చరాయిదేవ్ జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చరాయిదేవ్ జిల్లా
అసోం రాష్ట్రం లోని జిల్లా
అహోం కింగ్స్ మైదాం
అహోం కింగ్స్ మైదాం
అస్సాం పటంలో జిల్లా ప్రదేశం
అస్సాం పటంలో జిల్లా ప్రదేశం
దేశం భారతదేశం
రాష్ట్రంఅసోం
డివిజన్ఎగువ అసోం
జిల్లా ఏర్పాటు15 ఆగస్టు 2015
ముఖ్యపట్టణంసొనారీ
Government
 • డిఫ్యూటి కమీషనర్పలాష్ రంజన్ ఘర్ఫాలియా
Area
 • Total1,069 km2 (413 sq mi)
Population
 • Total4,71,418
భాషలు
 • అధికారికఅస్సామీ
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
Vehicle registrationఏఎస్ 33

చరాయిదేవ్ జిల్లా, అసోం రాష్ట్ర్రంలోని నూతనంగా ఏర్పడిన ఒక జిల్లా. 2015, ఆగస్టు 15న అస్సాం ముఖ్యమంత్రి ప్రకటించిన కొత్త జిల్లాలలో ఇది ఒకటి.[1] శివ్‌సాగర్ జిల్లా నుండి విడిపోయిన చరాయిదేవ్ జిల్లాకు సోనారీ ముఖ్య పట్టణంగా, పరిపాలనా ప్రధాన కార్యాలయంగా ఏర్పాటు చేయబడింది. ఈ జిల్లా ఎగువ అస్సాం డివిజన్ పరిధిలోకి వస్తుంది.[2][3][4]

పద వివరణ

[మార్చు]

చౌలుంగ్ సుకాఫా (మొదటి అహోం రాజు) ఈ చరాయిదేవ్ను స్థాపించాడు.[5] చే రాయ్ దోయి లేదా దోయి చే రాయ్ అనే తాయ్-అహోమ్ పదం నుండి ఈ చరాయిదేవ్ అనే పేరు వచ్చింది. చరాయిదేవ్ అంటే కొండలపై మెరుస్తున్న నగరం అని అర్థం.[6][7]

చరిత్ర

[మార్చు]

సుకాఫా రాకముందు ఈ ప్రాంతం మోరన్, బోరాహి, చుటియాస్ వంటి స్థానిక గిరిజన ప్రజలకు ప్రార్థనా స్థలంగా ఉండేది.

1253లో మొదటి అహోం రాజు చౌలుంగ్ సుకాఫా స్థాపించిన అహోం రాజ్యానికి చరాయిదేవ్ ప్రాంతం రాజధానిగా ఉండేది. అహోం రాజుల తుములి (మైడమ్స్), చరాయిదేవ్ కొండల వద్ద ఉన్న రాణులు ఈజిప్టు పిరమిడ్లతో పోల్చవచ్చు. ఇక్కడి కొన్ని పురావస్తు వస్తువులు దొంగల వల్ల నాశనమయ్యాయి.[8] ఈ సైట్ యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో ఉండాలని ప్రతిపాదన చేశారు.[9]

విస్తీర్ణం - జనాభా

[మార్చు]

1,069 చదరపు కి.మీ. (413 చ.మై) విస్తీర్ణం ఉన్న చరాయిదేవ్ జిల్లాలో 4,71,418 జనాభా ఉంది.[10]

మూలాలు

[మార్చు]
  1. Assam gets five more districts
  2. Charaideo commonly known as pyramids of Assam
  3. reparations afoot for inauguration of Charaideo district at Sonari
  4. Palasbari incensed over choice of district HQ
  5. Gogoi, Padmeswar (1968). The Tai and the Tai kingdoms: with a fuller treatment of the Tai-Ahom kingdom in the Brahmaputra Valley. Dept. of Publication, Gauhati University. pp. 264 & 265.
  6. Gohain, Birendra Kr (1999). Origin of the Tai and Chao Lung Hsukapha: A Historical Perspective. Omsons Publications. pp. 72 & 73.
  7. Bezbaruah, Ranju; Banerjee, Dipankar; Research, Indian Council of Historical (2008). North-East India: interpreting the sources of its history. Indian Council of Historical Research. p. 117. ISBN 9788173052958.
  8. Dutta, Pullock; Das, Ripunjoy (2003-03-01). "Bounty hunters beat ASI to tombs". The Telegraph. Calcutta, India. Retrieved 2020-12-19.
  9. Das, Ripunjoy (2006-01-19). "Saving Ahom kingdom - Local youths push for Unesco tag to protect Charaideo". The Telegraph. Calcutta, India. Retrieved 2020-12-19.
  10. "Charaideo at a glance | Charaideo District | Government Of Assam, India". charaideo.gov.in. Archived from the original on 2021-01-17. Retrieved 2020-12-19.

ఇతర లంకెలు

[మార్చు]