నయాగఢ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మా దఖినకాళి ఆలయ ప్రవేశం, నయాగఢ్

నయాగఢ్ ఒడిషా రాష్ట్రంలోని నయాగఢ్ జిల్లాలో ఉన్న పట్టణం. ఇది నయాగఢ్ జిల్లా కేంద్రం.

భౌగోళికం

[మార్చు]

నయాగఢ్ 20°08′N 85°06′E / 20.13°N 85.1°E / 20.13; 85.1 వద్ద, [1] సముద్రమట్టం నుండి 178 మీటర్లు ఎత్తున ఉంది. ఈ పట్టణానికి దక్షిణాన రుఖీ పర్వతం, ఉత్తరాన బలరామ్ పర్వతం ఉన్నాయి. ఈ పర్వతాల వలన నయాగఢ్‌పై 1999 ఒడిశా తుఫాను ప్రభావం తగ్గింది. కొత్త జగన్నాథ్ సడక్ నయాగఢ్‌ని పవిత్ర నగరం పూరీతో కలుపుతుంది.

జనాభా

[మార్చు]

2011 జనగణన ప్రకారం, నయాగఢ్ పట్టణం జనాభా 17,030. అందులో పురుషులు 9000, మహిళలు 8030 మంది ఉన్నారు.

హౌసింగ్ & అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ నోటిఫికేషన్ నం. 4475/LSG/dt.13.05.1953 ద్వారా నయాగఢ్ నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్‌ను ఏర్పాటు చేసారు. NAC 15.54 చ.కి.మీ. విస్తీర్ణంలో ఉంది. 2001 జనాభా లెక్కల ప్రకారం దీని జనాభా 14,314. మున్సిపల్ పరిధిలో 13 వార్డులున్నాయి.

రవాణా

[మార్చు]

2017 జూన్ 19 న రైల్వే మంత్రి సురేష్ ప్రభు ఖుర్దా రోడ్-బలంగీర్ ప్రాజెక్ట్‌లో భాగంగా బోలాగర్ రోడ్ నుండి నయాగఢ్ టౌన్ వరకు కొత్త లైన్‌ను లాంఛనంగా ప్రారంభించడంతో నయాగఢ్ దేశపు రైల్వే మ్యాప్‌లో చేరింది. రైల్వే మంత్రి నయాగఢ్ టౌన్ రైల్వే స్టేషన్ భవనాన్ని, పట్టణానికి మొదటి ప్రయాణం చేసిన ప్యాసింజర్ రైలును జెండా ఊపి ప్రారంభించాడు.

మూలాలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=నయాగఢ్&oldid=4074068" నుండి వెలికితీశారు