ఒడిశా జిల్లాల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఒడిశా జిల్లాల
ଓଡ଼ିଶାର ଜିଲ୍ଲାସମୂହ
ఒడిశా రాజకీయ పటం
రకంఒడిశా జిల్లాలు
స్థానంఒడిశా
సంఖ్య30
జనాభా వ్యాప్తిదేవగఢ్ – 3,12,520 (అత్యల్ప); గంజాం – 35,29,031 (అత్యధిక)
విస్తీర్ణాల వ్యాప్తిమయూర్‌భంజ్ – 10,418 చ.కి.మీ (అతిపెద్ద); జగత్‌సింగ్‌పూర్ – 1,759 చ.కి.మీ (చిన్నది)
ప్రభుత్వంఒడిశా ప్రభుత్వం
ఉప విభజనఉప విభాగాలు, తాలూకాలు లేదా తహసీల్లు

ఒడిశా,ఇది భారతదేశం తూర్పు తీరంలో ఉన్న రాష్ట్రం. ఈ రాష్ట్రంలో 2023 ఆగస్టు నాటికి 30 జిల్లాలు ఉన్నాయి.[1][2][3] ఈ 30 జిల్లాల పాలనను క్రమబద్ధీకరించడానికి తిరిగి మూడు పరిపాలనా విభాగాలు సెంట్రల్ డివిజను, నార్త్ డివిజను, సౌత్ డివిజను అనే వేర్వేరు విభాగాలు ఉన్నాయి.వాటి ప్రధాన కార్యాలయాలు వరుసగా కటక్ (సెంట్రల్ డివిజన్), సంబల్‌పూర్ (నార్త్ డివిజన్ ), బెర్హంపూర్ (దక్షిణ డివిజన్) ఉన్నాయి. ప్రతి విభాగంలో 10 జిల్లాలు ఉంటాయి. దాని పరిపాలనా నిర్వహణకు ప్రధాన అధికారిగా రెవెన్యూ డివిజనల్ కమీషనర్ (ఆర్.డి.సి) గా, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ సీనియర్ ర్యాంక్ కలిగిన అధికారి ఉంటారు. పరిపాలనా శ్రేణిలో ఆర్.డి.సి. స్థానం, జిల్లా పరిపాలన, రాష్ట్ర సచివాలయం మధ్య ఉంటుంది. ప్రతి జిల్లా పరిపాలన కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ చేత నిర్వహించబడింది. వీరి నియామకం ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ద్వారా జరుగుతుంది. కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్ జిల్లాలో ఆదాయాన్ని సేకరించడం, జిల్లాలో శాంతిభద్రతల నిర్వహణకు బాధ్యత వహిస్తాడు. ప్రతి జిల్లా ఉప విభాగాలుగా విభజించబడింది, ప్రతి ఒక్క ఉపవిభాగ పరిపాలన సబ్-కలెక్టర్ & సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ ద్వారా జరుగుతుంది. ఉప-విభాగాలు తహసిల్‌లుగా విభజించారు. తహసీల్దార్‌ నేతృత్వంలో తహసీల్‌లు ఉంటారు. ఒడిశాలో 03 డివిజన్లు, 30 జిల్లాలు, 58 సబ్ డివిజన్లు, 317 తాహసీల్లు, 314 బ్లాక్‌లు ఉన్నాయి.

విభాగాలు వారీగా జిల్లాల జాబితా[మార్చు]

ఒడిషా రాష్ట్రం లోని జిల్లాల స్థానం వివరాల సూచించే పటం
  నార్త్ విభాగం
  సెంట్రల్ విభాగం
  సౌత్ విభాగం
ఉత్తర విభాగం

(సంబల్‌పూర్)

సెంట్రల్ డివిజన్ (కటక్) దక్షిణ విభాగం (బెర్హంపూర్)

పరిపాలన[మార్చు]

ప్రతి జిల్లాకు ఒక కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ జిల్లా రెవెన్యూ సేకరణ, పరిపాలనకు బాధ్యత వహించటానికి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఎఎస్) అధికారి, శాంతిభద్రతలు, సంబంధిత సమస్యలను నిర్వహించడానికి ఒక ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐ.పి.ఎస్.) అధికారిగా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్.పి.) బాధ్యత వహిస్తారు. అన్ని శాఖలు పరిపాలనకు జిల్లా స్థాయిలో జిల్లా అధికారులు ఉంటారు. వీరు అందరిపై జిల్లా కలెక్టరు పర్వేక్షణ ఉంటుంది.

జిల్లాలు[మార్చు]

ఒడిశాలో 2023 ఆగస్టు నాటికి 30 జిల్లాలు ఉన్నాయి. విస్తీర్ణం ప్రకారం మయూర్‌భంజ్ అతి పెద్ద జిల్లా, జగత్‌సింగ్‌పూర్ అతి చిన్న జిల్లా. ఒడిశాలో జనాభా ప్రకారం గంజాం అతి పెద్ద జిల్లా. దేవగఢ్ జిల్లా అతి చిన్న జిల్లా. ఒడిశా రాజధాని భుబనేశ్వర్, ఇది ఖుర్ధా జిల్లాలో ఉంది. 30 జిల్లాల వైశాల్యంతో జనాభా వివరాలు ఈ క్రింద పట్టికలో ఇవ్వబడ్డాయి.[4][5]

కోడ్ జిల్లాలు ముఖ్యపట్టణం జనాభా
(2011)[6]
విస్తీర్ణం (km2) జనసాంధ్రత
2011 (km2)
పటం
1 అంగుల్ జిల్లా అంగుల్ 1,273,821 6,375 200
2 బౌధ్ జిల్లా బౌధ్ 441,162 3444.8 128
3 బలాంగిర్ జిల్లా బలాంగిర్ 1,648,997 6,575 251
4 బర్గఢ్ జిల్లా బర్గఢ్ 1,481,255 5,837 254
5 బాలాసోర్ జిల్లా బాలాసోర్ 2,320,529 3,634 638
6 భద్రక్ జిల్లా భద్రక్ 1,506,337 2,505 601
7 కటక్ జిల్లా కటక్ 2,624,470 3,932 667
8 దేవగఢ్ జిల్లా దేవగఢ్ 312,520 2,782 112
9 ధేన్‌కనల్ జిల్లా ధేన్‌కనల్ 1,192,811 4,452 268
10 గంజాం జిల్లా ఛత్రపూర్ 3,529,031 8,206 430
11 గజపతి జిల్లా పర్లాకిమిడి 577,817 3,850 150
12 ఝార్సుగూడా జిల్లా ఝార్సుగూడా 579,505 2,081 278
13 జాజ్‌పూర్ జిల్లా జాజ్‌పూర్ 1,827,192 2887.69 633
14 జగత్‌సింగ్‌పూర్ జిల్లా జగత్‌సింగ్‌పూర్ 1,136,971 1,759 646
15 ఖుర్ధా జిల్లా ఖుర్ధా 2,251,673 2,813 800
16 కెందుఝార్ జిల్లా కెందుఝార్ 1,801,733 8,303 217
17 కలహండి జిల్లా భవానీపట్న 1,576,869 7,920 199
18 కంథమాల్ జిల్లా ఫూల్‌బని 733,110 7,654 96
19 కోరాపుట్ జిల్లా కోరాపుట్ 1,379,647 8,807 157
20 కేంద్రపడా జిల్లా కేంద్రపడా 1,440,361 2,644 545
21 మల్కనగిరి జిల్లా మల్కనగిరి 613,192 5,791 106
22 మయూర్‌భంజ్ జిల్లా బారిపడా 2,519,738 10,418 242
23 నవరంగపూర్ జిల్లా నవరంగపూర్ 1,220,946 5,294 231
24 నౌపడా జిల్లా నౌపడా 610,382 3,852 158
25 నయాగఢ్ జిల్లా నయాగఢ్ 962,789 3,890 247
26 పూరీ జిల్లా పూరి 1,698,730 3,051 557
27 రాయగడ జిల్లా రాయగడ 967,911 7,073 137
28 సంబల్‌పూర్ జిల్లా సంబల్‌పూర్ 1,041,099 6,702 155
29 సుబర్నపూర్ జిల్లా సుబర్నపూర్ 610,183 2,337 261
30 సుందర్‌గఢ్ జిల్లా సుందర్‌గఢ్ 2,093,437 9,712 215
ఒడిశా 41,974,218 154,468.98 272

మూలాలు[మార్చు]

  1. "Districts of Odisha". Official Portal. Bhubaneswar: Government of Odisha. Retrieved 4 January 2013.
  2. "Districts of Orissa". Archived from the original on 16 January 2012. Retrieved 13 January 2012.
  3. "List of Districts" (PDF). Retrieved 13 January 2012.
  4. "Administrative Unit". Revenue & Disaster Management Department, Government of Odisha. Archived from the original on 21 August 2013. Retrieved 27 March 2015.
  5. The Office of Registrar General and Census Commissioner of India.
  6. "List of districts of Orissa". census2011.co.in.

వెలుపలి లంకెలు[మార్చు]