మాతృభాష

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అజర్‌బైజాన్‌లోని నఖివాన్‌లో మాతృభాష స్మారక చిహ్నం

మాతృభాష (ఆంగ్లం : Mother Tongue లేదా first language *or primary language* ) ఇంకనూ, తన్నుడి, మొదటి భాష, ప్రాంతీయ భాష మొదలగు పేర్లు గలది. మానవుడు పుట్టిన తరువాత మొదటగా నేర్చుకునే నుడి. ముఖ్యంగా తన తల్లి ఒడిలో నేర్చుకునే నుడి(భాష), అందుకే తన్నుడి అనే పేరు.[1]

పద కోశము[మార్చు]

మాతృభాషనే పలు పేర్లతోనూ పిలుస్తారు;

 • మాతృభాష : మానవుడు పుట్టినప్పటి నుండి సహజంగా (మాతృ ఒడిలో) నేర్చుకుని మాట్లాడ గలిగే భాష మాతృభాష. లేదా మాతృభూమిలో మాట్లాడే భాష. తెలంగాణ రాష్ట్రాన్ని తమ మాతృభూమిగా గలవారు మాట్లాడే భాష (తెలుగు) మాతృభాష.
 • ప్రథమ భాష లేదా మొదటి భాష : చక్కగా మాట్లాడగలిగే, అర్థం చేసుకో గలిగే, భావాలను వ్యక్తపరచ గలిగే భాషను ప్రథమభాషగా గుర్తించవచ్చు. ఆంధ్రప్రదేశ్ లో, తెల౦గాణాలో అనేక భాషలు మాట్లాడేవారు గలరు. 90% మంది తెలుగు మాట్లాడుతారు. కారణం వీరి మాతృభాష "తెలుగు". అలాగే ఉర్దూ, తమిళం, కన్నడ, ఒరియా, హిందీ భాషలు ప్రథమ భాషగా గల వారు కానవస్తారు.
 • ప్రాంతీయ భాష : ఒక ప్రాంతంలో నివసిస్తూ వుంటే, ఆ ప్రాంతపు వ్యావహారిక భాషను కూడా మాతృభాషగా పరిగణించవచ్చు.

[2]

బహు భాషా విధానం[మార్చు]

తెలుగు భాషను తన మాతృభాషగా కలిగివున్నవాడు ఇతర భాషలు మాట్లాడ గలిగివుండవచ్చును భారతీయ విద్యావిధానంలో "త్రిభాషా సూత్రము" అవలంబించబడుచున్నది. తెలుగు మాతృభాష కలిగివుండేవారు, హిందీ (దేశ భాష) ని రెండవ భాషగానూ, ఆంగ్లమును మూడవ భాషగానూ నేర్చుకుని తీరాలి.ఒక భాష అనే కాదు ఎన్నో భాషలు మనకి ఉన్నయి

మాతృభాషలో ఉన్నత చదువులు[మార్చు]

 • తమిళంలో ఇంజనీరింగ్, మెడిసిన్ కోర్సులను అందించే ఏర్పాట్లు చేస్తున్నారు.
 • తెలుగుమీడియంలో డిగ్రీ చదివినవారికి 1995వరకు ఏ.పి.పి.యస్.సి.నిర్వహించిన గ్రూప్1,2 పరీక్షలలో 5% వైటేజి మార్కులు కలిపేవారు.
 • రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్ఆర్‌బీ) నిర్వహించే పరీక్షలను ఉద్యోగార్థులు తమ మాతృ భాషల్లోనే రాసే వీలు 2009 నుండి కల్పిస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లో ఈ అవకాశం ఉంటుంది.

మాతృ భాషలో వాదనలు తీర్పులు[మార్చు]

 • తమిళనాడు హైకోర్టు లాయర్లు తమిళంలో వాదనలు మొదలుపెట్టారు
 • మాతృభాషలో సమాచార కమిషన్లు తీర్పులు ఇవ్వాలని కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్‌ (సీసీఐసీ) హబీబుల్లా అభిప్రాయపడ్డారు. మహారాష్ట్రలో మరాఠీలో, తమిళనాడులో తమిళంలోనే ఇస్తున్నారు.ఆంధ్రప్రదేశ్‌ సమాచార కమిషన్‌ కూడా ఈ దిశగా చొరవ తీసుకోవాలని సూచించారు.కేంద్ర సమాచార కమిషన్‌ మాత్రం ఆంగ్లం, హిందీ భాషల్లో ఇస్తోంది.

గిరిజన మాతృభాషల్లో నిఘంటువులు పుస్తకాలు[మార్చు]

ఆదిలాబాద్‌, వరంగల్‌, పశ్చిమగోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఖమ్మంజిల్లాల్లో వందలాది గిరిజన తెగలున్నాయి...వారి భాషలూ అనేకం. కోయంగ్‌ (గోండి), కొలవర్‌గొట్టి (కొలామి), కోయ, కొండ, కువి, ఆదివాసిఒరియా, సవర (సొరబాస), బంజారా తదితర ఎన్నోభాషల్ని మాట్లాడుతుంటారు.మాతృభాషలో ప్రాథమిక విద్యాభ్యాసం కోసం ఎనిమిది గిరిజన భాషానిఘంటువులను డిజిటల్‌రూపంలో భద్రపర్చారు.ఒక్కోభాషకూ ఒక్కోవెబ్‌సైట్‌ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనా ఉంది. (ఈనాడు5.12.2009)

మాతృభాష ప్రాధాన్య నేర్చుకుంటారు.మాతృభాషలో ఎన్నడూ మాట్లడనంటూ రాసి ఉన్న బోర్డులను చిన్నారి విద్యార్థుల మెడలో 'ఉపాధ్యాయులు' వేలాడదీయటం అనైతికమే కాదు అసహజం కూడా అని సైన్స్‌ నిరూపించింది. అప్పుడే పుట్టిన పసిపిల్లలు ఏడ్చే ఏడుపు కూడా మాతృభాషలోనే ఉంటుందని జర్మనీకి చెందిన శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. అమ్మ గర్భంలో ఉన్న తొమ్మిది నెలల్లో.. చివరి మూడు నెలల సమయంలో తల్లి మాటలు వింటూ పిల్లలు మాతృభాష గురించి తెలుసుకుంటారని, పుట్టిన తర్వాత వారి ఏడుపు అదే భాషను ప్రతిఫలిస్తుందని తెలిసింది.పిల్లలు గర్భంలో ఉండగానే తల్లి మాటలు వింటూ ఉచ్చరణ గురించి తెలుసుకున్నారని స్పష్టమైంది. పిల్లలు వివిధ రకాల ధ్వనుల్లో ఏడ్చే సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ.. మాతృభాషకే ప్రాధాన్యమిస్తున్నారని కూడా ఈ పరిశోధనలో తెలిసింది. అమ్మతో అనుబంధాన్ని పెంచుకోవటం కోసమే శిశువు తనకు తెలిసిన మొదటి విద్యను ఇలా ప్రదర్శిస్తుంటారు. (ఈనాడు7.11.2009). భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యాన్ని పరిపాలించిన బలవంతులైన చక్రవర్తుల్లో ఆఖరివాడైన ఔరంగజేబు విద్యాబోధన గురించి తన పెద్దవయసులో గురువుకు వ్రాసిన ఉత్తరంలో పలు వ్యాఖ్యలు చేశారు. మాతృభాషలో కాక తనకు విదేశీ భాష అయిన పర్షియాను మాధ్యమంగా స్వీకరించి విద్య నేర్పడం వల్ల తాను ముందుగా తెలియని భాష నేర్చుకునేందుకు కొన్ని సంవత్సరాలు, ఆపైన విద్యను అభ్యసించేందుకు మిగిలిన సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడాల్సివచ్చిందని గుర్తుచేసుకున్నారు. మాతృభాషలోనో, దేశభాషలోనో విద్యాబోధన చేస్తే పిల్లలు మరింత తేలికగా నేర్చుకుని, మనోవికాసం కూడా బాగా జరుగుతుందని ఔరంగజేబు వ్రాశారు.[3]

ఇవీ చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

 1. Bloomfield, Leonard. The Native Speaker: Myth and Reality By Alan Davies ISBN 1-85359-622-1 మూస:Pn
 2. "mother tongue". 2001 census. Archived from the original on 2008-09-16. Retrieved 2008-08-25. [unreliable source?]
 3. లక్ష్మణరావు, కొమర్రాజు (1910). "ఔరంగజేబు తన గురువునకు వ్రాసిన యుత్తరము". ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచిక: 57. Retrieved 6 March 2015.

<మూలాలు/>

"https://te.wikipedia.org/w/index.php?title=మాతృభాష&oldid=4073352" నుండి వెలికితీశారు