జార్ఖండ్ జిల్లాల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Districts of Jharkhand

భారతదేశం లోని జార్ఖండ్ రాష్ట్రం ఇరవై నాలుగు (2023 నాటికి) పరిపాలనా జిల్లాలను కలిగి ఉంది.[1]

పరిపాలన

[మార్చు]

భారతీయ రాష్ట్రానికి చెందిన జిల్లా అనేది జిల్లా మేజిస్ట్రేట్ లేదా డిప్యూటీ కమిషనర్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌కు చెందిన అధికారి నేతృత్వంలోని పరిపాలనా భౌగోళిక ప్రాంతం.జిల్లా మేజిస్ట్రేట్ లేదా డిప్యూటీ కమీషనర్‌కు వివిధ శాఖలకుచెందిన అధికారులు పరిపాలనలో సహాయం చేస్తారు.పోలీస్ సూపరింటెండెంట్, ఇండియన్ పోలీస్ సర్వీస్‌కు చెందిన అధికారికి శాంతిభద్రతలు, సంబంధిత సమస్యలను నిర్వహించే బాధ్యత కలిగి ఉంటారు

చరిత్ర

[మార్చు]

జార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటు సమయంలో 18 జిల్లాలు ఉండేవి. తరువాత, ఈ జిల్లాలను పునర్వ్యవస్థీకరించడం ద్వారా మరో ఆరు జిల్లాలు ఏర్పడ్డాయి. వీటితో రాష్టంలో జిల్లాల సంఖ్య 24కు పెరిగింది.

జిల్లా పరిపాలనా విభాగాలు

జార్ఖండ్‌లో 24 జిల్లాలు ఉన్నాయి.ఇవి 5 డివిజన్లుగా విభజించబడ్డాయి. ఈ విభాగాలు:

  1. పాలము డివిజన్ - 3 జిల్లాలు: పాలము, గర్హ్వా, లతేహార్ - ప్రధాన కార్యాలయం: మేదినీనగర్
  2. ఉత్తర చోటానాగ్‌పూర్ డివిజన్ - 7 జిల్లాలు: చత్రా, హజారీబాగ్, కోడెర్మా, గిరిదిహ్, రామ్‌ఘర్, బొకారో, ధన్‌బాద్ - ప్రధాన కార్యాలయం: హజారీబాగ్
  3. దక్షిణ చోటానాగ్‌పూర్ డివిజన్ - 5 జిల్లాలు: లోహర్దగా, గుమ్లా, సిమ్‌డేగా, రాంచీ, ఖుంటి - ప్రధాన కార్యాలయం: రాంచీ
  4. కొల్హన్ డివిజన్ - 3 జిల్లాలు: పశ్చిమ సింగ్‌భూమ్, సరైకేలా ఖర్సవాన్, తూర్పు సింగ్‌భూమ్ - ప్రధాన కార్యాలయం: చైబాసా
  5. సంతాల్ పరగణా డివిజన్ - 6 జిల్లాలు: జమ్తారా, డియోఘర్, దుమ్కా, పాకుర్, గొడ్డ, సాహెబ్‌గంజ్ - ప్రధాన కార్యాలయం: దుమ్కా

జిల్లాల జాబితా క్రింద ఉంది:

వ.సంఖ్య కోడ్ జిల్లా ప్రధానకార్యాలయం విస్తీర్ణం (చ.కీ.మీ)[2] () జనాభా (2011) జనసాంధ్రత (చ.కి.మీ.కి) జిల్లా స్థానం సూచించే పటం
1 BO బొకారో జిల్లా బొకారో స్టీల్ సిటీ 2,883 2,062,330 715
2 CH ఛత్రా జిల్లా ఛత్రా 3,718 1,042,886 280
3 DE దేవ్‌ఘర్ జిల్లా దేవ్‌ఘర్ 2,477 1,492,073 602
4 DH ధన్‌బాద్ జిల్లా ధన్‌బాద్ 2,040 2,684,487 1316
5 DU దుమ్కా జిల్లా దుమ్కా 3,761 1,321,442 351
6 ES తూర్పు సింగ్‌భుం జిల్లా జంషెడ్‌పూర్ 3,562 2,293,919 644
7 GA గఢ్వా జిల్లా గఢ్వా 4,093 1,322,784 323
8 GI గిరిడి జిల్లా గిరిడి 4,962 2,445,474 493
9 GO గొడ్డా జిల్లా గొడ్డా 2,266 1,313,551 580
10 GU గుమ్లా జిల్లా గుమ్లా 5,360 1,025,213 191
11 HA హజారీబాగ్ జిల్లా హజారీబాగ్ 3,555 1,734,495 488
12 జమ్తాడా జిల్లా జామ్తాడా 1,811 791,042 437
13 ఖుంటీ జిల్లా ఖుంటీ 2,535 531,885 210
14 KO కోడర్మా జిల్లా కోడర్మా 2,540 716,259 282
15 లాతేహార్ జిల్లా లాతేహార్ 4,291 726,978 169
16 LO లోహార్‌దాగా జిల్లా లోహార్‌దాగా 1,502 461,790 307
17 PK పాకూర్ జిల్లా పాకూర్ 1,811 900,422 497
18 PL పాలము జిల్లా మేదినీనగర్ 4,393 1,939,869 442
19 రాంగఢ్ జిల్లా రాంగఢ్ కంటోన్మెంట్ 1,341 949,443 708
20 RA రాంచీ జిల్లా రాంచీ 5,097 2,914,253 572
21 SA సాహిబ్‌గంజ్ జిల్లా సాహెబ్‌గంజ్ 2,063 1,150,567 558
22 సరాయికేలా ఖర్సావా జిల్లా సరాయికేలా 2,657 1,065,056 401
23 సిమ్‌డేగా జిల్లా సిమ్‌డేగా 3,774 599,578 159
24 WS పశ్చిం సింగ్‌భుం జిల్లా చైబాసా 7,224 1,502,338 208

మూలాలు

[మార్చు]
  1. "Districts of Jharkhand". Government of Jharkhand Portal. Archived from the original on 2013-06-27. Retrieved 2023-10-05.
  2. Primary Census Abstract Data Tables (India & States/UTs - District Level)

వెలుపలి లంకెలు

[మార్చు]