ముహమ్మద్ అలీ జిన్నా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ముహమ్మద్ అలీ జిన్నాహ్
ముహమ్మద్ అలీ జిన్నా


పదవీ కాలం
ఆగస్టు 15, 1947 – సెప్టెంబర్ 11, 1948
ప్రధాన మంత్రి లియాఖత్ అలీ ఖాన్
చక్రవర్తి జార్జి VI
ముందు లేరు; పదవి సృష్టించబడింది
ఎర్ల్ మౌంట్ బాటన్ ఆఫ్ బర్మా (భారతదేశ వైశ్రాయ్ గా)
తరువాత సర్ ఖ్వాజా నాజిముద్దీన్

వ్యక్తిగత వివరాలు

జననం డిసెంబర్ 25, 1876
బ్రిటిష్ రాజ్ కరాచీ, బ్రిటిష్ ఇండియా
మరణం సెప్టెంబర్ 11, 1948 (వయస్సు 71)
పాకిస్తాన్ కరాచీ, పాకిస్తాన్
రాజకీయ పార్టీ భారతీయ జాతీయ కాంగ్రెస్ (1896-1913)
ముస్లిం లీగు (1913-1948)
జీవిత భాగస్వామి ఎమీబాయి జిన్నా
మర్యం జిన్నా
సంతానం దీనా జిన్నా
వృత్తి న్యాయవాది, రాజకీయవేత్త
మతం ఇస్లాం - షియా ముస్లిం [1][1][2][3][4]

ముహమ్మద్ అలీ జిన్నాహ్ లేదా మహమ్మద్ అలీ జిన్నా (ఆంగ్లం : Muhammad Ali Jinnah or Mahomed Ali Jinnah; ఉర్దూ: محمد علی جناح ) (1876 డిసెంబరు 251948 సెప్టెంబరు 11), 20వ శతాబ్దానికి చెందిన రాజకీయనాయకుడు, భారత్‌ను విభజించి పాకిస్తాన్ ను ఏర్పాటుచేసిన నాయకుడు. ఇతడు షియా ముస్లిం. ముస్లిం లీగ్ నకు అధ్యక్షుడిగా ఉన్నాడు. ఇతడికి పాకిస్తాన్ లో, కాయద్ ఎ ఆజం (ఉర్దూ قائد اعظم ) — "మహా నాయకుడు"), జాతి పిత (పాకిస్తాన్) Baba-e-Qaum (بابا قوم) అని పిలుస్తారు.

జిన్నా భారత జాతీయ కాంగ్రెస్లో ప్రధానపాత్ర పోషించేవాడు, 1916 లక్నో ఒప్పందంలోనూ ముస్లింలీగ్ ను హిందూ-ముస్లింల ఐక్యత కొరకునూ పాటుపడ్డాడు. అంతేగాక అఖిలభారత హోంరూల్ లీగ్ లోనూ క్రియాశీలకంగా ఉన్నాడు. ఇతను రాజ్యాంగ సంస్కరణ ప్రణాళిక-పద్నాలుగు సూత్రాలు తయారుచేశాడు, దీని ప్రకారం ముస్లింల హక్కులు సంరక్షింపబడుతాయి. ముస్లింలీగ్ లోని అభిప్రాయభేదాలవలన ఈ ప్రతిపాదన సఫలం కాలేదు. దీనివలన జిన్నా దీర్ఘకాలం కొరకు లండన్ వెళ్ళిపోయాడు.

అనేక ముస్లిం నాయకులు, జిన్నాను బుజ్జగించి, 1934లో మరలా భారత్‌ను రప్పించుటలో సఫలీకృతులయ్యారు. భారత్ వచ్చిన జిన్నా ముస్లింలీగ్ ను ప్రక్షాళణా కార్యక్రమం చేపట్టాడు. లాహోర్ తీర్మానం ద్వారా తన "దేశ విభజన" కావాలి ముస్లింల కొరకు ప్రత్యేక దేశం కావాలి అనే పట్టును సాధించుకున్నాడు. 1946లో జరిగిన ఎన్నికలలో ముస్లింలీగ్ అనేక సీట్లను గెలుచుకున్నది. జిన్నా నేరు కార్యాచరణ ఉద్యమం చేపట్టాడు, ఈ ఉద్యమం ద్వారా పాకిస్తాన్ స్వాతంత్ర్యం పొందుటకు మార్గం సుగమమయింది. ఆంగ్లేయుల విభజించు-పాలించు సూత్రాన్ని అమలు పరచుటలో జిన్నా ఒక పావుగా మారాడు. ఇందుకు విరుద్దంగా కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజాందోళనలకు దిగారు, దక్షిణాసియాలో హింస ప్రజ్వరిల్లినది. దేశాన్ని పాలించుటకు, కాంగ్రెస్-ముస్లింలీగ్ లు ఏకం కాలేదు, కనీసం ఏక సూత్రముపైనా రాలేదు. ఇదే అదనుగా బ్రిటిష్ ప్రభుత్వం భారత్-పాకిస్తాన్ లకు స్వతంత్రాన్ని ప్రకటించింది. స్వాతంత్ర్యం పొందిన ఇరుదేశాలలో కాందిశీకులు ఇరువైపులా ఎక్కువయ్యారు, వీరి గృహసౌకర్యాలను కల్పించడంలో తన సాధారణ పాత్రను అమలులో పెట్టాడు.

జిన్నా, గాంధీ, 1944.
జిన్నా సమాధి

జీవితవిశేషాలు

[మార్చు]

ప్రశంశలు, విమర్శలు

[మార్చు]
  • ‘కొందరు వ్యక్తులు ప్రముఖంగా చరిత్రను మలచారు. కొందరు ప్రపంచ మ్యాపును మార్చగలిగారు. అతికొద్ది మంది మాత్రమే దేశాలను ఏర్పాటు చేయగలరు. జిన్నా ఇవి మూడూ చేసాడు. - స్టాన్లీ వోల్పర్ట్ [6]
  • పాకిస్తాన్ లో ఇతనిని "కాయద్-ఎ-ఆజమ్" (జాతి నాయకుడు) అని పిలుస్తారు.
  • జిన్నా త్రాగుడుకు బానిస, మరణానికి ముందు త్రాగుడు మానేశాడు --.ఎస్. అహ్మద్ [7]
  • మహమ్మద్ అలీ జిన్నా'లౌకిక' నేత, 'హిందూ-ముస్లిం ఐక్యతా రాయబారి ---ఎల్.కె.అద్వానీ 2005 జూన్ 4 పాకిస్తాన్లో జిన్నా సమాధి ముందు నిలబడి.
  • జిన్నా విలన్ కాదు, భారత్ తప్పుగా అర్థం చేసుకుంది. ఆయన్ను భూతంలా చిత్రించింది.నెహ్రూ వల్లే దేశ విభజనజరిగింది. పాకిస్థాన్ వ్యవస్థాపకుడు మహ్మద్ అలీ జిన్నాను భారత్ తప్పుగా అర్థం చేసుకుని భూతంలా చిత్రించింది. హిందువులకు జిన్నా వ్యతిరేకం కాదు. జిన్నా గొప్పవాడు. ఆయన శూన్యం నుంచి ఒక దేశాన్ని సృష్టించారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీని, బ్రిటన్‌ను తీవ్రంగా వ్యతిరేకించేవారు. జిన్నా గొప్ప భారతీయుడని గాంధీజీ కూడా ప్రశంసించారు. అలాంటప్పుడు మనమెందుకు ఆయన్ను గుర్తించకూడదు? అసలు ఆ కోణంలో మనం ఎందుకు చూడట్లేదు? భారత్ ఆయన్ను తప్పుగా అర్థం చేసుకుని భూతంలా చిత్రించింది. దేశ విభజనకు జిన్నా కారకుడు కాదు. నెహ్రూ అనుసరించిన కేంద్రీకృత విధానం వల్లే అవిభాజ్య దేశం ముక్కలైంది. ఈ విషయంలో అంతిమ నిర్ణయం నెహ్రూ కాకుండా మహాత్మా గాంధీ, రాజాజీ, మౌలానా అజాద్‌లు తీసుకుని ఉంటే అవిభాజ్య భారత్ ఉండేది. హిందువులకు జిన్నా వ్యతిరేకమనే అభిప్రాయం కూడా తప్పు. నేను భారతీయ జనతా పార్టీ ఎంపీగా ఈ పుస్తకం రాయలేదు. ఓ భారతీయుడిగా రాశాను. విభజన వల్ల భారతీయ ముస్లింలు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. పాక్ వైఖరి మారుతోంది: భారత్ పట్ల పాక్ వైఖరిలో కొంత మార్పు వచ్చింది. జిన్నా వ్యక్తిత్వానికి ఆకర్షితుడనైనందునే ఆయనపై పుస్తకం రాశాను. జిన్నా బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగానే కాదు, భారతీయ ముస్లింల తరఫున కూడా అనవరతం పోరాడాడు. జిన్నా గొప్ప వ్యక్తి, అనుకున్నది సాధించగలిగిన, ఏమీ లేని దాని నుంచి ఒక దేశాన్ని సాధించగలిగిన సమర్థనేత. 1947లో దేశ విభజనకు మూలకారకుడిగా, ముఖ్యమైన 'విలన్'గా మహమ్మద్ అలీ జిన్నా వైపు చూడొద్దు.విభజనలో జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇతర కాంగ్రెస్ నేతలే కీలక పాత్ర పోషించారు.దేశం ముక్కలవటంలో జిన్నా పాత్రను ఎక్కువచేసి ఆయనను విలన్‌గా చూడటమన్నది విభజన గాయాల బాధ, ఆ ఆవేదన నుంచి పుట్టిన ఆగ్రహమేగానీ జిన్నా హిందువుల పట్ల విద్వేషం చూపారన్నది వాస్తవం కాదు. 'జిన్నా వ్యతిరేకత హిందువులు, హిందూ మతం పట్ల కానేకాదు, ఆయన వ్యతిరేకత అంతా కూడా ముస్లిం లీగ్‌కు తనను తాను రాజకీయ ప్రత్యర్థిగా భావించుకునే కాంగ్రెస్ నాయకత్వం పట్లే. జిన్నాను గాంధీ, గోఖలే, నెహ్రూ... తదితరులు గొప్ప భారతీయుడని కీర్తించారు--- [8]
  • జిన్నా ఒకప్పుడు సమైక్యవాది భారత్ విముక్తికోసం లోకమాన్య తిలక్‌తో కలిసి ఎంతో కృషి చేశారు. టర్కీలో ఖలీఫా పదవీచ్యుతుడైనప్పుడు ఆయనకు అనుకూలంగా ఉద్యమం నడపాలన్న కాంగ్రెస్ వాదనను జిన్నా వ్యతిరేకించారు. ఆ దేశంలో జరిగిన దానికి మనకేం సంబంధమని అడిగారు. ఆయన మాటలనుకాంగ్రెస్ వినకపోవటంతో విచారంతో ఆయన లండన్ వెళ్లిపోయి తిరిగి 1927లో భారత్‌కు వచ్చారు. ఆ తరువాత బ్రిటిషర్ల రాజనీతి వల్ల ఆయన ప్రత్యేకదేశం కోరేవాడిగా మారారు.--- [9]

ఇవీ చూడండి

[మార్చు]

పాదపీఠికలు

[మార్చు]
Muhammad Ali Jinnah గురించిన మరింత సమాచారం కొరకు వికీపీడియా సోదర ప్రాజెక్టులు అన్వేషించండి

నిఘంటువు విక్షనరీ నుండి
పాఠ్యపుస్తకాలు వికీ పుస్తకాల నుండి
ఉదాహరణలు వికికోట్ నుండి
వికీసోర్సు నుండి వికీసోర్సు నుండి
చిత్రాలు, మీడియా చిత్రాలు, మీడియా నుండి
వార్తా కథనాలు వికీ వార్తల నుండి

  1. 1.0 1.1 "Interview with Vali Nasr". Archived from the original on 2008-01-23. Retrieved 2009-02-12.
  2. "End in sight for a dynasty steeped in power, death and politics". Archived from the original on 2008-10-12. Retrieved 2009-02-12.
  3. http://www.indianexpress.com/news/muslim-law-doesnt-apply-to-jinnah-says-daughter/372877/
  4. Vali Nasr The Shia Revival: How Conflicts Within Islam Will Shape the Future (W. W. Norton, 2006), pp. 88-90 ISBN 0-3933-2968-2
  5. http://www.andhrajyothy.com/mainshow.asp?qry=/2009/aug/30main58[permanent dead link]
  6. Wolpert, Stanley, Jinnah of Pakistan
  7. Ahmed, Akbar S., Jinnah, Pakistan and Islamic Identity, p.200.
  8. జశ్వంత్‌సింగ్.'జిన్నా-భారత్, విభజన, స్వాతంత్య్రం' అనే పుస్తకం లో.ఈనాడు 17.8.2009,20.8.2009,10.10.2009.
  9. ఆరెస్సెస్ మాజీ అధ్యక్షుడు సుదర్శన్. ఈనాడు25.8.2009.

మూలాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]