మనోహర్ పారికర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మనోహర్ పారికర్

గోవా ముఖ్యమంత్రి
పదవీ కాలం
2012, మార్చి 13 నుంచి

వ్యక్తిగత వివరాలు

జననం (1955-12-13) 1955 డిసెంబరు 13 (వయస్సు 65)
మపూసాలి, గోవా
మరణం మార్చి 17, 2019
గోవా
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
మార్చి 16, 2012నాటికి

మనోహర్ గోపాలకృష్ణ పార్రికర్ (Manohar Gopalkrishna Prabhu Parrikar) (Konkani: मनोहर गोपालकृष्ण प्रभु पारिकर) 1955, డిసెంబరు 13 న గోవాలోని మపూసాలీలో జన్మించాడు. ఇతను రాజకీయ నాయకుడు. ఐఐటిలో చదివాడు. ఐఐటిలో గ్రాడ్యుయేషన్ చేసి ఒక రాష్ట్రపు ముఖ్యమంత్రి పదవి పొందిన వారిలో ఇతను ప్రథముడు.

రాజకీయ జీవితం[మార్చు]

1994లో మనోహర్ పార్రికర్ తొలిసారిగా గోవా శాసనసభకు ఎన్నికయ్యాడు. 1999లో గోవా శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించాడు. 2000, అక్టోబరు 24న తొలిసారిగా గోవా ముఖ్యమంత్రి పీఠం అధిష్టించాడు. 2002 ఫిబ్రవరి 27 వరకు ఆ పదవిలో ఉన్నాడు. మళ్ళీ 2002 జూన్ 5న మరోసారి ముఖ్యమంత్రి అయ్యాడు. 2005 జనవరిలో నలుగురు భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు రాజీనామా చేయడంతో మైనారిటీలో పడ్డ ప్రభుత్వాన్ని కూడా నెట్టుకొచ్చాడు. 2007 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయంతో దిగంబర్ కామత్‌కు ముఖ్యమంత్రి పీఠం అప్పగించాడు. 2012 శాసనసభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ మెజారిటీ సాధించడంతో మరోసారి పార్రికర్ గోవా ముఖ్యమంత్రి అయ్యాడు. రాఫెల్ ఒప్పందం వివాదం లో ఇతని పేరు ప్రముఖంగా వినిపించింది.