కృష్ణా నది

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Coordinates: 15°57′N 80°59′E / 15.950°N 80.983°E / 15.950; 80.983
కృష్ణా
River
Soutěska řeky Kršny u Šríšajlamu.jpg
శ్రీశైలం వద్ద కృష్ణానది
ఇతర పేర్లు: కృష్ణమ్మ
దేశం భారతదేశం
రాష్ర్టాలు మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణా, ఆంధ్ర ప్రదేశ్
ఉపనదులు
 - ఎడమ భీమా నది, దిండి, పెద్దవాగు, హాలియా, మూసీ నది, పాలేరు, మున్నేరు
 - కుడి వెన్నా నది, కోయ్నా నది, పంచగంగ, దుద్ గంగ, ఘటప్రభ, ఘటప్రభ నది, తుంగనది, భద్రనది
Source మహాబలేశ్వరం
 - ఎత్తు 1,337 m (4,386 ft)
 - అక్షాంశరేఖాంశాలు 17°55′28″N 73°39′36″E / 17.92444°N 73.66000°E / 17.92444; 73.66000
Mouth బంగాళాఖాతం
 - location హంసలదీవి, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం
 - ఎత్తు 0 m (0 ft)
 - coordinates 15°57′N 80°59′E / 15.950°N 80.983°E / 15.950; 80.983 [1]
పొడవు 1,400 km (870 mi) approx.
పరివాహక ప్రాంతం 2,58,948 km2 (99,980 sq mi)
Discharge
 - సరాసరి 2,213 m3/s (78,151 cu ft/s) [2]
Discharge elsewhere (average)
 - విజయవాడ (1901–1979 సరాసరి),
max (2009), min (1997)
1,641.74 m3/s (57,978 cu ft/s)
భారతదేశ ముఖ్య నదులు
విజయవాడ వద్ద కృష్ణానది
మహబూబ్ నగర్ జిల్లాలో 7వ నెంబరు జాతీయ రహదారిపై కృష్ణానది

భారతదేశంలో మూడవ పెద్ద నది, దక్షిణ భారతదేశంలో రెండో పెద్ద నది అయిన కృష్ణా నదిని తెలుగు వారు ఆప్యాయంగా కృష్ణవేణి అని కూడా పిలుస్తారు. పడమటి కనులలో మహారాష్ట్ర లోని మహాబలేశ్వర్కు ఉత్తరంగా మహాదేవ్ పర్వత శ్రేణిలో సముద్ర మట్టానికి 1337 మీటర్ల ఎత్తున చిన్న ధారగా జన్మించిన కృష్ణానది ఆపై అనేక ఉపనదులను తనలో కలుపుకుంటూ మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్‌లలో సస్యశ్యామలం చేస్తూ మొత్తం 1, 400 కిలోమీటర్లు ప్రయాణం చేసి దివిసీమలోని హంసల దీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది.

ప్రయాణం[మార్చు]

కృష్ణానది సముద్రంలో కలిసే స్థలం - ఉపగ్రహ చిత్రం

ద్వీపకల్పం పడమర చివరిp నుండి తూర్పు చివరికి సాగే తన ప్రస్థానంలో కృష్ణ 29 ఉపనదులను తనలో కలుపుకుంటోంది. పుట్టిన మహాబలేశ్వర్ నుండి 135 కి.మీ.ల దూరంలో కొయినా నదిని తనలో కలుపుకుంటుంది. తరువాత వర్ణ, పంచగంగ, దూధ్‌గంగ లు కలుస్తాయి. మహారాష్ట్రలో నది 306 కిలోమీటర్లు ప్రవహించాక బెల్గాం జిల్లా ఐనాపూర్ గ్రామం వద్ద కర్ణాటక రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. కృష్ణా నది పడమటి కనుమలు దాటాక జన్మస్థానం నుండి దాదాపు 500 కి.మీ దూరంలో కర్ణాటకలోఘటప్రభ, మాలప్రభ నదులు కృష్ణలో కలుస్తాయి. తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించే ముందు, భీమ నది కలుస్తుంది. కర్ణాటకలో 482 కిలోమీటర్ల దూరం ప్రవహించి రాయచూర్ జిల్లా దేవర్‌సుగుర్ గ్రామం వద్ద ఆ రాష్ట్రానికి వీడ్కోలు పలుకి, మహబూబ్‌నగర్ జిల్లా తంగడి వద్ద తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశిస్తుంది. తరువాత ఆలంపూర్కు దగ్గరలో కృష్ణ యొక్క అతిపెద్ద ఉపనది తుంగభద్ర కలుస్తుంది. ఇదే ప్రాంతంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశిస్తుంది. తరువాత కొద్ది దూరంలోనే నది నల్లమల కొండల శ్రేణి లోని లోతైన లోయల లోకి ప్రవేశిస్తుంది. ఇక్కడే శ్రీశైలం, నాగార్జున సాగర్ ల వద్ద పెద్ద ఆనకట్టలు నిర్మించబడ్డాయి. ఇక్కడి నుండి చిన్న చిన్న ఉపనదులైన దిండి, మూసి , పాలేరు, మున్నేరు వంటివి కలుస్తాయి. విజయవాడ వద్ద బ్రిటిషు వారి కాలంలో నిర్మించబడ్డ ప్రకాశం బ్యారేజిని దాటి డెల్టా ప్రాంతంలో ప్రవేశిస్తుంది. విజయవాడ వద్ద ఈ నది 1188 మీటర్ల వెడల్పుతో విశ్వరూపాన్ని ప్రదర్శిస్తుంది. ఆ తరువాత దివిసీమ లోని హంసల దీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది.

ఉపనదులు అన్నిటితో కలిపిన కృష్ణా నదీ వ్యవస్థ యొక్క మొత్తం పరీవాహక ప్రాంతం 2, 56, 000 చ.కి.మీ. ఇందులో మూడు పరీవాహక రాష్ట్రాల వాటా ఇలా ఉంది:

ప్రకాశం బ్యారేజి పనోరమ

కృష్ణా నదీ తీరాన ఉన్న పుణ్యక్షేత్రాలు[మార్చు]

కృష్ణా నదికి భారత దేశంలోని ఇతర నదుల వలెనే పౌరాణిక ప్రశస్తి ఉంది. ఎన్నో పుణ్య క్షేత్రాలు నది పొడుగునా వెలిసాయి. వీటిలో ప్రముఖమైనవి:

సీతానగరం నుంచి ఉండవల్లి కరకట్ట మీదుగా వైకుంఠపురం వరకు కరకట్ట వెంబడి కృష్ణాతీరాన్ని ఆనుకుంటూ ఆధ్యాత్మిక కేంద్రాలు, ప్రకృతి ఆశ్రమాన్ని కూడా నెలకొల్పారు.సీతానగరంలో శ్రీ మద్వీరాంజనేయ సమేత కోదండరామస్వామి ఆలయం, 1982లో అయిదెకరాల విస్తీర్ణంలో శ్రీ జీయరుస్వామివారు ఆశ్రమాన్ని నెలకొల్పారు. 2001 ఫిబ్రవరి 6వ తేదీన రామకృష్ణమిషన్‌ను ఇక్కడే ఏర్పాటు చేశారు. శ్రీ జయదుర్గా తీర్థాన్ని 1986లో దత్తపీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ స్థాపించారు.ఇస్కాన్ మందిరంలో విదేశీ భక్తులు సైతం కృష్ణ భజనల్లో మునిగి తేలుతుంటారు. డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు ప్రకృతి వైద్యశాలను ఏర్పాటు చేశారు.తాళ్లాయపాలెం లోశ్రీ కోటిలింగ మహాశైవక్షేత్రాన్ని ఏడెకరాల విస్తీర్ణంలో విజయవాడకు చెందిన శ్రీ బ్రహ్మచారి శివస్వామి 2004లో నెలకొల్పారు. ఈ క్షేత్రంలో అనేక ఆలయాలు దర్శనమిస్తాయి. ఈ క్షేత్రంలో పాదరస స్పటిక లింగాలు వుండడం ఓ విశేషం.

ప్రాజెక్టులు[మార్చు]

ప్రధాన వ్యాసము: కృష్ణా నదీ వ్యవస్థలోని ప్రాజెక్టులు

కృష్ణా నది పరీవాహక రాష్ట్రాలు మూడూ కూడా విస్తృతంగా సాగునీటి, విద్యుత్ ప్రాజెక్టులు నిర్మించుకున్నాయి. వీటిలో ముఖ్యమైనవి:

కర్ణాటక[మార్చు]

పై రెంటినీ కలిపి అప్పర్ కృష్ణా ప్రాజెక్టు అని అంటారు.

తెలంగాణ[మార్చు]

ఇవిగాక, రెండు రాష్ట్రాల్లోనూ మరిన్ని భారీ, మధ్య తరహా ప్రాజెక్టులు వివిధ నిర్మాణా దశల్లో ఉన్నాయి.

ఆంధ్ర ప్రదేశ్[మార్చు]

బయటి లంకెలు[మార్చు]

వనరులు[మార్చు]

[3]

  1. మూస:GEOnet2
  2. Kumar, Rakesh; Singh, R.D.; Sharma, K.D. (2005-09-10). "Water Resources of India" (PDF). Current Science. Bangalore: Current Science Association. 89 (5): 794–811. Retrieved 2013-10-13. 
  3. కృష్ణా పుష్కరాలు, కృష్ణా పుష్కరాలు
"https://te.wikipedia.org/w/index.php?title=కృష్ణా_నది&oldid=2111194" నుండి వెలికితీశారు