రెడ్డి రాజవంశం
Appearance
(కొండవీటి రెడ్డి రాజులు నుండి దారిమార్పు చెందింది)
రెడ్డి రాజ్యం | |||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
1325–1448 | |||||||||||
రాజధాని | అద్దంకి (తొలి) కొండవీడు రాజమహేంద్రవరం కందుకూరు | ||||||||||
సామాన్య భాషలు | తెలుగు | ||||||||||
మతం | హిందూ మతం | ||||||||||
ప్రభుత్వం | రాచరికం | ||||||||||
చారిత్రిక కాలం | మధ్య యుగ భారతదేశం | ||||||||||
• స్థాపన | 1325 | ||||||||||
• పతనం | 1448 | ||||||||||
|
దక్షిణ ఆసియా చరిత్ర సారాంశం భారత ఉపఖండ చరిత్ర |
---|
రెడ్డివంశం ఆంధ్రప్రదేశ్ లో కొంత భూభాగాన్ని కొంతకాలం పరిపాలించిన రాజవంశం. ఈ వంశపు రాజుల రాజధానులు కొండవీడు, అద్దంకి, రాజమహేంద్రవరం, కందుకూరు.
కొండవీటి రెడ్లు
[మార్చు]రెడ్లు ప్రధానంగా కొండవీడు రాజధానిగా తీరాంధ్రాన్ని పరిపాలించారు. రెడ్డి రాజ్యస్థాపకుడు ప్రోలయ వేమారెడ్డి.
రాజు పేరు | పాలన ప్రారంభం | పాలనముగింపు |
---|---|---|
ప్రోలయ వేమారెడ్డి | 1325 | 1353 |
ప్రోలయ అనపోతారెడ్డి | 1353 | 1364 |
ప్రోలయ అనవేమారెడ్డి | 1364 | 1386 |
ప్రోలయ కుమార గిరిరెడ్డి | 1386 | 1402 |
ప్రోలయ పెదకోమటి వేమారెడ్డి | 1402 | 1420 |
ప్రోలయ రాచవేమారెడ్డి | 1420 | 1424 |
రచనలు, బిరుదులు
[మార్చు]సర్వజ్ఞచక్రవర్తి బిరుదుగల పెదకోమటి వేమారెడ్డి సాహిత్య చింతామణి, సంగీత చింతామణి, శృంగార దీపిక అను గ్రంథాలను రచించాడు. వసంత రాజీయం గ్రంథాన్ని రచించిన కుమారగిరిరెడ్డికి కర్పూర వసంతరాయలు అనే బిరుదు ఉంది.
రాజమహేంద్రవర రెడ్డి రాజులు
[మార్చు]రెడ్లు ప్రధానంగా కొండవీడు రాజధానిగా తీరాంధ్రాన్ని పరిపాలించారు. రెడ్డి రాజ్యస్థాపకుడు ప్రోలయ వేమారెడ్డి.
రాజు పేరు | పాలన ప్రారంభం | పాలనముగింపు |
---|---|---|
కాటయ వేముడు | 1395 | 1414 |
రెండో కుమారగిరి | 1414 | 1416 |
మూడో కుమారగిరి, మూడో అనవోతారెడ్డి | ? | ? |
వీరభద్రారెడ్డి | 1423 | 1448 |
కందుకూరు రెడ్డి రాజులు
[మార్చు]ప్రోలయ వేముడు బోయవిహారదేశానికి తన ప్రతినిధిగా మల్లారెడ్డిని నియమించాడు. మల్లారెడ్డి, అతని సంతతి(శ్రీగిరి, రెండో కోమటిరెడ్డి) కందుకూరు రాజధానిగా ఒక శతాబ్దికాలం పరిపాలించారు. [3]
చిత్రమాలిక
[మార్చు]-
రాగిరేకులపై సంస్కృతం తెలుగు శాసనాలు సా.శ1358 (అనవోతా రెడ్డి)
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ బి.యస్.యల్ 2012, pp. 243–258.
- ↑ బి.యస్.యల్ 2012, pp. 258–261.
- ↑ బి.యస్.యల్ 2012, pp. 261–262.
- బి.యస్.యల్, హనుమంతరావు (2012). "రెడ్డి-నాయక యుగము". ఆంధ్రుల చరిత్ర. విశాలాంధ్ర.