చాళుక్యులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Guntupalli Buddist site 8.JPG
గుంటుపల్లి (కామవరపుకోట) వద్ద ఉన్న బౌద్ధ స్తూపాలు
ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర కాలరేఖ
చరిత్ర పూర్వ యుగము క్రీ.పూ.1500వరకు
పూర్వ యుగము క్రీ.పూ.1500-క్రీ.శ.650
మౌర్యులకు ముందు క్రీ.పూ.1500-క్రీ.శ.322
మౌర్యులు క్రీ.పూ.322 - క్రీ.పూ. 184
శాతవాహనులు క్రీ.పూ.200 - క్రీ.త.200
కళింగులు క్రీ.పూ.180? - క్రీ.త.400?
ఇక్ష్వాకులు 210 - 300
బృహత్పలాయనులు 300 - 350
ఆనందగోత్రికులు 295 - 620
శాలంకాయనులు 320 - 420
విష్ణుకుండినులు 375 - 555
పల్లవులు 400 - 550
పూర్వమధ్య యుగము 650 - 1320
మహాపల్లవులు
రేనాటి చోడులు
చాళుక్యులు
రాష్ట్రకూటులు
తూర్పు చాళుక్యులు 624 - 1076
పూర్వగాంగులు 498 - 894
చాళుక్య చోళులు 980 - 1076
కాకతీయులు 750 - 1323
అర్వాచీన గాంగులు
ఉత్తరమధ్య యుగము 1320 - 1565
ముసునూరి కమ్మ రాజులు 1220 - 1368
ఓఢ్ర గజపతులు 1513
రేచెర్ల పద్మనాయకులు 1368 - 1461
కొండవీటి రెడ్డి రాజులు 1324 - 1424
రాజమహేంద్రవరం రెడ్డి రాజులు 1395 - 1447
బహమనీ రాజ్యము
విజయనగర సామ్రాజ్యము 1336 - 1565
ఆధునిక యుగము 1540 – 1956
అరవీటి వంశము 1572 - 1680
పెమ్మసాని కమ్మ రాజులు 1352 - 1652
కుతుబ్ షాహీ యుగము 1518 - 1687
వాసిరెడ్డి కమ్మ రాజులు 1314 - 1816
నిజాము రాజ్యము 1742-1948
బ్రిటిషు రాజ్యము
స్వాతంత్ర్యోద్యమము 1800 - 1947
ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు 1912-1953
హైదరాబాదు రాష్ట్రం ఏర్పాటు 1948-1952
ఆంధ్ర ప్రదేశ్‌ అవతరణ 1953-1956
ఏకీకృత ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర 1956-2014
ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర 2014-
తెలుగు సాహిత్యం
నన్నయకు ముందు
నన్నయ యుగముశివకవి యుగము
తిక్కన యుగముఎఱ్ఱన యుగము
శ్రీనాథ యుగమురాయల యుగము
దాక్షిణాత్య యుగముక్షీణ యుగము
ఆధునిక యుగము21వ శతాబ్ది
చారిత్రక నగరాలు
పిఠాపురంభట్టిప్రోలువేంగిధాన్యకటకము
కొలనుపాకఓరుగల్లువిజయపురిరాజమహేంద్రవరం
కళింగపట్నంహంపిసింహపురిహైదరాబాదు
చారిత్రక వ్యక్తులు
గణపతిదేవుడురుద్రమదేవికృష్ణదేవరాయలు
శాలివాహనుడు

చాళుక్యులు దక్షిణభారత దేశాన్ని క్రీ.శ. 6- 12 శతాబ్ధాల మధ్య పరిపాలించిన రాజులు. ముఖ్యంగా వీరు భారత దేశంలోని కర్ణాటక ప్రాంతాన్ని పరిపాలించారు. క్రీ.శ. 2వ శతాబ్దమునాటి ఇక్ష్వాకుల శాసనములో "కండచిలికి రెమ్మనక" అనువాడు ఇక్ష్వాకుల సామంతుడని ఉంది. ఇక్ష్వాకుల పతనము తర్వాత పల్లవుల ధాటికి తాళలేక వీరు కర్ణాటప్రాంతానికి వెళ్ళారు. దుర్గా ప్రసాద్, అడ్లూరి గారి అభిప్రాయములను బట్టి చాళుక్యుల పూర్వీకులు ఆంధ్రులే[1][2]. రెండవ పులకేశి మారుటూరు శాసనములో 'చాళుక్య విషయము' ప్రసక్తి గలదు. ఈ చాళుక్య విషయము ప్రస్తుత రాయలసీమలోని కడప-కర్నూలు ప్రాంతము. కర్ణాట దేశమందలి బాదామినేలుతున్న కదంబులనోడించి చాళుక్యులు ఒక మహా సామ్రాజ్యము స్థాపించారు.

చాళుక్యులు ప్రధానంగా[3]

 1. బాదామి చాళుక్యులు
 2. తూర్పు చాళుక్యులు
 3. కళ్యాణి చాళుక్యులు
 4. ముదిగొండ చాళుక్యులు
 5. వేములవాడ చాళుక్యులు
 6. యలమంచిలి చాళుక్యులుగా పాలన కొనసాగించారు.

చాళుక్యులు తెలంగాణముగుండా తిరిగి ఆంధ్రదేశము ప్రవేశించి వేములవాడ చాళుక్యులు, తూర్పు చాళుక్యులు, ముదిగొండ చాళుక్యులు, చాళుక్య చోళులు మున్నగు శాఖలుగా పరిపాలన చేశారు.

చాళుక్యుల వంశవృక్షం[మార్చు]

జయసింహ[4]రణరాగమొదటి పులకేశి 
(క్రీ.శ. 535 - 566)
↓
↓———————————————————————————————————————————————↓
కీర్తివర్మన్ మంగవేశ
(క్రీ.శ. 566 - 597) (క్రీ.శ. 597 - 610)
↓
↓—————————————————————————————————————↓——————————————————————————————————↓
రెండవ పులకేశి కుబ్జా విష్ణువర్ధనుడు దారాశ్రయ జయసింహ
( క్రీ.శ. 610-6420) (తూర్పుచాళుక్య/ వేంగి శాఖ) 
↓ 
↓———————————————↓———————————————↓———————————————————↓————————————————————————————————↓
ఆదిత్య వర్మ చంద్రాదిత్య రెండవ రణరాగ మొదటి విక్రమాదిత్యుడు మూడవ జయసింహ 
(క్రీ.శ. 655- 681) (Lata Branch స్థాపకుడు ) 
↓
వినయాదిత్యుడు 
(క్రీ.శ. 681 - 696) 
↓
↓————————————————————————————————↓
విజయాదిత్యుడు అరికేసరి
(క్రీ.శ.696- 733) (వేములవాడ శాఖ )
↓ 
↓———————————————————————————————————————————————↓———————————↓
రెండవ విక్రమాదిత్యుడు భీమ తైలపుడు
(క్రీ.శ.733 - 744) ( కళ్యాణి స్థాపకులు)
↓
రెండవ కీర్తివర్మ 
(క్రీ.శ.744- 757) 

బాదామి చాళుక్యులు[మార్చు]

 • వీరు చంద్రవంశీయులు


పూర్వ చాళుక్యులు[మార్చు]

పూర్వ (తూర్పు) చాళుక్యులు బాదామి పశ్చిమ చాళుక్య వంశమునుండి చీలిన ఒక శాఖకు చెందినవారు. వీరికి మూలపురుషుడు పశ్చిమ చాళుక్య రాజులలో ప్రసిద్ధుడయిన ఇమ్మడి సత్యాశ్రయ పులకేశి పెద్ద తమ్ముడైన కుబ్జవిష్ణువర్ధనుడు. పులకేశి క్రీ.శ. 617 మరియు 624లలో కళింగ, వేంగీ దేశములు (దుర్జయులను) జయించి వానిపై తమ్ముడు కుబ్జవిష్ణువర్ధనుని పాలకునిగా నియమించాడు. కుబ్జవిష్ణువర్ధనుని పరిపాలనాకాలము క్రీ. శ. 624-641. క్రీ. శ. 631వరకు అన్న పులకేశికి ప్రతినిధిగా పాలించాడు. అప్పటివరకు కృష్ణానదికి దక్షిణము లోని తీరాంధ్రదేశమంతయూ పల్లవుల ఆధీనములోనుండెను. క్రీ. శ. 630లో పల్లవ రాజు మొదటి మహేంద్రవర్మ మరణించాడు. అదే అదనుగా పులకేసి కమ్మనాడు ఆక్రమించి వేంగీ రాజ్యాధిపత్యాన్ని కుబ్జవిష్ణువర్ధనునికి ఇచ్చాడు. కీ. శ. 631 తరువాత పులకేశి మూడుపర్యాయాలు పల్లవ రాజ్యాన్ని అతలాకుతలము చేశాడు. అయితే క్రీ. శ.641లో పల్లవ రాజు మొదటి నరసింహవర్మ బాదామి ముట్టడి చేసి పులకేశిని వధించాడు. అన్నకు సహాయము చేయుటకై వెడలి కుబ్జవిష్ణువర్ధనుడు కూడా మరణించాడని చారిత్రకుల అభిప్రాయము.

కుబ్జవిష్ణువర్ధనుడు అసమానపరాక్రమశాలి. విష్ణుభక్తుడు. విషమసిద్ధి మరియు మకరధ్వజ అను బిరుదాంకితుడు. రాణి అయ్యణ మహాదేవి. ఇతనికి జయసింహవల్లభుడు, ఇంద్రభట్టారకుడు అను ఇద్దరు కుమారులు. వీరు ఒకరితర్వాత ఒకరు సింహాసనము అధిష్ఠించారు.

జయసింహవల్లభుడు క్రీ.శ 641నుండి ముప్పది మూడేండ్లు రాజ్యము చేసినను జరిగిన విశేషాంశములు ఏవీ తెలియరావు. సంతతి లేని కారణమున తమ్ముడు ఇంద్రభట్టారకుడు ఏడు దినములు మాత్రమే రాజ్యమేలాడు. అతని కుమారుడు రెండవ విష్ణువర్ధనుడు క్రీ.శ. 681వరకు తొమ్మిదేండ్లు పాలించాడు. ఇతని వెనుక కొడుకైన మంగి యువరాజు రాజై క్రీ.శ. 705 వరకు ఇరువది ఐదేండ్లు పాలించాడు. ఇతనికి జయసింహుడు, కొక్కిలి విక్రమాదిత్యుడు మరియు విష్ణువర్ధనుడు అను ముగ్గురు కుమారులున్నారు. వీరు ఒకరి తరువాత ఒకరు రాజ్యము చేశారు. ముమ్మడి విష్ణువర్ధనుడు క్రీ.శ. 718 నుండి 752 వరకు పాలనము చేశాడు. ఈతని కాలములో పల్లవ జనపద ప్రజలు తమ రాజుగా నందివర్మ పల్లవమల్లుని ఎన్నుకొనిరి. నందివర్మ అద్వితీయ శక్తి సంపన్నుడు. ఇతని అశ్వమేధయాగ సందర్భమున యాగాశ్వము నెల్లూరు మండలములోని బోయకొట్టములు ప్రవేశించెను. అచట విష్ణువర్ధనుని సామంతుడు పృధ్వీవ్యాఘ్రుడు దానిని బంధించాడు. జరిగిన యుద్ధ ఫలితముగా విష్ణువర్ధనుడు తన రాజ్యములోని దక్షిణసీమ కోల్పోయాడు.

కళ్యాణి చాళుక్యులు[మార్చు]

దక్షిణాపథమును నిరంకుశముగా పాలించి ఆంధ్రదేశమును ప్రభావితము చేసిన గొప్ప రాజవంశము కల్యాణి చాళుక్యులు. వీరు బాదామి చాళుక్యుల కోవకు చెందినవారే. చిరకాలము పశ్చిమ తెలంగాణములో రాష్ట్రకూటులకు సామంతులుగా ఉండి తరువాత స్వతంత్రులయ్యారు. క్రీ.శ. 969లో చివరి రాష్ట్రకూట రాజు మూడవ కృష్ణ గతించిన పిదప వారి రాజ్యము విచ్ఛిన్నమయింది. కళ్యాణి చాళుక్యులలో మొదటివాడు రెండవ తైలపుడు (క్రీ.శ. 973-997). ఇతడు ఇరువది ఐదేండ్లు పాలించాడు. పరమారులను, చోళులను, ఘూర్జరులను జయించాడు. తైలపుడు మహాయోధుడు, మంచి పరిపాలకుడు. కన్నడ కవిరత్నత్రయములో ఒకడగు రన్న తైలపుని కొలువులో ఉన్నాడు. తైలప కుమారుడు సత్యాశ్రయుడు. ఇతడు కూడా మహాయోధుడు. చోళులతో వేంగి కొరకు యుద్ధాలు చేశాడు. రాజరాజ చోళుని సామంతుడు శక్తివర్మ చివరకు నెగ్గాడు. పిమ్మట విక్రమాదిత్య, అయ్యన కొలదికాలమే పాలించారు. అయ్యన తమ్ముడు జయసింహుడు వేంగి తిరిగి సాధించుటకు చోళులతో పెక్కు యుద్ధాలు చేశాడు. జైనమతావలంబియగు జయసింహ శైవము స్వీకరించాడు. అప్పటినుండి శైవము కర్ణాటకములో రాజమతమయ్యింది. జయసింహ కుమారుడు మొదటి సోమేశ్వరుడు తండ్రిని మించినవాడు. త్రైలోక్యమల్ల, అహవమల్ల బిరుదులు ధరించాడు. తెలుగు చోళులను, కోట, పరిచ్చేది నాయకులను తన పక్షము చేసుకున్నాడు. ఇతడుకూడ తన ఇరువది ఐదు సంవత్సరముల రాజ్యకాలము చోళులతో యుద్ధములందు గడిపాడు. ఇతనికాలములోనే కాకతీయులు అనుమకొండ విషయమును సామంతులుగా పొందారు. రెండవ సోమేశ్వరుడు, త్రిభువనమల్ల విక్రమాదిత్యుడు, మూడవ సోమేశ్వరుడు చోళులతో చెసిన యుద్ధములలో వేంగి పలుమార్లు చేతులు మారింది. చివరకు క్రీ.శ. 1133లో వేంగి కళ్యాణి చాళుక్యుల చేజారిపోయింది. చాళుక్యచోళ సామంతులైన వెలనాటి చోళులు చాళుక్యదండనాయకులను జయించి వేంగిని పాలించసాగారు. ఈ విధముగా తెలుగు దేశము నూట యాభై సంవత్సరములు చాళుక్య, చోళులకు యుద్ధరంగమైనది.

కళ్యాణి చాళుక్య వంశం[మార్చు]

తైలపుడు[5]
(క్రీ.శ.965-997)
↓
↓————————————————————————————————————————↓
సత్యాశ్రయుడు [? ]
(క్రీ.శ.997-1008) ↓
↓ ———————————————————————↓——————————————————————————↓
త్రిభువనమల్ల విక్రమాదిత్యుడు అయ్యన జగదేకమల్ల జయసింహుడు
(క్రీ.శ.1008- 1014) (క్రీ.శ.1014-1015) (క్రీ.శ.1015-1043) 
↓
సోమేశ్వరుడు
(క్రీ.శ.1043-1068) 
↓
↓————————————————————————————————————————↓
భువనైకమల్ల సోమేశ్వరుడు త్రిభువనమల్ల 6వ విక్రమాదిత్యుడు 
(క్రీ.శ.1068-1076) (క్రీ.శ.1076-1126) 
↓
భూలోకమల్ల సోమేశ్వరుడు-3
(క్రీ.శ.1126-1138) 
↓ 
↓——————————————————————————————————————————↓
ప్రతాప చక్రవర్తి జగదేకమల్లుడు -2 తైలపుడు -3
(క్రీ.శ.1138-1149) (క్రీ.శ.1149-1162)


ముదిగొండ చాళుక్యులు[మార్చు]

పూర్వ మధ్య యుగమున తెలుగు దేశములో వేంగీ చాళుక్యుల పక్షము వహించి, రాష్ట్రకూటులనెదిర్చి, కాకతీయులను కూడా ప్రతిఘటించిన రాజవంశము ముదిగొండ చాళుక్యులు. ఖమ్మం ప్రాంతములోని ముదిగొండ వీరి రాజధాని. కొరివి, బొట్టు కూడా అప్పుడప్పుడు రాజధానులు. ఈ రాజ్యము ఎనిమిదవ శతాబ్దిలో ప్రారంభమై పన్నెండవ శతాబ్దిలో అంతమయినది. వీరు మానవ్యస గోత్రులు, హారితీ పుత్రులు, వరాహ లాంఛనధారులు. వీరు శాసనములలో అయోధ్య నుండి వచ్చినవారుగా చెప్పుకున్నారు. వీరిలో ముఖ్యులు మూడవ కుసుమాయుధుడు, బొట్టు బేతరాజు మరియు కుసుమాదిత్యుడు.

వేములవాడ చాళుక్యులు[మార్చు]

ఇప్పటి కరీంనగరు జిల్లాలోని వేములవాడ రాజధానిగా పాలించిన చాళుక్య రాజవంశమును వేములవాడ చాళుక్యులందురు. తొలుత వీరు ఇందూరు (నిజామాబాద్) ప్రాంతములోని పోదనపురము (బోధన్) నుండి పాలించెడివారు. సాతవాహన సామ్రాజ్యములో అశ్మక రాష్ట్రమునకు ఇది రాజధాని. ఈ ప్రాంతమును సపాదలక్ష, సబ్బినాడు, పోదననాడు అని కూడా అంటారు. సాతవాహనుల తరువాత నాలుగు శతాబ్దముల చరిత్ర తెలియడం లేదు.

రాష్ట్రకూట రాజగు దంతిదుర్గ పోదననాడులో సామంతునిగా వినయాదిత్య యుద్ధమల్లుని (క్రీ. శ. 750-780) నియమించాడు. ఈతడు దంతిదుర్గ దండయాత్రలలో విజయములు సాధించి రాజు మన్ననలు పొందాడు. బాదామి చాళుక్యుల అధికారము కూలద్రోయుటలో యుద్ధమల్లుడు మిక్కిలి తోడ్పడ్డాడు. యుద్ధమల్లుని కుమారుడు మొదటి అరికేసరి (క్రీ. శ. 780-800). ఈతడు గొప్ప విద్వాంసుడు, గజతంత్రము, ధనుర్విద్య, ఆయుర్వేదము మున్నగు విద్యలు నేర్చినవాడు. సమస్తలోకాశ్రయ, త్రిభువనమల్ల, రాజత్రినేత్ర, సాహసరామాది బిరుదులు గలవాడు. ఇతని కొడుకు రెండవ యుద్ధమల్లుడు. ఇతని గురించి విశేషములు తెలియరాలేదు. రెండవ యుద్ధమల్లుని కుమారుడు బద్దెగ మహావీరుడు. రాష్ట్రకూటులకు సాయముగా బద్దెగ, కాకర్త్య గుండన వేంగి పై దాడి చేశారు. బద్దెగ మనుమడు ఇమ్మడి అరికేసరి ఈ వంశములో అందరికంటె గొప్పవాడు. రాష్టకూటులతొ సంబంధములు నెరపి వేంగి, మాన్యఖేటము, కొరవి లలో తన ప్రాబల్యము పెంపు చేశాడు. పసిద్ధ కన్నడ కవి పంప అరికేసరి ఆస్థానములో ఉండి విక్రమార్జునవిజయము అనబడు తొలి కన్నడ కావ్యము రచించాడు. ఇతడు కమ్మనాడుకు చెందిన వాడు.

చాళుక్య చోళులు[మార్చు]

మూలాలు[మార్చు]

 1. చాళుక్యుల పూర్వ స్థానము: The History of Andhras, G. Durga Prasad, 1988, Page 86; http://igmlnet.uohyd.ernet.in:8000/gw_44_5/hi-res/hcu_images/G2.pdf
 2. తెలుగు భాష, సాహిత్యము:Telugu Language and Literature, S. M. R. Adluri, 1998, http://www.engr.mun.ca/~adluri/telugu/language/script/script1d.html
 3. ఆంధ్రదేశ చరిత్ర - సంస్కృతి, మొదటి భాగం, రచయిత: బి. ఎన్. శాస్త్రి, మూసీ పబ్లికేషన్స్, హైదరాబాద్,1990 పుట - 387
 4. ' బాదామి ' లోని పురావస్తు శాఖ వారి మ్యూజియంలోని ఆధారాలు
 5. ఆంధ్రదేశ చరిత్ర - సంస్కృతి, మొదటి భాగం, రచయిత: బి. ఎన్. శాస్త్రి, మూసీ పబ్లికేషన్స్, హైదరాబాద్,1990 పుట - 437