భారతదేశంలో కంపెనీ పాలన
భారతదేశంలో కంపెనీ పాలన (కొన్నిసార్లు, కంపెనీ రాజ్ లేక కుంఫిణీ పాలన,[1] "రాజ్", అంటే హిందీలో పాలన[2]) అన్నది భారత ఉపఖండంలోని భాగాలపై బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ పరిపాలన లేక ఆధిపత్యం గురించినది. ప్లాసీ యుద్ధంలో బెంగాల్ నవాబు సిరాజుద్దౌలా కంపెనీకి తన అధీనంలోని ప్రాంతాన్ని లొంగుబాటు చేసిన తర్వాత 1757లో ప్రారంభమైందని కొందరు చరిత్రకారులు,[3] 1765లో బెంగాల్, బీహార్ ప్రాంతాల్లో దివానీ అని పేర్కొనే పన్ను వసూలు చేసుకునే అవకాశం కంపెనీకి దక్కాక ప్రారంభమైందని మరికొందరు,[4] 1773లో కంపెనీ కలకత్తాలో రాజధానిని ఏర్పరిచి వారన్ హేస్టింగ్స్ గవర్నర్ జనరల్ గా పరిపాలన ప్రారంభించాకా మొదలైందిన ఇంకొందరు,[5] 1818లో మరాఠాలు ఓడిపోయి పీష్వాకు పింఛను ప్రారంభించి, అతని భూభాగాలను బ్రిటీష్ అధీనంలోకి తీసుకున్నాకా పూర్తి బ్రిటీష్ ఆధిపత్యం ప్రారంభమయ్యాకా మొదలైందని మరికొందరు లెక్కిస్తారు.[6]
ఈస్టిండియా కంపెనీ అన్నది వాటాదారులు యాజమాన్యంలోని ప్రైవేటు కంపెనీ, లండనులోని డైరెక్టర్ల బోర్డుకు నివేదిస్తూండేవారు. అసలు మొదట్లో వాణిజ్యంపై గుత్తాధిపత్యం లక్ష్యంగా ఏర్పడింది, క్రమక్రమంగా స్వంత సైన్యం, న్యాయవ్యవస్థలతో ప్రభుత్వాధికారాలు అదుపులోకి తీసుకుంది. కంపెనీ సొమ్మును ఉద్యోగులు తమ జేబుల్లో వేసుకుంటూ ఉండడంతో కంపెనీ లాభాల్లోకి వెళ్ళిన సందర్భాలు అరుదు. ఆ దశలో, బ్రిటీష్ ప్రభుత్వానికి ఈస్టిండియా కంపెనీ మీద చాలా తక్కువ అదుపు ఉండేది, కంపెనీ అధికారులు లేదా నబోబ్స్ అనేవారు విపరీతమైన అవినీతి, బాధ్యతారాహిత్యంతో కొద్దికాలంలో ఊహించలేనంత సంపద పోగేసుకోవడంతో జనంలో ఆగ్రహం పెరుగుతూ వచ్చింది.[7] 1784లోని పిట్ ఇండియా చట్టం మొట్టమొదటిసారిగా బ్రిటీష్ ప్రభుత్వానికి ప్రైవేటు కంపెనీ వ్యవహారాలపై అదుపుని ఇచ్చింది. చక్కని సివిల్ సర్వీసు కెరీర్ ను కంపెనీ ఉద్యోగాల్లో రూపకల్పన చేసేలా పాలసీలు రావడంతో అవినీతికి పాల్పడాలన్న దురాశ తగ్గుముఖం పట్టింది.[8] కంపెనీ అధికారులు బ్రిటీష్ ప్రమాణాలకు అనుగుణమైన ప్రత్యేక గృహాలు నిర్మించుకుని జీవించడం పెరిగింది. 1857 భారత తిరుగుబాటు వరకూ కొనసాగిన కంపెనీ పాలన, ఆ తర్వాత 1858లో రద్దు అయింది. 1858లో భారత ప్రభుత్వ చట్టం 1858 ్ప్రకారం బ్రిటీష్ ప్రభుత్వం కొత్త బ్రిటీష్ రాజ్ కింద భారతదేశాన్ని నేరుగా పరిపాలించడం ప్రారంభించింది.
తొలినాళ్ళు
[మార్చు]ఇంగ్లీష్ ఈస్టిండియా కంపెనీ ("కుంఫిణీ" అని తెలుగులో వ్యవహారం) ద కంపెనీ ఆఫ్ మర్చంట్స్ ఆఫ్ లండన్ ట్రేడింగ్ ఇన్ టు ద ఈస్టిండీస్ అన్న పేరుతో 1600లో స్థాపించారు. భారతదేశంలో వారు 1611లో మొట్టమొదట భారతదేశపు తూర్పుతీరంలో మచిలీపట్నంలో ఫ్యాక్టరీ స్థాపించడంతో కాలు మోపారు. మొఘల్ పాదుషా జహంగీర్ నుంచి 1612లో సూరత్లో అటువంటి ఫ్యాక్టరీనే నెలకొల్పేందుకు అనుమతి సంపాదించారు. 1640లో విజయనగర పాలకుడు వేంకటపతి రాయల నుంచి ఆయన సామంతుడు దామెర్ల చెన్నప్ప నాయకుడి సహకారంతో అనుమతి పొంది మద్రాసులో మరో ఫ్యాక్టరీ కట్టుకున్నారు. సూరత్ కు సమీపంలోనే ఉన్న బొంబాయి ద్వీపం పోర్చుగీసు అవుట్ పోస్టుగా ఉండేది. పోర్చుగీసు రాజవంశీకురాలైన బ్రాగంజా కేథరీన్ ని ఇంగ్లాండు రాకుమారుడు రెండవ చార్లెస్ కి ఇచ్చి వివాహం చేస్తున్నప్పుడు బొంబాయి ద్వీపాన్ని కట్నంగా బ్రిటీష్ సామ్రాజ్యానికి ఇచ్చారు, బ్రిటీష్ సామ్రాజ్యం నుంచి ద్వీపాన్ని కుంఫిణీ 1668లో లీజుకు తీసుకుంది. రెండు దశాబ్దాల అనంతరం గంగా నదీ డెల్టాలో కలకత్తాలో ఫ్యాక్టరీ నిర్మించారు. ఈ కాలంలోనే పోర్చుగీసు, డచ్చి, ఫ్రెంచి, డానిష్ వారు ఏర్పరిచిన వివిధ కంపెనీలు ఇలానే విస్తరిస్తూ ఉన్నాయి, పెద్ద ప్రాముఖ్యం లేకుండా భారత తీరంలో కంపెనీ కార్యకలాపాలను బట్టి భారత ఉపఖండంలో తర్వాత సుదీర్ఘ కాలం కుంఫిణీ పరిపాలిస్తుందని ఎవరూ ఊహించలేదు.
రాబర్ట్ క్లైవ్ నాయకత్వంలో కుంఫిణీ 1757లో ప్లాసీ యుద్ధంలోనూ, 1764లో బక్సర్ యుద్ధం (బీహార్ లో)లోనూ విజయం సాధించడంతో కుంఫిణీ అధికారాన్ని బలపరిచింది. ఈ స్థితిలో మొఘల్ చక్రవర్తి రెండవ షా ఆలం కుంఫిణీ వారిని బెంగాల్ (ప్రస్తుత పశ్చిమ బంగ, బంగ్లాదేశ్), బీహార్ (ప్రస్తుత బీహార్, జార్ఖండ్), ఒరిస్సా ప్రాంతాల్లో పన్నులు వసూలు చేసే దివానుగా నియమించాల్సి వచ్చింది. దాంతో కుంఫిణీ దిగువ గంగా మైదానం ప్రాంతంలో 1773 నాటికల్లా వాస్తవాధికారాన్ని చెలాయిస్తున్న పరిపాలకుడిగా మారింది. అలాగే బొంబాయి, మద్రాసుల్లో దాని ఆధిపత్యాన్ని విస్తరిస్తూ అడుగులు ముందుకువేస్తూ పోయింది. ఆంగ్లో-మైసూరు యుద్ధాలు (1766-99), ఆంగ్లో-మరాఠా యుద్ధాలు (1722-1818) పంజాబ్ దిగువన సట్లెజ్ నదికి దక్షిణంగా విస్తారమైన భారత దేశ ప్రాంతాల్లో ఆధిపత్యాన్ని అందించింది. మరాఠాల ఓటమి తర్వాత ఇక మరి ఏ ఇతర స్థానిక శక్తీ కుంఫిణీ ఆధిపత్యానికి ఎదురు నిలిచేదిగా కనిపించలేదు.[9]
కుంఫిణీ అధికార విస్తరణ ప్రధానంగా రెండు మార్గాల్లో జరిగింది. మొదటిది - భారతీయ రాజ్యాలను, వారి ఆధీనంలోని ప్రాంతాలను నేరుగా తన పరిపాలనలోకి స్వాధీనపరచుకోవడం, ఈ ప్రాంతాలన్నీ కలిపి బ్రిటీష్ ఇండియా అయింది. ఇలా స్వాధీనపరుచుకున్న ప్రాంతాల్లో వాయువ్య ప్రావిన్సులు (రోహిలాఖండ్, గోరఖ్‌పూర్, దోఅబ్ దీనిలో భాగం) (1801), ఢిల్లీ (1803), అస్సాం (అహోం రాజ్యం 1828), సింధ్ (1843) ఉన్నాయి. పంజాబ్ ప్రాంతం, వాయువ్య సరిహద్దు ప్రావిన్సు, కాశ్మీరు 1849-56ల్లో జరిగిన ఆంగ్లో-సిక్ఖు యుద్ధాల్లో కంపెనీ విజయాల ఫలితంగా బ్రిటీష్ ఇండియాలో కలిసిపోయాయి, ఐతే కాశ్మీరు అమృత్‌సర్ ఒప్పందాన్ని (1850) అనుసరించి వెనువెంటనే జమ్మూకు చెందిన డోగ్రా రాజవంశానికి అమ్మడంతో రాచరిక రాష్ట్రం (ప్రిన్స్‌లీ స్టేట్)గా మారింది. 1854లో బీరార్, 1856లో ఔధ్ బ్రిటీష్ ఇండియాలో విలీనం అయ్యాయి.
అధికారాన్ని ప్రతిష్ఠించుకోవడంలో రెండవ విధానం: భారతీయ పరిపాలకులు కంపెనీ ఆధిపత్యాన్ని అంగీకరిస్తూ, కంపెనీ పాలనలో పరిమిత అంతర్గత స్వతంత్ర ప్రతిపత్తి పొందేలా ఒప్పందాలు చేసుకోవడం. కంపెనీ ఆర్థిక పరిమితుల నడుమ పనిచేస్తూండడంతో, దాని పరిపాలనకు రాజకీయంగా పునాదులు ఏర్పరుచుకోవాలి.[10] కంపెనీ పాలన మొదలైన తొలి 75 సంవత్సరాల్లో, అలాంటి అత్యంత ముఖ్యమైన సహకారం భారతీయ రాజుల నుంచి సైన్య సహకార విధానం ద్వారా లభించింది. 19వ శతాబ్ది తొలినాళ్ళలో, భారతదేశంలో మూడింట రెండువంతుల భూభాగం ఈ పాలకుల వద్దనే ఉండేది. తన భూభాగాన్ని రక్షించుకోగల భారతీయ పాలకుడు కుంఫిణీ వారితో అలాంటి ఒప్పందంలోకి రాదలచినప్పుడు కుంఫిణీ స్వాగతించేది, ఎందుకంటే అలాంటి ఒప్పందం పరోక్ష పాలన పద్ధతిలో చాలా లాభసాటిగా ఉండేది. పరోక్ష పాలనలో నేరుగా పరిపాలించడం వల్ల జరిగే ఆర్థిక వ్యయాలూ ఉండవు, విదేశీ పాలితుల మద్దతు సంపాదించాల్సిన రాజకీయ సమస్యలూ ఎదురుకావు. అవన్నీ భారతీయ పాలకుడు చూసుకుంటూండగా తమకు మాత్రం ఆర్థికంగా, రాజకీయంగా లాభం మాత్రమే మిగులుతుంది.[11]
దీనికి బదులుగా కుంఫిణీ తమ సామంతరాజుల వంటి వీరి రక్షణ బాధ్యతలు స్వీకరించి, వారి పారంపర్య గౌరవాన్ని, ప్రతిష్ఠా చిహ్నాలను ఉండనిచ్చి మర్యాద చెల్లిస్తూండేది. సహకార మైత్రి ఒప్పందాలు హిందూ మహారాజుల, ముస్లిం నవాబుల రాజరిక రాష్ట్రాలను ఏర్పరిచాయి. అటువంటి రాజరిక రాష్ట్రాల్లో కొచ్చిన్ (1791), జైపూర్ (1794), తిరువాన్కూర్ (1795), హైదరాబాద్ (1798), మైసూరు (1799), సట్లెజ్ సమీప పర్వత రాజ్యాలు (1815), మధ్యభారత ఏజెన్సీ (1819), కచ్, గుజరాత్ గైక్వాడ్ సంస్థానాలు (1819), రాజ్‌పుతానా (1818), బహవాల్‌పూర్ (1833) ముఖ్యమైనవి.[12]
విస్తరణ
[మార్చు]18వ శతాబ్ది తొలి అర్థభాగంలో, మొఘల్ సామ్రాజ్యం క్షీణిస్తూండగా, ఆధునిక భారతదేశం చుట్టూ ఆవరించిన ప్రాంతాలు ప్రధానంగా చీలిపోయి ఉండేవి.[13]
కాలరేఖ
[మార్చు]- 1757: ప్లాసీ యుద్ధం తర్వాత రాబర్ట్ క్లైవ్ సుందర్బన్లలోని 24 పరగణాలను స్వాధీనం చేసుకున్నారు.[14]
- 1760: ఉత్తర సర్కారుల స్వాధీనం.
- 1765: బక్సర్ యుద్ధం అనంతరం బెంగాల్, ముర్షిదాబాద్ నవాబుల భూభాగాన్ని (బీహార్ ప్రాంతం సహా) కలుపుకున్నారు.
- 1773: బెనారస్ రాజాతో ఒప్పందం.[15]
- 1775: ఘాజీపూర్ నవాబు పాలనా ప్రాంతం స్వాధీనం.
- 1795: నిజాం నవాబు రెండవ అసఫ్ ఝాను ఖర్దా యుద్ధంలో మరాఠా-మైసూర్ యుద్ధం అనంతరం కంపెనీ ఓడించింది.[16]
- 1799: శ్రీరంగపట్నం ముట్టడి (1799) తర్వాత మైసూరు పతనం; కడప నవాబు, కర్నూలు నవాబుల భూభాగాలు స్వాధీనం.
- 1801: కర్ణాటక (ఆర్కాటు, నెల్లూరు),[17] జునాగఢ్, రోహిలాఖండ్ నవాబులు కంపెనీ పాలనకు లోబడ్డారు.
- 1803: ఎగువ దోఅబ్ కు చెందిన రోహిలాఖండ్ ప్రాంతం స్వాధీనం; మొఘల్ చక్రవర్తి నుంచి ఏ ప్రతిఘటన ఎదురుకాలేదు; భవాల్పూర్ నవాబు బ్రిటీష్ ఇండియాతో సరిహద్దులు అంగీకరించాడు.
గవర్నర్ జనరల్
[మార్చు](వారి పదవీకాలంలో మరీ ముఖ్యమైన ఘటనలు జరిగితే తప్ప తాత్కాలిక గవర్నర్ జనరళ్లను ఈ పట్టికలో చేర్చలేదు.)
గవర్నర్ జనరల్ |
పదవీ కాలం |
ఘటనలు |
---|---|---|
వారన్ హేస్టింగ్స్ | 1773 అక్టోబరు 20 – 1785 ఫిబ్రవరి 1 | బెంగాల్ కరువు-1770 (1769–73) రోహిల్లా యుద్ధం (1773–74) [[
మొదటి ఆంగ్లో-మరాఠా యుద్ధం]] (1777–83) (1780–1784) |
చార్లెస్ కారన్ వాలీసు |
1786 సెప్టెంబరు 12 – 1793 అక్టోబరు 28 | కారన్ వాలీస్ కోడ్ (1793) శాశ్వత భూమిశిస్తు విధానం, బ్రిటీష్ వారి కింద కొచ్చిన్ పాక్షిక రక్షిత రాజ్యంగా అవతరించింది (1791) |
John Shore | 28 October 1793 – March 1798 | ఈస్టిండియా కంపెనీ సైన్యం పునర్వ్యవస్థీకరించి, సంఖ్య కుదించారు. మలబార్ ప్రాంతంలో మొదటి పళసి తిరుగుబాటు (1793–97) |
Richard Wellesley | 18 May 1798 – 30 July 1805 | హైదరాబాద్ నిజాం వెల్లస్లీ ప్రవేశపెట్టిన సైన్య సహకార విధానంపై సంతకం చేశాడు. (ఆ విధానంపై సంతకం చేసిన తొలి పాలకుడు అతనే) (1798)ద. నాలుగవ ఆంగ్లో-మైసూరు యుద్ధం (1798–99) గోరఖ్‌పూర్, రోహిలాఖండ్ డివిజన్లను, అలహాబాద్, ఫతేపూర్, కాన్పూర్, ఎతావ, మైంపూరి, ఎత, జిల్లాలను, మీర్జాపూర్ లో కొంత భాగం, కుమావూన్ ప్రాంతంలో తెరాయ్ ప్రాంతాలను ఔధ్ నవాబు కంపెనీకి ధారాదత్తం చేశాడు. ఢిల్లీ యుద్ధం (1803) తర్వాత బాసెన్ సంధి పీష్వా రెండవ బాజీరావు సైన్య సహకార ఒప్పందంపై సంతకం చేశాడు. రెండవ ఆంగ్లో-మరాఠా యుద్ధం (1803-05) దోఅబ్, ఆగ్రా, ఢిల్లీ డివిజన్లలో మిగిలిన భాగం బుందేల్‌ఖండ్ ప్రాంతంలో కొంత భాగంమరాఠా సామ్రాజ్యం (1805) నుంచి బ్రిటీష్ ఇండియాలో కలుపుకుంది. జయించిన, ఒప్పగించిన ప్రాంతాలకు సీడెడ్ అండ్ కాంక్వర్డ్ ప్రావిన్సు స్థాపన (1805) |
Charles Cornwallis (second term) | 30 July 1805 – 5 October 1805 | Financial strain in East India Company after costly campaigns. Cornwallis reappointed to bring peace, but dies in Ghazipur. |
George Hilario Barlow (locum tenens) | 10 October 1805 – 31 July 1807 | Vellore Mutiny (10 July 1806) |
Lord Minto | 31 July 1807 – 4 October 1813 | Invasion of Java Occupation of Mauritius |
Marquess of Hastings | 4 October 1813 – 9 January 1823 | Anglo-Nepal War of 1814 Annexation of Kumaon, Garhwal, and east Sikkim. |
Lord Amherst | 1 August 1823 – 13 March 1828 | First Anglo–Burmese War (1823–26) Annexation of Assam, Manipur, Arakan, and Tenasserim from Burma |
William Bentinck | 4 July 1828 – 20 March 1835 | Bengal Sati Regulation, 1829 Thuggee and Dacoity Suppression Acts, 1836–48 |
Lord Auckland | 4 March 1836 – 28 February 1842 | North-Western Provinces established (1836) Post Offices were established (1837) |
Lord Ellenborough | 28 February 1842 – June 1844 | First Anglo-Afghan War (1839–42) Annexation of Sindh (1843) |
Henry Hardinge | 23 July 1844 – 12 January 1848 | First Anglo-Sikh War (1845–46) Sikhs cede Jullundur Doab, Hazara, and Kashmir to the British under Treaty of Lahore (1846) |
Marquess of Dalhousie | 12 January 1848 – 28 February 1856 | Second Anglo-Sikh War (1848–1849) Annexation of Punjab and North-West Frontier Province (1849–56) |
Charles Canning | 28 February 1856 – 1 November 1858 | Hindu Widows Remarriage Act (25 July 1856) First Indian universities founded (January–September 1857) |
ప్లాసీ యుద్ధంలో క్లైవ్ గెలుపొందేవరకూ కలకత్తా, మద్రాసు, బొంబాయి ప్రెసిడెన్సీ పట్టణాలలో చాలావరకూ స్వతంత్ర ప్రతిపత్తి కలిగి, చెదురుమదురుగా, నిర్వహించ వీలు లేకుండా ఉన్న పట్టణ కౌన్సిళ్ల ద్వారా పరిపాలన సాగేది. ఇవి వ్యాపారులతో నిండివుండేవి. కౌన్సిళ్ళకు సమర్థవంతమైన నిర్వహణ చేసేందుకు తగ్గ అధికారం ఉండేది కాదు, భారతదేశంలో మొత్తంగా కంపెనీ వ్యవహారాల పర్యవేక్షణ లోపించడంతో కంపెనీ అధికారులు, వారి సన్నిహితులు అత్యంత దారుణమైన అక్రమాలు, అధికార దుర్వినియోగం చేసేవారు.[20] క్లైవ్ విజయం, బెంగాల్ వంటి సంపద్వంతమైన ప్రాంతానికి దివానీ లభించడం బ్రిటన్ లో ప్రజల దృష్టికి భారతదేశాన్ని తీసుకువచ్చాయి. కొందరు కంపెనీ ఉద్యోగులు ("నబాబులు" అని వీరిని పిలిచేవారు) భారీ సంపదతో బ్రిటన్ కి తిరిగిరావడం, మరోపక్క కంపెనీకి నష్టాలు రావడం వల్ల కంపెనీ ఆర్థిక నిర్వహణ పద్ధతుల గురించి ప్రజల్లో ప్రశ్నించడం ప్రారంభం అయింది.[21] 1772 నాటికి కంపెనీ నడపడానికి బ్రిటీష్ ప్రభుత్వం నుంచి అప్పులు అవసరమయ్యాయి, కంపెనీ అవినీతి విధానాలు త్వరలోనే బ్రిటీష్ వ్యాపార వర్గాల్లోకి, ప్రజా జీవనంలోకి కూడా అడుగుపెడతాయన్న భయాలు లండన్‌లో వ్యాపించాయి.[22] కంపెనీ సంపాదించిన కొత్త భూభాగాల విషయంలో బ్రిటీష్ ప్రభుత్వానికి ఉండే హక్కులు, బాధ్యతల గురించి చర్చ కూడా ప్రారంభమైంది.[23] బ్రిటీష్ పార్లమెంట్ పలు దర్యాప్తులు చేపట్టి, 1773లో నియంత్రణ చట్టాన్ని తీసుకువచ్చింది.[24]
అప్పటి బ్రిటీష్ పార్లమెంట్ ప్రీమియర్ లార్డ్ నార్త్ కంపెనీ భూభాగాలను బ్రిటీష్ ప్రభుత్వం తానే తీసుకోవాలని కోరుకున్నా, ఆ ప్రతిపాదనకు కొన్ని లండన్ నగర వర్గాల నుంచి, బ్రిటీష్ పార్లమెంటులోని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నాడు. ఫలితంగా ఓ రాజీ కుదిరింది, నియంత్రణ చట్టం ప్రకారం అత్యున్నత సార్వభౌమాధికారం బ్రిటీష్ రాణికే ఉన్నా, కంపెనీ బ్రిటీష్ రాణి తరఫున సర్వస్వతంత్ర సార్వభౌమాధికారాన్ని కలిగివుంటుంది. కంపెనీ భారత, ఐరోపా కార్యకలాపాలు బ్రిటీష్ ప్రభుత్వం, పార్లమెంటుల పర్యవేక్షణ, నియంత్రణలో ఉంటాయి.[25] భారతదేశపు పౌర, సైనిక, రెవెన్యూ వ్యవహారాలకు సంబంధించిన అన్ని రకాల సమాచారాలు, నివేదికలు, ఉత్తర ప్రత్యుత్తరాలు కంపెనీ డైరెక్టర్ల కూటమి బ్రిటీష్ ప్రభుత్వ పరిశీలనకు అందజేయాలి.[26] భారత భూభాగాల పరిపాలనకు మద్రాసు, బొంబాయి ప్రెసిడెన్సీలపై బెంగాల్ ప్రెసిడెన్సీ సర్వాధికారాన్ని చట్టం నిశ్చయించింది. బెంగాల్ ప్రెసిడెన్సీని పరిపాలించేందుకు, కంపెనీ భారత వ్యవహారాలను పర్యవేక్షించేందుకు చట్టం ఒక గవర్నర్-జనరల్ (వారన్ హేస్టింగ్స్)ని, నలుగురు కౌన్సిలర్లను నియమించింది.[27] "The subordinate Presidencies were forbidden to wage war or make treaties without the previous consent of the Governor-General of Bengal in Council,[28] except in case of imminent necessity. The Governors of these Presidencies were directed in general terms to obey the orders of the Governor-General-in-Council, and to transmit to him intelligence of all important matters." However, the imprecise wording of the Act, left it open to be variously interpreted; consequently, the administration in India continued to be hobbled by disunity between the provincial governors, between members of the Council, and between the Governor-General himself and his Council. The Regulating Act also attempted to address the prevalent corruption in India: Company servants were henceforth forbidden to engage in private trade in India or to receive "presents" from Indian nationals.
ఇవి కూడ చూడండి
[మార్చు]Notes
[మార్చు]- ↑ Robb 2004, pp. 116–147 "Chapter 5: Early Modern India II: Company Raj", Metcalf & Metcalf 2006, pp. 56–91 "Chapter 3: The East India Company Raj, 1772–1850", Bose & Jalal 2003, pp. 76–87 "Chapter 7: Company Raj and Indian Society 1757 to 1857, Reinvention and Reform of Tradition".
- ↑ Oxford English Dictionary, 2nd edition, 1989: Hindi, rāj, from Skr. rāj: to reign, rule; cognate with L. rēx, rēg-is, OIr. rī, rīg king (see RICH).
- ↑ Bose & Jalal 2003, p. 76
- ↑ Brown 1994, p. 46 , Peers 2006, p. 30
- ↑ Metcalf & Metcalf, p. 56
- ↑ "Maratha Wars". Encyclopedia Britannica. Encyclopedia Britannica.
- ↑ J. Albert Rorabacher (2016). Property, Land, Revenue, and Policy: The East India Company, C.1757–1825. Taylor & Francis. p. 236.
- ↑ Tristram Hunt (2014). Cities of Empire: The British Colonies and the Creation of the Urban World. Henry Holt. p. 208.
- ↑ Markovits 2004, pp. 271–
- ↑ Brown 1994, p. 67
- ↑ Brown 1994, p. 68
- ↑ Ludden 2002, p. 133
- ↑ Wickwire, p. 19
- ↑ Imperial Gazetteer of India vol. IV 1908, p. 9
- ↑ Imperial Gazetteer of India vol. IV 1908, p. 10
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-04. Retrieved 2018-02-06.
- ↑ Imperial Gazetteer of India vol. IV 1908, p. 11
- ↑ "British East India Company captures Aden". Wolfram Alpha.[permanent dead link]
- ↑ "Official, India". World Digital Library. 1890–1923. Retrieved 30 May 2013.
- ↑ Bandyopadhyay 2004, p. 76 , Imperial Gazetteer of India vol. IV 1908, p. 14
- ↑ Imperial Gazetteer of India vol. IV 1908, p. 14 , Peers 2006, p. 35 , Bandyopadhyay 2004, p. 76
- ↑ Peers 2006, p. 35
- ↑ Marshall 2007, p. 207
- ↑ Imperial Gazetteer of India vol. IV 2007, p. 14
- ↑ Marshall 2007, p. 197
- ↑ Bandyopadhyay 2004, p. 77
- ↑ Imperial Gazetteer of India vol. IV 2007, p. 14 , Bandyopadhyay 2004, p. 77
- ↑ "in Council," i.e. in concert with the advice of the Council.