అబ్దుల్లా ఎల్ బాకీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మౌలానా

ముహమ్మద్ అబ్దుల్లా ఎల్-బాకీ

సాహెబ్
মুহাম্মদ আব্দুল্লাহিল বাকী
వ్యక్తిగతం
జననం
నుహమ్మద్ అబ్దుల్లా బాకీ

1886
తబ్‌గ్రాం, బర్ద్‌వాన్ జిల్లా, ప్రస్తుత పశ్చిమ బెంగాల్
మరణం1952 డిసెంబరు 1(1952-12-01) (వయసు 65–66)
తూర్పు పాకిస్తాన్ (ప్రస్తుత బంగ్లాదేశ్)
మతంఇస్లాం
Denominationసున్నీ
తెగఅహ్ల్-ఇ హదీత్
మతాచారంఖిలాఫత్ ఉద్యమం
సహాయ నిరాకరణోద్యమం
పాకిస్తాన్ ఉద్యమం
రాజకీయ పార్టీక్రిషక్ ప్రజాపార్టీ
ఆల్ ఇండియా ముస్లిం లీగ్
విద్యాసంస్థలాల్బారీ మదరసా
కాన్పూర్ మదరసా
వృత్తిమత పండితుడు, రచయిత, రాజకీయ నాయకుడు
Senior posting
Initiatedఅంజుమన్-ఇ-ఉలేమా-బంగలా

ముహమ్మద్ అబ్దుల్లా ఎల్-బాకీ బెంగాలీ ఇస్లామిక్ పండితుడు, రచయిత, రాజకీయవేత్త. కేంద్ర శాసనసభ సభ్యునిగా భారత స్వాతంత్ర్య ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించాడు. అతను ఉత్తర బెంగాల్‌లో అహ్ల్-ఐ హదీత్ ఉద్యమానికి చెందిన ప్రముఖ నాయకుడు. దేశ విభజనకు ముందు అహ్ల్-ఐ హదీత్ సమావేశాలలో అతను ప్రముఖ పాత్ర పోషించాడు. [1]

తొలి జీవితం[మార్చు]

బ్రిటిషు భారతదేశంలో బెంగాల్ లోని బర్ద్‌వాన్ జిల్లా, తుబ్‌గ్రామ్ గ్రామంలో బెంగాలీ ముస్లిం కుటుంబంలో బాకీ జన్మించాడు. చిన్నతనం లోనే దినాజ్‌పూర్ జిల్లాలోని నూరుల్ హూడా ప్రాంతానికి వలస వెళ్లాడు. రంగాపూర్ జిల్లా, బదర్‌గంజ్ లోని లాల్‌బారీ మదరసాలో ప్రాథమిక విద్య నేర్చుకున్నాడు. ఆ తరువాత, కాన్పూర్‌లో ఒక మదరసాలో చేరాడు, అక్కడ అతను ఇస్లామిక్ అధ్యయనాల్లో, అరబిక్ భాషలో విద్య అభ్యసించాడు.

వృత్తి, రాజకీయాలు[మార్చు]

1907 లో, అతను నూరుల్ హూడా మైనర్ పాఠశాల, నూరుల్ హూడా జూనియర్ మదరసాలను స్థాపించాడు. 1951 - 1962 మధ్యకాలంలో, ఇది నూరుల్ హూడా హై మదరసాగా ప్రసిద్ధి చెందింది. [2] 1913 మార్చిలో బోగ్రాలో జరిగిన ఒక ఇస్లామిక్ సమావేశంలో బాకీ, మొహమ్మద్ అక్రమ్ ఖాన్, మనీరుజ్జామాన్ ఇస్లామాబాదీ, ముహమ్మద్ షహీదుల్లాలతో కలిసి అంజుమన్-ఇ-ఉలమా-ఇ-బంగలాను స్థాపించాడు.

బాకీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ దినాజ్‌పూర్ శాఖకు అధ్యక్షుడిగా పనిచేసాడు. అతను ఖిలాఫత్ ఉద్యమం లోను, సహాయ నిరాకరణ ఉద్యమంలోనూ పాల్గొన్నాడు. 1935 లో, శాసనోల్లంఘన ఉద్యమాలలో పాల్గొన్నందుకు బాకీ, రెండుసార్లు జైలు శిక్ష అనుభవించాడు. బాకీ, ఉత్తర బెంగాల్ అహ్ల్-ఇ-హదీత్ కాన్ఫరెన్సుకు చెందిన రంగాపూర్ జిల్లా, హరగాచ్‌ శాఖకు అధ్యక్షుడిగా కూడా పనిచేసాడు. [1]

1934 లో బాకీ, ప్రజా పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తూ కేంద్ర శాసనసభలో సభ్యుడయ్యాడు. 1937 లో ఆల్ బెంగాల్ టెనెంట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. 1945 లో బాకీ, కృషక్ ప్రజా పార్టీని వీడి, ఆల్ ఇండియా ముస్లిం లీగ్‌లో చేరాడు. [3] పాకిస్తాన్ రాజ్యాంగ పరిషత్ సభ్యుడిగా, అతను పాకిస్తాన్ ఉద్యమంలో చురుగ్గా వ్యవహరించాడు. [4]

1947 లో పాకిస్తాన్ ఏర్పడ్డాక బాకీ, తూర్పు బెంగాల్ జమియత్-ఇ-అహ్ల్-ఇ-హదీత్ స్థాపించడంలో చురుకైన పాత్ర పోషించాడు. అతను, పాకిస్తాన్ మొదటి జాతీయ అసెంబ్లీ లోను, తూర్పు పాకిస్తాన్ శాసనసభలోనూ సభ్యుడయ్యాడు. ముస్లిం లీగ్ తూర్పు బెంగాల్ శాఖ అధ్యక్షుడిగా కూడా బాకీ పనిచేసాడు.

గ్రంథ పట్టిక[మార్చు]

బాకీ బెంగాలీలో అనేక రచనలు చేసాడు. అతనికి అరబిక్, పర్షియన్, ఉర్దూ, ఇంగ్లీషు భాషల్లో మంచి పట్టు ఉంది. అతని వ్యాసాలు సాధారణంగా తానే స్థాపించిన అంజుమన్-ఇ-ఉలామా-ఐ-బంగళా సంస్థ నుండి వెలువడే అల్-ఎస్లామ్ మాస పత్రికలో ప్రచురితమయ్యేవి. అతను పిరేర్ ధ్యాన్ (పిర్ యొక్క ధ్యానం) అనే చిరుపుస్తకం కూడా రాసాడు.

బాకీ 1952 డిసెంబరు 1 న మరణించాడు. [5]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 Pakistan Quarterly (in ఇంగ్లీష్). Pakistan Publications. 1964. p. 129.
  2. "প্রথম পাতা". Nurul Huda High School (in Bengali). Archived from the original on 2021-09-12. Retrieved 2021-09-12.
  3. Jalal, Ayesha (1994). The Sole Spokesman: Jinnah, the Muslim League and the Demand for Pakistan (in ఇంగ్లీష్). Cambridge University Press. p. 152. ISBN 978-0-521-45850-4.
  4. The Constituent Assembly (Legislature) of Pakistan Debate: Official Report (in ఇంగ్లీష్). Manager of Publications. 1953. p. 134.
  5. Constituent Assembly of Pakistan Debates: Official Report (in ఇంగ్లీష్). Manager of Publications. 1952. p. 45. Retrieved 26 April 2020.