Jump to content

బ్రూస్ లీ

వికీపీడియా నుండి
బ్రూస్ లీ
జననం
లీ జున్-ఫాన్

(1940-11-27)1940 నవంబరు 27
మరణం1973 జూలై 20(1973-07-20) (వయసు: 32)
మరణ కారణంసెరెబ్రల్ ఎడెమా
ఇతర పేర్లులే యూన్-చం
లే యూన్-కామ్
వృత్తినటుడు, తత్వవేత్త
ఎత్తు1.72 మీ. (5 అ. 8 అం.)
తల్లిదండ్రులు
పురస్కారాలు
హాంకాంగ్ ఫిల్మ్ అవార్డ్స్జీవన సాఫల్య పురస్కారం[1]
1994
స్టార్ ఆఫ్ ద సెంచురీ అవార్డ్[2]
2004

గోల్డెన్ హార్స్ అవార్డ్ఉత్తమ మాండరిన్ చిత్రం
1972 ఫిస్ట్స్ ఆఫ్ ఫ్యూరీ[1]
స్పెషల్ జ్యూరీ అవార్డ్
1972 ఫిస్ట్స్ ఆఫ్ ఫ్యూరీ

వెబ్‌సైటుబ్రూస్ లీ ఫౌండేషన్
బ్రూస్ లీ అధికార సైటు

బ్రూస్ లీ (నవంబర్ 27, 1940 - జులై 20, 1973) అమెరికాలో జన్మించి, హాంకాంగ్ లో పెరిగిన మార్షల్ ఆర్టిస్ట్ (యుద్ధ క్రీడా నిపుణుడు), నటుడు, నిర్మాత, తత్వవేత్త. ఇతను తాను ఆచరించిన నిరాయుధ పోరాటం, ఆత్మరక్షణ పద్ధతులు, జెన్ బౌద్ధం, టావోయిజం లాంటి అనేక సాంప్రదాయాల మిశ్రమమైన జీత్ కున్ డు అనే ఒక హైబ్రిడ్ మార్షల్ ఆర్ట్స్ తత్వాన్ని కనిపెట్టాడు. అటు అమెరికా, ఇటు హాంగ్‌కాంగ్ దేశాల సినిమాలలో నటించిన లీ, చైనా ప్రాంతం నుంచి వచ్చిన మొట్టమొదటి గ్లోబల్ స్టార్ అని చెప్పవచ్చు. ఆయన్ను చాలామంది 20 వ శతాబ్దంలో, సినిమా చరిత్రలో ప్రఖ్యాతి గాంచిన యుద్ధ విద్యా ప్రవీణుడిగా, సాంస్కృతిక చిహ్నంగా భావిస్తారు.[3] ఐదు పూర్తి స్థాయి మార్షల్ ఆర్ట్స్ సినిమాలలో నటించిన బ్రూస్ లీ, 1970 వ దశకంలో ఆ శైలి చిత్రాలకు ఒక ప్రత్యేకత, ప్రాముఖ్యతను కల్పించి హాంగ్‌కాంగ్ యాక్షన్ కథా చిత్రాలకు ప్రత్యేక స్థానం సంపాదించి పెట్టాడు.

బ్రూస్ లీ అమెరికాలోని, కాలిఫోర్నియా రాష్ట్రం, శాన్‌ఫ్రాన్సిస్కో లో పుట్టి, బ్రిటిష్ హాంగ్‌కాంగ్ లో పెరిగాడు. లీ తండ్రి అతన్ని చిన్నతనంలోనే బాలనటుడిగా హాంగ్‌కాంగ్ చిత్ర పరిశ్రమకు పరిచయం చేశాడు. మార్షల్ ఆర్ట్స్ లో అతను మొదటగా వింగ్ చున్ (ఇప్ మాన్ శిక్షణలో), తాయ్ చీ, బాక్సింగ్ సాధన చేశాడు. ఒక బాక్సింగ్ పోటీలో కూడా గెలుపొందాడు. 1959 లో లీ సియాటిల్ కి వచ్చి 1961 లో వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలో చేరాడు. ఈ సమయంలో అతనికి నటనవైపు వెళ్ళాలని కోరికగా ఉన్నా మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ ఇవ్వడం ద్వారా డబ్బులు సంపాదించాలనుకున్నాడు. సియాటిల్ లో తన ఇంటి నుంచే మొదటి మార్షల్ ఆర్ట్స్ బడి ప్రారంభించాడు. ఓక్లాండ్, కాలిఫోర్నియాలో మరో పాఠశాల ప్రారంభించిన తర్వాత 1964 లాంగ్ బీచ్ అంతర్జాతీయ కరాటే పోటీల్లో కొన్ని ప్రదర్శనలు ఇవ్వడం ద్వారా, ఉపన్యాసం ద్వారా మంచి గుర్తింపు వచ్చింది. తర్వాత అతను బోధించడానికి లాస్ ఏంజిలెస్ కి మారాడు. అక్కడ అతనికి చక్ నోరిస్, షారన్ టేట్, కరీం అబ్దుల్ జబ్బర్ లాంటి హాలీవుడ్ నటులు విద్యార్థులయ్యారు.

ద గ్రీన్ హార్నెట్ అనే చిత్రంలో కాటో అనే పాత్ర ద్వారా లీ అమెరికన్ ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. అయితే సాంస్కృతిక వైరుధ్యాల వల్ల తనను తాను పూర్తిగా వ్యక్తపరచలేకపోయాడు. 1971 లో హాంగ్‌కాంగ్ కి తిరిగి వచ్చాక లో వే దర్శకత్వంలో వచ్చిన ద బిగ్ బాస్ అనే చిత్రంలో మొదటిసారిగా కథానాయకుడి పాత్రలో నటించాడు. ఒక సంవత్సరం తర్వాత ఫిస్ట్ ఆఫ్ ఫ్యూరీ అనే చిత్రంలో చెన్ జెన్ అనే పాత్రలో నటించాడు. తర్వాత తన స్వీయ రచన, దర్శకత్వంలో ద వే ఆఫ్ ద డ్రాగన్ సినిమా చేశాడు. అమెరికా, హాంగ్‌కాంగ్ సంయుక్తంగా నిర్మించిన ఎంటర్ ది డ్రాగన్ (1973), ద గేమ్ ఆఫ్ డెత్ (1978) చిత్రాల్లో నటించాడు. హాలీవుడ్, హాంగ్‌కాంగ్ సంయుక్తంగా నిర్మించిన అతని చిత్రాలు వాణిజ్యపరంగా మంచి విజయం సాధించి హాంగ్‌కాంగ్ మార్షల్ ఆర్ట్స్ చిత్రాలను ప్రాచుర్యంలోనూ, ప్రశంసల్లోనూ మరో మెట్టు ఎక్కించడమే కాక పాశ్చాత్య దేశాలలో చైనీస్ మార్షల్ ఆర్ట్స్ మీద ఆసక్తి కలిగేలా చేశాయి. సినిమాల దర్శకత్వం, వాటిలోని టోన్, పోరాట దృశ్యాల రూపకల్పన, వైవిధ్యం అన్ని వెరసి మార్షల్ ఆర్ట్స్, దానిమీద ఆధారపడిన సినిమాలను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది.

33 సంవత్సరాల వయసులో సెరెబ్రల్ ఎడిమా అనే వ్యాధితో లీ హఠాన్మరణంతో అతని కెరీర్ అర్ధాంతరంగా ముగిసింది. అయినా సరే అతని చిత్రాలు నేటికీ ప్రజాదరణ పొందుతూ ఒక కల్ట్ క్లాసిక్ స్థాయిని సంపాదించుకున్నాయి. వీటిని అనుకరించే వారు, లీని పోలిన నటులచే సినిమాలు తీయడం చేశారు. అతను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. ముఖ్యంగా బ్రూస్ లీ లో తన సినిమాల్లో చైనా సంప్రదాయాలను, జాతీయ గౌరవాన్ని ఎక్కువగా చూపించడం చేత చైనీయులు లీని అమితంగా అభిమానించేవారు.[4] చైనీయుల సాంప్రదాయ క్రీడయైన కుంగ్ ఫూను లీ తన సినిమాల్లో ఎక్కువగా ప్రదర్శించేవాడు. టైమ్ పత్రిక బ్రూస్ లీ ని 20వ శతాబ్దపు అత్యంత ముఖ్యమైన 100 మంది వ్యక్తుల్లో ఒకడిగా గుర్తించింది.

బాల్యం

[మార్చు]

బ్రూస్ లీ కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాన్ ఫ్రాన్సిస్కో అనే నగరంలో పుట్టి, హాంకాంగ్ లో పెరిగాడు. ఇతని అసలు పేరు లీ జూన్ ఫాన్. లీ జన్మించిన సంవత్సరం చైనీస్ క్యాలెండర్ ప్రకారం డ్రాగన్ సంవత్సరం. బ్రూస్ లీ తండ్రి లీ హోయ్ చాన్ హాంగ్‌కాంగ్ కు చెందిన ఒక పేరు పొందిన కాంటోనీస్ ఒపెరా గాయకుడు. 1939 డిసెంబరులో లీ తల్లిదండ్రులు అంతర్జాతీయ ఒపెరా యాత్రలో భాగంగా అమెరికాలోని, కాలిఫోర్నియా రాష్ట్రం, శాన్‌ఫ్రాన్సిస్కో నగరంలోని చైనాటౌన్ కి వెళ్ళారు. 1940 నవంబరు 27 న లీ ఇక్కడే జన్మించాడు. అలా పుట్టుకతోనే ఆయనకు, హాంగ్‌కాంగ్, అమెరికా దేశాల నుంచి రెండు పౌరసత్వాలు దక్కాయి. లీ నాలుగు నెలల వయసులో అతని తల్లిదండ్రులు తిరిగి హాంగ్‌కాంగ్ కి వెళ్ళారు. అలా వెళ్ళగానే జపాన్ 1941 డిసెంబరులో రెండవ ప్రపంచ యుద్ధంలో భాగంగా హాంగ్‌కాంగ్ మీద మెరుపు దాడి చేసి నాలుగు సంవత్సరాల పాటు తమ ఆధీనంలో ఉంచుకోవడంతో ఆ కుటుంబం అనేక కష్టాలనెదుర్కొన్నది.[5]

బ్రూస్ తండ్రి కాంటోనీస్, తల్లి గ్రేస్ హో యురేషియా మూలాలు ఉన్న వ్యక్తి.[6] గ్రేస్ హో తండ్రి కూడా కాంటోనీస్ కి చెందిన వాడు, తల్లి మాత్రం ఆంగ్లేయురాలు. గ్రేస్ హో దూరపు బంధువైన రాబర్ట్ హోటంగ్ హాంగ్‌కాంగ్ లో పేరొందిన వ్యాపారవేత్త.

బ్రూస్ లీ తల్లీ ,తండ్రి 1940లో

విద్యాభ్యాసం, వృత్తి

[మార్చు]

1940-1958: నటనలో తొలి అడుగులు, పాఠశాల విద్య, యుద్ధవిద్యల్లో ప్రవేశం

[మార్చు]

లీ తండ్రి లీ హోయ్ చాన్ ఒక ప్రముఖ కాంటోనీస్ ఒపెరా గాయకుడు. దీనివల్ల బ్రూస్ లీకి చిన్నప్పటి నుంచే సినిమా రంగంతో పరిచయం ఏర్పడింది. బాలనటుడిగా పలు చిత్రాల్లో నటించాడు. పసిపాపడిగా ఉన్నప్పుడే గోల్డెన్ గేట్ గర్ల్ అనే చిత్రంలో కనిపించాడు.[7] అతను పుట్టిన సంవత్సరం చైనా క్యాలెండరు ప్రకారం డ్రాగన్ సంవత్సరం. అందుకనే అతనికి రంగస్థలం మీద లిటిల్ డ్రాగన్ అనే పేరు వచ్చింది.[8]

తొమ్మిది సంవత్సరాల వయసులో ఉండగా తన తండ్రితో కలిసి ద కిడ్ (1950) అనే చిత్రంలో నటించాడు. ఇది ఒక కామిక్ పాత్ర ఆధారంగా రూపొందిన పాత్ర. అతను పోషించిన మొదటి ప్రధాన పాత్ర.[9] 18 సంవత్సరాల వయసు వచ్చేసరికి 20 చిత్రాల్లో నటించాడు. 218, నాథన్ రోడ్, కౌలూన్ లోని అతని ఇంటికి సమీపంలో ఉన్న టాక్ సన్ స్కూల్ లో చదివిన తర్వాత 12 సంవత్సరాల వయసులో క్యాథలిక్ లా శాలీ కాలేజ్ లో చేరాడు.[10]

1956 లో సరిగా చదవక పోవడం వల్ల (బహుశ ప్రవర్తన సరిగా లేకపోవడం వల్ల కూడా కావచ్చు) సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్స్ కళాశాలకు మారవలసి వచ్చింది. అక్కడి ఇతను బవేరియాకు చెందిన బ్రదర్ ఎడ్వర్డ్ మస్ అనే ఉపాధ్యాయుడు, బాక్సింగ్ శిక్షకుడి అండ దొరికింది.[11][12][13] లీ దుడుకు ప్రవర్తనతో పలు వీధి పోరాటాల్లో పాల్గొంటుండటంతో అతని తల్లిదండ్రులు మార్షల్ ఆర్ట్స్ నేర్పించాలని అనుకున్నారు.

1953 లో లీ స్నేహితుడు విలియం చాంగ్ అతన్ని ఇప్ మ్యాన్ అనే శిక్షకుడికి పరిచయం చేశాడు.[14][15] అయితే లీ తల్లి యురేషియా మూలాలున్న వ్యక్తి కావడంతో విన్ చున్ కుంగ్ ఫూ లో చాలా కాలంగా ఉన్న నియమ నిబంధనల ప్రకారం విదేశీయులకు ఆ విద్య నేర్పించకూడదని ఉండటంతో మొదటగా అతన్ని తిరస్కరించారు.[16][17] కానీ చాంగ్ లీ తరపున మాట్లాడి వారిని ఒప్పించి అతకి ఇప్ మాన్ శిక్షణ ఇచ్చేలా చూశాడు.[18][19] ఇప్ మ్యాన్ తన విద్యార్థులను వీధి పోరాటాల్లో కాకుండా ఒక క్రమ పద్ధతిలో జరిగే మార్షల్ ఆర్ట్స్ పోటీల్లో పాల్గొనేటట్లు ప్రేరేపించేవాడు.[20]

1958 లో లీ, ఇప్ మ్యాన్

ఇప్ మ్యాన్ శిక్షణలో ఒక సంవత్సరం పాటు రాటుదేలిన తర్వాత ఇతర విద్యార్థులు అతనితో కలిసి నేర్చుకోవడానికి విముఖత చూపారు. ఎందుకంటే వారికి లీ తల్లి విదేశీ నేపథ్యం గురించి తెలుసుకున్నారు. సాధారణంగా చైనీయులు ఆసియాకు చెందనివారికి ఈ విద్యలు నేర్పేవారు కాదు.[21][22] లీ కి సాధనలో ప్రత్యర్థి అయిన హాకిన్స్ చాంగ్ ప్రకారం ఇప్‌మ్యాన్ బహుశ ఆరు మందికి మాత్రమే స్వయంగా పూర్తి స్థాయి లేదా పాక్షిక శిక్షణ ఇచ్చేవాడు.[23] లీ వింగ్ చున్ మీద ప్రత్యేకమైన శ్రద్ధ చూపేవాడు. ఇప్‌మ్యా, విలియం చాంగ్, వాంగ్ షున్ లాంగ్ ఆధ్వర్యంలో రహస్యంగా శిక్షణ పొందుతుండేవాడు.[24][25]

1958 లో లీ మునుపటి స్కూల్ ఛాంపియన్ అయిన గ్యారీ ఎల్మ్స్ ని ఓడించి హాంగ్‌కాంగ్ స్కూల్ బాక్సింగ్ ఛాంపియన్ గా నిలిచాడు.[11] అదే సంవత్సరంలో లీ చా చా నృత్యంలో కూడా ప్రావీణ్యం సంపాదించి హాంగ్‌కాంగ్ క్రౌంస్ కాలనీ చా చా ఛాంపియన్ షిప్ గెలుపొందాడు.[26]

1959 - 64: ఎడతెరగని సాధన, మార్షల్ ఆర్ట్స్ బ్రేక్ త్రూ

[మార్చు]

టీనేజీ ఆఖరికి వచ్చేసరికి లీ వీధిపోరాటాల్లో పాల్గొనడం ఎక్కువైంది. ఇతను ఒకసారి అప్పట్లో చైనాలో అందరూ భయపడే ట్రయాడ్ అనే ఒక నేర ముఠా సభ్యుల కొడుకును కొట్టాడు.[27] 1958 లోనే లీ సాధన చేసే వింగ్ చున్ స్కూల్ ని మరో ప్రత్యర్థి స్కూల్ చోయ్ లి ఫుట్ స్కూలు విద్యార్థులు చాలెంజ్ చేయగా ఒక ఇంటి పైకప్పు మీద పోరాటం చేశాడు. ఒకాబ్బాయి లీని అన్యాయమైన పంచ్ ఇవ్వగా అతన్ని తిరిగి బాగా కొట్టేసరికి ఆ అబ్బాయి పన్ను ఊడింది. ఆ అబ్బాయి తల్లిదండ్రులు లీ మీద పోలీసు కంప్లైంటు ఇచ్చారు.[28]

లీ తల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కొడుకు చేసే పనులకు పూర్తి బాధ్యత తనదే అని ఒక పత్రం మీద సంతకం చేసి అతన్ని విడిపించుకువచ్చింది. ఈమె ఈ సంఘటనను భర్తకు చెప్పకపోయినా 18 ఏళ్ళకు లీ తిరిగి అమెరికా వెళ్ళి అక్కడి పౌరసత్వాన్ని దక్కించుకోవాల్సిందిగా కోరింది.[29] లీ తండ్రి కూడా ఇక్కడే ఉంటే అతని కళాశాల చదువు సరిగా సాగదని ఆమె నిర్ణయంతో ఏకీభవించాడు.[28]

పోలీస్ డిటెక్టివ్ వచ్చి ఇలా చెప్పాడు, "ఏమండీ, మీ కొడుకు లీ బడిలో విపరీతంగా పోరాటాలు చేస్తున్నాడు. అతను మళ్ళీ ఇంకో పోరాటానికి దిగితే అతన్ని జైల్లో పెట్టాల్సి ఉంటుంది."

— రాబర్ట్ లీ (బ్రూస్ లీ అన్నయ్య)[30]

ఏప్రిల్ 1959 లో లీ తల్లిదండ్రులు అతనిని అమెరికాలో శాన్ ఫ్రాన్సిస్కో ఇదివరకే తమ కుటుంబ స్నేహితులతో కలిసి ఉంటున్న అక్క దగ్గరికి పంపారు. కొన్ని నెలల తర్వాత తన హైస్కూల్ విద్య పూర్తి చేయడం కోసం 1959లోనే సియాటిల్ కి మారాడు. అక్కడే అతను రూబీ చౌ అనే మహిళకు చెందిన రెస్టారెంటులో వెయిటర్ గా పనిచేశాడు. చౌ భర్త లీ తండ్రికి సహోద్యోగి, స్నేహితుడు. లీ అన్న పీటర్ లీ సియాటిల్ లో అతనితో పాటు కొన్నాళ్ళు ఉండి కళాశాల చదువు కోసం మిన్నసోటాకు వెళ్ళిపోయాడు.[31]

లీ 1959 లో మార్షల్ ఆర్ట్స్ బోధించడం మొదలుపెట్టాడు. అతను బోధించే విధానాన్ని జున్ ఫాన్ గుంగ్ ఫూ (బ్రూస్ లీ కుంగ్ ఫూ అని అర్థం) అని పిలిచాడు. సియాటిల్ లో అదే పేరుతో ఒక పాఠశాల ప్రారంభించాడు. వింగ్ చున్ అనే సాంప్రదాయశైలిని అతని స్వంత రూపం అది.[31] మొదట్లో లీ సియాటిల్‌లో పరిచయమైన మిత్రులకు బోధించడం ప్రారంభించాడు. వారిలో జూడో సాధన చేసే జెస్సీ గ్లోవర్ ఒకరు. ఇతను ఇప్పటికీ లీ పద్ధతులను బోధిస్తున్నాడు. టేకీ కిమురా అనే ఇంకొకరు లో సహాయ శిక్షకుడిగా స్థిరపడి, లీ మరణం తర్వాత కూడా అతని కళను, తత్వాన్ని బోధించాడు.[32]

లీ ఉన్నత పాఠశాల విద్యాభ్యాసం తరువాత సియాటిల్‌లోని క్యాపిటల్ హిల్ లో ఉన్న ఎడిసన్ టెక్నికల్ స్కూల్లో డిప్లోమా సాధించాడు.[33] మార్చి 1961 లో వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలో నాటక కళలు, తత్వశాస్త్రం, మానసిక శాస్త్రం, ఇంకా ఇతర సబ్జెక్టులు చదివాడు.[34][35] బ్రూస్ లీ, ఇంకా చాలామంది చెప్పినట్లు ఇతను తత్వశాస్త్రం ప్రధాన అంశం కాకుండా నాటక కళలు ప్రధానంగా చదివినట్లు విశ్వవిద్యాలయం పూర్వవిద్యార్థుల గురించిన వ్యాసంలో పేర్కొంది.[36]

1964 మొదట్లో లీ విశ్వవిద్యాలయం నుంచి విరమించుకుని ఓక్‌ల్యాండ్ లో ఉంటున్న జేమ్స్ యిమ్ లీ తో కలిసి ఉండటానికి వెళ్ళాడు. జేమ్స్ లీ బ్రూస్ లీకి 20 ఏళ్ళు సీనియర్. ఆ ప్రాంతంలో బాగా ప్రాచుర్యం పొందిన మార్షల్ ఆర్టిస్ట్. వీళ్ళిద్దరూ కలిసి ఓక్‌ల్యాండ్ లో రెండవ జున్ ఫాన్ గుంగ్ ఫూ ఇన్‌స్టిట్యూట్ ని ప్రారంభించారు. జేమ్స్ లీ బ్రూస్ లీని ఎడ్ పార్కర్ అనే అమెరికన్ మార్షల్ ఆర్టిస్ట్ కి పరిచయం చేశాడు. పార్కర్ ఆహ్వానంతో లీ 1964 లో లాంగ్ బీచ్ ఇంటర్నేషనల్ కరాటే చాంపియన్‌షిప్స్ లో పాల్గొన్నాడు. అక్కడ కేవలం రెండు వేళ్ళ మీద పుష్‌అప్స్ ప్రదర్శన ఇచ్చాడు. అదే కార్యక్రమంలోనే వన్ ఇంచ్ పంచ్ ప్రదర్శన కూడా ఇచ్చాడు.[37] ఇందులో భాగంగా బ్రూస్ లీ తన కుడికాలు కొద్దిగా ముందుకు పెట్టి, మోకాలు కొద్దిగా వంచి ప్రత్యర్థికి ఎదురుగా నిలుచుకుని ఉంటాడు. అతని కుడిచేతి పిడికిలి ప్రత్యర్థి రొమ్ముకి సుమారు ఒక ఇంచి (2.5 సె.మీ) దూరంలో ఉంటుంది. కుడి భుజాన్ని ఏ మాత్రం వెనుకకి జగరకుండా, తన భంగిమనుంచి కదలకుండా స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన బాబ్ బేకర్ కి ఆ పంచ్ ఇచ్చాడు. బేకర్ కిందపడి దెబ్బ తగలకుండా ఉండేందుకు వెనుకల అతనికి ఒక కుర్చీ కూడా వేశారు. కానీ లీ పంచ్ కి అతను వెనుకకి వాలి కుర్చీతో సహా కింద పడ్డాడు. ఈ సంఘటన గురించి వివరిస్తూ బేకర్, తాను లీ ని ఇలాంటి ప్రదర్శన మరెప్పుడూ చేయవద్దని సలహా ఇచ్చానని చెప్పాడు. లీ దెబ్బ తిన్న బేకర్ ఉరంలో కలిగిన భరించలేని నొప్పికి కొన్నాళ్ళు పనికి వెళ్ళకుండా విశ్రాంతి తీసుకోవలసి వచ్చింది.[38] 1964 ఛాంపియన్‌షిప్స్ లో లీ మొదటిసారిగా తైక్వాండో మాస్టర్ జూంగూ రీని కలిశాడు. వీరిద్దరికీ మంచి స్నేహం కుదిరింది. ఇద్దరూ ఒకర్నుంచి ఒకరు మార్షల్ ఆర్ట్స్ గురించి బాగా తెలుసుకున్నారు. రీ లీ కి సైడ్ కిక్ గురించి నేర్పిస్తే అందుకు ప్రతిగా లీ అతనికి నాన్-టెలిగ్రాఫిక్ పంచ్ గురించి నేర్పించాడు.[39]

1964 లో ఓక్లాండ్ చైనాటౌన్ లో బ్రూస్ లీ, వాంగ్ జాక్‌మ్యాన్ అనే మరో యోధుడితో వివాదాస్పద ప్రైవేటు పోటీలో పాల్గొన్నాడు. వాంగ్ జాక్‌మ్యాన్, మా కిన్ ఫుంగ్ అనే మరో యోధుడి శిష్యుడు. అతనికి షింగ్‌ఇకాన్, నార్తర్న్ షావోలిన్, తై చీ ల మీద మంచి పట్టు ఉంది. బ్రూస్ లీ కథనం ప్రకారం చైనా సమాజం అతన్ని చైనీయులు కాని వారికి విద్యను బోధించవద్దంటూ హెచ్చరిక చేసింది. అందుకు అతను అంగీకరించకపోవడంతో వాంగ్ తో అతన్ని పోటీ పడమన్నారు. ఆ పోటీలో లీ ఓడిపోతే అతను తన పాఠశాలను మూసివేయాలి. ఒకవేళ లీ గెలిస్తే తెల్లవాళ్ళకే కాక మరెవరికైనా విద్యను నేర్పించవచ్చు.[40] కానీ వాంగ్ ఈ వాదనను తోసిపుచ్చాడు. ఒక చైనాటౌన్ థియేటర్లో లీ ప్రదర్శన ఇస్తున్నపుడు, శాన్‌ఫ్రాన్సిస్కోలో తనను ఓడించే వారు ఎవరూ లేరని చాలెంజ్ చేయడంతో అతన్ని తనతో పోరాడమని వాంగ్ ఆహ్వానించాడు. అంతే కాక వాంగ్ తెల్లవాళ్ళు, చైనీయులు కానివారి పట్ల తానెప్పుడూ వివక్షను చూపలేదని చెప్పాడు.[41] లీ ఈ వ్యాఖ్యాలకు బదులిస్తూ ఆ పేపర్లో గొప్ప వారి పేర్లందరివీ ఉన్నాయి. అయినా నేను భయపడను అన్నాడు.[42]

వాంగ్, విలియం చెన్ ప్రకారం ఈ పోటీ అసాధారణ రీతిలో 20 నుంచి 25 నిమిషాల పాటు సాగింది.[41][43] వాంగ్ చెప్పినదాన్ని బట్టి అతను లీ నుంచి గంభీరమైన, గౌరవప్రదమైన పోటీ ఉంటుందని భావించాడు. అందుకు బదులుగా లీ అతన్ని చంపాలనే తలపుతో దాడి చేశాడు. వాంగ్ సాంప్రదాయబద్ధమైన రీతిలో చేయి చాచగా లీ దాన్ని స్వీకరిస్తున్నట్లుగా ప్రవర్తించి వెనువెంటనే అతని కంటిమీద పొడవడానికి చూశాడు. దాంతో వాంగ్ ఆత్మరక్షణ కోసం పోరాడవలసి వచ్చింది. అతనికి అవకాశం వచ్చినా లీని చంపే విధంగా అయితే దెబ్బ తీయలేదు. అలా చేసి ఉంటే అతను జైలుకు వెళ్ళవలిసి వచ్చుండేదని, కానీ తన మణికట్టు దగ్గరున్న ఆయుధాల్ని అధర్మంగా వాడానని చెప్పాడు. 1980లో మైకేల్ డోర్గాన్ రాసిన బ్రూస్ లీస్ టఫెస్ట్ ఫైట్ అనే పుస్తకంలో ఈ పోటీ లీ అలసిపోవడంతో ముగిసిందనీ, ఇద్దరిలో ఎవరూ ప్రత్యర్థిని కోలుకోలేని దెబ్బ తీయలేకపోయారని రాశాడు.[41]

కానీ బ్రూస్ లీ, అతని సతీమణి లిండా లీ కాడ్‌వెల్, అతని మార్గదర్శకుడైన జేమ్స్ ఇమ్ లీ ప్రకారం ఈ పోటీ కేవలం మూడు నిమిషాల పాటు మాత్రమే సాగిందనీ, అందులో లీ విజయం సాధించాడు. కాడ్వెల్ చెప్పినదాన్ని బట్టి ఇద్దరి మధ్య పోటీ ప్రారంభమైన కొద్ది సేపటికే లీ ప్రత్యర్థిని మట్టి కరిపించి, పోటీ ఆపేయమంటావా అని అడిగాడు. అతను సరే అనడంతో పోటీ ముగిసింది.[40] ఇది జరిగిన రెండు వారాలకు లీ తాను పేరు చెప్పకుండా ఒక ప్రత్యర్థిని ఓడించానని చెప్పాడు. అది తనను గురించే అని వాంగ్ ప్రకటించాడు.[41][43]

దీనికి ప్రతిస్పందనగా వాంగ్ శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి వెలువడే చైనీస్ పత్రిక పసిఫిక్ వీక్లీలో లీ తాను ప్రచురించింది సరికాదనుకుంటే ఈ సారి బహిరంగ పోటీలో పాల్గొనాలని పేర్కొన్నాడు. ఎప్పుడూ దుడుకుగా మాటకు మాట బదులిచ్చే లీ దీనికి మాత్రం స్పందించలేదు.[41] దీని తర్వాత ఇద్దరూ ఏమీ బహిరంగ ప్రకటనలు ఇవ్వలేదు. లీ తెల్లజాతీయులకు పాఠాలు చెప్పడం కొనసాగిస్తూనే ఉన్నాడు. మార్షల్ ఆర్ట్స్ మీద కృషి చేసే ఉద్దేశ్యంతో సినిమా ఆలోచనలు కూడా పక్కనబెట్టాడు. కానీ 1964 లో జరిగిన లాంగ్ బీచ్ ప్రదర్శన కార్యక్రమంలో నిర్మాత విలియం డోజియర్ అతన్ని చార్లీ చాన్ కుమారుడైన లీ చాన్ మీద తీసే నంబర్ వన్ సన్ అనే కార్యక్రమంలో ఆడిషన్ కి ఆహ్వానించాడు. ఇది ఎందుకో మరుగున పడింది కానీ బ్రూస్ లీ నైపుణ్యాన్ని మాత్రం డోజియర్ గుర్తుంచుకున్నాడు.[44]

1966 - 1970: అమెరికన్ పాత్రలు, జీత్ కున్ డు సృష్టి

[మార్చు]
ద గ్రీన్ హార్నెట్ (1966) కోసం విలియమ్స్, లీ ప్రచార చిత్రం

1966 నుంచి 1967 వరకు బ్రూస్ లో విలియం డోజియర్ రూపొందించిన ద గ్రీన్ హార్నెట్ అనే టీవీ ధారావాహికలో వాన్ విలియమ్స్ సరసన కాటో అనే పాత్రలో నటించాడు.[45] ఇది సెప్టెంబరు 1966 నుంచి మార్చి 1967 వరకు ఒక సీజన్ లో 26 ఎపిసోడ్లు సాగింది. లీ, విలియమ్స్ ఇద్దరూ డోజియర్ నిర్మించిన క్రాస్ ఓవర్ బాట్‌మ్యాన్ ఎపిసోడ్లలో అదే పాత్రల్లోనే నటించారు.[46][47][48]

ద గ్రీన్ హార్నెట్ యువకుడైన బ్రూస్ లీ ని అమెరికన్ ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఆసియా మార్షల్ ఆర్ట్స్ ని ఇలా చూపించిన ప్రముఖ కార్యక్రమం అది. దీని దర్శకుడు పోరాటాలు చేసేటపుడు లీ ని పిడికిళ్ళు, గుద్దులు ఉపయోగించి అమెరికన్ శైలిలో చూపమనేవాడు. ఒక ప్రొఫెషనల్ మార్షల్ ఆర్టిస్టుగా లీ అందుకు నిరాకరించి తన శైలిలోనే పోరాటాలు చేస్తానని పట్టుబట్టేవాడు. మొదట్లో అతని కదలికకు ఎంత వేగంగా కదిలేవంటే అవి కెమెరా పట్టుకోలేక ఫిల్ములో రికార్డు అయ్యేవి కావు. దాంతో లీ ఉద్దేశపూర్వకంగా వేగం తగ్గించాడు.[49]

షో నిర్మాణంలో ఉండగా లీ కి అక్కడే స్టంట్‌మ్యాన్ గా పనిచేసే జీనీ లెబెల్ తో పరిచయం అయింది. వీరిద్దరూ కలిసి సాధన చేస్తూ ఒకరికి తెలిసిన పరిజ్ఞానాన్ని మరొకరితో పంచుకుంటూ ఉండేవారు..[50] 1967 లో కార్యక్రమం రద్దైంది. తన కెరీర్ అలా ప్రారంభమైనందుకు తర్వాత లీ డోజియర్ కు ధన్యవాదాలు తెలియజేశాడు.[49] 1967 లో లీ ఐరన్‌సైడ్ అనే కార్యక్రమంలో ఒక ఎపిసోడ్ లో నటించాడు.[51]

జీత్ కున్ డు చిహ్నం. బ్రూస్ లీ ఎస్టేట్ దీని మీద కాపీ హక్కులు కలిగి ఉంది.[52]

జీత్ కున్ డు 1967 లో ఆవిర్భవించింది. ద గ్రీన్ హార్నెట్ ఒక సీజన్ పూర్తయిన తర్వాత లీ చేతిలో పని లేకుండా పోయింది. అప్పుడే ద జున్ ఫాన్ గుంగ్ ఫు సంస్థను ప్రారంభించాడు. వాంగ్ జాక్‌మ్యాన్ తో వివాదాస్పద పోటో తర్వాత మార్షల్ ఆర్ట్స్ తత్వం పట్ల లీ దృక్పథంలో మార్పు వచ్చింది. వింగ్ చున్ పద్ధతులనే పాటించడం వలన ఆ పోటీ అనవసరంగా ఎక్కువ సేపు సాగిందనీ, ఆ పోటీలో తనలో ఉన్న సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో వాడుకోలేకపోయానని భావించాడు. సాంప్రదాయ మార్షల్ ఆర్ట్స్ పద్ధతులు చాలా నిష్కర్షగా ఉంటాయనీ, వీధి పోరాటాల వంటి వాటికి ఆ నియమాలు పనికిరావనే అభిప్రాయానికి వచ్చాడు. ఆచరణాత్మకత, ఒదుగుబాటు, వేగం, సమర్ధతలకు పెద్దపీట వేస్తూ తానే ఒక పద్ధతిని రూపొందించాలనుకున్నాడు. శిక్షణలో దారుఢ్యం కోసం బరువులు ఎత్తడం, సహన శక్తి కోసం పరుగు తీయడం, ఒదుగుబాటు కోసం సాగే వ్యాయామాలు, ఇంకా ఫెన్సింగ్, బాక్సింగ్ విధానాలు కూడా వాడుకున్నాడు.

లీ దీనిని శైలి కాని శైలి (The style of no style) అన్నాడు. సాంప్రదాయ చట్రాల నుంచి బయటపడిన శైలి కాబట్టి దాన్ని అలా పిలిచాడు. తాను సృష్టించిన జున్ ఫాన్ గుంగ్ ఫూ కూడా ఇలాంటి కట్టుబాట్లే కలిగి ఉండేది. అందుకనే వాటి నుంచి నెమ్మదిగా బయటపడుతూ ఒక తత్వంగా, మార్షల్ ఆర్ట్ గా జీత్ కున్ డు రూపు దిద్దుకుంది. కానీ ఆ పదాన్ని వాడినందుకు కూడా లీ తర్వాత పశ్చాత్తాప పడ్డాడు. ఎందుకంటే తాను ఎలాంటి నియమాలు, పరిమితులు లేని ఒక శైలిని సృష్టించాలనుకున్నాడు.[53]

ఆ సమయంలో లీ దగ్గర హాలీవుడ్ స్క్రిప్ట్ రచయిత స్టిర్లింగ్ సిల్లిఫాంట్, నటుడు జేమ్స్ కోబర్న్ విద్యార్థులుగా ఉండేవారు. 1969 లో ఈ ముగ్గురూ కలిసి ద సైలెంట్ ఫ్లూట్ అనే ఒక చిత్రం కోసం కథ రాసుకున్నారు. వాళ్ళందరూ కలిసి భారతదేశంలో చిత్రీకరణకు అనువైన ఒక ప్రదేశం కోసం చూడ్డానికి కూడా వెళ్ళారు. ఆ ప్రాజెక్టు చివరికి రూపుదాల్చలేదు. కానీ 1978 లో వచ్చిన డేవిడ్ క్యారడీన్ నటించిన సర్కిల్ ఆఫ్ ఐరన్ అనే సినిమా ఇదే కథ ఆధారంగా రూపొందించబడింది. 2010 లో నిర్మాత పాల్ మస్లాన్‌స్కీ ద సైలెంట్ ఫ్లూట్ అసలు కథతో సినిమా తీయడానికి ప్రణాళిక వేసుకుని నిధులు సమకూర్చుకున్నాడని వార్తలు వచ్చాయి.[54]

1969లో లీ సిల్లిఫాంట్ రచనలో వచ్చిన మార్లోవీ అనే సినిమాలో కాసేపు కనిపించాడు. ఇందులో ప్రైవేటు డిటెక్టివ్ ఫిలిప్ మార్లోవీ అనే పాత్ర పోషించిన జేమ్స్ గార్నర్ ను తన మార్షల్ ఆర్ట్స్ తో విధ్వంసం సృష్టించి భయపెట్టే కిరాయిరౌడీగా కనిపిస్తాడు.[55][56] అదే సంవత్సరం ద రెకింగ్ క్రూ అనే చిత్రంలో ఒక కరాటే సలహాదారుగా గుర్తింపు ఇచ్చారు. ఇది డీన్ మార్టిన్ మాట్ హెల్మ్ అనే పాత్రలో నటించిన కామెడీ స్పై చిత్రం.[57] ఇంకా అదే సంవత్సరంలోనే హియర్ కమ్స్ ద బ్రైడ్స్, బ్లాండీ ధారావాహికల్లో ఒక ఎపిసోడ్ లో కనిపించాడు.[58][59] 1970 లో సిల్లిఫాంట్ రచించిన, ఇన్‌గ్రిడ్ బెర్గ్‌మ్యాన్, ఆంటోనీ క్విన్ నటించిన ఎ వాక్ ఇన్ ద స్ప్రింగ్ రెయిన్ అనే చిత్రానికి పోరాట దృశ్యాలకు దర్శకత్వం వహించాడు.[60][61]

1971 - 73: హాంగ్‌కాంగ్ చిత్రాలు, హాలీవుడ్ లో ప్రవేశం

[మార్చు]
1971 లో లీ

1971 లో లీ సిల్లిఫాంట్ రచించిన లాంగ్‌స్ట్రీట్ అనే టివీ కార్యక్రమంలో నాలుగు ఎపిసోడ్లలో నటించాడు. ఇందులో ప్రధాన పాత్ర మైక్ లాంగ్‌స్ట్రీట్ కు మార్షల్ ఆర్ట్స్ శిక్షణ ఇచ్చే లీ సుంగ్ అనే పాత్ర బ్రూస్ ది. అతని మార్షల్ ఆర్ట్స్ తత్వాన్ని ఈ పాత్రలో ప్రవేశ పెట్టారు.[62][63] లీ, ఇంకా లిండా లీ కాడ్వెల్ ఇచ్చిన సమాచారం మేరకు అతను ఒక ద వారియర్ అనే స్వంత టీవీ కార్యక్రమాన్ని ఒకదాన్ని గురించి వార్నర్ బ్రదర్స్ తో చర్చించాడు. డిసెంబరు 9, 1971 లో ప్రసారమైన ద ప్రియరీ బెర్టన్ షో లో పారమౌంట్ పిక్చర్స్, వార్నర్ బ్రదర్స్ రెండు సంస్థలు లీని పాశ్చాత్య శైలి పాతబడిందనీ ఆధునికతను అందిపుచ్చుకోమని, సలహా ఇచ్చారు. కానీ లీ మాత్రం పాశ్చాత్య శైలిలో సినిమాలు చేయాలనుకుంటున్నట్టు చెప్పాడు.[64]

కాడ్వెల్ ప్రకారం లీ ప్రతిపాదించిన అంశమే వార్నర్ బ్రదర్స్ కుంగ్ ఫూ అనే కార్యక్రమంగా రూపొందించారు కానీ లీ కి మాత్రం ఎలాంటి గుర్తింపు ఇవ్వలేదు.[65] వార్నర్ బ్రదర్స్ తమ ఇద్దరు రచయితలు, నిర్మాతలు ఎడ్ స్పీల్‌మ్యాన్, హోవార్డ్ ఫ్రీడ్‌ల్యాండర్ 1969 నుంచి అలాంటి ఇతివృత్తంతో కూడిన స్క్రిప్టు రూపొందిస్తున్నట్లు చెప్పారు.[66][67] ఇదే విషయాన్ని లీ జీవితచరిత్ర రచయిత అయిన మాథ్యూ పోలీ ధృవపరిచాడు.[68] ఈ సమాచారాన్ని బట్టి లీ ని ఎంపికచేయకపోవడానికి కారణం అతని ఉచ్చారణ.[69] ఫ్రీడ్ వీన్‌ట్రాబ్ మాత్రం అతని జాతీయతను కారణంగా చూపాడు.[70][71]

వార్నర్ బ్రదర్స్ వారి కుంగ్ ఫూ ధారావాహికలో షావోలిన్ సన్యాసి పాత్ర అప్పటికి మార్షల్ ఆర్ట్స్ లో ప్రవేశం లేని డేవిడ్ క్యారడీన్ అనే వ్యక్తికి దక్కింది. ద పియరీ బెర్టన్ షో ముఖాముఖిలో లీ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ తాను వార్నర్ బ్రదర్స్ వైఖరిని అర్థం చేసుకున్నాను అని చెప్పాడు. వారు వ్యాపారపరంగా నన్ను ఎంచుకోవడం ఒక రిస్క్ గా భావించారు. దానికి వారిని నేను నిందించను. ఒకవేళ ఒక అమెరికన్ స్టార్ హాంగ్‌కాంగ్ వచ్చి ఉంటే, అక్కడ నేను డబ్బులు పెట్టే నిర్మాతనైతే నాక్కూడా అతన్ని ఆదరిస్తారా లేదా అనే సందేహం కలిగి ఉండేదని చెప్పాడు.[72]

నిర్మాత ఫ్రెడ్ వీన్‌ట్రాబ్ లీ ని హాంగ్‌కాంగ్ కు తిరిగివెళ్ళి అక్కడ ఒక చిత్రాన్ని చేసి తిరిగి వచ్చి దాన్ని హాలీవుడ్ నిర్మాతలకు చూపించమని సలహా ఇచ్చాడు.[73] అమెరికాలో కేవలం సహాయ పాత్రలకే పరిమితం చేస్తుండటంతో లీ అసంతృప్తితో హాంగ్‌కాంగ్ కు తిరిగి వెళ్ళాడు. అప్పటికే అక్కడ ద గ్రీన్ హార్నెట్ బాగా ప్రజాదరణ పొందింది. దాన్ని అక్కడ అందరూ ద కాటో షో అని గుర్తించారు. కాటో అనేది లీ అందులో పోషించిన పాత్ర పేరు. అలా లీ అక్కడి వారికి స్టార్ గా మారాడు.[74] షా బ్రదర్స్ స్టూడియో, గోల్డెన్ హార్వెస్ట్ తో లీ రెండు చిత్రాలలో నటించేటట్లుగా ఒప్పందం కుదుర్చుకున్నాడు.

లీ మొదటిసారిగా ద బిగ్ బాస్ (1971) అనే చిత్రంలో కథానాయకుడి పాత్ర పోషించాడు. ఇది ఆసియా ఖండంలో మంచి విజయం సాధించి అతనికి స్టార్‌డమ్ సాధించి పెట్టింది. దాని తర్వాత 1972 లో వచ్చిన ఫిస్ట్ ఆఫ్ ఫ్యూరీ చిత్రం ముందు చిత్రం రికార్డులు తిరగరాసి మరో ఘన విజయాన్ని నమోదు చేసింది. రెండూ సినిమాలతో మొదటి ఒప్పందం పూర్తి కాగానే లీ గోల్డెన్ హార్వెస్ట్ తో కొత్త ఒప్పందం కుదుర్చుకున్నాడు. లీ తర్వాత చౌ తో కలిసి తానే కాన్‌కార్డ్ ప్రొడక్షంస్ అనే కొత్త సంస్థను స్థాపించాడు. అతని మూడో చిత్రం ద వే ఆఫ్ ద డ్రాగన్ (1972) కి చిత్ర నిర్మాణం, కథ, దర్శకత్వం, నటన, పోరాటాలు మీద పూర్తి నియంత్రణ ఇచ్చారు. 1964 కాలిఫోర్నియాలోని లాంగ్ బీచ్ లో జరిగిన ప్రదర్శనలో లీ కి కరాటే ఛాంపియన్ అయిన చక్ నోరిస్ పరిచయమయ్యాడు. ద వే ఆఫ్ ద డ్రాగన్ చిత్రంలో లీ నోరిస్ ని ప్రతినాయకుడిగా పరిచయం చేశాడు. వారిరువురి ప్రదర్శన మార్షల్ ఆర్ట్స్ లోనూ సినీ చరిత్రలోనూ ఒక మరపురాని పోరాట దృశ్యం.[75][76] ఈ పాత్రకు మొదటగా అమెరికన్ కరాటే ఛాంపియన్ అయిన జో లూయిస్ ని అనుకున్నారు.[77] ప్రపంచ వ్యాప్తంగా ఫిస్ట్ ఆఫ్ ఫ్యూరీ 100 మిలియన్ డాలర్లు, వే ఆఫ్ ద్ డ్రాగన్ 130 మిలియన్ డాలర్లు వసూలు చేశాయి.[78]

1972 ఆగస్టు నుండి అక్టోబరు వరకు లీ గోల్డెన్ హార్వెస్ట్ తరపున నాలుగో చిత్రమైన గేమ్ ఆఫ్ డెత్ కు ప్రణాళిక వేశాడు. కొన్ని దృశ్యాలు చిత్రీకరణ కూడా ప్రారంభించాడు. 7 అడుగుల 2 అంగుళాల ఎత్తు కలిగిన అమెరికన్ బాస్కెట్ బాల్ ఆటగాడు, లీ పూర్వ విద్యార్థి అయిన కరీం అబ్దుల్ జబ్బార్ తో చేసిన పోరాట దృశ్యం కూడా ఇందులో ఉంది. అయితే నవంబరు 1972 లీ దీని నిర్మాణం ఆగింది. దీనికి కారణం వార్నర్ బ్రదర్స్, కాంకార్డ్ ప్రొడక్షన్స్, గోల్డెన్ హార్వెస్ట్ తో కలిసి సంయుక్తంగా నిర్మించదలపెట్టిన ఎంటర్ ది డ్రాగన్ చిత్రంలో లీ కథానాయకుడిగా ఎంపిక కావడం. ఈ చిత్రం 1973 ఫిబ్రవరిలో మొదలై, అదే సంవత్సరం ఏప్రిల్ లో ముగిసింది.[79]

స్టార్‌సీస్ మోషన్ పిక్చర్స్ అనే నిర్మాణ అనే సంస్థ తాము నిర్మిస్తున్న ఫిస్ట్ ఆఫ్ యూనికార్న్ అనే చిత్రానికి మొదటగా బ్రూస్ లీ ని పోరాట దృశ్యాలను మాత్రమే రూపొందించేటట్లుగా ఒప్పందం కుదుర్చుకుంది. ఇది కూడా తన చిన్ననాటి స్నేహితుడు యూనికార్న్ చాన్ మీద గౌరవం కొద్దీ ఒప్పుకున్నాడు.[80] కానీ వాళ్ళు లీ ని ప్రధాన పాత్రలో నటించమన్నారు. లీ మొదటగా ఆ నిర్మాణ సంస్థపై కేసు వేయాలనుకున్నాడు కానీ తన చాన్ తో మితృత్వం దృష్ట్యా ఆ ప్రయత్నం విరమించుకున్నాడు. కానీ ఎంటర్ ద డ్రాగన్ పూర్తయిన కొన్ని నెలలకే, జూలై 26, 1973 ఆ చిత్రం విడుదలకు ఆరు రోజులకు ముందే లీ మరణించాడు.[81]

ఎంటర్ ద డ్రాగన్ ఆ సంవత్సరంలో అత్యధిక వసూళ్ళు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలవడమే కాక బ్రూస్ లీ ని ఒక మార్షల్ ఆర్ట్స్ లెజెండ్ గా నిలబెట్టింది. ఈ చిత్రం 1973 లో సుమారు 8,50,000 డాలర్ల బడ్జెట్ తో నిర్మించారు.[82] ద్రవ్యోల్బణాన్ని పరిధిలోకి తీసుకుంటే 2007 నాటికి దాని విలువ సుమారు 4 మిలియన్ డాలర్లు.[83] ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సుమారు 400 మిలియన్ డాలర్లు ఆర్జించింది.[81] 2022 నాటికి ద్రవ్యోల్బణం ప్రకారం దీని విలువ సుమారు 2 బిలియన్ డాలర్ల పైమాటే.[84][85]

1978 - ప్రస్తుతం: మరణానంతర పని

[మార్చు]

ఎంటర్ ద డ్రాగన్ దర్శకుడు రాబర్ట్ క్లౌస్ గోల్డెన్ హార్వెస్ట్ సంస్థతో కలిసి లీ అర్ధాంతరంగా వదిలి పెట్టిన గేమ్ ఆఫ్ డెత్ ప్రాజెక్టును పునరుద్ధరించారు. చేస్తున్న పనిని ఆపి ఎంటర్ ద డ్రాగన్ చిత్రంలో నటించే ముందు లీ సుమారు 100 నిమిషాల ఫుటేజీని చిత్రీకరించి ఉన్నాడు. అబ్దుల్ జబ్బార్ తో పాటు జార్జ్ లెజన్‌బీ, హాప్కిడో మాస్టర్ జి హాన్-జే, లీ ఇంకొక విద్యార్థి డాన్ ఇనోసాంటో ఈ చిత్రంలో నటించారు. బ్రూస్ లీ పోషించిన హై టియెన్ పాత్ర ఐదు అంతస్థుల పగోడాలో వివిధ ప్రత్యర్థులను ఓడించుకుంటూ పతాక స్థాయికి చేరుకుంటుంది.[a][87]

రాబర్ట్ క్లౌస్ వివాదాస్పద రీతిలో బ్రూస్ లీ ని పోలిన మరొక వ్యక్తి కిమ్ టాయ్ చంగ్, అతనికి స్టంట్ డబుల్ గా యువెన్ బియావో గా నటింపచేశాడు. లీ ముందు నటించిన చిత్రాల నుంచి ఆర్కైవ్ ఫుటేజ్ తీసుకుని కొత్త కథ, నటులతో ఈ సినిమా చేశాడు. ఇది 1978 లో విడుదలైంది. ఈ అతుకుల బొంత సినిమాలో అసలైన బ్రూస్ లీ కనిపించే సన్నివేశాలు కేవలం 15 నిమిషాలే ఉన్నాయి.[87] లీ చిత్రీకరించిన దానిలో వాడకుండా ఉన్న ఫుటేజీని 22 ఏళ్ళ తర్వాత సంపాదించి బ్రూస్ లీ: ఎ వారియర్స్ జర్నీ అనే డాక్యుమెంటరీలో వాడారు.

ద బిగ్ బాస్, ఫిస్ట్ ఆఫ్ ఫ్యూరీ విజయాల తర్వాత 1972 లో నిర్మాత రేమండ్ చౌ, గోల్డెన్ హార్వెస్ట్ సంస్థ సారథ్యంలో లో వెయ్ దర్శకత్వంలో యెల్లో ఫేస్‌డ్ టైగర్ అనే పేరుతో మూడో చిత్రానికి ప్రణాళిక వేశారు. కానీ లీ మాత్రం తన స్వీయ నిర్మాణ దర్శకత్వంలో తన దగ్గరున్న స్క్రిప్టును వే ఆఫ్ ద డ్రాగన్ అనే సినిమాగా తీయాలనుకున్నాడు. రేమండ్ చౌ తో కలిసి లీ ఒక నిర్మాణ సంస్థను ప్రారంభించినా సెప్టెంబరు - నవంబరు 1973 మధ్యలో షా బ్రదర్స్ స్టూడియో తో కలిసి ద సెవెన్ సన్స్ ఆఫ్ ద జేడ్ డ్రాగన్ అని ఒక పీరియడ్ డ్రామా తీయాలనుకున్నారు.[88]

2015 లో పర్‌ఫెక్ట్ స్టాం ఎంటర్టైన్మెంట్, ఇంకా బ్రూస్ లీ కూతురు షానన్ లీ కలిసి ద వారియర్ ధారావాహికను నిర్మిస్తామనీ, అది సినీమాక్స్ లో ప్రసారం అవుతుందని ప్రకటించారు. జస్టిన్ లిన్ దీనికి దర్శకత్వం వహించేందుకు ఎంపికయింది.[89] దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్ లో అక్టోబరు 2017 న ఇది ప్రారంభమైంది. మొదటి సీజన్ లో 10 ఎపిసోడ్లు ఉన్నాయి.[90] ఏప్రిల్ 2019 లో సినీమాక్స్ దీన్ని రెండవ సీజన్ కు పొడిగించింది.[91]

మార్చి 2021 లో నిర్మాత జేసన్ కొఠారి ద సైలెంట్ ఫ్లూట్ ని మినీసిరీస్ లా రూపొందించేందుకు హక్కులు పొందాడు. జాన్ ఫస్కో దీనికి స్క్రీన్ రచయితగా, ఎక్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తాడు.[92]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

చైనాకు చెందిన కాంటోనీస్ భాషలో లీ అసలు పేరు లీ జున్ ఫాంగ్.[93] దీనికి తిరిగి రా అనే అర్థం ఉంది. లీ అమెరికాలో జన్మించి హాంగ్‌కాంగ్ లో పెరిగాడు. వయసుకు వచ్చినపుడు మళ్ళీ అమెరికాకు రమ్మని గుర్తుగా లీ తల్లి ఆ పేరు పెట్టింది.[94] లీ తల్లికి ఉండే మూఢనమ్మకం వల్ల అతనికి పెట్టిన అసలైన పేరు సై ఫాన్. ఇది ఆడవాళ్ళకు పెట్టే పేరు. దీని అర్థం చిన్న ఫీనిక్స్ పక్షి.[30] ఆంగ్ల నామం బ్రూస్ అనేది డాక్టర్ మేరీ గ్లోవర్ అనే వైద్యుడు ఇచ్చినట్లు భావిస్తున్నారు.[95]

బ్రూస్ లీ తండ్రి లీ హోయ్-చాన్ ఒక పేరొందిన కాంటోనీస్ ఆపెరా గాయకుడు, సినీ నటుడు. జపానీయులు హాంగ్‌కాంగ్ మీద దాడి చేస్తున్న సమయంలో ఈయన తన కుటుంబంతో కలిసి ఒక సంవత్సరం పాటు ప్రదర్శనలు ఇస్తూ పర్యటనలు చేస్తున్నాడు. అంతకు ముందు అనేక సంవత్సరాలు అమెరికాలో పర్యటించి అక్కడ ఉన్న చైనా సమాజాలలో ప్రదర్శనలు ఇచ్చాడు. ఆయన సహచరులు చాలామంది అమెరికాలో ఉండటానికే నిశ్చయించుకున్నా ఆయన మాత్రం బ్రూస్ పుట్టిన తర్వాత హాంగ్‌కాంగ్ కు తిరిగి వచ్చాడు. కొన్ని నెలలలో జపాన్ హాంగ్‌కాంగ్ మీద దాడి చేసింది. మూడు సంవత్సరాల ఎనిమిది నెలల పాటు జపానీయుల పాలన కిందే ఉన్నారు. యుద్ధం ముగిసిన తర్వాత హోయ్-చాన్ తన నటనా వృత్తిని తిరిగి ప్రారంభించి హాంగ్‌కాంగ్ పునర్నిర్మాణమైన సంవత్సరాల్లో మరింత ప్రజాదరణ పొందిన నటుడు అయ్యాడు.

లీ తల్లి గ్రేస్ హో అప్పటి హాంగ్‌కాంగ్ లోని ధనవంతులు, మంచి పలుకుబడి ఉన్న హోటుంగ్స్ కుటుంబం నుంచి వచ్చింది. అందుకని బ్రూస్ చిన్నతనంలో మంచి వాతారణంలోనే పెరిగాడు. వాళ్ళ కుటుంబం కలిగిందే అయినా వారి చుట్టుపక్కల వాతావరణం మాత్రం రాను రాను జనాభా ఎక్కువై పోయి ప్రమాదకరంగానూ, ముఠా తగాదాలకు నిలయంగానూ మారింది. కమ్యూనిస్ట్ చైనాలోని నిరాశ్రయులు ఇక్కడికి రావడం ఒక ప్రధాన కారణం. ఐదుమంది సంతానంలో బ్రూస్ నాలుగవ వాడు.

లీ కుమారుడు బ్రాండన్ లీ, కుమార్తె షానన్ లీ కూడా నటులే. తమ్ముడు రాబర్ట్ 1960వ దశకంలో హాంకాంగ్ ను ఒక ఊపు ఊపిన థండర్ బర్డ్స్ అనే సంగీత బృందంలో సభ్యుడు.[96]

మార్షల్ ఆర్ట్స్, శారీరక ధారుడ్యము

[మార్చు]

లీ చిత్రాలలో సైడ్ కిక్, రౌండ్‌హౌస్ కిక్, గ్రాప్లింగ్, స్పిన్నింగ్ హీల్ కిక్, ఆర్మ్‌బార్ వంటి శైలి, నన్‌చాకు లాంటి ఆయుధాలకు, ఒక చిన్న అరుపు (కియై) ప్రాచుర్యం పొందాయి. లీ కేవలం ఒక అంగుళం దూరం నుండి ఇవ్వగలిగే వన్ ఇంచ్ పంచ్, రెండు వేళ్ళతో చేసే పుషప్‌లకు కూడా ప్రాచుర్యం తెచ్చాడు.[97][98][99][100][101] లీ కి మొట్టమొదట తండ్రి ద్వారా మార్షల్ ఆర్ట్స్ పరిచయం అయ్యింది. ఆయన దగ్గర్నుంచి వు స్టైల్ తాయ్ చీ లో ప్రాథమిక అంశాలు నేర్చుకున్నాడు.[102] టీనేజీలో ఉండగా లీ హాంగ్‌కాంగ్ లో జరిగా ముఠా తగాదాల్లో తల దూర్చాడు. దీనివల్ల తరచు అతను వీధి పోరాటాలకు దిగేవాడు.[27] వింగ్ చున్ విధానాన్ని అభ్యసించడం అతని మార్షల్ ఆర్ట్ పై పెద్ద ప్రభావం చూపింది.[103] 1956-57 మధ్యలో ప్రత్యర్థుల చేతిలో ఓడిపోవడంతో వింగ్ చున్ మాస్టర్ అయిన ఇప్‌మ్యాన్ దగ్గరకు శిక్షణకు వెళ్ళాడు. అప్పటికి లీ 16 ఏళ్ళ వయసువాడు.[19] ఇప్‌మ్యాన్ శిక్షణలో చి సావో, వుడెన్ డమ్మీ లాంటి కొన్ని పద్ధతులు సాధన చేశాడు. ఈ శిక్షణలో ఒక ఖచ్చితమైన సరళి ఉండేది కాదు.[19] ఇది కాక లీ వేరే చైనీస్ మార్షల్ ఆర్ట్స్ పద్ధతుల్లో కూడా శిక్షణ పొందాడు.[104]

1956 58 సంవత్సరాల మధ్యలో సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ కళాశాల బాక్సింగ్ శిక్షకుడైన బ్రదర్ ఎడ్వర్డ్ దగ్గర లీ బాక్సింగ్ నేర్చుకున్నాడు. లీ 1958లో హాంగ్ కాంగ్ స్కూల్స్ బాక్సింగ్ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచాడు. ఫైనల్‌లో మునుపటి ఛాంపియన్ గ్యారీ ఎల్మ్స్‌ ని మట్టికరిపించాడు.[11] అమెరికాకు వెళ్లిన తర్వాత, లీ హెవీవెయిట్ బాక్సింగ్ ఛాంపియన్ ముహమ్మద్ ఆలీచే ఎక్కువగా ప్రభావితమయ్యాడు. 1960లలో అతని ఫుట్‌వర్క్‌ను అధ్యయనం చేసి తన శైలిలో చేర్చుకున్నాడు.[105]

వీధి పోరాటాలు

[మార్చు]

లీ లైన హాంకాంగ్ వీధి పోరాట సంస్కృతి ప్రధాన ప్రభావం చూపించింది. ఇందులో భాగంగా ఇంటి పైకప్పులపైకెక్కి పోరాటాలు చేసేవారు. 20వ శతాబ్దం మధ్యలో, హాంకాంగ్‌లో విపరీతమైన నేరాలు, పరిమిత హాంకాంగ్ పోలీసు సిబ్బంది వల్ల అనేక మంది హాంకాంగ్ యువకులు ఆత్మరక్షణ కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునేవారు. దాదాపు 1960వ దశకంలో, హాంగ్‌కాంగ్‌లో దాదాపు 400 మార్షల్ ఆర్ట్స్ పాఠశాలలు ఉన్నాయి. అందులో విలక్షణమైన యుద్ధ కళలను బోధించేవారు. హాంగ్‌కాంగ్ వీధి పోరాట సంస్కృతిలో, 1950-60 దశకాలలో ఇంటి పైకప్పులపై పోరాటే పద్ధతి కనిపెట్టారు. బ్రిటీష్ అధికారుల అణిచివేతలను నివారించడానికి ఇక్కడ ప్రత్యర్థి యుద్ధ కళల పాఠశాలల ముఠాలు హాంగ్ కాంగ్ పైకప్పులపై ఉత్తిచేతులతో పోరాటాలకు దిగి ఒకరినొకరు సవాలు చేసుకునేవారు. ఈ పోటీలలో లీ తరచుగా పాల్గొనేవాడు. వివిధ మార్షల్ ఆర్ట్స్ పాఠశాలల నుండి విభిన్న పద్ధతులను తన స్వంత హైబ్రిడ్ మార్షల్ ఆర్ట్స్ స్టైల్‌లో కలిపాడు.[106]

లీ 1970ల ప్రారంభంలో హాంకాంగ్‌కు తిరిగి వచ్చినప్పుడు, "తూర్పుదేశాలలో అత్యంత వేగవంతమైన పిడికిలి"గా పేరుగాంచడం వల్ల, స్థానికులు అతనిని వీధి పోరాటాలకు సవాలు చేసేవారు. అతను కొన్నిసార్లు ఈ సవాళ్లను అంగీకరించి, వీధి పోరాటాలలో పాల్గొన్నాడు. ఆ సమయంలో పత్రికలు అతనిని హింసాత్మకంగా చిత్రీకరించాయి.[107]

దేహ ధారుడ్యం

[మార్చు]

సుమారు 5 అడుగుల 8 అంగుళాల (172 సె.మీ) ఎత్తు, 64 కెజి బరువుతో[108] లీ తన శారీరక దృఢత్వం, శక్తికి ప్రసిద్ధి చెందాడు. వీలైనంత బలంగా మారడానికి ఫిట్‌నెస్ నియమాన్ని ఖచ్చితంగా అనుసరించేవాడు. 1965లో వాంగ్ జాక్-మాన్‌తో అతని మ్యాచ్ తర్వాత, లీ మార్షల్ ఆర్ట్స్ శిక్షణ పట్ల తన విధానాన్ని మార్చుకున్నాడు. తన కాలంలోని చాలా మంది మార్షల్ ఆర్టిస్టులు ఫిజికల్ కండిషనింగ్‌పై తగినంత సమయాన్ని వెచ్చించలేదని లీ భావించాడు. లీ మొత్తం ఫిట్‌నెస్ - కండరాల బలం, కండరాల ఓర్పు, హృదయనాళ ఓర్పు, వశ్యత యొక్క అన్ని అంశాలను చేర్చారు. అతను కొన్ని కండరాలను వృద్ధిచేయడానికి సాంప్రదాయ బాడీబిల్డింగ్ పద్ధతులను ఉపయోగించాడు. అయితే అది వేగం లేదా వశ్యతను తగ్గిస్తుంది. అదే సమయంలో, సమతుల్యత గురించి, మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యాలలో శారీరక శిక్షణ విజయవంతం కావడానికి మానసిక, ఆధ్యాత్మిక సాధన ప్రాథమికమని లీ అభిప్రాయపడ్డాడు. టావో ఆఫ్ జీత్ కున్ డో లో అతను ఇలా వ్రాశాడు:

వ్యాయామక్రీడల్లో అత్యంత నిర్లక్ష్యం చేయబడిన అంశాలలో శిక్షణ ఒకటి. నైపుణ్యాభివృద్ధికి ఎక్కువ సమయం కేటాయిస్తారు కానీ పోటీల్లో పాల్గొనడానికి కావలసిన వ్యక్తిత్వ అభివృద్ధికి చాలా తక్కువ సమయం ఇవ్వబడుతుంది. అంతిమంగా శిక్షణ అనేది చిన్నపాటి టెక్నిక్‌లకు సంబంధించినది కాదు. అంతకు మించి అత్యంత అభివృద్ధి చెందిన ఆధ్యాత్మికత, శరీరాకృతికి సంబంధించినది.[109]

లిండా లీ కాడ్వెల్ ప్రకారం, అతను అమెరికాకు వెళ్ళిన వెంటనే, పోషకాహారాన్ని తీవ్రంగా పరిగణించడం ప్రారంభించాడు. ఆరోగ్యకరమైన ఆహారాలు, అధిక-ప్రోటీన్ పానీయాలు, విటమిన్, మినరల్ సప్లిమెంట్లపై ఆసక్తిని పెంచుకున్నాడు. అధిక-పనితీరు గల శరీరాన్ని సాధించడం అనేది అధిక-పనితీరు గల ఆటోమొబైల్ ఇంజిన్‌ను నిర్వహించడానికి సమానమని అతను తరువాత నిర్ధారించాడు. ఉపమానంగా, తక్కువ-ఆక్టేన్ ఇంధనాలతో కారును నడపలేనందున, జంక్ ఫుడ్ యొక్క స్థిరమైన ఆహారంతో ఒకరి శరీరాన్ని నిలబెట్టుకోలేరు. సరిపడని ఇంధనం వల్ల ఒకరి శరీరం నిదానంగా లేదా అలసత్వంగా పని చేస్తుంది.[110]

లీ వేయించిన వస్తువులు, శుద్ధి చేసిన పిండిని పక్కన పెట్టాడు. అవి తన శరీరానికి కేవలం ఖాళీ కేలరీలను అందజేస్తాయని వివరించాడు.[111] ఆహార వైవిధ్యం కోసం ఆసియా వంటకాలకు అభిమానిగా ప్రసిద్ది చెందాడు. తరచుగా కూరగాయలు, బియ్యం మరియు చేపల కలయికతో భోజనం చేసేవాడు. లీ పాల ఉత్పత్తులపై అయిష్టత చూపేవాడు. కానీ అతని ఆహారంలో పాలపొడి ఉపయోగించేవాడు.[112]

డాన్ ఇనోసాంటో లీ తన షెడ్యూల్‌లో మొదటి చర్యగా ధ్యానాన్ని అభ్యసించాడని గుర్తుచేసుకున్నాడు.[113]

మరణం

[మార్చు]

మే 10, 1973న ఎంటర్ ది డ్రాగన్ సినిమాకు ఆరెంజ్ స్కై గోల్డెన్ హార్వెస్ట్ స్టూడియోలో డబ్బింగ్ జరుగుతుండగా లీ ఆకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. అతనికి మూర్ఛ రావడం, తలనొప్పిగా అనిపించడంతో వెంటనే హాంగ్‌కాంగ్ బాప్టిస్ట్ ఆసుపత్రికి తరలించారు. మెదడు విపరీతంగా ఉబ్బిపోవడం (సెరిబ్రల్ ఎడిమా) దీనికి కారణమని అక్కడి వైద్యులు చెప్పారు. వాళ్ళి మాన్నిటాల్ అనే ఔషధం సాయంతో ఆ వాపును తగ్గించగలిగారు.[114]

జూలై 20, 1973 న బ్రూస్ హాంగ్‌కాంగ్ లో జార్జ్ లేజెన్‌బీ అనే నటుడితో రాత్రి విందుకు వెళ్ళాడు. అతనితో ఒక సినిమా చేయాలని బ్రూస్ లీ అనుకున్నాడు. బ్రూస్ లీ భార్య లిండా ప్రకారం అతను మధ్యాహ్నం 2 గంటలకు నిర్మాత రేమండ్ చౌ తో గేమ్ ఆఫ్ డెత్ సినిమా గురించి చర్చించాడు. 4 గంటల తర్వాత ఇద్దరూ కలిసి తైవాన్ నటి బెట్టీ టింగ్ పెయ్ ఇంటికి వెళ్ళారు. ఆమె ఇంట్లో అందరూ కలిసి స్క్రిప్టు గురించి చర్చించారు. తర్వాత రేమండ్ చౌ విందు సమావేశం హాజరవడానికి వెళ్ళాడు.[115][116] లీ ఒక చిన్న కునుకు తీయడానికి వెళ్ళాడు. విందు సమయానికి లీ రాకపోవడంతో చౌ అతని అపార్ట్‌మెంటుకు వెళ్ళి అతన్ని లేపాలని చూశాడు కానీ సాధ్యం కాలేదు. వెంటనే వైద్యుడిని ఇంటికి రప్పించి లేపాలని ప్రయత్నించారు. అది కూడా సాధ్యం కాలేదు. తర్వాత ఆంబులెన్స్ లో క్వీన్ ఎలిజబెత్ ఆసుపత్రికి తరలించారు. అక్కడికి చేరుకోకముందే లీ మరణించాడని వైద్యులు ధృవీకరించారు. అప్పటికి లీ వయసు 32 ఏళ్ళు.[117]

వారసత్వం, సాంస్కృతిక ప్రభావం

[మార్చు]

బ్రూస్ లీ ప్రపంచంలోనే ఒక అత్యంత ప్రభావవంతమైన మార్షల్ ఆర్టిస్టు అని కొంతమంది వ్యాఖ్యాతలు, మార్షల్ ఆర్టిస్టులు అభిప్రాయపడ్డారు.[118][119][120] ఇంకా 20వ శతాబ్దపు పాప్ కల్చర్ ఐకాన్ గానూ, తూర్పు పడమర దేశాల మధ్య వారధిగానూ ఇతన్ని అభివర్ణిస్తారు.[121][122] టైమ్ పత్రిక ఇతనిని 20వ శతాబ్దపు అతిముఖ్యమైన వ్యక్తులలో ఒకడిగా పరిగణించింది. లీ గురించి చాలా జీవిత చరిత్రలు కూడా వచ్చాయి.[123] ఒక పుస్తకం 1988 నాటికి సుమారు 40 లక్షల ప్రతులు అమ్ముడైంది.[124]

సినిమాలు

[మార్చు]
సంవత్సరము శీర్షిక పాత్ర గమనికలు
1969 మార్లో విన్స్లో వాంగ్
1971 ది బిగ్ బాస్ చెంగ్ చావో-అన్ ఫిస్ట్స్ ఆఫ్ ఫ్యూరీ అని కూడా పిలుస్తారు
1972 ఫిస్ట్స్ ఆఫ్ ఫ్యూరీ చెన్ జెన్ ది చైనీస్ కనెక్షన్ అని కూడా పిలుస్తారు
1972 వే అఫ్ ది డ్రాగన్ టాంగ్ లంగ్ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ అని కూడా పిలుస్తారు
1972 గేమ్ ఆఫ్ డెత్ హై టెన్ 1978 వరకు సినిమా తీయడం పూర్తి కాలేదు
1973 ఎంటర్ ది డ్రాగన్ లీ మరణానంతర విడుదల
1979 ది రియల్ బ్రూస్ లీ మరణానికి ముందు బ్రూస్ లీ ప్రారంభ బ్రూస్ లీ చలన చిత్రాల క్లిప్‌లతో డాక్యుమెంటరీ, బ్రూస్ లీ అనుకరించేవారితో సన్నివేశాలు.
1981 గేమ్ ఆఫ్ డెత్ II దీనిని టవర్ ఆఫ్ డెత్ అని కూడా అంటారు. ఈ చిత్రం నిర్మాణానికి ముందే లీ మరణించాడు ,దృశ్యాలు అతని ఇతర చిత్రాల నుండి తీసుకోబడ్డాయి.

గమనికలు

[మార్చు]
  1. Film producer Andre Morgan, who worked with Lee on the set of Game of Death, recalls that a choice had to be made from what was made available: a yellow suit or a black suit. The yellow suit was chosen because it allowed a footprint from a kick to be seen on film in a fighting scene with Kareem[86]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Awards, Honors, Achievements, and Activities". Los Angeles: Bruce Lee Foundation. Archived from the original on 2009-08-05. Retrieved 2020-04-18.
  2. "Enter the star of the century". The Sydney Morning Herald. Retrieved March 21, 2017.
  3. Stein, Joel (1999). "TIME 100: Bruce Lee". Time. Archived from the original on 2009-12-02. Retrieved 2008-05-30.
  4. Dennis, Felix; Atyeo, Don (1974). Bruce Lee King of Kung-Fu. United States: Straight Arrow Books. ISBN 0-87932-088-5.
  5. 吳貴龍 (2018). 龍影中華──李小龍的光影片段. 中華書局(香港). p. 8.
  6. Description of the parent's racial makeup as described by Robert Lee at minute mark 3:35 in the cable television documentary, First Families: Bruce Lee, which premiered on Fox Family on October 26, 1999.
  7. Sid Campbell; Greglon Lee (2003). Dragon and the Tiger: The Birth of Bruce Lee's Jeet Kune Do – The Oakland Years. Frog Books. pp. 1–. ISBN 978-1-58394-089-1. Archived from the original on July 27, 2020. Retrieved November 18, 2019.
  8. "Biography". Bruce Lee Foundation. Archived from the original on August 22, 2010. Retrieved June 7, 2010.
  9. Christopher J. Berry; Mary Ann Farquhar (2006). China on Screen: Cinema and Nation. Columbia University Press. pp. 100–. ISBN 978-0-231-51030-1.
  10. Bruce Thomas (1994). Bruce Lee: Fighting Spirit : a Biography. Frog Books. pp. 11–. ISBN 978-1-883319-25-0.
  11. 11.0 11.1 11.2 Thomas 1994, pp. 29–30.
  12. "Bruce Lee, a global hero who epitomised Hong Kong's strengths – it's just a pity the city could not preserve his former home". South China Morning Post. 12ft.io. Archived from the original on January 27, 2023. Retrieved January 26, 2023.
  13. "Bro. Edward Muss FMS R.I.P." Archived from the original on January 26, 2023. Retrieved January 26, 2023.
  14. Thomas 1994, pg. 307-308
  15. "Who taught Bruce Lee kung fu? He was born to be a fighter, but the martial arts superstar also trained with the best". South China Morning Post. July 25, 2018. Archived from the original on February 14, 2023. Retrieved February 14, 2023. Lee found a sifu, or master, through a street-gang member called William Cheung, who took him to a wing chun school run by Ip Man, who had begun teaching the style in Hong Kong around 1950.
  16. De Roche, Everett (June 1989). "William Cheung Scene one... Take One". Australasian Blitz Magazine. No. Print edition Vol. 3 No. 3. Blitz Publishers. Gordon and Gotch Ltd. ISSN 0818-9595. Archived from the original on June 2, 2019. Retrieved January 12, 2017.
  17. Lallo, Michael (January 20, 2011). "All the right moves". The Sydney Morning Herald. No. onliine. Fairfax Media. Retrieved December 26, 2016.
  18. Chen, Edwin (January 5, 2016). "Bruce Lee Was an Anchor Baby". asamnews.com. No. Online. AsAmNews. Archived from the original on November 8, 2020. Retrieved November 1, 2020.
  19. 19.0 19.1 19.2 Black Belt: Bruce Lee Collector's Edition Summer 1993
  20. Black Belt: Bruce Lee Collector's Edition Summer 1993, p. 18.
  21. Thomas 1994, p. 26.
  22. Sharif 2009, p. 56.
  23. Black Belt: Bruce Lee Collector's Edition Summer 1993 p. 19.
  24. Campbell 2006, p. 172.
  25. "Who taught Bruce Lee kung fu? He was born to be a fighter, but the martial arts superstar also trained with the best". South China Morning Post. July 25, 2018. Archived from the original on February 14, 2023. Retrieved February 14, 2023. Although Lee studied wing chun at Ip's school, he was mainly taught by Wong Shun-leung, as Ip himself only taught advanced students, not beginners. Lee quickly became devoted to wing chun and practiced diligently.
  26. Lee, Linda; Lee, Mike (1989). The Bruce Lee Story (in ఇంగ్లీష్). Black Belt Communications. p. 30. ISBN 978-0-89750-121-7. Archived from the original on July 27, 2020. Retrieved July 23, 2020.
  27. 27.0 27.1 Linda Lee; Mike Lee (1989). The Bruce Lee Story. Black Belt Communications. pp. 26–. ISBN 978-0-89750-121-7. Archived from the original on July 27, 2020. Retrieved November 18, 2019.
  28. 28.0 28.1 Burrows, Alyssa (2002). "Bruce Lee". HistoryLink. Archived from the original on May 8, 2008. Retrieved May 30, 2008.
  29. "What you didn't know about: Bruce Lee Bruce Lee in Seattle — Part 1". Northwest Asian Weekly. August 25, 2022. Archived from the original on July 2, 2023. Retrieved July 2, 2023.
  30. 30.0 30.1 Bruce Lee: the immortal Dragon, January 29, 2002, A&E Television Networks
  31. 31.0 31.1 "Wing Chung Gung Fu". Hardcore JKD. Archived from the original on May 14, 2008. Retrieved May 30, 2008.
  32. "Bruce Lee Biography". Bruce Lee Foundation. Archived from the original on November 19, 2012. Retrieved September 4, 2012.
  33. "Bruce Lee and his Seattle roots — A retrospective comes to the Wing". Northwest Asian Weekly (in అమెరికన్ ఇంగ్లీష్). August 11, 2014. Archived from the original on November 25, 2021. Retrieved November 25, 2021.
  34. Little 2001, p. 32
  35. Thomas 1994, p. 42
  36. "U. of Washington alumni records". Washington.edu. Archived from the original on February 21, 2011. Retrieved January 22, 2010.
  37. "Two Finger Pushup". Maniac World. Archived from the original on May 21, 2008. Retrieved May 30, 2008.
  38. Vaughn 1986, p. 21
  39. Nilsson, Thomas (May 1996). "With Bruce Lee: Taekwondo Pioneer Jhoon Rhee Recounts His 10-Year Friendship With the "Dragon"". Black Belt Magazine. 34 (5): 39–43. Archived from the original on May 23, 2024. Retrieved November 19, 2009.
  40. 40.0 40.1 Bruce Lee: The Immortal Dragon, January 29, 2002, A&E Television Networks
  41. 41.0 41.1 41.2 41.3 41.4 Dorgan 1980
  42. Black Belt: Bruce Lee Collector's Edition, Summer 1993 Rainbow Publications Inc, p. 117
  43. 43.0 43.1 Rossen, Jake (August 10, 2015). "Bruce Lee: The Time Bruce Lee Was Challenged to a Real Fight". Mental Floss. New York. Archived from the original on July 11, 2016. Retrieved July 10, 2016.
  44. Aarons, Leroy F. (October 2, 1966). "Color Him Green". Tampa Bay Times. Vol. 83.
  45. "American Heritage Center Blog: Bruce Lee Steals the Show in ""The Green Hornet""". American Heritage Center. The American Heritage Center holds the papers of William Dozier, who produced and narrated the TV series The Green Hornet, as well as the Batman TV series. March 16, 2020. Archived from the original on April 10, 2020. Retrieved April 5, 2020.
  46. "Batman | TV Guide". TVGuide.com (in ఇంగ్లీష్). Archived from the original on November 15, 2019. Retrieved November 15, 2019.
  47. "Batman | TV Guide". TVGuide.com (in ఇంగ్లీష్). Archived from the original on November 15, 2019. Retrieved November 15, 2019.
  48. "Batman | TV Guide". TVGuide.com (in ఇంగ్లీష్). Archived from the original on November 15, 2019. Retrieved November 15, 2019.
  49. 49.0 49.1 "American Heritage Center Blog: Bruce Lee Steals the Show in 'The Green Hornet'". American Heritage Center. March 16, 2020. Archived from the original on April 10, 2020. Retrieved April 5, 2020.
  50. Polly 2018, pp. 187.
  51. Dubin, Charles S. (October 26, 1967), Tagged for Murder, Ironside, archived from the original on January 26, 2023, retrieved January 26, 2023
  52. Bishop 2004, p. 23
  53. Thomas 1994, p. 81
  54. McNary, Dave (April 15, 2010). "Bruce Lee's 'Flute' heads to bigscreen – Entertainment News, Film News, Media". Variety. Archived from the original on October 27, 2010. Retrieved February 22, 2011.
  55. Muss, H.P. (October 31, 1969). "Meet Master Of Jeet Kune Do". The Cincinnati Enquirer.
  56. "AFI|Catalog". catalog.afi.com. Archived from the original on June 8, 2019. Retrieved November 15, 2019.
  57. "AFI|Catalog". catalog.afi.com. Archived from the original on June 8, 2019. Retrieved November 15, 2019.
  58. "Prospective Bridal Pair". The Journal Times. Vol. 113. July 27, 1969.
  59. "Wednesday". Chicago Tribune. January 4, 1969.
  60. Heffernan, Harold (June 19, 1969). "Hollywood". The Times-Tribune.
  61. "AFI|Catalog". catalog.afi.com. Archived from the original on June 17, 2019. Retrieved November 19, 2019.
  62. Riste, Tom (November 18, 1971). "Bruce Lee's Acting adds To 'Longstreet'". Arizona Daily Star. Vol. 130.
  63. Riste, Tom (September 18, 1971). "'Longstreet' Shines As New Detective Hit". Arizona Daily Star. Vol. 130.
  64. From The Pierre Berton Show యూట్యూబ్లో December 9, 1971 (comments at 7:10 of part 2)
  65. Lee 1975a
  66. Bleecker, Tom (1996). Unsettled Matters. The Life & Death of Bruce Lee. Gilderoy Publications
  67. "The Truth about the Creation of the Kung Fu TV Series". Martial Journal. May 20, 2019. Archived from the original on January 30, 2021. Retrieved February 20, 2021.
  68. Polly, Matthew E. (2018). Bruce Lee: A Life. Simon & Schuster. pp. 277–280, 321–327, 573–574. ISBN 978-1-5011-8762-9.
  69. "From Grasshopper to Caine" యూట్యూబ్లో
  70. Bruce Lee, Woodstock And Me. scribd.com. Archived from the original on May 1, 2021. Retrieved March 8, 2021.
  71. Weintraub, Fred (2012). Bruce Lee, Woodstock And Me: From The Man Behind A Half-Century of Music, Movies and Martial Arts. Brooktree Canyon Press. pp. chapter 1. ISBN 978-0-9847152-0-6.
  72. From The Pierre Berton Show యూట్యూబ్లో December 9, 1971 (comments near end of part 2 & early in part 3)
  73. Tale of the Dragon (Channel 4), directed by Jess Search
  74. Rob Cohen (1993). Director's Commentary (Dragon: The Bruce Lee Story, DVD). Universal Pictures.
  75. Lee 1989
  76. John Blake (July 7, 2018). "New Bruce Lee bio debunks 'kung fu Jesus' myth". CNN. Archived from the original on December 19, 2019. Retrieved November 19, 2019.
  77. Thomas, B. (1994) Bruce Lee Fighting Spirit. Berkeley: Frog Ltd.
  78. Krizanovich, Karen (2015). Infographic Guide To The Movies. Hachette UK. pp. 18–9. ISBN 978-1-84403-762-9. Archived from the original on June 8, 2020. Retrieved June 8, 2020.
  79. "Bruce Lee's Life". Archived from the original on February 18, 2020. Retrieved March 14, 2020.
  80. Thomas, B. (2003) Bruce Lee Fighting Words. Berkeley: Frog Ltd.
  81. 81.0 81.1 Wilson, Wayne (2001). Bruce Lee. Mitchell Lane Publishers. pp. 30–1. ISBN 978-1-58415-066-4. After its release, Enter the Dragon became Warner Brothers' highest grossing movie of 1973. It has earned well over $400 million
  82. Polly, Matthew (2019). Bruce Lee: A Life. Simon and Schuster. p. 478. ISBN 978-1-5011-8763-6. Archived from the original on June 20, 2020. Retrieved June 8, 2020. Enter the Dragon struck a responsive chord across the globe. Made for a minuscule $850,000, it would gross $90 million worldwide in 1973 and go on to earn an estimated $350 million over the next forty-five years.
  83. "Inflation Calculator". Bureau of Labor Statistics. Archived from the original on May 29, 2008. Retrieved May 30, 2008.
  84. Risen, Clay (February 11, 2022). "Bob Wall, Martial Arts Master Who Sparred With Bruce Lee, Dies at 82". The New York Times. Archived from the original on February 11, 2022. Retrieved April 16, 2022.
  85. Chachowski, Richard (March 21, 2022). "The Best Kung Fu Movies Of All Time Ranked". Looper.com. Static Media. Archived from the original on April 21, 2022. Retrieved April 16, 2022.
  86. "The truth about Bruce Lee's yellow jumpsuit". South China Morning Post. November 27, 2015. Archived from the original on November 28, 2015.
  87. 87.0 87.1 Bruce Lee, the Legend, 1977, Paragon Films, Ltd., 20th Century Fox Home Entertainment
  88. "Shaw Brothers Film Project". Archived from the original on November 3, 2011. Retrieved January 6, 2011.
  89. Andreeva, Nellie (May 21, 2015). "Cinemax Developing Bruce Lee-Inspired Crime Drama 'Warrior' From Justin Lin". Archived from the original on November 15, 2020. Retrieved April 16, 2020.
  90. Andreeva, Nellie (October 11, 2017). "'Warrior': Cinemax Sets Cast & Director For Bruce Lee-Inspired Martial Arts Series". Archived from the original on November 15, 2020. Retrieved April 16, 2020.
  91. Andreeva, Nellie (April 24, 2019). "'Warrior' Renewed For Season 2 By Cinemax". Deadline Hollywood. Archived from the original on November 15, 2020. Retrieved April 24, 2019.
  92. Frater, Patrick (March 23, 2021). "Jason Kothari and John Fusco to Produce Bruce Lee-Scripted 'The Silent Flute'". Variety (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on March 24, 2021. Retrieved March 25, 2021.
  93. 振藩; Mandarin Pinyin: Zhènfán Lee 1989
  94. Lee 1989, p. 20
  95. Lee, Grace (1980). Bruce Lee The Untold Story. United States: CFW Enterprise.
  96. Web UK Online, Bruce Lee Articles In The Shadow Of A Legend - Robert Lee Remembers Bruce Lee by Steve Rubinstein Archived 2009-03-30 at the Wayback Machine
  97. "10 Best Martial Arts Moves in Bruce Lee's Movies, Ranked". Screen Rant. August 27, 2023.
  98. Ma, Sheng-mei (2000). The Deathly Embrace: Orientalism and Asian American Identity. U of Minnesota Press. ISBN 978-0-8166-3711-9.
  99. Asthana, Nirmal Chandra; Nirmal, Anjali (June 29, 2010). Myth Buster: 150 Great Misconceptions Clarified. Sterling Publishers Pvt. ISBN 978-81-207-4210-9.
  100. Scott, Mathew (11 April 2020). "Benny 'The Jet' Urquidez: Bruce Lee, Jackie Chan, and mixing the martial arts". Bloody Elbow. Archived from the original on 11 అక్టోబర్ 2020. Retrieved 21 March 2021. {{cite news}}: Check date values in: |archive-date= (help)
  101. "12 Types of Push-Ups So Brutal Even the Toughest of You Will Fail". May 25, 2015.
  102. Thomas 1994, p. 14
  103. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Haines2011 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  104. Bruce Lee's Commenatries on The Martial Way and Tao of Jeet Kune Do Expanded Edition
  105. Vaughn & Lee 1986, p. 127.
  106. Robles, Pablo; Wong, Dennis; Scott, Mathew (May 21, 2019). "How Bruce Lee and street fighting in Hong Kong helped create MMA". South China Morning Post. Archived from the original on July 9, 2021. Retrieved July 6, 2021.
  107. Elegant, Robert S. (January 21, 1973). "Chinese movies find market as gore, blood fill screen". The Sun Herald. p. 5. Archived from the original on April 15, 2022. Retrieved April 15, 2022 – via NewspaperArchive. Today, Bruce Lee is the hottest property in the Chinese film business and "the fastest fist in the east," as Chow calls him.
    Small boys — and some very big boys — regularly challenge him to fight when they spy him on the streets. Sometimes he accepts, for he is full of suppressed violence engendered by a singularly unhappy childhood.
  108. "The Last Days of Bruce Lee". theringer.com. The Ringer. May 29, 2018. Archived from the original on August 2, 2023. Retrieved August 1, 2023.
  109. "Martial Art Disciplines at Hybrid Martial Arts Academy". Hybrid Martial Art. Archived from the original on April 30, 2008. Retrieved May 30, 2008.
  110. Little 1998, p. 162
  111. Little 1998, p. 163
  112. "Inspirational! Bruce Lee's diet and fitness routine". newindianexpress.com. November 28, 2018. Archived from the original on July 28, 2020. Retrieved July 7, 2020.
  113. Thomas 1994, pp. 97.
  114. Thomas 1994
  115. Campbell 2006, p. 205
  116. Lee 1989, pp. 156–157
  117. "Bruce Lee's residence". South China Morning Post. October 24, 2012. Archived from the original on June 15, 2018.
  118. The MMA World Pays Tribute to Bruce Lee 40 Years After His Death Archived ఆగస్టు 2, 2019 at the Wayback Machine. Bleacher Report. July 20, 2013.
  119. The Greatest Martial Artists of All Time Archived ఆగస్టు 2, 2019 at the Wayback Machine. Liveabout. May 24, 2019.
  120. "Bruce Lee Lives Documentary". Archived from the original on June 29, 2012.
  121. "From Icon to Lifestyle, the Marketing of Bruce Lee". The New York Times. December 11, 2009. Archived from the original on July 18, 2012. Retrieved June 3, 2011.
  122. "Bruce Lee's 70th birth anniversary celebrated". The Hindu. India. November 30, 2010. Archived from the original on October 25, 2012. Retrieved June 3, 2011.
  123. Stein, Joel (June 14, 1999). "The Gladiator Bruce Lee". Time. p. 3. Archived from the original on March 6, 2008. Retrieved August 29, 2010.
  124. Beale, Lewis (March 24, 1988). "Move Over Bruce Lee; Jackie Chan Kicks Out". Chicago Tribune. Archived from the original on June 8, 2020. Retrieved June 8, 2020. A biography of his life has sold more than four million copies
"https://te.wikipedia.org/w/index.php?title=బ్రూస్_లీ&oldid=4544716" నుండి వెలికితీశారు