నయాగఢ్ జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నయాగఢ్ జిల్లా
జిల్లా
ఒడిశా పటంలో జిల్లా స్థానం
ఒడిశా పటంలో జిల్లా స్థానం
దేశం India
రాష్ట్రంఒడిశా
ప్రధాన కార్యాలయంనయాగఢ్
Government
 • Collector & District MagistrateHemanta Kumar Padhi
 • Member of Lok SabhaPinaki Misra
Area
 • Total3,890 km2 (1,500 sq mi)
Population
 (2001)
 • Total5,35,385
 • Density138/km2 (360/sq mi)
భాషలు
 • అధికారఒరియా, హిందీ,ఇంగ్లీషు
Time zoneUTC+5:30 (IST)
పిన్‌కోడ్
752 xxx
Vehicle registrationOD-25
లింగ నిష్పత్తి0.994 /
లోక్‌సభ నియోజకవర్గంPuri
శీతోష్ణస్థితిAw (Köppen)
అవపాతం1,449.1 millimetres (57.05 in)

ఒడిషా రాష్ట్రం లోని జిల్లాలలో నయాగఢ్ జిల్లా ఒకటి. 1995లో మునుపటి పూరి జిల్లా 3 జిల్లాలుగా విడగొట్టబడింది. జిల్లాలో " బైసిపలి విల్డ్‌లైఫ్ శాంక్చ్యురీ " ఏర్పాటు చేయబడింది. జిల్లా హిల్ స్టేషను లా ఉంటుంది. నయాగఢ్‌లో తయారు చేయబడుతున్న " చెన పోడా " ఒడిషా ప్రజలందరి ప్రజల అభిమానాన్ని చూరగొన్న వంటకం. ఈ వంటకం తయారీవలన నయాగఢ్ ప్రత్యేకత సంతరించుకుంది.

చరిత్ర[మార్చు]

నయాగఢ్ జిల్లా ప్రాంతం 13వ శతాబ్దం నుండి ఉనికిలో ఉంటూ ఒడిషా చరిత్రలో ముఖ్యపాత్ర వహించింది. బఘేల రాజమంశానికి చెందిన రాజా సూర్యమణి పూరీకి వచ్చి నయాగఢ్ వద్ద రాజ్యస్థాపన చేసారు. మునుపటి గుజరాతి రాజాస్థానాలైన రాంపూర్, నయాగఢ్, ఖందపరా, దశపల్లా కలిపిన ప్రదేశమే ప్రస్తుత నయాగఢ్ జిల్లా. సవరలు, కంధాలు నయాగఢ్ స్థానిక ప్రజలుగా భావిస్తున్నారు. ఆర్యులు తరువాతి కాలంలో ఈ ప్రాంతానికి వచ్చారు. మునుపటి గుజరాతి రాజాస్థానాలైన రాంపూర్, నయాగఢ్, ఖందపరా, దశపల్లాలు భారతస్వతంత్ర సమరంలో ప్రధానపాత్ర వహించాయి.

సూర్యమణి[మార్చు]

నయాగఢ్ జిల్లా ప్రాంతం 13వ శతాబ్దం నుండి ఉనికిలో ఉంటూ ఒడిషా చరిత్రలో ముఖ్యపాత్ర వహించింది. సూర్యవంశానికి చెందిన బఘేలా మద్యప్రదేశ్‌లో ఉన్న రేవా రాస్థానానికి యాత్రకు వచ్చి తరువాత నయాగఢ్ వద్ధ రాజ్యస్థాపన చేసాడు. సూర్యమణి పూరీకి వెళ్ళే మార్గంలో తన సోదరుడైన గుణానతి వద్ద రాత్రికి బసచేసాడు. అప్పుడీ ప్రాంతం అంతటా పులులు అధికంగా సంచరిస్తూ ఉండేవి. రాత్రి సమయంలో ఒక పులి నిద్రిస్తున్న బగేలా సోదరుల మీద దాడి చేసింది. సోదరిలిద్దరూ విరోచితంగా పోరాడి పులిని సంహరించారు. అది చూసి ప్రశింసించిన ప్రజలు వారిని తమ నాయకులుగా ఎంచుకున్నారు. క్రమంగా సూర్యమణి గుణనాతి వద్ద కోటనిర్మాణం చేసి, మాలి మహిళను వివాహం చేసుకున్నాడు. సూర్యకుమార్ మొదటి భార్య మరణించిన తరువాత సూర్యమణి క్షత్రియకాంతను వివాహం చేసుకున్నాడు. తరువాత సూర్యమణి హరిపూర్, రాల్బా మీద దండయాత్ర చేసాడు. రలబా చాలా సౌందర్యవంతమైన ప్రదేశం. సూర్యమణి రలబా వద్ద నిద్రిస్తున్న సమయంలో తిరిగి వేరొక పులి ఆయనమీద దాడి చేసింది. సూర్యమణి దానిని కూడా సంహరించాడు. ఆ సమయంలో సూర్యమణి ఒకస్త్రీ ఖాళీ కుండతీసుకుని పక్కన ఉన్న మడుగులో నీరు తీసుకుని తిరిగి వచ్చే సమయంలో ఒక బాలునితో వచ్చింది. సూర్యమణి ఆ స్త్రీని అడ్డగించి బాలుని గురించిన మర్మం గురించి ప్రశ్నించాడు. ఆస్త్రీ తాను " బౌరీ తకురాణి " దేవతనని ఆబాలుడు తనకుమారుడని చెప్పి తనను కూడా సంహరించి కులదేవతగా పూజించమని రాజా సూర్యమణికి సూచించింది. రాజా సూర్యమణి అలాగే చేసి పులి తలను తమ రాజ్యానికి చిహ్నం చేసాడు.

బగెల్ సింగ్[మార్చు]

బగెల్ సింగ్ వంశానికి చెందిన రాజా నింత్ (1480-1510) రుక్షి, బలరాం పర్వతాల మద్య ఉన్న ప్రదేశానికి వేటకు వచ్చి అక్కడ ఒక అద్భుతప్రదేశాన్ని చూసాడు. ఇక్కడ ఒక కుందేలు కుక్కను ఓడించడం చూసాడు. తరువాత అతడు ఈ ప్రాంతానికి తన రాజధానిని మార్చుకున్నాడు. తరువాత ఈ ప్రాంతం బఘుయా నయాగఢ్ అని పిలువబడుంది. ఇక్కడ సంభవించిన సంఘటనను " కుర్కుర్ తసరా " అని అంటున్నారు.

రఘునాథ్[మార్చు]

నయాగఢ్ 12వ రాజా రఘునాథ్ సింగ్ (1565-1595) చాలా శక్తివంతమైన వాడు. ఈ సమయంలో ముస్లిములు పూర్తిగా ఒడిషాను ఆక్రమించుకున్నారు. ఒరిసా తీరప్రాంతాలలో పరిస్థితి అస్థవ్యస్థంగా మారింది. చివరి స్వతంత్ర పాలకుడు రాజా ముకుందవర్మ (1565) లో గొహ్రితికిర వద్ద ఓడించబడి మరణించాడు. ఒడిషాతీరప్రాంత పరిస్థితిని అనుకూలంగా చేసుకుని రాజా రఘునాథ్ సింగ్ రాణాపూర్ మీద దాడి చేసి ఒడగావ్‌, సరంకుల్, బౌంసిపరాలను స్వాధీనం చేసుకున్నాడు. బౌధ్ రాజా నుండి నయాగఢ్- దశపల్లా ప్రాంతం, ఒడగావ్‌కు చెందిన సునాముహిన్ ప్రాంతాన్ని రాజా గుముషర్ నుండి తీసుకున్నాడు. బాణ్పూర్ నుండి మరికొంత భూభాగం తీసుకున్నాడు. రఘినాథ్ సింగ్ మరణించే ముందు తనరాజ్యాన్ని మూగ్గురు కుమారులకు విభజించి ఇచ్చాడు. హరిహర సింగ్ నయాగఢ్ పాలకుడయ్యాడు. జదునాథ్ సింగ్ నాలుగు ఖందగ్రామాలకు (పెద్ద భూభాగం) పాలకుడయ్యాడు. తరువాత ఈ ప్రాంతం కందపరా అయింది. హరిహర సింగ్ కుమారుడైన గదాధర సింగ్ రాణ్పూర్ మీద దాడి చేసిన సమయంలో గుంషర్ నయాగఢ్ మీద దాడి చేసాడు. పిందిక్ పత్సహాని అనే గ్రామీణ యువకుడు 150 సైనికులతో ధైర్యంగా గొప్ప గుంషర్ సైన్యాన్ని ఎదుర్కొని వీరోచితంగా పోరాడి ఓడించాడు. తరువాత జరిగిన పోరులో పిందిక్ పత్సహాని శత్రుసైన్యాలకు బంధీగా చిక్కి తనప్రాణాన్ని అర్పించాడు. గంగాధర్ సింగ్ ప్రఖ్యాత గుంషర్ కవి భంజాను కుమార్తెను వివాహం చేసుకున్నాడు. వివాహం తరువాత భంజా నయాగఢ్ రాజ్యంలోని మాలిసాహి వద్ద స్థిరపడ్డాడు. బ్రిటిష్ ఒడిషాను స్వాధీనం చేసుకున్న తరుణంలో నాయాగర్‌ను బినాయక్ సింగ్ పాలిస్తున్నాడు. ప్రఖ్యాత కవి జదుమణి ఆయనకు ఆస్థాన కవిగా ఉన్నాడు.నయాగఢ్‌ను పలు రాజమంశాలు పాలించాయి. .[1][2]

దశపల్ల[మార్చు]

15 వ శతాబ్దంలో దశపల్ల సామ్రాజ్యం స్థాపించబడింది.

పాలకులు[మార్చు]

 • 1701 చక్రధర్ దేవ్ భంజ్ - 1653.
 • 1753 ఫద్మనవ్ దేవ్ భంజ్ - 1701.
 • 1775 త్రిలోచన్ దేవ్ భంజ్ - 1753.
 • 1775 - 1795 ంఅకుంద భంక్ దేవ్ భంజ్.
 • 1795 - 1805 ఘురి చరణ్ దేవ్ భంజ్.
 • 1805 - 1845 కృష్ణా చందా దేవ్ భంజ్.
 • 1861 మధుసూదన్ దేవ్ భంజ్ - 1845.
 • 1861 - 1873 జనవరి నర్సింహా దేవ్ భంజ్.
 • 1874 మే 21 ఛైతన్ దేవ్ భంజ్ - 1873 జనవరి 21 (బి 1854 -.. డ్ ....).

రాజులు[మార్చు]

 • 1874 మే 21 - 1896 ఛైతన్ దేవ్ భంజ్ (శా).
 • 1896 - 1913 డిసెంబరు 11 నారాయణ దేవ్ భంజ్ (బి 1860 -.. డ్ 1913).
 • డెచ్ 1913 11 - (. బి 1908. - డి 1960) 1947 ఆగస్టు 15 కిశోర్ చంద్ర దేవ్ భంజ్.
 • 11 డెచ్ 1913 - 3 ంఅర్ 1930 .... -ఋఎగెంత్.

ఖందపరా[మార్చు]

 • 17వ శతాబ్దంలో ఖందపరా రాజ్యం స్థాపించబడింది.

రాజాలు[మార్చు]

 • 1709 నారాయణ్ సింగ్ ంఅర్ద్రజ్ - 1675.
 • 1723 భలుంకెస్వర్ సింగ్ ంఅర్ద్రజ్ - 1709.
 • 1732 భనమల్ల్ సింగ్ ంఅర్ద్రజ్ - 1723.
 • 1770 భైరగి సింగ్ ంఅర్ద్రజ్ - 1734.
 • 1794 ణిలద్రి సింగ్ ంఅర్ద్రజ్ - 1770.
 • 1815 నరసింహ సింగ్ ంఅర్ద్రజ్ - 1794.
 • 1815 - 1821 పురుషోత్తం ంఅర్ద్రజ్.
 • 1842 కృష్ణ చంద్ర సింగ్ - 1821.
 • 1867 కుంజ బిహారీ సింగ్ - 1842.
 • 1867 ఫిబ్రవరి 28 - (. బి 1837. - డి 1905?) 1905 ణతొబర్ ంఅర్ద్రజ్ భ్రమర్బర్ రాయ్.
 • 1905 - 1922 డిసెంబరు 26 శ్రీరామచంద్ర సింగ్ ంఅర్ద్రజ్ భ్రమర్బర్ రాయ్.
 • డెచ్ 1922 26 - (. బి 1914. - డి 1977) 1947 ఆగస్టు 15 హరిహర్ సింగ్ దేవ్ ంఅర్ద్రజ్ భ్రమర్బర్ రాయ్.

నయాగఢ్[మార్చు]

1550లో నయాగఢ్ రాజ్యం స్థాపించబడింది.

రాజాలు[మార్చు]

 • .... - .... చంద్రశేఖర్ సింగ్ ంఅంధత.
 • .... - .... పురుషోత్తం సింగ్ ంఅంధత.
 • .... - 1784 ంరుత్యుంజయ్ సింగ్ ంఅంధత.
 • 1825 భినయక్ సింగ్ ంఅంధత - 1784.
 • 1825 - 1851 బ్రజ భబ్ధు సింగ్ ంఅంధత.
 • 30 శెప్ 1851 - 1889 ళధు కిశోర్ సింగ్ ంఅంధత (భ్ఛ్ 1843 -. డ్ ....).
 • 1889 - 1890 భల్భద్ర సింగ్.
 • 2 ంఅర్ 1890 - 4 శెప్ 1897 రఘునాథ్ సింగ్ ంఅంధత.
 • 1897 - 7 డెచ్ 1918 నారాయణ్ సింగ్ ంఅంధత.
 • డెచ్ 1918 7 - (. బి 1911. - డి 1983) 1947 ఆగస్టు 15 కృష్ణచంద్ర సింగ్ ంఅంధత.

రాంపూర్[మార్చు]

The Jagannath temple at Ranapur

రాంపూర్ రాజాస్థానం క్రీ.పూ 18వ శతాబ్దంలో స్థాపించబడింది.

రాజాలు[మార్చు]

 • 1692 - 1727 రామచంద్ర నరేంద్ర.
 • 1754 సారంగధర్ భజ్రధర్ నరేంద్ర - 1727.
 • 1789 నరసింగ్ భజ్రధర్ నరేంద్ర - 1754.
 • 1821 బ్రురుజ్దబన్ భజ్రధర్ నరేంద్ర - 1789.
 • 1842 బ్రరజ్సుందర్ భజ్రధర్ నరేంద్ర - 1821.
 • 1899 బెనుదర్ భజ్రధర్ నరేంద్ర - 1842 (బి 1817 -.. డ్ ....).
 • జుల్ 1899 12 - (. బి 1875. - డి 1945) 1945 జూన్ 21 కృష్ణ చంద్ర నరేంద్ర.
 • 1945 జూన్ 21 - (. బి 1928. - డి 1980) 1947 బ్రజేంద్ర చంద్ర నరేంద్ర.

మావోయిస్టుల దాడి[మార్చు]

నయాగఢ్ జిల్లా ప్రస్తుతం " రెడ్ కార్పెట్‌లో భాగంగా ఉంది " [3]2008 ఫిబ్రవరి 15 న మావోయిస్ట్ తిరుగుబాటు తరువాత జిల్లా అంతటా పోలీస్ బలగాలు అధికం చేయబడ్డాయి. ఈ పోరాటంలో 15 మంది పోలీస్ ఆఫీసర్లు 1 పౌరుడు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి సమయంలో తిరుగుబాటుదారులు ఆయుధాలను దొంగిలించారు.[4] పోలీస్ స్కూల్స్, పోలీస్ ఆయుధాలు, పోలీస్ స్టేషన్లు లక్ష్యంగా ఈ దాడి జరిగింది.[5]

విభాగాలు[మార్చు]

బ్లాకులు[మార్చు]

 • భాపూర్
 • దాస్పల్ల
 • గనియా
 • ఖందపద
 • నయాగడ్
 • నూగన్
 • ఒడగావ్
 • రాజ్- రాంపూర్ (ఒడిషా)

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 962,215,[6]
ఇది దాదాపు. ఫిజి దేశ జనసంఖ్యకు సమానం.[7]
అమెరికాలోని. మొంటానా నగర జనసంఖ్యకు సమం.[8]
640 భారతదేశ జిల్లాలలో. 453 వ స్థానంలో ఉంది.[6]
1చ.కి.మీ జనసాంద్రత. 247 .[6]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 11.3%.[6]
స్త్రీ పురుష నిష్పత్తి. 916:1000 [6]
జాతియ సరాసరి (928) కంటే. తక్కువ
అక్షరాస్యత శాతం. 79.17%.[6]
జాతియ సరాసరి (72%) కంటే. అధికం

పర్యాటక ఆకర్షణలు[మార్చు]

 • బైసిపలి వన్యప్రాణుల అభయారణ్యం
 • జగన్నాథ్ టెంపుల్, నయాగడ్
 • మాతా దక్షిణ కాళీ ఆలయం, నయాగడ్
 • లాడూ బాబా ఆలయం, సరంకుల్
 • రఘునాథ్ టెంపుల్, ఒడగావ్
 • నిలమధాబ్ ఆలయం, కంతియో
 • మాతా మణినాగా ఆలయం, రాణా పుర్
 • మాతా తరిని ఆలయం, శ్యాంఘన్ పుర్ దగ్గర రణ్పూర్ పెట్రోల్ టాంకీ
 • దుతికేశ్వర్ ఆలయం, బహదఝొల, ఒడగావ్.
జగన్నాథ్ ఆలయం, బలభద్రపూర్

రాజకీయాలు[మార్చు]

 • (119) రాంపూర్: పునర్విభజన తరువాత పూరి లోక్‌సభ నియోజకవర్గం .
 • (120) ఖందపద ఇది 2009 నుండి కటక్ లోక్సభ నియోజకవర్గం భాగం పునర్విభజన తరువాత భువనేశ్వర్ లోక్‌సభ నియోజకవర్గం
 • (121) Daspalla (SC) 2009 నుండి కంధమాల్ లోక్సభ నియోజకవర్గం పునర్విభజన తరువాత భాగం భువనేశ్వర్ లోక్‌సభ నియోజకవర్గం
 • (122) నయాగఢ్ ఇది 2009 నుండి పూరి లోక్సభ నియోజకవర్గం భాగం పునర్విభజన తరువాత భువనేశ్వర్ లోక్‌సభ నియోజకవర్గం

అసెంబ్లీ నియోజకవర్గాలు[మార్చు]

జిల్లాలో ఒరిస్సా రాష్ట్ర 4 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.[9][10] నయాగఢ్ జిల్లాలో ఎన్నికైన సభ్యుల జాబితా.[11]

క్ర.సం నియోజకవర్గం రిజర్వేషను పరిధి 14 వ శాసనసభ సభ్యులు పార్టీ
119 రణ్పూర్ లేదు రణ్పూర్, ఒడగయోన్ (part) సత్యనారాయణ్ ప్రధాన్ బిజు జనతాదళ్ జి.జె.పి
120 ఖందపద లేదు ఖందపద (ఎన్.ఎ.సి), ఖందపరా, భపుర్ సిద్ధార్ధ్ శేఖర్ సింఘ్ BJD
121 దాస్పల్ల ఎస్.సి దాస్పల్ల, గనియా, నౌగావ్. కాషీనాథ్ మల్లిక్ BJD
122 నయాగఢ్ లేదు నయాగఢ్ (ఎన్.ఎ.సి), నయాగఢ్, ఒడాగావ్ (భాగం) అరుణ్ కుమార్ సాహు BJD

మూలాలు[మార్చు]

 1. Princely States of Nayagarh District
 2. Princely States
 3. "83 districts under the Security Related Expenditure Scheme". IntelliBriefs. 2009-12-11. Archived from the original on 2011-10-27. Retrieved 2011-09-17.
 4. "Indian Maoists kill 14 in Orissa". BBC. 2008-02-16. Retrieved 2008-02-16.
 5. "13 police personnel killed in Naxal attack in Orissa". headlines india. Retrieved 2008-02-16. [dead link]
 6. 6.0 6.1 6.2 6.3 6.4 6.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
 7. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Fiji 883,125 July 2011 est.
 8. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Montana 989,415
 9. Assembly Constituencies and their EXtent
 10. Seats of Odisha
 11. "List of Member in Fourteenth Assembly". ws.ori.nic.in. Archived from the original on 2 మే 2007. Retrieved 19 February 2013. MEMBER NAME

వెలుపలి లింకులు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]