హాంగ్‌కాంగ్

వికీపీడియా నుండి
(హాంకాంగ్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
香港特別行政區
Hong Kong Special Administrative Region
Flag of Hong Kong Hong Kong యొక్క Emblem
జాతీయగీతం
March of the Volunteers[1]
Hong Kong యొక్క స్థానం
Hong Kong యొక్క స్థానం
రాజధానిNone[2]
అతి పెద్ద district (population) Sha Tin District
అధికార భాషలు English, Chinese[3]
ప్రభుత్వం
 -  Chief Executive Donald Tsang
Establishment
 -  Convention of Chuenpeh January 25 1841 
 -  Treaty of Nanking August 29 1842 
 -  Japanese occupation December 25 1941August 15 1945 
 -  Transfer of sovereignty July 1 1997 
విస్తీర్ణం
 -  మొత్తం 1,104 కి.మీ² (not ranked)
426.4 చ.మై 
 -  జలాలు (%) 4.6
జనాభా
 -  2007 అంచనా 6,921,700 (96th)
 -  2001 జన గణన 6,708,389 
 -  జన సాంద్రత 6,352 /కి.మీ² (3rd)
16,469.6 /చ.మై
జీడీపీ (PPP) 2006 అంచనా
 -  మొత్తం US$263.1 billion (38th)
 -  తలసరి US$38,127 (6th)
జీడీపీ (nominal) 2006 అంచనా
 -  మొత్తం US$189.5 billion (36th)
 -  తలసరి US$27,466 (28th)
జినీ? (2006) 0.533 (high
మా.సూ (హెచ్.డి.ఐ) (2004) Increase 0.927 (high) (22nd)
కరెన్సీ Hong Kong dollar (HKD)
కాలాంశం HKT (UTC+8)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .hk
కాలింగ్ కోడ్ +852

చరిత్ర

[మార్చు]

హాంగ్ కాంగ్ (చైనీస్: 香港) పీపుల్స్ రిపబ్లిక్ చైనా (పి.ఆర్.సి) ప్రత్యేక పాలనా ప్రదేశం (స్పెషల్ అడిమినిస్ట్‍రేటివ్ రీజన్ ఎస్.ఆర్.పి). ఈ నగరం పీర్ల్ నది సౌత్ సీ సముద్రంలో సంగమించే ప్రదేశంలో దక్షిణ చైనా సముద్రతీరంలో ఉంది. ఈ నగరం అతి ఖరీదైన ఆకాశసౌధ సముదాయాలకు, లోతైన ఓడరేవుకు ప్రఖ్యాతి చెందింది. ఈ నగరవైశాల్యం 1'104 చదరపు కిలోమీటర్లు, జనసంఖ్య 7 మిలియన్లు. హాంగ్ కాంగ్ ప్రపంచంలో అత్యధిక జనసంఖ్య కలిగిన నగరం. హాంగ్ కాంగ్ లోని 95% ప్రజలు సంప్రదాయ చైనీయులు, మిగిలిన 5% ప్రజలు ఇతర సంప్రదాయాలకు చెందిన వారు. హాంగ్ కాంగ్ యొక్క "హాన్ చైనీస్" ప్రజలు పరిసర గుయంగ్డోంగ్ రాష్ట్రభూ భాగంలోలో ఉన్న గ్వాంగ్ఝౌ, తైషన్ ప్రదేశం పూర్వీకంగా కలిగిన వారు.

మొదటి ఓపియం యుద్ధానంతరం హాంగ్ కాంగ్ బ్రిటిష్ కాలనీలో ఒక భాగం అయింది. సహజంగా ఉన్న హాంగ్ కాంగ్ ద్వీపాన్ని స్వాధీనపరచుకున్న తరువాత కాలనీ సరిహద్దులను 1860 లో క్రమంగా పెంచుకుంటూ కోలూన్ ద్వీపకల్పం వరకు విస్తరించి 1868 నాటికి సరికొత్త భూభాగం ఏర్పాటు అయింది. పసిఫిక్ యుద్ధానంతరం హాంగ్ కాంగ్‍ను జపాన్ వశమైంది. తరువాత హాంగ్ కాంగ్ బ్రిటిష్ ప్రభుత్వం తిరిగి స్వాధీనపరచుకుని 1997 వరకు తమ ఆధీనంలో ఉంచుకుంది. తరువాత హాంగ్ కాంగ్‍ మీద స్వాధీనత సాధించుకున్న చైనా కాలనీ ప్రభుత్వం సమయంలో ఉన్నప్పటిలా పరిపాలనా నిర్వహణలో అతి తక్కువ జోక్యం మాత్రమే చేసుకుంది. ఆ సమయంలో హాంగ్ కాంగ్‍ మీద ప్రస్తుత సంస్కృతి ప్రభావాన్ని " ఈస్ట్ మీట్స్ వెస్ట్ " అని అభివర్ణించారు. 2009 సంస్కరణలు అమలయ్యే వరకు ఇంగ్లాండ్ విద్యావిధానం అనుసరించడానికి సడలింపు లభించింది.

" ఒక దేశం రెండు విధానాలు " అన్న నియమావళి అనుసరించి ప్రధన చైనా భూభాగం కంటే హాంగ్ కాంగ్‍లో రాజ్యాంగం విభిన్నంగా ఉంటుంది. హాంగ్ కాంగ్‍ స్వతంత్ర న్యాయవ్యవస్థ "కామన్ లా ఫ్రేం వర్క్ " ఆధారంగా పనిచేస్తుంది. హాంగ్ కాంగ్‍ చట్టమూలాలు, రాజ్యాంగ పత్రం తమపాలనా విధానాలలో విదేశీ వ్యవహారాలు, సైన్యం, రక్షణ మినహా మిగిలిన అన్ని రాజ్యాంగ వ్యహారలలో స్వతంత్రమైన విశేష అధికారాలను ఇస్తుంది. వివిధ పార్టీల విధానం, స్వల్ప ప్రదేశంలో ఎన్నికల నిర్వహణ అధికారం చట్టవ్యహారాలలో సగం ఈ స్వతంత్ర పాలనలో భాగాలే. 400 నుండి 1,200 సభ్యుల కమిటీ చేత ఎన్నికొనబడిన ప్రధాన పాలనాధికారి హాంగ్ కాంగ్ పరిపాలనాధికారిగా బాధ్యత వహిస్తాడు. 20 సంవత్సరాల చైనీయుల పాలనలో హాంగ్ కాంగ్ పాలనా విధానం ఇలాగే కొనసాగుతుంది.

చట్టం, పన్నువిధింపు, స్వతంత్ర వాణిజ్యం, ద్రవ్యం వంటి ప్రత్యేకతలతో ప్రధాన పెట్టుబడి దారి ఆర్థిక వ్యవస్థ కలిగి అంతర్జాతీయ ఆర్థిక కేంద్రంగా హాంగ్ కాంగ్ విలసిల్లుతుంది. హాంగ్ కాంగ్ డాలర్ ప్రపంచ సంతలో క్రయవిక్రయాలు జరుగుతున్న ద్రవ్యరూప వ్యాపారంలో ఎనిమిదవ స్థానంలో ఉంది. భూమి కొరత కారణంగా అతి సమీపంగా నివాస భవన నిర్మాణం జరుగుతుంది. ఈ కారణంగా నగరం ఆధునిక నిర్మాణ కౌశలానికి ప్రధాన కేంద్రంగా గుర్తింపు పొందింది. ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం కలిగిన నగరంగా కూడా హాంగ్ కాంగ్ ప్రత్యేక స్థానంలో ఉంది. జనసాంధ్రత కారణంగా ప్రభుత్వ వాహనాలలో రద్దీ పెరిగింది. ప్రయాణపు వ్యయం 90% అధికం అయింది. ఇది ప్రపంచంలో అత్యధికం. వివిధ విషయాలలో హాంగ్ కాంగ్ అంతర్జాతీయంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. ఆర్థిక స్వాతంత్ర్యం, ద్రవ్యం, ద్రవ్య ఆర్థిక పోటీ, జీవన నాణ్యత, అవినీతి అవగాహన, మనవ వనరుల అభివృద్ధి మొదలైనవి. ప్రంపంచ అధ్యయనాలు ప్రపంచంలో అన్ని దేశాలకంటే హాంగ్ కాంగ్ వాసుల జీవన కాలం అధికమని తెలియజేస్తున్నాయి.

నామచరిత్ర

[మార్చు]

ఈ నగరానికి కాంటెనస్ లేక హక్కా "香港" అనే శబ్దం నుండి వచ్చింది. దీనికి అర్ద్గం సువాసన రేవు. ఈ పేరు 1842 కి మముందు అతి చిన్న ద్వీపం ప్రస్తుత అబర్దీన్ హార్బర్ లేక 香港 仔 గాంగ్2, జాయ్ 2 " లిటిల్ హాంగ్ కాంగ్ "ను సూచిస్తుంది. ఈ ద్వీపాలు అబర్దీన్ ద్వీపం , హాంగ్ కాంగ్ దక్షిణంలో ఉంటాయి. ద్వీపాలను బ్రిటిష్ నావికిలు మత్స్యకారుల ణూండి ఒప్పందం మూలంగా మొదటి సారిగా స్వాధీనం చేసుకున్నారు.

ఈ పేరు పరిశోధనలు సువాసన అనేపదం పీర్ల్‍ నది నుండి స్వచ్ఛజలాలు సాగరంలో సంగమిస్తున్న కారణంగా వచ్చిందని భావించబడుతుంది. మరొక కారణంగా విక్టోరియా రేవు ఉత్తర కోలూన్ వద్ద వరుసగా ఉన్న అగరిబత్తి ఎగుమతులు అబర్దీన్ రేవు వద్ద నిలువ ఉంచడంగా భావించబడుతుంది. 1842 లో " ది ట్రీ టీ ఆఫ్ నాన్ కింగ్ " తరువాత హాంగ్ కాంగ్ అనే పేరు అధికార దస్తావేజులలో మొదటిసారిగా నమోదు అయింది. ఈ నమోదు తరువత ఈద్వీపాలు చుట్టూ ఉన్న ప్రాంతం బ్రిటిష్ కాలనీ ఆధీనంలోకి పరిపూర్ణంగా వచ్చింది.

చరిత్ర

[మార్చు]

పురావస్తు పరిశోధనాశాఖ పర్శోధనలు 35,000 నుండి 39,000 ముందు " చెక్ లాప్ కోక్ ఏరియా "లో మానవులు నివసించినట్లు ఆధారాలు ఉన్నట్లు భావిస్తున్నారు. అలాగే శాయి కుంగ్ ద్వీపకల్పం ప్రాంతంలో 6,000 సంవత్సరాల ముందు మానవులు నివసించినట్లు భావిస్తున్నారు. " వాంగ్ తేయీ తుంగ్, త్రీ ఫాతింస్ కోవ్ " అనే రెండు ప్రదేశాలు పురాతన మానవనివాసిత ప్రదేశాలుగా భావిస్తున్నారు. త్రీ ఫాతింస్ కోవ్ నదీలోయ నివాసిత ప్రాంతం. అలాగే తేయీ తుంగ్ లిథిక్ తయారీ ప్రదేశంగా భావిస్తున్నారు. త్రవ్వకాలలో లభించిన నియోలిథిక్ కళాఖండాలు సూచిస్తున్న సాంస్కృతి బైయూకు తరలి వెళ్ళే వరకు నివసించిన చీ జాతి ప్రజలకు ఉత్తర చైనాలో నివసించిన లాంగ్షన్ సంస్కృతితో విభేదిస్తుంది. షాంగ్ సంరాజ్యానికి చెందిన ఎనిమిది శిలాశాసనాలు సమీప ద్వీపాలలో లభించాయి.

క్రీ.పూ 214 చైనా మొదటి చక్రవర్తి " క్విన్ షి హంగ్ " జియ్జొజీలో బైయూ గిరిజనులను జయించి మొదటిసారిగా ఈ ప్రదేశాన్ని తన సామ్రాజ్యంతో విలీనం చేసాడు. ఆధునిక హాంగ్ కాంగ్ నాంహీ కమాండ్రీలోనూ రాజధాని పాన్యూ లోనూ ఉంటూ వచ్చింది. ఈ ప్రాంతం క్రీ.పూ 204 జనరల్ ఝో తూ స్థాపించ బడి పతనమైన నాన్యూ సామ్రాజ్యంలో భాగంగా ఉంటూ వచ్చింది. క్రీ.పూ 111 లో నన్యూ సామ్రాజ్యాన్ని యూ చక్రవర్తి జయించాడు. పురావస్తు పరిశీలకుల ఆధారాలు ఈ సయంలో ఇక్కడ నివాసితుల సంఖ్య అభివృద్ధి చెంది సమృద్ధిగా ఉప్పు ఉత్పత్తి ఆరంభం అయింది. కోలూం ద్వీపకల్పంలో ఉన్న లీ చాంగ్ యుక్ సమాధి హాన్ సామ్రాజ్య కాలంలో నిర్మించబడింది.

టాంగ్ సామ్రాజ్యం కాలంలో " గాంగ్ డాంగ్బ్" ప్రదేశం వాణిజ్యకేంద్రంగా విలసిల్లింది. 736 లో టాంగ్ సామ్రాజ్య చక్రవర్తి క్సుయాన్ జాంగ్ ఈ ప్రాంతంలో తీరప్రాంత రక్షణార్ధం త్యూం మున్ అనే సైనిక పట్టాణాన్ని స్థాపించాడు. 1075లో నార్తన్ సాంగ్ సామ్రాజ్యం ఆధ్వర్యంలో ఈ కొత్తప్రదేశ సమీపంలో మొదటి విలేజ్ స్కూల్, లీయింగ్ కాలేజ్ స్థాపన జరిగింది. 1276 మంగోల్ దండయాత్ర సమయంలో ది సదరన్ సాంగ్ సామ్రాజ్య న్యాయస్థానం ఫ్యూజియన్ కు మార్చబడింది. తరువాత లాంట్యూ తరువాత సంగ్ వాంగ్ టాయ్ (ప్రస్తుతం ఇది కూలూన్ నగరం) మార్చబడింది. యామెన్ యుద్ధంలో ఓడిపోయి అధికారాన్ని పోగొట్టుకున్న బాల చక్రవర్తి బింగ్ ఆఫ్ సాంగ్స్ ఆత్మహత్య చేసుకోవాలన్న నిర్ణయం తీసుకున్నాడు. చక్రవర్తి అనుచరుడైన హ్యూ వాంగ్ ఇప్పటికీ హాంగ్ కాంగ్ వాసుల చేత ఆరాధించబడుతున్నాడు.

1513 లో పోర్చుగీసు నావికుడు ఐరోపా యాత్రికుడు జార్జ్ ఆల్వర్స్ కొత్త సరికొత్త భూభాపు వెతుకులాటలో ఒక భాగంగా ఇక్కడకు వచ్చినట్లు మొట్టమొదటి రికార్డులు సూచిస్తున్నాయి. ఇక్కడ వ్యాపార ఒప్పందాలు ముగిసిన తరువాత పోర్చుగీసు వ్యాపారులు దక్షిణ చైనాలో వ్యాపారం చేయడం మొదలు పెట్టారు. అదే సమయం వారు " తూయన్ మూన్ "కు అధిక సంఖ్యలో ప్రవేశించి కోటల నిర్మాణం చేసారు. చైనా , పోర్చుగీస్ మధ్య సైనిక పోరాటాలు కొనసాగాయి. ఫలితంగా పోర్చుగీవారిని దేశబహిస్కారం చేయడం మొదలైంది. 16వ శతాబ్దం మధ్యకాలంలో మేరీటైం ఆక్టొవిటీస్ మీద హైజిన్ ఆర్డర్ తో నిషేధం విధించి విదేశీయులతో సంబంధాలను అడ్డగించారు. ఈ చట్టం దేశాంంతర్గత చర్యల మీద కీడా నిస్గేధం విధించింది. 1661-69 మధ్య కాంగ్సి చక్రవర్తి విధించిన క్లియరెంస్ ఆర్డర్ వలన ఈ ప్రాంత వాసులు సమస్యల ఫాలయ్యరు. ఈ చర్య గాంగ్డాంగ్ తీరం ఖాళీ చేయాలని వత్తిడిచేసింది. క్సిన్ నుండి 16,000 మంది దేశం అంతర్భాగం లోకి తరలి వెళ్ళారు. వెళ్ళకుండా అక్కడే ఉండి పోయారు. ఈ శాసనం 1669 లో రద్దు చేయబడింది. ఈ నిషేధం సమయంలో ప్రస్తుత హాంగ్ కాంగ్ ప్రదేశం బంజరు భూమిగా ఉండి పోయింది. 1685లో కాంగ్సి మొదటి సారిగా చక్రవర్తి అయిన తరువాత విదేశీయులతో పరిమితికి లోబడి వ్యాపారం చేయడానికి అనుమతి ఇచ్చాడు. వ్యాపారాల కారణంగా "కాంటన్" ప్రదేశం రూపిదిద్దుకుంది.

ఆయన వ్యాపారుల మీద కఠిన షరతులు విధించాడు. అనుమతించిన ప్రదేశంలోనే నివసించాలని, వ్యాపార కాలంలోనే నివసించాలని, ఆయుధాలు అమ్మకూడదని, వెండి వస్తువులు మాత్రమే అమ్మాలని నిషేధాలు విధించబడ్డాయి. 1699 నాటికి ఈస్టిండియా కంపనీ మొదటిసారిగా ఈ ప్రదేశం లోకి ప్రవేశించింది. తరువాత ఈ ప్రాంతంలో బ్రిటిష్ వ్యాపారులతో వ్యాపారం త్వరితగతిలో అభివృద్ధి చెందింది. 1771లో ఈస్టిండియా కంపనీ కాంటన్ లో వాణిజ్య స్థూపాన్ని స్థాపించింది. 1553 యురేపియన్ల ప్రవేశం తరువాత చైనీయులు ఒక సంవత్సరానికి 2, 000 చెస్ట్స్ ఓపియం ఉపయోగిస్తుండగా 1711 నాటికి కాంటన్లో మాత్రమే 1,000 చెస్ట్ ల వాడకానికి చేరింది.

బ్రిటిష్ కాలనీ శకం

[మార్చు]

1889 లో క్వింగ్ సామ్రాజ్య ఆధిపత్యం ఓపియం దిగుమతులను నిరాకరించిన కారణంగా చైనా, బ్రిటన్ మధ్య ఓపియం యుద్ధం సంభవించింది. 1841 జనవరి 20 తేదీలో హాంగ్ కాంగ్ బ్రిటిష్ సైన్యాల చేత ఆక్రమించబడింది. తరువాత కేఫ్టన్ ఎలియాట్, గవర్నర్ క్విషాన్ కలయిలక వలన జరిగిన " యుద్ధ నిలుపుదల (సీస్ సైర్) ఒప్పందం ఫలితంగా బ్రిటన్ మొదట హాంగ్ కాంగ్ మీద ఆధిపత్యం వదులుకుంది. అయినప్పటికీ ఇరు వైపులా రెండు ప్రభుత్వ ఉన్నతోద్యుగుల మధ్య సాగిన వివాదాల కారణంగా ఈ ఒప్పందం అమలు కాలేదు. చివరకు ఆగస్ట్ 29 1842న " నాన్ కింగ్" ఒప్పందం ఆధారంగా ఈ ద్వీపం బ్రిటన్ కు శాశ్వతంగా ఒప్పగించబడింది. తరువాత సంవత్సరం వికోరియా సిటీ స్థాపించబడిన తరువాత బ్రిటన్ క్రౌన్ కాలనీని నిర్మించింది. 1841 లో బ్రిటిష్ పాలనలో హాంగ్ కాంగ్ ద్వీపం జనసంఖ్య 7,450 నుండి బాగా అభివృద్ధి చెందింది. వీరిలో అత్యధికులు చైనీయ మత్స్యకారులు. 1870 నాటికి హాంగ్ కాంగ్ జనసంఖ్య 115,000 మంది కంటే అధిక చైనీయులు, 8,754 మంది యురోపియన్లు స్థాయికి చేరింది.

1860లో చైనా రెండవ ఓపియం యుద్ధంలో ఓటమిని చవిచూసింది. పీకింగ్ మీటింగ్ సమయంలో కోలూన్ ద్వీపకల్పం, స్టోన్ కట్టర్స్ ద్వీపం శాశ్వతంగా బ్రిటన్ కొరకు వదులుకొనబడింది. 1894 లో బ్యూబోనిక్ ప్లేగ్ అతి ఘోరంగా వ్యాపించిన కారణంగా హాంగ్ కాంగ్ లో 50,000-1,00,000 వరకు మరణాలు సంభవించాయి.

1898లో హాంగ్ కాంగ్ భూభాగ విస్తరణ సమావేశంలో బ్రిటన్ లాంత్యూ ద్వీపం, దానిని ఆనుకుని ఉన్న ద్వీపాల 99 మీద ఆధిపత్యం సాధించింది. ఈ ఒప్పందం కొత్త భూములుగా అభివర్ణించబడింది. ప్రస్తుతం హాంగ్ కాంగ్ భూభాగం మార్పులకు లోనికాకుండా ఉండిపోయింది.

20వ శతాబ్దపు సగం వరకు హాంకాంగ్ స్వతంత్ర ఓడరేవుగా ఉంటూ బ్రిటన్ సామ్రాజ్యానికి ప్రవేశంగా ఉంటూ వచ్చింది. ప్రాంతీయ చైనీయులలో సంపన్న వర్గాలు మాత్రమే సత్సంబంధాలు కలిగిఉన్న సమయంలో బ్రిటన్ విక్టోరియా శిఖరం వద్ద వారి తరహా విద్యావిధానం పరిచయం చేసింది.

జపాన్ దండయాత్ర

[మార్చు]

1941 డిసెంబరు 8 తేదీన జపాన్ హాంకాం మీద దండెత్తింది. " ది బాటిల్ ఆఫ్ హాంకాంగ్ " బ్రిటన్, కెనడా మద్దతుదారులు డిసెంబరు 25న హాంకాంగ్ ను జపానుకు స్వాధీనం చేయడంతో ముగింపుకు వచ్చింది. జపాను ఆక్రమణ కాలంలో హాంగ్ కాంగ్ ప్రజలు ఆహారపు కొరత, రేషన్, ధనాభవం వంటి సమస్యలతో బాధలు అనుభవించారు. సైనిక నిర్వహణ కొరకు అధిక ధనం ఖర్చు చేయవలసిన వత్తిడికి గురైయ్యారు. ఈ సమయం అంతా ఆహారం కొరత కారణంగా నిరుద్యోగులను ప్రధాన భూమికి తరలించబడ్డారు. 1941లో 1.6 మిలియన్లు ఉన్న హాంగ్ కాంగ్ జనాభా 1945 లో హాంగ్ కాంగ్ ను యునైటెడ్ కింగ్డం తిరిగి తమ స్వాధీనంలోకి తీసుకునే సమయానికి 0.6 మిలియన్లకు చేరుకుంది.

ప్రచ్చన్న యుద్ధం

[మార్చు]

చైనా అంతర్యుద్ధం ప్రారంభం అయిన తరువాత చైనా నుండి శరణార్ధులు అలలా హాంగ్ కాంగ్‍లో ప్రవేశించిన తరువాత హాంగ్ కాంగ్ జనసంఖ్య కోలుకుంది. 1949లో పి ఆర్ సి ప్రకటించిన తరువాత దేశంలో కమ్యూనిస్టుల కారణంగా హింస చెలరేగవచ్చన్న భీతి కారణంగా ప్రజలు హాంగ్ కాంగ్‍కు పారిపోయారు. సజ్ంఘై, గంగ్యూలో ఉన్న పలు సంస్థలను హాంగ్ కాంగుకు మార్చుకున్నారు. 1950లో హాంగ్ కాంగ్ వేగంగా దూసుకఓతున్న వాణిజ్యం వస్త్రఎగుమతులు, ఇతర పరిశ్రమల విస్తరణ వైపు మరలించబడింది. జనసంఖ్య వృద్ధి అయిన కారణంగా శ్రామికుల జీతభత్యాలు అందుబాటులో ఉన్నాయి. జీవప్రమాణాలు పెరిగాయి. 1953లో " షేక్ కిప్ మెయి" నిర్మాణం తరువాత హాంగ్ కాంగ్ మురుకివాడల తొలగింపు, ప్రభుత్వ నివాస భవనాల ప్రారంభం మొదలైంది. ఈ కార్యక్రమం వలస ప్రజల నివాస గృహాలకు అవసరం తీర్చింది. హాంగ్ కాంగ్ వ్యాపారం షెజెన్, నార్త్ హాంగ్ కాంగ్ లలో అభివృద్ధి చెందింది. హాంగ్‍కాంగ్ చైనలో విదేశీపెట్టుబడి దారులకు ప్రధాన వనరుగా మారింది. హాంగ్ కాంగ్ పి ఆర్ శసి ఆర్థిక భ్జుభాగంగా మారింది. 1980 ఆరంభంలో దక్షిణ చైనాలో పరిశ్రమల అభివృద్ధి తరువాత హాంగ్ కాంగ్ పరిశ్రమలో పోటీ తగ్గుముఖం పట్టింది. సేరంగంలో వచ్చిన మార్పుల పరిశ్రమ్లు ఉద్యోగులను పని నుండి తొలగించడం మొదలైంది.

బ్రిటిష్ కాలనీ శకం అంతా హాంగ్ కాంగ్ ప్రారిశ్రామిక నగరంగా అభివృద్ధి చేయబడుతూనే ఉంది. అలాగే ఆర్థిక, ఆరోగ్య సంరక్షణ వంటి విషయాలలో కూడా అభివృద్ధి చెందింది. క్వీన్‍ఎలిజబెత్ హాస్పిటల్ హాంగ్ కాంగ్, ది క్వీన్ మేరీ హాస్పిటల్ హాంగ్ కాంగ్, ది ప్రింసెస్ మార్గరేట్ హాస్పిటల్ హాంగ్ కాంగ్ ప్రింస్ ఆఫ్ వేల్స్ హాస్పిటల్ హాంగ్ కాంగ్ వంటి నాణ్యమైన వైద్యసేవలు అందించగలిగిన ఆరోగ్యసంరక్షణా వసతులను హాంగ్ కాంగ్ వాసులకు కల్పించారు. 1983లో యునైటెడ్ కింగ్డం హాంగ్ కాంగ్‍ను బ్రిటిష్ సామ్రాజ్యం నుండి విడివడి ఆధారిత ప్రదేశంగా తీర్మానించిన తరువాత చైనా ప్రభుత్వం, యునైటెడ్ కింగ్డం ఇరురాజ్యాల నడుమ హాంగ్ కాంగ్ స్వతంత్ర ప్రతిపత్తి గురించిన చర్చలు జరిపాయి. ఫలితంగా తరువాతి రెండు దశాబ్ధాల కాలం వరకు హాంగ్ కాంగ్ స్వతరంత్రప్రతిపత్తి కలింగించాలని సూచించబడింది. 1984లో సినో-బ్రిటిష్ సంయుక్త తీర్మానం ద్వారా హాంగ్ కాంగ్‍ను 1997లో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాకు అప్పగించాలని ఒప్పందానికి వచ్చాయి. ఈ ఒప్పందం హాంగ్ కాంగ్‍ను చైనా ఆధీనంలోకి తీసుకున్న తరువాత 50 సంవత్సరాల కాలం వరకు ప్రత్యేక పరిపాలనా భూభాగంగా పరిగణించాలని, బ్రిటిష్ ఆధారిత మూల న్యాయవ్యవస్థ పరిరక్షంపబడాలని నిర్ధేశించింది. ఈ ఒప్పందం ఇరుదేశాలు 1990లో ఆమోదించబడింది.

1997 తరువాత

[మార్చు]

1997 జూలై 1న యునైటెడ్ కింగ్డం హంగ్ కాంగ్ మీద అధికారాన్ని రిపబ్లిక్ చైనకు అప్పగించింది. దీనితో హాంగ్ కాంగ్‍లో 156 సంవత్సరాల బ్రిటిష్ కాలనీ పాలన ముగింపుకు వచ్చింది. హాంగ్ కాంగ్ చైనా మొదటి ప్రత్యేక అధికారాలు కలిగిన భూ భాగంగా మారింది. తుంగ్-చీ-హ్వా హాంగ్ కాంగ్ ప్రధాన పాలకుడుగా అధికారస్వీకారం చేసాడు. అదే సంవత్సరం ఆర్థిక పరమైన సమస్యలను ఎదుర్కొన్నది. ఉర్థ్వ శ్వాసనాళ ప్రాంతములో వైరస్ వలన కలుగు విషపడిశము, ఆశియన్ ఆర్థిక మాంద్యం రెండు సమస్యలు హాంగ్ కాంగ్ ఆత్ధిక వ్యవస్థ మీద దెబ్బతీసాయి. 2003లో హాంగ్ కాంగ్ సార్స్ అని పిలువబడిన తీవ్రమైన శ్వాసకోశ వ్యాధి వలన పీడించబడింది. " ది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ " హాంగ్ కాంగ్ లో ఈ వ్యాధితో 1,755 మంది బాధించబడ్డారని 299 మంది మరణించారని తమ నివేదికలో తెలిపింది. ఈ అంటువ్యాధి ఫలితంగా 380 హాంగ్ కాంగ్ ఒపందాలు రద్దు రూపంలో డాలర్ల (48.9 అమెరికన్ డాలర్లు) ధనాన్ని నష్టపడింది.

2005 మార్చి 10 ఆరోగ్యసమస్యల కారణంగా తూంగ్ ప్రధాన నిర్వహణాధికారిగా బాధ్యత స్వీకరించాడు. 2005 లో అదే సమయంలో డోనాల్డ్ త్సంగ్ నిర్వహణా ప్రధాన కాత్యదర్శిగా ఏకగ్ర్జివంగా ఎన్నిక చేయబడి పదవీ బాధ్యతవహించాడు. 2007లో త్సాంగ్ నిర్వహణాఆధికారి ఎన్నికలో విజయం సాధించి తన రెండవ విడత పదవీ బాధ్యత స్వీకరించాడు.

2009 లో " ఐదవ ఆషియన్ క్రీడలు "కు ఆతిధ్యం వహిస్తాయి. ఆ క్రీడలలో హాంగ్ కాంగ్ జాతీయ బృందాలు పాలుపంచుకున్నాయి. ఈ ప్రదేశంలో నిర్వహించబడిన మొదటి, బృహత్తరమైన అంతర్జాతీయ విభిన్న క్రీడలు ఇవే. ప్రస్తుతం హాంగ్ కాంగ్ అంతర్జాతీయ ఆర్థిక కేంద్రంగా ఉన్నప్పటికీ దాని ప్రధానభూభాగమైన చైనా ఆర్థికబలం, రిపబ్లిక్ చైనతో కల సంబంధాలు ప్రజాపాలన వైపు జరుగుతున్న సంస్కరణలు అంతర్జాతీయ అంగీకారం వంటివి హాంగ్ కాంగ్ భష్యత్తుకు ప్రశ్నార్ధకం అయింది.

పాలన

[మార్చు]

అత్యధిక కాలం బ్రిటిష్ సామ్రాజ్యపు వలసరాజ్యంగా ఉన్న కారణంగా అది రిపబ్లిక్ చైనాకు తిరిగి ఇచ్చివేయనప్పటికీ ప్రత్యేక రాష్ట్రంగా-నగరంగా, యూనియన్ ప్రాంతంగా ఇప్పటికీ విశేషాధికారాన్ని అనుభవిస్తున్నది. సినో-బ్రిటిష్ ఒప్పందం అనుసరించి ఒక దేశం రెండు విధానాలు అన్న నినాదం అనుసరిస్తూ ప్రత్యేక రాజ్యనిర్వహణా ప్రదేశంగా హాంగ్ కాంగ్ విదేశీవ్యవహారాలు, రక్షణ మినహా అన్ని రంగాలలో ప్రత్యేకనిర్వహణా విధానాలను అనుసరిస్తుంది. సంయుక్త ప్రకటన హాంగ్ కాంగ్ 1997 చైనా రిపబ్లిక్‍కు స్వాఫ్హీనం చేసిన తరువాత కనీసం 50 సంవత్సరాల కాలంహాంగ్ కాంగ్ పెట్టుబడిదారీ వ్యవస్థను, ప్రజాస్వాతంత్ర్య సంరక్షణ కలిగిస్తుంది. ఈ హామీ ప్రత్యేక హక్కులు, స్వాతంత్ర్యం ఈ ప్రాంత ప్రజలు అనుభవించేలా చేస్తుంది. హాంగ్ కాంగ్ న్యాయవ్యవస్థ ఇంగ్లాండ్ న్యాయవ్యస్థ ఆధారంగా తయారుచేయబడింది.

ఎగ్జిక్యూటివ్ కౌంసిల్, ది సివిల్ సర్వీసు, ది లెజిస్లేటివ్ కౌంసిల్, జ్యుడీషియరీ కౌంసిల్ అనేవి హాంగ్ కాంగ్ పాలనా మూలస్తంభాలు. ఎగ్జిక్యూటివ్ కౌంసిల్ అధ్యక్షుడు ఎలెక్షన్ కమిటీ చేత ఎన్నుకొనబడి కేంద్ర ప్రభుత్వం చేత నియమించబడతాడు. మేధాసంపత్తి అనుసరించి నియమించబడే సివిల్ నిర్వహణాధికారి రాజకీయాలకు అతీతంగా రాజ్యాంగ నిర్వహణా విధానాల రూపకల్పన, ప్రజలకు ప్రభుత్వపరమైన సేవలు అందుబాటులోకి తీసుకురావడం వంటి బాధ్యతలు నిర్వహిస్తారు. శాసన సభాసభ్యులైన 60 మంది సభ్యులు హాంగ్ కాంగ్ శాశ్వత పౌర సభ్యత్వం కలిగిన ఐదు భూభాగాల ప్రజలచేత నేరుగా ఎన్నిక చేయబడిన వారు సగం, వ్యాపార ప్రముఖులు, క్రియాత్మక రంగాలు నిర్ధేశించబడిన వారితో ఎన్నిక చేబడిన వారై ఉంటారు. మొత్తం శాససన సభ్యులు స్పీకర్ బాధ్యతను వహించే శాసనసభాధ్యక్షుని ఆధ్వర్యంలో పని చేస్తారు. న్యాయాధికారులను ఇండిపెండెంట్ కమిషన్ నియమిస్తుంది.

అధికార మార్పిడి సమయంలో ప్రధానంగా చర్చించబడి వాగ్ధానం చేయబడిన బేసిక్ లా అమలు సధారణ ప్రజామోదం పొందిది. 2002 లో నిషేధాలు, రాజద్రోహం, చైనా ప్రభుత్య వ్యతిరేకత కలిగిన కార్యక్రమాలు వంటి విషయాలతో " బేసిక్ లా 23 "లో మార్పులు తీసుకురావాలన్న ప్రభుత్వ ప్రతిపాదన హాంగ్ కాంగ్ ప్రజలు భీతితో వ్యతిరేకించడంతో వీగిపోయింది.

2004 లో రాజకీయ సంస్కరణలు చెయ్యడానికి " డిస్ట్రిక్ కౌంసిల్ మోడెల్" తీసుకురావడానికి " పాన్- కౌంసిల్" అమోదం పొందడంలో హాంగ్ కాంగ్ ప్రభుత్వం విఫలమైంది. 2012లో చీఫ్ ఎగ్జిక్యూటివ్ నియామకం, దిలెగ్‍కో రూపొందిండం వంటి విధానాల గురించి పునఃపరిశీలనకు ప్రతిపాదన చేసింది. ఈ ప్రతిపాదనలో ఎన్నికల సంఘం విస్తరణ, హాంగ్ కాంగ్ ఎలెక్టోరల్ కాలేజ్, 800 సభ్యులను 1200 వరకు విస్తరించడం, శాసనసభ స్థానాలను 60 నుండి 70 వరకు అధికం చెయ్యడం వంటి విషయాలు ప్రస్తావించబడ్డాయి. కొత్త పది శాసనసభాస్థానాలలో 5 నియోజకవర్గాలు భౌగోళిక నేపథ్యంలోనూ మిగిలిన 5 కార్యాచరణ నియోజకవర్గాలుగా డిస్ట్రిక్ కౌంసిల్ సభ్యుల చేత ఎన్నిక చెయ్యబడిన వారు ఉంటారు. ఈ ప్రతిపాదన " పాన్- కౌంసిల్" చేత తిరిగి తిరస్కరించబడింది. అయినప్పటికీ డెమొక్రటిక్ పార్టీకి చెందిన రిపబ్లిక్ చైనా ప్రభుత్వం కౌంటర్- ప్రపోజల్ ఆమోదించబడింది. ప్రత్యేకంగా పాన్-డెమొక్రసీ కేంప్ కార్యాచరణ సభ్యుల నియామక విషయంలో అభిప్రాయబేధాల వాలన చీలిపోయింది. ది డెమొక్రటిక్ పార్టీ ప్రభుత్వం పక్షంవహించిన కారణంతో ప్రతిపాదన 46-12 ఓట్లతేడాతో ఆమోదించబడింది.

చట్టం , న్యాయవ్యవస్థ

[మార్చు]

హాంగ్ కాంగ్ న్యాయవ్యవస్థ పూర్తిగా రిపబ్లిక్ న్యావ్యవస్థకు లోబడక స్వతంత్రంగా వ్యవహరించే సాధికారం కలిగి ఉంది. రిపబ్లిక్ చైనా సివిల్ లా కంటే విభిన్నమైన హాంగ్ కాంగ్ న్యావ్యవస్థ బ్రిటిష్ న్యాయసూత్రాల ఆధారితంగా రూపొందించబడిన " ఇంగ్లీష్ కామన్ లా సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉంది. ఇతర న్యాయవ్యవస్థలు ప్రతిపాదించిన కేసుల చర్చలు హాంగ్ కాంగ్ కోర్టులలో కొనసాగిస్తారు. ఇతర కామన్ లా న్యాయమూర్తులు తాత్కాలికంగా అనధికారికంగా న్యాయస్థానంలో కూర్చుని కేసును విచారణను గమనించవచ్చు.

కుటుంబ న్యాయస్థానం చేరిన డిస్ట్రిక్ కోర్టులలో విచారించిన తరువాత వారి సిఫారసు మీద ఆధారపడి హైకోర్ట్ కేసు విచారణ జరుపుతుంది. ట్రిబ్యూనల్, మెజిస్ట్రేట్ కోర్ట్, ది జ్యువెన్లీ కోర్ట్, ది కార్నర్స్ కోర్ట్, ది లేబర్ ట్రిబ్యూనల్, ది స్మాల్ క్లెయింస్ ట్రిబ్యూనల్, అబ్సెంస్ ఆర్టికల్ ట్రిబ్యూనల్ వంటి ఇతర న్యాయస్థానాలు న్యాయ సేవలు అందిస్తునాయి. చివరి తీర్పుకు వచ్చే కేసులను విచారించడానికి హాంగ్ కాంగ్ ప్రభుత్వం చీఫ్ ఎగ్జిక్యూటివ్ నియామకం చేస్తుంది.

న్యాయవ్యస్థ బాధ్యతలలో ప్రభుత్వ వివాద పరిష్కారాలు కూడా ఒక భాగమే. న్యాయవ్యవస్థ బాధ్యతలలో ముఖ్యమైనవి చట్టపరమైన సలహాలు అందించడం, నేర విచారణ, సాంఘిక ప్రాతినిధ్యం, చట్టం, విధానాల రూపకల్పన, సంస్కరణ చేయడం వంటివి. అలాగే విభిన్నమైన న్యాయవిధానాలు కలిగిన అంతర్జాత్జియ న్యాయవిధానాలకు సహకరించడం కూడా వారి బాధ్యతలలో ఒకటి. ప్రభుత్వ న్యాయశాఖా న్యాయవాదులకు క్రిమినల్ కేసుల విచారణ చేయడమే కాక ప్రభుత్వా వ్యతిరేక సివిల్ కేసులను నిర్వహణా పరమైన కేసులను కూడా వివాదించవలసిన బాధ్యత ఉంది. ప్రజాశక్తి కరమైన కేసులను ప్రభుత్వం న్యాయవిచారణ బాధ్యతను స్వీకరిస్తుంది. క్రిమినల్ కేసుల విచారణలో ప్రభుత్వ జోక్యం ఆటంకపడకుండా న్యాయవ్యవస్థను బేసిక్ లా విధానం రక్షిస్థుంది.

మానవ హక్కులు

[మార్చు]

హాంగ్ కాంగ్ చట్టమూలాలు ఇంగ్లీష్ చట్టం ఆధారంగా రూపొందించబడింది కనుక హాంగ్ కాంగ్ ప్రజలు ఉన్నత ప్రమాణాలు కలిగిన పౌరహక్కులను, స్వేచ్ఛను అనుభవిస్తారు. ప్రధాన విషయాలు స్థిరంగా ఉన్నప్పటికీ హాంగ్ కాంగ్ ప్రభుత్వం మానవహక్కులను పరిరక్షిస్తుంది. హాంగ్ కాంగ్ లో బహిరంగ సభలు స్వతంత్రంగా జరపుకోవడానికి ప్రభుత్వం నిషేధం విధించడం మీద ప్రజలలో కొంత ఆందోళనలు ఉన్నాయి. పోలీస్ భావప్రకటన చేసే వారి మీద ప్రయోగించే వ్యూహాలు, సంధించే ప్రశ్నలు వంటి విషయాలు ప్రజల తరచుగా విమర్శకు లోను ఔతుంటాయి. వ్యక్తిగత విషయాల గోప్యత హాక్కుల విషయయంలో కూడా అందోళన వ్యక్తమౌతుంది. శ్రామిక హక్కుల రక్షణలో ఉన్న లోపాలు ప్రజలలో విమర్శనకు లోనౌతునాయి.

రక్షణవ్యవస్థ

[మార్చు]

హాంగ్ కాంగ్ బ్రిటిష్ కాలనీగా ఉండే సమయంలో తరువాత యూనియన్ ప్రదేశం అయిన తరువాత బ్రిటిష్ సైన్యం అధికారిక " కమాండర్ ఆఫ్ చీఫ్ " బాధ్యత వహిస్తున్న హాంగ్ కాంగ్ గవర్నర్ ఆదేశాలమేరకు రక్షణ బాధ్యత వహిస్తున్నారు. బ్రిటిష్ సైన్యాలలో అధికమైన వారు బ్రిటన్ నుండి వచ్చిన వారైనా వారు ప్రాంతీయంగా రెగ్యులర్ బ్రిటిష్ ఫోర్సెస్ మెంబర్స్ ఇన్ స్కార్వార్డెన్ ఆఫ్ ది రాయల్ నేవీలో తమ అర్హతలను నమోదుచేసుకుంటారు. ది హాంగ్ కాంగ్ రెజిమెంట్ సైనిక దళం హాంగ్ కాంగ్ ప్రభుత్వంలో ఒక భాగం. ఔఇనప్పటికీ వారు సైనిక శిక్షణ మాత్రం బ్రిటిష్ భూమిలో బ్రిటిష్ సైనికాధికారిలవద్ద నిర్వహించబడుతుంది. ఈ బ్రిటిష్ సైనికులు వారి రాయల్ హాంగ్ కాంగ్ రెజిమెంట్ తరఫున సేవలు అందిస్తుంటారు.

హాంగ్ కాంగ్ ప్రత్యేక రక్షణదళం బ్రిటిష్ సైనిక దళంలో భాగం అయిన " ది హెచ్ కే ఎం సి 1,200 మంది మనుషులతో శిఖరాగ్రానికి చేరుకుంది. ది హెచ్ కే ఎం సి సైనికులు హాంగ్ కాంగ్‍లో సైనిక శిక్షణ తీసుకుని తరువతా అప్‍గ్రేడింగ్, ట్రేడ్ కోర్సులు చదవడానికి యునైటెడ్ కింగ్‍డంలో పూర్తి చేస్తారు. ది హెచ్ కే ఎం సిలో నియమించబడిన సైనికులు ఇతర హెచ్ కే ఎం సికి చెందని యూనిట్స్ కలిసి పనిచేస్తుంటారు. యూనిట్స్ ఉద్యోగులు 29వ స్క్వార్డ్, గన్ క్లబ్ హిల్ సరిహద్దులలో ఉన్న రాయల్ కార్ప్స్ ఆఫ్ ట్రాంస్పోర్ట్ ల నుండి ఎంచుకుని అధికారులుగా, డ్రైవర్లుగా నియమించబడతారు. ఈ యూనిట్స్ లో స్టోన్ కట్టర్ ద్వీపంలో ఉన్న మేరీ టైం 415 కి, సెక్ కాంగ్ లోఉన్న ది డిఫెంస్ అనిమల్ సపోర్ట్ యూనిట్ ఆఫ్ ది రాయల్ ఆర్మీ వెటర్నిటీ క్రాప్స్ నుండి డాగ్ హాండిలర్స్, వటివి ఉంటాయి. రాయల్ ఆర్మీ పే క్రాప్స్ నుండి అధికారులు, గుమస్తాలను నియమిస్తారు. బోధకులను ది రాయల్ ఆర్మీ ఎజ్యుకేషనల్ క్రాప్స్ నుండి నియమిస్తారు. ది రాయల్ సిగ్నల్స్ ఆఫ్ ది క్వీన్ గుర్ఖా సిగ్నల్స్ నుండి సాంకేతిక నిపుణులను నియమిస్తారు. ది రాయల్ ఎలెక్ట్రానిక్ అండ్ మెకానికల్ ఇంజనీర్లను ఇంజనీర్లు, ఆర్మౌరీర్లను నియమిస్తారు. ఆర్మీ ఫిజికల్ ట్రైనింగ్ కార్ప్స్ నుండి ది హెచ్ కే ఎం సి లను నియమిస్తారు. బ్రిటిష్ మిలటరీ హాస్పిటల్ లోని రాయల్ ఆర్మీ మెడికల్ నుండి వైద్యులను నియమిస్తారు. రాయల్ మిలటరీ పోలీస్ నుండి మిలటరీ పోలీసులను నియమిస్తారు. సెక్ కాంగ్ ఎయిర్ ఫీల్డులో ఉన్న 660 స్క్వార్డన్ ఆర్మీ ఎయిర్ కార్ప్స్ నుండి హెలికాఫ్టర్ దళం నియమించబడతారు. దిరాయల్ అర్మీ కేటరింగ్ కార్ప్స్ నుండి వంటవారు నియమించబడతారు. ది రాయల్ ఆర్మీ ఆర్డినెంస్ కార్ప్స్ నుండి ఆయుధాలు, సప్లై స్టోర్‍కీపర్లు నియమించబడతారు.ఇంకా అస్బర్న్ సరిహద్దులలో ప్రధానకార్యాకయం ఉన్న డ్రాగన్ కంపెనీ ఆఫ్ జనరల్ సర్వీసెస్ కార్ప్స్ నుండి వ్యాఖ్యాతలు, గుమస్తాలు, రెజిమెంటల్ పోలీస్, లైట్- ఇంఫాంటరీ పర్సనల్స్ ను నియమించబడతారు. హెచ్ కే ఎం సి చైనా సైనికులకు బ్రిటిష్ రెగ్యులర్ అర్మీ పూర్తి కాల ఉద్యోగావకాశాలను, క్వీంస్ కమీషండ్ ఆఫీసర్ ర్యాంక్ ఆఫ్ ది జనరల్ లిస్ట్ హోదాలను అందిస్తుంది. బ్రిటిష్ రెగ్యులర్ ఆర్మీ సైనికులైన హెచ్ కే ఎం సి సైనికులు వారి 15 సంవత్సరాల మంచి, విశ్వసనీయ సేవలను పూర్తి చేసుకున్న తరువాత ఆర్మీని వదిలి పోయే ముందు రెగ్యులర్ ఆర్మీ సర్వీసు బుక్ అందుకుంటారు. వారిలో చాలా మంది దీర్ఘకాలసేవ, మంచిప్రవర్తనా పతకాలను అందుకుంటారు. బ్రిటిష్ గాలంట్రి అవార్డులు, ఆర్డర్లు, అలంకరణలు, మెడల్ రిబ్బన్లు వంటివి కూడా హెచ్ కే ఎం ఎస్ సి సైనికులు అందుకుంటారు. వాటిలో కొన్ని క్వీంస్ గాలంటరీ మెడల్, ది బ్రిటిష్ ఎంపైర్ మెడల్, మెంబర్స్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్, ది ఆఫీసర్స్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ వంటివి కొన్ని.

భౌగీళిక పరిస్థితి , వాతావరణం

[మార్చు]

హాంగ్ కాంగ్ చైనా దక్షిణ సముద్రతీరంలో మాకా నగరానికి తూర్పున పీర్ల్ నదిడెలా ఆవలి తీరంలో 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. హాంగ్ కాంగ్ దక్షిణ, పడమటి భాగం, షేంజెన్ నగరం లోని గాంగ్ డాంగ్ ప్రాంత సరిహద్దులు చైనా సమృద్రంతో ఆవృతం అయి ఉంది. హాంగ్ కాంగ్ ప్రదేశ మొత్తం వైశాల్యం 1,104 చదరపు కిలోమీటర్లు (426 చదరపు మైళ్ళు). హాంగ్ కాంగ్ ద్వీపం, కోలూన్ ద్వీపకల్పం, ది న్య్జు టెర్రిటరీస్, 200 ద్వీపాలు కలిసిన మొత్తం ప్రదేశం హాంగ్ కాంగ్ పప్రభుత్వ ఆధీనంలో ఉంది. సముద్రంలో ఉన్న ద్వీపాలలో పెద్దది లాంత్యూ ద్వీపం అంటారు. హాంగ్ కాంగ్ లో మొత్తం 1,054 చదరపు మైళ్ళు భూభాగం, 50 చదరపు కిలో మీటర్ల జలభాగం ఉంది. హాంగ్ కాంగ్ స్వాధీనంలో 3 నాటికన్ సముద్ర భాగం ఉంది. హాంగ్ కాంగ్ భూగంలో నివసించే ప్రజల సంఖ్యను ప్రామాణికంగా తీసుకుంటే ప్రపంచంలో 179వ ప్రత్యేక రాజ్యపాలనా భాగంగా గుర్తించబడింది.

హాంగ్ కాంగ్ లోని అత్యధిక భూభాగంలో ఎత్తైన పర్వతాలు నిటారుగా ఉండే లోయలూ ఉంటాయి. 25% కంటే తక్కువ భూభగం అభివృద్ధి చేయబడి ఉంది. మిగిలిన 40% పార్క్‍ ల కొరకు సంరిక్షించబడి ఉంది. హాంగ్ కాంగ్ ఉత్తర తీరంలో ఉన్న కోలూన్ ద్వీపకల్పంలో, న్యూతెర్రిటరీస్ లో చెదురుమదురుగా ఒప్పంద ఆధారంగా నగరంగా అభివృద్ధి చేయబడింది. సముద్రమట్టానికి 957 మీటర్ల ఎత్తులో ఉన్న " తాయ్ మో షాన్ " భూభాగం హాంగ్ కాంగ్ లోని అత్యున్నత భూభాగంగా గుర్తించబడింది. హాంగ్ కాంగ్ అస్తవ్యస్థంగా ఉండే పొడవైన సముద్రతీరం అనేక అఖాతాలను, బీచ్ లను, ప్రవాహాలను ఏర్పరచింది. 2011 సెప్టెంబరు తేదీన యునెస్కో " హాంగ్ కాంగ్ నేషనల్ జియోపార్క్ నెట్ వర్క్" తన జాబితాలోకి చేర్చింది. సై కుంగ్ వల్కానిక్ రాక్ రీజియన్, నార్తీస్ట్ న్యూటెర్రిటరీస్ రాక్ రీజియన్ లలో హాంగ్ కాంగ్ జియోపార్క్ 8 భౌగోళిక బిభాగాలుగా విభజించబడి ఉంది.

హాంగ్ కాంగ్ కీర్తి అంతా దాని నగరాభివృద్ధికే చెందుతుంది. ఈ ప్రదేశంలో హరితప్రదేశంగా మార్చడానికి కావలసిన ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ప్రజలలో తలెత్తిన స్పందన కారణంగా విక్టోరియా ప్రాంతంలో భూపునరుద్ధరణ కార్యక్రమాలు రూపుదిద్దుకుంటున్నాయి. ఎత్తైన భవనాలు, భౌగోళిక కారణలా కారణంగా పెరుగుతున్న కాలుష్యానికి ప్రజలలో కలిగిన ఆందోళన వారిని జాగృతం చేసి పర్యావరణ అభివృద్ధికి పూనుకొనేలా అడుగులు వేయిస్తుంది. హాంగ్ కాంగ్ లోని 80% పొగమంచుకు పీర్ల్ రివర్ డెల్టా ప్రాంతం కారణం ఔతుంది అని భావిస్తున్నారు.

ఇది కర్కాటక రేఖకు దక్షిణంగా ఉన్నప్పటికీ హాంగ్ కాంగ్ తేమ కలిగిన వాతావరణం కలిగి ఉంటుంది. అప్పుడప్పుడూ కురిసే వర్షాలతో, ఉరుములతో కూడిన మబ్బులతో అలాగే ఆగ్నేయ దిశనుండి వీచే వచ్చని గాలులతో వేసవి తేమమిశ్రిత వతావరణం కలిగి ఉంటుంది. వేసవిలో తుఫానులూ, కోడచరియలు విరిగి పడడం అధికం కనుక కొన్ని మార్లు వరదలు సంభవిస్తుంటాయి. శీతాకాలంలో చలి స్వల్పంగా ఉండి సాధారణంగా ఎండ కూడా ఉంటుంది. ఫిబ్రవరి నాటికి ఆకాశం మేఘావృతమై ఉంటుంది. అప్పుడప్పుడూ ఉత్తరదిశ నుండి వీచే శీతల పవనాల కారణంగా చలి అధికంగా ఉంటుంది. వసంతకాలంలో మాత్రం అధిక ఉష్ణోగ్రత నమోదు ఔతుంది. ఆకురాలు కాలంలో ఎండలు పొడి వాతావరణం సంభవం. హాంగ్ కాంగ్ లో సంవత్సరానికి సుమారుగా 1,948 గంటలు ఎండ ఉంటుంది. హాంగ్ కాంగ్ అబ్జర్వేటరీ 36.1 °సి (97.0 °ఫి), 0.0 °సి (32.0 °ఫారెన్ హీట్) ఉంటుంది.

ఆర్ధికరంగం

[మార్చు]

అంతర్జాతీయ వాణిజ్యకేంద్రంగా హాంగ్ కాంగ్ పెట్టుబడుదారులకు అనుకూలమైన సేవలలో భాగంగా తక్కువ పన్నులు, పన్ను కట్టే లేని స్వేచ్ఛా వ్యాపారాన్ని అనుమతిస్తుంది. 2010లో అత్యధికంకా వాణిజ్యం జరుగుతున్న కరెంసీలో హాంగ్ కాంగ్ డాలర్ ప్రపంచంలో ఎనిమిదవస్థానంలో ఉంది. ఒకసారి మిల్టన్ ఫ్రైడ్మాన్ హాంగ్- కాంగ్ స్వేచావిఫణికి, పెట్టుబడి దారుల అనుకూలతకు ఒక ప్రయోగ కేంద్రమని అభివర్ణిణించారు. అయినప్పటికీ తక్కువ కూలీ వంటి నిబంధనలు కలిగిన పాలనావిధానాలను అనుసరిస్తున్న రాజ్యాంగవ్యవస్థను కలిగి ఉంది. 1995 నుండి హాంగ్ కాంగ్ అధికంగా అభివృద్ధి చెందిన పెట్టుబడిదారి స్వేచ్ఛా వాణిజ్య ఆర్థికవ్యవస్థ కలిగినదేశంగా తన స్థానాన్ని పదిలపరచుకుని ఉంది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ప్రముఖ వాణిజ్య సంస్థల ప్రధాన కార్యాలు కేంద్రీకృతమైన దేశంగా, అంతర్జాతీయ ఆర్థిక, వ్యాపార కేంద్రంగా కూడా అభివృద్ధి చెందిన దేశంగా గుర్తింపు కలిగిఉంది. 1960 నుండి 1990 వరకూ అభివృద్ధి పధంలో దూసుకుపోతున్న ప్రాంతంగా నాలుగు ఆసియన్ టైగర్లలో ఒకటికా గుర్తింపు పొందింది. 1961 నుండి 1997 వరకు గ్రాస్ డొమెస్టిక్ ఉత్పత్తి 180 % పెరుగుదల సూచించింది. తలసరి గిడిపి 87 రెట్లు అధికమైంది.

హాంగ్ కాంగ్ స్టాక్ ఎక్సేంజ్ ప్రపంచంలో ఏడవ స్థానంలో ఉంది. 2009 డిసెంబరు నాటికి హాంగ్ కాంగ్ స్టాక్ ఎక్సేంజ్ పెట్టుబడులు 2.3 ట్రిలియన్లకు చేరింది. అదేసంవత్సరం హాంగ్ కాంగ్ 22% ఐ పి ఒ పెట్టుబడులను ఆహ్వానించడంతో హాంగ్ కాంగ్ ఐపిఒ పెట్టుబడులలో అతిపెద్దదిగా భావించబడుతుంది. అలాగే హాంగ్ కాంగ్ పెట్టుబడులను పెంచడానికి సులువైన ప్రదేశంగా భావించబడుతుంది. 1983 వరకు హాంగ్ కాంగ్ డాలర్ యు.ఎస్ డాలర్ కు సమానంగా ఉండేది.

కొంచంగా పారిశ్రామిక విధానాలు, ఎగుమతి, దిగుమతుల మీద ఎలాంటి నిబంధనలు విధించబడని విధానం అనుసరొస్తూఆర్ధికరంగంలో హాంగ్ కాంగ్ సాంప్రదాయకంగా అనుకూల పాత్రవహిస్తుంది. మార్కెట్ శక్తులు, ప్రైవేట్ యాజమాన్యం కలిసి ఆచరణాత్మకమైన అభివృద్ధిని నిర్ణయిస్తాయి. అధికారికంగా జోక్యం చేసుకోని విధానాలు హాంగ్ కాంగును స్వేచ్ఛావిఫణి పెట్టుబడులకు కేంద్రంగా మార్చింది. రెండవ ప్రపంచయుద్ధ యుద్ధ సమయంలో హాంగ్ కాంగ్ పారిశ్రామికంగా దూసుకుపోతూ తయారీ కేంద్రం ఎగుమతుల వైపు దృష్టి మరల్చేలా చేసింది. అలాగే రవాణా రంగంలో కూడా దూసుకు పోసాగింది. 1980 నుండి హాంగ్ కాంగ్ ఆర్థిక రంగం సేవారంగ ఆర్థికరంగంగా రూపుదిద్దుకుంది. అప్పటి నుండి అది మేనేజ్మెంట్, ఫైనాంషియల్, ఐటి, వ్యాపార సలహాలు, వృత్తి సేవలు అందించండంలో హాంగ్ కాంగ్ ప్రధాన కేంద్రంగా మారింది.

1990 నాటికి హాంగ్ కాంగ్ వాణిజ్య కేంద్రంగా అభివృద్ధిసాధించింది. అయినప్పటికీ 1998లో ఆషియన్ ఆర్థిక మాంధ్యం ప్రభావం హాంగ్ కాంగ్ మీద కూడా ప్రభావం చూపింది. తరువాత 2003 లో సార్స్ వ్యాధి ప్రభావం కూడా హాంగ్ కాంగ్ ఆర్థికరంగం మీద దెబ్బతీసింది. తరువాత దేశీయ, అంతర్జాతీయ అవసరాలు హాంగ్ కాంగ్ ఆర్థికరంగాన్ని తిరిగి అభివృద్ధి పధంలోకి తీసుకువెళ్ళింది. ఎగుమతుల రుసుము తగ్గింపు హాంగ్ కాంగ్ ను పోటీలో నిలబడేలా చేసి ఆర్థికమాంధ్య కాలం ముగింపుకు వచ్చింది. చివరి కాలనీ రాజ్యం సమయంలో ఆరంభమైన ప్రభుత్వ జోక్యం కొంచెం కొంచెంగా పెరుగుతూ 1997 వరకూ కొనసాగింది. తరువాత ఆదాయ హామీ, నిర్భంధ పదవీవిరమణ భత్యం, పరిమిత కూలీలు, వివక్షకు వ్యతిరిక్త విధానాలు హాంగ్ కాంగ్ ఆర్థికరంగ అభివృద్ధికి దోహదం చేసాయి.

ఈ ప్రదేశం స్వల్పంగా పంటభూములు, కొన్ని సహజ సంపదలు కలిగి ఉంది. అందువలన హాంగ్ కాంగ్ అనేక ఆహారపదార్ధాలు దిగుమతి చేసుకుంటుంది. హాంగ్ కాంగ్ ఆర్థికరంగానికి వ్యవసాయ కార్యక్రమాలు ప్రధానమైనవి కాదు. ఆహారం, పూలతోటల అభివృద్ధి వంటి వ్యవసాయం హాంగ్ కాంగ్ జిడిపికి 0.1% మాత్రమే సాయం చేస్తుంది. హాంగ్ కాంగ్ అదాయం, జిడిపి లను దేశీయ ఉత్పత్తులకంటే ఎగుమతి, దిగుమతుల వలన లభించే ఆదాయం అధిగమిస్తుంది. అత్యధిక వాణిజ్య పరిమితి కలిగిన దేశాఆలలో హాంగ్ కాంగ్ 11వ స్థానంలో ఉంది. అత్యధిక హాంగ్ కాంగ్ ఎగుమతులు రెండవ ఎగుమతి కొరకే హాంగ్ కాంగ్ కు చేరుతుంటాయి. ఈ ఉత్పత్తులు వెలుపలి నుండి హాంగ్ కాంగ్ కు చేరుకుంటాయి. ప్రధానంగా రిపబ్లిక్ చైనా ఉత్పత్తులు హాంగ్ కాంగ్ ద్వారా ఎగుమతి చేయబడతాయి. హాంగ్ కాంగ్ భౌగీళిక పరిస్థితులు రవాణా, మౌలికంగా నగరాభివృద్ధి వంటి విషయాలకు తోడ్పడుతూ హాంగ్ కాంగ్ ను అత్యంత రద్దీ అయిన కంటైనర్ పోర్ట్, రద్దీ అయిన వస్తు రవాణా చేస్తున్న విమానాశ్రయంగా చేసింది. సామ్రాజ్యాధికారం మార్చబడడానికి ముందే హాంగ్ కాంగ్ రిపబ్లిక్ చైనాతో వ్యాపార పెట్టుబడి, వాణిజ్య సంబంధాలను బలపరచింది. ఆర్థిక మాంధ్యం కారణంగా క్షీణదశకు చేరుకున్న ఉద్యోగావకాశాలను 2007 చివరి నాటికి 3.46 మిలియన్ల పూర్తి సమయ ఉద్యోగాలు కల్పించి నిరుద్యోగ శాతాన్ని 4.1%కి తీసుకు వచ్చారు. హాంగ్ కాంగ్ ఆర్థికరంగంలో 90% జిడిపి పెరుగుదలకు కారణం అయినది సేవారంగం, 9% జిడిపి అభివృద్ధికి పారిశ్రామిక రంగం సహకరిస్తుంది. 2007లో ద్రవ్యోల్బణం 2.5% నికి చేరుకుంది. హాంగ్ కాంగ్ అత్యధిక ఎగుమతి దారులు రిపబ్లిక్ చైనా, జపాన్, అమెరికా దేశాలకు చెందినవారే.

బ్రిటన్ కామన్ లా ఆధారిత హాంగ్ కాంగ్ న్యాయవ్యవస్థ కావడం మూలాన ప్రాంతీయ సివిల్ వ్యవహారాలలో రక్షకదళం జోక్యం నుండి తగిన రక్షణ కలిగిస్తుంది. హాంగ్ కాంగ్ ప్రభుత్వానికి ప్రజారక్షణ బాధ్యత ఉంది కనుక అది నిర్వహణ, విపత్తు నివారణ వంటి విషాయాలకు రిపబ్లిక్ చైనా నుండి రక్షకదళ సహాయం తీసుకుంటుంది. రక్షకదళ నిర్వహణా వ్యయాన్ని హాంగ్ కాంగ్ ప్రభుత్వం భరిస్తుంది.

జనసంఖ్య

[మార్చు]

ఈ ప్రదేశం జనసంఖ్య 7.03 మిలియన్లు. 2009 హాంగ్ కాంగ్ జననాల శాతం 1.17% సంతోనోత్పత్తి నిష్పత్తి 1000 స్త్రీలకు 1032 మంది పిల్లలుగా ఉన్నారు. చైనా రిపబ్లిక్ ప్రజలకు హాంగ్ కాంగ్‍లో నివసించే హక్కు లేదు. అంతే కాదు వారు ఈ ప్రదేశంలో స్వేచ్ఛగా ప్రవేశించే అధికారం కూడా లేదు. అయినప్పటికీ రిపబ్లిక్ చైనా నుండి ప్రతి సంవత్సరం సుమారు 45,000 ప్రవేశించడం జసంఖ్య పెరుగుదలకు కారణం ఔతుంది. రిపబ్లిక్ చైనా నుండి కుంటుంబ సభ్యులను కలవడానికి వచ్చే ప్రజలకు ప్రతి దినం 150 "ఒన్ వే అనుమతులను" ఇస్తుంది. 2009 గణాంకాలు హాంగ్ కాంగ్ ప్రజల ఆయుష్ పరిమితి పురుషులకు 79.16 అలాగే స్త్రీలకు 84.79 నిష్పత్తిలో ఉన్నట్లు తెలియజేస్తున్నాయి. ప్రపంచంలో అత్యధిక ఆయుష్ పరిమితి కలిగిన ప్రజలు హాంగ్ కాంగ్ వాసులే.

హాంగ్ కాంగ్ వాసులలో 95% చైనాసంతతి వారే. వీరిలో అధికులు తైషానీస్, చియు చౌ, ఇతర చైనీయులు హక్కాకు చెందిన వారు. హాంగ్ కాంగ్ యొక్క హాన్ ప్రజలలో అత్యధికులు గాంగ్‍డాంగ్ లోని గ్వాంగ్ఝౌ, తైషాన్ ప్రదేశాలకు చెందిన వారు. మిగిలిన 5% ప్రజలు చైనాసంప్రదాయేతరులు. హాంగ్ కాంగ్ లో దక్షిణ ఆసియాకు చెందిన భారతీయులు, పాకిస్థానీయులు, నేపాలీలు కూడా ఉనారు. కొంతమంది వియత్నాం నుండి వచ్చిన ఆశ్రితులు హాంగ్ కాంగ్ శాశ్వత నివాస అనుమతులను కలిగి ఉన్నారు. వీరేకాక బ్రిటన్ పౌరులు, అమెరికన్లు, కెనెడియన్లు, జపానీయులు కొరియన్లు వ్యాపార, ఆర్థిక సంస్థలలో పనిచేస్తున్నారు. 2008 గణాఆంకాలు హాంగ్ కాంగ్‍లో 2,52,500 మంది విదేశీ ఇంటి పనుల సహాయకులు ఇండోనేషియా, ఫిలిప్పైన్ నుండి వచ్చరని తెలియజేస్తున్నాయి.

వాస్తవంగా హాంగ్ కాంగ్ యొక్క అధికారిక భాష కాంటోనీస్. ఈ భాషకు మూలం హాంగ్ కాంగ్ ఉత్తర ప్రాంతంలో ఉన్న గాంగ్ డాంగ్ ప్రాంతంలోని చైనీయుల భాష. హాంగ్ కాంగ్ లో 3.1% ప్రజలు మరొక అధికారిక భాష అయిన ఆంగ్లభాషను తమ దైనందిక భాషాగా మాట్లాడుతున్నట్లు 1996 గణాంకాలు తెలియజేస్తున్నాయి. అలాగే 34.9% ప్రజలు ఆంగ్లభాషను రెండవ భాషగా మాట్లాడుతున్నట్లు గణాంకాలు తెలియజేస్తునాయి. ఈ ప్రాంతం అంతా ఆంగ్లం, చైనీస్ అక్షరాలు, గుర్తులు ప్రజలకు మార్గనిర్డేశం చేస్తుంటాయి. 1997 చైనీయులకు హస్థగతం చేసిన తరువాత ప్రధాన భూమి అయిన చైనా నుండి వలస వచ్చిన వారిలో మాండరిన్ భాష మాట్లేడే వారు అధికంగా ఉన్నరు. రిపబ్లిక్ చైనా ఆర్థిక రంగాన్ని అధికంగా ప్రభావితం చేసినవారు వీరే. హాంగ్ కాంగ్ నివాసులలో అధిక భాగం నాస్థికత్వం లేక హేతువాదం మీద విశ్వాసం ఉన్న వారే కనిక వీరికి ఎటువంటి మత ప్రాతిపదిక ఉండదు. యు.ఎస్ డిపార్టుమెంటు హాంగ్ కాంగ్ ప్రజలలో 43% ఒక విధమైన మతవిశ్వాసకులుగా భావిస్తుంది. కొన్ని ప్రజాభిప్రాయ సేకరణలు హాం కాంగ్ ప్రజలలో స్ఘుమారు 64% ప్రజలకు ఎటువంటి మతవిశ్వాసం లేదని తెలియజేస్తున్నాయి. మరికొన్ని 80% ప్రజలకు మతవిశ్వాసాలు లేవని తెలియజేస్తున్నాయి.

బేసిక్ లా హాంగ్ కాంగ్ వాసులకు అత్య్త్తమ మతస్వాతంత్ర్యం ఇచ్చింది. హాంగ్‍కాంగ్ ప్రధన మతము బుద్ధిజం, తాయిజం, కంఫ్యూషియనిజం. అనేక తెగల ప్రజలతో సంబంధం ఉన్న ప్రాంతీయ మతపడితుడు హాంగ్‍కాంగ్‍లో సుమారు 1.5 మిలియన్ల బుద్ధమతస్థులు, తాయ్ మతస్థులు ఉన్నారని అంచనా వేస్తున్నాడు. లేటర్-డే సన్యాసుల, జెహోవా విట్నెస్‍లతో కలిసి క్రిస్టియనులు స్వల్పంగా ఉన్నారు. వీరిలో ప్రొటెస్టెంట్లు కాథలిక్కుల నిష్పత్తి 4:3. ది ఆంగ్లికన్, రోమన్ కాథలిక్కులు స్వేచ్ఛగా వారి భిషప్పులను వారి చర్చిలలో నియమిస్తారు. చైనా రిపబ్లిక్‍లో ఈ అధికారం ఉండదు. ఇంకా సిక్కులు, ముస్లిములు, యూదులు, హిందువులు, బహాయీ సమూహానికి చెందిన వారూ కూడా హాంగ్ కాంగ్ లో నివసిస్తున్నరు.

పసిఫిక్ ఆసియన్ల కంటే హాంగ్ కాంగ్ నివాసితుల తలసరి ఆదాయం అధికంగా ఉంటుంది. 2008 యునైటెడ్ స్టేట్స్ సెటిల్మెంట్ పోగ్రాం నివేదిక అనుసరించి కొనుగోలు శక్తి ఆసియాలోనే అధికమని అంతర్జాతీయ స్థాయి కలిగి ఉన్నదని తెలియజేస్తున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం ఎదుర్కొంటున్న వత్తిడి ఆదాయం పేదరిక పరిస్థితులను ఉద్ధరించలేదని, కొను గోలు శక్తి అన్ని ప్రాంతాలకు సమానంగా వర్తించదని భావించేలా చేస్తుంది. పరిస్థితులు సరిదిద్దడానికి ప్రభుత్వం నివాసగృహాల వైశాల్యంలో మార్పులు తీసుకురావడం, అధిక వేతనం కలిగిన ఉపాధి వసతులను అభివృద్ధి చేయడం వంటి ప్రణాళికలతో పునరుద్ధరణ కార్యక్రమాలు చేపట్టింది.

విద్య

[మార్చు]

హాంగ్ కాంగ్ విద్యావిధానం పూర్తిగా ఇంగ్లాండ్ విద్యావిధానాన్ని అనుసరిస్తూ ఉండేది. " మదర్ టంగ్ ఇంస్ట్రక్షన్ " (చైనా భాష: 母語教學 ) పేరుతో అంత్ర్జాతీయ విద్యావిధాన్నన్ని ప్రభుత్వం నిర్వహిస్తున్నప్పటికీ కాంటోనీస్ ఇంస్ట్రక్షన్ చైనా, ఆంగ్ల లిపితో బోధించబడుతుంది. మాధ్యమిక పాఠశాలలలో రెండు భాషలు, మూడుభాషలను మాట్లాడే శక్తి కలవారు తప్పనిసరి. అలాగే మాండరిన్- భాష విద్య కూడా అభివృద్ధి చెందుతుంది." ది ఇంట్జర్నేషనల్ స్టూడెంట్ అసెస్మెంట్ హాంగ్ కాంగ్ విధ్యావిధానం ప్రపంచంలో రెండవ స్థాయిలో ఉందని ధృవీకరించింది. హాంగ్ కాంగ్ ప్రభుత్వ పాఠశాలలను ఎజుకేషన్ బ్యూరో నిర్వహిస్తుంది. ఈ విద్యావిధానం తప్పనిసరికాని మూడు సంవత్సరముల కిండర్‍గార్డెన్ విధ్యాభ్యాసం తరువాత తప్పనిసరి అయిన ఆరుసంవత్సరాల ప్రాథమిక విధ్యాభ్యాసం తరువాత తప్పనిసరి అయిన మూడు సంవత్సరాల జూనియర్ సెకండరీ విధ్యాభ్యాసం తరువాత తప్పనిసరికాని రెండుసంత్సరాల సీనియర్ సెకండరీ విధ్య తరువాత హాంగ్ కాంగ్ సర్టొఫికేట్ ఆఫ్ ఎజ్యుకేషన్ పరీక్షలు తరువాత రెండుసంవత్సరాల మెట్రిక్యులేషన్ కోర్స్ తరువాత హాంగ్ కాంగ్ అడ్వంస్ లెవల్ పరీక్షలు ఉంటాయి. 2009 లో సరొకొత్త సీనియర్ సెకండరీ అకాడమిక్ స్ట్రక్చర్ , కరికులం ప్రవేశపెట్టబడింది. ఈ విధానం విద్యార్ధులందరూ తప్పనిసరిగా మూడు సంవత్సరముల జూనియర్ తరువాత మూడు సంవత్సరాల సీనియర్ సెకండరీ ఎజ్యుకేషన్ ఉంటాయి. కొత్త విద్యావిధానంలో ఒకేఒక పబ్లిక్ ఎగ్జామినేషన్ ఉంటుంది. దీనిని " హాంగ్ కాంగ్ డిప్లొమా ఆఫ్ సెకండరీ ఎజ్యుకేషన్ అంటారు.

హాంగ్ కాంగ్ పతనం తరువాత హాంగ్ కాంగ్ స్కూల్స్ మూడు వర్గాలుగా విడిపోయాయి, వీటిలో అధికంగా రాయితీతో నడిచేవి, ఇవి ప్రభుత్వ నిధిసహాయం, గ్రాంట్ స్కూల్స్, ప్రైవేట్ యాజమన్యం స్కూఉల్స్. ఇవి తరచుగా క్రిస్టియన్ సేవా సంస్థల ఆధ్వర్యంలో నడపబడుతుంటాయి. వీటిలో ప్రవేశించడానికి ఆర్థిక స్తోమత కంటే మేధా సంపత్తికి ప్రాధాన్యత ఇస్తారు. మిగిలిన స్కూల్స్ నేరుగా లభించిన రాయితీతో, ప్రైవేట్ యాజమాన్యం కల అంతర్జాతీయ పాఠశాలలు.

హాంగ్ కాంగ్‍లో తొమ్మిది ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. హాంగ్ కాంగ్‍లోని చాలా పురాతనమైన విశ్వవిద్యాలయం 1911 లో స్థాపించబడిన " యూనివర్శిటీ ఆఫ్ హాంగ్ కాంగ్ ". అండర్ గ్రాజ్యుయేట్ చదువుల ప్రవేశానికి ఉన్న పోటీ విద్యార్థులను భయాందోళనకు గురిచేస్తుంది. ఉన్నత విద్యలకు సంవత్సర విద్యార్థుల ప్రవేశ స్థానాలు పరిమితంగా ఉండడం ఇందుకు ప్రధాన కారణం. ప్రత్యేకంగా కొన్ని వృత్తి విద్యా స్థానాలు కొన్ని ప్రత్యేక ప్రదేశ విద్యాసంస్థలకు లభించడం ఒక సమస్య. కొన్ని విద్యలను కొన్ని ప్రత్యేక ప్రాంతంలో ఉన్న సంస్థలు మాత్రమే అందిస్తున్నాయి. ఈ ప్రాంతంలో వైద్య విద్యను రెండు విద్యాసంస్థలు మాత్రమే అందిస్తున్నాయి. యూనివర్శిటీ ఆఫ్ హాంగ్ కాంగ్ " ది లికా షింగ్ ఫాకల్టీ ఆఫ్ మెడిసిన్ " విద్యను అందిస్తుంది. వైద్య విద్యను అందిస్తున్న రెండవ విద్యా సంస్థ " ది ఫేకల్టీ ఆఫ్ మెడిసిన్ ఆఫ్ ది చైనీస్ య్జునివర్శిటీ ఆఫ్ హాంగ్ కాంగ్ ". హాంగ్ కాంగ్‍లో ప్రభుత్వ విద్యాలయాలలో ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం లేనివారికి అనేక ప్రైవేట్ విద్యా సంస్థలు ఉన్నత డిప్లొమా, సంబంధిత డిగ్రీ విద్యను అందిస్తున్నాయి. ఈ సంస్థలలో ప్రతిభ చూపిన వారిలో కొందరు ప్రభుత్వ విశవిద్యాలయాలలో విద్యాభ్యాసం చేసే అవకాశాన్ని అందుకుంటున్నరు.

ఆరోగ్య సంరక్షణ

[మార్చు]

హాంగ్ కాంగ్‍లో 50కి పైగా ప్రభుత్వ వైద్యశాలలు, 13 ప్రభుత్వేతర వైద్యశాలలు ఉన్నాయి. అత్యధికంగా ఆరోగ్యసంరక్షణ వసతులు లభ్యం కావడం వైద్యసేవలలో హాంగ్ కాంగ్‍ను అంతర్జాతీయ శ్రేణిలో నిలిపింది. ఎస్ ఏ ఆర్ వైద్యశాలలలో కొన్ని అత్యుత్తమ వైద్యాశాలలని ప్రంపంచమంతటా భావిస్తున్నారు. 2012లో ఐక్యరాజ్యసమితి, ప్రపంచ ఆరోగ్య సంస్థ హాంగ్ కాంగ్ ప్రజల ఆయుష్ పరిమితి ప్రంచంలో మొదటి శ్రేణిలో ఉందని అభిప్రాయపడింది. గ్రేట్ బ్రిటన్ పూర్వీకంగా ఉన్న బ్రిగేడ్ శాఖ హాంగ్ కాంగ్‍లో " సెయింట్ జాన్ అంబులెంస్ బ్రిగేడ్ హాంగ్ కాంక్ "గా సమూహపరమైన సేవలతో ఇతరసేవలు అందింస్తుంది.

ఎస్ ఏ ఆర్ లో రెండు వైద్యకళాశాలలు ఉన్నాయి. ఒకటి " చైనీస్ యూనివర్సిటీ ఆఫ్ హాంగ్ కాంగ్" అలాగే రెండవది హాంగ్ కాంగ్ యూనివర్శిటీలో ఉంది. రెండు ప్రభుత్వరంగ ఆసుపత్రులతో బలమైన సంబంధాలు కలిగి ఉంది. పోస్ట్ గ్రాజ్యుయేషన్ విద్యలకు హాంగ్ కాంగ్‍లో ఉన్న గౌరవం కారణంగా సంప్రదాయకంగా హాంగ్ కాంగ్ డాక్టర్లు అదనంగా చదువులను కొనసాగించడానికి విదేశాలవైపు దృష్టిసాగిస్తుంటారు. అనేకమంది ది ఎం ఆర్ సి పి, (యుకె), ది ఎం ఆర్ సి ఎస్ (యు కె) వంటి బ్రిటిష్ రాయల్ కాలేజ్ ఎగ్జాంస్‍కు హాజరౌతుంటారు. ఏది ఏమైనప్పటికీ హాంగ్ కాంగ్ తమ స్వంత పోస్ట్ గ్రాజ్యుయేషన్ మెడికల్ ఇంస్టిట్యూషన్లను అభివృద్ధి చేస్తుంది. ప్రత్యేకంగా హాంగ్ కాంగ్ లో "దిఅకాడమీ ఆఫ్ మెడిసిన్ క్రమంగా పోస్ట్‍గ్రాడ్యుయేట్ మెడికల్ ట్రైనింగ్ బాధ్యతలను తీసుకుంది. 2003 లో సార్స్ విజృంభణ తరువాత హాంగ్ కాంగ్ ఆరోగ్యసంరక్షణ విధానం , ఆరోగ్యసంరక్షణా కేంద్రాల ఏర్పాటు తప్పక హాంగ్ కాంగ్ ప్రజలకు మేలు చేస్తుంది.

2011 నాటికి ప్రధాన చైనా భూమి నుండి తల్లులు హాంగ్ కాంగ్‍లో నివసించడానికి ప్రభుత్వ అనుమతి పొందడంతో నగరంలోని ప్రభుత్వ , ప్రైవేటు హాస్పిటల్ వార్డులు గదులు అన్నీ నిండి పోతున్న కారణంగా నగరంలోని గర్భవతులకు ప్రసవకాలంలో ఆసుపత్రులలో అవసరమైన పడకలు , రొటీన్ చెకప్పులు వంటి వైద్యపరమైన వసతులు లభించ లేదని ప్రజలు తమ ఆవేదనను వెలిబుచ్చుతున్నారు. 2001-2010 మధ్యకాలంలో వైద్యసిబ్బందికి పెరిగిన పనిభారం, వైద్యపరమైన పొరపాట్లు , వైద్యపరమైన ఆపదలు ప్రధాన రిపబ్లిక్ చైనా వార్తా పత్రికలలో ప్రధాన వార్తలుగా వెలువడుతుంటాయి.

సంస్కృతి

[మార్చు]

హాంగ్ కాంగ్ తరచుగా "ఈస్ట్ మీట్స్ వెస్ట్" (తూర్పు పడమరల కలయిక) అని వర్ణించబడుతుంది. ఈ ప్రదేశంలో చైనీస్ సాంస్కృతిక మూలాలు బ్రిటిష్ కాలనీ కాలంలో పశిమదేశ సంస్కృతితో ప్రభావితం కావడమే ఇందుకు ప్రధాన కారణం. హాంగ్ కాంగ్ ప్రజలు ఆధునిక జీవనరీతిని చైనాసంప్రదాయాలతో ముడివేసి జీవించడంలో సమతుల్యం సాధించారు. హాంగ్ కాంగ్ ప్రజలు అతి ఖరీదైన బృహత్తర నిర్మాణాలలో సైతం " ఫెంఘ్ షుయ్ " (చైనా వాస్తుసంప్రదాయం ) తీవ్రంగా పాటిస్తుంటారు. భవన నిర్మాణానికి ముందు వారు ఫెంఘ్ షుయ్ నిపుణులను నియమించి వారి సలహాసంప్రదింపులు తీసుకుంటారు. వారు తరచుగా వారి వ్యాపార అభివృద్ధికి, పతనానికి ఫెంఘ్ షుయ్ కారణమౌతుందని విశ్వసిస్తారు. వారి విశ్వాసాలలో భాగంపంచుకునే మరొక వస్తువు " బా క్వా " అద్దాలు. వారి ఈ అద్దాలను ఇప్పటికీ దెయాల దృష్టి మరల్చడానికి వారి బృహత్తర భవనాలలో సైతం వాడుతుంటారు. అలాగే వారు 4 వ నంబర్ చోటు చేసుకున్న భవనాలను కొనుగోలు చేయడం, అద్దెకు తీసుకోవడం వంటివి నివారిస్తారు. వారి భాషలలో ఒకటైన కాంటనీస్ భాషలో ఇటువంటి పదానికి " మరణం " అని అర్ధం ఉండడమే ఇందుకు కారణం. తూర్పు, పడమర భావాలు వారి వంటలలో కూడా ప్రతిఫలిస్తుంది. డిం సం, హాట్ పాట్, ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లలో హ్యూచ్యూ వంటకాలు చోటుచేసుకుంటాయి.

హాంగ్ కాంగ్ అంతర్జాతీయ వ్యాపార కేంద్రంగా, పర్యాటక ఆకర్షణ కేంద్రంగా గుర్తింపు పొందింది.1960 - 1970 లో హాంగ్ కాంగ్ మార్షల్ ఆర్ట్స్ చిత్రమిర్మాణం ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందింది. పలు హాలివుడ్ కాళాకారులు, అంత్ర్జాతీయ ఖ్యాతిగాంచిన నటీనటులు, మార్షల్ ఆర్ట్స్ కళాకారులను హాంగ్ కాంగ్ చిత్రపరిశ్రమ అంతర్జాతీయ చిత్రసీమకు కానుకగా సమర్పించింది. బ్రూస్‍లీ, జాకీచాన్, చౌ యున్- ఫట్, మైకేల్ యాహ్, మేగీ చుంగ్, జెట్‍లీ.ఏ వంటి ప్రముఖనటులు హాంగ్ కాంగ్ చిత్రసీమ నుండి హాలీవుడ్‍లో ప్రవేశించారు. అనేక హాంగ్ కాంగ్ నిర్మాతలు హాలీవుడ్‍లో అత్యంత కీర్తిని సంపాదించారు. జాన్ వూ, వాంగ్ కార్-వై, స్టిఫెన్ చౌ వంటి ప్రముఖులు వారిలో కొందరు. హోమ్‍గ్రోన్ చిత్రాలు చుంగ్‍కింగ్ ఎక్స్‍ప్రెస్, ఇన్‍ఫర్నల్ అఫెయిర్స్, షోల్ ఇన్ సాకర్, రంబుల్ ఇన్ ది బ్రోక్స్, ఇన్ ది మూడ్ ఫర్ లవ్, ఎకోస్ ఆఫ్ రైన్‍భో వటివి అంత్ర్జాతీయ గుర్తింపును పొందాయి. కాంటోపాప్ సంగీతానికి హాంగ్ కాంగ్ ప్రముఖ కేంద్రం. ఈ సంగీతం ఇతర చైనా సంగీతాలను అలాగే పశ్చిమదేశాల సంగీతం మీద ప్రభావం చూపి అధికమైన అభిమానులను సంపాదించింది.

హాంగ్ కాంగ్ " హెర్టేజ్ మ్యూజియం" " ది హాంగ్ కాంగ్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్స్ ", " ది హాంగ్ కాంగ్ అకాడమీ ఫర్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ , హాంగ్ కాంగ్ ఫిల్‍హార్మోనిక్ ఆర్కెస్ట్రా వంటి హాంగ్ కాంగ్ సంస్కృతికి హాంగ్ కాంగ్ ప్రభుత్వం సహాయసహకారాలు అందిస్తుంది. " ది గవర్నమెంట్ లీషర్ అండ్ కల్చరల్ సర్వీస్ డిపార్ట్‍మెంట్ సబ్సిడీస్ అండ్ స్పాంసర్స్ ఇంటర్నేషనల్ పర్ఫార్మర్స్ వంటివి హాంగ్ కాంగ్‍కు తీసుకురాబడ్డాఆయి. అనేక అంతర్జాతీయ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రభుత్వం, సలహాదారులు, ప్రైవేట్ సంస్థలు చేత నిర్వహించబడుతున్నాయి.

హాంగ్ కాంగ్ ఎ టి వి, టి వి బి వంటి ఆకాశవాణి ప్రసారకేంద్రాలు ఉన్నాయి. హాంగ్ కాంగ్‍లో మూడు ప్రాంతీయ పలు విదేశీ కేబుల్, శాటిలైట్ ప్రసారకేంద్రాలు ఉన్నాయి. హాంగ్ కాంగ్‍స్ సోప్ డ్రాంస్, కామెడీ సిరీస్, వైవిధ్యమున్న ప్రదర్శనలు హాంగ్ కాంగ్‍లో తయారై ప్రంపంచమంతటా ఉన్న చైనా ప్రజలను ప్రేక్షకులను రంజింపజేస్తున్నాయి. వార్తాపత్రికలు, మాగజింస్ చైనా, ఆంగభాషలలో ముద్రించబడుతున్నాయి. ఈ పత్రికలలో ప్రజాదరణ పొందిన వారి స్వంత విషయాలు, ఆసక్తిని రేకెత్తించే విషయాలు చోటు చేసుకుంటాయి. రిపబ్లిక్ చైనతో పోల్చి చూస్తే హాంగ్ కాంగ్ చలనచిత్రాలలో ప్రభుత్వం అధికారికంగా జోక్యం చేసుకోదు. అయినప్పటికీ భవిష్యత్తులో తూర్పు దేశాలతో ఆర్థిక సంబంధాలు మెరుగుపరచుకోవాలన్న ధృక్పధంతో తమకు తామే పరిశీలించుకుని పరిమితులను నిర్ణయిస్తుంది. పాశ్చాత్య సంస్కృతుల ప్రభావం చైనా ఆర్థికసంబంధాలను కలుధితం చేయకూడదన్నదే ప్రధాన ఉద్దేశం.

హాంగ్ కాంగ్ పునరుత్తేజకరమైన, పోటీ ప్రధానమైన క్రీడల అవకాశాలను తన భూపరిమితులను అధిగమించి అందిస్తుంది. హాంగ్ కాంగ్ ఒలింపిక్, ఆశియన్ క్రీడలలో తన ప్రతినిధులను పాల్గొనడానికి పంపింది. 2008 లో ఒలింపిక్ క్రీడలలో " ఈక్విస్ట్రియన్ మెక్‍ఫర్సన్ స్టేడియం " ఆహుతులకు ఆతిథ్యం ఇచ్చింది. హాంగ్ కాంఫ్ నిటారుగా ఉండి ఎత్తైన ప్రదేశం పర్వాతారోహకులను ఆకర్షిస్తాయి అలాగే కఠినమైన సముద్రతీరాలు ఈతగాళ్ళను ఆకర్షిస్తున్నాయి.

నిర్మాణశైలి

[మార్చు]

గణాంకాలను అనుసరించి హాంగ్ కాంగ్‍లో సుమారు 1,223 ఆకాశసౌధాలు ఉన్నాయి. అవి హాంగ్ కాంగ్‍ను అంతర్జాతీయ శ్రేణికి చేర్చాయి. మిగిలిన లేనన్ని 500 అడుగులకంటే అధిక ఎత్తైన భవనాలు హాంగ్ కాంగ్‍లో ఉన్నాయి. ఎత్తైన ఆకాశసౌధాలు, అధిక సంఖ్యలో ఉన్న భవన సముదాయం ఉన్న హంగ్ కాంగ్ నగరప్రాంతం హార్బర్ సమీపంలో విశాలమైన నివాసగృహాల కొరత అధికంగా ఉంది. నిటారుగా ఉండే కొండలు కలిగిన హాంగ్ కాంగ్ దీవి వైశాల్యం 1.3 చదరపు కిలోమీటర్ మాత్రమే ఉంది. నివాస అనుకూల ప్రాంతం కొరత కారణంగా నగరంలో జనసాంద్రత అధికంగా ఉంది. ఈ కారణంగా ఎత్తైన కార్యాలయ భవనాలు, నివాస గృహసముదాయాలు కూడా ఆకాశసౌధాలుగా నిర్మించవలసిన అవసరం ఏర్పడింది. ప్రపంచంలో అత్యంత ఎత్తైన నివాస గృహాలు కలిగిన 100 ఆకాశభవనాలలో 36 హాంగ్ కాంగ్‍లో ఉన్నాయి. హాంగ్ కాంగ్ లోని అధికమైన ప్రజలు 14 అంతస్తుల కంటే ఎత్తులోనే నివసించడం, పనిచేయడం వటివి చేస్తున్నారు. ఈ కారణంగా హాంగ్ కాంగ్ అత్యంత ఎత్తైన నగరంగా గుర్తింపు పొందింది.

భూమి కొరత నిర్మాణాల ఆవశ్యకత కారణంగా హాంగ్ కాంగ్‍లో పురాత భవనాల సంఖ్య చాలా కొద్దిగా మాత్రమే ఉన్నాయి. అంతే కాక హాంగ్ కాంగ్‍లో అత్యంతాధునిక నిర్మాణాలు అధికంగా ఉన్నాయి. " ది ఇంటర్నేషనల్ కామర్స్ సెంటర్ " 1,588 అడుగుల ఎత్తు ఉంది. ఈ భవనం ఎత్తు, పైకప్పు పరిమాణంలో హాంగ్ కాంగ్‍లో అత్యంత ఎత్తైనది, అలాగే ప్రపంచంలో ఈ భవనం మూడవ స్థానంలోంఉంది. ఇంతకు ముందు ఎత్తైన భవనమైన 1,362 అడుగుల ఎత్తైన ఐసిసి భవనంలో రెండు ఫైనాంషియల్ సెంటర్లు ఉన్నాయి. గుర్తించతగిన ఇతర భవనాలు హెచ్ ఎస్ బి సి హెడ్క్వార్టర్స్ బిల్డింస్, పిరమిడ్ ఆకాపరపు శిఖరం ఉన్న " ది ట్రైయాంగులర్-టాప్డ్ సెంట్రల్ ప్లాజా కూడా ఒకటి. ఈ సెంటర్‍లో రాత్రిసమయ అనేక రంగుల నియోన్ లైట్ షోజ్, సింఫోనీ లైట్లు, పదునైన త్రిభుజాకార ముఖాకృతికలిగిన ఐ.ఎం.పి బాంక్ ఆఫ్ చైనా టవర్ ఉన్నాయి. ఎంపోరిస్ వెబ్‍సైట్ హాంగ్ కాంగ్ ఆకాశసౌధాల సమూహ దృశ్యం ఇతర ప్రపంచ నగరాలకు ధీటైన ప్రభావవంతమైనదని అభిప్రాయపడింది. తరచుగా హాంగ్ కాంగ్ నగర ఆకాశసౌధ సమూహం ప్రపంచంలో అత్యుత్తమమైనదిగా భావించబడుతుంది. కొడల నడుమ వికోటిరియా రేవు ఆకాశసౌధాల సౌందర్యం కలసి హాంగ్ కాంగ్ అందం ఇనుమడింపజేస్తున్నాయి. 19 , 20 వ శతాబ్ద ఆరంభంలో నిర్మించబడిన " త్సిం షా ట్సుఇ క్లాక్ టవర్", సెంట్రల్ పోలీస్ స్టేషను,, కౌలూన్ అవశేషాలు హాంగ్ కాంగ్ చాత్రిత్రకతను చాటే భవనాలుగా గుర్తింపు కలిగి ఉన్నాయి. హాంగ్ కాంగ్‍లో అనేక అభివృద్ధి ప్రణాళికలు రూపుదిద్దుకొంటున్నాయి. ప్రభుత్వ భవన నిర్మాణం, కేంద్రంలో జలభాగం పునరుద్ధరణ, కోలూన్ పడమటి భాగంలో వరుస నిర్మాణ ప్రణాళికలు వంటివి కొన్ని. కోలూన్‍లో విక్టోరియా రేవు ఎదురు తీరంలో ఆకాశసౌధ నిర్మాణం వంటివి భవనాల ఎత్తు విషయంలో నిబంధనలకు లోబడి నిర్మించాలని భావిస్తున్నారు.

రవాణా

[మార్చు]

హాంగ్ కాంగ్ రవాణా వసతులు అధికంగా అభివృద్ధి చెందినవి. 90% (మిలియన్లు) కంటే అధికంగా ప్రజలు ప్రభుత్వ వాహనాలలో ప్రయాణం చేస్తుంటారు. మాస్ ట్రాంసిస్ట్ రైల్వే (ఎం టి ఆర్) ముందుగా చెల్లింపు విధానంలో గుర్తింపు అక్టోపస్ కార్డులను పంపిణీ చేతుంది. ఈ కార్డులను ఉపయోగించి రైలు, బసు, ఫెర్రీలలో ప్రయాణం చేయ్డానికి వీలు ఔతుంది. నగరంలోని ప్రధాన రైల్వే (కే సి ఆర్ సి ) సంస్థ ఎం టి ఆర్‍తో మిళితం చేయబడడం వలన మొత్తం ప్రదేశంలో ఏకీకృత ప్రయాణవసతులు ఏర్ప్డడానికి సాధ్యమైంది. ఎం టి ఆర్ రాపిడ్ ట్రాంసిస్ట్ 152 స్టేషనులతో రోజుకు 3.4 మిలియన్ల ప్రజలకు ప్రయాణసౌకర్యం కలిగిస్తుంది. 1904 నుండి ప్రయాణ సేవలు అందిస్తున్న హాంగ్ కాంగ్ ట్రాంవేలు హాంగ్ కాంగ్ ద్వీపం ఉత్తర భాగంలో ప్రయాణించడానికి అనువైన వసతులు కల్పిస్తుంది.

హాంగ్ కాంగ్ బసులను నడిపే విశేషాధికారం ప్రైవేటు సంస్థకు ఇవ్వబడుతుంది. ఈ అధికారాన్ని కలిగి ఉన్న 5 ప్రైవేట్ యాజమాన్య సంస్థలు మొత్తం ప్రదేశంలో 700 బసులను నడుపుతున్నాయి. వీటిలో పెద్ద సంస్థ అయిన కోలూన్ మోటర్ బసులు కోలూన్, న్యూటెర్రిటరీలలో 402 మర్గాలలో బసులను నడుపుతున్నాయి. హాంగ్ కాంగ్ ద్వీపంలో సిటీబసులను 154 మార్గాలలో నడుపుతున్నారు. రెండూ హార్బర్ సేవలను అందిస్తున్నాయి. హాంగ్ కాంగ్‍లో 1949లో డబల్ డెక్కర్ బసులను పరిచయం చేసారు. ఇప్పుడు అధికంగా డబల్ డెక్కర్ బసులనే నడుపబడుతున్నాయి. సింగల్ డెక్కర్ బసులను తక్కువ రద్దీ కలిగిన మార్గాలలో, తక్కువ బరువును మాత్రమే అనుమతించే మార్గాలలో నడుపుతున్నారు. తేలికపాటి ప్రభుత్వ బసులను హాంగ్ కాంగ్ లోని బసులను స్టాండర్డ్ బసులు చేరుకోలేని, తరచుగా లేక నేరుగా లభ్యంకాని మార్గాలలో నడుపుతుంటారు.

1888లో స్థాపించబడిన ది స్టార్ ఫెర్రీ సర్వీసు విక్టోరియా హార్బర్ చేరుకునేలా 4 మార్గాలలో ఫెర్రీలను నడుపుతుంది. ఈ ఫెర్రీలలో ప్రయాణిస్తూ హాంగ్ కాంగ్ ఆకాశసౌధ సమూహాలను వీక్షించే వీలు కల్పిస్తుంది. ఈ ఫెర్రీలలో ఒకరోజుకు 53,000 మంది ప్రయాణిస్తుంటారు. ది వరల్డ్ ఆఫ్ సూజీ వాంగ్ నవలలో ఈ ఫెర్రీ ప్రయాణాలు చోటుచేసుకోవడంతో ఈ ఫెర్రీ ప్రయాణాలు ప్రపంచంలో విశిష్ట స్థానం సంపాదించుకున్నాయి. పర్యాటక రచయిత రాయన్ లెవిట్ సెంట్రల్ తీరంలోని ప్రధాన " త్సిం షా ట్సుయి " ప్రయాణం ప్రపంచంలోనే అతి సుందరమైనదని పేర్కొన్నాడు. ఇతర ఫెర్రీలు సముద్రాంతర ద్వీపాలైన న్యూటౌంస్, మాక్యూ, రిపబ్లిక్ చైనాలోని ప్రధాన నగరాలకు ఫెర్రీ సేవలు అందిస్తున్నాయి. హాంగ్ కాంగ్ చిరుతితిండి తింటూ హార్బర్ ప్రయాణాలు చేయడానికి పేరుపొందినది. సుదూర నివాసాలకు తీసుకు వెళ్ళడానికి కై-టు అనే చిన్న ఫెర్రీలను నడుపుతుంటారు. రద్దీ డీప్ వాటర్ హార్బర్ అయిన హాంగ్ కాంగ్ హార్బర్‍ కంటైనర్ రవాణాకు ప్రసిద్ధిచెందినది.

నిటారైన కొండలతో నిండిన హాంగ్ కాంగ్ ప్రాంతంలో ఆరంభంలో సెడాన్ చైర్స్ (పల్లకీ) సేవలను అందిస్తూ వచ్చారు. 1888 నుండి సెంట్రల్, వికోరియా పీక్ వరకూ నడుపబడిన "ది పీక్ ట్రాం " హాంగ్ కాంగ్ మొదటి ప్రభుత్వరవాణా సదుపాయంగా భావించబడుతుంది. సెంట్రల్, పడమటి జిల్లాలలో విస్తారంగా ఎస్కలేటర్ సిస్టం, మూవింగ్ పేవ్‍మెంట్ (కదిలే బాటలు ) విధానాలు ప్రపంచంలోనే అతిపెద్ద ఔట్ డోర్ కవర్డ్ ఎస్కలేటర్ సిస్టంగా ప్రత్యేకత సంపాదించుకున్నది.

ఆసియాలోనే హాంగ్ కాంగ్ అంత్ర్జాతీయ విమానాశ్రయం ముఖ్యమైన ప్రయాణీకుల ప్రవేశద్వారం, లాజిస్టిక్ హబ్‍గా పేరుపొందింది. ప్రయాణీకులు, కార్గో సేవలందిస్తున్న రద్దీ అయిన విమానాశ్రయంగా హాంగ్ కాంగ్ విమానాఅశ్రయం ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది. 2007 లో హాంగ్ కాంగ్ విమానాశ్రయం నుండి 47 మిలియన్ల ప్రయాణీకులకులు ప్రయాణించగా కార్గో ద్వారా 3.74 మిలియన్ల సరుకులు రవాణా చెయ్యబడ్డాయి. 1988 కోలూంలో ఉన్న కాయ్ తక్ విమానాశ్రయం రూపు రేఖలను మార్చి అనేక సర్వేలలో ప్రపంచంలో ఉత్తమ విమానాశ్రయంగా గుర్తించబడింది. ఈ విమానాశ్రయాన్ని 85 కంటే అధికమైన ఎయిర్ లైంస్ టూ- టెర్మినల్ గా ఉపయోగించుకుంటున్నారు. కేథీ పసిఫిక్, డ్రాగన్ ఎయిర్, ఎయిర్ హాంగ్ కాంగ్, హాంగ్ కాంగ్ ఎయిర్ లైంస్, హాంగ్ కాంగ్ ఎక్స్‍ప్రెస్ వంటి సంస్థలకు హాంగ్ కాంగ్ విమానాశ్రయం ప్రధాన మార్గంగా ఉపయోగపడుతుంది.

మూలాలు

[మార్చు]
  1. Since the transfer of sovereignty in 1997, Hong Kong has used the national anthem of the People's Republic of China.
  2. Historically, the capital of Hong Kong territory was Victoria City; government headquarters are located in the Central and Western District (22°17′N 114°08′E / 22.283°N 114.133°E / 22.283; 114.133).
  3. The Hong Kong Basic Law states that the official languages are "Chinese and English." It does not explicitly specify the standard for "Chinese". While Standard Mandarin and Simplified Chinese characters are used as the spoken and written standards in mainland China, Cantonese and Traditional Chinese characters are the long-established de facto standards in Hong Kong. See Bilingualism in Hong Kong