ఖిలాఫత్ ఉద్యమం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

How many members are therein in khilafat committee ??ఖిలాఫత్ ఉద్యమం (1919-1924) ముస్లింలు, దక్షిణ ఆసియాలో ఉస్మానియా సామ్రాజ్యం పై బ్రిటిష్ ప్రభుత్వం దుర్నీతినుండి కాపాడడానికి లేవనెత్తిన ఉద్యమం. ఖిలాఫత్ ఉద్యమం మతసంబంధమయినప్పటికీ భారతదేశంలోని ఉదార జనబాహుళ్యం ఈ ఉద్యమానికి చేయూతనిచ్చింది. భారతదేశంలో దీని ప్రభావం ఎంత వరకు ఉండినదంటే, భారత స్వాతంత్ర్యోద్యమంలో భాగమైపోయింది.

చరిత్ర[మార్చు]

ఖిలాఫత్ అనునది ఇస్లామీయ పరిపాలనా విధానం. ఈ విధానంలో ప్రభుత్వం ఇస్లామీయ ధర్మశాస్త్రానుగుణంగా పరిపాలన సాగిస్తుంది. ఖలీఫా ఇస్లామీయ ధర్మానుగుణంగా రాజ్యాన్ని పరిపాలించువాడు. ఈ ఖలీఫా నామము ఉమయ్యద్ ఖలీఫా ల కాలంనుండి సాంప్రదాయమైంది. తరువాత అబ్బాసీయులు, ఫాతిమిద్ ఉస్మానియాలు దీనిని అనుసరించారు.

ఉస్మానియా ఖిలాఫత్[మార్చు]

ఒట్టోమాన్ చక్రవర్తి అబ్దుల్ హమీద్ II (1876-1909) టర్కీ పై పశ్చిమ దేశాల దురాక్రమణలను ఎదుర్కోవడానికి ఒక పాన్-ఇస్లామిక్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. ఇతడు "జమాలుద్దీన్ అఫ్ఘానీ"ని 19వ శతాబ్దపు చివర్లో భారతదేశానికి పంపాడు. ఉస్మానియా సామ్రాజ్యానికి ముస్లిం ప్రపంచంలో సానుభూతిని పొందటానికి ఇది తోడ్పడింది. ఉస్మానియా చక్రవర్తి ఒక ఖలీఫాగా ముస్లింల మతపరమైన , రాజకీయ నాయకుడిగా గుర్తింపు పొందడాని కూడా ఇది దోహదపడింది. ముస్లింనాయకుల పెద్ద సమూహం ముస్లింలలో అవగాహన పెంపొందించడానికి , ఖిలాఫత్ యొక్క ఆవశ్యకతను నొక్కి వక్కాణించడానికి చక్కగా పనిచేసింది. మౌలానా మెహమూద్ హసన్ ఉస్మానియా సామ్రాజ్యపు సహకారంతో బ్రిటిషువారికి వ్యతిరేకంగా భారత స్వతంత్ర సంగ్రామంలో ముఖ్య పాత్ర వహించాడు.

విభజన[మార్చు]

మొదటి ప్రపంచ యుధ్ధకాలంలో ఉస్మానియా సామ్రాజ్యం కేంద్రబలగాలతో ఉండి సైనికపరంగా దెబ్బతింది. 1919 లో వెర్సైల్ సంధితో దీని ఎల్లలు కుదించుకుపోయాయి, యూరప్ దేశాలు ఉస్మానియాసామ్రాజ్యానికి చేస్తాయన్న సహాయమూ నీరుగారింది. 1920లో సర్వెస్ సంధి మూలాన పాలస్తీనా, సిరియా, లెబనాన్, ఇరాక్, ఈజిప్టులు ఉస్మానియా సామ్రాజ్యం నుండి వేరు చేయబడ్డాయి. టర్కీలో జాతీయోద్యమమం మొదలైంది. 1919-1924 లో జరిగిన "టర్కీ స్వాతంత్ర్యోద్యమం", ముస్తఫా కమాల్ అతాతుర్క్ నాయకత్వంలో ఉస్మానియా సామ్రాజ్యం అంతరించి "గణతంత్ర టర్కీ" ఆవిర్భవించింది.

ఇవీ చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]