జూలై 20
Appearance
జూలై 20, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 201వ రోజు (లీపు సంవత్సరములో 202వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 164 రోజులు మిగిలినవి.
<< | జూలై | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | |
7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
28 | 29 | 30 | 31 | |||
2024 |
సంఘటనలు
[మార్చు]- 1773: స్కాట్లాండు నుంచి వలసవచ్చిన వారు కెనడా లోని పిక్టౌ (నొవ స్కాటియా) కి వచ్చారు.
- 1868: సిగరెట్లమీద మొదటిసారిగా 'టాక్స్ స్టాంపుల' ను వాడారు అమెరికాలో.
- 1871: బ్రిటిష్ కొలంబియా, కెనడా సమాఖ్యలో చేరింది.
- 1872: అమెరికన్ పేటెంట్ కార్యాలయం, వైర్‌లెస్ టెలిగ్రఫీ మొదటి పేటెంట్ మహ్లాన్ లూమిస్ అనే వ్యక్తికి ఇచ్చింది.
- 1878: హవాయిలో మొట్టమొదటి టెలిఫోన్ ని ప్రవేశ పెట్టారు.
- 1903: ఫోర్డ్ మోటార్ కంపెనీ తన మొట్టమొదటి కారును ఎగుమతి చేసింది.
- 1921: న్యూయార్క్ నగరం నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకి ఎయిర్ మెయిల్ సర్వీస్ మొదలైంది.
- 1930: వాషింగ్టన్, డి.సి. (జిల్లా రికార్డ్) 106 డిగ్రీల ఫారెన్ హీట్ (41 డిగ్రీల సెంటిగ్రేడ్).
- 1934: అయొవా రాష్ట్రం రికార్డు. అయొవా రాష్ట్రంలో ఉన్న 'కియోకుక్' లో 118 డిగ్రీల ఫారెన్ హీట్ (48 డిగ్రీల సెంటిగ్రేడ్).
- 1935: లాహోర్ లోని మసీదు విషయమై ముస్లిములకు, సిక్కులకు జరిగిన అల్లర్లలో, 11 మంది మరణించారు.
- 1944: రాస్తెన్ బర్గ్ లో జరిగిన మూడవ హత్యా ప్రయత్నం నుంచి, అడాల్ఫ్ హిట్లర్ తప్పించుకున్నాడు.
- 1947: ప్రధాని యు. అంగ్ సాన్ మీద, అతని మంత్రివర్గ సభ్యులుగా ఉన్న మరొక తొమ్మిది మంది మీద, హత్యా ప్రయత్నం చేసినందుకు, బర్మా (నేటి మియన్మార్) మాజీ ప్రధాని 'యు. సా' ని, మరొక 19 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
- 1947: 1947 జూలై 19 న జరిగిన అభిప్రాయ సేకరణలో చాలా ఎక్కువ ఓట్లతో, వాయవ్య సరిహద్దు ప్రాంతం ప్రావిన్స్ (నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్) ప్రజలు, భారతదేశంలో కంటే, పాకిస్తాన్ లోనే చేరటానికి, తమ సమ్మతిని తెలిపారని, భారతదేశపు వైస్రాయి 1947 జూలై 20 తేదీన, చెప్పాడు.
- 1960: సిరిమావో బండారు నాయకే, సిలోన్ (నేటి శ్రీలంక) ప్రధానిగా ఎన్నికైంది. ఈమె ప్రపంచంలోనే మొట్టమొదటి మహిళా ప్రధాని (ప్రభుత్వాధినేత్రి).
- 1960: రోదసీలోకి వెళ్ళిన రెండుకుక్కలు తిరిగి భూమిమీదకు (యు.ఎస్.ఎస్.ఆర్) తిరిగి వచ్చాయి. రోదసీలోకి వెళ్ళి తిరిగివచ్చిన మొదటి జీవాలు ఇవే.
- 1962: కొలంబియాలో జరిగిన భూకంపంలో 40మంది మరణించారు.
- 1969: భారత రాష్ట్రపతిగా వరాహగిరి వేంకటగిరి పదవీ విరమణ.
- 1969: భారత రాష్ట్రపతిగా ఎం.హిదయతుల్లా పదవిని స్వీకరించాడు.
- 1974: టర్కీ సైన్యం సైప్రస్ మీద దాడి చేసింది.
- 1975: 'ది టైమ్స్', 'ది డెయిలీ టెలిగ్రాఫ్', 'న్యూస్ వీక్' పత్రికా విలేకరులను, భారత ప్రభుత్వపు సెన్సార్ నిబంధనలను పాటించే పత్రంపై సంతకం చేయటానికి నిరాకరించటం వలన, భారత ప్రభుత్వం వారిని బహిష్కరించింది (అది అత్యవసర పరిస్థితి - ఎమెర్జెన్సీ కాలం)
- 1976: 'వైకింగ్ 1' అనే రోదసీ నౌక కుజగ్రహం మీద దిగింది. అపొల్లో 11 రోదసీ నౌక చంద్రుడిమీద దిగి ఏడు సంవత్సరాలు అయిన సందర్భంగా, అమెరికా ఈ 'వైకింగ్ 1' ని ప్రయోగించింది. మొదటిసారిగా కుజుడి నేలమీద 'క్రిస్ ప్లానిటియా' అనే చోట (కుజుడి నేల మీద ఉన్న ఒక స్థలం పేరు) ఈ వైకింగ్ దిగింది.
- 1976: అమెరికా తన సైనిక దళాలను థాయ్‌లేండ్ నుంచి ఉపసంహరించింది (వియత్నాం యుద్ధం కోసం అమెరికా ఈ సైనిక దళాలను ఇక్కడ ఉంచింది)
- 1989: బర్మాను పాలిస్తున్న సైనికా జుంటా ప్రభుత్వము, ప్రతిపక్ష నాయకురాలు 'దా అంగ్ సాన్ సూ క్యి' ని గృహ నిర్బంధం (ఇంటిలో నుంచి బయటకు రాకుండా) లో ఉంచారు.
- 1990: లండన్ స్టాక్ ఎక్షేంజ్ పై ఐరిష్ రిపబ్లిక్ ఆర్మీ బాంబు పేల్చింది.
జననాలు
[మార్చు]- 1785: మహముద్ II ఒట్టొమాన్ సుల్తాన్, సంస్కర్త, పాశ్చాత్యీకరణ చేసిన వాడు.
- 1822: గ్రెగర్ జాన్ మెండెల్, ఆస్ట్రియా సన్యాసి, వృక్షశాస్త్రజ్ఞుడు. 'లాస్ ఆఫ్ హెరెడిటీ' జీవుల అనువంశికత సూత్రాలు కనుగొన్నాడు.
- 1864: ఎరిక్ కార్ల్‌ఫెల్డ్, స్వీడన్. కవి. ( 1918 లో నోబెల్ బహుమతి తిరస్కారము. 1931 లో నోబెల్ బహుమతి మరణానంతరం ఇచ్చారు).
- 1892: కవికొండల వెంకటరావు, తెలుగు కవి, జానపద, నాటక రచయిత. (మ.1969)
- 1919: ఎడ్మండ్ హిల్లరీ, టెన్సింగ్ నార్గేతో కలిసి ఎవరెస్టు పర్వతాన్ని ఎక్కాడు. (మ.2008)
- 1920: లెవ్ అరోనిన్, యు.ఎస్.ఎస్.ఆర్. ప్రపంచ చదరంగపు ఆటగాడు (1950)
- 1933: రొద్దం నరసింహ, భారతీయ అంతరిక్ష శాస్త్రవేత్త, పద్మవిభూషణ్ గ్రహీత.
- 1941: వ్లాదిమిర్ ఎ ల్యాఖోవ్, రోదసీ యాత్రికుడు (సోయుజ్ 32, టి-9)
- 1947: గెర్డ్ బిన్నింగ్ ఫ్రాంక్‌ఫర్ట్, ఫిజిసిస్ట్ (టన్నెలింగ్ సూక్ష్మదర్శిని - నోబెల్ బహుమతి గ్రహీత 1986)
- 1968: ఎస్.జె.సూర్య , తమిళ, తెలుగు, చిత్రాల నటుడు,దర్శకుడు , రచయత, సంగీత దర్శకుడు,గాయకుడు.
- 1969: గిరిజా షెత్తర్, తెలుగు సినిమా నటి.
- 1980: గ్రేసీ సింగ్, భారతీయ సినీనటి , భరత నాట్యం, ఒడిస్సీ, నృత్య కారిణి.
- 1983: వేణు ఊడుగుల, తెలుగు సినిమా దర్శకుడు.
మరణాలు
[మార్చు]- 1937: గూగ్లి ఎల్మో మార్కోని, రేడియోని కనుగొన్న శాస్త్రవేత్త. (జ.1874)
- 1951: జోర్డాన్ రాజు, అబ్దుల్లా ఇబిన్ హుస్సేన్, ని జెరూసలెంలో హత్య చేసారు.
- 1972: గీతా దత్, భారతీయ నేపథ్య గాయకురాలు. (జ.1930)
- 1973: బ్రూస్ లీ, ప్రపంచ యుద్ధ వీరుడు. (జ.1940)
- 1980: పర్వతనేని బ్రహ్మయ్య, పేరొందిన అకౌంటెంట్. (జ.1908)
- 2015: టి.కనకం, అలనాటి చలనచిత్ర హాస్యనటి, రంగస్థల నటి, గాయనీ.(జ.1927)
- 2019: షీలా దీక్షిత్, దేశ రాజధాని ఢిల్లీకి ఎక్కువకాలం ముఖ్యమంత్రిగా పనిచేశారు.(జ. 1938)
- 2023: చిలుకూరి రామచంద్రారెడ్డి, రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి. (జ. 1944)
- 2024: జెడింగీ, పులిని గొడ్డలితో చంపిన మిజోరాం ధీర వనిత, శౌర్యచక్ర పురస్కార గ్రహీత.[1] బంగ్లాదేశ్కు చెందిన ఆమె ఇరవై ఆరేళ్ల వయసులో వంట చెరకు కోసం గ్రామ సమీపంలోని అడవిలోకి వెళ్ళింది. అక్కడ, తనపై దాడికి సిద్ధమైన పులిని చేతిలోని గొడ్డలితో నరికి చంపింది. ఈ సంఘటన 1978 జులై 3న జరిగింది.
పండుగలు, జాతీయ దినాలు
[మార్చు]- 1810 : కొలంబియా దేశం స్పెయిన్ నుంచి స్వాతంత్ర్యం ప్రకటించుకొంది.
- అంతర్జాతీయ చెస్ రోజు
- అంతర్జాతీయ చంద్ర దినోత్సవం
బయటి లింకులు
[మార్చు]- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : జూలై 20
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
జూలై 19 - జూలై 21 - జూన్ 20 - ఆగష్టు 20 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |
- ↑ "Jedingi: గొడ్డలితో పులిని చంపిన వీరనారి జెడింగీ మృతి | veeranari-jedingi-who-killed-a-tiger-with-an-ax-died". web.archive.org. 2024-07-21. Archived from the original on 2024-07-21. Retrieved 2024-07-21.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)