1948
Appearance
1948 గ్రెగోరియన్ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.
సంవత్సరాలు: | 1945 1946 1947 - 1948 - 1949 1950 1951 |
దశాబ్దాలు: | 1920లు 1930లు 1940లు 1950లు 1960లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]- ఏప్రిల్ 7: ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏర్పాటు చేయబడింది.
- మే 14: ప్రత్యేక దేశంగా ఇజ్రాయెల్ ఏర్పడింది.
- జూన్ 21: స్వతంత్ర భారత తొలి భారతీయ గవర్నర్ జనరల్‌గా చక్రవర్తి రాజగోపాలాచారి బాధ్యతలు చేపట్టినాడు.
- జూలై 29: 14వ వేసవి ఒలింపిక్ క్రీడలు లండన్‌లో ప్రారంభమయ్యాయి.
- సెప్టెంబర్ 17: తెలంగాణ విమోచన దినోత్సవం.
- డిసెంబరు 18: జాగృతి తెలుగు వారపత్రిక ప్రారంభమైనది.
జననాలు
[మార్చు]- జనవరి 1: షేక్ బడేసాహెబ్ తెలుగు రచయిత.
- జనవరి 1: మంచాల సూర్యనారాయణ, తెలుగు నాటకరంగ, టీవీ, సినీ నటుడు. (మ.2020)
- జనవరి 1: ఫగు చౌహాన్, మేఘాలయా గవర్నర్.
- జనవరి 3: ఐతా చంద్రయ్య: తెలంగాణా ప్రాంతానికి చెందిన కవి, రచయిత.
- ఫిబ్రవరి 24: జయలలిత, తమిళనాడు ముఖ్యమంత్రిణి.
- ఫిబ్రవరి 25: డానీ డెంజోంగ్ప, భారతీయ చలనచిత్ర నటుడు.
- మే 22: నాగం జనార్ధన్ రెడ్డి పాలమూరు జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు
- జూన్ 16: ఉత్పల హనుమంతరావు, కాంగ్రెస్ తరపున ఆంధ్రప్రదేశ్ నుండి భారత రాజ్యసభకు ప్రాతినిథ్యము వహిస్తున్నాడు
- జూన్ 30: తమ్మారెడ్డి భరద్వాజ తెలుగు సినిమా నిర్మాత, దర్శకులు.ఆయన దర్శకుడు తమ్మారెడ్డి గోపాలకృష్ణమూర్తి కుమారుడు.
- జూలై 6: ఛాయరాజ్ శ్రీకాకుళం జిల్లాకు చెందిన కవి, రచయిత. ఈయన "జనసాహితి" రాష్ట్ర అధ్యక్షుడుగా యున్నారు. (మ.2013)
- జూలై 27: ఎం. వి. ఎస్. హరనాథ రావు, నాటక రచయిత, సినీ మాటల రచయిత,, నటుడు. (మ.2017)
- ఆగష్టు 3: వాణిశ్రీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినినటి.
- ఆగష్టు 4: శత్రుచర్ల విజయరామరాజు, విజయనగరం జిల్లాలోని చినమేరంగి సంస్థానాదిపతి, పార్లమెంటుకు పార్వతీపురం లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యారు.
- సెప్టెంబర్ 22: మల్లాది గోపాలకృష్ణ, రంగస్థల నటుడు, దర్శకుడు, రూపశిల్పి, నటశిక్షణ అధ్యాపకులు.
- సెప్టెంబర్ 25: రేమెళ్ళ అవధానులు, తెలుగు శాస్త్రవేత్త.
- సెప్టెంబర్ 25: భూపతిరాజు సోమరాజు, ప్రసిద్ధిచెందిన గుండె వ్యాధి నిపుణుడు, కేర్ హాస్పిటల్ హెడ్, ఛైర్మన్.
- అక్టోబరు 12: ప్రొతిమా బేడి, ఒడిస్సీ సాంప్రదాయ భారతీయ నృత్య కళాకారిణి. (మ.1998)
- అక్టోబరు 16: రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి రచయిత, విమర్శకులు. 2014 సంవవత్సరానికి వీరికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారము లభించింది.
- అక్టోబరు 17: అన్నపూర్ణ (నటి), ఏడువందల సినిమాల్లో నటించిన తెలుగు సినిమా నటి.
- నవంబరు 9: గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ పేరొందిన సంగీత విద్వాంసులు.
- నవంబరు 14: నిజాం వెంకటేశం, కవి, అనువాదకుడు, ప్రచురణకర్త. (మ. 2022)
- నవంబరు 30: కె. ఆర్. విజయ, భారతీయ సినిమా నటి.
- డిసెంబర్ 11: రఘువరన్, దక్షిణ భారతదేశానికి చెందిన సుప్రసిద్ధ నటుడు. (మ.2008)
- డిసెంబర్ 30: భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు సురీందర్ అమర్నాథ్.
మరణాలు
[మార్చు]- జనవరి 30: మహాత్మా గాంధీ, భారత జాతి పిత. (జ.1869)
- మార్చి 1: క్లారా కెర్న్ బేలిస్, అమెరికన్ రచయిత్రి, విద్యావేత్త. (జ.1848)
- ఏప్రిల్ 4: రాజా నర్సాగౌడ్, సంఘసేవకుడు, మహాదాత. (జ.1866)
- జూన్ 18: హరిలాల్ గాంధీ, మహాత్మాగాంధీ ప్రథమ పుత్రుడు. (జ.1888)
- ఆగష్టు 9: యల్లాప్రగడ సుబ్బారావు, భారతీయ వైద్య శాస్త్రజ్ఞుడు. (జ.1895)
- ఆగష్టు 22: షోయబ్ ఉల్లాఖాన్, తెలంగాణా సాయుధ పోరాట యోధుడు, బాహ్య ప్రపంచానికి అంతగా తెలియని త్యాగధనుడు, నిర్భయ జర్నలిస్ట్, మత దురహంకారానికి వ్యతిరేకి. (జ.1920)