ఎయిర్ బ్లూ
ఎయిర్ బ్లూ లిమిటెడ్ (ఎయిర్ బ్లూ అంటారు) పాకిస్థాన్కు చెందిన ఓ ప్రయివేటు విమానయాన సంస్థ. ఇస్లామాబాద్ నగరంలోని ఇస్లామాబాద్ స్టాక్ ఎక్స్చేంజీ (ఐఎస్ఇ) టవర్స్ 12వ అంతస్తులో దీని ప్రధాన కార్యాలయం ఉంది.[1] ఎయిర్ బ్లూ ప్రతిరోజు దేశీయంగా ఇస్లామాబాద్, లాహోర్, కరాచీ, పెషావర్ నగరాలతోపాటు అంతర్జాతీయంగా దుబాయ్, అబుదాబీ, షార్జా, మస్కట్ దేశాలకు 30 సర్వీసులను నడిపిస్తుంటుంది. కరాచీ నగరంలోని జిన్నత్ అంతర్జాతీయ విమానాశ్రయం దీని ప్రధాన స్థావరం.
చరిత్ర
[మార్చు]ఎయిర్ బ్లూ విమాన సంస్థ 2003లో ప్రారంభించబడింది. దీని కార్యకలాపాలు 2004 జూన్ 18 నుంచి అందుబాటులోకి వచ్చాయి. అప్పటి పాకిస్థాన్ ప్రధాన మంత్రి జఫారుల్లా ఖాన్ జమేలీ ఎయిర్ బ్లూ సేవలను ప్రారంభించారు. ఎయిర్ బస్ ఎ 320-200 విమానాలను మూడింటిని మొదట అద్దె ప్రాతిపదికన తీసుకుని వాటిని కరాచీ–లాహోర్, కరాచీ–ఇస్లామాబాద్ మధ్య నడిపించారు.[2]
గమ్యాలు
[మార్చు]మార్చి 2015 నాటికి ఎయిర్ బ్లూ సేవలందించే గమ్యస్థానాలు:[3]
దేశం | నగరం | విమానాశ్రయం | సూచనలు | మూలాలు |
---|---|---|---|---|
ఒమన్ | మస్కట్ | మస్కట్
అంతర్జాతీయ విమానాశ్రయం |
[3] | |
పాకిస్థాన్ | ఫైసలాబాద్ | ఫైసలాబాద్
అంతర్జాతీయ విమానాశ్రయం |
రద్దు
అయింది |
[4] |
పాకిస్థాన్ | గ్వాడర్ | గ్వాడర్
అంతర్జాతీయ విమానాశ్రయం |
రద్దు
అయింది |
[5] |
పాకిస్థాన్ | ఇస్లామాబాద్ | బెనజీర్
భుట్టో అంతర్జాతీయ విమానాశ్రయం |
ఫోకస్
సిటీ |
[3] |
పాకిస్థాన్ | కరాచీ | జిన్నా
అంతర్జాతీయ విమానాశ్రయం |
స్థావరం | [3] |
పాకిస్థాన్ | లాహోర్ | అల్లమా
ఇక్బాల్ అంతర్జాతీయ విమానాశ్రయం |
ఫోకస్
సిటీ |
[3] |
పాకిస్థాన్ | ముల్తాన్ | ముల్తాన్
అంతర్జాతీయ విమానాశ్రయం |
[3] | |
పాకిస్థాన్ | నవాబ్
షా |
నవాబ్
షా విమానాశ్రయం |
రద్దు
అయింది |
[4] |
పాకిస్థాన్ | పెషావర్ | బచాఖాన్
అంతర్జాతీయ విమానాశ్రయం |
[3] | |
పాకిస్థాన్ | క్వెట్టా | క్వెట్టా
అంతర్జాతీయ విమానాశ్రయం |
రద్దు
అయింది |
[4] |
పాకిస్థాన్ | రహీం
యార్ ఖాన్ |
షేక్
జాయద్ అంతర్జాతీయ విమానాశ్రయం |
[3] | |
పాకిస్థాన్ | సెయిల్
కోట్ |
సెయిల్
కోట్ అంతర్జాతీయ విమానాశ్రయం |
[3] | |
సౌదీ
అరేబియా |
జెడ్డా | కింగ్
అబులాజిజ్ అంతర్జాతీయ విమానాశ్రయం |
[3] | |
సౌదీ
అరేబియా |
రియాద్ | కింగ్
ఖాలీద్ అంతర్జాతీయ విమానాశ్రయం |
[3] | |
టర్కీ | ఇస్తాంబుల్ | సాబిహా
గోక్సెన్ అంతర్జాతీయ విమానాశ్రయం |
రద్దు
అయింది |
[6] |
యునైటెడ్
అరబ్ ఎమిరేట్స్ |
అబుదాబీ | అబుదాబీ
అంతర్జాతీయ విమానాశ్రయం |
[3] | |
యునైటెడ్
అరబ్ ఎమిరేట్స్ |
దుబాయ్ | దుబాయ్
అంతర్జాతీయ విమానాశ్రయం |
[3] | |
యునైటెడ్
అరబ్ ఎమిరేట్స్ |
షార్జా | షార్జా
అంతర్జాతీయ విమానాశ్రయం |
[3] | |
యునైటెడ్
కింగ్ డమ్ |
బిర్మిన్గమ్ | బిర్మిన్గమ్
విమానాశ్రయం |
రద్దు
అయింది |
[7] |
యునైటెడ్
కింగ్ డమ్ |
మాంచెస్టర్ | మాంచెస్టర్
విమానాశ్రయం |
రద్దు
అయింది |
[8] |
సేవలు
[మార్చు]ఎయిర్ బ్లూ ఎయిర్ లైన్స్ సంస్థ ప్రయాణికులకోసం అనేక సేవలందిస్తోంది. అన్ని విమానాల్లోనూ 3x3 లే అవుట్ తో ఎకానమీ క్యాబిన్, ప్రతీ సీటుకు ఓవర్ హెడ్ వీడియో స్క్రీన్ల సదుపాయం ఉంటుంది. పాకిస్థాన్ నుంచి ఇ-టికెటింగ్ సదుపాయాన్ని కల్పించిన తొలి విమాన సంస్థ ఎయిర్ బ్లూ. వైర్ లెస్ చెక్ ఇన్, సెల్ఫ్ చెకిన్ కియాస్క్ సదుపాయాలనందిస్తోంది. ఎయిర్ బ్లూ సొంతంగా జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయం, కరాచీ లోనవంబరు 2008 లో సొంతంగా ప్రారంభించిన ప్రీమియం లాంజ్ లో ఇంటర్నెట్, కేబుల్ టీవీ, పత్రికలు, మర్దన కుర్చీలు, స్నాక్ బార్ సదుపాయాలున్నాయి. ఎయిర్ బ్లూ ఇ-కార్గో ద్వారా పాకిస్థాన్, యు.ఎ.ఇ., యు.కె. దేశాలకు సరుకులు రవాణా చేయవచ్చు.
విమానాలు
[మార్చు]జనవరి 2015నాటికి ఎయిర్ బ్లూ నడుపుతున్న విమానాల వివరాలు (వీటి సగటు వయస్సు 8.9 సంవత్సరాలు) :[9]
విమానరకం | సేవలో | ఆర్డర్లు | సూచనలు |
---|---|---|---|
ఎయిర్
బస్ ఎ320-200 |
4 | 0 | 3
అద్దె, ఒకటి ఐ.ఎల్.ఎఫ్.సి, రెండు ఎ.డబ్ల్యు.ఎ.ఎస్ |
ఎయిర్
బస్ ఎ321-200 |
4 | 0 | విండ్రోజ్
ఎయిర్ లైన్స్ నుంచి, మే 2015 వరకు అద్దెకు[10] |
ఎయిర్
బస్ ఎ330-200 |
1 | 0 | |
మొత్తం | 9 | 0 |
ప్రమాదాలు-సంఘటనలు
[మార్చు]ఎయిర్ బ్లూ విమానం 202: 2010 జూలై 28 నాడు కరాచీ లోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఎయిర్ బ్లూ ఎయిర్ బస్ ఎ321 విమానం ఇస్లామాబాద్ లోని బెనజీర్ భుట్టో అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఉన్నమార్గల్లా కొండలకు ఢీకొని ప్రమాదానికి గురైంది.[11]
బయటి లింకులు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Contacting Us Archived 2010-07-29 at the Wayback Machine." Airblue. Retrieved on 2015-07-23. "Airblue Limited (Corporate Headquarters) 12th Floor, ISE Towers 55-B Jinnah Avenue Islamabad 111-247-258."
- ↑ Schmitz 2006, p. 57.
- ↑ 3.00 3.01 3.02 3.03 3.04 3.05 3.06 3.07 3.08 3.09 3.10 3.11 3.12 3.13 "Airblue schedule". Archived from the original on 2013-10-29. Retrieved 2015-07-23.
- ↑ 4.0 4.1 4.2 "Former domestic route map". Archived from the original on 2013-07-19. Retrieved 2015-07-23.
- ↑ "Airblue/JS Air Gwadar service". Archived from the original on 2011-07-13. Retrieved 2015-07-23.
- ↑ "Airbue launch Istanbul". Archived from the original on 2013-12-02. Retrieved 2015-07-23.
- ↑ Air Blue suspends Birmingham to Pakistan flights
- ↑ "Air Blue Manchester suspension news". Archived from the original on 2014-02-01. Retrieved 2015-07-23.
- ↑ "Airblue flight schedule". cleartrip.com. Archived from the original on 2021-05-15. Retrieved 2015-07-23.
- ↑ Air Blue to lease A330-200 from Windrose
- ↑ "ASN Aircraft accident Airbus A321-231 AP-BJB Islamabad-Benazir Bhutto International Airport (ISB)". Aviation Safety Network. Archived from the original on 2018-12-25. Retrieved 2015-07-23.