జనవరి 8 : భూమా నాగిరెడ్డి ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఒక రాజకీయ నాయకుడు, మాజీ లోక్‌సభ సభ్యుడు. (మ.2017)
ఏప్రిల్ 3 : అజయ్ శర్మ , భారత క్రికెట్ క్రీడాకారుడు.
ఏప్రిల్ 6 : డేవిడ్ వుడార్డ్ , అమెరికన్ రచయిత, సంగీతకారుడు.
ఏప్రిల్ 11 : అఫ్సర్ , కవి, విమర్శకుడు, రచయిత.
మే 2 : నారాయణం నరసింహ మూర్తి , అంతర్జాతీయ పర్యవరణ వేత్త.
మే 15 : జి.కిషన్ రెడ్డి , భారతీయ జనతా పార్టీకి చెందిన యువనేత.
మే 20 : పి.టి.ఉష , భారత మాజీ అథ్లెటిక్స్ క్రీడాకారిణి.
జూన్ 8 : లక్ష్మణ్ ఏలె , భారతీయ చిత్రకారుడు.
జూన్ 24 : విజయశాంతి . సినీ నటి.
జూలై 13 : ఉత్పల్ చటర్జీ , భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు .
ఆగష్టు 15 : శ్రీహరి , తెలుగు సినిమా నటుడు, ప్రతినాయకునిగా తెలుగు తెరకు పరిచయమై తరువాత నాయకుడిగా పదోన్నతి పొందిన నటుడు. (మ.2013)
ఆగష్టు 22 : రేకందార్ గుణవతి , రంగస్థల నటి.
ఆగష్టు 26 : సురేష్ , తెలుగు సినీ నటుడు.
అక్టోబరు 25 : కలేకూరు ప్రసాద్ , (యువక) కవి, సినీ గేయరచయిత, సాహితీ విమర్శకుడు, మార్క్సిస్టు విశ్లేషకుడు ప్రజాకవి. (మ.2013)
డిసెంబర్ 31 : విన్స్టన్ బెంజిమన్ , వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
దస్త్రం:Jawaharlal Nehru, 1947.jpg జవహర్ లాల్ నెహ్రూ
జనవరి 1 : శొంఠి వెంకట రామమూర్తి బహుముఖ ప్రజ్ఞాశాలి. గణితశాస్త్రవేత్త. (జ.1888)
జనవరి 1 : ఆల్ఫ్రెడ్ ఎవార్ట్ హాల్ దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్. (జ.1896)
మార్చి 6 : రావు వేంకటకుమార మహీపతి సూర్యారావు , చివరి పిఠాపురం మహారాజు. సూర్యరాయాంధ్రనిఘంటువును ప్రచురించాడు. పూర్తిగా ఉత్తరవాదిగా వ్యవహరించాడు. మొట్టమొదటి తెలుగు టైపురైటరు కూడా ఇతడి హయాంలోనే మొదలయింది. (జ.1885)
మార్చి 9 : కిరికెర రెడ్డి భీమరావు , తెలుగు, కన్నడ భాషలలో కవిత్వమల్లినవాడు. (జ.1896)
మే 7 : పసుపులేటి కన్నాంబ , రంగస్థల నటి, గాయని, చలనచిత్ర కళాకారిణి
మే 25 : గాలి పెంచల నరసింహారావు తెలుగు చలనచిత్ర సంగీతదర్శకులలో మొదటి తరానికి చెందినవారు. (జ.1903)
మే 27 : జవహర్లాల్ నెహ్రూ , భారత తొలి ప్రధానమంత్రి .
మే 29 : వఝల సీతారామ శాస్త్రి , భాషా శాస్త్రవేత్త, సాహిత్య విమర్శకుడు, జ్యోతిష శాస్త్రపండితుడు. (జ.1878)
మే 31 : దువ్వూరి సుబ్బమ్మ , స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని జైలు వెళ్ళిన మెట్టమెదటి ఆంధ్ర మహిళ. సమాజసేవిక, స్త్రీ జనోద్ధరణకు కృషి చేసిన మహిళ.
జూన్ 23 : చెరుకువాడ వేంకట నరసింహం , ఉపన్యాస కేసరి, బీమాడిండిమ, ఆంధ్ర డెమొస్తనీస్. (జ.1887)
జూన్ 24 : కొత్త రాజబాపయ్య , ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత, విద్యాబోర్డులో, రాష్ట్రవిద్యాసలహాసంఘం సభ్యుడు. (జ.1913)
జూన్ 28 : ఎన్.ఎం.జయసూర్య , హోమియోపతీ వైద్యుడు, సరోజినీ నాయుడు కుమారుడు. (జ.1899)
నవంబర్ 25 : ద్వారం వెంకటస్వామి నాయుడు , ఒక గొప్ప వయొలిన్ (వాయులీనం) విద్వాంసుడు. (జ.1893)
డిసెంబర్ 7 : అర్ధనారీశ వర్మ , స్వాతంత్ర్య సమరయోధుడు, కవి, రచయిత, పాత్రికేయుడు. (జ.1874)
తేదీ వివరాలు తెలియనివి[ మార్చు ]
20వ శతాబ్దం
సంవత్సరాలు శతాబ్దాలు