Jump to content

ఒడిశా

అక్షాంశ రేఖాంశాలు: 20°16′N 85°49′E / 20.27°N 85.82°E / 20.27; 85.82
వికీపీడియా నుండి
(ఒడిషా నుండి దారిమార్పు చెందింది)
ఒడిశా
Clockwise from top: Habalikhati Beach, Mukteshvara Temple, Bhitarkanika National Park, Dhauli, Chilika Lake, Rajarani Temple, Mahanadi, Jagannath Temple, Gundichaghagi Waterfall, Konark Temple
Anthem: Bande Utkala Janani
(I Adore Thee, O Mother Utkala!)
Location of ఒడిశా
Coordinates (భువనేశ్వర్): 20°16′N 85°49′E / 20.27°N 85.82°E / 20.27; 85.82
దేశం India
రాష్ట్రావతరణ1 ఏప్రిల్ 1936
(Utkala Dibasa)
రాజధాని
అతిపెద్ద నగరం
భువనేశ్వర్[2]
Government
 • Bodyప్రభుత్వం
 • గవర్నర్గణేషి లాల్
 • ముఖ్యమంత్రినవీన్ పట్నాయక్ (BJD)
 • శాసన వ్యవస్థఏక సభ, (147 సీట్లు)
 • పార్లమెంట్ నియోజకవర్గాలులోక్‌సభ (21 seats)
రాజ్యసభ (10 సీట్లు)
 • ఉన్నత న్యాయస్థానంఒడిశా ఉన్నత న్యాయస్థానం
విస్తీర్ణం
 • Total1,55,707 కి.మీ2 (60,119 చ. మై)
 • Rank8వ
జనాభా
 (2011)
 • Total4,19,74,218[1]
 • Rank11th
Demonymఒడియావారు
GDP (2019–20)
 • మొత్తం5,33,822 crore (US$67 billion)
 • తలసరి జిడిపి1,16,614 (US$1,500)
Time zoneUTC+05:30 (IST)
ISO 3166 codeIN-OR
HDI (2018)Increase 0.606[4]
medium · 32nd
అక్షరాస్యత రేటు73.45%[5]
అధికార భాషలుఒడియా[6]
Symbols of Odisha
EmblemEmblem of Odisha
SongBande Utkala Janani
Bird
Indian Roller[8][9]
Fish
Mahanadi mahseer[10]
Flower
Ashoka[7]
Mammal
Sambar[7]
Tree
Sacred Fig[7][11]
Dance
Odissi
Food
Pakhala
Sweet
Rasagola

ఒడిశా (ఒరియా: ଓଡ଼ିଶା) ( పాత పేరు ఒరిస్సా) తూర్పు భారతదేశంలో ఉన్న ఒక రాష్ట్రం . దీనికి ఉత్తరాన ఝార్ఖండ్ రాష్ట్రం, ఈశాన్యాన పశ్చిమ బెంగాల్, దక్షిణాన ఆంధ్రప్రదేశ్, పశ్చిమాన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు, తూర్పున బంగాళాఖాతం సముద్రమున్నాయి. ఇది విస్తీర్ణంలో 8 వ అతిపెద్ద రాష్ట్రం, జనాభా ప్రకారం 11 వ అతిపెద్ద రాష్ట్రం. షెడ్యూల్డ్ తెగల జనాభా పరంగా భారతదేశంలో మూడవ స్థానంలో ఉంది.[12] బంగాళాఖాతం వెంబడి 485 కిలోమీటర్లు (301 మై.) తీరం ఉంది.[13] ఈ ప్రాంతాన్ని ఉత్కల అని కూడా పిలుస్తారు. ఈ పదం భారతదేశ జాతీయ గీతం " జన గణ మన "లో ప్రస్తావించబడింది.[14] ఒడిశా భాష ఒడియా, ఇది భారతదేశ ప్రాచీన భాషలలో ఒకటి .[15]

ఒడిషా రాష్ట్రానికి ఆ పేరు రావడానికి గల కారణం ఓడ్రా అనె ప్రాచీన ఆదివాసి తెగ, ఆ తెగ ద్వారానే ఓడ్రా దేశ అనే పాత గిరిజన నామం ఏర్పడింది, ఇది క్రమంగా ఒడిషా (లేదా ఉద్దిషా, లేదా ఉడిసా)గా రూపాంతరం చెందింది, ఇది ఆంగ్లంలో ఒరిస్సాగా మారింది; 21వ శతాబ్దపు ప్రారంభంలో అసలు ఒడిషా పునఃస్థాపించబడే వరకు స్పెల్లింగ్ కొనసాగింది. ఈ ప్రాంతం యొక్క భాష ఒడియా అని పిలువబడింది . సా.శ.పూ 261 లో మౌర్య చక్రవర్తి అశోకుడు కళింగ యుద్ధంలో ఖారవేలుడు రాజును ఓడించినా ఖారవేలుడు మరల రాజ్యాన్ని పొందాడు. ఈ యుద్ధం ప్రతీకారవాంఛగల చక్రవర్తి అశోకుడిని బౌద్ధమతం స్వీకరణతో ప్రశాంతుడిగా మార్చడానికి కారణమైంది., అప్పటి ప్రాంతం, ఆధునిక ఒడిశా సరిహద్దులతో సరిపోలుతుంది.[16] బ్రిటిష్ భారత ప్రభుత్వం ఒడిస్సా ప్రావిన్స్ ను 1936 ఏప్రిల్ 1 న స్థాపించబడినప్పుడు ఒడిశా యొక్క ఆధునిక సరిహద్దులను గుర్తించింది. ఇందులో బీహార్, ఒరిస్సా ప్రావిన్స్ లో ఒడియా మాట్లాడే జిల్లాలు ఉన్నాయి. ఏప్రిల్ 1ని ఉత్కల దిబసగా జరుపుకు౯రు.[17] సా.శ. 989 లో మర్కత కేశరీ రాజు కటక్ రాజధానిగా పరిపాలించాడు.[18] తరువాత బ్రిటిష్ శకం వరకు ఈ నగరాన్ని చాలా మంది పాలకులు రాజధానిగా ఉపయోగించారు. ఆ తరువాత in 1970 భువనేశ్వర్ ఒడిశా రాజధాని అయ్యింది.[19]

ఒడిశా ఆర్థిక స్థూల రాష్ట్రీయ ఉత్పత్తి ₹ 5.33 లక్షల కోట్లు, తలసరి స్థూల రాష్ట్రీయ ఉత్పత్తి ₹ 116.614 గా భారతదేశం లో16 వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గల రాష్ట్రంగా,ుంది..[3] మానవ అభివృద్ధి సూచికలో ఒడిశా భారత రాష్ట్రాలలో 32 వ స్థానంలో ఉంది.[20]

కోణార్క, పూరి, భువనేశ్వర్లు ప్రసిద్ధి చెందిన మందిరాలు గల పట్టణాలు.

భౌగోళికం

[మార్చు]

ఒడిశా రాష్ట్రానికి పశ్చిమ, ఉత్తర భాగాలలో తూర్పు కనుమలు, ఛోటానాగపూర్ పీఠభూమి ఉన్నాయి. ఇది దట్టమైన అడవుల ప్రాంతం. లోపలి ప్రాంతాలు అరణ్యాలు, కొండల మయం. ఆదివాసులు, తెగలు ఇక్కడ నివసిస్తున్నారు. తూర్పు కనుమలకు, సముద్రానికి మధ్యభాగంలోని మైదాన ప్రాంతం సారవంతమైన వ్వవసాయభూమి. తీరప్రాంత మైదానాలు ప్రధాన జనావాసకేంద్రాలు. మహానది, బ్రాహ్మణి నది, బైతరణి నది డెల్టాలు కూడా ఇక్కడే ఉన్నాయి. తీర రేఖ తిన్నగా (చీలకుండా) ఉండడంవల్ల మంచి నౌకాశ్రయాలకు అవకాశంలేదు. ఒక్క పరదీప్ మాత్రం నౌకలకు అనుకూలమైనది. తీర ప్రాంతాలు, మహానది డెల్టా సారవంతమైన నేలలు. సక్రమంగా మంచి వర్షపాతం ఉండడంవల్ల ఏటా రెండు వరి పంటలు పండుతాయి.

బంగాళాఖాతంలో జనించే తుఫానుల తాకిడికి ఒరిస్సా తీరప్రాంతం తరచు నష్టపోతూ ఉంటుంది. 1999 అక్టోబరులో వచ్చిన తుఫాను వల్ల 10,000 మంది మరణించాఱు. తీవ్రమైన నష్టం వాటిల్లింది

చరిత్ర

[మార్చు]
ఉదయగిరి బౌద్ధ స్తూపం, ఒడిశా

ఎక్కువ కాలం ఒడిశా కళింగరాజుల పాలనలో ఉండేది. క్రీ.పూ. 250 లో మగధ రాజు ఆశోకుడు తీవ్రమైన యుద్ధంలో కళింగరాజులను జయించాడుగాని, ఆ యుద్ధంలోని రక్తపాతానికి పశ్చాత్తాపం చెంది, శాంతి మార్గాన్ని అవలంబించాడు. తరువాత దాదాపు 100 సంవత్సరాలు ఈ ప్రాంతం మౌర్యుల పాలనలో ఉంది. కళింగరాజుల పతనానంతరం ఒరిస్సా ప్రాంతాన్ని వేరువేరు వంశాల రాజులు పాలించారు.

  • మురుంద వంశము
  • మరాఠ వంశము
  • నల వంశము
  • విగ్రహ, ముద్గల వంశము
  • శైలోద్భవ వంశము
  • భౌమకార వంశము
  • నందోద్భవ వంశము
  • సోమవంశి వంశము
  • తూర్పు గంగుల వంశము
  • సూర్య వంశి వంశము ( vaddi,od,vadde rajulu)

ముస్లిం దండయాత్రల ప్రధానమార్గానికి ప్రక్కగా ఉన్నందువల్లా, కొద్ది దండయాత్రలకు బలమైన ప్రతిఘటన చేయగలగడం వల్లా ఈ ప్రాంతం చాలా కాలం మహమ్మదీయుల పాలనలోకి రాలేదు. కాని 1568లో ముఘల్ సామ్రాజ్యంలో కలుపబడింది.

ముఘల్ రాజుల పతనం తరువాత ఒడిశాలో కొంత భాగం బెంగాలు నవాబుల పాలనలోను, మరి కొంత భాగం మరాఠా లపాలనలోను ఉంది. 1936లో బీహారులో కొంతభాగం చేర్చి ఒడిశా ప్రాదేశిక విభాగం ఏర్పరచబడింది. 1948లో 24 రాజసంస్థానాల విలీనం వల్ల ఒడిశా వైశాల్యం, జనాభా దాదాపు రెట్టింపు అయ్యింది.

1950లో ఒరిస్సా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది.

2011 నవంబరు 4 న ఈ రాష్ట్రం యొక్క పేరును ఒడిశాగా మార్చారు.

సంస్కృతి

[మార్చు]

ఒడియా అధికారిక భాష. ఒడిశాలో సాంస్కృతిక వారసత్వం సుసంపన్నమైనది. భువనేశ్వర్ లో మందిరాలు, పూరీ రథయాత్ర, పిపిలి హస్తకళలు, కటక్ వెండినగిషీలు, పట చిత్రాలు, వివిధ ఆదివాసీ తెగలు వారి కళలు, ఆచారాలు - ఇవన్నీ ఒడిశా సాంస్కృతిక ప్రతీకలు.

జన విస్తరణ

[మార్చు]
ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలోని షెడ్యూల్డు తెగల ప్రజలు

ఒడిశా జనాభాలో దాదాపు 24% వరకు ఆదివాసిలు ఉన్నారు. ఇది చాలా రాష్ట్రాలకంటే ఎక్కువ. 87% జనాభా గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్నారు. ఎక్కువ భూమి కొద్ది మంది అధినంలో ఉండడంవలనా, అభివృద్ధి కార్యక్రమాలు ఆదివాసి ప్రాంతాలకు విస్తరిచకపోవడం వలనా ఒరిస్సాలో పేదరికం బాగా ఎక్కువనే చెప్పవచ్చును.

24% వరకు ఉన్న ఆదివాసజనులలో 62 వివిధ తెగలున్నాయి. వీరి జీవనవిధానం వన్య సంపద కేంద్రంగా ఉంటుంది. రైల్వేలు, ఆనకట్టలు, ఖనిజాల త్రవ్వకం వంటి ఆధునిక కార్యక్రమాలు వీరి బ్రతుకుతెరువును దుర్భరంచేయడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయి.

16% వరకు ఉన్న దళితులు దేశమంతటా ఉన్న సామాజిక వివక్షతల్ల, ఆర్థిక అసమానతల వల్ల బాగా వెనుకబడి ఉన్నారు.

ఒడిశాలో శిశుమరణాలు 1000 కి 97. ఇది దేశంలో బాగా అధికం. 60% పైగాజనులకు సరైన సదుపాయాలు (నీరు, విద్యుత్తు, నివాసయోగ్యమైన ఇల్లు వంటివి) అందుబాటులోలేవు. వీటికి తోడు తుఫానులు, వరదలు, అనావృష్టి వంటి ప్రకృతివైపరీత్యాలు ఒడిశా అభివృద్ధికి ప్రధానమైన అడ్డంకులు.

క్రీడాకారులు

[మార్చు]

పర్యాటక స్థలాలు

[మార్చు]
  • రాజధాని భువనేశ్వర్: మందిరాల నగరమని దీనికి పేరు. ఇక్కడ సుమారు 1000 మందిరాలున్నాయి.
  • పూరి: జగత్ప్రసిద్ధమైన జగన్నాధ మందిరం ఉంది. జగన్నాధ రధయాత్ర ఏటా ఒక ముఖ్యమైన ఉత్సవం. జగన్నాధుడు, బలభద్రుడు, సుభద్రలను ఊరేగించే ఈ ఉత్సవానికి లక్షలాది భక్తులు హాజరవుతారు.
  • కోణార్క సూర్య మందిరం - ఒరిస్సా శిల్పకళా నైపుణ్యానికి, నిర్మాణకౌశలానికి ఒక చక్కని తార్కాణం. 13వ శతాబ్దంలో నిర్మించిన ఈ మందిరంలోని శిల్పాలలో ఆనాటి సాంస్కృతిక జీవన విధానం ప్రతిబింబిస్తుంది.
Stone work at Konark
  • చిల్కా సరస్సు: మహానది ముఖద్వారానికి దక్షిణాన ఉన్న ఉప్పునీటి సరస్సు. ఎన్నో విధాల పక్షులకు ఆవాసం. రక్షితవనం. ఇక్కడ దాదాపు 150 జాతుల పక్షులు వలసకు వస్తుంటాయి.
  • చర్చికా మాత మందిరం: రేణుకా నది ఒడ్డున రుచికా పర్వతంపై, బంకి వద్ద, సుందర ప్రకృతి సౌందర్యానికి దీటుగా నిర్మింపబడ్డ మందిరం. కటక్ కు 52 కి.మీ., భువనేశ్వర్ కు 60 కి.మీ. దూరంలో ఉంది.
  • సునాదేయి మందిరం: మహానది ఒడ్డున ఉంది. వలస పక్షులకు ఆవాసం కూడాను. పిక్నిక్ లకు జనప్రియమైనది.

రాజకీయాలు

[మార్చు]

ఒడిశా రాష్ట్రపాలన భారతదేశంలోని అన్ని రాష్ట్రాల పాలనా విధానాన్ని అనుసరించే ఉంటుంది (గవర్నరు, ముఖ్య మంత్రి, కాబినెట్, అసెంబ్లీ మొదలగునవి)

రాజకీయ నాయకులు

[మార్చు]

ఆర్థిక పరిస్థితి

[మార్చు]
చారిత్రక జనాభా
జనగణన జనాభా
19511,46,46,100
19611,75,49,50019.8%
19712,19,44,62525.0%
19812,63,70,27020.2%
19913,16,59,74020.1%
20013,67,07,90015.9%
20114,19,47,35814.3%

ఒడిశా ఆర్థిక స్థితికి ముఖ్యమైన వనరులు:

కొన్ని గణాంకాలు:

  • అభివృద్ధి రేటు 4.3 % (భారతదేశం సగటు 6.7 %)
  • మొత్తం స్థూల ఉత్పత్తిలో వ్వసాయం పాలు 32% . మొత్తం జనాభాలో 62% వ్యసాయ పనులపై ఆధారపడి ఉన్నారు.
  • సుమారు 1,75,000 మంది దారిద్ర్యరేఖ దిగువన ఉన్నారు
  • అక్షరాస్యత 50% (భారతదేశం సగటు 66%)

జిల్లాలు

[మార్చు]

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Population, Size and Decadal Change" (PDF). Primary Census Abstract Data Highlights, Census of India. Registrar General and Census Commissioner of India. 2018. Archived (PDF) from the original on 2019-10-19. Retrieved 2020-06-16.
  2. "Cities having population 1 lakh and above, Census 2011" (PDF). Government of India. Archived (PDF) from the original on 25 November 2014. Retrieved 2 February 2015.
  3. 3.0 3.1 "Odisha Budget analysis". PRS India. 18 February 2020. Retrieved 27 September 2020.
  4. "Sub-national HDI – Subnational HDI – Global Data Lab". globaldatalab.org. Retrieved 2020-04-17.
  5. "State of Literacy" (PDF). Census of India. p. 110. Archived (PDF) from the original on 6 July 2015. Retrieved 5 August 2015.
  6. "Report of the Commissioner for linguistic minorities: 47th report (July 2008 to June 2010)" (PDF). Commissioner for Linguistic Minorities, Ministry of Minority Affairs, Government of India. pp. 122–126. Archived from the original (PDF) on 13 May 2012. Retrieved 16 February 2012.
  7. 7.0 7.1 7.2 Blue Jay (PDF), Orissa Review, 2005, p. 87, archived from the original (PDF) on 2019-10-07, retrieved 2021-06-02
  8. "Palapitta: How a mindless dasara ritual is killing our state bird palapitta – Hyderabad News". The Times of India. 29 September 2017. Retrieved 7 October 2019.
  9. Blue Jay (PDF), Orissa Review, 2005, archived from the original (PDF) on 2019-10-07, retrieved 2021-06-02
  10. "State Fishes of India" (PDF). National Fisheries Development Board, Government of India. Retrieved 25 December 2020.
  11. Pipal(Ficus religiosa) – The State Tree of Odisha (PDF), RPRC, 2014
  12. "ST & SC Development, Minorities & Backward Classes Welfare Department:: Government of Odisha". stscodisha.gov.in. Archived from the original on 1 September 2018. Retrieved 10 December 2018.
  13. "Coastal security". Odisha Police. Archived from the original on 6 February 2015. Retrieved 1 February 2015.
  14. "The National Anthem of India" (PDF). Columbia University. Archived (PDF) from the original on 24 January 2012. Retrieved 1 February 2015.
  15. https://www.jagranjosh.com/current-affairs/cabinet-approved-odia-as-classical-language-1392954604-1
  16. "Detail History of Orissa". Government of Odisha. Archived from the original on 12 November 2006.
  17. "Utkala Dibasa hails colours, flavours of Odisha". The Times of India. 2 April 2014. Archived from the original on 8 July 2015. Retrieved 1 February 2015.
  18. Rabindra Nath Chakraborty (1985). National Integration in Historical Perspective: A Cultural Regeneration in Eastern India. Mittal Publications. pp. 17–. GGKEY:CNFHULBK119. Archived from the original on 15 May 2013. Retrieved 30 November 2012.
  19. Ravi Kalia (1994). Bhubaneswar: From a Temple Town to a Capital City. SIU Press. p. 23. ISBN 978-0-8093-1876-6. Archived from the original on 5 January 2016. Retrieved 2 February 2015.
  20. "Sub-national HDI – Area Database". Global Data Lab. Institute for Management Research, Radboud University. Archived from the original on 23 September 2018. Retrieved 25 September 2018.
  21. Sakshi (4 September 2021). "చరిత్ర సృష్టించిన ప్రమోద్‌ భగత్‌.. భారత్‌ ఖాతాలో మరో స్వర్ణం". Archived from the original on 5 September 2021. Retrieved 5 September 2021.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=ఒడిశా&oldid=4370696" నుండి వెలికితీశారు