చిత్తరంజన్ దాస్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Chittaranjan Das
Chittaranjan Das.JPG
Chittaranjan Das
జననం (1870-11-05)5 నవంబరు 1870
మరణం 16 జూన్ 1925(1925-06-16) (aged 55)
జాతీయత Indian
జాతి Bengali
వృత్తి Lawyer
ప్రసిద్ధులు Major figure in the Indian independence movement
శీర్షిక Deshbandhu ("Friend of the nation")
రాజకీయ పార్టీ Indian National Congress
మతం Hinduism
తల్లిదండ్రులు Bhuban Mohan Das
Durga Mohan Das

దేశబంధుగా ప్రసిద్ధి చెందిన చిత్తరంజన్ దాస్ (C.R.Das) (బెంగాళీ:চিত্তরঞ্জন দাস) (నవంబరు 5, 1870 - జూన్ 16, 1925) ప్రముఖబెంగాళీ న్యాయవాది మరియు స్వాతంత్ర్యోద్యమ నేత.

ఇంగ్లాండులో విద్యాభ్యాసము పూర్తి చేసుకొని, 1909లో అంతకు ముందు సంవత్సరములో జరిగిన అలీపూరు బాంబు కేసులో, అభియోగము మోపబడిన అరబిందో ఘోష్ను విజయవంతముగా గెలిపించడముతో తన న్యాయవాద వృత్తికి శ్రీకారము చుట్టాడు. ఈయన 1919 నుండి 1922 వరకు కొనసాగిన సహాయనిరాకరణోద్యములో బెంగాల్ ప్రాంతములో ప్రముఖపాత్ర వహించి బ్రిటీష్ దుస్తులను బహిస్కరించడానికి నాంది పలికి ఐరోపా దేశ వస్త్రాలను తగుల బెట్టి స్వదేశ ఖాదీని కట్టి అందరికి ఆదర్శప్రాయుడయ్యాడు. తన మితవాదేతర అభిప్రాయాలు వ్యక్తపరచడానికి మోతీలాల్ నెహ్రూతో కలసి స్వరాజ్ పార్టీ స్థాపించాడు.

బ్రిటిష్ రాజ్కు వ్యతిరేకంగా పోరాడేందుకు ఆయన "ఫార్వర్డ్" అనే పత్రికను స్థాపించి తర్వాత దాని పేరును "లిబర్టీ"గా మార్చారు. కలకత్తా కార్పోరేషన్ ఏర్పడ్డాకా దానికి ఆయన మొదటి మేయర్ గా పనిచేసారు.ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, గయ సెషన్స్ కు అధ్యక్షత వహించారు. ఆయన రాజకీయ జీవితం యావత్తు అనారోగ్యంతో బాధ పడినప్పటిక్, మొక్కవోని దీక్ష, పట్టుదలతో బ్రిటిష్ వారి పై పోరాడారు.

ఆయన అహింసా విధానాన్ని నమ్ముతారు. స్వాతంత్ర్యాన్ని సాధించడానికి రాజ్యంగ బద్ధమైన విధానాలను అనుసరించాలని భావించేవారు. సమాజ సామరస్యానికి పాటు పడిన, జాతీయ విద్యాప్రగతి వాది. ఆయన వారసత్వాన్ని ఆయన శిష్యులు అనుసరించారు. వారిలో సుభాష్ చంద్ర బోస్ పేరెన్నికగన్నారు.

ఆయన ప్రస్తుత బంగ్లాదేశ్లో ఉన్న ఢాకాలో బిక్రంపూర్ కి చెందిన తెలిర్బాగ్‌లోని దాస్ కుటుంబానికి చెందిన వారు. ఆయన భువన్ మోహన్ దాస్ యొక్క కుమారుడు మరియు సంఘ సంస్కర్త అయిన దుర్గ మోహన్ దాస్‌కు మేనల్లుడు.ఈయన బంధు వర్గంలో ప్రసిద్ధులైన ఇతరులు ఎస్.ఆర్.దాస్, సరళా రాయ్, లేడీ ఆబాల బోస్.

బయటి లింకులు[మార్చు]