మోతీలాల్ నెహ్రూ
Appearance
మోతీలాల్ నెహ్రూ (ఆంగ్లం: Motilal Nehru) (మే 6, 1861 – ఫిబ్రవరి 6, 1931). భారతీయ స్వాతంత్ర్య సమర యోధుడు, భారత జాతీయ కాంగ్రెస్ నాయకుడు. ఇతను, బలీయమైన రాజకీయ కుటుంబ స్థాపకుడు. మోతీలాల్ నెహ్రూ ఆగ్రాలో పుట్టాడు, తండ్రి 'గంగాధర్' ఒక కాశ్మీరీ పండిట్ కుటుంబీకుడు.నెహ్రూ, ఉత్తర ప్రదేశ్ లోని అలహాబాదు నుండి బారిష్టరు డిగ్రీను పొందాడు.భారత జాతీయ కాంగ్రస్ కు చెందిన మధ్యేయవాద, ధనిక నాయకుడు. మహాత్మా గాంధీ మార్గదర్శకత్వంలో జాతీయ రాజకీయాలలో ప్రవేశించాడు. మోతీలాల్, స్వరూప్ రాణీని వివాహమాడాడు.
కుటుంబం , వారసులు
[మార్చు]క్రింది వారసులు భారత రాజకీయాలలో తమ ప్రభావాన్ని, ప్రాభవాన్నీ చూపారు :
- లక్ష్మీ నారాయణ్ నెహ్రూ
- గంగాధర్ నెహ్రూ (తండ్రి: లక్ష్మీనారాయణ్ నెహ్రూ, ఢిల్లీ కొత్వాల్)
- మోతీలాల్ నెహ్రూ (తండ్రి: గంగాధర్ నెహ్రూ) కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు.
- నందలాల్ నెహ్రూ (తండ్రి: గంగాధర్ నెహ్రూ) ఖేత్రీ రాజ్యపు దీవాన్.
- బన్సీధర్ నెహ్రూ (తండ్రి: గంగాధర్ నెహ్రూ)
- పండిట్ బ్రజ్లాల్ నెహ్రూ (తండ్రి: నందలాల్ నెహ్రూ, జమ్మూ కాశ్మీరు ఆర్థిక మంత్రి)
- రామేశ్విరీ నెహ్రూ (భర్త: బ్రజ్లాల్ నెహ్రూ)
- పండిట్ బ్రజ్ కుమార్ నెహ్రూ (తండ్రి: బ్రజ్లాల్ నెహ్రూ, ఆర్థిక మంత్రి, అమెరికాలో భారతరాయబారి, ప్రపంచ బ్యాంకులో భారత డైరెక్టరు, యునైటెడ్ కింగ్డంకు భారత హైకమీషనరు, జమ్మూ కాశ్మీరు, గుజరాత్ రాష్ట్రాల గవర్నర్.
- స్వరాజ్ మాటీ నెహ్రూ (జవహర్ లాల్ నెహ్రూ చుట్టం) పార్లమెంటు సభ్యుడు.
- జవహర్ లాల్ నెహ్రూ (తండ్రి:మోతీలాల్ నెహ్రూ) భారతదేశ ప్రధాన మంత్రి.
- శ్యామ్లాల్ నెహ్రూ (తండ్రి: నంద్లాల్ నెహ్రూ) ఎమ్.ఎల్.ఏ.
- ఉమా నెహ్రూ (భర్త: శ్యామ్లాల్ నెహ్రూ) పార్లమెంటు సభ్యుడు.
- శ్యాంకుమారి (తండ్రి:శ్యామ్లాల్ నెహ్రూ) రాజ్యసభ సభ్యురాలు.
- విజయలక్ష్మీ పండిట్ (తండ్రి: మోతీలాల్ నెహ్రూ) కేబినెట్ మంత్రి, గవర్నర్, రష్యా, అమెరికా, మెక్సికో లకు భారత రాయబారి, యు.కె.కు భారత హైకమీషనరు., ఐక్య రాజ్య సమితి అధ్యక్షురాలు.)
- కృష్ణ హుథీసింగ్ (తండ్రి: మోతీలాల్ నెహ్రూ)
- అజిత్ హుతీసింగ్ (తండ్రి: క్రిష్ణా నెహ్రూ హుతీసింగ్)
- నయనతారా సెహ్గల్ (తల్లి: విజయలక్ష్మి) రచయిత్రి - స్త్రీల విషయాలు, రాజకీయాలు.
- షీలా కౌల్ (ఇందిరా గాంధీ యొక్క పిన్ని) మంత్రి, గవర్నర్
- విక్రం కౌల్ (తల్లి: షీలా కౌల్) 1996 లో రాయ్బరేలీ నుండి ఎం.పీ.గా పోటీ చేసి ఓడిపోయాడు.
- దీపా కౌల్ (తల్లి: షీలా కౌల్) 1998 లో రాయ్బరేలీ నుండి ఎం.పీ.గా పోటీ చేసి ఓడిపోయారు.
- ఇందిరా గాంధీ (తండ్రి: జవాహర్ లాల్ నెహ్రూ) భారతదేశ ప్రధాన మంత్రి)
- ఫిరోజ్ గాంధీ (ఇందిరా గాంధీ భర్త), పార్లమెంటు సభ్యుడు.
- అరుణ్ నెహ్రూ (తల్లి: శ్యాంకుమారీ) పార్లమెంటు సభ్యుడు.
- రాజీవ్ గాంధీ (తల్లి: ఇందిరా గాంధీ, భారతదేశ ప్రధాన మంత్రి)
- సంజయ్ గాంధీ (తల్లి: ఇందిరా గాంధీ, పార్లమెంటు సభ్యుడు.
- సోనియా గాంధీ (భర్త: రాజీవ్ గాంధీ) ఇటలీలో జన్మించారు - ప్రస్తుతం పార్లమెంటు సభ్యురాలు, భారత జాతీయ కాంగ్రెసు అధ్యక్షురాలు.
- మేనకా గాంధీ (భర్త: సంజయ్ గాంధీ), ప్రస్తుతం పార్లమెంటు సభ్యురాలు.
- రాహుల్ గాంధీ (తండ్రి: రాజీవ్ గాంధీ), ప్రస్తుతం పార్లమెంటు సభ్యుడు.)
- వరుణ్ గాంధీ (తండ్రి: సంజయ్ గాంధీ)
- ప్రియాంకా గాంధీ (తండ్రి: రాజీవ్ గాంధీ)
- రాబర్ట్ వధేరా (ప్రియాంకా గాంధీ భర్త)
- రైహాన్ రాజీవ్ వధేరా గాంధీ (ప్రియాంకా గాంధీ కుమారుడు)
- మిరాయా వధేరా గాంధీ (ప్రియాంకా గాంధీ కుమార్తె)
- నిఖిల్ అజిత్ హుతీసింగ్ (తండ్రి: అజిత్ హుతీసింగ్)
- వివేక్ అజిత్ హుతీసింగ్ (తండ్రి: అజిత్ హుతీసింగ్)
- రవి అజిత్ హుతీసింగ్ (తండ్రి: అజిత్ హుతీసింగ్)
- కిరిణ్ ఎన్.కే. గుతీసింగ్ (తండ్రి: నిఖిల్ హుతీసింగ్)
- రెమీ ఎన్.కే.హుతీసింగ్ (తండ్రి: నిఖిల్ హుతీసింగ్)
- మిరాయి జీన్ హుతీసింగ్ (తండ్రి: వివేక్ హుతీసింగ్)
ఇవి కూడా చదవండి
[మార్చు]మూలాలు
[మార్చు]- Katherine Frank, Indira: the life of Indira Nehru Gandhi
- Jawaharlal Nehru, My Autobiography