పాకిస్తాన్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
اسلامی جمہوریہ پاکستان
ఇస్లామీ జమ్‌హూరియె పాకిస్తాన్
ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్
Flag of పాకిస్తాన్ పాకిస్తాన్ యొక్క State Emblem
నినాదం
اتحاد، تنظيم، يقين محکم
Ittehad, Tanzim, Yaqeen-e-Muhkam  (Urdu)
"Unity, Discipline and Faith"
జాతీయగీతం
"ఖౌమీ తరానా"
పాకిస్తాన్ యొక్క స్థానం
రాజధాని ఇస్లామాబాద్
33°40′N, 73°10′E
Largest city కరాచీ
ఇతర భాషలు ఉర్దూపష్తో, ఆంగ్లం, పంజాబీ భాష, సింధీ, బలోచీ
ప్రజానామము పాకిస్తానీ
ప్రభుత్వం ఇస్లామిక్ రిపబ్లిక్
 -  అధ్యక్షుడు Mamnoon Hussain (PML-N)
 -  ప్రధానమంత్రి Mian Nawaz Sharif (PML-N)
 -  Chair of Senate Muhammadmian Soomro (PML)
 -  House Speaker en:Fahmida Mirza (PPP)
 -  Chief Justice en:Abdul Hameed Dogar
Formation
 -  స్వాతంత్ర్యము బ్రిటిష్ రాజ్యం నుండి (భారత్ నుండి వేరుపడినది) 
 -  ప్రకటితము 14 ఆగస్టు 1947 
 -  ఇస్లామిక్ రిపబ్లిక్ 23 మార్చి 1956 
 -  జలాలు (%) 3.1
జనాభా
 -  2008 అంచనా 172,800,000 (6వది)
 -  1998 జన గణన 132,352,279[1] 
జీడీపీ (PPP) 2007 అంచనా
 -  మొత్తం $410.295 billion[2] (26th)
 -  తలసరి $2,594[2] (127వది)
జీడీపీ (nominal) 2007 అంచనా
 -  మొత్తం $143.766 billion[2] (47వది)
 -  తలసరి $908[2] (138వది)
Gini? (2002) 30.6 (medium
మా.సూ (హెచ్.డి.ఐ) (2008) Increase 0.562 (medium) (139వది UNIQ--nowiki-00000010-QINU3UNIQ--nowiki-00000011-QINU)
కరెన్సీ en:Pakistani Rupee (Rs.) (PKR)
కాలాంశం PST (UTC+5)
 -  వేసవి (DST) PDT (UTC+6)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .pk
కాలింగ్ కోడ్ +92

పాకిస్తాన్ లేదా పాకిస్తాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ (ఆంగ్లం : Pakistan) (ఉర్దూ : پاکستان) : దక్షిణాసియాలోని దేశం. భారత్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, అరేబియా సముద్రంలను సరిహద్దులుగా కలిగి ఉంది. 16 కోట్లకు పైబడిన జనాభాతో అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో ప్రపంచంలో ఆరవ స్థానంలోను, అత్యధిక ముస్లిము జనాభా కలిగిన దేశాల్లో రెండో స్థానంలోను ఉన్నది. కామన్‌వెల్తులోను (2004 మరియు 2007లో కొంతకాలము బహిష్కరించబడినది), ఇస్లామిక్ దేశాల సంస్థలోను సభ్యత్వం ఉంది. 1947కు పూర్వం భారత అంతర్భాగమైన ఈ పాకిస్తాన్, 1947లో భారత్ నుండి వేరుపడి పాకిస్తాన్ (ప్రస్తుత పాకిస్తాన్) మరియు తూర్పు పాకిస్తాన్ (నేటి బంగ్లాదేశ్) ఏర్పడింది. ఈ విభజనకు ముఖ్య కారకులలో ముహమ్మద్ అలీ జిన్నా ఒకడు.

National symbols of Pakistan (Official)
National animal Markhor.jpg
National bird Keklik.jpg
National tree Pedrengo cedro nel parco Frizzoni.jpg
National flower Jasminum officinale.JPG
National heritage animal Snow Leopard 13.jpg
National heritage bird Vándorsólyom.JPG
National aquatic marine mammal Platanista gangetica.jpg
National reptile Persiancrocodile.jpg
National amphibian Bufo stomaticus04.jpg
National fruit Chaunsa.JPG
National mosque Shah Faisal Mosque (Islamabad, Pakistan).jpg
National mausoleum
National river Indus river from karakouram highway.jpg
National mountain K2, Mount Godwin Austen, Chogori, Savage Mountain.jpg

కొత్త రాజధాని[మార్చు]

పాకిస్థాన్‌లో త్వరలో జంట రాజధాని నగరాలు ఏర్పడనున్నాయి. అందమైన మార్గల్లా పర్వత శ్రేణుల్లో కొత్తగా రాజధాని నగర నిర్మాణానికి చకచకా చర్యలు ప్రారంభమయ్యాయి. దీన్ని ప్రస్తుత రాజధాని ఇస్లామాబాద్‌కు సొరంగ మార్గం ద్వారా అనుసంధానం చేయనున్నారు. దీంతోపాటు సుమా రు రూ.77 వేల కోట్ల వ్యయంతో చేపట్టే ఈ భారీ ప్రాజెక్టులో పలు నిర్మాణ, అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేపట్టనున్నారు. సాధ్యమైనంత త్వరగా ఇది అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రధాని నవాజ్ షరీఫ్ ఆదేశించడంతో రాజధాని అభివృద్ధి అథారిటీ (సీడీఏ) ఈ దిశగా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటోంది.రావల్పిండి-ఇస్లామాబాద్ మధ్య రెండు రింగు రోడ్డులు, రావల్పిండిలోని రావత్ వద్ద ఒక కొత్త ఎయిర్‌పోర్టు నిర్మాణం కూడా ఈ మెగా ప్రాజెక్టులో భాగంగా ఉన్నాయి. బ్లూ ఏరియా నుంచి రావత్ వరకూ ఉన్న ఇస్లామాబాద్ హైవేను 8 నుంచి పది లైన్లకు విస్తరించడంతోపాటు రోడ్డుకు ఇరువైపులా దుబాయ్‌లోని షేక్ జాయెద్ రోడ్డు తరహాలో బహుళ అంతస్తుల వాణిజ్య భవనాలను కూడా నిర్మించనున్నారు. ఇస్లామాబాద్ హైవేకు ఇరువైపుల ఉన్న ప్లాట్లను వాణిజ్య అవసరాలకు ఇవ్వడం ద్వారా భారీ మొత్తంలో డాలర్లను రాబట్టవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మెగా ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టాల్సిందిగా విదేశీ పెట్టుబడిదారులను, ముఖ్యంగా ప్రవాస పాకిస్థానీయులను ప్రభుత్వం ఆహ్వానిస్తోంది.

పాక్‌ అధ్యక్షుడి అధికారాలకు కత్తెర[మార్చు]

పాక్‌లో త్వరలో తీసుకురానున్న 232వ రాజ్యాంగ సవరణ ద్వారా 'అత్యవసర పరిస్థితి విధింపు', 'న్యాయమూర్తుల, ముఖ్య ఎన్నికల అధికారి నియామకం' వంటి అధ్యక్షుడి అసాధారణ అధికారాలకు కత్తెర వేయనున్నారు. రాష్ట్ర శాసనసభలను సంప్రదించకుండా అధ్యక్షుడు తనంత తానుగా దేశంలో అత్యవసర పరిస్థితిని విధించలేరు. అలాకాకుండా అధ్యక్షుడు స్వతంత్రంగా వ్యవహరించి అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తే దానికి పార్లమెంటు ఉభయసభలు 10రోజుల వ్యవధిలో ఆమోదముద్ర వేస్తేనే అమల్లోకి వచ్చే విధంగా ముసాయిదాలో పొందుపరిచారు.

ఆరోపణలు[మార్చు]

ఉత్తరకొరియా మరియు లిబియావంటి దేశాలకు అణుపరిఘ్నానాన్ని అక్రమముగా తరలించబడిందని ఆరోపణలు ఉన్నాయి.

వివాదాలు[మార్చు]

భారతదేశముతో 1947 నుంచి కాశ్మీరు గురించి వివాదము నడుస్తోంది. భారత్, పాకిస్తాన్, చైనా దేశాలమధ్య కాశ్మీరు వివాదం చాలా తీవ్రమైనది. భారత్, పాకిస్తాన్‌ల మధ్య జరిగిన మూడు యుద్ధాలకు (1947, 1965, 1999(కార్గిల్)) అలాగే భారత్, చైనా దేశాల మధ్య 1962 (బ్రిటిష్ వలస పాలన కాలములో భారత చైనాలను విదదీసే మెక్ మెహాన్ రేఖను చైనా గుర్తించనందుకు) యుద్ధానికి కాశ్మీరు వివాదమే కారణం. జమ్ము-కాశ్మీరు సంపూర్ణ రాష్ట్రం భారతదేశపు అంతర్గత భూభాగమని భారతదేశం వాదన. కాని మొత్తం రాష్ట్రంలో సగభాగం మాత్రమే ఇప్పుడు భారతదేశం ఆధీనంలో ఉన్నది. కాశ్మీరు లోయలో కొంత భాగం పాకిస్తాన్ అధీనంలో ఉన్నది. ఆక్సాయ్‌చిన్ ప్రాంతం చైనా అధీనంలో ఉన్నది.

కాశ్మీరులో భాగమైన గిల్గిత్‌-బాల్టిస్థాన్‌ను స్థానిక గిరిజనుల సాయంతో పాకిస్థాన్‌ 1947లో ఆక్రమించింది. ఇప్పటి వరకూ ఈ భూభాగం ఎలాంటి ప్రజాస్వామ్యం లేకుండా పాకిస్థాన్‌ అధ్యక్షుడి ప్రత్యక్ష పాలనలో ఉంది. ఇప్పుడు ఈ భూభాగంపై వాస్తవ నియంత్రణాధికారాన్ని పాకిస్థాన్‌ చైనాకు అప్పగించింది. అరబ్బు దేశాలకు, చైనాకు మధ్య సిల్క్‌ రవాణా మార్గంలో గిల్గిత్‌-బాల్టిస్థాన్‌ భూభాగం ఉంది.

భారత్‌-పాక్‌ను సన్నిహితం చేద్దాం[మార్చు]

భారత్‌-పాకిస్థాన్‌ మధ్య సుదీర్ఘ కాలంగా అపరిష్కృతంగా మిగిలిపోయిన సమస్యలకు పరిష్కార మార్గాలను కనుగొనేందుకు ఇరుదేశాలకు చెందిన ఏడుగురు మాజీ మంత్రులు ప్రయత్నాలు ప్రారంభించారు. భారత్‌కు చెందిన జశ్వంత్‌సింగ్‌, నట్వర్‌సింగ్‌, మణిశంకర్‌ అయ్యర్ పాకిస్థాన్‌ నుంచి ఖుర్షీద్‌ ఎం.కసూరీ, సర్తాజ్‌ అజీజ్‌, అబ్దుల్‌ సత్తార్‌, గొహర్‌ అయూబ్‌ఖాన్‌ ఇరుదేశాల మధ్య నలుగుతున్న కాశ్మీర్‌ వ్యవహారం, జలాల పంపిణీ, ఉగ్రవాదం వంటి కీలక అంశాలపై వారు పరస్పరం అభిప్రాయాలు పంచుకున్నారు. ఇకపై ప్రతిఏటా సమావేశం కావాలని నిర్ణయించారు.

ఇవి కూడా చూడండి[మార్చు]

భారత్ పాక్ యుద్దం 1965
భారత్ పాక్ యుద్దం 1971

మూలాలు[మార్చు]

  1. "Area, Population, Density and Urban/Rural Proportion by Administrative Units". Population Census Organization, Government of Pakistan. Retrieved 2008-02-13. 
  2. 2.0 2.1 2.2 2.3 "Pakistan". International Monetary Fund. Retrieved 2008-10-09. 
  3. 2008 HDI Statistical Update