Jump to content

అసోం

వికీపీడియా నుండి
Assam
Etymology: "Uneven" or from "Ahom"
Nickname: 
"Land of Blue Hills"
Motto: 
Joi Aai Axom (Hail mother Assam)[1]
Anthem: "O Mur Apunar Desh" (O my Dearest Country)
The map of India showing Assam
Location of Assam in India
Coordinates: 26°08′N 91°46′E / 26.14°N 91.77°E / 26.14; 91.77
Country India
RegionNortheast India
Before was State of Assam
Bifurcation21 Jan 1972
Formation
(as a state)
26 January 1950[2]
CapitalDispur
Largest CityGuwahati
Districts31 (5 divisions)
Government
  BodyGovernment of Assam
  GovernorGulab Chand Kataria
  Chief MinisterHimanta Biswa Sarma (BJP)
State LegislatureUnicameral
  AssemblyAssam Legislative Assembly (126 seats)
National ParliamentParliament of India
  Rajya Sabha7 seats
  Lok Sabha14 seats
High CourtGauhati High Court
Area
  Total
78,438 కి.మీ2 (30,285 చ. మై)
  Rank16th
Dimensions
  Length725 కి.మీ (450 మై.)
  Width30 కి.మీ (20 మై.)
Elevation
80 మీ (260 అ.)
Highest elevation
(Cachar Hills section)
1,960 మీ (6,430 అ.)
Lowest elevation
45 మీ (148 అ.)
Population
 (2011)
  Total
Increase 3,11,69,272
  Rank15th
  Density397/కి.మీ2 (1,030/చ. మై.)
  Urban
14.1%
  Rural
85.9%
DemonymAssamese
Language
  OfficialAssameseBoro[3]
  Additional OfficialBengali (Barak Valley)[4]
  Official ScriptBengali–Assamese script
GDP
  Total (2019-2020)Neutral increase 3.74 లక్ష కోట్లు (US$47 billion)
  Rank18th
  Per capitaIncrease 1,09,069 (US$1,400) (18th)
Time zoneUTC+05:30 (IST)
ISO 3166 codeIN-AS
Vehicle registrationAS
HDI (2018)Neutral increase0.614 Medium[6] (30th)
Literacy (2011)Increase72.19%[7] (25th)
Sex ratio (2011)958 (12th)
Symbols of Assam
Emblem of Assam
గీతం"O Mur Apunar Desh" (O my Dearest Country)
భాషAssameseBoro[3]
Foundation dayAssam Day
పక్షిWhite-winged duck
పువ్వుFoxtail orchid
MammalIndian rhinoceros
TreeHollong
State Highway Mark
State Highway of Assam
AS SH1 -AS SH48
List of State Symbols
• First recognised as an administrative division on 1 April 1911, and led to the establishment of Assam Province by partitioning Province of East Bengal and Assam.
• Assam was one of the original provincial divisions of British India.
• Assam has had a legislature since 1937.[8]

అసోం (పూర్వ పేరు అస్సోం) ఈశాన్య భారతదేశం లోని ఒక రాష్ట్రం. దీని రాజధాని దిస్పూర్. హిమాయల పర్వత సానువుల్లో ఉన్న ప్రాంతం చూట్టూ అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, మేఘాలయ మొదలైన ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయి. అసోం ముఖ్య వాణిజ్య నగరమైన గౌహాతి సప్త సోదరీ రాష్ట్రాలుగా పిలవబడే ఈశాన్య రాష్ట్రాలకు ముఖద్వారం. ఈ రాష్ట్రాలన్నీ మిగిలిన భారత భూభాగానికి అసోంకు పశ్చిమ బెంగాల్తొ ఉన్న సరిహద్దుతో కలపబడి ఉన్నాయి. ఈ కురుచైన పట్టీని కోడిమెడ అని వ్యవహరిస్తుంటారు. అసోంకు భూటాన్, బంగ్లాదేశ్ దేశాలతో సరిహద్దులు ఉన్నాయి.

పేరు పుట్టుపూర్వోత్తరాలు

[మార్చు]

కొందరు అసోం "అసమ" లేదా "అస్సమ" అనే సంస్కృత పదం అపభ్రంశమని భావిస్తారు. ఈ పదం పర్వత ప్రాంతం వర్ణనకు కచ్చితంగా సరిపోతుంది. మరికొందరు ఈ పదం అసోం ప్రాంతాన్ని 600 సంవత్సరాల పాటు పరిపాలించిన అహోంలకు సంబంధించిందని భావిస్తారు. 1228కి పూర్వం ఈ పదాన్ని ఉపయోగించిన ఆధారాలు లేకపోవడం, చారిత్రక గంథాలు అహోంలను అసాంలని కూడా పేర్కొనడం ఈ వాదానికి ఊతానిస్తున్నాయి.

అసమ లేదా అస్సమ అన్న పదాలు "కామరూప"ను భాస్కర వర్మన్ పరిపాలించిన కాలములో వాడబడింది. ఆ కాలములో ప్రస్తుత ఉత్తర అసోం భూమి నుండి విషవాయువులు విరజిమ్ముతూ అనివాసయోగ్యముగా ఉండేది. కొంతమంది కామరూప నేరస్థులు శిక్షను తప్పించుకోవడానికి ఈ ప్రాంతానికి పారిపోయి వచ్చారని చైనా యాత్రికుడు హ్యుయాన్ త్సాంగ్ యాత్రా రచనల వల్ల తెలుస్తుంది. వీరే అసమ లేదా అస్సమ అని పిలవబడ్డారు. హ్యుయాన్ త్సాంగ్ అస్సమ ప్రజలు దాడిచేస్తారనే భయముతో చైనాకు ఈ మార్గం గుండా తిరిగి వెళ్లలేదు. కామరూపి భాషలో, ఈ పదానికి వింత మనిషి/పాపితో పాటు ఎవ్వరితో పోల్చలేని వ్యక్తి అనే అర్ధం కూడా ఉంది. అయితే పూర్వపు కామరూపి గ్రంథాలలో ఈ ప్రాంతాన్ని అసమ లేదా అసం లేదా అసోం అని వ్యవహరించనే లేదు.

బ్రిటిషు జనరల్ పై ఏదేని కారణం వల్ల ఈ పేరు ఎన్నుకోలేదు. ఇతను ఆంథెరా అస్సమ అనే ఒక శాస్త్రీయ నామం నుండి ఆంథెరాను వదిలేసి మిగిలిన పేరును తీసుకున్నాడు అంటారు. ఈ పద ప్రయోగం తొలిసారిగా బ్రిటీషు వారు యాండబూ అకార్డ్ తరువాత ఎగువ అసోం రాష్ట్రంను సృష్టించినప్పుడు జరిగింది. కాని ఈ వాదన అంత నమ్మదగిందిగా లేదు. ఆంథెరా అస్సమ అనే ఒక విధమైన పట్టుపురుగు అసోం ప్రాంతంలో అంతటా ఉంది. కనుక అసోం ప్రాంతపు పేరు ఆ పురుగుకు తగిలి ఉండ వచ్చును కాని ఆ పురుగుపేరు ప్రాంతానికి వర్తించకపోవచ్చును.

భౌగోళికం

[మార్చు]

ఆంగ్ల అక్షరం T ఆకారంలో ఉండే ఈ రాష్ట్రం భౌగోళికంగా మూడు ప్రాంతాలుగా విభజించవచ్చు. ఉత్తరాన బ్రహ్మపుత్ర నదీలోయ, మధ్యన కర్బి, చాచర్ కొండలు, దక్షిణాన బరక్ లోయ. అసోం రాష్ట్రంలో మార్చి నుండి సెప్టెంబరు వరకు భారీ వర్షాలు కురుస్తాయి. వేసవి నెలల్లో గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు సాధారణంగా అన్ని కాలాల్లోనూ మితముగా ఉంటాయి.

అసోంలో జీవ సంపద, అడవులు, వణ్యప్రాణులు పుష్కలంగా ఉన్నాయి. ఒకప్పుడు కలప వ్యాపారం జోరుగా సాగేది, అయితే భారతదేశ సుప్రీం కోర్టు దీన్ని నిషేధించడంతో అది తగ్గింది. ఈ ప్రాంతంలో అనేక అభయారణ్యాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైంది, అరుదైన భారతీయ ఖడ్గమృగానికి ఆలవాలమైన కాజీరంగా జాతీయ వనం. రాష్ట్రంలో అత్యధికంగా వెదురు ఉత్పత్తి అవుతుంది. కానీ వెదురు పరిశ్రమ ఇంకా ఆరంభ దశలోనే ఉంటుంది. వన్య ప్రాణులు, అడవులు, వృక్షసంపద, నదులు, జలమార్గాలు అన్నీ ఈ ప్రాంతాకి ఎంతో ప్రకృతి సౌందర్యాన్ని తెచ్చుపెడుతూ పర్యాటక రంగ అభివృద్ధికి దోహదపడుతున్నాయి.

అతివృష్టి, చెట్ల నరికివేత,, ఇతరత్రా కారణాల వల్ల ప్రతి సంవత్సరం వరదలు సంభవించి విస్తృత ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వాటిల్లడమే కాకుండా జీవనోపాధికి ముప్పు జరుగుతుంది. భూకంప బాధిత ప్రాంతంలో ఉన్న అసోం 1897లో (రిక్టర్ స్కేలు పై 8.1 గా నమోదైంది), 1950లో (రిక్టర్ స్కేలు పై 8.6 గా నమోదైంది) రెండు అతిపెద్ద భూకంపాలకు గురైంది.

చరిత్ర

[మార్చు]
9-10వ శతాబ్దానికి చెందిన కామరూప - పలాస్ వంశ చిహ్నంగా చెక్కబడిన శిల్పం
సంప్రదాయ దుస్తుల్లో సత్రియా నాట్యం చేస్తున్న యువతి

ప్రాచీన అసోం

[మార్చు]

అసోం,, పరిసర ప్రాంతాలు పురాణకాలంలో ప్రాగ్జ్యోతిషం అనబడేవని మహాభారతంలో చెప్పబడింది. అక్కడి ప్రజలు కిరాతులనీ, చీనులనీ అనబడ్డారు. కామరూప రాజ్యానికి ప్రాగ్జ్యోతిషపురం రాజధాని.

మధ్యయుగ అసోం

[మార్చు]

మధ్యయుగంలో దీనిపేరు కామరూప, లేదా కమట. అక్కడ రాజ్యమేలిన వంశాలలో వర్మ వంశం ప్రధానమైంది. కనోజ్‌ను పాలించిన హర్షవర్ధనుని సమకాలీనుడైన భాస్కరవర్మ కాలంలో జువన్‌జాంగ్ అనే చైనా యాత్రికుడు కామరూప ప్రాంతాన్ని సందర్శించాడు. ఇంకా కచారి, చూటియా వంశాలు కూడా రాజ్యమేలాయి. వీరు ఇండో-టిబెటన్ జాతికి చెందిన రాజులు.

తరువాత టాయ్ జాతికి చెందిన అహోమ్ రాజులు 600 సంవత్సరాలు పాలించారు. కోచ్ వంశపు రాజులు అసోం పశ్చిమభాగాన్నీ, ఉత్తర బెంగాల్‌నూ పాలించారు. ఈ రాజ్యం అప్పుడు రెండు భాగాలయ్యింది. పశ్చిమ భాగం మొగల్‌చక్రవర్తుల సామంతరాజ్యమైంది. తూర్పు భాగం అహోం రాజుల పాలన క్రిందికి వచ్చింది. మొత్తానికి బ్రిటిష్ వారి కాలం వరకూ ఎవరూ అసోంను పూర్తిగా తమ అధీనంలోకి తెచ్చుకొనలేక పోయారు.

బ్రిటీషు పాలన

అహోం రాజులలోని అంతర్గత కలహాల కారణంగా అది 1821 నాటికి బర్మా పాలకుల సామంతరాజ్యంగా మారింది. దానితో బర్మావారికి, బ్రిటిష్ వారికి వైరం మొదలయ్యింది. మొదటి ఆంగ్ల-బర్మా యుద్ధము తరువాత 1826లో యాండబూ ఒడంబడిక ప్రకారం అసోం బ్రిటిషు అధీనంలోకి, బెంగాలు ప్రెసిడెన్సీలో భాగంగా, తీసుకోబడింది. 1905-1912 మధ్య అసోం ఒక వేరు పరగణా అయ్యింది.

భారత స్వాతంత్ర్యం తరువాత అహోం రాజ్యభాగం, ప్రస్తుత అరుణాచల్ ప్రదేశ్, నాగా పర్వత ప్రాంతం, కచారి రాజ్య ప్రాంతం, లూషాయ్ పర్వత ప్రాంతం, గారో పర్వత ప్రాంతం, జైంతియా పర్వత ప్రాంతం - ఇవన్నీ అసోం రాష్ట్రంలో చేర్చ బడ్డాయి. రాజదానిగా షిల్లాంగ్ నగరం ఏర్పడింది. సిల్హెట్ ప్రాంతం వారు పాకిస్తాన్‌లో చేరారు. మణిపూర్, త్రిపుర సంస్థానాలు ప్రత్యేక పరగణాలయ్యాయి.

స్వాతంత్ర్యం తరువాత అసోం

[మార్చు]

స్వాతంత్ర్యం తరువాత 1960 - 1970 దశకాలలో అసోం రాష్ట్రంలోంచి అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మేఘాలయ, మిజోరామ్ రాష్ట్రాలు వేరుచేయబడ్డాయి. రాజధాని దిస్పూర్కు మార్చబడింది. పెరుగుతున్న గౌహతి నగరంలో దిస్పూర్ కలిసిపోతున్నది. అసోం అధికారిక భాషగా చేయాలని సంకల్పించినపుడ కచార్ జిల్లా వాసులూ, ఇతర బెంగాలీ భాష మాటలాడేవారూ ప్రతిఘటించారు. ఇది తీవ్రమైన ఉద్యమమైంది.

1980 దశకంలో ఆరు సంవత్సరాల పాటు తీవ్రమైన ఉద్యమం నడచింది. బయటి ప్రాంతనుండి, ముఖ్యంగా బంగ్లాదేశ్ నుండి వచ్చి స్థిరపడినవారిని వెళ్ళగొట్టాలనీ, వారు స్థానికుల జన విస్తరణను మార్చేస్తున్నారనీ అనేది ఈ ఉద్యమంలో ప్రధానాంశం. మొదట శాంతియుతంగా మొదలైన ఈ ఉద్యమం క్రమేపీ హింసాత్మకమవసాగింది. కేంద్రప్రభుత్వంతో జరిగిన ఒప్పందం తరువాత ఈ ఉద్యమం చల్లబడింది. కాని ఆ ఒప్పందంలో చాలా భాగం ఇప్పటికీ అమలు కాలేదు. ఇది ప్రజలలో అసంతృప్తికి ఒక ముఖ్యకారణం.

1980-90 లలో బోడో తెగల వారు, మరికొన్ని తెగలవారు ప్రత్యేక ప్రతిపత్తి కోసము ఘర్షణలు ప్రారంభించారు. ఇవి క్రమంగా సాయుధ, హింసాత్మక పోరాటాలయ్యాయి. యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్, నేషనల్ డెమోక్రాటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్ వంటి తీవ్రవాద వర్గాలకూ, భారత సైన్యానికీ మధ్య పోరులు పెచ్చరిల్లాయి. సైన్యం మానవహక్కులను మంటకలుపుతున్నదనీ, విచక్షణా రహితంగా హింసను అమలు చేస్తున్నదనీ ఆరోపణలు బలంగా ఉన్నాయి. వర్గాల మధ్య పోరాటాలలో ఎన్నో మూక హత్యలు జరిగాయి

భాషలు

[మార్చు]

అస్సామీ, బోడో భాష రాష్ట్ర అధికార భాషలు. భాషా శాస్త్ర యుక్తముగా ఆధునిక అస్సామీ భాష తూర్పు "మాగధి ప్రాకృతం" నుండి ఉద్భవించింది. అయితే ఈ ప్రాంతములో మాట్లాడే ఇతర టిబెటో-బర్మన్, మోన్-ఖమెర్, కోచ్ భాషల ప్రభావము కూడా అధికాముగానే ఉంది. బోడో ఒక టిబెటో-బర్మన్ భాష.

బ్రిటీషు వారి రాకతో, బెంగాల్ విభజనతో బరక్ లోయలో బెంగాళీ (సిల్హెటి) ప్రాబల్యం హెచ్చింది. నేపాళీ, హిందీ రాష్ట్రంలో మాట్లాడే ఇతర ముఖ్య భాషలు

రాష్ట్ర గణాంకాలు

[మార్చు]
  1. అవతరణ:1950 జనవరి 26
  2. వైశాల్యం. 78, 438 చ.కి.
  3. జనసంఖ్య. 31, 169, 272 స్త్రీలు. 15, 214, 345 పురుషులు. 15, 954, 927, నిష్పత్తి . 954/1000
  4. అక్షరాస్యత. స్త్రీలు. 73.18% పురుషులు. 78.81%
  5. ప్రధాన మతాలు. హిందు, ముస్లిం, బౌద్ధ మతం.
  6. ప్రధాన భాషలు. అస్సామీ, బెంగాలి, బోడో.
  7. జిల్లాల సంఖ్య.27
  8. గ్రామాలు. 25, 124 పట్టణాలు.125
  9. పార్లమెంటు సభ్యుల సంఖ్య, 14 శాసనసభ్యుల సంఖ్య. 126
  10. మూలx. మనోరమ ఇయర్ బుక్

సంస్కృతి

[మార్చు]

ఆదిమవాసుల ఆచారాలు, అందిపుచ్చుకున్న సంప్రదాయాలు కలగలిపి ఉండటం వల్ల మిగిలిన ప్రాంతాలకంటే అస్సామీ సంస్కృతి కాస్త భిన్నమైన, సుసంపన్నమైన సంస్కృతిగా అభివృద్ధి చెందింది.

గమోసా

అస్సామీ ఆచార వ్యవహారాలలో గమోసాకు ఒక విశిష్టమైన స్థానముంది. ఇది ఒక దీర్ఘ చతురస్రాకారపు గుడ్డ. మూడు ప్రక్కల ఎరుపుగాని, వేరే రంగులో గాని అంచు ఉంటుంది. నాలుగవ ప్రక్క అల్లిక అంచుగా ఉంటుంది. దీనికి వళ్ళు తుడుచుకొనేది అనే సామాన్య అర్ధం చెప్పవచ్చును. నిజంగానే వళ్ళు తుడుచుకోవడానికి వాడినా, గమోసాను మరెన్నో విధాలుగా వాడుతారు. రైతులు మొలగుడ్డగా వాడుతారు. బిహూ నాట్యకారులు చిత్రమైన ముడివేసి తలగుడ్డగా వాడుతారు. ప్రార్థనా సమయంలో మెడలో వేసుకొంటారు. సమాజంలో ఉన్నతిని తెలుపుకొనే విధంగా భుజాన వేసుకొంటారు. బిహు పండుగకు పెద్దవారికి గమోసాలు సమర్పించుకోవడం ఆనవాయితీ. ఏదయినా భక్తిగా, ఆదరంగా భావించే వస్తువును నేలమీద పెట్టరు. ముందుగా గమోసా పరచి, దానిపై ఉంచుతారు. గామ్+చాదర్ (అనగా పూజా గదిలో పురాణ గ్రంథాన్ని కప్పి ఉంచే గుడ్డ) - అనే కామరూప పదం గమోసాకు మూలం. అన్ని మతాలువారూ గమోసాను ఇదే ఆదరంతో దైనందిన జీవితంలో వాడుతారు

బిహు

బిహు పండుగ అసోంలో ఎక్కువ మంది జరుపుకొనే పండుగ. ఇది సంవత్సరంలో మూడు సార్లు వస్తుంది. మాఘ్ (జనవరి), బోహాగ్ (ఏప్రిల్), కతి (అక్టోబరు)

దుర్గా పూజ

దుర్గాపూజ కూడా అసోంలో బాగా పెద్దయెత్తున జరుపుకొనే పండుగ. అసోంలో స్థిరపడిన లక్షలాది బెంగాలీయుల ప్రభావం కూడా ఈ పండుగ ప్రాచుర్యానికి కొంత కారణం కావచ్చును.

సంగీతం

భిన్నజాతులు, సంస్కృతుల సమ్మేళనం కారణంగా అసోం జానపద సంగీతంలో చాలా వైవిధ్యం కానవస్తుంది. దీనికి ఆధునిక సంగీతంలోని బాణీలు జోడించడం వల్ల మరింత సుసంపన్నమైనది. రుద్ర బారువా, భూపేన్ హజారికా, ఖాగెన్ మహంత, అనిమా చౌధురి - వీరు ప్రసిద్ధులైన సంగీతకారులలో కొందరు.

దేవాలయాలు

[మార్చు]

ఆర్ధిక వ్యవస్థ

[మార్చు]

అసోం టీ

[మార్చు]

తేయాకు ఉత్పత్తి అసోం ఆర్థిక వ్యవస్థలో ప్రధానమైనది. సముద్ర మట్టానికి దగ్గర ఎత్తులో పండే అసోం తేయాకుకు ఒక ప్రత్యేకమైన రుచి ఉంటుంది. కామెల్లియా అస్సామికా అనేది అసోం పేరుతో ప్రసిద్ధమైన ఒక తేయాకు రకం. (ఇటువంటి గౌరవం అసోం కూ, చైనాకు మాత్రమే దక్కింది కామెల్లియా సినెసిస్ అనే పేరుతో ఒక చైనా తేయాకు రకం ఉంది.

అసోంలో తేయాకు వ్యవసాయం బ్రిటిషువారు వృద్ధి చేశారు. ఆ కాలంలో బీహారు, ఒడిషా ప్రాంతాలనుండి కూలీలుగా వచ్చి చాలామంది ఇక్కడ స్థిరపడ్డారు.

అసోం చమురు;

[మార్చు]

ముడి చమురు, సహజవాయువు కూడా అసోం ఉత్పత్తులలో ప్రధానమైనవి. ప్రపంచంలో చమురు ప్రప్రథమంగా అమెరికాలోని టిటస్‌విల్లిలోలభించింది. రెండవ స్థలం అసోం . ఇక్కడ అప్పుడు త్రవ్విన బావిలో ఇప్పటికీ చమురు ఉత్పత్తి కొనసాగుతున్నది.

అసోంలో సమస్యలు

[మార్చు]

బ్రిటిషు అధికారం నుంచి అసోం ప్రాంతంలోని వేరువేరు పరగణాలు ప్రశాంతంగా స్వతంత్రభారతదేశంలో విలీనం చేయబడ్డాయి. కాని తరువాత ఈ ప్రాంతంలోని అభివృద్ధి బాగా కుంటుపడింది. ఫలితంగా తీవ్రవాద వర్గాలు, వేర్పాటు వాద వర్గాలు ప్రాభవం సంపాదించగలిగాయి. గ్రామీణ ప్రాంతంలోని తీవ్రమైన నిరుద్యోగ సమస్య వీరికి అనుకూలమైన పరిస్థితులను కూరుస్తున్నాయి.

దీనికి తోడు వివిధ తెగల మధ్య వైరాలు, పొరుగు దేశాలనుంచి కొన సాగుతున్న వలసలు, వెనుకబాటుతనం - ఇవన్నీ అసోంను వెంటాడుతున్న సమస్యలు. కొన్ని తెగల మధ్య ఘర్షణలు చాలా తీవ్రంగ ఉంటున్నాయి.

జిల్లాలు

[మార్చు]
అసోం జిల్లాల జాబితా
వ.సం. కోడ్ ‌జిల్లా ముఖ్య పట్టణం జనాభా (2001) విస్తీర్ణం (కి.మీ.²) జన సాంద్రత (/కి.మీ.²)
1BKబక్స జిల్లాముషాల్‌పూర్953,7732,400398
2BAబాజాలి జిల్లాపట్శాల
3BPబార్పేట జిల్లాబార్పేట16424203245506
4BSవిశ్వనాథ్ జిల్లావిశ్వనాథ్ చారియాలి5,80,0001,100530
5BOబొంగైగావ్ జిల్లాబొంగైగావ్9063152510361
6CAకచార్ జిల్లాసిల్చార్14421413786381
7CDచరాయిదేవ్ జిల్లాసోనారీ471,4181,064440
8CHచిరంగ్ జిల్లాకాజల్‌గావ్481,8181,468328
9DRదర్రాంగ్ జిల్లామంగల్‌దాయి15039433481432
10DMధెమాజి జిల్లాధెమాజి5694683237176
11DUధుబ్రి జిల్లాధుబ్రి16345892838576
12DIడిబ్రూగర్ జిల్లాడిబ్రూగర్11720563381347
13DHదిమా హసాయో జిల్లాహాఫ్లాంగ్186189488838
14GPగోల్‌పారా జిల్లాగోల్‌పారా8223061824451
15GGగోలాఘాట్ జిల్లాగోలాఘాట్9457813502270
16HAహైలకండి జిల్లాహైలకండి5429781327409
17JOహోజాయ్ జిల్లాహోజాయ్931,218
18JOజోర్హాట్ జిల్లాజోర్హాట్10091972851354
19KMకామరూప్ మెట్రో జిల్లాగౌహతి1,260,4191,528820
20KUకామరూప్ జిల్లాఅమింగావ్1,517,2021,527.84520
21KGకర్బి ఆంగ్లాంగ్ జిల్లాదిఫు8123201043478
22KRకరీంగంజ్ జిల్లాకరీంగంజ్10036781809555
23KJకోక్రఝార్ జిల్లాకోక్రఝార్9304043129297
24LAలఖింపూర్ జిల్లాఉత్తర లఖింపూర్8893252277391
25MJమజులి జిల్లాగారమూర్167,304880300
26MAమారిగావ్ జిల్లామారిగావ్7758741704455
27NNనాగావ్ జిల్లానాగావ్23153873831604
28NBనల్బరి జిల్లానల్బరి11381842257504
29SVశివ్‌సాగర్ జిల్లాశిబ్‌సాగర్10528022668395
30STసోనిత్‌పూర్ జిల్లాతేజ్‌పూర్16778745324315
31SMదక్షిణ సల్మారా జిల్లాహాట్సింగరి555,114568980
32TIతిన్‌సుకియా జిల్లాతిన్‌సుకియా11501463790303
33UDఉదల్గురి జిల్లాఉదల్గురి832,7691,676497
34WKపశ్చిమ కర్బి ఆంగ్లాంగ్ జిల్లాహమ్రెన్3,00,3203,03599
35MLమజులి జిల్లా----

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "State Symbols | Assam State Portal". Assam.gov.in. 2020-12-01. ఒరిజినల్ నుండి 4 July 2022 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2022-08-24.
  2. Steinberg, S. (2016). The Statesman's Year-Book 1964–65: The One-Volume ENCYCLOPAEDIA of all nations. Springer. p. 412. ISBN 978-0-230-27093-0. ఒరిజినల్ నుండి 1 February 2023 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 3 September 2018.
  3. 1 2 "Report of the Commissioner for linguistic minorities: 52nd report (July 2014 to June 2015)" (PDF). Commissioner for Linguistic Minorities, Ministry of Minority Affairs, Government of India. pp. 58–59. the original (PDF) నుండి 28 డిసెంబరు 2017 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 16 ఫిబ్రవరి 2016.
  4. "Govt withdraws Assamese as official language from Barak valley". Business Standard India. Press Trust of India. 9 September 2014. ఒరిజినల్ నుండి 29 January 2018 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 29 January 2018.
  5. "Assam Budget 2021". 16 July 2021. the original నుండి 17 July 2021 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 17 July 2021.
  6. "Sub-national HDI – Area Database – Global Data Lab". hdi.globaldatalab.org. ఒరిజినల్ నుండి 23 September 2018 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 September 2018.
  7. "Census 2011 (Final Data) – Demographic details, Literate Population (Total, Rural & Urban)" (PDF). planningcommission.gov.in. Planning Commission, Government of India. the original (PDF) నుండి 27 January 2018 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 3 October 2018.
  8. "Assam Legislative Assembly - History". ఒరిజినల్ నుండి 13 September 2016 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 14 September 2016.

వెలుపలి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=అసోం&oldid=4904969" నుండి వెలికితీశారు