అసోం జిల్లాల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అస్సాం జిల్లాల మ్యాప్, విభజనల వారీగా... ఆకుపచ్చ: లోయర్ అస్సాం, పర్పుల్: ఉత్తర అస్సాం, పసుపు: సెంట్రల్ అస్సాం, నారింజ: బరాక్ వ్యాలీ, ఎరుపు: ఎగువ అస్సాం.

అసోం (ఇదివరకటి పేరు అస్సాం) ఈశాన్య భారతదేశం లోని ఒక రాష్ట్రం. దీని రాజధాని దిస్పూర్. హిమాయల పర్వత సానువుల్లో ఉన్న ప్రాంతం చూట్టూ అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, మేఘాలయ మొదలైన ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయి. అసోం ముఖ్య వాణిజ్య నగరమైన గౌహాతి సప్త సోదరీ రాష్ట్రాలుగా పిలవబడే ఈశాన్య రాష్ట్రాలకు ముఖద్వారం. ఈ రాష్ట్రాలన్నీ మిగిలిన భారత భూభాగానికి అస్సాంకు పశ్చిమ బెంగాల్ తో ఉన్న సరిహద్దుతో కలపబడి ఉన్నాయి. ఈ కురుచైన పట్టీని కోడిమెడ అని వ్యవహరిస్తుంటారు. అసోంకు భూటాన్, బంగ్లాదేశ్ దేశాలతో సరిహద్దులు ఉన్నాయి. అస్సాం 35 పరిపాలనా భౌగోళిక విభాగాలు (జిల్లాలు) గా విభజించబడింది.

పరిపాలన

[మార్చు]

భారత రాష్ట్రంలోని జిల్లా అనేది డిప్యూటీ కమీషనర్ (డిసి) నేతృత్వంలోని పరిపాలనా భౌగోళిక విభాగం, ఇది శాంతిభద్రతల నిర్వహణకు అంతిమంగా జిల్లా మేజిస్ట్రేట్, రెవెన్యూ సేకరణకు బాధ్యత వహించే జిల్లా కలెక్టర్ కార్యాలయాలను కలిగివుంటుంది. సాధారణంగా, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌కు చెందిన అధికారి డిప్యూటీ కమీషనర్ అవుతాడు, కొన్ని సందర్భాలలో అస్సాం సివిల్ సర్వీస్‌కు చెందిన అధికారులు కూడా నియమితులవుతారు. రాష్ట్ర పరిపాలనా సేవలకు చెందిన వివిధ విభాగాలకు చెందిన అనేక మంది అధికారులు డిప్యూటీ కమీషనర్ కి సహాయం చేస్తారు.

అస్సాం జిల్లాలు కమీషనర్ నేతృత్వంలో ఐదు ప్రాంతీయ విభాగాలలో కలిసి ఉన్నాయి. పోలీస్ సూపరింటెండెంట్, ఇండియన్ పోలీస్ సర్వీస్‌కు చెందిన అధికారికి శాంతిభద్రతలు, సంబంధిత సమస్యలను నిర్వహించే బాధ్యతను అప్పగించారు. గౌహతి నగరంలో పోలీస్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ ఆఫ్ పోలీస్ నేతృత్వంలో ఉంది, ఇది 2015 జనవరి 1 నుండి తన కార్యకలాపాలను నిర్వర్తిస్తోంది.

చరిత్ర

[మార్చు]

1947లో స్వాతంత్ర్యానికి ముందు అస్సాం రాష్ట్రంలో కాచర్, దర్రాంగ్, గోల్‌పరా, కమ్రూప్, లఖింపూర్, నాగావ్, శివసాగర్, జయంతియా పరగణాలు, గారో హిల్స్, లుషై హిల్స్, నాగా హిల్స్, సిల్హెట్, నేఫా అనే 13 జిల్లాలు ఉండేవి. అస్సాం రాష్ట్రం కింద బ్రిటిష్ ఇండియా రక్షిత 4 రాచరిక రాష్ట్రాలు త్రిపుర, ఖాసీ రాష్ట్రాలు, కోచ్ బీహార్, మణిపూర్ (స్వాతంత్ర్యం సమయంలో కూడా ఉన్నాయి) ఉన్నాయి. విభజన సమయంలో సిల్హెట్ జిల్లా తూర్పు పాకిస్తాన్‌కు ఇవ్వబడింది. స్వాతంత్ర్యం తరువాత 1972 వరకు అనేక చేరికల తరువాత అస్సాం దాని ప్రధాన 7 జిల్లాలతో సరికొత్త రూపాన్ని ఏర్పరుచుకుంది. మిగిలిన 6 జిల్లాలు అస్సాం నుండి విడిపోయి జయంతియా, గారో, ఖాసి కలిపి మేఘాలయ రాష్ట్రంగా, లుషియాయ్ కొండలు మిజోరాంగా, నాగాకొండలు నాగాలాండ్‌ గా, నెఫా అరుణాచల్ ప్రదేశ్గా మారాయి. రెండు రాచరిక రాష్ట్రాలైన త్రిపుర, మణిపూర్ అస్సాంలో చేర్చబడి కొంతకాలం తరువాత ప్రత్యేక రాష్ట్రాలుగా విడిపోయాయి. కోచ్ బీహార్ పశ్చిమ బెంగాల్‌లో భాగమైంది.

1951 నవంబరు 17న యునైటెడ్ మికిర్, నార్త్ కాచర్ హిల్స్ జిల్లాలు గోలాఘాట్, నాగావ్, కాచర్, జయంతియా, నాగా హిల్స్ జిల్లాల నుండి వేరుచేయబడ్డాయి. 1970 ఫిబ్రవరి 2 న మికిర్ హిల్స్ జిల్లా నార్త్ కాచర్ హిల్స్ నుండి వేరుచేయబడింది. 1976లో దిబ్రూఘర్ జిల్లా లఖింపూర్ నుండి విడిపోయింది, మికిర్ హిల్స్ జిల్లా పేరు కర్బీ అంగ్లాంగ్ జిల్లాగా మార్చబడింది. 1983లో కామ్‌రూప్‌ నుండి బార్‌పేట జిల్లా విడిపోయింది. 1985 ఆగస్టు 14న కామ్రూప్ నుండి నల్బరీ జిల్లా విడిపోయింది. 1987 ఆగస్టు 15న సిబ్‌సాగర్ నుండి గోలాఘాట్ జిల్లా విడిపోయింది. 1989లో కాచర్ నుండి హైలాకండి జిల్లా, నాగోన్ నుండి మరిగావ్ జిల్లా, గోల్‌పరా -కోక్రాఝర్ నుండి బొంగైగావ్ జిల్లా, డిబ్రూఘర్ నుండి టిన్సుకియా జిల్లా, లఖింపూర్ నుండి ధేమాజి జిల్లా విడిపోయాయి.

2003 ఫిబ్రవరి 3న కమ్రూప్ నుండి కమ్రూప్ మెట్రోపాలిటన్ జిల్లా విడిపోయింది. 2004 జూన్ 1న బార్‌పేట-నల్‌బారి-కమ్‌రూప్‌ల నుండి బక్సా జిల్లా విడిపోయింది. జూన్ 4న బొంగైగావ్-కోక్రాఝర్ నుండి చిరాంగ్ జిల్లా, జూన్ 14న దర్రాంగ్-సోనిత్‌పూర్ నుండి ఉదల్‌గురి జిల్లా విడిపోయింది. కోక్రాఝర్ జిల్లాతో పాటు బిటిఏడి ఏర్పాటు చేయబడింది. 2010 ఏప్రిల్ 1న నార్త్ కాచర్ హిల్స్ జిల్లా పేరు దిమా హసావోగా మార్చబడింది. 2015 ఆగస్టు 15న , అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ రాష్ట్రంలో ఐదు కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాడు.[1] మొత్తం సంఖ్యను 27 నుండి 32కి పెంచాడు. ఐదు కొత్త జిల్లాలు:[1][2] బిస్వనాథ్ ( సోనిత్‌పూర్ నుండి) ; చరాయిదేవ్ (శివసాగర్ నుండి) ; హోజై (నాగోన్ నుండి) ; దక్షిణ సల్మారా-మంకాచార్ ( ధుబ్రి నుండి) ; వెస్ట్ కర్బీ అంగ్లాంగ్ ( కర్బీ అంగ్లాంగ్ నుండి).

2016 జనవరి 26న మరో 2 జిల్లాలు ప్రకటించబడ్డాయి. అయితే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సరిపోకపోవడంతో 2016 అక్టోబరు 7న ప్రభుత్వం తూర్పు కామ్‌రూప్, సౌత్ కామ్‌రూప్ జిల్లా హోదాను ఉపసంహరించుకుంది. తూర్పు కామ్రూప్ జిల్లాలోని రెండు ఉప-విభాగాలు - అవి. చంద్రాపూర్, సోనాపూర్. ఇప్పుడు కమ్రూప్ మెట్రోపాలిటన్ జిల్లాలో భాగంగా ఉన్నాయి. దక్షిణ కామ్రూప్ జిల్లాలోని ఉప-విభాగాలు ఇప్పుడు కమ్రూప్ రూరల్ జిల్లాలో భాగంగా ఉన్నాయి.

2016 జూన్ 27న మరో జిల్లాను సర్బానంద సోనోవాల్ ప్రకటించి, మొత్తం సంఖ్యను 32 నుండి 33కి పెంచారు, ఇది మజులి (జోర్హాట్ ఉత్తర భాగాల నుండి). ఇది భారతదేశంలోని మొదటి నదీ ద్వీపం జిల్లా.[3]

2020 ఆగస్టు 8న అస్సాం క్యాబినెట్ అస్సాంలోని బజాలీని (బార్పేట నుండి) 34వ పూర్తిస్థాయి జిల్లాగా చేసే ప్రతిపాదనను ఆమోదించింది.[4] ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ నేతృత్వంలోని అస్సాం క్యాబినెట్ బక్సా జిల్లా నుండి తమల్‌పూర్‌ను పూర్తిస్థాయి జిల్లాగా మార్చే ప్రతిపాదనను ఆమోదించింది.[5] 2022 జనవరి 23న తముల్పూర్ను అధికారికంగా అస్సాంలో 35వ జిల్లాగా ప్రకటించబడింది.[6]

రద్దు అయిన లేదా విలీనమైన జిల్లాలు

[మార్చు]

గతంలో ఉన్న 35 జిల్లాలలో, నాలుగు జిల్లాలు విశ్వనాథ్ జిల్లాను సోనిత్‌పూర్‌ జిల్లాలో, హోజాయ్ జిల్లాను నాగావ్‌ జిల్లాలో, బాజాలి జిల్లాను బార్‌పేటజిల్లాలో, తూముల్‌పూర్‌ జిల్లాను బక్సా జిల్లాలో విలీనం చేసారు.[7][8]

రద్దైన నాలుగు జిల్లాలు తిరిగి పునర్వినియోగం

[మార్చు]

2023 ఆగష్టు 25న అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ కొత్తగా సృష్టించిన నాలుగు జిల్లాలైన బిశ్వనాథ్, హోజాయ్, బాజాలి, తముల్‌పూర్‌లనువాటి అసలు జిల్లాలతో పునర్వినియోగించాలనే నిర్ణయాన్ని ప్రకటించారు.[9]దీంతో అసోంలో మొత్తం జిల్లాల సంఖ్య మరోసారి 35కి చేరింది.

జిల్లాలు జాబితా

[మార్చు]

31 జిల్లాల ప్రాంతాలు, జనాభా క్రింద ఇవ్వబడ్డాయి:[10]

వ.సం. కోడ్ ‌జిల్లా ముఖ్య పట్టణం జనాభా

(2011)

విస్తీర్ణం

(కి.మీ.²)

జన సాంద్రత (కి.మీ.²)
1 BK బక్సా జిల్లా ముషాల్‌పూర్ 953,773 2,400 398
2 BP బార్పేట జిల్లా బార్పేట 1642420 3245 506
3 BO బొంగైగావ్ జిల్లా బొంగైగావ్ 906315 2510 361
4 CA కచార్ జిల్లా సిల్చార్ 1442141 3786 381
5 CD చరాయిదేవ్ జిల్లా సోనారీ 471,418 1,064 440
6 CH చిరంగ్ జిల్లా కాజల్‌గావ్ 481,818 1,468 328
7 DR దర్రాంగ్ జిల్లా మంగల్‌దాయి 1503943 3481 432
8 DM ధేమాజి జిల్లా ధెమాజి 569468 3237 176
9 DU ధుబ్రి జిల్లా ధుబ్రి 1634589 2838 576
10 DI డిబ్రూగఢ్ జిల్లా డిబ్రూగర్ 1172056 3381 347
11 DH దిమా హసాయో జిల్లా (నార్త్ కచార్ హిల్స్ జిల్లా) హాఫ్లాంగ్ 186189 4888 38
12 GP గోల్‌పారా జిల్లా గోల్‌పారా 822306 1824 451
13 GG గోలాఘాట్ జిల్లా గోలాఘాట్ 945781 3502 270
14 HA హైలకండి జిల్లా హైలకండి 542978 1327 409
15 JO జోర్హాట్ జిల్లా జోర్హాట్ 1009197 2851 354
16 KM కామరూప్ మెట్రోపాలిటన్ జిల్లా గౌహతి 1,260,419 1,528 820
17 KU కామరూప్ జిల్లా అమీన్‌గావ్ 1,517,202 1,527.84 520
18 KG కర్బీ ఆంగ్లాంగ్ జిల్లా దిఫు 812320 10434 78
19 KR కరీంగంజ్ జిల్లా కరీంగంజ్ 1003678 1809 555
20 KJ కోక్రాఝార్ జిల్లా కోక్రఝార్ 930404 3129 297
21 LA లఖింపూర్ జిల్లా ఉత్తర లఖింపూర్ 889325 2277 391
22 MJ మజులి జిల్లా గారమూర్ 167,304 880 300
23 MA మారిగావ్ జిల్లా మారిగావ్ 775874 1704 455
24 NN నాగావ్ జిల్లా నాగావ్ 2315387 3831 604
25 NB నల్బారి జిల్లా నల్బరి 1138184 2257 504
26 SV శివసాగర్ జిల్లా సిబ్‌సాగర్ 1052802 2668 395
27 ST సోనిత్‌పూర్ జిల్లా తేజ్‌పూర్ 1677874 5324 315
28 SM దక్షిణ సల్మారా-మంకాచార్ జిల్లా హాట్సింగరి 555,114 568 980
29 TI తిన్‌సుకియా జిల్లా తిన్‌సుకియా 1150146 3790 303
30 UD ఉదల్గురి జిల్లా ఉదల్గురి 832,769 1,676 497
31 WK పశ్చిమ కర్బి ఆంగ్లాంగ్ జిల్లా హమ్రెన్ 3,00,320 3,035 99

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "CM Tarun Gogoi announces 5 new districts in Assam on Independence Day". Daily News and Analysis. Guwahati. Press Trust of India. 15 August 2015. Retrieved 2022-10-18.
  2. "Assam gets five more districts". Zee News. Guwahati. IANS. 15 August 2015. Retrieved 2022-10-18.
  3. "Assam: Majuli becomes 1st river island district of India". Hindustan Times. Guwahati. 27 June 2016. Retrieved 2022-10-18.
  4. "'Bajali' to become the 34th full-fledged district of Assam". The Sentinel (Guwahati). Guwahati. 8 August 2020. Retrieved 2022-10-18.
  5. "Assam Budget 2021: Tamulpur Proposed To Be Created As New District". www.newsdaily24.in. 2021-07-17. Archived from the original on 2021-07-16. Retrieved 2022-10-18.
  6. Desk, Sentinel Digital (2021-01-24). "Assam Govt Forms Tamulpur As New District In State". www.sentinelassam.com. Retrieved 2022-10-18.
  7. "Assam merges 4 districts, redraws boundaries ahead of EC's delimitation deadline". Hindustan Times. 2022-12-31. Retrieved 2023-07-27.
  8. "Assam merges 4 new districts with 4 others ahead of 'delimitation'". The Times of India. 2023-01-01. ISSN 0971-8257. Retrieved 2023-07-27.
  9. "Assam govt remerges Biswanath, Hojai, Bajali and Tamulpur with original districts". nenow.in. Retrieved 2023-10-07.
  10. The Office of Registrar General and Census Commissioner of India.

బయటి లింకులు

[మార్చు]