అనీ బిసెంట్
అనీ బిసెంట్ | |
---|---|
జననం | అక్టోబర్ 1, 1847 |
మరణం | సెప్టెంబర్ 20, 1933 |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | స్త్రీ వాది ఉద్యమ నాయకురాలు, రచయిత, సామ్యవాది,బ్రహ్మ జ్ఞానవాది, |
జీవిత భాగస్వామి | ఫ్రాంక్ బీసెంట్ |
అనీ బిసెంట్, (1847 అక్టోబర్ 1 - 1933 సెప్టెంబర్ 20) బ్రిటిష్ సామ్యవాది, బ్రహ్మ జ్ఞానవాది, మహిళాహక్కుల ఉద్యమవాది, రచయిత. ఆమె వాక్పటిమ కలిగిన స్త్రీ.[1]
అనీ వుడ్ బిసెంట్ ఐరిష్ జాతి మహిళ. లండను లోని క్లఫామ్ లో, 1847 అక్టోబరు 1 న జన్మించింది. 1933 సెప్టెంబరు 20 న తమిళనాడు లోని అడయారులో మరణించింది. ఈమె దివ్యజ్ఞాన తత్వజ్ఞి, మహిళల హక్కుల ఉద్యమకారిణి, రచయిత, వక్త. ఈమె ఐర్లాండ్, భారతదేశాల స్వాతంత్ర్యం, స్వయంపాలన కొరకు పోరాడింది. స్వయం పాలన ఉద్యమం స్థాపించింది.
తల్లి ధార్మిక స్వభావి. తండ్రి డా. విలియం ఫేజ్ గొప్ప విద్వాంసుడు. 1867 డిసెంబరులో తన 19 వ ఏట, తల్లి కోరికమేరకు ఫాదర్ ఫ్రాంక్ బిసెంట్ ని అనిబిసెంట్ పెళ్ళి చేసుకుంది. అంతవరకూ అనీగా పిలవబడిన ఆమె వివాహముతో అనీ బిసెంట్ గా మారింది. ఈమె 1874 లో ఇంగ్లాడులోని నేషనల్ సెక్యులర్ సొసైటీ అనే సంస్థలో చేరింది. లా అండ్ రిపబ్లిక్ లీగ్ ని స్థాపించి పోలీసు అత్యాచారాలకు బలైన కుటుంబాలకు సేవచేసింది.
ఆమెకు భర్తతో మతపరమైన విభేదాలు కలగడంతో విడిపోయారు. తరువాత ఆమె జాతీయ సామ్యవాద సంఘానికి ప్రముఖ ఉపన్యాసకురాలుగా వ్యవహరించింది. ఆమెకు చార్లెస్ బ్రాడ్‌లాఫ్‍తో సన్నిహిత మైత్రి కుదిరింది. 1887 లో వారిరువురు రచయిత చార్లెస్ నోల్టన్ పుస్తకం బర్త్ కంట్రోల్ ప్రచురణ విషయంలో విచారణను ఎదుర్కొన్నారు. ఈ అపకీర్తి వారికి ప్రాబల్యం కలిగించింది. 1880లో బ్రాడ్‍లాఫ్, నార్తాంప్టన్ నియోజకవర్గ పార్లమెంట్ సభ్యుడుగా ఎన్నికైయాడు.
1880లో అనీ బిసెంట్ "హెలెనా బ్లావట్‍స్కీ"ని కలుసుకున్న తరువాత ఆమె ఆసక్తి సామ్యవాదం నుండి దివ్యజ్ఞానం వైపు మళ్ళింది. ఆమె దివ్యజ్ఞానం సమాజంలో సభ్యత్వం స్వీకరించి, ఉపన్యాసకురాలిగా విజయం సాధించింది. దివ్యజ్ఞాన సమాజం బాధ్యతలలో భాగంగా ఆమె భారతదేశం వచ్చింది. 1898లో కేంద్రీయ హిందూ కళాశాల స్థాపనకు సహకరించింది. 1902 లో అమె " కో-ఫ్రీమసోంరీ లీ డ్రాయిట్ హ్య్జమన్ "ను ఇంగ్లాండులో స్థాపించింది. తరువాత కొద్ది సంత్సరాలలో ఈ తరహా నిర్మాణాలు బ్రిటన్ సామ్రాజ్యమంతటా స్థాపించింది. 1907లో ఆమె దివ్యజ్ఞానసమాజం అధ్యక్షురాలైంది.
మే యూనియన్ ని స్థాపించి కార్మికులకోసం పోరాడింది. 1898 జూలై 7న బనారస్ లోని ఒక చిన్న ఇంట్లో తాను కలలుగన్న విద్యాసౌధాన్ని ప్రారంభించి, దానిని అలహాబాదు విశ్వవిద్యాలయంగా పేర్కొంది. బాలగంగాధర తిలక్ 1895 లో ప్రస్తావించిన "స్వయంపాలన"ను 1914 లో అనీ బిసెంట్ కార్యరూపంలో పెట్టేందుకు ప్రజల్ని సంసిద్ధులను చేయసాగింది. దీనికి సంబంధించిన కామన్ వెల్త్ అనే వార పత్రికను ఆమె ప్రారంభించినది. 1915 లో ఈమె "హౌ ఇండియా ఫాట్ ఫర్ ఫ్రీడం" అనే పుస్తకాన్ని వ్రాసింది. భారతదేశ స్వాతంత్ర్యం గురించి వివరించింది.
ఆమె భారత రాజకీయాలలో ప్రవేశించి, భారతీయ జాతీయ కాంగ్రెస్‍లో సభ్యురాలైంది. 1914లో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభం అయిన సమయంలో హోం రూల్ లీగ్ స్వాతంత్ర్యోద్యమానికి సహకరించింది. 1917లో ఆమె భారతీయ జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలైంది. యుద్ధానంతరం ఆమె భారతీయ స్వాతంత్ర్య పోరాటం, దివ్యజ్ఞాన సమాజ కార్యక్రమాలు రెంటినీ 1933లో మరణించే వరకు కొనసాగించింది.
ఈమె రచించిన లెక్చర్ ఆన్ పొలిటికల్ సైన్స్ పుస్తకంలో పాశ్చాత్య, భారతీయ రాజకీయ వ్యవస్థల గురించి పరిష్కృతం కాగలిగే సూచనలను ఇచ్చినది. 1917లో అనీ బిసెంట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమించబడింది. ఎన్నోరకాల ప్రాతిపదికలతో జాతీయ విద్యా ప్రణాళికను రూపొందించించినది. న్యూ ఇండియా అనే దినపత్రిక ఈమెదే. ఇండియన్ బాయ్స్ స్కౌట్ అసోషియేషన్ను స్థాపించినది. ఈమెకు 1921లో కాశీ హిందూవిశ్వవిద్యాలయం డాక్టర్ ఆఫ్ లెటర్స్ బిరుదునిచ్చి సత్కరించినది. 80సంవత్సరాల వయసులో బుడాపెస్ట్ యూరోపియన్ కాంగ్రెస్, చికాగో ప్రపంచ కాంగ్రెస్ కు అధ్యక్షత వహించినది. 1933 సెప్టెంబర్ 20న ఆమె తుదిశ్వాస విడిచినది.
ఆరంభ జీవితం
[మార్చు]అనీ బిసెంట్ 1847లో లండన్‍లో ఐరోపా సంతతి వారైన ఒక మధ్యతరగతి దంపతులకు జన్మించింది. తన వారసత్వానికి గర్వించే ఆమె యవ్వనంలో ఐరోపా స్వతంత్ర రాజ్యానికి మద్దతు తెలియజేసింది. ఆమెకు ఐదు సంవత్సరాల వయసులో కుటుంబాన్ని పేదరికంలో వదిలి తండ్రి మరణించాడు. ఆమె తల్లి " హారో స్కూల్" బాలల వసతిగృహం నిర్వహణ చేస్తూ, కుటుంబ పోషణ భారం వహించింది. అనీని పోషించలేని పరిస్థితిలో స్నేహితురాలైన మారియెట్‍కు ఆమె సంరక్షణ భారం అప్పగించింది. మారియెట్ అనీకి మంచి విద్యాభ్యాసం అందిస్తానని మాట ఇచ్చింది. ఆమె అనీకి సమాజం పట్ల బాధ్యత, స్త్రీస్వాతంత్ర్యత యొక్క అవశ్యకత పట్ల అవగాహన కల్పించింది. యువప్రాయంలోనే ఆమె ఐరోపా అంతా పర్యటించింది. అక్కడ ఆమెకు రోమన్‍కాథలిక్కు మతం పట్ల కలిగిన అభిరుచి ఆమెను ఎప్పటికీ వదిలి పెట్టలేదు.
1867లో ఆమె ఆధ్యాత్మిక రంగంలో ఉన్న 26 సంవత్సరాల ఫ్రాంక్ బిసెంట్‍ను పెళ్ళి చేసుకుంది. ఆయన వాల్టర్ బిసెంట్ తమ్ముడు. ఆయన ఒక క్రైస్తవ మతవిశ్వాసి. అనీ బిసెంట్ ఆయనతో తన ఆలోచనలు పంచుకుంది. పెళ్ళైన సాయంత్రం ఆమెను కలుసుకున్న మిత్రులు రాజకీయాలలో పాల్గొనే ఆసక్తిని ఆమెలో కలుగ చేసారు. నగరంలోని పేద వర్గానికి చెందిన ఆంగ్లేయులతో, ఐరోపా వారితో సంబంధాలు ఏర్పడడానికి ఆ మిత్రులే కారణ మయ్యారు.
ఫ్రాంక్ త్వరగానే లింకన్ షైర్ లోని సిబ్సే చర్చిలో ప్రీస్ట్ అయ్యాడు. అనీ తన భర్తతో సిబ్సేకు మకాం మార్చుకుంది. వారికి ఆర్తర్, మాబెల్ అనే పిల్లలు పుట్టారు. ఏది ఏమైనా వివాహ జీవితం భగ్నమైంది. మొదటి వివాదం ధనం విషయంలోను, అనీ స్వాతంత్ర్యం విషయంలోనూ మొదలయింది. అనీ పిల్లల కోసం చిన్న కథలు, పుస్తకాలు, వ్యాసాలు రచించింది. వివాహిత అయిన స్త్రీకి చట్టరీత్యా ధనం మీద అధికారం లేదు కనుక అన్నీ సంపాదించిన ధనాన్ని ఫ్రాంక్ తీసుకున్నాడు. దంపతులను రాజకీయాలు మరింత వేరు చేసాయి. వ్యవసాయ కూలీలు సంఘంగా ఏర్పడి పరిస్థితులను మెరుగు పరచుకోవడానికి, భూస్వాములతో పోరాటం సాగిస్తున్న సమయంలో ఆనీ వారికి అండగా నిలిచింది. టోరీ పార్టీ సభ్యుడైన ఫ్రాంక్, భూస్వాములు, రైతుల వైపు నిలిచాడు. అనీ భర్తను తిరిగి కలుసుకోవడానికి నిరాకరించడంతో (క్రైస్తవ మతానికి సంబంధించిన కమ్యూనియన్) వారి వివాదం తారస్థాయికి చేరుకుంది. 1873 లో ఆమె భర్తను విడిచి లండనుకు తిరిగివెళ్ళింది. చట్టరీత్యా వారు విడిపోగానే కుమార్తె బాధ్యతను అనీ తీసుకుంది.
బిసెంట్ ఆమె విశ్వాసాన్ని తనకుతానే ప్రశ్నించుకుంది. ఆమె ఇంగ్లండ్ చర్చి కాథలిక్ శాఖ నాయకుడైన ఏడ్వర్డ్ బివరీ పుసెని కలుసుకుని సలహా అడిగింది. ఆమె తన ప్రశ్నకు సమాధానం తెలియజేయగల పుస్తకాలను చెప్పమని ఆయనను అడిగినప్పుడు ఆయన ఇప్పటికే నీవు చాలా చదివావు అని చెప్పాడు. ఫ్రాంక్‌ను కలుసుకుని తమ వివాహ జీవితం చక్కదిద్దడానికి చిట్టచివరి ప్రయత్నం చేసింది. అది విఫలం కావడంతో లండను విడిచి పెట్టింది.
బిర్క్‌బెక్
[మార్చు]అనీ బిసెంట్ బిర్క్‌బెక్ లిటరరీ అండ్ సైటిఫిక్ ఇన్‌స్టిట్యూట్‌లో విద్యాభ్యాసం ఆరంభించింది. అక్కడ ఆమె చేపట్టిన మత, రాజకీయ కార్యకలాపాలు రేపిన అలజడి కారణంగా ఇన్‌స్టిట్యూషన్ గవర్నర్లు ఆమె పరీక్షా ఫలితాలను నిలిపివేసారు.
సంస్కర్త, లౌకికవాది
[మార్చు]అనీ బిసెంట్ తన ఆలోచనలు సరిఅయినవని విశ్వసించి, వాటి కొరకు పోరాటం సాగించింది. ఆలోచనా స్వాతంత్ర్యం, స్త్రీహక్కులు, సామ్యవాదం, సంతాన నిరోధం, ఫాబియన్ సోషలిజం కొరకు, శ్రామికుల హక్కుల కొరకూ పోరాటం కొనసాగించింది.
వివాహరద్దును ఫ్రాంక్ తేలికగా తీసుకోలేక పోయాడు. ఆ కాలంలో వివాహరద్దు అన్నది మధ్యతరగతి జీవితాలను అంతగా చేరుకోలేదు. ఆనీ తన మిగిలిన జీవితంలో బిసెంట్ గానే మిగిలి పోయింది. ప్రారంభంలో ఆమె తన ఇద్దరు పిల్లలతో సత్సంబంధాలను కలిగి ఉంది. మాబెల్ ఆమెతోనే ఉంది. ఆమెకు భర్త నుండి స్వల్పంగా భరణం అందుతూ వచ్చింది. ఫ్రాంక్ నుండి స్వేచ్ఛపొందిన తరువాత ఆమెలో నుండి శక్తివంతమైన ఆలోచనలు వెలువడ్డాయి. ఆమె తాను అధిక కాలం నమ్మిన మతవిశ్వాసాన్ని కూడా ప్రశ్నించడం మొదలు పెట్టింది. చర్చి ప్రజలజీవితాలను నియంత్రించడాన్ని విమర్శిస్తూ వ్రాయడం మొదలు పెట్టింది. ప్రత్యేకించి, ఇంగ్లండు చర్చిల మతప్రచారాన్ని తీవ్రంగా విమర్శించసాగింది.
దివ్య జ్ఞాన సమాజం అధ్యక్షత
[మార్చు]అనిబిసెంట్ 1888 లో దివ్య జ్ఞాన సమాజంలో చేరింది. 1893 లో ఇండియాకు వచ్చింది
మూలాలు
[మార్చు]- ↑ "భారత స్వాతంత్ర్య పోరాటంలో వీర నారీమణులు". web.archive.org. 2021-09-02. Archived from the original on 2021-09-02. Retrieved 2021-10-15.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)
వెలుపలి లంకెలు
[మార్చు]- భారతదేశం
- సంఘసంస్కర్తలు
- భారతీయ సంఘ సంస్కర్తలు
- భారత జాతీయ కాంగ్రెసు అధ్యక్షులు
- AC with 16 elements
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with SELIBR identifiers
- Wikipedia articles with BNF identifiers
- Wikipedia articles with BIBSYS identifiers
- Wikipedia articles with ULAN identifiers
- Wikipedia articles with NLA identifiers
- Wikipedia articles with faulty authority control identifiers (SBN)
- Wikipedia articles with SNAC-ID identifiers
- తత్వవేత్తలు
- ప్రపంచ ప్రసిద్ధులు
- 1847 జననాలు
- 1933 మరణాలు