ఎన్.జి.చందవర్కర్
ఎన్.జి.చందవర్కర్ | |
---|---|
పుట్టిన తేదీ, స్థలం | 1855 డిసెంబరు 2 |
మరణం | 1923 మే 4 |
జాతీయత | భారతీయుడు |
సర్ నారాయణ్ గణేష్ చందవర్కర్ (1855 డిసెంబరు 2- 1923 మే 4) ప్రారంభ భారత జాతీయ కాంగ్రెస్ రాజకీయవేత్త, భారత స్వాతంత్ర్య సమరయోధుడు, హిందూ సంస్కర్త. అతడిని కొందరు "పశ్చిమ భారతదేశ ప్రముఖ హిందూ సంస్కర్త" గా పరిగణిస్తారు [1]
ప్రారంభ జీవితం
[మార్చు]నారాయణ గణేష్ చందవర్కర్ 1855 డిసెంబరు 2 న బాంబే ప్రెసిడెన్సీ, హోనవర్ లో జన్మించాడు.అతని మేనమామ చిత్రపూర్ సరస్వత్ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన మరో ప్రముఖ సంస్కర్త శ్యాంరావ్ విఠల్ కైకిని.ఇతను గౌడ సరస్వతులు కుటుంబానికి చెందినవాడు.[2]1881లో న్యాయ విద్య పట్టా సంపాదించడానికి కొంతకాలం ముందు ఎల్ఫిన్‌స్టోన్ కాలేజీ లో దక్షిణ ఫెలోగా పనిచేశాడు. 1885 లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపించడానికి కొద్దికాలం ముందు, ఇంగ్లాండ్ లో సార్వత్రిక ఎన్నికలు జరగడానికి ముందు భారతదేశం గురించి ప్రజల అభిప్రాయాన్ని తెలియజేయడానికి పంపిన ముగ్గురు వ్యక్తుల ప్రతినిధి బృందంలో ఎన్. జి. చందవర్కర్ ఒక సభ్యుడు. చందవర్కర్ పై రాసిన కాంగ్రెస్ సందేశం.
“ | 1885 లో అతను ఇంగ్లాండ్ పర్యటనలో చందవర్కర్ రాజకీయ జీవితాన్ని రూపొందించాడు, అతను బొంబాయిలో స్థాపించబడిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పనిలో మనస్ఫూర్తిగా త్యాగం చేసాడు. 1885 లో డిసెంబరు 28 న, అతను, ఇతర ప్రతినిధులు భారతదేశానికి తిరిగి వచ్చినరోజు | ” |
వృత్తి జీవితం
[మార్చు]అతను బొంబాయి విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలరుగా పనిచేసాడు.అతను1900లో భారత జాతీయ కాంగ్రెస్ సంవత్సరవారీ జరిగేసభలకు అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఒకసంవత్సరం తరువాత అతను బొంబాయి ఉన్నత న్యాయస్థానం ఉన్నత ధర్మాసనం పదోన్నతి పొందాడు. [3] తరువాతి పన్నెండు సంవత్సరాలు రాజకీయాల నుండివిరామం తీసుకున్నాడు.1913వరకు న్యాయ వ్యవస్థ, వివిధ సామాజిక సమూహాలకు తన సమయాన్ని కేటాయించాడు.అతను పనిచేసిన ప్రధాన సామాజిక సమూహం ప్రార్థన సమాజ్ ("ప్రార్థన సంఘం") సంఘ నిర్వహకుడు మహాదేవ్ గోవింద్ రనడే 1901 లో మరణించిన తరువాత గణేష్ చందవర్కర్ నాయకత్వ పగ్గాలు చేపట్టాడు [4] ఈసంస్థ బ్రహ్మ సమాజం నుండి ప్రేరణ పొందింది. హిందూసమాజ ఆధునికీకరణలో పాలుపంచుకుంది. [5] చందవర్కర్ 1910 కొత్త సంవత్సర నైట్ హుడ్ గౌరవ బిరుదు జాబితాలో నైట్ అయ్యాడు. [6]
తిరిగి రాజకీయాలకు
[మార్చు]అతను1914లో భారతదేశ రాజకీయ రంగానికి తిరిగి వచ్చాడు.1918లో కాంగ్రెస్‌లో సంభవించిన విభేదాలు కారణంగా సంస్థను రెండు శిబిరాలుగా విడిపోయింది. చందవర్కర్ 1918లో సురేంద్రనాథ్ బెనర్జీ, దిన్షా వాచాతోకలిసి అఖిలభారత మోడరేట్ సమావేశానికి అధిపతి అయ్యాడు.1920లో "భారత ప్రభుత్వం నియమించిన జలియన్ వాలా బాగ్ దురాగతాలపై హంటర్ కమిటీ నివేదికకు నిరసనగా బొంబాయిలో జరిగిన బహిరంగ సభకు చందవర్కర్ అధ్యక్షత వహించారు."ఈఅంశంపై తీర్మానం చేయడానికి మహాత్మా గాంధీ స్ఫూర్తి పొందాడు.
మూలాలు
[మార్చు]- ↑ Modern Religious Movements in India by J. N. Farquhar - Journal of the American Academy of Religion, Vol. 43, No. 2, Book Review Supplement (Jun., 1975), pp. 349-351
- ↑ "gsb, gowda saraswath". www.srikumar.com. Archived from the original on 2021-10-09. Retrieved 2021-10-09.
- ↑ "Former Justices". Bombay High Court, Bombay. Retrieved 2 February 2012.
- ↑ Prarthana Samaj - Encyclopædia Britannica
- ↑ Hinduism - The Essence of India Archived 2017-09-28 at the Wayback Machine - Hindubooks
- ↑ London Gazette, 21 January 1910