భారత ప్రామాణిక కాలమానం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

భారత ప్రామాణిక కాలమానం[మార్చు]

భారత ప్రామాణిక కాలమానానికి అధారమైన 82.5° తూ రేఖాంశము మిర్జాపూర్కు పశ్చిమంగ మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కాకినాడ నగరం మీదుగా వెళుతుంది. వెళుతుంది

భారత ప్రామాణిక కాలమానం (IST) భారతదేశమంతటా పాటించే సమయం. ఇది గ్రీన్‌విచ్ (Greenwich) సమయానికి ఐదున్నర గంటలు (UTC+5:30) ముందు ఉంటుంది. భారతదేశం, పొద్దు పొదుపు సమయాన్ని (డేలైట్ సేవింగ్ టైం) కానీ, మరే విధమైనా ఋతు అనుగుణ సర్దుబాట్లను కానీ పాటించదు. అయితే పొద్దు పొదుపు సమయాన్ని తాత్కాలికంగా 1962 భారత-చైనా యుద్ధం, 1965 భారత-పాకిస్తాన్ యుద్ధం, 1971 భారత-పాకిస్తాన్ యుద్ధ సమయాల్లో పాటించారు.[1] సైనిక మరియు విమానయాన సమయంలో భారత ప్రామాణిక కాలమానాన్ని E* ("ఎకో స్టార్")గా సూచిస్తారు.[2]

భారత ప్రామాణిక కాలమానాన్ని 82.5°తూ రేఖాంశము ఆధారంగా లెక్కకడతారు. ఈ రేఖాంశము ఉత్తర ప్రదేశ్ రాష్ట్రములోని అలహాబాదు నగరం దగ్గరున్న మిర్జాపూర్ పట్టాణానికి కొంచెం పశ్చిమంగా మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కాకినాడ నగరం మీదుగా వెళుతుంది. మిర్జాపూరు మరియు యునైటెడ్ కింగ్‌డం యొక్క గ్రీన్‌విచ్ లోని రాయల్ అబ్జర్వేటరీల మధ్య రేఖాంశ అంతరం కచ్చితంగా 5 గంటల 30 నిమిషాలు. ఆధికారిక సమయపాలనా యంత్రాగం ఢిల్లీ లోని భారత జాతీయ భౌతిక ప్రయోగశాలకు సమయపాలనబాధ్యతను అప్పగించినా, స్థానిక సమయాన్ని అలహాబాద్ అబ్జర్వేటరీ (25.15° N 82.5° E) వద్ద ఉన్న గడియార స్తంభం నుండి లెక్కకడతారు.[3]

చరిత్ర[మార్చు]

చరిత్రలో మొట్టమొదటగా ప్రామాణిక సమయం యొక్క వివరణ భారతదేశములో 4వ శతాబ్దపు భారతీయ ఖగోళశాస్త్ర రచన సూర్య సిద్ధాంతంలో ఇవ్వబడింది. ఈ పుస్తకంలో భూమి గుండ్రంగా ఉందని ప్రతిపాదిస్తూ, ప్రైమ్ మెరీడియన్ లేదా జీరో డిగ్రీల రేఖాంశము అవంతీ నగరం (చారిత్రక నగరమైన ఉజ్జయినికి (23°10′58″N 75°46′38″E / 23.18278°N 75.77722°E / 23.18278; 75.77722), పూర్వపు పేరు) మరియు రోహితక (చారిత్రక కురుక్షేత్ర యుద్ధభూమి దగ్గర లోని నగరం రోహ్‌తక్) (28°54′N 76°38′E / 28.900°N 76.633°E / 28.900; 76.633) గుండా వెళ్ళుచున్నదని నిర్వచించబడింది.[4]

రోహితక మరియు అవంతి నగరాలు Situated upon the line which passes through the haunt of the demons (భూమధ్యరేఖ మరియు 76° తూ) మరియు దేవతల ఆవాసమైన కైలాస పర్వతము (ఉత్తర ధృవం) గుండా వెళుతున్న సరిగీతపై ఉన్నాయి...[5]

పూర్వపు భారతీయ ఖగోళ శాస్త్రజ్ఞులు ఉపయోగించే రోజు ఉజ్జయిని లోని ప్రైమ్ మెరీడియన్ వద్ద సూర్యుడు ఉదయించడముతో ప్రారంభమవుతుంది.[6] అలా ప్రారంభమయిన రోజు ఈ క్రింది విధముగా చిన్న చిన్న సమయఖండాలుగా విభజించబడినది:[7]

సాధారణ ఉపయోగములో ఉన్న సమయమే గణించగల సమయము. ప్రాణం తో (ఒక శ్వాసకు పట్టే సమయం) ప్రారంభమై, ఆరు ప్రాణాలు ఒక విఘటిక లేదా పలం, 60 విఘటికలు ఒక ఘటిక, 60 ఘటికలు ఒక నక్షత్ర అహోరాత్రి, లేదా ఒక ఖగోళ దినం గా గణిస్తారు. ఒక నక్షత్ర మాసం లేదా ఖగోళ మాసం లో 30 అహోరాత్రులు లేదా రోజులు ఉంటాయి.

ఒక రోజుకు 24 గంటలుగా పరిగణిస్తే, ఈ కాలమానములోని అత్యంత చిన్న కొలత, ప్రాణం, లేదా ఒక ఉచ్ఛ్వాసనిశ్వాసం నాలుగు సెకన్లకు సమానమవుతుంది. ఇది ఆధునిక వైద్యశాస్త్ర పరిశోధనలు సాధారణ ఉచ్ఛ్వాసనిశ్వాస పౌనపున్యం గా భావించే నిమిషానికి 15 శ్వాసలకు సరిపోతుంది.[8] సూర్య సిద్ధాంతం, స్థానిక సమయము నుండి ఉజ్జయినీ ప్రామాణిక సమయాన్ని గణించే పద్ధతిని కూడా వివరించింది.[5] భారతీయ కాలమానం చాలా ముందే ఈ ప్రగతిని సాధించినప్పటికీ, ప్రామాణిక సమయం, ఖగోళ శాస్త్రంలో తప్ప వేరెక్కడా విరివిగా ఉపయోగించబడలేదు. చరిత్రలో భారతదేశాన్ని పరిపాలించిన రాజులు, తమసామ్రాజ్యాలలో, చాలామటుకు భారతీయ పంచాంగము సహాయముతో గణించిన స్థానిక సమయాన్నే పాటించారు. typically using the Hindu calendar in both lunar and solar units.[9] ఉదాహరణకు, 1733లో మహారాజా సవాయి జైసింగ్ జైపూర్‌లో నిర్మించిన జంతర్ మంతర్ వేధశాలలో స్థానిక సమయాన్ని కచ్చితంగా తెలుసుకోవటానికి 90 అడుగులు (27 మీటర్లు) వరకు ఎత్తున్న సూర్య సూచిక(సన్ డయల్) ‌లు ఉన్నాయి.

ప్రస్తుతం భారతదేశములో అమలులో ఉన్న భిన్నాంశ కాలమానాన్ని (UTC+5:30) ఖగోళకారుడు జాన్ గోల్డింగ్‌హామ్ స్థాపించాడని భావిస్తారు.

బ్రిటీషు నావికుడు-ఖగోళకారుడు మైఖెల్ టాపింగ్ యొక్క కృషి ఫలితముగా 1792లో, బ్రిటీషు ఈస్టిండియా కంపెనీ అప్పటి మద్రాసులో మద్రాసు అబ్జర్వేటరీని ప్రారంభించింది. 1802లో భారతదేశంలో ఈస్టిండియా కంపెనీ యొక్క అధికారిక ఖగోళకారునిగా నియమితుడైన జాన్ గోల్డింగ్‌హామ్, గ్రీన్‌విచ్ ప్రామాణిక సమయానికి ఐదున్నర గంటలు ముందున్న మద్రాసు యొక్క రేఖాంశము (13°5′24″N 80°18′30″E / 13.09000°N 80.30833°E / 13.09000; 80.30833) ను స్థానిక ప్రామాణిక సమయముగా స్థిరపరిచాడు. దీనితో ప్రస్తుతము ఉపయోగిస్తున్న ప్రమాణిక సమయానికి నాందివేశాడు. అప్పటి వరకు ప్రామాణికముగా ఉపయోగిస్తున్న సమయములో రోజు సూర్యోదయముతో ప్రారంభమయ్యేది. అయితే కొత్త పద్ధతిలో రోజు అర్ధరాత్రి ప్రారంభమవుతుంది. అబ్జర్వేటరీలోని గడియారం ఒక తుపాకికి అనుసంధానించబడి ప్రతిరోజు రాత్రి 8 గంటలకు భాప్రాకా సవ్యంగా ఉందని సూచించటానికి తుపాకీ పేలుతుండేది.[10] బొంబాయి నౌకాశ్రయములో నౌకా కార్యకలపాలకు సమయ పాలనా మద్దతును 1862లో స్థాపించబడిన కొలాబా అబ్జర్వేటరీ అందించేది.[11]

భారతదేశములో అనేక పట్టణాలు 1850లలో రైల్వేలు వచ్చిన తర్వాత కొద్ది సంవత్సరాలకు కూడా తమ సొంత స్థానిక సమయాన్నే ఉపయోగించేవి. రైల్వేల రాకతో ఒక సమైక్య ప్రామాణిక సమయం యొక్క ఆవశ్యకత తెలియవచ్చింది. అప్పటి బ్రిటీషు ఇండియాలోని రెండు పెద్ద ప్రాంతాలకు ముఖ్యపట్టణాలైన బొంబాయి మరియు కలకత్తాల స్థానిక సమయాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. క్రమేణ వాటి చుట్టుపక్కల ప్రాంతాలు మరియు సంస్థానాలు ఈ ప్రామాణిక సమయాన్ని అవలంబించాయి. 19వ శతాబ్దములో గడియారాలను టెలిగ్రాఫు ద్వారా ఒకే సమయము ఉండేట్టు చేసేవారు (సింక్రొనైజ్) ఉదాహరణకు రైల్వేలు తమ గడియారాలని ప్రతిరోజూ ఒక నిర్ణీత సమయములో ముఖ్య కార్యాలయము లేదా ప్రాంతీయ కార్యాలయము నుండి పంపే సమయ సంకేతము ద్వారా సింక్రొనైజ్ చేసేవారు.[12]

1884లో, వాషింగ్టన్, డి.సిలో జరిగిన అంతర్జాతీయ మెరిడియన్ సమావేశము ప్రపంచమంతటా ప్రామాణిక కాలమండలాలను వ్యవస్థీకరించింది. ఆ సమావేశములో భారతదేశంలో రెండు కాలమండలాలు ఉండాలని నిర్ణయించింది. కలకత్తా తూర్పు 90డిగ్రీల రేఖాంశమును, బొంబాయి తూర్పు 75డిగ్రీల రేఖాంశము ఉపయోగించేది. కలకత్తా సమయము గ్రీన్విచ్ కంటే 5 గంటల 30 నిమిషాల 21 సెకన్లు, బొంబాయి సమయము గ్రీన్విచ్ కంటే 4 గంటల 51 నిమిషాలు ముందు ఉండేట్టు నిర్ణయమైనది.[13] 1880ల చివరికల్లా, చాలామటుకు రైల్వే కంపెనీలు రెండు కాలమండలాలకు మధ్యేమార్గంగా రైల్వే సమయముగా పేరొందిన మద్రాసు సమయమును ఉపయోగించడం ప్రారంభించాయి. అండమాన్ మరియు నికోబార్ దీవులు రాజధాని అయిన పోర్ట్ బ్లెయిర్ లో పోర్ట్ బ్లెయిర్ మీన్ టైం అనే మరొక ప్రత్యేక కాలమండలం స్థాపించబడింది. పోర్ట్ బ్లెయిర్ సమయము, మద్రాసు సమయము కంటే 49 నిమిషాల 51 సెకన్లు ముందు ఉండేది.[14]

అయితే బ్రిటీషు ఇండియా 1905 వరకు అధికారికంగా ప్రామాణిక కాలమండలాలను నిర్ణయించలేదు. 1905లో ఏకైక ప్రామాణిక సమయాన్ని స్థాపిస్తూ అలహాబాదుకు తూర్పుగా వెళ్ళే 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని భారతదేశ కేంద్ర మెరిడియన్ గా ఎంచుకున్నది. ఇది 1906, జనవరి 1 నుండి భారతదేశంతో పాటు శ్రీలంకలో కూడా అమలులోకి వచ్చింది. కానీ, కలకత్తా సమయమును మాత్రం 1948 వరకు అధికారికముగా, ప్రత్యేక కాలమండలముగానే నిర్వహించారు.[12]

ఇతర సరిహద్దు దేశాలతో సంబంధములో భాప్రాకా

1925లో, టైం సింక్రొనైజేషన్ సంకేతాన్ని ఆమ్నిబస్ టెలిఫోన్ వ్యవస్థ ద్వారా, నియంత్రిత సర్క్యూట్ల ద్వారా కచ్చితమైన సమయము కావలసిన సంస్థలకు ప్రసారము చేసేవారు. ఈ పద్ధతి 1940ల వరకు కొనసాగినది. 1940లలో ప్రభుత్వము సమయ సంకేతాలను రేడియో ద్వారా ప్రసారం చెయ్యటం ప్రారంభించింది.[12]

1947లో భారతదేశానికి స్వాతంత్ర్యము వచ్చిన తర్వాత, భారత ప్రభుత్వము భారత ప్రామాణిక సమయాన్ని దేశం మొత్తానికి అధికారిక సమయంగా ప్రకటించింది. ఆ తరువాత మరి కొన్ని సంవత్సరాల పాటు కలకత్తా మరియు బొంబాయి తమ సొంత స్థానిక సమయాన్ని పాటించాయి.[12] UTC +5:30కి వీలైనంతగా దగ్గరలో ఉండటానికి చెన్నైలోని కేంద్రీయ అబ్జర్వేటరీని మిర్జాపూర్ దగ్గరకు తరలించారు.

1962 చైనా-ఇండియా యుద్ధము మరియు పాకిస్తాన్ తో జరిగిన 1965 మరియు 1971 యుద్ధ సమయాల్లో పౌర విద్యుచ్ఛక్తి వినియోగాన్ని తగ్గించడానికి తాత్కాలికంగా కొంతకాలం పాటూ పొద్దు పొదుపు(డేలైట్ సేవింగ్)ను అమలుపరిచారు.[1]

సమస్యలు[మార్చు]

1980వ దశకపు చివరిలో, ఒక పరిశోధకుల బృందము విద్యుచ్ఛక్తిని ఆదాచేయటానికి దేశాన్ని రెండు లేదా మూడు కాలాంశాలుగా విభజించాలని ప్రతిపాదించారు. వీరి ప్రతిపాదనలో బ్రిటీషు పాలన కాలంలో ఉన్న రెండు కాలాంశాల పద్ధతిని తిరిగి ప్రవేశపెట్టడము కూడా ఒకటి. అయితే ఈ బృందము యొక్క ప్రతిపాదనలు అమలుపరబడలేదు[3][15]

2001లో, కేంద్ర ప్రభుత్వము శాస్త్ర సాంకేతిక శాఖ ఆధ్వర్యములో అనేక కాలాంశాలు మరియు పొద్దు పొదుపు సమయం యొక్క ఆవశ్యకతలను పరిశీలించటానికి నలుగురు సభ్యుల సంఘాన్ని నియమించింది.[3] ఈ సంఘం యొక్క నిర్ధారణలను 2004లో శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి, కపిల్ సిబాల్ భారత పార్లమెంటులో ప్రవేశపెట్టాడు. ఈ సంఘం భారతదేశము యొక్క విస్తృతి అనేక కాలాంశాలు అవసరమయ్యేంతగా లేదని, పైమ్ మెరీడియను కేంద్రస్థానముగానే ఎంపిక చేయబడినది కాబట్టి ఇప్పుడున్న సమైక్య వ్యవస్థకు మార్పులు చేయనవసరం లేదని నిర్ధారించింది.[16]

ప్రభుత్వము, భారత దేశాన్ని అనేక కాలాంశాలుగా విభజించడానికి పలుమార్లు తిరస్కరించినప్పటికీ, ప్లాంటేషన్స్ శ్రామిక చట్టము, 1951 వంటి కార్మిక చట్టాలు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వములకు ఆయా పారిశ్రామిక ప్రాంతాలలో స్థానిక సమయాన్ని నిర్వచించటానికి మరియు స్థాపించటానికి అవకాశం కల్పిస్తున్నవి.[17]

సమయ సంకేతాలు[మార్చు]

వాణిజ్య మరియు అధికారిక ఉపయోగాల కోసం అధికారిక సమయ సంకేతాలు కొత్త ఢిల్లీలోని జాతీయ భౌతిక పరిశోధనశాల వద్ద ఉన్న సమయ మరియు పౌనపున్య ప్రామాణిక పరిశోధనశాల వెలువడతాయి. ఈ సంకేతాలు విశ్వవ్యాప్త సమన్వయ సమయమునకు మద్దతునిచ్చే ప్రపంచవ్యాప్త గడియార వ్యవస్థతో అనుసంధానించబడిన అటామిక్ క్లాక్ ఆధారంగా వెలువడుతాయి.

సమయ మరియు పౌనపున్య ప్రామాణిక పరిశోధనశాల యొక్క విశేషాలు:[18]

 • నాలుగు సీషియం మరియు రుబీడియం అటామిక్ గడియారాలు;
 • 10 మెగా హెర్ట్‌జుల వద్ద ATA అనేక సంతేకనామంతో ప్రసారమయ్యే ఉఛ్ఛస్థాయి పౌనపున్యం కలిగిన ప్రసార సర్వీసు వినియోగదారుల గడియారాన్ని మిల్లీసెకండ్లలలో సింక్రొనైజ్ చెయ్యటానికి ఉపయోగిస్తారు.
 • భారత జాతీయ ఉపగ్రహ వ్యవస్థ యొక్క ఉపగ్రహాలపై ఆధారపడిన ప్రామాణిక సమయము మరియు ఫ్రీక్వెన్సీ ప్రసార సర్వీసు

నిర్దిష్టమైన సమయాన్ని దేశమంతటా ప్రభుత్వాధీనములో ఉన్న ఆలిండియా రేడియో మరియు దూరదర్శన్ టెలివిజన్ నెట్‌వర్కుల ద్వారా ప్రసారం చేస్తారు. టెలిఫోన్ కంపెనీలు వినియోగదారులకు కచ్చితమైన సమయాన్ని తెలియజేసేందుకు ప్రత్యేకంగా నియమించిన టెలిఫోన్ నంబర్లు టైం సర్వర్ మిర్రర్లకు అనుసంధానించబడి ఉంటాయి. కచ్చితమైన సమయం తెలుసుకోవటానికి గణనీయంగా పెరుగుతున్న మరో ప్రాచుర్యమైన పద్ధతి గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం (జి.పి.ఎస్) రిసీవర్లు.[19]

ఇవికూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

 1. 1.0 1.1 "India Time Zones". Greenwich Mean Time (GMT). Retrieved 2006-11-25. External link in |work= (help)
 2. "Military and Civilian Time Designations". Greenwich Mean Time (GMT). Retrieved 2006-12-02. External link in |work= (help)
 3. 3.0 3.1 3.2 Sen, Ayanjit (2001-08-21). "India investigates different time zones". BBC News. Retrieved 2006-11-25. Check date values in: |date= (help); External link in |work= (help)
 4. Schmidt, Olaf H. (1944). "The Computation of the Length of Daylight in Hindu Astronomy". Isis, 35(3):205–211. The University of Chicago Press. Retrieved 2006-11-29. Italic or bold markup not allowed in: |work= (help)
 5. 5.0 5.1 Burgess, Ebenezer. 1858–1860. "Translation of the Surya-Sikddhanta, A Text-Book of Hindu Astronomy; With Notes, and an Appendix." Journal of the American Oriental Society, 6:141–498. (pages 183–186).
 6. Swerdlow, N. 1973. "A Lost Monument of Indian Astronomy." Isis. 64(2):239–243.
 7. Das, Sukumar Ranjan. 1928. "The Equation of Time in Hindu Astronomy">, The American Mathematical Monthly, 35(10):540–543. Retrieved 1 December 2006.
 8. Piepoli, M. 1997. "Origin of Respiratory Sinus Arrhythmia in Conscious Humans." Circulation. 95:1813–1821. Retrieved 1 December 2006.
 9. Tomczak, Matthias (2004-07-15). "Lecture 7: Living with the seasons—the calendar problem". Lectures on Science, civilization and society, Flinders University, Australia. Retrieved 2006-12-01. Cite web requires |website= (help)
 10. "History of Indian Time (IST)". Greenwich Mean Time (GMT). Retrieved 2006-11-25. External link in |work= (help)
 11. "History of Indian Institute of Geomagnetism". National Informatics Centre. 2006-10-10. Retrieved 2006-11-25. Cite web requires |website= (help)
 12. 12.0 12.1 12.2 12.3 "Odds and Ends". Indian Railways Fan Club. Retrieved 2006-11-25. External link in |work= (help)
 13. "Indian Time Zones (IST)". Project Gutenberg. International Conference Held at Washington for the Purpose of Fixing a Prime Meridian and a Universal Day. October, 1884 Protocols of the Proceedings. Retrieved 2006-11-25. External link in |work= (help)
 14. "Note on the earthquake of [[31 December]] [[1881]], Records of the Geological Survey of India,, XVII(2), 47–53, 1884". Cooperative Institute for Research in Environmental Sciences (CIRES). Retrieved 2006-11-25. URL–wikilink conflict (help)
 15. S. Muthiah (2002-01-07). "A matter of time". The Hindu Business Line. The Hindu Group. Retrieved 2006-11-25. Check date values in: |date= (help); External link in |work= (help)
 16. "Standard Time for Different Regions". Department of Science and Technology]. 2004-07-22. Retrieved 2006-11-25. Check date values in: |date= (help)
 17. "A matter of time". National Resource Centre for Women. Retrieved 2006-11-25.
 18. "Indian Time Today (IST)". Greenwich Mean Time (GMT). Retrieved 2006-11-25. External link in |work= (help)
 19. "Satellites for Navigation". Press Information Bureau, Government of India. Retrieved 2006-11-25. External link in |work= (help)

బయటి లింకులు[మార్చు]