శ్రీకాకుళం జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్రీకాకుళం జిల్లా
శ్రీకాకుళం జిల్లా సమగ్ర చిత్రాన్ని రూపొందించే ప్రక్రియ
శ్రీకాకుళం జిల్లా సమగ్ర చిత్రాన్ని రూపొందించే ప్రక్రియ
Srikakulam in Andhra Pradesh (India).svg
నిర్దేశాంకాలు: 18°18′N 83°54′E / 18.3°N 83.9°E / 18.3; 83.9Coordinates: 18°18′N 83°54′E / 18.3°N 83.9°E / 18.3; 83.9
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
ప్రాంతంకోస్తా
ప్రధాన కార్యాలయంశ్రీకాకుళం
విస్తీర్ణం
 • మొత్తం5,837 కి.మీ2 (2,254 చ. మై)
జనాభా వివరాలు
(2011)
 • మొత్తం26,99,471
 • సాంద్రత462/కి.మీ2 (1,200/చ. మై.)
భాషలు
 • అధికారతెలుగు
కాలమానంUTC+5:30 (IST)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 0( )
అక్షరాస్యత55.9 (2001)
పురుషులు అక్షరాస్యత67.9
స్రీల అక్షరాస్యత44.19
లోకసభ నియోజకవర్గంశ్రీకాకుళం లోకసభ నియోజకవర్గం
జాలస్థలిhttps://srikakulam.ap.gov.in/te/

శ్రీకాకుళం జిల్లా, భారతదేశం లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈశాన్య సరిహద్దులో ఉంది. జిల్లా ముఖ్యపట్టణం శ్రీకాకుళం. (అక్షా: 18' ఉ, రేఖా: 54' తూ)ఇది నాగావళి నది ఒడ్డున ఉంది. 2022 లో జిల్లా పునర్వ్యవస్థీకరణలో భాగంగా, కొన్ని ప్రాంతాలను పార్వతీపురం మన్యం జిల్లాలో చేర్చారు.


జిల్లా పేరు వెనుక చరిత్ర[మార్చు]

మందస వాసుదేవ ఆలయం

బ్రిటిషు వారు శ్రీకాకుళం పేరును పలకలేక "చికాకోల్" అనేవారు. చికాకోల్ కు సంబంధించిన మరో కథనం ఇలాఉంది: ఈ ప్రాంతం నైజాం ఆధిపత్యంలో ఉండే సమయంలో ఈ ఊళ్లోనే ప్రతి సంవత్సరం జమాబందీ నిర్వహిస్తూ రైతుల వద్ద నుండి పన్నులు వసూలు చేసేవారు. రైతులు తాము కట్ట వలసిన పన్ను సొమ్మును విచ్చు రూపాయల రూపంలో చిన్నచిన్న గుడ్డసంచులలో పోసి, మూటకట్టి, ఆమూటను తీసికొనివచ్చి ఖుద్దున సమర్పించేవారు. ఆ మూట లోని సొమ్ము సరిగా ఉందో లేదో చూసుకోవడానికి మూటను విప్పాలి. ఆ మూటలు చాలా ఉంటున్నందువలన, ఆ మూటల మూతికట్టు విప్పమని రైతులతో చెప్పడానికి "శిఖా ఖోల్" అనేవారు. అంటే "మూతికట్టువిప్పు" అని అర్థం. ఈమాట క్రమంగా "చికా కోల్" అయి, శ్రీకాకుళంగా స్థిరపడిందిఅని అంటారు.

జిల్లా చరిత్ర[మార్చు]

శ్రీముఖలింగం ఆలయం

ఒకప్పుడు ఇది బౌద్ధమతానికి ముఖ్యస్థానంగా వర్ధిల్లింది. శాలిహుండం, దంతపురి, జగతిమెట్ వంటి బౌద్ధారామాలు ఇక్కడ కనుగొన్నారు. తరువాత ఇది కళింగ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. గాంగేయులు ఈ ప్రాంతాన్ని 6 నుండి 14వ శతాబ్దం వరకు, 800 సంవత్సరాలు పాలించారు. వజ్రహస్తుడు కాలంలో ప్రసిద్ధి చెందిన శ్రీ ముఖలింగం ఆలయాన్ని నిర్మించాడు. మహమ్మదీయుల పాలన కాలంలో షేర్ మహమ్మద్ ఖాన్ శ్రీకాకుళంలో జామియా మసీదు నిర్మించాడు.

విశాఖపట్నం జిల్లాలో భాగంగా ఉండే ఈ జిల్లా 1950 ఆగష్టు 15న ప్రత్యేక జిల్లాగా అవతరించింది. 1969లో ఈ జిల్లానుండి సాలూరు తాలూకాలోని 63 గ్రామాలు, బొబ్బిలి తాలూకాలోని 44 గ్రామాలను విశాఖపట్నం జిల్లాలో కొత్తగా ఏర్పరచిన గజపతి నగరం తాలూకాకు బదలాయించారు. మళ్ళీ 1979 మే లో కొత్తగా విజయనగరం జిల్లాను ఏర్పరచినపుడు సాలూరు, బొబ్బిలి, పార్వతీపురం, చీపురుపల్లి తాలూకాలను కొత్తజిల్లాలో విభాగాలుగా చేశారు.ఆంధ్రప్రదేశ్ లో నక్సలైటు (మావోయిస్టు పార్టీ) ఉద్యమం శ్రీకాకుళం జిల్లాలోనే ప్రారంభమయింది .

నైసర్గిక స్వరూపం[మార్చు]

శ్రీకాకుళం జిల్లా మొత్తం వైశాల్యం 5837 చ.కి.మీ. జిల్లాకు 193 కి.మీ. సముద్ర తీరం ఉంది. తూర్పు కనుమలు ఈశాన్యం నుండి కొంతభాగం విస్తరించి ఉన్నాయి.

నదులు

నాగావళి, వంశధార, మహేంద్ర తనయ, చంపావతి, బహుదా, కుంభికోటగడ్ ఇవి జిల్లాలలో ముఖ్యమైన నదులు. ఇవి తూర్పు కనుమలలో పుట్టి బంగాళాఖాతంలో కలుస్తున్నాయి.

వాతావరణం

సంవత్సరంలో ఎక్కువకాలం వాతావరణం తేమగా ఉంటుంది. నైఋతి ఋతుపవనాలు జూన్ నుండి సెప్టెంబరు వరకు, ఈశాన్య ఋతుపవనాలు అక్టోబరు - నవంబరు మాసాలలోను వర్షాలు కురిపిస్తాయి. డిసెంబరు నుండి ఫిబ్రవరి వరకు పొడిగాను, చల్లగాను ఉంటుంది. సంవత్సరం సగటు వర్షపాతం 1162 మి.మీ. (2004-2005 సం.లో వర్షపాతం 937.6 మి.మీ.)

వన్య సంపద

జిల్లాలోని అడవుల సాంద్రత, వృక్ష జాతులు ప్రాంతాన్ని బట్టి వైవిధ్యం కలిగి ఉన్నాయి. ప్రధానంగా ఇక్కడి అడవులను రెండు రకాలుగా చెప్పవచ్చును.

 1. దక్షిణ భారత తేమ ఆకురాల్చే అడవులు - మిశ్రమ అడవులు, మద్ది అడవులు, పర్వత సవాన్నా భూములు.
 2. దక్షిణ భారత సతత హరిత అడవులు
జంతు సంపద

శ్రీకాకుళం జిల్లాలో అటవీ మృగాలు అల్పంగా ఉన్నాయి. జనావాసాల విస్తరణ, అడవుల నాశనం ఇందుకు కారణాలు కావచ్చును. మాంసాహార మృగాలలో పులి దాదాపు అంతరించింది. చిరుత పులి, హైనా (దుమ్ములగొండి), తోడేలు వంటి జంతువులు అరుదుగా అడవుల్లో కనిపిస్తుంటాయి. గుంటనక్క, అడవిపిల్లులు, కుక్కలు జిల్లాలో కనిపించే ఇతర మాంసాహార జంతువులు. శాకాహార జంతువులలో ఎక్కువుగా మచ్చల దుప్పి (చితాల్), అడవి గొర్రెలు, ఎలుగుబంట్లు సాధారణంగా కనిపిస్తాయి. ఈ ప్రాంతంలో కృష్ణజింక, నీలగాయ్, బైసన్లు అసలు కనిపించకపోవడం గమనార్హం. పక్షి జాతులలో - నెమళ్ళు, కౌజులు, పావురాలు, చిలకలు, మైనా కౌజుపిట్టలు, బాతులు, పావురాలు వంటివి అధికంగా ఉన్నాయి..

2022 జిల్లాల పునర్వ్యవస్థీకరణ ముందు, తరువాత జిల్లా స్థితి[మార్చు]

భౌగోళిక స్వరూపం[మార్చు]

సరిహద్దులు, వైశాల్యం[మార్చు]

2022 జిల్లాల పునర్వ్యవస్థీకరణ ముందు ఉత్తరాన ఒడిశా రాష్ట్రం, దక్షిణ-పశ్చిమాల్లో విజయనగరం జిల్లా, ఒడిశా గజపతి జిల్లా, తూర్పున బంగాళాఖాతం ఉన్నాయి. జిల్లాకు కొంత భాగం హద్దులుగా కందివలస గెడ్, వంశధార, బహుదా నదులు ప్రవహిస్తున్నాయి. మొత్తం జిల్లా వైశాల్యం 5837 చ.కి.మీ.పునర్వ్యవస్థీకరణ తరువాత మొత్తం జిల్లా వైశాల్యం 4,591 చ.కి.మీ.

పాలనా విభాగాలు[మార్చు]

జిల్లా కీలక అధికారులు[మార్చు]

2022 జిల్లాల పునర్వ్యవస్థీకరణ ముందు ఈ జిల్లా కలెక్టర్‌గా కేశ్‌ బాలాజీరావు, ఐ.ఏ.ఎస్., సూపరింటెండెంట్ అఫ్ పోలీస్‌గా జి ఆర్ రాధిక, ఐ. పి. యస్. కొనసాగుచున్నారు.[1] పునర్వ్యవస్థీకరణ తరువాత మొదటి కీలక అధికారులుగా తిరిగి జిల్లా కలెక్టర్‌గా కేశ్‌ బాలాజీరావు, ఐ.ఏ.ఎస్., సూపరింటెండెంట్ అఫ్ పోలీస్‌గా జి ఆర్ రాధిక, ఐ. పి. యస్. కొనసాగుచున్నారు.[2]

రెవెన్యూ డివిజన్లు[మార్చు]

శ్రీకాకుళం జిల్లా రెవెన్యూ డివిజన్లు వివరాలు తెలుపు పటం

2022 జిల్లాల పునర్వ్యవస్థీకరణ ముందు జిల్లా శ్రీకాకుళం రెవెన్యూ డివిజను, టెక్కలి రెవెన్యూ డివిజను, పాలకొండ రెవెన్యూ డివిజను అనే మూడు రెవెన్యూ డివిజన్లుగా విభజింపబడింది, పునర్వ్యవస్థీకరణ తరువాత ఈ జిల్లా 3 రెవెన్యూ డివిజన్లుతో ఏర్పడింది.అందులో శ్రీకాకుళం రెవెన్యూ డివిజను, టెక్కలి రెవెన్యూ డివిజన్లు గతంలో ఉన్నవి కాగా, ఒకటి పలాస రెవెన్యూ డివిజను జిల్లాలో కొత్తగా ఏర్పడింది. .[3]

మండలాలు[మార్చు]

2022 జిల్లాల పునర్వ్యవస్థీకరణ ముందు జిల్లా మొత్తం 38 మండలాలుగా విభజింపబడింది.[4]

శ్రీకాకుళం జిల్లా మండలాల పటం (Overpass-turbo)


పునర్వ్యవస్థీకరణ తరువాత ఈ జిల్లాలో గతంలో ఉన్న 36 మండలాలనుండి కొత్తగా ఏర్పడిన పార్వతీపురం మన్యం జిల్లాలో 4 మండలాలు,[5] విజయనగరం జిల్లాలో 4 మండలాలు విలీనమయ్యాయి.[6]మిగిలిన 30 జిల్లాలతో శ్రీకాకుళం జిల్లా ఏర్పడింది.[7]

శ్రీకాకుళం జిల్లా లోని మండలాలు[మార్చు]

పార్వతీపురం మన్యం జిల్లాలో చేరిన మండలాలు[మార్చు]

విజయనగరం జిల్లాలో చేరిన మండలాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

2022 జిల్లాల పునర్వ్యవస్థీకరణ ముందు జిల్లాలో మొత్తం 38 మండలాలలో, 1865 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. [8] పునర్వ్యవస్థీకరణ తరువాత 30 మండలాలతో 1468 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి

జిల్లాలో పట్టణ ప్రాంతాలు[మార్చు]

2022 జిల్లాల పునర్వ్యవస్థీకరణ ముందు 7 పట్టణ ప్రాంతాలు ఉన్నాయి.వాటిలో ఒకటి కొత్తగా ఏర్పడిన పాార్వతీపురంమన్యం జిల్లాలో పాలకొండ చేరగా, రెండవది రాజాం పట్టణం విజయనగరం జిల్లాలో చేరింది. పునర్వ్యవస్థీకరణ తరువాత జిల్లాలో మిగిలిన 5 పట్టణ ప్రాంతాలు ఉన్నాయి. అందులో నాలుగు మునిసిపాలిటీలు, ఒకటి నోటిఫైడ్ పంచాయితీ (జనగణన పట్టణం) ఉన్నాయి.

 1. శ్రీకాకుళం మున్సిపాలిటీ (టౌను) - 1,17,320
 2. ఆముదాలవలస - 37,931
 3. ఇచ్చాపురం - 32,662
 4. పలాస (పలాస-కాశిబుగ్గ) - 49,899
 5. సోంపేట - 17,423 (జనగణన పట్టణం)

నియోజక వర్గాలు[మార్చు]

లోక్‌సభ స్థానాలు[మార్చు]

2022 జిల్లాల పునర్వ్యవస్థీకరణలో ముందు ఈ శ్రీకాకుళం లోకసభ నియోజకవర్గంలో పార్వతీపురం, విజయనగరం జిల్లాలలో కొంత భాగం (పాక్షికంగా) కలిసి ఉంది. పునర్వ్యవస్థీకరణ తరువాత శ్రీకాకుళం జిల్లాపరిధిలో, శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గం అంతా ఇమిడి ఉంది.

శాసనసభస్థానాలు[మార్చు]

Srikakulam-Voters.jpg
SrikakulamAssemblySegments.jpg

2022 జిల్లాల పునర్వ్యవస్థీకరణ ముందు జిల్లాలో మొత్తం 10 శాసనసభా స్థానాలు ఉన్నాయి.[9]నియోజకవర్గాల పునర్విభజన ప్రకారం 2007 మే 31 న వెలువడిన నోటిఫికేషన్ ప్రకారం వాటిని 10 స్థానాలకు కుదించడం జరిగింది. వాటి వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.[10]

పునర్విభజన ప్రకారం శ్రీకాకుళం జిల్లా శాసనసభ స్థానాలు.
నియోజకవర్గం పేరు మండలాలు జనాభా ఎస్సీ ఎస్టీ
1.శ్రీకాకుళం శాసనసభ శ్రీకాకుళం 187132 15136 772
గార 75017 4302 237
మొత్తం 262149 19438 1009
2.ఎచ్చెర్ల. రణస్థలం 77436 9025 131
లావేరు 67334 8795 459
ఎచ్చెర్ల 82051 7529 372
గి.సిగడాం 55087 6656 450
మొత్తం 281908 32005 1412
3.రాజాం. రాజాం 81693 9497 1041
సంతకవిటి 66893 7052 132
అర్.ఆమదాలవలస 68422 7673 578
వంగర 47879 7081 1248
మొత్తం 264867 31303 2998
4.ఆమదాలవలస ఆమదాలవలస 83945 6555 226
సరుబుజ్జిలి 32630 3643 801
బూర్జ 42852 5866 1288
పొందూరు 73175 6345 271
మొత్తం 231602 22509 2586
5.నరసన్నపేట నరసన్నపేట 74284 5029 242
పోలాకి 65734 293 163
జలుమూరు 60200 4455 391
సారవకోట 48793 5129 6148
మొత్తం 249011 14906 6944
6.పాలకొండ పాలకొండ 73592 10637 2997
సీతంపేట 52282 1879 45741
భామిని 41058 7495 8178
వీరఘట్టం 63882 12196 4224
మొత్తం 230814 32207 61140
7.పాతపట్నం పాతపట్నం 58381 6604 10603
మెళియాపుట్టి 50490 3511 13435
కొత్తూరు 60876 8809 7823
ఎల్.ఎన్.పేట 27141 2672 607
మొత్తం 248092 27937 36830
8.టెక్కలి టెక్కలి 70872 7713 3596
నందిగాం 53192 6050 2842
సంతబొమ్మాలి 64845 3821 764
కోటబొమ్మాలి 69906 6207 6944
మొత్తం 258815 14906 6944
9.పలాస పలాస 87850 6694 3208
మందస 76402 4747 10087
వి.కొత్తూరు 69398 1197 154
మొత్తం 233650 12638 13469
10.ఇచ్ఛాపురం ఇచ్చాపురం 76747 2450 1304
కంచిలి 59847 2697 7597
కవిటి 70947 1214 6636
సోంపేట 74138 3634 1063
మొత్తం 281679 9995 16600

పునర్వ్యవస్థీకరణ తరువాత శ్రీకాకుళం జిల్లా ఎనిమిది శాసనసభ నియోజకవర్గాలతో ఏర్పడింది.[11]అవి ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, ఎచ్చెర్ల, శ్రీకాకుళం, ఆమదాలవలస, పాతపట్నం, నరసన్నపేట. పునర్వ్యవస్థీకరణ ముందు ఉన్న పాలకొండ పార్వతీపురం మన్యం జిల్లాలో చేరగా, రాజాం శాసనసభ నియోజకవర్గం విజయనగరం జిల్లాలో చేరింది.[12]

ఆర్ధిక స్థితి గతులు[మార్చు]

వ్యవసాయం[మార్చు]

జిల్లాలో ముఖ్య పంటలు- వరి, రాగులు, పెసలు, మినుములు, ఉలవలు, చెరకు, జనుం, వేరుశనగ, నువ్వులు, మిరప, పసుపు, నీరుల్లి.

నీటివనరులు[మార్చు]

శ్రీకాకుళం జిల్లాలో బాహుద, ఉత్తర మహేంద్ర, తనయ, బెంజిగడ్డ, వరహాలు గడ్డ, వంశధార, నాగావళి, పెద్దగడ్డ, కందివలస అనే 9 నదులు ఉన్నాయి. వీటిలో నాగావళి, వంశధార, మహేంద్ర తనయ ముఖ్యమైన నదులు. జిల్లాలో ఈశాన్య ఋతుపవనాల ద్వారా 26.47%, నైఋతి ఋతుపవనాల ద్వారా 62.61% వర్షాలు లభిస్తాయి. మూడు ముఖ్య నదుల ద్వారా జరుగుతున్న నీటి వినియోగం: నాగావళి 371 మి.క్యూ.మీ. (మిలియన్ క్యూబిక్ మీటర్లు) (36%), వంశధార 121 మి.క్యూ.మీ. (12%), మహేంద్ర తనయ 81 మి.క్యూ.మీ. (8%), చిన్న చెరువులు 140 మి.క్యూ.మీ. (14%), భూగర్భ జలాలు 300 మి.క్యూ.మీ. (30%). మొత్తం 1,013 మి.క్యూ.మీ. రాష్ట్రంలో రెండు ప్రధాన జలాశయాలు సుమారు 140 మి.క్యూ.మీ. నీటిని వ్యవసాయ నిమిత్తం సమకూరుస్తున్నాయి. అవకాశం ఉన్న నీటిలో 91% (5,763 మి.క్యూ.మీ.) బంగాళాఖాతంలోకి వృధాగా పోతున్నదని అంచనా. 9% నీరు మాత్రమే భూగర్భంలోకి ఇంకుతుంది.

జిల్లాలో 3.3 లక్షల (0.33 మిలియన్) హెక్టేరులు భూమి సాగులో ఉంది. అందులో 1.9 లక్షల హెక్టేరులకు సాగునీటి వసతి ఉంది. కాలువల ద్వారా 91,946 హెక్టేరులు, చెరువుల ద్వారా 80,123 హెక్టేరులు, బోరు బావుల ద్వారా 6,923 హెక్టేరులు, ఇతర బావుల ద్వారా 8,866 హెక్టేరులు, ఇతర వనరుల ద్వారా 5,316 హెక్టేరులు భూమికి సాగునీరు లభిస్తుంది.

అనిశ్చితమైన వర్షపాతం జిల్లాలో ప్రధాన సమస్య. చాలా సంవత్సరాలు అనావృష్టి సంవత్సరాలుగా పరిగణింపబడుతున్నాయి. అలాగే త్రాగు నీటి సమస్య కూడా తీవ్రంగానే ఉంది. ఫ్లోరోసిస్ సమస్య కూడా కొన్నిచోట్ల ఉంది. నీటి వనరులను పరిరక్షించే విధానాలు లేకపోవడం, ఏజెన్సీ ప్రాంతంలోని "పోడు" వ్యవసాయం ఇందుకు ముఖ్యమైన కారణాలు. జిల్లాలో ఎక్కువ భాగం నేల ఉపరితలం గట్టిగా ఉన్నందున నీరు ఇంకే అవకాశం తక్కువ. అందుకు తోడు అధిక భూభాగం వాలుగా ఉన్నది గనుక నీరు నిలవదు. వరి, చెరకు పంటలకు ఎక్కువ నీటిని వాడుతారు.

జిల్లాలో ముఖ్యమైన ప్రాజెక్టులు: నారాయణపురం డాం (మద్దివలస రిజర్వాయిర్, నాగావళి), గొట్టా బారేజి (వంశధార), కళింగాంధ్ర ప్రాజెక్టు (మహేంద్ర తనయ) మచిలేశం, కళింగపట్నం, నువ్వలరేవు, భావనపాడు, బారువలు ముఖ్యమైన మత్స్య పరిశ్రమ కేంద్రాలు.

పరిశ్రమలు[మార్చు]

జిల్లాలో ముఖ్యపరిశ్రమలు: చక్కెర, నూనె, జీడిపప్పు, జనపనార, పేపర మిల్లు కర్మాగారాలు ఉన్నాయి. మాంగనీసు, గ్రాఫైటు, సున్నపు రాయి, మైకా, గ్రానైట్, జిల్లా తీరప్రాంతంలోని ఇసుకలో మోనజైట్, ఇతర ఖనిజాలు సమృద్ధిగా దొరుకుతాయి. పైడిభీమవరం, రాజాం, మడపాం, ఆమదాలవలస, సంకిలి పట్టణాలలో పరిశ్రమలు విస్తరిస్తున్నాయి.

రవాణా వ్వవస్థ[మార్చు]

రోడ్డు మార్గాల ద్వారా వివిధ ప్రాంతాలకు చక్కగా కలపబడి ఉంది. విశాఖపట్నం, దగ్గరలోని విమానాశ్రయం.ఇది రెవెన్యూ డివిజనుకు కేంద్రస్థానమైనా రైలుస్టేషను లేదు.10 కి.మీ.లోని శ్రీకాకుళం రోడ్ స్టేషనుకు వెళ్ళాలి. ఎ.పి.ఎస్.ఆర్.టి.సి ప్రభుత్వ సంస్ధ ద్వారా జిల్లా కేంద్రం నుండి ఇతర మండల, జిల్లా. రాష్ట్రాలకు వివిధ సర్వీసులు ద్వారా ప్రయాణ సౌకర్యాలు వసతులు ఉన్నాయి

జనాభా గణాంకాలు[మార్చు]

జిల్లా జనాభా

2011 భారత జనభా లెక్కలు ప్రకారం 2,703,114, అందులో పురుషులు 1,341,738 కాగా, మహిళలు 1,361,376. 2001 జనాభా లెక్కల ప్రకారం, శ్రీకాకుళం జనాభా 2,537,593, అందులో పురుషులు 1,260,020, స్త్రీలు 1,277,573. 2001 జనాభాతో పోలిస్తే జనాభాలో 6.52 శాతం మార్పు ఉంది. భారతదేశం మునుపటి 2001 జనాభా లెక్కల ప్రకారం, శ్రీకాకుళం జిల్లా 1991తో పోల్చితే దాని జనాభాలో 9.33 శాతం పెరిగింది.[13]

ప్రధాన వివరాలు

(2011 జనాభా లెక్కల ప్రకారం)

 • 2001-2011 దశకంలో జనాభా వృద్ధి రేటు: 6.52% (మొత్తం రాష్ట్రం వృద్ధి రేటు 14.44%)
 • జనసాంద్రత: చ.కి.మీ.కు 463 మంది (రాష్ట్రం జనసాంద్రత 308)
 • అక్షరాస్యులు మగవారిలో 8,57,824 (71.61%), ఆడువారిలో 6,37,557 (52.08%)
 • పట్టణ ప్రాంతాల జనాభా 4,36,703 లేదా 16.16% (రాష్ట్రం మొత్తంలో పట్టణ జనాభా 27.35%)
 • శ్రామికులు: 48.6% (ఇందులో 78% వ్యవసాయం, 15% సేవల రంగం)
శ్రీకాకుళం జిల్లా జనాభా - 2011 జనాభా లెక్కలు ప్రకారం[14]
కేటగిరీ మగ ఆడ మొత్తం %మగ %ఆడ
అందరు 13,41,738 13,61,376 27,03,114 49.64% 50.36%
ఎస్సీ 113730 115879 229609 9.02% 9.07%
ఎస్టీ 75284 75965 151249 5.97% 5.94%
మైనారిటీస్ 21706 23641 44223 1.73% 1.88%

సంస్కృతి[మార్చు]

ప్రధాన భాష తెలుగు. అయితే, ఒడిశా రాష్ట్రానికి సరిహద్దు కావడంచేత ఒడియా భాషను కొంతమంది అర్థం చేసుకోగలరు, మాట్లాడగలరు. శ్రీకాకుళం జిల్లా ప్రధానంగా వ్యవసాయాధారిత ప్రాంతం. ఇటీవలి కాలంలో జరుగుతున్న పారిశ్రామిక, విద్యారంగాల్లో అభివృద్ధి కారణంగా శ్రీకాకుళం పట్టణం వేగంగా అభివృద్ధి చెందింది. కానీ మౌలిక సదుపాయాల విషయంలో ఆటంకాలను ఎదుర్కొంటోంది. ఈ ఊరిని పేదవాని స్వర్గం అని చమత్కరిస్తారు (వేసవికాలంలో చల్లగా ఉండే ప్రదేశం కావడం వలన).

విద్యాసంస్థలు[మార్చు]

 • అంబేద్కర్ విశ్వవిద్యాలయం - ఎచ్చెర్ల
 • రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ శ్రీకాకుళం (రిమ్స్)
 • ఐఐటి ఎచ్చెర్ల వద్ద ఉంది. జి.యు.ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రైవేట్ (రాజాం)
 • రాజీవ్ గాంధీ వైజ్ఞానిక విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం
 • గ్రేట్ ఈస్టర్న్ మెడికల్ స్కూల్, శ్రీకాకుళం

పర్యాటకం[మార్చు]

కళింగపట్నం బీచ్ వద్ద దీపస్తంభం
శాలిహుండం బౌద్ధారామ అవశేషాలు
అరసవిల్లి ఆలయం
శ్రీకూర్మం ఆలయం

శ్రీకాకుళం పట్నం, జిల్లాలోని పలు ప్రాంతాలు పచ్చికబయల్లు, అడవులు, సశ్యస్యామలమైన పంట పొలాలతో ఎప్పుడూ చల్లగా ఉంటుంది.వేసవి కాలంలో ఊటీని పోలి ఉంటుంది. ఈ జిల్లాలో వర్షపాతం ఎక్కువగా ఉంటుంది. కాస్టాఫ్ లివింగ్ చాలా తక్కువ. అందుకే దీనిని పేదవాని స్వర్గమని పిలుస్తారు. జిల్లాలోని పర్యాటక ప్రదేశాలన్నీ కలిపి 2017లో రెండు కోట్లమంది పైచిలుకు, 2016లో కోటీ అరవైలక్షల పైచిలుకు పర్యాటకులు సందర్శించారని ప్రభుత్వ అంచనా.[15] పర్యాటకుల సంఖ్య విషయంలో 2017లో శ్రీకాకుళం జిల్లా రాష్ట్రంలో చిత్తూరు జిల్లా తర్వాత రెండవ స్థానం పొందింది.

వాతావరణం

సంవత్సరంలో ఎక్కువకాలం వాతావరణం తేమగా ఉంటుంది. నైఋతి ఋతుపవనాలు జూన్ నుండి సెప్టెంబరు వరకు, ఈశాన్య ఋతుపవనాలు అక్టోబరు - నవంబరు మాసాలలోను వర్షాలు కురిపిస్తాయి. డిసెంబరు నుండి ఫిబ్రవరి వరకు పొడిగాను, చల్లగాను ఉంటుంది. సంవత్సరం సగటు వర్షపాతం 1162 మి.మీ. (2004-2005 సంవత్సరంలో వర్షపాతం 937.6 మి.మీ.) జిల్లాలోని అడవుల సాంద్రత, వృక్ష జాతులు ప్రాంతాన్ని బట్టి వైవిధ్యం కలిగి ఉన్నాయి. ప్రధానంగా ఇక్కడి అడవులను రెండు రకాలుగా చెప్పవచ్చును.

సస్య సంపద

తేమతో కూడిన ఆకురాల్చే అడవులు - మిశ్రమ అడవులు, మద్ది అడవులు, పర్వత సవాన్నా భూములు. దక్షిణ భారత సతత హరిత అడవులు.అందుకే దీనిని పేదవాని స్వర్గం అని పిలుస్తారు.[16]

శ్రీకాకుళం పట్టణానికి చేరువలో అనేక ధార్మిక, విహార యాత్రా స్థలాలు ఉన్నాయి. వీటిలో కొన్ని ఇక్కడ ఇవ్వబడ్డాయు.

శ్రీకాకుళం

జిల్లా కేంద్రమైన ఈ పట్టణం నాగావళి నది ఒడ్డున ఉంది. 13 కిలోమీటర్ల దూరంలో ఆమదాలవలస రైల్వేస్టేషను ఉంది. కోటేశ్వరస్వామి ఆలయము (గుడివీధి), సంతోషిమాత ఆలయం (పాతశ్రీకాకుళం), వెంకటేశ్వరఆలయం (గుజరాతీపేట), కోదండ రామస్వామి ఆలయం, జమియా మసీదు ముఖ్యమైన ప్రార్థనా స్థలాలు.

అరసవిల్లి

సూర్య దేవాలయానికి ప్రసిద్ధి చెందిన అరసవిల్లి శ్రీకాకుళం పట్టణానికి 2 కి.మీ.లోనే ఉంది. దేశంలో ఉన్న కొద్ది సూర్య మందిరాలలో ఇది ఒకటి. ఇక్కడ ఆదిత్య, అంబిక, విష్ణు, గణేష, మహేశ్వర మూర్తులు ఉన్నాయి.

శ్రీకూర్మం

శ్రీకాకుళం పట్టణానికి 15 కి.మీ. దూరంలో ఉన్న శ్రీకూర్మం దేశంలో బహుశా ఒకే ఒక కూర్మావతార మందిరం. విశిష్టమైన శిల్పకళ కలిగిన ఈ మందిరంలో లభించిన శాసనాలు చారిత్రికంగా కూడా ఎంతో ముఖ్యమైనవి. ఇక్కడ డోలోత్సవం ప్రధాన ఉత్సవం.

శాలిహుండం

ఇది శ్రీకాకుళం పట్టణానికి 18 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడ పురావస్తుశాఖ త్రవ్వకాలలో పురాతన బౌద్ధారామాల శిథిలాలు బయటపడ్డాయి.

శ్రీముఖలింగం
కళింగపట్నం

జిల్లా కేంద్రానికి 25 కి.మీ. దూరంలో ఉన్న ఓడరేవు. చారిత్రకంగా సముద్ర వాణిజ్య కేంద్రం. వంశధార నది ఇక్కడ బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇక్కడ దర్గా షరీఫ్, షేక్ మదీనా అక్విలిన్ ఉన్నాయి. 23 కిలోమీటర్లవరకు కనుపించే ఒక దీప స్తంభం ఉఉంది.

కవిటి

సోంపేట, ఇచ్ఛాపురాల మధ్య ఉన్న కవిటిని 'ఉద్దానం' (ఉద్యానవనం) అని కూడా అంటారు. కొబ్బరి, జీడిమామిడి, పనస వంటి తోటలతో ఇది రమణీయంగా ఉండే ప్రదేశం. శ్రీకాకుళానికి 130 కి.మీ. దూరం. ఇక్కడ చింతామణి అమ్మవారి, శ్రీ సీతారామ స్వామి ఆలయం ఉన్నాయి.

బారువ

ఇది శ్రీకాకుళం పట్టణానికి 109 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడ మహేంద్ర తనయ నది సముద్రంలో కలుస్తుంది, ఇక్కడ కోటిలింగేశ్వర స్వామి ఆలయం, జనార్దన స్వామి ఆలయం ఉన్నాయి. ఒకప్పుడు ఇది ముఖ్యమైన ఓడరేవు. ఇది కొబ్బరి తోటలకు, కొబ్బరి పీచు పరిశ్రమకు కేంద్రం.

తేలినీలాపురం

ఇది శ్రీకాకుళం పట్టణానికి 60 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడ ఒక సంరక్షిత పక్షి ఆవాస కేంద్రం. సైబీరియా నుండి శీతకాలంలో పెలికన్ పక్షులు ఇక్కడికి వలస వస్తాయి.

దంతపురి

ఇది శ్రీకాకుళం పట్టణానికి 22 కి.మీ. దూరంలో ఉంది. దీనిని బౌద్ధ జ్ఞానదంతపురి అని కూడా అంటారు. క్రీ.పూ.261లో అశోకుని కళింగ యుద్ధం తరువాత ఇది కళింగరాజులకు ప్రాంతీయ రాజధానిగా ఉంది. ఇక్కడ పురావస్తు శాఖవారి త్రవ్వకాలలో అనేక పురాతన వస్తువులు లభించాయి.

సంగం

శ్రీకాకుళానికి 56 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడ నాగావళి, వంశధార, సువర్ణముఖి నదులు కలుస్తున్నాయి. ఇక్కడ సంగమేశ్వర మందిరం ఐదు లింగక్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధం. మహాశివరాత్రికి ఇక్కడ పెద్ద ఉత్సవం జరుగుతుంది.

పొందూరు

ప్రఖ్యాతి గాంచిన పొందూరు ఖద్దరు తయారయ్యేది జిల్లాలోని పొందూరు లోనే. ఇది జిల్లా కేంద్రానికి 21 కి.మీ. దూరంలో ఉంది.

కొరసవాడ

ప్రఖ్యాతి గాంచిన మంచు తాతాయ్య చెనెత వస్త్రములు తయారయ్యేది జిల్లాలోని కొరసవాడ లోనే. ఇది శ్రీకాకుళానికి 55 కి.మీ. దూరంలో ఉంది.

మందస

సోంపేటకు 26 కి.మీ. దూరంలో ఉంది. మహేంద్రగిరి కొండ దుగువున ఉన్న ఈ వూరిలో 700 సంవత్సరాల పురాతన వాసుదేవ ఆలయం ఉంది. ఇక్కడి కోట దక్షిణ భారతదేశంలోనే ఎత్తైంగా చెప్పబడుతుంది.

క్రీడలు[మార్చు]

ఈ జిల్లాకు చెందిన ఎందరో మహానుభావులు ఆంధ్ర దేశం, తెలుగు భాష వికాసానికి అసమానమైన సేవ చేశారు. జిల్లాకు చెందిన కొందరు ప్రముఖులు

సాహితీవేత్తలు
కళాకారులు
క్రీడాకారులు
నాయకులు
 • రామలింగం మాష్టారు - స్వాతంత్ర్య సమర యోధులు
 • రొక్కం లక్ష్మీ నరసింహ దొర - శ్రీకాకుళం జిల్లా నుండి మొట్టమొదటి శాసనసభ స్పీకర్, రాజకీయ నాయకులు
 • వీర గున్నమ్మ - స్వాతంత్ర్య సమర యోధులు
 • జననాయక్. చౌదరి సత్యనారాయణ - స్వాతంత్ర్య సమర యోధులు, రాజకీయ నాయకులు, మానవ హక్కుల ఉద్యమ నాయకులు
 • సర్దార్ గౌతు లచ్చన్న - స్వాతంత్ర్య సమర యోధులు, రాజకీయ నాయకులు
 • త్రిపురాన రాఘవదాసు - స్వాతంత్ర్య సమర యోధులు, రాజకీయ నాయకులు
 • నంద కృష్ణమూర్తి - స్వాతంత్ర్య సమర యోధులు
 • తంగి సత్యనారాయణ - రాజకీయ నాయకులు
 • కిల్లి అప్పలనాయుడు - స్వాతంత్ర్య సమర యోధులు, రాజకీయ నాయకులు
 • దంతులూరి కృష్ణమూర్తి రాజు - స్వాతంత్ర్య సమర యోధులు
 • శిల్లా రాజుల రెడ్డి - స్వాతంత్ర్య సమర యోధులు

సంస్థానాలు[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

 1. "ఎవరెవరు | శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం | భారతదేశం". web.archive.org. 2022-04-08. Retrieved 2022-04-08.
 2. "పాత, కొత్త జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీల నియామకం... జగన్ సర్కార్ కీలక ఉత్తర్వులు". web.archive.org. 2022-04-08. Retrieved 2022-04-08.
 3. "New AP Map: Check Out Biggest and Smallest Districts in Andhra Pradesh". Sakshi Post. 2022-04-03. Retrieved 2022-04-07.
 4. పంచాయత్ రాజ్ మంత్రిత్వ శాఖ వెబ్‌సైటులో శ్రీకాకుళం జిల్లా తాలూకాల వివరాలు Archived 2007-09-27 at the Wayback Machine. జూలై 28, 2007న సేకరించారు.
 5. satya-kvs (2022-04-03), andhra_pradesh (PDF), retrieved 2022-04-08
 6. satya-kvs (2022-04-03), andhra_pradesh (PDF), retrieved 2022-04-08
 7. satya-kvs (2022-04-03), andhra_pradesh (PDF), retrieved 2022-04-08
 8. "రెవెన్యూ గ్రామాలు | శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం | భారతదేశం". web.archive.org. 2021-06-28. Retrieved 2022-04-08.
 9. https://www.smstoneta.com/sccode_full.php+
 10. "వార్త" దినపత్రిక శ్రీకాకుళం ఎడిషన్ -28 మే 2007
 11. "AP New Districts List In Telugu: Area And Population Of The New Districts In AP - Sakshi". web.archive.org. 2022-04-08. Retrieved 2022-04-08.
 12. "AP New Districts List In Telugu: Area And Population Of The New Districts In AP - Sakshi". web.archive.org. 2022-04-08. Retrieved 2022-04-08.
 13. "Srikakulam District Population Census 2011-2022, Andhra Pradesh literacy sex ratio and density". www.census2011.co.in. Retrieved 2022-04-07.
 14. "Srikakulam District Population Religion - Andhra Pradesh, Srikakulam Literacy, Sex Ratio - Census India". www.censusindia.co.in. Retrieved 2022-04-07.
 15. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ ఫుట్‌ఫాల్స్ సమాచారం (ఆర్కైవ్)
 16. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-02-01. Retrieved 2009-06-25.

బయటి లింకులు[మార్చు]