బీహార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బీహార్
Map of India with the location of బీహార్ highlighted.
రాజధాని
 - అక్షాంశరేఖాంశాలు
పాట్నా
 - 25°21′N 85°07′E / 25.35°N 85.12°E / 25.35; 85.12
పెద్ద నగరం పాట్నా
జనాభా (2001)
 - జనసాంద్రత
82,878,796 (3rd)
 - 880/చ.కి.మీ
విస్తీర్ణం
 - జిల్లాలు
94,164 చ.కి.మీ (12th)
 - 37
సమయ ప్రాంతం IST (UTC యుటిసి+5:30)
అవతరణ
 - [[బీహార్ |గవర్నరు
 - [[బీహార్ |ముఖ్యమంత్రి
 - చట్టసభలు (సీట్లు)
1912
 - ఆర్.ఎస్.గవై
 - నితీష్ కుమార్
 - రెండు సభలు (243 + 96)
అధికార బాష (లు) హిందీ, అంగిక, భోజ్‌పురి, మగహి, మైథిలి
పొడిపదం (ISO) IN-BR
వెబ్‌సైటు: gov.bih.nic.in

బీహార్ (बिहार) భారతదేశపు తూర్పుభాగాన ఉన్న ఒక రాష్ట్రము. రాజధాని పాట్నా.

బీహార్‌కు ఉత్తరాన నేపాల్ దేశము సరిహద్దున్నది. పశ్చిమాన ఉత్తర ప్రదేశ్, దక్షిణాన ఝార్ఖండ్, ఈశాన్యాన పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలున్నాయి. బీహార్ రాష్ట్రం హిందీ మాట్లాడే ప్రాంతపు మధ్యనుంది. సారవంతమైన గంగానదీ మైదానం బీహార్‌లో విస్తరించి ఉంది.

చరిత్ర[మార్చు]

పురాతన చరిత్ర[మార్చు]

బీహారు చరిత్ర పురాతనమైనది. ఒకప్పుడు ఇది మగధ ప్రాంతము.నేటి పాట్నా ఆనాటి పాటలీపుత్రనగరం. మౌర్యసామ్రాజ్యానికి రాజధాని. అప్పటినుండి వెయ్యేళ్ళకాలం ప్రముఖ రాజకీయ, సాంస్కృతిక, విద్యా కేంద్రంగా వెలిగింది. నలందా, విక్రమశీల విశ్వవిద్యాలయాలు ప్రపంచప్రఖ్యాతి గాంచినవి.

'విహారం' అనే సంస్కృతపదం నుండి 'బీహార్' పేరు రూపొందింది.

మతాలకు జన్మస్థానం

బౌద్ధ, జైన మతాలకు బీహార్ జన్మస్థలం. బోధ్‌గయలో గౌతమబుద్ధుడు జ్ఙానోదయం పొంది, ధర్మ బోధన ఆరంభించాడు. జైనమత ప్రవక్త మహావీరుడు బీహారులోని వైశాలిలో జన్మించాడు.

మధ్యయుగపు చరిత్ర[మార్చు]

విదేశీయుల దండయాత్రలతో బీహార్ ప్రాభవం బాగా దెబ్బతిన్నది. 12వ శతాబ్దంలో మహమ్మదు ఘోరీ సైన్యం వశమైంది. మధ్యలో ససరాం నుండి వచ్చిన షేర్‌ షా సూరి ఆరేళ్ళు రాజ్యమేలినప్పుడు బీహార్ కొంత వైభవాన్ని మళ్ళీ చవిచూచింది. కలకత్తా నుండి పెషావర్ (పాకిస్తాన్) వరకు గ్రాండ్‌ట్రంక్ రోడ్డు ఆ కాలంలోనే వేయబడింది.

1557-1576 మధ్యకాలంలో అక్బర్ చక్రవర్తి బీహార్, బెంగాల్‌లను ఆక్రమించి మొత్తాన్ని బెంగాల్ పాలనలో కలిపాడు.ముఘల్ సామ్రాజ్య పతనానంతరం బీహార్ క్రమంగా బెంగాల్ నవాబుల అధీనంలోకి వెళ్ళింది.

ఆధునిక చరిత్ర[మార్చు]

1765లో బక్సార్ యుద్ధము తర్వాత బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీకి బీహార్, బెంగాల్, ఒడిషాలపై దివానీ (పన్ను) అధికారం లభించింది. అప్పటినుండి 1912 వరకు బీహార్ ప్రాంతం బ్రిటిష్‌వారి బెంగాల్ ప్రెసిడెన్సీలో భాగంగా ఉంది. 1912లో బీహార్‌ను వేరుచేశారు. 1935లో బీహారులో కొంతభాగాన్ని ఒడిషాగా ఏర్పరచారు. 2000లో బీహారులోని 18 జిల్లాలను వేరుచేసి ఝార్ఖండ్ రాష్ట్రాన్ని ఏర్పరచారు.

1857 ప్రధమ స్వాతంత్ర్య సంగ్రామంలో ససరాంకు చెందిన బాబు కున్వర్ సింగ్, మరెందరో బీహార్ వీరులు ప్రముఖంగా పోరాడారు. తరువాత స్వాతంత్ర్యపోరాటంలో బీహారువారు ఘనంగా పాలు పంచుకొన్నారు. బీహారులోని చంపారణ్ నీలి సత్యాగ్రహంతో భారతదేశంలో మహాత్మా గాంధీ నాయకత్వం అంకురించిందనిచెప్పవచ్చును. అప్పుడు సత్యాగ్రహానికి తోడు నిలిచిన డా.బాబూ రాజేంద్రప్రసాద్ తరువాత మొదటి భారత రాష్ట్రపతి అయ్యాడు.

కాలరేఖ[మార్చు]

భౌగోళికం[మార్చు]

బీహారు ఎక్కువ భాగం సారవంతమైన మైదాన ప్రాంతం. గంగ, శోణ, బాగమతి, కోసి, బుధి గండక్, ఫల్గు వంటి ఎన్నో నదుల బీహారు భూభాగంలో ప్రవహిస్తున్నాయి. దక్షిణ బీహారులో చిన్న కొండలున్నాయి.

వాతావరణం[మార్చు]

డిసెంబరు, జనవరి మాసాలు చలికాలం ఉష్ణోగ్రతలు 5 నుండి 10 డిగ్రీలు సెల్సియస్ వరకు నమోదవుతాయి. వేసవికాలం ఏప్రిల్, మే లలో 40-45 డిగ్రీలవరకు వెళ్తుంది. జూన్ నుండి సెప్టెంబరు వరకు వర్షాకాలం.

రాష్ట్ర గణాంకాలు[మార్చు]

  1. అవతరణము. 1912 మార్చి 22
  2. వైశాల్యము. 94,163 చ.కి.మీ
  3. జనసంఖ్య. 103,804,637 స్త్రీలు.49,619,290 పురుషులు. 54,185,347 నిష్పత్తి . 916
  4. జిల్లాల సంఖ్య.38
  5. గ్రామాలు. 39,015 పట్టణాలు.130
  6. ప్రధాన భాష. హింది, ఉర్దూ, ఆంగిక, బొజ్ పురి, మఘధి, మిథిలి ప్రధాన మతం.హిందు, ఇస్లాం, బౌద్ధం, క్రీస్తు.
  7. పార్లమెంటు సభ్యుల సంఖ్య,40 శాసన సభ్యుల సంఖ్య. 243
  8. మూలము. మనోరమ యీయర్ బుక్

ఆర్ధిక వ్యవస్థ[మార్చు]

2000 సంవత్సరంలో ఖనిజ సంపద, పరిశ్రమలు బాగా ఉన్న జార్ఖండ్ రాష్ట్రాన్ని విభజించిన తరువాత బీహారు ప్రధానంగా వ్యావసాయిక రాష్ట్రంగా మిగిలిపోయింది. సారవంతమైన గంగా పరీవాహక మైదానం బీహారు ఆర్థికరంగానికి ఆధారం. కాని వ్యవసాయం ప్రకృతి వైపరీత్యాలవలన తరచు దెబ్బతింటూ ఉంది. ప్రత్యేకంగా అభివృద్ధిచేసిన నీటివనరులు స్వల్పం. వ్యావసాయిక, ఇతర పరిశ్రమల అభివృద్ధికై కృషి జరుగుతున్నది గాని ఇప్పటికి ప్రగతి అంతగా లేదు.

భారతదేశంలో బాగా పేదరాష్ట్రాలలో ఒకటిగా బీహారు గుర్తింపబడుతుంది. దీనికి చాలా కారణాలు చెబుతారు. తక్కువ అక్షరాస్యత, కేంద్రం నిర్లక్ష్యత (ఇదివరకు కలకత్తా, ఇప్పుడు ఢిల్లీ), కులాలవారీగా, మతాలవారీగా చీలిపోయిన సమాజం, సంస్కరణలు రాకపోవడం, నాయకుల అవినీతి - ఇలాంటి చాలా కారణాలున్నాయి.

రాజకీయాలు[మార్చు]

బీహారు శాసన, పాలనా విధానం అన్ని రాష్ట్రాలవలెనె ఉంది. - గవర్నరు, ముఖ్య మంత్రి, శాసన సభ, సివిల్ సర్వీసు, న్యాయ వ్యవస్థ వగయిరా.

దాదాపు దశాబ్దం పైగా బీహారు రాజకీయాలలో లాలూ ప్రసాద్ యాదవ్ ప్రముఖ వ్యక్తిగా ఉంటూ వచ్చాడు.

రాజకీయ నాయకులూ[మార్చు]

జిల్లాలు[మార్చు]

బీహార్ జిల్లాలు[మార్చు]

కోడ్ ‌జిల్లా ముఖ్య పట్టణం జనాభా

(2011)

విస్తీర్ణం

(కి.మీ.²)

జన సాంద్రత (కి.మీ.²)
1 AR అరారియా అరారియా 28,06,200 2,829 992
2 AR అర్వాల్ అర్వాల్ 7,00,843 638 1,098
3 AU ఔరంగాబాద్ ఔరంగాబాద్ 25,11,243 3,303 760
4 BA బంకా బంకా 20,29,339 3,018 672
5 BE బెగుసరాయ్ బేగుసరాయ్ 29,54,367 1,917 1,540
6 BG భాగల్‌పూర్ భాగల్పూర్ 30,32,226 2,569 1,180
7 BJ భోజ్‌పూర్ ఆరా 27,20,155 2,473 1,136
8 BU బక్సార్ బక్సర్ 17,07,643 1,624 1,003
9 DA దర్భంగా దర్భంగా 39,21,971 2,278 1,721
10 EC తూర్పు చంపారణ్ మోతీహారి 50,82,868 3,969 1,281
11 GA గయ గయ 43,79,383 4,978 880
12 GO గోపాల్‌గంజ్ గోపాల్‌గంజ్ 25,58,037 2,033 1,258
13 JA జమూయి జమూయి 17,56,078 3,099 567
16 JE జహానాబాద్ జహానాబాద్ 11,24,176 1,569 1,206
17 KM కైమూర్ భబువా 16,26,900 3,363 488
14 KT కటిహార్ కటిహార్ 30,68,149 3,056 1,004
15 KH ఖగరియా ఖగరియా 16,57,599 1,486 1,115
18 KI కిషన్‌గంజ్ కిషన్‌గంజ్ 16,90,948 1,884 898
21 LA లఖిసరాయ్ లఖిసరాయ్ 10,00,717 1,229 815
19 MP మాధేపురా మాధేపురా 19,94,618 1,787 1,116
20 MB మధుబని మధుబని 44,76,044 3,501 1,279
22 MG ముంగేర్ ముంగేర్ 13,59,054 1,419 958
23 MZ ముజఫర్‌పూర్ ముజఫర్‌పూర్ 47,78,610 3,173 1,506
24 NL నలందా బీహార్ షరీఫ్ 28,72,523 2,354 1,220
25 NW నవాదా నవాదా 22,16,653 2,492 889
26 PA పాట్నా పాట్నా 57,72,804 3,202 1,803
27 PU పూర్ణియా పూర్ణియా 32,73,127 3,228 1,014
28 RO రోహ్‌తాస్ సాసారామ్ 29,62,593 3,850 763
29 SH సహర్సా సహర్సా 18,97,102 1,702 1,125
32 SM సమస్తిపూర్ సమస్తిపూర్ 42,54,782 2,905 1,465
31 SR సారణ్ చప్రా 39,43,098 2,641 1,493
30 SP షేఖ్‌పురా షేఖ్‌పురా 6,34,927 689 922
33 SO శివ్‌హర్ శివ్‌హర్ 6,56,916 443 1,882
35 ST సీతామఢీ సీతామఢీ 34,19,622 2,199 1,491
34 SW సివాన్ సివాన్ 33,18,176 2,219 1,495
36 SU సుపౌల్ సుపౌల్ 22,28,397 2,410 919
37 VA వైశాలి హజీపూర్ 34,95,021 2,036 1,717
38 WC పశ్చిమ చంపారణ్ బేతియా 39,35,042 5,229 753

ప్రయాణ,రవాణా సౌకర్యాలు[మార్చు]

బీహారులో రెండు విమానాశ్రయాలున్నాయి. పాట్నా, గయ

రైల్వే వ్వస్థ బీహారులో బాగా విస్తరించి ఉంది. అన్ని ప్రధాన నగరాలకు రైలు కనెక్షన్లున్నాయి.

బీహారు రోడ్డు రవాణా వ్యవస్థ అంత బాగా లేదు. రోడ్లు బాగుండకపోవడం ఇందుకొక కారణం.

చూడదగినవి[మార్చు]

సంస్కృతి[మార్చు]

పండుగలు[మార్చు]

అన్ని మతాలవారికి బీహారు నెలవైనట్లే అన్ని పండుగలూ జరుపబడతాయి.మకర సంక్రాంతి, సరస్వతీ పూజ దసరా, హోలీ, ఈద్-ఉద్-ఫిత్రా, ఈద్-ఉద్-జోహా (బక్రీద్), ముహర్రం, శ్రీరామ నవమి, రథయాత్ర, రాఖీ, మహాశివరాత్రి, దీపావళి, లక్ష్మీపూజ, క్రిస్టమస్, మహావీర జయంతి, బుద్ధపూర్ణిమ, ఇంకా అనేక జాతీయ, ప్రాంతీయ ఉత్సవాలు బీహారులో సంరంభంగా జరుపుకొంటారు

అయితే దీపావళి తరువాతి వారంలో వచ్చే ఛత్ లేదా దలాఛత్ పండుగ మాత్రం బీహారుకు ప్రత్యేకం, బీహారీలకు చాలా ముఖ్యం. ఇది సూర్యుడిని ఆరాధించే పండుగ. ఈ ఆచారాన్ని వలస వెళ్ళిన బీహారీలు తమతో తీసుకెళ్ళినందున ఇప్పుడు దేశమంతటా ప్రధాన నగరాలలో ఛత్ పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా మారింది.

జానపద గేయాలు, సంగీతం[మార్చు]

బీహారులో గంగా మైదానంలో సంస్కృతి పురాతనమైనట్లే వారి జానపద సంగీతం చాలా పురాతనమైనది. ఎంతో వైవిధ్యము కలిగినది. జీవనంలో అన్ని సందర్భాలకూ, ఉత్సవాలకూ ఆయా విశిష్ట బాణీలలో జానపద గేయాలున్నాయి. ఇంకా హాస్యాన్నీ, ఆనందాన్నీ కలగలిపిన హోలీ పాటలు కూడా చాలా ఉన్నాయి.

19వ శతాబ్దంలో బ్రిటిష్‌వారి దుష్పాలన వల్ల, క్షీణించిన ఆర్థిక గతివల్లా చాలామంది ఫిజీ, మారిషస్ వంటి పరదేశాలకు వలసపోయారు. అప్పటి చేదు పరిస్థితులకు అద్దం పట్టే విషాదపూరిత గేయాలూ, నాటికలూ కూడా చాలా జనప్రసిద్ధమైనాయి.

భాష, సాహిత్యం[మార్చు]

బీహారులో హిందీ, ఉర్దూ మాత్రమే కాకుండా మరెన్నో స్థానిక భాషలున్నాయి. భోజపురి, మైథిలి, మాగహి, ఆంగిక వంటివి. వీటిని కొంత వరకు హిందీ మాండలికాలని కూడా పరిగణిస్తూ ఉంటారు. వీటన్నింటినీ కలిపి బీహారీ భాష అని కూడా వ్యవహరిస్తుంటారు.

బీహారు నండి ఎందరో ప్రసిద్ధ కవులు, రచయితలు ఉన్నారు. రాజా రాధికా రమణ సింగ్, శివ పూజన్ సహాయ్, దివాకర ప్రసాద్ విద్యార్ధి, నిరాలా, రామ్ బిక్ష్ బేనిపురి, దేవకీ నందన్ ఖత్రి (చంద్ర కాంత నవలా రచయిత), విద్యాపతి (మైథలి భాషా రచయిత) వంటి వారు.

సినిమా[మార్చు]

బీహారులో భోజపురి భాష సినిమా పరిశ్రమ బాగా వేళ్ళూనుకొంది. కొద్దిపాటి మైధిలి సినిమా పరిశ్రమ కూడా ఉంది.

విద్య[మార్చు]

ఒకప్పుడు విద్యలకు నిలయమై, ప్రపంచ స్థాయిలూ ఉండే నలందా, విక్రమశిల విశ్వవిద్యాలయాలు 13వ శతాబ్దంలో నాశనమయ్యాయి. తరువాత బీహారులో అంత గొప్ప విద్యాలయాలు వచ్చాయని చెప్పలేము. బీహారు జనాభాకు, మారుతున్నఅవసరాలకూ, ఆశయాలకూ అనుగుణమైన విద్యావకాశాలు బీహారులో అభివృద్ధి చెందలేదు.

విద్యా వ్యవస్థ తక్కిన భారతదేశంలో లానే ఉంది.

బడులు[మార్చు]

1980 దశకంలో చాలా ప్రైవేటు యాజమాన్పు స్కూళ్ళను ప్రభుత్వం అధినంలోకి తీసుకొన్నది. ఇవన్నీ బీహారు స్కూల్ ఎక్జామినేషను బోర్డు అధ్వర్యంలో నడుస్తాయి. ఇంకా వివిధ పాఠశాలలు ICSE, CBSE బోర్దులకు అనుబంధంగా ఉన్నాయి.

విశ్వ విద్యాలయాలు, కాలేజీలు[మార్చు]

బీహారులో 5 విశ్వ విద్యాలయాలున్నాయి.

బీహారులో ప్రభుత్వాధీనంలో 3 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. - పాట్నా, భాగల్పూర్, ముజఫర్‌పూర్

ఇవి కూడా చూడండి[మార్చు]

బయటి లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=బీహార్&oldid=3580941" నుండి వెలికితీశారు