లడఖ్ జిల్లాల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లడఖ్ జిల్లా పటం (లేత నీలం రంగుతో ఉన్నప్రాంతాలు నియంత్రించబడని భూభాగాలను సూచిస్తుంది).

లడఖ్‌లో, రెండు జిల్లాలు ఉన్నాయి. ఇది భారత కేంద్రపాలిత ప్రాంతం ప్రతి జిల్లా స్వయంప్రతిపత్తి గల జిల్లా మండలిని ఎన్నుకుంటుంది. 2019 అక్టోబరు 31 వరకు, ఈ జిల్లాలు పూర్వ జమ్మూ, కాశ్మీర్ రాష్ట్రంలో భాగంగా ఉన్నాయి.

లడఖ్ జిల్లాలు

[మార్చు]

కార్గిల్

[మార్చు]

కార్గిల్ ప్రాంతం 1979లో లడఖ్ లోని ఒక ప్రత్యేక జిల్లాగా అవతరించింది, ఇది పూర్వపు లేహ్ జిల్లా నుండి విభజించబడింది. లడఖ్ అటానమస్ హిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ కార్గిల్ జిల్లాలో జూలై 2003లో ప్రారంభించబడింది.[1] ప్రస్తుత కార్గిల్ జిల్లా చాలా వరకు ఒకప్పుడు పూరిగ్ అని పిలువబడింది. పురిగ్ అని పిలువబడే ప్రాంతంలో కార్గిల్ పట్టణం చుట్టుపక్కల ప్రాంతాలు, సురు వ్యాలీ, సంఘ్ (కె) ఆర్ చిక్తాన్, పశు (యం, బౌద్ ఖర్బు, ముల్బెక్(హెచ్) ఉన్నాయి.[2]

లేహ్ జిల్లా

[మార్చు]

పురాతన కాలంలో ప్రస్తుత లేహ్ జిల్లా గ్రేటర్ లడఖ్‌లో భాగంగా కైలాష్ మానసరోవర్ నుండి స్వాత్ (దార్దిస్తాన్) వరకు విస్తరించి ఉంది. గ్రేటర్ లడఖ్ టిబెట్ డొమైన్ లేదా దాని ప్రభావంలో లేదు. లడఖ్ పురాతన చరిత్ర గురించి చాలా సమాచారం అందుబాటులో లేదు. లేహ్ జిల్లా వైశాల్యం 45,110 చ.కి.మీ. భారతదేశంలో వైశాల్యపరంగా లేహ్ జిల్లా 2వ స్థానంలో ఉంది.లేహ్ జిల్లాలో నోబ్రా శాసనసభ నియోజకవర్గం , లెహ్ శాసనసభ నియోజకవర్గం.[3]  అనే రెండు శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి.

సం. కోడ్ జిల్లా ముఖ్య పట్టణం జనాభా (2001) విస్తీర్ణం (కి.మీ.²) జన సాంద్రత (/కి.మీ.²)
1 KL కార్గిల్ కార్గిల్ 1,40,802 14,036 10
2 LH లేహ్ ‌లేహ్ 1,33,487 45,110 3

మూలాలు

[మార్చు]
  1. "History | District Kargil, Union Territory of Ladakh | India". Retrieved 2023-07-24.
  2. "History | District Kargil, Union Territory of Ladakh | India". Retrieved 2023-07-24.
  3. "ERO's and AERO's". Chief Electoral Officer, Jammu and Kashmir. Archived from the original on 2008-10-22. Retrieved 2008-08-28.

వెలుపలి లంకెలు

[మార్చు]