ఛత్రపూర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఛత్రపూర్
—  పట్టణం  —
ఛత్రపూర్ is located in Odisha
ఛత్రపూర్
ఛత్రపూర్
ఒడిశా పటంలో పట్టణ స్థానం
దేశం  India
రాష్ట్రం ఒడిశా
జిల్లా గంజాం
Government
 - Type NAC
Area rank 2nd
జనాభా (2011)
 - మొత్తం 22,027 [1]
Population rank 100
భాషలు
 - అధికారిక ఒరియా
Time zone IST (UTC+5:30)
PIN 761020[2]
Telephone code 06811
Vehicle registration OD-07

ఛత్రపూర్ (ఛతర్‌పూర్ అని కూడా పిలుస్తారు) ఒడిషా రాష్ట్రం, గంజాం జిల్లా లోని పట్టణం. ఇది గంజాం జిల్లా ముఖ్యపట్టణం. దీని పరిపాలనను నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్ చూస్తుంది. ఛత్రపూర్ ఒడిషాలోని గంజాం జిల్లాలో ఒక తహసీల్ / బ్లాక్ (CD).

జనాభా వివరాలు

[మార్చు]

2011 జనగణన ప్రకారం,[3] ఛత్రపూర్ జనాభా 20,288. ఇందులో పురుషులు 51% కాగా, స్త్రీలు 49%. పట్టణ అక్షరాస్యత 89%, ఇది జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువ. పురుషుల్లో అక్షరాస్యత 85% కాగా, స్త్రీలలో ఇది 73%. జనాభాలో 10%,మంది ఆరెళ్ళ లోపు పిల్లలు.

ఛత్రపూర్‌లో మతం[4]
హిందువులు
  
97.31%
ముస్లిములు
  
1.78%
క్రైస్తవులు
  
0.72%
సిక్కులు
  
0.04%
బౌద్ధులు
  
0.00%
జైనులు
  
0.05%
చెప్పనివారు
  
0.10%
ఇతరులు
  
0.00%

రవాణా

[మార్చు]

ఛత్రపూర్ దక్షిణ ఒడిషాకు ముఖద్వారం. పట్టణంలో బాగా అభివృద్ధి చెందిన రవాణా వ్యవస్థ ఉంది. ఈ మార్గంలో వెళ్ళే అన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఇక్కడ ఆగుతాయి. ఇది కోల్‌కతా మద్రాస్ జాతీయ రహదారితో బాగా అనుసంధానించబడి ఉంది కాబట్టి అన్ని లగ్జరీ బస్సులు కూడా పట్టణం గుండా వెళతాయి.

రోడ్డు

[మార్చు]

జాతీయ రహదారులు NH-16 ( చెన్నై - కోల్‌కతా ), NH-59 ( ఖరియార్ - బెర్హంపూర్ ), స్టేట్ హైవే 36 (ఒడిషా) (సురడ నుండి హింజిలికట్ మీదుగా ఛత్రపూర్) ఛత్రపూర్ గుండా వెళ్తూ, పట్టణాన్ని ఒడిషాలోని ఇతర నగరాలు, పట్టణాలతో కలుపుతున్నాయి. పట్టణం లోపల మూడు చక్రాల ఆటో టాక్సీలు అత్యంత ముఖ్యమైన రవాణా మార్గం. టాక్సీలు కూడా తిరుగుతాయి.

రైలు

[మార్చు]

చత్రపూర్ రైల్వే స్టేషన్ ఈస్ట్ కోస్ట్ రైల్వే లైన్‌లో ఉంది, ఇది కోల్‌కతా, చెన్నై లను కలిపే ప్రధాన మార్గంలో ఉంది. ఇక్కడి నుండి నేరుగా న్యూఢిల్లీ, అహ్మదాబాద్, బెంగళూరు, భువనేశ్వర్, బెర్హంపూర్, చెన్నై, కటక్, ముంబై, నాగ్‌పూర్, పూణే, పూరీ, విశాఖపట్నం, హైదరాబాద్, కోల్‌కతా, రాయ్‌పూర్, సంబల్‌పూర్ వంటి అనేక నగరాలకు రైలు సౌకర్యం ఉంది. భువనేశ్వర్ - ఛత్రపూర్ రైలు రాజధాని నగరం భువనేశ్వర్ చేరుకోవడానికి ఒక సౌకర్యం.

ఛత్రపూర్‌లో ఛత్రపూర్ స్టేషన్, ఛత్రపూర్ కోర్ట్ స్టేషన్ అనే రెండు రైల్వే స్టేషన్లు ఉన్నాయి.

శీతోష్ణస్థితి

[మార్చు]

వేసవిలో గరిష్ఠ ఉష్ణోగ్రత 37 °C; శీతాకాలపు కనిష్ఠ ఉష్ణోగ్రత 16 °C. సగటు రోజువారీ ఉష్ణోగ్రత 33 నుండి 38 °C వరకు ఉంటుంది. మే అత్యంత వేడిగా ఉండే నెల; డిసెంబరు అత్యంత చలిగా ఉంటుంది. సగటు వార్షిక వర్షపాతం 1250 mm. ఈ ప్రాంతంలో జూలై నుండి అక్టోబరు వరకూ ఉండే రుతుపవనాల కాలంలో కుండపోతగా వానలు కురుస్తాయి.

శీతోష్ణస్థితి డేటా - Chhatrapur, Odisha
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
సగటు అధిక °C (°F) 27
(81)
30
(86)
34
(93)
36
(97)
37
(99)
34
(93)
32
(90)
31
(88)
32
(90)
32
(90)
30
(86)
28
(82)
32
(90)
సగటు అల్ప °C (°F) 16
(61)
19
(66)
23
(73)
27
(81)
29
(84)
28
(82)
27
(81)
27
(81)
26
(79)
23
(73)
20
(68)
16
(61)
23
(74)
సగటు వర్షపాతం cm (inches) 1.2
(0.5)
1.70
(0.67)
1.90
(0.75)
1.50
(0.59)
4.00
(1.57)
15.00
(5.91)
28.20
(11.10)
27.30
(10.75)
18.00
(7.09)
9.30
(3.66)
3.30
(1.30)
1.90
(0.75)
113.3
(44.64)
Source: MSM Weather

మూలాలు

[మార్చు]
  1. "Urban Agglomerations/Cities having Census 2011-2020 in Orissa". Registrar General and Census Commissioner of India. Retrieved 10 October 2014.
  2. "PinCode: CHATRAPUR, GANJAM, ORISSA, India, Pincode.net.in". pincode.net.in. 2012. Retrieved 1 July 2012. PinCode: 761020
  3. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.
  4. "Urban Agglomerations/Cities having Census 2011-2020 in Orissa". Registrar General and Census Commissioner of India. Retrieved 10 October 2014.
"https://te.wikipedia.org/w/index.php?title=ఛత్రపూర్&oldid=4074063" నుండి వెలికితీశారు