స్వేచ్ఛ
స్వేచ్ఛ అనేది జీవన విధానంపైనా, ప్రవర్తన పైనా, రాజకీయ అభిప్రాయాల పైనా అణచివేతలు లేకుండా సమాజంలో జీవించగలిగే స్థితి.[1] స్వేచ్ఛ అనే భావనకు సందర్భాన్ని బట్టి వేర్వేరు అర్థాలుంటాయి. వ్యక్తి, తనకు సామర్ధ్యం ఉన్నంతవరకూ, ఇతరుల హక్కులకు భంగం కలగనంతవరకూ అనుభవించేదే స్వేచ్ఛ. కొన్ని దేశాలలో, నేరస్థులకు శిక్షగా వారి స్వేచ్ఛను తొలగించడం ఉంటుంది.
రాజకీయ స్వేచ్ఛ
[మార్చు]రాజకీయ స్వేచ్ఛ అనే ఆధునిక భావనకు మూలాలు గ్రీకుల స్వేచ్ఛ, బానిసత్వాల భావనలలో ఉన్నాయి.[2] గ్రీకులకు, స్వేచ్ఛగా ఉండడమంటే యజమాని ఉండకపోవడం, యజమాని నుండి స్వతంత్రంగా ఉండటం (ఒకరికి నచ్చినట్లు జీవించడం).[3][4] అది స్వాతంత్ర్యానికి సంబంధించిన అసలు గ్రీకు భావన. అరిస్టాటిల్ చెప్పినట్లుగా ఇది ప్రజాస్వామ్య భావనతో దీనికి దగ్గరి సంబంధం ఉంది.
ప్రాచీన భారతదేశంలోని మౌర్య సామ్రాజ్యంలో, వివిధ మతాలు, జాతుల ప్రజలందరికీ స్వేచ్ఛ, సహనం, సమానత్వ హక్కులు ఉండేవి. సమతౌల్య ప్రాతిపదికన సహనం ఉండాల్సిన అవసరాన్ని అశోకుడి శాసనాలలో చూడవచ్చు. ప్రభుత్వ ప్రజావిధానంలో సహనం ప్రాముఖ్యతను ఇది నొక్కి చెబుతుంది. యుద్ధ ఖైదీలను వధించడం లేదా పట్టుకోవడం కూడా అశోకుడు ఖండించినట్లు కనిపిస్తుంది.[5] మౌర్య సామ్రాజ్యంలో బానిసత్వం కూడా లేనట్లు కనిపిస్తుంది.[6] అయితే, హెర్మన్ కుల్కే, డైట్‌మార్ రోథర్‌మండ్‌లు "అశోకుని ఆదేశాలకు మొదటి నుండి ప్రతిఘటన ఎదురైనట్లు కనిపిస్తోంది," అన్నారు.[7]
మూలాలు
[మార్చు]- ↑ (2010-01-01). "New Oxford American Dictionary".
- ↑ Rodriguez, Junius P. (2007) The Historical Encyclopedia of World Slavery: A–K; Vol. II, L–Z, [page needed]
- ↑ Mogens Herman Hansen, 2010, Democratic Freedom and the Concept of Freedom in Plato and Aristotle
- ↑ Baldissone, Riccardo (2018). Farewell to Freedom: A Western Genealogy of Liberty. doi:10.16997/book15. ISBN 978-1911534600.
- ↑ Amartya Sen (1997). Human Rights and Asian Values. ISBN 0-87641-151-0.[page needed]
- ↑ Arrian, Indica:
"This also is remarkable in India, that all Indians are free, and no Indian at all is a slave. In this the Indians agree with the Lacedaemonians. Yet the Lacedaemonians have Helots for slaves, who perform the duties of slaves; but the Indians have no slaves at all, much less is any Indian a slave."
- ↑ Hermann Kulke, Dietmar Rothermund (2004). A history of India. Routledge. p. 66. ISBN 0-415-32920-5