Jump to content

కపిల్ సిబల్

వికీపీడియా నుండి
కపిల్ సిబల్
కపిల్ సిబల్


రాజ్యసభ సభ్యుడు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
4 జులై 2022
ముందు సతీష్ శర్మ, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ
నియోజకవర్గం ఉత్తరప్రదేశ్[1]

కేంద్ర కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
పదవీ కాలం
జనవరి 19, 2011 – మే 26, 2014
ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్
ముందు ఎ. రాజా
తరువాత రవి శంకర్ ప్రసాద్

మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
పదవీ కాలం
మే 31, 2009 – అక్టోబర్ 28, 2012
ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్
ముందు అర్జున్ సింగ్
తరువాత పల్లం రాజు

కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
పదవీ కాలం
మే 22, 2004 – మే 31, 2009
ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్
ముందు విజయ్ గోయల్
తరువాత పవన్ కుమార్ బన్సల్

పదవీ కాలం
మే 22, 2004 – మే 31, 2009
ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్
ముందు విజయ్ గోయల్
తరువాత పవన్ కుమార్ బన్సల్

లోక్ సభ సభ్యుడు
పదవీ కాలం
మే 10, 2004 – మే 16, 2014
ముందు విజయ్ గోయల్
తరువాత హర్ష వర్ధన్
నియోజకవర్గం చాందిని చౌక్

కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ
పదవీ కాలం
మే 11, 2013 – మే 26, 2014
ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్
ముందు అశ్వని కుమార్
తరువాత రవి శంకర్ ప్రసాద్

వ్యక్తిగత వివరాలు

జననం (1948-08-08) 1948 ఆగస్టు 8 (వయసు 76)
జలందర్, తూర్పు పంజాబ్, భారతదేశం
రాజకీయ పార్టీ సమాజ్‌వాదీ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు భారత జాతీయ కాంగ్రెస్[2]
జీవిత భాగస్వామి నైనా సిబల్ (1973–2000)
ప్రమీల సిబల్
సంతానం ఇద్దరు కుమారులు
పూర్వ విద్యార్థి ఢిల్లీ విశ్వవిద్యాలయం (ఎల్. ఎల్. బి, ఎమ్.ఎ)
హార్వర్డ్ విశ్వవిద్యాలయం (ఎల్ ఎల్. ఎమ్)
వృత్తి రాజకీయ నాయకుడు , న్యాయవాది
మతం హిందువు
సంతకం కపిల్ సిబల్'s signature
వెబ్‌సైటు Official website

కపిల్ సిబల్ (జననం: ఆగస్టు 8, 1948) ఈయన భారతీయ రాజకీయ నాయకుడు, న్యాయవాది.

కపిల్ సిబాల్ సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా 2024 మే 16న ఎన్నికయ్యాడు.[3][4]

తొలినాళ్ళ జీవితం

[మార్చు]

ఈయన 1948 ఆగస్టు 8 న పంజాబ్‌ లోని జలంధర్‌లో జన్మించాడు. ఈయన కుటుంబం 1947 లో విభజన సమయంలో భారతదేశానికి వలస వచ్చారు. కపిల్ సిబల్ 1964 లో ఢిల్లీలోని సెయింట్ జాన్స్ హై స్కూల్ లో తన పాఠశాల విద్యను, ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో ఎల్.ఎల్.బి డిగ్రీని, ఫ్యాకల్టీ ఆఫ్ లాను, చరిత్రలో ఎం.ఏ. పట్టాను పొందాడు. ఈయన 1972 లో బార్ అసోసియేషన్‌లో చేరడు. 1973 లో  ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్‌కు అర్హత సాధించాడు. కానీ ఈ ఉద్యోగాన్ని తిరస్కరించి న్యాయ విద్యను కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు. 1977 లో తన ఎల్. ఎల్.ఎమ్ ను  హార్వర్డ్ లా స్కూల్ లో పూర్తిచేసాడు.

కెరీర్

[మార్చు]

ఈయన 1983 లో సీనియర్ న్యాయవాదిగా నియమించబడ్డాడు. 1989 లో భారతదేశ అదనపు సొలిసిటర్ జనరల్గా నియమించబడ్డాడు. ఈయన మూడు పర్యాయాలు 1995-1996, 1997-1998, 2001-2002లో సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేశాడు. ఈయన జాతీయ దినపత్రికలలో భద్రత, అణు విస్తరణ, ఉగ్రవాదం వంటి వివిధ అంశాలపై అనేక వ్యాసాలను రాసాడు. ఈయన 2004 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరపున చాంద్ని చౌక్ లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీచేసి భారతీయ జనతా పార్టీకి చెందిన స్మృతి ఇరానీపై గెలిచాడు. ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కేబినెట్‌లో కేంద్ర సైన్స్, టెక్నాలజీ, ఎర్త్ సైన్సెస్ మంత్రిగా పనిచేశాడు. 2009 సార్వత్రిక లోక్‌సభ ఎన్నికల్లో చాందిని చౌక్ నియోజకవర్గం నుంచి భారత జాతీయ కాంగ్రెస్ తరపున రెండోసారి పోటీచేసి గెలుపొందాడు.[5]

పదవులు

[మార్చు]

ఈయన అదనపు సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (1989 డిసెంబరు - 1990), ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ (1993) ప్రెసిడెంట్. సుప్రీం కోర్ట్ బార్ అసోసియేషన్ (1995-96, 1997-98, 2001-2002) ; సభ్యుడు. రాజ్యసభ (1998 జూలై) సభ్యుడు. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ అండ్ పార్లమెంటరీ స్టడీస్ (2001 జూలై) సభ్యుడు. వ్యాపార సలహా కమిటీ (2001 ఆగస్టు) సభ్యుడు, హోం వ్యవహారాల కమిటీ (2002 జనవరి) కో-చైర్మన్, ఇండో-యుఎస్ పార్లమెంటరీ ఫోరం (2002) సభ్యుడు, బోర్డ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎయిడ్స్ వ్యాక్సిన్ ఇనిషియేటివ్ (2002) సభ్యుడు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఈయన తండ్రి న్యాయవాది. ఈయన కుటుంబం 1947 లో విభజన సమయంలో భారతదేశానికి వలస వచ్చారు. 1994 లో హెచ్ఎల్ సిబల్ ను ఇంటర్నేషనల్ బార్ అసోసియేషన్ "లివింగ్ లెజెండ్ ఆఫ్ ది లా"గా పేర్కొంది. ఈయన 1973 లో నినా సిబల్‌ను వివాహం చేసుకున్నాడు.[6] ఈమె 2000 లో రొమ్ము క్యాన్సర్‌తో మరణించింది. ఈయనకు తన మొదటి వివాహం నుండి ఇద్దరు కుమారులు అమిత్, అఖిల్. వీరు ఇద్దరూ న్యాయవాదులు. ఈయన 2005 లో ప్రోమిలా సిబల్‌ను వివాహం చేసుకున్నాడు. అతని సోదరుడు కన్వాల్ సిబల్, భారత విదేశాంగ సేవ యొక్క రిటైర్డ్ దౌత్యవేత్త, భారత మాజీ విదేశాంగ కార్యదర్శి.[7]

మూలాలు

[మార్చు]
  1. http://www.thehindu.com/news/national/kapil-sibal-wins-rajya-sabha-polls-from-uttar-pradesh/article8718509.ece
  2. Namasthe Telangana (25 May 2022). "కాంగ్రెస్‌కు క‌పిల్ సిబ‌ల్ ఝ‌ల‌క్‌.. సైకిల్ ఎక్కి రాజ్య‌స‌భ‌కు..!". Archived from the original on 25 May 2022. Retrieved 25 May 2022.
  3. EENADU (17 May 2024). "సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా కపిల్‌ సిబల్‌ గెలుపు". Archived from the original on 17 May 2024. Retrieved 17 May 2024.
  4. The Hindu (16 May 2024). "Kapil Sibal elected Supreme Court Bar Association president" (in Indian English). Archived from the original on 17 May 2024. Retrieved 17 May 2024.
  5. "Personal Profile | Kapil Sibal | Official Website | Perspectives and News about India, and Facts of Progress under the UPA Government". Archived from the original on 2013-11-11. Retrieved 12 January 2020.
  6. Bishakha De Sarkar (24 August 2008). "'When I'm in politics, I stick to the party line; when I'm a poet, I don't'". The Telegraph. Calcutta, India. Archived from the original on 22 మే 2018. Retrieved 11 January 2020.
  7. <http://timesofindia.indiatimes.com/city/pune-times/No-politricks-for-Kapil-Sibal/articleshow/44009939.cms>