తమిళనాడు జిల్లాల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తమిళనాడు జిల్లాల జాబితా
తమిళనాడు జిల్లాలు
రకంజిల్లాలు
స్థానంతనుళనాడు
సంఖ్య38 జిల్లాలు
జనాభా వ్యాప్తిపెరంబలూరు – 565,223 (అత్యల్ప); చెన్నై – 7,139,630 (అత్యధిక)
విస్తీర్ణాల వ్యాప్తిచెన్నైమూస:కన్వర్ట్ (చిన్నది); దిండిగల్మూస:కన్వర్ట్ (అతిపెద్ద)
ప్రభుత్వంతమిళనాడు ప్రభుత్వం
ఉప విభజనతమిళనాడులోని రెవెన్యూ డివిజన్లు

భారతదేశం లోని, తమిళనాడు రాష్ట్రం, 1956 నవంబరు 1న రాష్ట్రం ఏర్పడినప్పుడు మొదట 13 జిల్లాలతో ఉంది. ఆ తరువాత అనేక విభజనల తర్వాత 2022 ఆఖరునాటికి 38 జిల్లాలను కలిగిఉంది. పరిపాలనా సౌలభ్యం కోసం ఉప జిల్లాలు, తాలూకాలు, చిన్న పరిపాలనా విభాగాలుగా జిల్లాలు విభజించబడ్డాయి.

చరిత్ర[మార్చు]

స్వాతంత్ర్యానికి పూర్వం[మార్చు]

స్వాతంత్ర్యం వచ్చినప్పుడు, భారతదేశంలోని మద్రాసు ప్రెసిడెన్సీ 26 జిల్లాలతో రూపొందించబడింది. వీటిలో 12 జిల్లాలు ప్రస్తుత తమిళనాడులో ఉన్నాయి. అవి, చింగిల్‌పుట్, కోయంబత్తూరు, నీలగిరి, ఉత్తర ఆర్కాట్, మద్రాస్, మధుర, రామ్‌నాడ్ , సేలం, సౌత్ ఆర్కాట్, తంజోర్, తిన్నెవేలీ, ట్రిచినోపోలీ.

1947–1956[మార్చు]

భారత స్వాతంత్ర్యం తరువాత, బ్రిటిష్ పాలనలో ఉన్న మద్రాస్ ప్రెసిడెన్సీ 1947 ఆగష్టు 15న మద్రాస్ ప్రావిన్స్‌గా మారింది. 1947లో భారత స్వాతంత్ర్యం తర్వాత, పుదుక్కోట్టై ప్రిన్స్లీ స్టేట్ 1948 మార్చి 4న భారత రాష్ట్రాల సమాఖ్యతో విలీనం చేయబడి, ట్రిచినోపోలీ జిల్లాలో ఒక విభాగంగా మారింది. భారత కొత్త రాజ్యాంగం 1950 జనవరి 26న అమల్లోకి వచ్చిన తరువాత, భారతదేశం సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా మారింది. ఈ చట్టం ప్రకారం, 1950 జనవరి 26న, మద్రాస్ ప్రావిన్స్‌ను భారత ప్రభుత్వం మద్రాసు రాష్ట్రంగా ఏర్పాటు చేసింది.

1950లో మద్రాసు రాష్ట్రం ఏర్పడిన సమయంలో, ఇది ప్రస్తుత తమిళనాడు, కోస్తా ఆంధ్ర, రాయలసీమ, ఉత్తర కేరళలోని మలబార్ ప్రాంతం, బళ్లారి, దక్షిణ కెనరా ప్రాంతాలను కలిగి ఉంది. 1953లో కోస్తా ఆంధ్ర, రాయలసీమలు విడిపోయి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పరచగా, అయితే 1956లో దక్షిణ కెనరా, బళ్లారి జిల్లాలు మైసూరు రాష్ట్రంతో కలిసి కర్ణాటక రాష్ట్రంగా, మలబార్ జిల్లా ట్రావెన్‌కోర్-కొచ్చిన్ రాష్ట్రంతో కలిసి కేరళగా ఏర్పడ్డాయి.

1956[మార్చు]

1956 రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ఫలితంగా, రాష్ట్ర సరిహద్దులు భాషా రేఖలను అనుసరించి పునర్వ్యవస్థీకరించారు. తమిళం మాట్లాడే కన్యాకుమారి ప్రాంతం గతంలో ట్రావెన్‌కోర్-కొచ్చిన్‌లో భాగంగాఉన్న మద్రాసు రాష్ట్రంలో విలీనమైంది. మద్రాసు ప్రెసిడెన్సీలోని 13 దక్షిణ జిల్లాలతో 1956 నవంబరు 1న మద్రాసు రాష్ట్రం ఏర్పడింది.

అవి క్రింది విధంగా ఉన్నాయి: చింగ్లేపుట్, కోయంబత్తూరు, కన్యాకుమారి, మద్రాసు, మధురై, నీలగిరి, ఉత్తర ఆర్కాట్, రామనాథపురం, సేలం, సౌత్ ఆర్కాట్, తంజావూరు, తిరుచిరాపల్లి, తిరునెల్వేలి .

1960–1989[మార్చు]

  • 1966 అక్టోబరు 2న, ధర్మపురి జిల్లా, ధర్మపురి, హరూర్, హోసూర్, కృష్ణగిరి తాలూకాలతో కూడినపూర్వపు సేలం జిల్లా నుండి విభజించబడింది. [1]
  • 1969లో మద్రాసు రాష్ట్రం పేరును తమిళనాడుగా మార్చారు.
  • 1974 జనవరి 14న, పుదుక్కోట్టై జిల్లా, తిరుచిరాపల్లి, తంజావూరు జిల్లాల నుండి కులత్తూర్, తిరుమయం, అలంగుడి, అరంతంగి తాలూకాలతో ఏర్పడింది. [2]
  • 31 ఆగస్టు 1979న, ఈరోడ్ జిల్లా భవానీ, ఈరోడ్, సత్యమంగళం తాలూకాలతో కూడిన పూర్వపు కోయంబత్తూరు జిల్లా నుండి విభజన ద్వారా ఏర్పడింది.[3]
  • 1985 మార్చి 8న, శివగంగ, విరుదునగర్ జిల్లాలు పూర్వపు రామనాథపురం జిల్లా [4] నుండి శివగంగ జిల్లాతో కలిపి తిరుపత్తూరు, కారైకుడి, దేవకోట్టై, శివగంగ, మనమదురై, ఇళైయంగుడి తాలూకాలతో, [5] విరుదునగర్ జిల్లా, శ్రీవిల్లిపుత్తూరు, విరుదునగర్, తిరుచూలి, అరుప్పుకోట్టై, సత్తూర్, రాజపాళయం తాలూకాలతో విభజించుట ద్వారా ఏర్పడ్డాయి.[6]
  • 1985 సెప్టెంబరు 15న, దిండిగల్ జిల్లా, పూర్వపు మధురై జిల్లా నుండి దిండిగల్, పళని, కొడైకెనాల్ తాలూకాలతో కూడిన జిల్లాగా విభజించుట ద్వారా ఏర్పడింది. [7]
  • 20 అక్టోబరు 1986న, తూత్తుకుడి జిల్లా తూత్తుకుడి, ఒట్టపిడారం, తిరువైకుంటం తాలూకాలతో కూడిన పూర్వపు తిరునల్వేలి జిల్లా నుండి విభజించుట ద్వారా ఏర్పడింది. [8]
  • 1989 సెప్టెంబరు 30 న, తిరువణ్ణామలై, వెల్లూరు జిల్లాలు పూర్వపు ఉత్తర ఆర్కాట్ జిల్లా (జిల్లా ఉనికిలో లేవు) నుండి తిరువణ్ణామలై, ఆర్ని, వందవాసి, చెయ్యార్, పోలూర్, చెంగం తాలూకాలతో కూడిన ఆర్కోనమ్ తాలూకాలతో [9] గుడియాతం, తిరుపత్తూరు, వెల్లూరు, వాణియంబాడి, వాలాజా తాలూకాలతో వెల్లూరు జిల్లాలు విభజించుట ద్వారా ఏర్పడ్డాయి. [10]

1990–1999[మార్చు]

  • 1991 అక్టోబరు 18న, నాగపట్టణం తిరువారూర్, మైలదుత్తురై, మనార్గుడి, నాగపట్నం విభాగాలు కుంభకోణం డివిజన్ నుండి వలంగైమాన్ తాలూకాతో కూడిన పూర్వపు తంజావూరు జిల్లా నుండి విభజించుట ద్వారా ఏర్పడింది. [11]
  • 1993 సెప్టెంబరు 30న, కడలూర్, విలుప్పురం జిల్లాలు పూర్వపు దక్షిణ ఆర్కాట్ జిల్లా (జిల్లా ఉనికిలో లేవు) నుండి వేరుచేయబడ్డాయి. కడలూర్ జిల్లాతో పాటు కడలూర్, చిదంబరం, వృద్ధాచలం తాలూకాలతో [12] విల్లుపురం జిల్లా తిరుక్కూరుచి, విల్లుపురం తిరుక్కూరుచి, తిరుప్పురం తాలుకాలతో ఏర్పడ్డాయి. [13]
  • 1995 సెప్టెంబరు 30 న, కరూర్, పెరంబలూరు జిల్లాలు పూర్వపు తిరుచిరాపల్లి జిల్లా [14]నుండి త్రివిభజన చేయబడ్డాయి. కరూర్ జిల్లా కరూర్, కుళితలై, మనప్పరై తాలూకాలతో [15]పెరంబలూరు జిల్లా పెరంబలూర్, కున్నం తాలూకాలతో ఏర్పడ్డాయి. [16]
  • 1996 జులై 25న, థేని జిల్లా మధురై జిల్లా నుండి థేని, బోడినాయకనూర్, పెరియకులం, ఉత్తమపాళయం, అండిపట్టి తాలూకాలతో ఏర్పడింది.[17]
  • 1997 జనవరి 1 న తిరువారూర్ జిల్లా, నాగపట్నం జిల్లా నుండి తిరువారూర్, నన్నిలం, కుడవాసల్, నీడమంగళం, మన్నార్గుడి, తిరుతురైపూండి తాలూకాలతో, తంజావూర్ జిల్లా నుండి వలంగైమాన్ తాలూకాలతో కూడిన పూర్వపు నాగపట్నం, తంజావూరు జిల్లాల నుండి ఏర్పడింది. [18]
  • 1997 జనవరి 1న, నమక్కల్, తిరుచెంగోడ్, రాశిపురం, పరమతి-వేలూరు తాలూకాలతో కూడిన పూర్వపు సేలం జిల్లా నుండి నమక్కల్ జిల్లా విభజించుట ద్వారా ఏర్పడింది. [19]
  • 1997 జులై 1న, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాలు కాంచీపురం, శ్రీపెరంబుదూర్, ఉత్తిరమేరూర్, చెంగల్పట్టు, తాంబరం, తిరుకళుకుంద్రం, మదురాంతకం, చెయ్యూర్ తాలూకాలతో [20], కాంచీపురం జిల్లాతో పాటు పూర్వపు చెంగల్పట్టు జిల్లా(జిల్లా ఉనికిలో లేదు) నుండి కాంచీపురం జిల్లా, తిరుత్తణి తాలూకా, సైదాపేట రెవెన్యూ డివిజన్‌లోని పొన్నేరి, గుమ్మిడిపూండి తాలూకాలతోపాటు చెంగల్పట్టు జిల్లా నుండి ఉత్తుక్కోట్టై, పల్లిపట్టు ఉపతాలూకాలు వేరుచేయుట ద్వారా తిరువళ్లూరు జిల్లా ఏర్పడినవి. [21]

జిల్లాల జాబితా[మార్చు]

వ.సంఖ్య. జిల్లా కోడ్ ప్రధాన కార్యాలయం అధికారికంగా ఏర్పడిన తేదీ దేని నుండి విభజించబడింది విస్తీర్ణం (చ.కి.మీటర్లు) జనాభా (2011)[33] జనసాంద్రత (చ.కి.మీ.1కి)
జిల్లా స్థానం సూటించే పటం
1. అరియాలూర్ జిల్లా AR అరియలూర్ 2007 నవంబరు 23 పెరంబలూర్ జిల్లా 1949.31 754,894 390
2. చెంగల్పట్టు జిల్లా CGL చెంగల్పట్టు 2019 నవంబరు 29 కాంచీపురం జిల్లా 2,944.96 2,556,244 868 |-
3. చెన్నై జిల్లా CH చెన్నై 1956 నవంబరు 1 మొదట రాష్ట్రం ఏర్పడినప్పుడు అసలు 13 జిల్లాలలో ఒకటి (పూర్వ పేరు "మద్రాసు జిల్లా") 426 7,139,630 17,000
4. కోయంబత్తూరు జిల్లా CO కోయంబత్తూర్ 1956 నవంబరు 1 మొదట రాష్ట్రం ఏర్పడినప్పుడు అసలు 13 జిల్లాలలో ఒకటి 4,723[34] 3,458,045 732
5. కడలూర్ జిల్లా CU కడలూర్ 1993 సెప్టెంబరు 30 సౌత్ ఆర్కాట్ జిల్లా (మద్రాసు ప్రెసిడెన్సీ) 3,703 2,605,914 709
6. ధర్మపురి జిల్లా DH ధర్మపురి 1965 అక్టోబరు 2 సేలం జిల్లా 4,497.77 1,506,843 335
7. దిండిగల్ జిల్లా DI దిండిగల్ 1985 సెప్టెంబరు 15 మథురై జిల్లా 6,266.64 2,159,775 345
8. ఈరోడ్ జిల్లా ER ఈరోడ్ 1979 ఆగష్టు 31 కోయంబత్తూర్ జిల్లా 5,722[35] 2,251,744 394
9. కళ్లకురిచి జిల్లా KL కళ్లకురిచి 2019 నవంబరు 26 విళుపురం జిల్లా 3,520.37 1,370,281 389
10. కాంచీపురం జిల్లా KC కాంచీపురం 1997 జులై 1 చెంగల్పట్టు 1,655.94 1,166,401 704
11. కన్యాకుమారి జిల్లా KK నాగర్‌కోయిల్ 1956 నవంబరు 1 మొదట రాష్ట్రం ఏర్పడినప్పుడు అసలు 13 జిల్లాలలో ఒకటి. (ట్రావెన్‌కోర్-కొచ్చిన్ నుండి బదిలీ చేయబడింది) 1,672 1,870,374 1,119
12. కరూర్ జిల్లా KR కరూర్ 1995 సెప్టెంబరు 30 తిరుచిరాపల్లి జిల్లా 2,895.57 1,064,493 357
13. కృష్ణగిరి జిల్లా KR కృష్ణగిరి 2004 ఫిబ్రవరి 9 ధర్మపురి జిల్లా 5,143 1,879,809 366
14. మదురై జిల్లా MDU మధురై 1956 నవంబరు 1 మొదట రాష్ట్రం ఏర్పడినప్పుడు అసలు 13 జిల్లాలలో ఒకటి. 3,741.73 3,038,252 812
15. మైలాదుత్తురై జిల్లా MYD మైలాదుత్తరై 2020 డిసెంబరు 28 నాగపట్టినం జిల్లా 1,172 918,356 784
16. నాగపట్టినం జిల్లా NG నాగపట్టినం 1991 అక్టోబరు 18 తంజావూరు జిల్లా 1,397 697,069 498
17. నమక్కల్ జిల్లా NM నమక్కల్ 1997 జనవరి 1 సేలం జిల్లా 3,368.21 1,726,601 513
18. నీలగిరి జిల్లా NI ఊటీ 1956 నవంబరు 1 మొదట రాష్ట్రం ఏర్పడినప్పుడు అసలు 13 జిల్లాలలో ఒకటి. 2,545 735,394 300
19. పెరంబలూర్ జిల్లా PE పెరంబలూర్ 1995 సెప్టెంబరు 30 తిరుచిరాపల్లి జిల్లా 1,757 565,223 320
20. పుదుక్కొట్టై జిల్లా PU పుదుక్కొట్టై 1974 జనవరి 14 తంజావూరు జిల్లా, తిరుచిరాపల్లి జిల్లా 4,663 1,618,345 347
21. రామనాథపురం జిల్లా RA రామనాథపురం 1956 నవంబరు 1 మొదట రాష్ట్రం ఏర్పడినప్పుడు అసలు 13 జిల్లాలలో ఒకటి. 4,068.31 1,353,445 331
22. రాణిపేట జిల్లా RN రాణిపేట 2019 నవంబరు 28 వెల్లూర్ జిల్లా 2,234.32 1,210,277 542
23. సేలం జిల్లా SA సేలం 1956 నవంబరు 1 మొదట రాష్ట్రం ఏర్పడినప్పుడు అసలు 13 జిల్లాలలో ఒకటి. 5,245 3,482,056 669
24. శివగంగై జిల్లా SI శివగంగై 1985 మార్చి 15 రామనాథపురం జిల్లా 4,189 1,339,101 328
25. తెన్‌కాశి జిల్లా TS తెన్‌కాశి 2019 నవంబరు 22 తిరునల్వేలి జిల్లా 2916.13 1,407,627 483
26. తంజావూరు జిల్లా TJ తంజావూరు 1956 నవంబరు 1 మొదట రాష్ట్రం ఏర్పడినప్పుడు అసలు 13 జిల్లాలలో ఒకటి. 3,396.57 2,405,890 708
27. థేని జిల్లా TN థేనీ 1996 జులై 25 మథురై జిల్లా 3,242.3 1,245,899 406
28. తూత్తుకూడి జిల్లా TK తూత్తుకూడి 1986 అక్టోబరు 20 తిరునల్వేలి జిల్లా 4,707 1,750,176 372
29. తిరుచిరాపల్లి జిల్లా TC తిరుచిరాపల్లి 1956 నవంబరు 1 మొదట రాష్ట్రం ఏర్పడినప్పుడు అసలు 13 జిల్లాలలో ఒకటి. 4,403.83 2,722,290 618
30. తిరునల్వేలి జిల్లా TI తిరునల్వేలి 1956 నవంబరు 1 మొదట రాష్ట్రం ఏర్పడినప్పుడు అసలు 13 జిల్లాలలో ఒకటి. 3842.37 1,665,253 433
31. తిరుపత్తూరు జిల్లా TU తిరుపత్తూరు 2019 నవంబరు 28 వెల్లూర్ జిల్లా 1,797.92 1,111,812 618
32. తిరుప్పూర్ జిల్లా TP తిరుప్పూర్ 2009 ఫిబ్రవరి 22 కోయంబత్తూర్ జిల్లా , ఈరోడ్ జిల్లా 5,186.34 2,479,052 478
33. తిరువళ్ళూర్ జిల్లా TL తిరువళ్లూర్ 1997 జులై 1 చెంగల్పట్టు జిల్లా 3,422.43 3,728,104 1,089
34. తిరువణ్ణామలై జిల్లా TV తిరువణ్ణామలై 1989 సెప్టెంబరు 30 నార్త్ ఆర్కాట్ 6,188 2,464,875 398
35. తిరువారూర్ జిల్లా TR తిరువారూర్ 1991 అక్టోబరు 18 తంజావూరు జిల్లా 2,161 1,264,277 585
36. వెల్లూర్ జిల్లా VE వెల్లూర్ 1989 సెప్టెంబరు 30 నార్త్ ఆర్కాట్ 2030.11 1,614,242 795
37. విళుపురం జిల్లా VL విళుపురం 1993 సెప్టెంబరు 30 సౌత్ ఆర్కాట్ (మద్రాస్ ప్రెసిడెన్సీ) 3725.54 2,093,003 562
38. విరుదునగర్ జిల్లా VR విరుదునగర్ 1985 మార్చి 15 రామనాథపురం జిల్లా 4,241.0 1,942,288 453

పూర్వ జిల్లాలు[మార్చు]

మ్యాప్ జిల్లా సంవత్సరాలు వారసత్వ జిల్లాలు
చింగిల్‌పుట్ 1956–1998 కాంచీపురం, చెంగల్పట్టు, తిరువళ్లూరు
ఉత్తర ఆర్కాట్ 1956–1989 తిరువణ్ణామలై, వెల్లూరు, రాణిపేట్, తిరుపత్తూరు
దక్షిణ ఆర్కాట్ 1956–1993 కడలూరు, విల్లుపురం , కళ్లకురిచి

ఇది కూడ చూడు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Formation of Dharmapuri district". Government of Tamil Nadu (in ఇంగ్లీష్). 2 October 1966. Archived from the original on 12 April 2019. Retrieved 28 April 2020.
  2. "Formation of Pudukottai district". Government of Tamil Nadu (in ఇంగ్లీష్). 14 January 1974. Archived from the original on 10 May 2019. Retrieved 28 April 2020.
  3. "Formation of Erode district". Government of Tamil Nadu (in ఇంగ్లీష్). 31 August 1979. Archived from the original on 10 April 2019. Retrieved 28 April 2020.
  4. "Formation of Sivgangai and Virudhunagar districts". Government of Tamil Nadu (in ఇంగ్లీష్). 8 March 1985. Retrieved 28 April 2020.
  5. "Formation of Sivgangai and Virudhunagar district". Government of Tamil Nadu (in ఇంగ్లీష్). 8 March 1985. Archived from the original on 3 November 2019. Retrieved 28 April 2020.
  6. "Formation of Sivgangai and Virudhunagar district". Government of Tamil Nadu (in ఇంగ్లీష్). 8 March 1985. Archived from the original on 21 April 2020. Retrieved 28 April 2020.
  7. "Formation of Dindigul district". Government of Tamil Nadu (in ఇంగ్లీష్). 15 September 1985. Archived from the original on 29 December 2019. Retrieved 28 April 2020.
  8. "Formation of Thoothukudi district". Government of Tamil Nadu (in ఇంగ్లీష్). 2 October 1966. Archived from the original on 2 May 2019. Retrieved 28 April 2020.
  9. "Formation of Tiruvannamalai district". Government of Tamil Nadu (in ఇంగ్లీష్). 30 September 1989. Archived from the original on 24 April 2019. Retrieved 28 April 2020.
  10. "Formation of Vellore district". Government of Tamil Nadu (in ఇంగ్లీష్). 30 September 1989. Archived from the original on 10 October 2019. Retrieved 28 April 2020.
  11. "Formation of Nagapattinam district". Government of Tamil Nadu (in ఇంగ్లీష్). 18 October 1991. Archived from the original on 21 April 2019. Retrieved 28 April 2020.
  12. "Formation of Cuddalore district". Government of Tamil Nadu (in ఇంగ్లీష్). 30 September 1993. Archived from the original on 25 March 2020. Retrieved 28 April 2020.
  13. "Formation of Villupuram district". Government of Tamil Nadu (in ఇంగ్లీష్). 30 September 1993. Retrieved 28 April 2020.[permanent dead link]
  14. "Formation of Karur and Perambalur districts". Government of Tamil Nadu (in ఇంగ్లీష్). 30 September 1995. Retrieved 28 April 2020.[permanent dead link]
  15. "Formation of Karur and Perambalur districts". Government of Tamil Nadu (in ఇంగ్లీష్). 30 September 1995. Archived from the original on 9 May 2019. Retrieved 28 April 2020.
  16. "Formation of Karur and Perambalur districts". Government of Tamil Nadu (in ఇంగ్లీష్). 30 September 1995. Archived from the original on 2 November 2019. Retrieved 28 April 2020.
  17. "Formation of Theni district". Government of Tamil Nadu (in ఇంగ్లీష్). 25 July 1996. Archived from the original on 27 April 2019. Retrieved 28 April 2020.
  18. "Formation of Tiruvarur district". Government of Tamil Nadu (in ఇంగ్లీష్). 1 January 1997. Archived from the original on 29 March 2019. Retrieved 28 April 2020.
  19. "Formation of Namakkal district". Government of Tamil Nadu (in ఇంగ్లీష్). 1 January 1997. Archived from the original on 1 November 2019. Retrieved 28 April 2020.
  20. "Formation ofKanchipuram district". Government of Tamil Nadu (in ఇంగ్లీష్). 1 July 1997. Retrieved 28 April 2020.[permanent dead link]
  21. "Formation of Tiruvallur district". Government of Tamil Nadu (in ఇంగ్లీష్). 1 July 1997. Archived from the original on 20 April 2019. Retrieved 28 April 2020.
  22. "Formation of Krishnagiri district". Government of Tamil Nadu (in ఇంగ్లీష్). 9 February 2004. Archived from the original on 7 May 2019. Retrieved 28 April 2020.
  23. "Formation of Ariyalur district". Government of Tamil Nadu (in ఇంగ్లీష్). 19 November 2007. Archived from the original on 8 April 2019. Retrieved 28 April 2020.
  24. "Formation of Tiruppur district". Government of Tamil Nadu (in ఇంగ్లీష్). 24 October 2009. Archived from the original on 24 April 2020. Retrieved 28 April 2020.
  25. "Formation of Tiruppur district". Government of Tamil Nadu (in ఇంగ్లీష్). 24 October 2009. Archived from the original on 12 April 2019. Retrieved 28 April 2020.
  26. "Formation of Tiruppur district". Government of Tamil Nadu (in ఇంగ్లీష్). 24 October 2009. Archived from the original on 10 April 2019. Retrieved 28 April 2020.
  27. "Expansion of Chennai district". Times of India (in ఇంగ్లీష్). 5 January 2018. Retrieved 28 April 2020.
  28. "Formation of Tenkasi district". The Hindu (in ఇంగ్లీష్). 22 November 2019. Archived from the original on 14 November 2019. Retrieved 28 April 2020.
  29. "Formation of Kallakuruchi district". New Indian Express (in ఇంగ్లీష్). 26 November 2019. Retrieved 28 April 2020.
  30. "Formation of Tirupattur and Ranipet districts". New Indian Express (in ఇంగ్లీష్). 29 November 2019. Archived from the original on 24 December 2019. Retrieved 28 April 2020.
  31. "Formation of Chengalpattu district". The Hindu (in ఇంగ్లీష్). 30 November 2019. Archived from the original on 21 March 2020. Retrieved 28 April 2020.
  32. "Formation of Mayiladuthurai district". The Hindu (in ఇంగ్లీష్). 24 March 2020. Archived from the original on 25 April 2020. Retrieved 28 April 2020.
  33. "A – 2: Decadal Variation Population Since 1901" (PDF). Registrar General and Census Commissioner of India. Archived (PDF) from the original on 13 November 2014. Retrieved 30 November 2019.
  34. "Coimbatore District Statistical Handbook". Coimbatore District Administration. Archived from the original on 4 December 2015. Retrieved 21 November 2015.
  35. "Erode District – District At a Glance". National Informatics Centre. Archived from the original on 11 September 2019. Retrieved 22 November 2019.

వెలుపలి లంకెలు[మార్చు]