ప్రేమ్‌కుమార్ ధుమాల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రేమ్‌కుమార్ ధుమాల్
2008లో ప్రేమ్ కుమార్ ధుమాల్
2008లో ధుమాల్
5th హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి

1944లో జన్మించిన ప్రేమ్‌కుమార్ ధుమాల్ (Prem Kumar Dhumal) హిమాచల్ ప్రదేశ్ 12th ముఖ్య మంత్రి. హిమాచల్ ప్రదేశ్ మాజి ముఖ్యమంత్రి. డిసెంబర్ 30, 2007న [1] ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ధుమాల్ అంతకు క్రితం లోక్‌సభకు భారతీయ జనతా పార్టీ తరఫున హమీర్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పార్లమెంటు సభ్యుడిగా వ్యవహరించాడు. 1998 మార్చి నుండి 2003 మార్చి వరకు హిమచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగానే పనిచేశాడు. అంతకు క్రితం 1989 నుండి 1991 వరకు లోక్‌సభ సభ్యుడిగా ఉన్నాడు. 2007 లోక్‌సభ ఉపఎన్నికలలో ఎన్నికయ్యే వరకు రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్షనేతగా వ్యవహరించాడు. డిసెంబర్ 2007లో జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించడంతో, ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్న ధుమాల్‌ 2007 డిసెంబర్ 30న అధికారం చేపట్టాడు.

మూలాలు

[మార్చు]
  1. "Dhumal takes oath as Himachal CM". Times of India. 2007-12-30.