మహేంద్రతనయ

వికీపీడియా నుండి
(మహేంద్ర తనయ నుండి దారిమార్పు చెందింది)
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
మహేంద్రతనయ నది వొడ్డున గల మెళియాపుట్టి గ్రామములో వున్న శ్రీ వేణుగోపాలస్వామి వారి దేవాలయం

మహేంద్రతనయ నది, వంశధార నదికి ఉపనది. ఒడిషా రాష్ట్రపు గజపతి జిల్లాలోని తుపారసింగి గ్రామం వద్ద మహేంద్రగిరి కొండల్లో పుట్టి గజపతి, రాయగడ జిల్లాల గుండా ప్రవహించి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో అడుగుపెడుతుంది. 56 కిలోమీటర్ల పొడవున్న మహేంద్రతనయ 35 కిలోమీటర్లు ఒడిషాలో ప్ర్రవహించిన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అడుగుపెడుతుంది. ఆ తరువాత తిరిగి ఒడిషాలోకి వచ్చి రెండు రాష్ట్రాల సరిహద్దుతో దాగుడుమూతలాడుతుంది. అయినా ఐదింట నాలుగో వంతు నది గజపతి, రాయగడ జిల్లాలలోనే ప్రవహిస్తుంది. ఆంధ్ర ప్రదేశ్లో గొట్టా బ్యారేజికి సమీపంలోని గులుమూరు వద్ద వంశధార నదిలో కలుస్తుంది.

2008లో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి మహేంద్రతనయపై శ్రీకాకుళం జిల్లాలోని రేగులపాడు వద్ద నీటి పారుదల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశాడు. ఇది జల వినియోగ ఒప్పందం యొక్క ఉల్లంఘన అని ప్రతిగా ఒడిషా రాష్ట్ర ముఖ్యమంత్రి అదే సంవత్సరం గజపతి జిల్లాలో దంబాపూర్, చంపాపూర్ల వద్ద రెండు దారిమల్లింపు ఆనకట్టలు కట్టడానికి శంకుస్థాపన చేశాడు.[1]

మూలాలు[మార్చు]