పీష్వా
Jump to navigation
Jump to search
![]() | ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
పీష్వా అంటే ప్రధాన మంత్రి. ఇది శివాజీ పరిపాలనా కాలంలో ప్రవేశపెట్టబడిన పదవి. మహారాష్ట్రులకు భారతదేశ చరిత్రలో సమున్నత స్థానం కల్పించిన మహారాష్ట్ర జాతిపిత శివాజీ మంత్రివర్గంలో అత్యంత ముఖ్యమైన పదవి పీష్వా. పీష్వా రాజుకు కుడి భుజంలా పనిచేస్తూ పరిపాలనా విధులలో పాలుపంచుకొనేవాడు.
శివాజీ మనవడైన షాహు పరిపాలనా కాలంలో పీష్వా పదవికి ప్రాముఖ్యం పెరిగింది. ఛత్రపతి లేదా చక్రవర్తి అధికారం కేవలం నామమాత్రమైంది. వాస్తవ పరిపాలనా బాధ్యతలను పీష్వా చేపట్టాడు. వాస్తవ పరిపాలనా బాధ్యతలు చేపట్టిన మొదటి పీష్వా బాలాజీ విశ్వనాథ్. ఇతడి పరిపాలనా కాలం నుంచి పీష్వా పదవి శక్తివంతం, అనువంశికం అయింది. బాలాజీ విశ్వనాథ్ తర్వాత పీష్వా అయిన బాజీరావు-1 కాలంలో మరాఠా సర్దార్ల కూటమి ఏర్పడింది. వీరంతా చక్రవర్తి వ్విధేయులుగా పనిచేస్తూ మహారాష్ట్ర సమైక్యత కోసం కృషి చేశారు.