ఛాయరాజ్
కొంక్యాన ఛాయరాజ్ | |
---|---|
జననం | కొంక్యాన ఛాయరాజ్ 1948 జూలై 6 గార మండలం కొంక్యానపేట |
మరణం | సెప్టెంబరు 20 2013 గారమండలం వేణుగోపాలపురం |
మరణ కారణం | క్యాన్సర్ వ్యాధి |
నివాస ప్రాంతం | గుజరాతీ పేట, శ్రీకాకుళం |
ఇతర పేర్లు | ఛాయరాజ్ |
వృత్తి | జీవశాస్త్ర ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయుడు |
ప్రసిద్ధి | ప్రముఖ కవి, సాహితీవేత్త, రచయిత, జనసాహితి రాష్ట్ర అధ్యక్షులు |
మతం | హిందూ |
పిల్లలు | కుమారుడు, ఇద్దరు కుమార్తెలు |
తండ్రి | సూర్యనారాయణ |
తల్లి | సూరమ్మ |
ఛాయరాజ్ శ్రీకాకుళం జిల్లాకు చెందిన ప్రముఖ కవి, రచయిత. ఈయన "జనసాహితి" రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేసాడు.
జీవిత విశేషాలు
[మార్చు]శ్రీకాకుళం జిల్లా లోని గార మండలం కొంక్యానపేటలో 1948 జూలై 6లో కొంక్యాన సూరమ్మ, సూర్యనారాయణ దంపతులకు ఛాయరాజ్ జన్మించాడు. ప్రాథమిక విద్యాభ్యాసం ఊళ్లోనే సాగింది. బిఎస్సీ బిఇడి చేసిన ఆయన ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేశాడు. సామాజికశాస్త్రంలో ఎం.ఎ. చదివాడు. ఈయన జీవ శాస్త్ర ఉపాధ్యాయునిగా పనిచేశాడు. 2005లో గజిటెడ్ ప్రధానోపాధ్యాయునిగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, దూసిపేట లో ఉద్యోగ విరమణ పొందాడు. మొదటి నుండి సాహిత్య కృషి సాగించాడు. శ్రీకాకుళం గిరిజన రైతాంగ సాయుధ పోరాటాన్ని కావ్యరూపంగా మలిచాడు. కొండకావ్యం 'గుమ్మ', స్త్రీ, పురుష సంబంధాలను విప్లవీకరించిన 'నిరీక్షణ', బుదడు, తొలెరుక, మన్ను నన్ను మౌనంగా ఉండనీయదు, మాతృభాష, దర్శిని, రసస్పర్శ, దుఖ్ఖేరు తదితర కథలు, కావ్య రచనలు చేశారు. ఆయన రచనలు శ్రీకాకుళం, కారువాకిని ఇటీవలే ఆవిష్కరించారు. 1980లో జనసాహితీలో సభ్యునిగా చేరిన ఛాయరాజ్ 2007 నుండి ఇప్పటివరకూ ఆ సంస్థ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నాడు. ఫ్రీవర్స్ ఫ్రంట్, తెలుగు వెలుగు, ఆంధ్రప్రదేశ్ సాహితీ సాంస్కృతిక సమాఖ్య, జిల్లా సాంస్కృతిక మండలి అవార్డులు అందుకున్నాడు.
శిల్పగతమైన శక్తులు ఎన్నివున్నా, కవికి వ్యక్తిత్వాన్ని ఇచ్చేవి అతని విశ్వాసాలు, అభిప్రాయాలే. సమాజం గురించి, జీవితం గురించి స్థిరమైన అభిప్రాయాలు లేనివాడు ఎన్నాళ్లయినా తనదని చెప్పుకోదగ్గ వ్యక్తిత్వం పొందలేడు. ఈ నిర్దిష్టమైన విలువలు తన ప్రతి రచనలోనూ మేళవించి సామాజిక ప్రయోజనం పరమావధిగా రచనలు చేస్తున్న అతి కొద్దిమంది తెలుగు కవులలో ఛాయరాజ్ ఒకడు. శ్రీకాకుళం పట్టణానికి చెందిన కవి ఛాయరాజుకు 2005లో ప్రతిష్ఠాత్మక ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు లభించింది.తెలుగు కవిత్వంలో ఫ్రీవర్స్ ఫ్రంటుకు ఉత్తమ బహుమానం అన్న విలువ ఉంది.
ఛాయరాజ్ రచించిన నవల 'కారువాకి'.. ఆయన మరణానికి కేవలం రెండు రోజుల ముందు.. 2013 సెప్టెంబరు 19న ఆవిష్కృతమైంది. అలాగే.. 1959-70 నడుమ సాగిన శ్రీకాకుళ గిరిజనోద్యమాన్ని 'శ్రీకాకుళం' కథాకావ్యంగా ఆయన ఆవిష్కరించాడు. [ఉపాధ్యాయుడుగా పనిచేసిన అతను ఎందరో విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దాడు.
ఈయన శ్రీకాకుళం పట్టణంలో గుజరాతీపేటలో నివాసమున్నాడు. నాలుగు దశాబ్దాలుగా తెలుగు సాహితీ రంగానికి ఆయన సేవ చేసిన ఆయన 2013 సెప్టెంబరు 20 న మరణించారు.
రచనలు
[మార్చు]ముద్రిత రచనలు
[మార్చు]- శ్రీకాకుళం (ఉద్యమ కథా కావ్యం)(1989): శ్రీకాకుళం ఉద్యమం ప్రభావంతోనే ఛాయరాజ్ ‘శ్రీకాకుళ కావ్యం’ రాసారు.
- గుమ్మ (కొండ కావ్యం) - ఫిబ్రవరి 1995[1]
- దర్శిని (కావ్యం) - ఫిబ్రవరి 1995 [2]
- నిరీక్షణ (కావ్యం) - డిసెంబరు 1996
- బుదడు (స్మృతి కావ్యం) - జూన్ 2003
- తొలెరుక (జన్మకావ్యం) - జనవరి 2005
- దుఖ్కేరు (స్మృతి కావ్యం) - జనవరి 2005
- రస స్పర్శ (కవిత) - జూలై 2005
- ది లాంగింగ్ ఐ ( ఎ లాంగ్ పోయం) ఆగస్టు 1999
(తెలుగు "నిరీక్షణ్"కు ఆర్.ఎస్ & ఎస్.ఎన్.మూర్తి) అనువాదం - మట్టి నన్ను మవునంగా ఉండానీదు (కవితా సంపుటి) ఆగష్టు 1999
- కారువాకి (చారిత్రక కళింగయుద్ధ నవల) సెప్టెంబర్ 2013
- వివిధ పత్రికలలో ప్రచురింపబడ్డ సుమారు 300 కవితలు.
- సాహిత్య, సామాజిక అంశాలపై వ్రాసిన వ్యాసాలు (ముద్రితమైనవి)
- కథలు: "అనుపమాన" కథారూపకాల పుస్తకం - మార్చి 2010
- సెల్‌ఫోన్ కథలు : సుమారు 6 కథలు "ప్రజాసాహితి" పత్రికలో 2009-10 సం.లలో ప్రచురితం.
- అనుపమాన కథారూపకాలు [3]
- కుంతి [4]
లేని నన్ను గురించిన ఆలోచన నీకెందుకు నీ జ్ఞాపకంలో నా ఆశయాన్ని కొనసాగించేటందుకు కానరాని నాకోసం నేనెందుకు లేనో లేని నువ్వు నా కోసం ఇద్దరమూ లేనినాడు (ముందూ వెనుకా "పోతున్నప్పు"డల్లా ఒకరు మరొకరితో మాట్లాడుకుంటున్నారు) |
అముద్రిత రచనలు
[మార్చు]- దుగ్గేరు (నృత్య గీతాలు)
- అమరకోశం (కావ్యం)
- చారిత్రక నాటిక
అసంపూర్ణ రచనలు
[మార్చు]- గున్నమ్మ (దీర్ఘ కవిత)
- టి.ఎన్.కావ్యం ( దీర్ఘ కవిత)
అవార్డులు
[మార్చు]- ఫ్రీవెర్స్ ఫ్రంట్ అవార్డు (2000 సంవత్సరం)
- తెలుగు వికాసం అవార్డు (2006)
- లాంగుల్యా మిత్రుల పురస్కారం (2005) బంగారు పతకం.
- డా. ఆవంత్స సోమసుందర్ సత్కారం, పిఠాపురం, 2004, నవంబరు 18
- సొ.ను. లిటరరీ ట్రష్టు - కృష్ణశాస్త్రి కావ్య పురస్కారం - నవంబరు 2010
మూలాలు
[మార్చు]- ↑ గుమ్మ కావ్యం
- ↑ "దర్శిని కావ్యం గూర్చి". Archived from the original on 2013-11-05. Retrieved 2013-09-20.
- ↑ అసమాన కథారూపాలు[permanent dead link]
- ↑ మానభంగ సంస్కృతికి ఛాయారాజ్ చెంపపెట్టు
యితర లింకులు
[మార్చు]- All articles with dead external links
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- తెలుగు రచయితలు
- విప్లవ రచయితలు
- 2013 మరణాలు
- ఆదర్శ ఉపాధ్యాయులు
- 1948 జననాలు
- సాహితీకారులు
- ఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కార గ్రహీతలు
- శ్రీకాకుళం జిల్లా ఉపాధ్యాయులు
- శ్రీకాకుళం జిల్లా రచయితలు
- శ్రీకాకుళం జిల్లా కవులు