పెషావర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పెషావర్ (Urdu: پشاور‎; Pashto: پېښور‎) పాకిస్తాన్ లోని ఖైబర్ పఖ్తూన్ ఖ్వా ప్రావిన్సు రాజధాని.[1] ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోకెల్లా ఇది అతిపెద్ద నగరం, 1998 జనగణన ప్రకారం పాకిస్తాన్ లోకెల్లా 9వ అతిపెద్ద నగరం.[2] పెషావర్ మెట్రోపాలిటన్ నగరం, పాకిస్తాన్ కు చెందిన ఫెడరల్లీ అడ్మినిస్టర్డ్ ట్రైబల్ ఏరియాస్ కు పరిపాలన కేంద్రం, ఆర్థిక కేంద్రం.[3] పెషావర్ ఖైబర్ పాస్ తూర్పు కొనకు సమీపంలోని పెద్ద లోయలో, పాక్-ఆఫ్ఘన్ సరిహద్దులో నెలకొంది. పెషావర్ కు నీటి సరఫరా కాబూల్ నది నుంచి, దాని కుడి ఉపనది బారా నది నుంచి లభిస్తోంది.

నమోదైన పెషావర్ చరిత్ర దానిని క్రీ.పూ.539 నాటి నుంచి ఉన్నదని తేలుస్తోంది, దీంతో పెషావర్ పాకిస్తాన్లో అత్యంత ప్రాచీనమైన నగరంగా, దక్షిణాసియా మొత్తం మీదే ప్రాచీనమైన నగరాల్లో ఒకటిగా నిలుస్తోంది.[4]

చరిత్ర[మార్చు]

దస్త్రం:Zaryab.jpg
బలా హిసార్ కోట
ఖైబర్ పాస్

ప్రాచీన పెషావర్[మార్చు]

పెషావర్ ను సంస్కృతంలో పురుషపురం అంటారు, దీనికి వాక్యార్థం మనుష్యుల నగరం అనీ, పురుషుల నగరం అనీ అర్థం వస్తుంది.[lower-alpha 1] జెండా అవెస్తాలో వేకెరెత అన్న పేరుతో అహురా మజ్దా సృష్టించిన భూమిపై ఏడు అతి సుందరమైన ప్రదేశాల్లో ఒకటిగా వర్ణితమైంది. బక్ట్రియా ప్రాంతానికి మకుటంలో కలికితురాయిగా, తక్షశిలపై అధికారం ఉన్న నగరం అనీ పేర్కొన్నారు.[5] మధ్య, దక్షిణ ఆసియా ప్రాంతపు ఇతర ప్రాచీన నగరాలతో పాటుగా పెషావర్ శతాబ్దాల పాటు బాక్ట్రియా, దక్షిణ ఆసియా, మధ్య ఆసియా ప్రాంతాల మధ్య వాణిజ్య కేంద్రంగా నిలిచింది. క్రీ.పూ.2వ శతాబ్ది నాటికి  చెందినవని భావిస్తున్న బక్షాళి వ్రాతప్రతిలో వర్గమూలాన్ని కనిపెట్టేందుకు బక్షాళి పద్ధతి వంటివి ఈ ప్రాంతంలో లభించాయి. వీటన్నిటి ఆధారంగా ఇది ప్రాచీన కాలానికి విద్యా కేంద్రం అని చెప్పవచ్చు.[6]

సంస్కృతి[మార్చు]

1980ల్లో ఆఫ్ఘనిస్తాన్ తో సోవియట్ యుద్ధం చేస్తున్నప్పుడు, పెషావర్ కు అనేకమంది ఆఫ్ఘాన్ శరణార్ధులు వసలవచ్చారు. ఆఫ్ఘాన్ సంగీతకారులు, కళాకారులకు పెషావర్ నిలయమైపోయింది.[7]

గ్యాలరీ[మార్చు]

నోట్సు[మార్చు]

మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=పెషావర్&oldid=1971585" నుండి వెలికితీశారు