Jump to content

బానిసత్వం

వికీపీడియా నుండి

బానిసత్వం అంటే సేవలు చేయించుకునేందుకు మనుషులను ఒక ఆస్తి లాగా కలిగి ఉండటం.[1] ఈ పని చేసేవారిని బానిసలు, సేవకులు, లేదా దాసులు అంటారు. బానిసత్వంలో సేవకులకు ఇష్టమున్నా లేకపోయినా ఖచ్చితంగా పని చేయాల్సిందే. వాళ్ళు పనిచేసే ప్రదేశం, సమయం మొదలైనవన్నీ వారి యజమానుల చేతిలోనే ఉంటాయి.

చరిత్రలో చట్టాన్ని ఉల్లంఘించడం, అప్పులపాలు కావడం, సైనిక ఓటమిని చవిచూడడం లేదా చవకైన శ్రమ కోసం దోపిడీ చేయడం వంటి అనేక బానిసత్వ ఘటనలు సంభవించాయి. బానిసత్వం ఇతర రూపాలు జాతి లేదా లింగం ఆధారంగా కూడా జరిగాయి. బానిసలను జీవితాంతం బంధీగా ఉంచవచ్చు లేదా నిర్ణీత కాలం తర్వాత వారికి స్వేచ్ఛ ఇవ్వబడుతుంది.[2] బానిసత్వం చాలాసార్లు అప్రయత్నంగానే, నిర్బంధంగా జరిగేదే అయినా, కొన్ని సందర్భాల్లో బానిసలు తమంతట తామే అందులోకి ప్రవేశించడమో, లేక పేదరికాన్ని తట్టుకోలేక అందులోకి వెళ్ళడమో చేస్తుంటారు. మానవ చరిత్రలో బానిసత్వం ఒక నాగరికత లక్షణంగా కనిపించినా, కొన్ని సమాజాలలో చట్టబద్ధమే అయినప్పటికీ ప్రస్తుతం చాలా దేశాల్లో బానిసత్వానికి వ్యతిరేకంగా చట్టాలు వచ్చాయి. జైలులో ఖైదీలతో నిర్బంధంగా చేయించే పనికి మాత్రం ఈ చట్టాలలో మినహాయింపు ఉంది.[3][4]

మూలాలు

[మార్చు]
  1. Allain, Jean (2012). "The Legal Definition of Slavery into the Twenty-First Century". In Allain, Jean (ed.). The Legal Understanding of Slavery: From the Historical to the Contemporary. Oxford: Oxford University Press. pp. 199–219. ISBN 978-0-19-164535-8.
  2. Baker-Kimmons, Leslie C. (2008). "Slavery". In Schaefer, Richard T. (ed.). Encyclopedia of Race, Ethnicity, and Society. Vol. 3. SAGE Publishing. p. 1234. ISBN 9781412926942.
  3. Bales 2004, p. 4.
  4. White, Shelley K.; White, Jonathan M.; Korgen, Kathleen Odell (2014). Sociologists in Action on Inequalities: Race, Class, Gender, and Sexuality. SAGE Publishing. p. 43. ISBN 978-1-4833-1147-0.