రాజధాని

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రాజధాని : ఒక దేశము లేదా ప్రాంతము లేదా రాష్ట్రము యొక్క పరిపాలనా విభాగాలు గల ప్రాంతం లేదా నగరం. రాజధాని అనగా దాదాపు ఒక నగరం, ఇది ఆ రాజ్యపు రాజరిక వ్యవహారాలు లేదా పరిపాలనా విభాగ అంగాలు గల నగరం.

పూర్వ కాలంలో రాజులు తమ రాజ్యానికి లేదా సామ్రాజ్యానికి కేంద్రంగా చేసుకుని పరిపాలించేవారు. ఈ నగరానికే రాజధాని అనే పేరు వచ్చింది. ఉదాహరణకు అక్బరు కాలంలో భారత రాజధాని ఫతేపూర్ సిక్రీ, ఆతరువాత ఆగ్రా.

అలాగే సమకాలీనంలో, ఒక రాజ్యం అనగా దేశం, తన రాజకీయ విషయాలను ఒకే చోట నుండి పర్యవేక్షించడానికి మరియు పరిపాలించడానికి ఎంచుకున్న నగరమే ఈ రాజధాని. ఉదాహరణకు నేటి భారత్ రాజధాని న్యూఢిల్లీ. తెలంగాణ రాజధాని హైదరాబాదు.

"https://te.wikipedia.org/w/index.php?title=రాజధాని&oldid=2367630" నుండి వెలికితీశారు