మయన్మార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ప్యి-డువాంగ్-జు మ్యాన్-మా నైంగ్-న్గాన్-డావ్
మయాన్మార్ యూనియన్
Flag of మయన్మార్ మయన్మార్ యొక్క చిహ్నం
జాతీయగీతం
కాబా మా క్యెయీ
మయన్మార్ యొక్క స్థానం
మయన్మార్ యొక్క స్థానం
రాజధానిNaypyidaw1
19°45′N 96°12′E / 19.750°N 96.200°E / 19.750; 96.200
అతి పెద్ద నగరం యాంగోన్ (రంగూన్)
అధికార భాషలు బర్మీస్
ప్రభుత్వం Military junta
 -  Chairman of the State Peace and Development Council Than Shwe
 -  Prime Minister en:Soe Win
 -  Acting Prime Minister Thein Sein
స్థాపితము
 -  Pagan Kingdom 849-1287 
 -  Toungoo Dynasty 1486-1752 
 -  Konbaung Dynasty 1753-1885 
 -  యునైటెడ్ కింగ్డం నుండి స్వాతంత్ర్యం జనవరి 4 1948 
విస్తీర్ణం
 -  మొత్తం 676,578 కి.మీ² (40వది)
261,227 చ.మై 
 -  జలాలు (%) 3.06
జనాభా
 -  జూలై 2005 అంచనా 50,519,000² (24వది)
 -  1983 జన గణన 33,234,000 
 -  జన సాంద్రత 75 /కి.మీ² (119th)
193 /చ.మై
జీడీపీ (PPP) 2005 అంచనా
 -  మొత్తం $93.77 బిలియన్ (59వది)
 -  తలసరి $1,691 (150వది)
మా.సూ (హెచ్.డి.ఐ) (2005) Increase0.581 (medium) (130వది)
కరెన్సీ క్యాట్ (K) (mmK)
కాలాంశం MMT (UTC+6:30)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .mm
కాలింగ్ కోడ్ +95
1 Some governments recognize Yangon as the national capital.
2 Estimates for this country take into account the effects of excess mortality due to AIDS; this can result in lower life expectancy, higher infant mortality and death rates, lower population growth rates, and changes in the distribution of population by age and sex than would otherwise be expected.

మయన్మార్ లేదా బర్మా ఆగ్నేయాసియా దేశలలో ఒకటి. బర్మాదేశానికి భారతదేశం, బంగ్లాదేశ్, చైనా, లావోస్, థాయ్‌లాండ్ దేశాలు సరిహద్దు దేశాలుగా ఉన్నాయి. మొత్తం సరిహద్దు 1,930 కిలోమీటర్ల (1,200) పొడవులో మూడవ వంతు అడ్డంకులు లేని బంగాళా ఖాతం, అండమాన్ సముద్రతీరం ఉన్నాయి. దక్షిణాసియా దేశాలలో ఇది పొడవులో 2వ స్థానంలో ఉంది. బర్మా జనసాంద్రతలో ప్రపంచంలో 24వ స్థానంలో ఉంది. బర్మా జనసంఖ్య సుమారు 5.88 కోట్లు.

దక్షిణాసియాలో ప్రాచీన నాగరికత కలిగిన దేశాలలో బర్మా ఒకటి. బర్మాలో ప్యూ, మాన్ లాంటి ప్రాచీన నాగరికతలు వర్ధిల్లాయి. సా.శ. 9వ శతాబ్దంలో ఇర్రవడ్డి లోయల ఎగువభాగానికి బర్మన్స్ సామ్రాజ్యమైన నాంఝయో ప్రవేశం, సా.శ.1050 లో జరిగిన పాగన్ సామ్రాజ్యపు విస్తరణ కారణంగా బర్మీయుల సంస్కృతి, భాషా ఈ దేశంలో ఆధిక్యత ప్రారంభం అయింది. ఈ సమయంలో థేరవాద బౌద్ధం క్రమంగా ఈ దేశంలో ప్రధాన మతంగా మారింది. 1277-1301 కాలంలో సంభవించిన మంగోలుల దండయాత్ర వలన పాగన్ సామ్రాజ్యం పతనం కావడంతో రాజ్యం ముక్కలుగా అయి చిన్న రాజ్యాలుగా విడిపోయింది. 16వ శతాబ్ధపు రెండవ భాగంలో తౌంగో సామ్రాజ్య అవతరణ వలన తిరిగి సమైక్యం అయింది. అయినా దక్షిణాసియాలో అతి స్వల్ప కాలం పాలన సాగించిన సామ్రాజ్యంగా తౌంగో సామ్రాజ్యం చరిత్రలో నిలిచిపోయింది. 19వ శతాబ్దం ప్రారంభంలో ఈ ప్రాంతాన్ని ఆధునిక బర్మా అలాగే అస్సాం, మణిపూర్ లతో చేర్చి కొంబౌంగ్సామ్రాజ్య ఆధీనంలోకి వచ్చింది. 1824-1885 తరువాత సంభవించిన మూడు వరుస యుద్ధాల అనంతరం బర్మాదేశం బ్రిటిష్ సామ్రాజ్య కాలనీ రాజ్యంగా మారింది.

ఒకప్పుడు భూస్వామ్య వ్యవస్థగా ఉన్న బర్మా దేశంలో బ్రిటిష్ పాలన వలన దేశంలో సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక, పాలనా పరమైన మార్పులను తీసుకు వచ్చింది. 1948లో స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కూడా దేశంలో సంభవించిన అంతర్యుద్ధాల కారణంగా బర్మాదేశం అతి దీర్ఘకాలం అంతర్యుద్ధాలు ఎదుర్కొన్న దేశంగా కూడా చరిత్రలో నిలిచింది. దేశంలో మైరియాడ్ సంప్రదాయ సమూహాల సమరం ఇంకా ముగింపుకు రాలేదు. 1962- 2011 వరకూ దేశం సైనిక పాలనలోనే ఉంది. 2010లో సారస్వతిక ఎన్నికలను నిర్వహించిన తరువాత 2011లో రద్దు చేయబడి ప్రజాపాలన స్థాపించ బడింది.

బర్మా అధిక వనరులు ఉన్న దేశం. అయినప్పటికీ 1962లో జరిగిన ఆర్థిక సంస్కరణల అనంతరం ఆర్థికంగా స్వల్పంగా అభివృద్ధి చెందిన దేశంగా బర్మాదేశం మిగిలి పోయింది. $42.953 బిలియన్లగా ఉన్న బర్మాదేశపు జి డి పి 2.9% సంవత్సరిక అభివృద్ధి మాత్రమే సాధింధించింది. మికాంగ్ రాజ్యాలలో ఇది అతి తక్కువ వృద్ధిరేటు ఇదే. ఇతర దేశాలతో చేరి అమెరికా, కెనడా దేశాలు బర్మాకు ఆర్థిక సాయం ప్రకటించాయి. ప్రంపంచంలో ఆరోగ్య సంరక్షణా స్థితి హీనంగా ఉన్న దేశాలలో బర్మా ఒకటి. ప్రపంచ ఆరోగ్య సంస్థ బర్మా ఆరోగ్య సంస్థను 190వ స్థానంలో గుర్తించింది.

అమెరికా సంయుక్త రాష్ట్రాలు, పలు సంస్థలు బర్మాదేశంలో మనవహక్కుల అతిక్రమణ స్థిరంగా జరుగుతున్నట్లు నివేదించాయి. స్వాతంత్ర్యం లేక పోవడం, బాలకార్మికులు, మానవ రవాణా మొదలైనవి వాటిలో కొన్ని.

నామ చరిత్ర

[మార్చు]

బర్మా, మయన్మార్ అనే పేర్లు అధికంగా ఉన్న బర్మీయులు, బామర్ సాంస్కృతిక ప్రజల వలన వలన వచ్చినవే. మాయన్మార్ సంప్రదాయ సమూహాల వ్రాత రూపం పేరు వలన మయన్మార్ అనే పేరు వచ్చింది. ప్రజలు వ్యవహారికంగా మాట్లాడుకునే బామర్ భాష వలన బర్మా అనే పేరు వచ్చింది. నమోదు చేసుకున్న పేరును బామా లేక మియామా అని పలకబడుతుంది. బ్రిటిష్ పాలనా కాలంలో ఇది బర్మాగా పిలువబడింది.

1989లో సైనిక ప్రభుత్వం అధికారికంగా అనేక ప్రదేశాల ఆంగ్ల రూప నామాలను మార్చింది. ఈ మార్పులలో ఒకటిగా దేశం పేరు కూడా మయన్మార్‌గా మార్చబడింది. కాని ఈ మార్పులు ఇంకా పూర్తిగా ప్రజామోదం పొందబడ లేదు. సైనిక ప్రభుత్వం చేత మార్చబడిన ఈ మార్పులను జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు, దేశాలు దీనిని ఎదిరిస్తూ ఇంకా బర్మా అన్న పేరునే వాడుతున్నారు. ఇతర సంప్రదాయ సమూహాలు కూడా ఈ మార్పును అంగీకరించ లేదు.

అమెరికా సంయుక్తదేశాలు, ఆస్ట్రేలియా, కెనడా, యునైటెడ్ కింగ్డమ్ బర్మా అన్న పేరునే వాడుతున్నాయి. యునైటెడ్ నేషన్స్, దక్షిణ ఆసియా దేశాలు, జర్మనీ, నార్వే, చైనా, ఇండియా, బ్రెజిల్, జపాన్ దేశాలు మయన్మార్‌ను ఉపయోగిస్తున్నాయి.

చరిత్ర

[మార్చు]

పూరాతత్వ శాస్త్రజ్ఞులు సాక్ష్యాల ఆధారంగా బర్మా ప్రాంతాలలో 750,000 సంవత్సరాలకు పూర్వం ఆదిమానవుడు (హోమో ఎరెక్టస్) నివసించినట్లు భావించబడుతుంది. అలాగే ఆదిమానవులైన హోమో సేపియన్లు క్రీ.పూ 11,000 సంవత్సరాల మునుపే నివసించబడినట్లు భావించబడుతుంది. ఆదిమానవుడు పాతరాతి యుగంలో మొక్కలు, జంతువుల పెంపకం అలవాటు చేసుకుని జీవించిన ఆధారంగా ఇక్కడ మెరుగు పెట్టబడిన రాతి పని ముట్లు ఇక్కడ కనిపించాయి. క్రీ.పూ 1500 సంవత్సరాల నాటికి ఈ ప్రాంతంలోని ప్రజలు రాగి, ఇత్తడి వాడకం, బియ్యం ఉత్పత్తి అలాగే కోళ్ళు పందుల పెంపకం పెంచడం ఆరంభించారు. వీరు ప్రపంపంచంలోని ప్రథమ మానవులని భావిస్తున్నారు. క్రీ.పూ 500 నాటికి ఇనుప యుగం ఆరంభం అయింది. ప్రస్తుతపు మండలే దక్షిణ ప్రాంతంలో ఇనుప పని ఒప్పందాలు మొదలైనాయి. క్రీ.పూ 500- 200 సమయంలో పెద్ద గ్రామాలు, చిన్న నగరాలలో బియ్యం తయారీ ఒప్పందాలు కూడా చేసుకుని పరిసర ప్రాంతాలలో చైనాతో కూడా చేర్చి వాటిని విక్రయించిన సాక్ష్యాధారాలు కూడా లభ్యం అయ్యాయి.

క్రీ.పూ 2వ శతాబ్దంలో మొదటగా గుర్తింపబడిన నగరాలు బర్మా దేశపు మధ్యభాగంలో మొలకెత్తినట్లు భావిస్తున్నారు. టిబెట్టన్ - బర్మా మాట్లాడే ప్యూ నాగరిక సమూహాలు దక్షిణదిశగా వలస వచ్చిన కారణంగా నగరాలు రూపుదిద్దుకున్నాయని తెలిపే ఆధారాలు యున్ననన్‌లో ఉన్నాయి. ప్యూ సాంస్కృతిక ప్రజలు భారతదేశంతో అధికంగా వ్యాపార సంబంధాలతో ప్రభావితులైయారు. అలాగే బౌద్ధమతాన్ని దిగుమతి చేసుకోవడమే కాక సాంస్కృతిక, వాస్తురూప, రాజకీయ వ్యూహాలతో వారిని ప్రభావితులని చేసాయి. ఆది తరువాత బర్మీయుల సంస్కృతి, రాజకీయ సంస్థల మీద కూడా శాశ్వతమైన ప్రభావం చూపింది. సా.శ.78లో ప్రపంచమంతా చుట్టిన గ్రీకు యాత్రికుడు భారతదేశం నుంచి చైనా వరకూ బర్మా మీదుగా వ్యాపారమార్గం ఉండేదని వ్రాశారు. 3వ శతాబ్దిలో భారతదేశం నుంచి అస్సాం, బర్మాల మీదుగా చైనాకు మార్గం ఉండేదని చంపా అనే శాసనం ద్వారా తెలుస్తోంది. సా.శ.5వ శతాబ్దిలో ఇండోచైనాలో చంపా, కాంబోజ అనే ప్రాంతాల్లో హిందూ రాజ్యాలు నెలకొన్నాయి. 5వ శతాబ్ది నాటి వ్యు శాసనం నుంచి అంతకు రెండు మూడువందల యేళ్ళకు పూర్వమే హిందూమతం వ్యాపించిందన్న విషయం తెలుస్తోంది. సంస్కృత, ప్రాకృత భాషల్లోని అనేకమైన పదాలు కూడా ఇక్కడి భాషల్లోకి వచ్చి చేరాయి. ఆపైన మహాయాన బౌద్ధం కూడా బర్మాలో ప్రవేశించింది. సా.శ.450లో హీనయానబౌద్ధ బోధకుడైన బుద్ధఘోషుడు ఈ ప్రాంతంలో మతప్రచారం చేశారు.[1] క్రీ. శ 9వ శతాబ్దానికి పలు నగరాలు ఈ ప్రాంతమంతా మొలకెత్తాయి. మెట్టప్రాంతాలైన బర్మా మధ్య ప్రదేశంలో ప్యూ జాతీయుల నగరాలు సముద్రతీర ప్రాంతంలో మాన్ జాతీయులు, పడమటి తీరప్రాంతాలలో ఆర్కనాస్ జాతీయుల నగరాలు వెలిసాయి. ప్యూ సంప్రదాయ ప్రజలు సా.శ. 750-830 నిరంతర నంజయో రాజ్యం నుండి ఎదురైన పలు దండయాత్రల కారణంగా నగరాల విస్తరణ దెబ్బతిన్నది. 9వ శతాబ్ధపు మధ్య నుండి చినరి వరకు నంజయోకి చెందిన మార్మా (బర్మా/బామర్) వారు పాగన్ (బెగాన్) వద్ద ఒక ఒప్పందానికి వచ్చారు.

సామ్రాజ్య వ్యవస్థ

[మార్చు]

పాగన్ క్రమంగా చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలను కలుపుకుంటూ విస్తరించింది. ఇలా విస్తరిస్తూ చివరకు 1050-1060 నాటికి అనావ్రహతా పాగన్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఇర్రావడ్డి లోయలో దాని సరిహద్దులలో ఇదే మొదటి సంఘటిత రాజ్యం. దక్షిఆణాసియాలో ప్రధాన భూములలో 12వ -13వ శతాబ్దంలో పాగన్ సామ్రాజ్యం, ఖ్మర్ సామ్రాజ్యం అనేవి ప్రధాన అధికారం కలిగి ఉన్నాయి. ఇర్రవడ్డీ లోయలో బర్మీయుల సంస్కృతి, భాషా క్రమంగా ఆధిక్యత అభివృద్ధి చెందుతూ 12వ శతాబధానికి ప్యూ, మాన్, పాలి నిబంధనలను అధిగమించారు. క్రమంగా గ్రామస్థాయిలో ప్రారంభమైన తెరవాడ బుద్ధిజం తాంత్రికం, మహాయానం, బ్రాహ్మానిక్, అనిమిస్ట్ కార్యక్రమాలు ఈ ప్రాంతమంతా వ్యాపించాయి. పాగన్ పాలకులు, ఐశ్వర్యవంతులు పాగన్ రాజధానిలో మాత్రమే 10,000 బౌద్ధ ఆలయాలు నిర్మించబడ్డాయి. 1277-1301 సంభవించిన వరుస మంగోలియన్ యుద్ధాల వలన 4 శతాబ్ధాల సామ్రాజ్యం 1287 నాటికి పాగన్ పతనం చెందింది.

ప్రారంభంలో 1385-1424 వరకు అవా సాగించిన యుద్ధాలు ఒకే రీతిగా జరిగినా అవి పాత సామ్రాజ్య యుద్ధరీతులకు విరుద్ధంగా సాగాయి. అవా నాయకత్వంలో హాంతవడ్డీ తన స్వర్ణయుగంలో ప్రవేశించింది. తరువాత 350 సంవత్సరాల కాలం అరకాన్ అధిపత్యం కొనసాగింది. తరువాతి కాలంలో పలు రీతులలో నిరంతరం సాగిన యుద్ధాల కారణంగా అవా బాగా బలహీన పడింది. 1481 నాటికి రాజ్యం చిన్నాభిన్నం అయింది. 1527 షాన్ సంయుక్త రాష్ట్రాలు అవా రాజ్యాన్ని జయించి ఎగువ బర్మా ప్రాంతాన్ని 1555 వరకు పాలించారు.

పాగన్ సామ్రాజ్యం లాగా అవా, హంతవడ్డి, షాన్ రాష్ట్రాలలో పలు - సాంస్కృతిక రాజకీయ విధానాలు కొనసాగాయి. ఒక వైపు యుద్ధాలు సాగుతున్నా నాగరికతలూ కొనసగుతూనే ఉన్నాయి. బర్మా నాగరికతలో ఈ సమయం స్వర్ణ యుగంగా భావించబడుతుంది. బర్మీయుల సాహిత్యం ఆత్మవిశ్వాసంతో ప్రజాదరణతో విభిన్న శైలితో అభివృద్ధి చెందింది. రెండవ తరం బర్మీయుల చట్టం పాన్-బర్మా పేరుతో వెలువడ్డాయి. హంతవడ్డీ సామ్రాజ్యం మతసంస్కరణలను ప్రవేశపెట్టాయి. తరువాత అవి దేశమంతా పాకాయి. ఈ కాలంలోనే అద్భుతమైన మ్రౌక్ యు ఆలయాలు అనేకం నిర్మించబడ్డాయి.

తౌంగూ సామ్రాజ్యం

[మార్చు]

పాత అవాలోని అతి చిన్న రాష్ట్రమైన తౌంగో రాజు ప్రయత్నంతో 1580 నాటికి రాజకీయ సమైక్యతతో ఏర్పడిన బేఇన్నౌంగ్ సామ్రాజ్యంలోకి తిరిగి ప్రవేశించింది. 1541 నాటికి యువకుడైన తౌంగో రాజు తబిన్‌ష్వేతి శక్తివంతమైన హంతవడ్డిని ఓడించింది. తరువాత నాయకుడైన బేఇన్నంగ్ షాన్ రాష్ట్రాలు, లాన్ నా, మణిపూర్, చైనీయుల షాన్ రాష్ట్రాలు, లాన్ నా, మణిపూర్, సియామ్, లాన్ క్సాంగ్ అలాగే దక్షిణ అరకాన్ లపై విజయం సాధించి దక్షిణ అసియాలు అతి పెద్ద సామ్రాజ్య స్థాపన చేసాడు. అయినప్పటికీ 1581న బెఇన్నింగ్ మరణంతా 1599 నాటికి ఈ సామ్రాజ్యం భిన్నం అయింది. సియాం తెనాసెరియం, లాన్ క్సాంగ్ లను ఆక్రమించుకుంది. సిరియం (తాన్‌లియిన్) ను పోర్చుగ్రీసు వ్యాపారులు పోర్చుగీసు పాలన ఆధిక్యానికి తీసుకు వచ్చారు.

1613 నాటికి సమ్రాజ్యం తిరిగి సంఘటితమై 1614 నాటికి పోర్చుగీసును ఓడించి చక్కగా నిర్వహించతగిన రాజ్యస్థాపన చేసారు. దిగువ బర్మా, ఎగువ బర్మా, షాన్ స్టేట్స్, లన్ నా, ఎగువ తెనసెరియం మధ్య ఈ రాజ్యం స్థాపించబడింది. పునఃస్థాపిత తుంగో రాజుల చేత వ్యవస్థీకరించబ్సడిన న్యాయ, రాజకీయ వ్యవస్థ లోని ప్రధాన విధనాలు 19వ శతాబ్దం వరకు కొనసాగింది. ఇర్రాడ్‌వెల్లీ అంతటా రాజకిరీటం పూర్తిగా వంశపారంపర్యంగా నియమించబడిన ప్రతినిధుల నిర్వహణలో కొనసాగుతూ షన్ రాజప్రతినిధుల వంశపారంపర్య అధికారాన్ని తగ్గిస్తూ వచ్చారు. ఆ రాజ్యం వ్యాపారం, మతసామరస్య సంస్కరణ విధానాలతో సుభిక్షమైన ఆర్థికప్రగతితో 80 సంవత్సరాల పాలన కొనసాగింది. 1720 నుండి ఈ రాజ్యం తిరిగి ఎగువ బర్మా వద్ద నిరంతర మణిపురి దాడులను లాన్ లా ప్రాంతంలో తిరుగుబాటును ఎదుర్కొన్నది. 1740 నాటికి దిగువ బర్మాలో హంతవడ్డి రాజ్యం తిరిగి స్థాపింపించబడింది. 1752లో హంతవడ్డి అవాను స్వాధీనపరచుకోవడంతో 266 సంవత్సరాల తౌంగూ సామ్రాజ్యపాలన ముగింపుకు వచ్చి హంతవడ్డి సామ్రాజ్యం స్థాపించబడింది.

అలౌంగ్‌పాయా

[మార్చు]

అవా పతనం తరువాత అలౌంగ్‌పాయా యొక్క కొన్‌బౌంగ్ సామ్రాజ్యం 1759లో పునఃస్థాపితమైన హంతవఅడ్డిని ఓడించి మొత్తం బర్మాను తిరిగి సంఘటితం చేసి హంతవడ్డికి ఆయుధసరఫరా చేసిన బ్రిటిష్, ఫ్రెంచి వారిని అక్కడి నుండి పంపింది. 1770 నాటికి అలౌంగ్‌పాయా వారసులు లావోస్ (1765) స్వాధీనపరచుకొని, సియాం (1767) ను ఓడించి అలాగే (1765-1769) ల మధ్య జరిగిన నాలుగు చైనా దాడులను సహితం తిప్పికొట్టారు. 1770లో చైనా ఆక్రమిత ప్రాంతాలను సియాం తిరిగి స్వాధీనపరచుకుని 1776లో లన్ లాను స్వాధీనపచుకొన్నది. బర్మా, సియాం 1855 వరకు సాగించిన యుద్ధల పర్యవసానంగా తెనసెరియాన్ని బర్మా లాన్ లాను సియాం లకు ఇచ్చిపుచ్చుకొనడం ద్వారా పరస్పరం రాజీ పడ్డారు. శక్తివంతమైన చైనాను ఎదుర్కొని సియాంకు పునరుజ్జీవితం ఇచ్చిన రాజు బోధవ్పాయా తన దృష్టిని పడమట వైపు సారించి అర్కన్ (1785), మనిపూర్ (1884), అస్సాం (1817) లను తన రాజ్యంలో చేర్చుకున్నాడు. బర్మా చరిత్రలో ఇది రెండవ పెద్ద సామ్రాజ్యంగా పేరు పొందినా బ్రిటిష్ ఇండియా సరిహద్దులను కాపాడడంలో చాలా కాలం వరకు బలహీనంగానే ఉండిపోయింది. ఈ సామ్రాజ్యపు వైశాల్యం కొంతకాలంలోనే క్షీణించసాగింది. బర్మా మొదటి ఆంగ్లో బర్మా యుద్ధంలో (1824-1826) లో సంభవించిన అర్కాన్, మణిపూర్, అస్సాం, తెనసెరియం లను కోల్పోయింది. రాజు మిండన్ రాజ్యాన్ని ఆధునికం చెయ్యడానికి ప్రయత్నించాడు.

కన్‌బౌంగ్ రాజులు తౌంగో సంస్కరణలను కొనసాగించి లోపలి పరిస్థితులను స్వాధీనానికి తెచ్చుకొని దానిని వెలుపలికి విస్తరించింది. చరిత్రలో మొదటి సారిగా బర్మాభాష, సంస్కృతి మొత్తం ఇర్రవడ్డి వెల్లీలో ఆధిక్యతను సాధించింది. బర్మా సాహిత్యం, నాటకరంగంలో విప్లవాత్మ మార్పులతో అభివృద్ధి కొనసాగి పురుషుల అక్షరాస్యత 50% స్త్రీల అక్షరాస్యత 5% ప్రతిని సాధించింది. అయినప్పటికీ ఈ సంస్కరణలు బ్రిటిష్ కాలనిజంతో పోటీ పడడంలో విఫలమయ్యాయి.

బ్రిటిష్ కాలనీ శకం

[మార్చు]

మాండలే పతనంతో బర్మా మొత్తం బ్రిటిష్ పాలనలోకి వచ్చింది. బ్రిటిష్ పాలనా కాలం అంతా అనేక మంది భారతీయులు సైనికులుగా మారి రాజ్య నిర్వహణా సేకులుగా, నిర్మాణ పనివారిగా వ్యాపారులుగా ఆంగ్లో - బర్మీస్ సమాజంతో బర్మా చేరి బర్మీయుల మీద వాణిజ్య, సాంస్కృతిక ఆధిక్యత సాధించారు. రంగూన్ బ్రిటిష్ బర్మా రాజధనిగా అలాగే కలకత్తా, సింగపూరుల మధ్య ప్రధాన రేవు పట్టణంగా తయారైంది.

బర్మీయుల ఆగ్రహం శక్తివంతమై యాంగన్ వద్ద విప్లవరూపందాల్చి అది 1930 వరకు కొనసాగింది. బర్మీయుల సంస్కృతిని అగౌరవపరచడం కూడా విప్లవానికి కొంత కారణం అయింది. కొంత మంది బ్రిటిష్ వారు పగోడాలలో ప్రవేశించే సమయంలో తమ బూట్లను తీసివేయడానికి నిరాకరించడం కూడా ఇందులో ఒక కారణం అయింది. బర్మా సన్యాసులు స్వాతంత్ర్య సమరంలో ప్రధాన పాత్ర వహించారు. స్వాతంత్ర్య సమర యోధుడు అయిన యు విసార జైలులో తన బర్మా సన్యాసులు ధరించే వస్త్రాలను ధరించడానికి విధించిన నిషేధానికి నిరసనగా 166 రోజుల నిరాహార దీక్ష చేసిన అనంతరం కారాగారంలోనే తన ప్రాణాలను కోల్పోయాడు.

1937 ఏప్రిల్ 1 నాటికి బ్రిటిష్ కాలనీలలో బర్మా ప్రత్యేక పలనా నిర్వహిత కాలనీగా మారి బా మా ప్రీమియర్ బర్మాకు మొదటి ప్రధానమంత్రిగా నియమించబడ్డాడు. బర్మా స్వతంత్రపాలన కోప్రుతూ బర్మా పాలనలో బ్రిటిష్ జోక్యాన్ని ఎదిరిస్తూ బా మా ప్రదర్శించిన తిరుగుబాటు దోరణ II ప్రపంచ యుద్ధం వరకు కొనసాగింది. అతడు లెజిస్లేటివ్ శాసనసభకి రాజీనామా చేసి తిరుగుబాటు కొరకు ఖైదు చేయబడ్డాడు. 1940లో జపన్ రెండవ ప్రపంచ యుద్ధంలో నేరుగా పాల్గొనడానికి ముందు ఆంగ్ సాన్ నాయకత్వంలో జపాన్‌లో బర్మా స్వాతంత్ర్య సేన రూపుదిద్దుకున్నది.

ప్రధాన యుద్ధభూమిగా రెండవ ప్రపంచ యుద్ధంలో చాలా వరకు నాశనం అయింది. వరు యుద్ధంలో ప్రవేశించిన కొన్ని మాసాలకే 1942 మార్చి నాటికి బర్మాసైన్యాలు రంగూన్ వరకు ఆక్రమించుకున్న తరువాత బర్మాలో బ్రిటిష్ పాలన పతనం అయింది. 1942 జపానీయులు బా మా నాయకత్వంలో రాజ్యస్థాపన చేసారు. 1942-1944 వరకు సంయుక్త సైన్యాలు సాగించిన నిరంతర అపరధల కారణంగా 1945 నాటికి బర్మాలో జపాన్ పాలనకు తెర పడింది. తీవ్రమైన యుద్ధాల కారణంగా బర్మా నిస్సారంగా నిలిచింది.

బర్మీయులు అనేకులు జపాన్ తరఫున యుద్ధం సాగించగా మరి కొందరు బర్మీయులు అల్ప వర్గీయులు బ్రిటిష్ బర్మా సైన్యాలకు మద్దతుగా నిలిచారు. బర్మా సాతంత్ర్య సైన్యం, అర్కాన్ జాతీయ సైన్యం కలిసి జపాన్ సైన్యంతో 1942-1944 వరకు యుద్ధం సాగించి 1945 లో బర్మా సైన్యాలకు విధేయత చూపుతూ మిత్రత్వం వహించారు.

రెండవ ప్రపంచయుద్ధానంతరం ఆంగ్ సాన్ మధ్యవర్తిత్వంతో సంప్రదాయ సమూహాల నాయకులతో ఒప్పందం కుదిరిన తరువాత బర్మా స్వాతంత్ర్యం నిర్ధారించబడి బడి సంయుక్త బర్మా అవతరించింది. 1947లో ఆంగ్ సాన్ బర్మకు దేఫ్యూటీ ఛైర్మన్‌గా నియమించబడ్డాడు. అయినా 1947లో రాజకీయ ప్రతిపక్షాలు ఆంగ్ సాన్ను పలువురి కాబినెట్ సభ్యులతో సహా హత్యకు గురి చేసారు.

సైనిక పాలన

[మార్చు]

నె విన్ కాలం

[మార్చు]

1962 మార్చి న, జనరల్ నే విజయాలు నేతృత్వంలోని సైనిక బలప్రయోగ విప్లవం ద్వారా బర్మా పలనాధికారం చేజిక్కించుకున్నారు. తరువాత ప్రభుత్వం అప్పటి నుండి సైనిక పాలన అధికారంలో ప్రత్యక్ష లేదా పరోక్ష నియంత్రణలో ఉంది. 1962, 1974 మధ్య, బర్మా ప్రజల సాధారణ నేతృత్వంలోని ఒక విప్లవ మండలి పరిపాలన, సమాజం యొక్క దాదాపు అన్ని అంశాలను (వ్యాపార, మీడియా, ఉత్పత్తి) కలిపి బర్మీస్ వే టొ సోషలిజం (సోవియట్ శైలి సొషలిజం) పేరుతో జాతీయ లేదా ప్రభుత్వ నియంత్రణ క్రిందకు తెచ్చారు. బర్మా సంప్రదాయాలకు విలువనిచ్చే ప్రభుత్వ విధానాల అమలుతో కూడిన జాతీయం, కేంద్ర ప్రణాళిక అమలుకు వచ్చింది.

కాన్సిటిట్యూషన్ ఆఫ్ సోషలిస్ట్ రిపబ్లికన్ పార్టీ పేరుతో ఒక కొత్త రాజ్యాంగం 1974-1988 వరకు పరిపాలన సాగించింది. 1988లొ సైనికాధికారులు రాజీనమా చేసి ఏకపార్టీ పలన విధనంతో బర్మా సోషలిస్ట్ ప్రోగ్రామ్ పార్టీ పేరుతో ఒక రాజకీయ పర్టీని స్థాపించి పాలన సాగించింది. ఈ సమయంలో ప్రపంచంలో అత్యంత పేద దేశాలాలలో బర్మా ఒకటిగా మారింది.

నే విన్ పలనా కాలంలో అక్కడ విడివిడిగా ఉన్న నిరసనలు బలవంతంగా అణిచివేయబడ్డాయి. 1962 జూలై 7 ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు చెసినందుకు రంగూన్ విశ్వవిద్యాలయం విద్యర్ధులను 15 మందిని కాల్చి వేసారు. 1974 లో, సైనిక బలంతో యూ థాంట్ యొక్క అంత్యక్రియలకు ప్రభుత్వవ్యతిరేక నిరసనలు తెలియజేస్తున్న ప్రదర్శకులను హింసాత్మకంగా అణచివేశారు. 1975, 1976, 1977 లో విద్యార్థి నిరసనలు త్వరగా అఖండమైన శక్తి ద్వారా అణచివెయ్యబడ్డాయి.

ఎస్ పి డి సి పాలన

[మార్చు]

1988 లో, ప్రభుత్వం ఆర్థికపరమైన అసమర్ధత, రాజకీయ అణచివేతకు ఫలితంగా దేశ వ్యాప్తంగా విస్తృత మైన ప్రజాస్వామ్య అనుకూల ప్రదర్శనలు జరగడానికి దారితీసింది అశాంత పరిస్థితితి 8888 తిరుగుబాటు అని పిలుస్తారు . భద్రతా దళాలు ప్రదర్శనలపై వేలాది మంది ప్రజాస్వామ్య ప్రదర్శకులను చంపివేసింది, జనరల్ మౌంగ్ ఒక బలప్రయోగ విప్లవం ప్రదర్శించాడు అలాగే అప్పటికి అమలులోఉన్న న్యాయవ్యవస్థకు బదులుగా లా, ఆర్డర్ పునరుద్ధరణ కౌన్సిల్ (ఎస్ ఎల్ ఒ ఆర్ సి ) ఏర్పాటు చేసాడు. విస్తృత నిరసనల తరువాత 1989 లో, ఎస్ ఎల్ ఒ ఆర్ సి మార్షల్ లా యుద్ధ చట్టం ప్రకటించింది. సైనిక ప్రభుత్వం 1989 మే 31 న పీపుల్స్ శాసనసభ ఎన్నికలకు ప్రణాళికలు ఖరారు చేసారు.1989 లో ఎస్ ఒ ఎల్ ఆర్ సి " సోషలిస్ట్ రిపబ్లిక్ ఆఫ్ ది యూనియన్ ఆఫ్ బర్మా" అనే ఆంగ్ల నామాన్ని " మయాన్మార్ యొక్క యూనియన్ " అనే పేరుకి మార్చింది.

1990 మే లో, ప్రభుత్వం దాదాపు 30 సంవత్సరాల మొదటి సారిగా స్వతంత్ర ఎన్నికలు నిర్వహించబడి ఔంగ్ సాన్ సూ రాజకీయ పార్టీ డెమోక్రసీ జాతీయ లీగ్ (ఎన్ ఎల్ డి) మొత్తం 489 స్థానాలలో 392 స్థానాలు స్వాధీనం చేసుకున్నది. అయినా అధికారం ఇవ్వడానికి నిరాకరించిన సైనిక ప్రభుత్వం 1997 వరకు ఎస్ ఎస్ ఒ ఆర్ సి ఆధ్వర్యంలోనే దేశపాలన కొనసాగించింది. అనంతరం 2011 మార్చిలో సైనిక ప్రభుత్వం రద్దు అయ్యే వరకు రాష్ట్రం పీస్ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్ (SPDC) గా పాలన సాగించింది.

1997 జూన్ 23 న, బర్మాను ఆగ్నేయ ఆసియా దేశాల (ఆసియన్ ) అసోసియేషన్ ఆఫ్ లోకి చేర్చారు. 2006 మార్చి 27 న, 2005 నవంబరులో సైనిక ముఠా జాతీయ రాజధాని యాంగాన్ నుండి ప్యిన్మన సమీపంలో ఒక ప్రదేశానికి మార్చబడింది. కొత్త రాజధాని అధికారికంగా నైపీడాగా మార్చబడింది. నైపీడా అంటే " రాజులు నగరం" అని అర్ధం.

2007 ప్రభుత్వ వ్యతిరేక అభిప్రాయ ప్రకటన

[మార్చు]

2007 ఆగస్టులో ప్రభుత్వం కఠినముగా నిర్వహించిన డీజిల్, పెట్రోల్ ధర పెరుగుదల చేసిన వ్యతిరేక ప్రభుత్వం వరుస నిరసనలకు దారితీసింది. ఈ నిరసనలు క్రమంగా సివిల్ రెసిస్టెన్స్ (పౌర విరోధం ) గా మరింది. దీనిని కాషాయ విప్లవం అని కూడా పిలిచారు. వందలాది బౌద్ధ సన్యాసులు నేతృత్వంలో ప్రజాస్వామ్యం న్యాయవాది ఔంగ్ సాన్ స్యు గృహ నిర్భంధాన్ని నిరసిస్తూ ఆమెను గౌరవవిస్తూ ఆమె ఇంటి గేట్ వద్ద తమ నిరసన వ్యక్తం చేసారు. ప్రభుత్వం చివరకు 2007 సెప్టెంబరు 26 న అణిచివేత కార్యక్రమాన్ని ష్వెడగాన్ గోపురం వద్ద కఠినంగా నిర్వహించి బౌద్ధ సన్యాసులను మరణానికి గురి చేసింది. బర్మీస్ సైనికాధికారులలో విభేదాలు తలెత్తినట్లు పుకార్లు కుడా వెలుగు చూసాయి.

2008 మే లో, సంభవించిన నర్గిస్ తుఫాను జనసాంద్రత కలిగిన ఇర్రాడ్ వెల్లీ వరి-వ్యవసాయ డెల్టాలో విస్తృతమైన నష్టాన్ని కలిగించింది. బర్మీస్ చరిత్రలో హీనమైన సహజ విపత్తు అని వర్ణించబడిన ఈ తుఫానులో మణించిన లేక తప్పి పోయిన వారి సంఖ్య 200,000 మంది. ఆస్తి నష్టం 10 బిలియన్ డాలర్లు (యు ఎస్ డి), 1 మిలియన్ల కంటే అధికమైన వారు నిరాశ్రయులు అయ్యారు. ఈ ఉపద్రవం తరువాత ఎదురైన క్లిష్టమైన పరిస్థితిలో అలీన విధానాలను అనుసరితూ ఒంటరి అయిన బర్మా ప్రభుత్వ మరుగైన విధానల కారణంగా ఐక్యరాజ్యసమితి నివారణగా ప్రకటించిన ఆహారం, ఇతర అవసర వస్తువుల విమానాలు దేశంలో ప్రవేశించడానికి జాప్యం జరిగింది.

2009 ఆగస్టు లో, కోకంగ్ సంఘటనగా గుర్తించిన ఒక సంఘర్షణ ఉత్తర బర్మాలో షాన్ లో నివసిస్తున్న వారిలో విభేదాలకు దారి తీసింది. చాలా వారాలు కొనసాగిన ఈ యుద్ధంలో జుంటా బృందాలు హాన్ చైనీస్, కాచిన్ అల్పసంఖ్యాకులకు వ్యతిరేకంగా పోరాడారు. ఈ పోరాటం ఆరంభంలో 8-12 ఆగస్టు వరకు 10,000బర్మీస్ పౌరులు చైనా పొరుగున ఉన్న యున్నన్ సరిహద్దులకు పారిపోయారు.

2010 ఎన్నికలు, సంస్కరణలు

[మార్చు]

"క్రమశిక్షణతోకూడిన అభివృద్దిని కలిగిన ప్రజాస్వామ్యాన్ని" ఇస్తామ్మన్న వాగ్దానంతో బర్మా రాజ్యాంగబద్ధమైన అభిప్రాయ సేకరణ, 2008, 2008 మే 10 న జరిగింది. అలాగే దేశం పేరు మయాన్మార్ ఆఫ్ యూనియన్ నుండి రిపబ్లిక్ ఆఫ్ మయాన్మార్ అఫ్ యూనియన్ గా మార్చబడింది. కొత్త రాజ్యాంగంలో ఆధ్వర్యంలో ఎన్నికలు 2010 లో జరిగాయి. పరిశీలకులు, అతి శాంతియుతమైనగా 2010 యొక్క ఎన్నికలను రోజు వర్ణించినా విమర్ళకులు, యునైటెడ్ నేషన్స్, పాశ్చాత్య దేశాలు పోలింగ్ కేంద్రంలలో అసమానతలు ఉన్న మోసపూరితమైన ఎన్నికలుగా అభివర్ణించారు. అధికారిక సభ 77% ఓట్లు నమోదైనట్లు తేలింది. సైనిక-మద్దతుగల యూనియన్ సాలిడారిటీ అండ్ అభివృద్ధి పార్టీ 80% ఓట్లతో గెలుచుకున్నాడు అని పేర్కొని విజయం ప్రకటించింది. ఆ విజయాన్ని ప్రజాస్వామ్యం అనుకూల ప్రతిపక్షాలు సైనిక పాలన విస్తృతంగా బలప్రయోగం చేసి ఇటువంటి ఫలితం మోసంతో సాధించిందని ఉద్ఘాటించింది.

ఎన్నికలు తర్వాత, ప్రభుత్వం ప్రతిపాదించిన వరుస సంస్కరణలను ఆధునిక ప్రజాస్వామ్యం, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ, సయోధ్య వంటి సంస్కరణలు ఉద్దేశాలు ఇప్పటికీ చర్చనీయాంశమే. ఈ సంస్కరణలలో అనుకూల ప్రజాస్వామ్య నాయకుడు ఔంగ్ శాన్ స్యూ కయి గృహ నిర్బంధంలో నుండి విడుదల, నేషనల్ మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు, 200 కంటే ఎక్కువ రాజకీయ ఖైదీలకు విడుదల ప్రస్తావన, కార్మిక సంఘాలు ఏర్పాటు చేసుకోవటానికి సమ్మె చేయటానికి అనుమతించే కొత్త కార్మిక చట్టాలు రూపొందంచడం, పత్రికా విధానాల మీద సడలింపు కరెన్సీ పద్ధతుల నిబంధనల క్రమబద్దీకరణ నంటివి ఉన్నాయి. అంతర్జాతీయ సమాజం మోసపూరిత ఎన్నికలుగా అభివర్ణంచబడిన 2010 ఎన్నికల తరువాత అమలుకు తీసుకురాబడిన ఈ సంస్కరణలు అంతర్జాతీయ సమాజానికి ఆశ్చర్యం కలుగజేసింది.

సంస్కరణలు పరిణామాలు చాలాకాలం సాగిన తరువాత ఎ ఎస్ ఇ ఎన్ సభ్యులు 2014 లో ఎ ఎస్ ఇ ఎన్ స్థానం కోసం బర్మా చేసిన అభ్యర్థ ఆమోదించారు. తరువాత యునైటెడ్ స్టేట్స్ రాష్ట్ర కార్యదర్శి హిల్లరీ క్లింటన్ బర్మాను సందర్శన యాభై సంవత్సరాల అనంతరం రాష్ట్ర ఒక కార్యదర్శి బర్మా సందర్శనగా వర్ణించ బడింది. హిలారీ క్లింటన్ మొదటి సందర్శన తదుపరి పురోగతి ప్రోత్సహించేందుకు 2011 డిసెంబరులో బర్మాను రెండవ మారు సందర్శించన జరిగింది. హిలారీ క్లింటన్ ప్రతిపక్ష నేత డా ఔంగ్ శాన్ స్యూ కయి అలాగే బర్మీస్ అధ్యక్షుడు దిఇన్ సేయిన్ లను కలిసి చర్చలు జరిపింది. ప్రభుత్వం దేశీయంగా చట్టాలు రద్దు చేసిన ఫలితంగా ఎన్ ఎల్ డి నిష్కరమణకు గారితీసంది. అయినా డెమోక్రసీ కోసం ఔంగ్ శాన్ స్యూ కయి యొక్క పార్టీ, నేషనల్ లీగ్-కు ఎన్నికల పాల్గొనేందుకు అనుమతి లభించింది. 1,600 కంటే ఎక్కువ రాజకీయ ఖైదీలను ఇప్పటికీ విడుదల నిలుపివేయబడడం, రాజకీయ అనిశ్చిత పరిస్థితి బర్మా సైనిక దళం, స్థానిక తిరుగుబాటు గ్రూపుల మధ్య ఘర్షణలు ఇంకా కొనసాగడం ఆగలేదు.

సంస్కరణ వాగ్ధానం ఏప్రిల్ 1 ఎన్నికలు బహుశా నిజం చేసాయి. ఔంగ్ శాన్ స్యూ కయి నేతృత్వంలో డెమోక్రసీ జాతీయ లీగ్ 45 స్థానాలలో 43 స్థానాలు గెలుచుకుంది. సీట్లలో తక్కువ భాగం మాత్రమే ఒక ఓటు తేడాతో ఉన్నప్పటికీ, గతంలో చట్టవిరుద్దంమని బావించబడిన న్ ఎల్ డి ఎన్నికల పోరాటానికి అనుమతించబడి మొదటి సారిగా విజయం సాధించింది. అంతర్జాతీయ ఎన్నికల మానిటర్లు ఓటింగ్ మానిటర్ చేయడానికి అనుమతించబడ్డారు. సానుకూల పరిస్థితులు గణనీయంగా ఉన్నప్పటికీ, ఎన్ ఎల్ డి మాత్రం ఎన్నికల రోజు అలాగే ఎన్నికల వరకు జరిగిన మోసం, వేధింపులకు ఓటింగ్ అసమానతల వంటి 50 పైగా సందర్భాలను వెల్లడించింది.

2021 ప్రభుత్వంపై సైన్యం తిరుగుబాటు

[మార్చు]

మయన్మార్‌లో ప్రభుత్వంపై సైన్యం తిరుగుబాటు చేసింది.2020 ఎన్నికలలో అక్రమాలు జరిగాయని మిలిటరీ మద్దతు ఉన్న డెవలప్‌మెంట్‌ పార్టీ ఆరోపించింది. ఆ దేశ మిలటరీ కూడా అదే ఆరోపణలు చేసింది. దీనితో ఆ దేశ మిలటరీ ఒక సంవత్సరం పాటు అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.2020 ఎన్నికలలో ఎన్నికైన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు రోజు తిరుగుబాటు జరిగింది. ప్రెసిడెంట్ విన్ మైంట్, రాష్ట్ర సలహాదారు ఆంగ్ సాన్ సూకీని మంత్రులు, వారి డిప్యూటీలు, పార్లమెంటు సభ్యులతో పాటు నిర్బంధించారు.

భౌగోళికం

[మార్చు]

బర్మాదేశపు మొత్తం వైశాల్యం 678,500 చదరపు కిలోమీటర్లు (262,000 చదరపు మైళ్ళు). దక్షిణ ఆసియా ప్రధాన ప్రదేశంలో ఇది పెద్ద రాజ్యం అలాగే ప్రపంచంలో ఇది 40వ స్థానంలో ఉంది. బర్మా రాజ్యాంగ పరంగా 14 రాష్ట్రాలను 67 జిల్లాలను 330 తాలూకాలు, 2914 వార్డులు, 14,220 మండలాలను 68,290 గ్రామాలను కలిగి ఉంది.

బర్మా వాయవ్యంలో బంగ్లాదేశ్ దేశానికి చెందిన చిటగాంగ్ డివిజన్, భారతదేశానికి చెందిన మిజోరాం, మణిపూర్, నాగాలాండ్, అరుణాచల ప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి. బర్మా ఉత్తరం, ఈశాన్య సరిహద్దులలో టిబెట్, చైనాకు చెందిన యున్నన్ రాష్ట్రాలు ఉన్నాయి. చైనా బర్మన్ సరిహద్దుల మొత్తం పొడవు 2,185 కిలోమీటర్లు (1,358 మైళ్ళు). బర్మా ఆగ్నేయం సరిహద్దులో లావోస్, థాయిలాండ్ దేశాలు ఉన్నాయి. బర్మా దేశానికి మొత్తం 1,990 కిలోమీటర్ల (1,200 మైళ్ళు) పొడవైన సముద్రతీరం ఉంది. ఈ సముద్రతీరం ఒక వైపు బంగాళాఖాతం మరొక వైపు నైరుతీ దిశలో అండమాన్ సముద్రం ఉన్నాయి. ఇది దేశపు మొత్తం సముద్రతీరంలో నాల్గవ వంతు పొడవు ఉంది.

బర్మా చైనా సరిహద్దులలో ఉత్తరంలో హెంగ్‌ద్యుయాన్ షాన్ పర్వతాలు ఉన్నాయి. బర్మాదేశపు అత్యధిక ఎత్తైన ప్రదేశంగా భావించబడుతున్న హకకబొ రాజి కచిన్ రాష్ట్రంలో ఉంది. ఇది సముద్రమట్టానికి 5,881 మీటర్లు (19,295 అడుగులు) ఎత్తు ఉంది. రాకైన్ యోమా, బగో యోమా, షాన్ పీఠభూమి అనే పేర్లు కలిగిన మూడు పర్వతశ్రేణులు బర్మాలో ఉన్నాయి. ఇవి హిమాలయాలకు ఉత్తరం నుండి దక్షిణం వరకు వ్యాపించి ఉన్నాయి. ఈ పర్వతశ్రేణులను మూడు నదులు విభజిస్తున్నాయి. అవి ఇర్రవాడి నది, సల్వీన్ (థన్ల్విన్), సిటౌంగ్ అన్న పేరు కలిగినవి. ఇర్రవాడి నది బర్మాలో అతి పొడవైనది. ఈ నది పొడవు 2,170 కిలోమీటర్లు (1,348 మైళ్ళు). ఈ నది మర్టబన్ వరకు ఉన్న భూములను సారవంతం చేస్తూ పంటలు పండిస్తూ ప్రవహిస్తుంటుంది. రాకైన్ యోమా, షాన్ పీఠభూమి మధ్య ప్రవహించే ఇర్రవాడి నదీ తీరంలోనే అత్యధిక బర్మీయులు నివసిస్తుంటారు.

వాతావరణం

[మార్చు]

దేశంలో చాలా భాగం కర్కట రేఖ, భూమధ్య మధ్య రేఖ మధ్య ఉంటుంది. బర్మా ఆసియా రుతుపవన ప్రాంతంలో ఉన్న కారణంగా. సముద్ర తీర ప్రాంతాల్లో ఏటా వర్షాలు 5,000 మిమీ (196.9 అంగుళాలు) ఉంటుంది. బర్మా కేంద్రంలో డ్రై జోన్ ‍‌ (పొడి భూభాగం) లో సగటు వార్షిక వర్షపాతం 1,000 మిల్లీ మీటర్ల ( 39.4) కన్నా తక్కువగా ఉండగా డెల్టా ప్రాంతంలో వార్షిక వర్షపాతం, సుమారు 2,500 మిమీ (98.4 అంగుళాలు) ఉంది. దేశ ఉత్తర ప్రాంతాల్లో 21 ° సెంటీగ్రేడ్ (70 ° ఫారిన్ హీట్) సగటు ఉష్ణోగ్రతలతో ఆహ్లాదంగా ఉంటుంది. తీర, డెల్టా ప్రాంతాలు 32 ° సెంటీగ్రేడ్ (89.6 °ఫారిన్ హీట్ ) సగటు గరిష్ఠ ఉష్ణోగ్రత కలిగి ఉంటుంది.

వన్యజీవనం

[మార్చు]

దేశంలో నెమ్మదైన ఆర్థిక వృద్ధి దాని పర్యావరణం, పర్యావరణ వ్యవస్థల మరింత సంరక్షణ దోహదం చేసింది. దిగువ బర్మాలో దట్టమైన ఉష్ణమండల పెరుగుదల, విలువైన టేకు చెట్లు ఉన్న అడవులతో, అలంకారమునకై పెంచే ఒక చిన్న వృక్షజాతి ప్రాంతాలు, వెదురు, ఐరన్ చెట్లు, మిచెలియా చంపక వనాలతో సహా దేశంలోని 49% భూభాగాన్ని ఆక్రమించి ఉంది. కొబ్బరి, తమలపాకు, రబ్బరు పంటలు నూతనంగా ప్రవేశపెట్టబడ్డాయి. ఉత్తర ఎగువ బర్మాలో ఓక్, పైన్ వంటి వివిధ వర్షపాత వృక్షాలు మరింత భూభాగాన్ని ఆక్రమించి ఉంది. కొత్త 1995 అటవీ చట్టం అమల్లోకి వచ్చిన నాటి నుండి అత్యధిక కలప రవాణా తీవ్రంగా కారణంగా అడవి విస్తీర్ణం, వన్యమృగ ఆవాసాన్ని తగ్గించింది. తీరం వెంబడి భూములు ఉష్ణమండల పండ్లు అన్ని రకాల చెట్లు పెంపకానికి అనుకూలంగా ఉన్నా ఎక్కువగా రక్షిత కనుమరుగయ్యాయి అయితే ఒకసారి వర్షపాత వృక్షాలు పెద్ద ప్రాంతాల్లో వచ్చింది. మరింత కేంద్ర బర్మా (డ్రై జోన్) అఫ్ లో, వృక్షాలు స్వల్పంగా అక్కడక్కడ మాత్రమే ఉన్నాయి.

బర్మాలో ముఖ్యంగా అడవి జంతువులు, పులులు, చిరుతపులులు అక్కడక్కడా మాత్రమే ఉంటాయి. ఎగువ బర్మాలో ప్రత్యేకించి కలప పరిశ్రమలో, పని జంతువులుగా ఉపయోగించడానికి ఖడ్గమృగం, అడవి గేదె, అడవి పందులు, జింక, లేడి, ఏనుగులు, బందిఖానాలో పోషించబడుతూ అలాగే వృద్ధి చేయబడుతున్నాయి. చిన్న క్షీరదాలు గిబ్బన్స్, కోతుల నుండి ఎగురుతున్న నక్కలు, టాప్రిస వరకు, అనేకంగా ఉన్నాయి. మగ కోడి, ఫీసాంట్సు, కాకులు, హెరాన్స్, పడ్డి బర్డ్సలతో సహా 800 పైగా జాతులు ఉన్నాయి. సరీసృపాలు జాతులైన మొసళ్ళు, జియోక్స, కోబ్రాస్, బర్మా కొండచిలువలు, తాబేళ్ళు ఉన్నాయి. విస్తృత-పరిధి కలిగిన వందల కొలది మంచినీటి చేపల జాతుల వంటివి అపారమైన అత్యంత ముఖ్యమైన ఆహార మూలాలు.

ప్రభుత్వం, విధానాలు

[మార్చు]

బర్మా రాజ్యాంగం తన స్వాతంత్ర్యం తరువాత తన సైనిక పోలకుల చేత పాలనా విఘానాలు రచించబడి 2008 సెప్టెంబరులో ప్రచురంచబడ్డాయి. దేశం అధ్యక్షనిర్వాహిత స్వతంత్ర రాజ్యంగా పాలించబడుతూ ఒక భాగం సైవిక నియమిత సభ్యులు ఒక భాగం ఎన్నిక ద్వారా నియమిత సభ్యుల ద్వారా పాలించబడుతుంది. ప్రస్తుత దేశం అధ్యక్షనిర్వాహిత స్వతంత్ర రాజ్యం 2011 మార్చ 30న పరిచయం చేయడడింది.

బర్మా శాసనసభ పిదౌంగ్ సు హూతావ్ రె౦డు విభాగాలను కలిగి ఉంది. 224 స్థానాలు కలిగిన ఎగువ సభ అంయోతా హూతావ్ 168 స్థానాలకు సభ్యులు నేరుగా ఎన్నిక చేయబడతారు. అలాగే మిగిలిన 56 స్థానాలకు సభ్యులు బర్మా సైనిక దళం చేత నియమించబడతారు. 440-స్థానాలు కలిగిన దిగువ సభ్యులలో 330 స్థానాలకు సభ్యులు నేరుగా ఎన్నిక చేయబడతారు అలాగే మిగిలిన 110 స్థానాలకు సభ్యులు బర్మా సైనిక దళం చేత నియమించబడతారు. ప్రధాన రాజకీయ పార్టీ నేషనల్ డెమొక్రటిక్ ఫోర్స, సైనిక దళాలు వెనుక ఉండి నడిపించే రె౦డు పార్టీలలో ఒకటి నేషనల్ యూనిటీ పార్టీ రె౦డవది యూనియన్ సాలిడరిటీ అండ్ డెవలప్ మెంట్ పార్టీ. ఔంగ్ సాంగ్ సూ కై పార్టీ అయిన నేషనల్ లీగ్ ఫర్ డెమాక్రసీ 2010 కి ముందు చట్టవిరుద్ధమైన పార్టీగా ప్రకటించిన కారణంగా 2010 వరకు నమోదు చేయబడ లేదు కనుక అప్పటి వరకు ఎన్నికలలో పాల్గొనడాలికి వీలుకాలేదు.

బర్మా సైనికదళం తయారు చేసిన ముసాయిదా 2008 మే నాటికి ఆమోదించబడింది. ఎన్నకల ఫలితంగా 22 నమిలియన్ల మొత్తం ఓట్లలో 92.4% లలో లభించడం అయినా అధికారికంగా 99%గా ప్రకటించడం వంటివి అంతర్జాతీయ పరిశీలకుల చేత అలాగే నేషనల్ లీగ్ ఫర్ డెమాక్రసీ చేత తీవ్రంగా విమర్శించబడింది.

2010 ఎన్నికల్లో సైనిక-మద్దతుతో యూనియన్ సాలిడారిటీ, అభివృద్ధి పార్టీ సాధించిన విజయాన్ని అనేక విదేశీ పరిశీలకులు ఎన్నికల నిష్పాక్షికతలను ప్రశ్నించారు. ఒక విమర్శ మాత్రమే ప్రభుత్వం మంజూరు చేసిన రాజకీయ పార్టీలు మాత్రమే ఎన్నికలలో పోటీచేసే అనుమతి లభించింది. ప్రముఖ 'నేషనల్ లీగ్ ఫర్ డెమాక్రసీ' పార్టీ చట్టవిరుద్ధమైన పార్టీగా ప్రకటించిన కారణంగా ఎన్నికలకు దూరం చేయబడి ఇప్పటికీ రాజకీయ కార్యకలాపాలు నిర్వహించడానికి నిరోధించబడింది. అయితే, వెంటనే జరిగిన ఎన్నికలు తరువాత నేషనల్ లీగ్ ప్రజాస్వామ్యం న్యాయవాది, 'నేషనల్ లీగ్ ఫర్ డెమాక్రసీ' పార్టీ నాయకుడు అయిన ఔంగ్ సాంగ్ సూ కై యొక్క గృహ నిర్బంధంలో ఉంచింది. సైనిక నాయకుల చర్యలను గమనించడానికి ఆమె దేశంలో స్వతంత్రంగా తిరగడం అవశ్యం అని భావించబడింది. ఊహించని సంస్కరణలు తర్వాత 2011లో ఎన ఎల్ డి నాయకులు తమ రాజకీయ పార్టీని కార్యకర్తలను నమోదు చేసి తరువాత జరుగనున్న ఎన్నికలకు అర్హత సాధించారు.

లంచగొండితనం అధికంగా ఉన్న 183 దేశాలలో బర్మా 180వ శ్రేణిలో ఉంది. 2011 నాటికి బర్మా అత్యంత అవినీతి కలిగిన దేశంగా గుర్తించబడింది.

మానవ హక్కులు

[మార్చు]

బర్మాలో మానవహక్కుల ఉల్లంఘన గురించి అంతర్జాతీయ మానవహక్కుల సంఘం చాలా కాలంగా ఆందేళన వ్యక్తపరుస్తూనే ఉంది. బర్మాలోని మానవహక్కుల ఉల్లంఘన గురంచి యునైటెడ్ నేషన్స్, అంతర్జాతీయ మానవహక్కుల సంఘం సభ్యులు నిరంతరం ఈ విషయమై నివేదికలు జారీ చేస్తున్నాయి. యునైటెడ్ నేషన్స్ జనరల్ శాసనసభ బర్మా సైనిక అధికారి మీద తీసుకు వచ్చిన నిరంతర వత్తిడి ఫలితంగా 2009 నవంబరు నాటికి ఒక నిర్ణయానికి వచ్చి ప్రాథమిక హక్కులు, మానవహక్కుల ఉల్లంఘనను ఖండిస్తూ సైనిక అధికారులను పిలిచి అంతర్జాతీయ మానవహక్కులను, చట్టాన్ని ఉల్లంఘించిన వారి మీద చర్యలు తీసుకోవాలని ఆజ్ఞలను జారీ చేసింది. ఇంటర్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్స్, ఆమెన్ సిటీ ఇంటర్ నేషనల్, అమెరికన్ అసోసేషన్ ఫర్ ది అడ్వాన్స్ మెంట్ సైన్సెస్ బర్మాలో విస్తరించిన మానవహక్కుల ఉల్లంఘన గురించి నిరంతరం ఖండనా పత్రాలను విడుదల చేస్తూ వచ్చింది. బర్మా సైనిక పాలన అణచివేత విధానం, దుర్నీతి పాలన ప్రపంపంచంలోనే అతి హేయమైన పాలనగా సర్వజనామోదం పొందింది. బర్మాలో స్వాతంత్ర్యం న్యాయవ్యవస్థ లేదని అంతరజాతీయ ప్రజలు అభిప్రాయపడ్డారు. బర్మాలో వెట్టిచాకిరి, మానవుల తరలింపు, బాలకార్మిక వ్యవస్థ సాధారణ వి, యంగా మారింది. ఆయుధాలతో బెదిరించి స్త్రీల మీద అత్యాచారం చేయడం, స్త్రీలను సైనిక సావికులుగా ఉపయేగించడం వంటి సైనిక చర్యలను వాటిని ఖండిస్తూ దేశానికి వెలుపలగా తాయ్ లాండ్ సరిహద్దులలో, చైంగ్ మాయ్ లలో ఉమన్స్ ప్రో డెమొక్రసీ మూవ్ మెంట్ రూపుదిద్దుకుంది. స్త్రీల హక్కుల పరిరక్షణ కొరకు అంతర్జాతీయ ఉద్యమమం అభివృధ్ధి చెందింది. ది ఫ్రీడం ఇన్ ది వరల్డ్ (ప్రపంచలో శాంతి ) 2011 నివేదిక సారాంశం ఇలా ఉంది " ప్రాథమిక హక్కుత ఉల్లంఘన, అ స్తవ్యస్థమైన వ్యాయవ్యవస్థలతే కూడిన అణిచివేత చేస్తున్న సైనిక ప్రభుత్వం మానవ హక్కులను సైతం ఉల్లంఘన చేసిన వారిని శిక్షనుండి తప్పిస్తూ దీర్ఘకాలం పాలన సాగిస్తుంది. ఎన్నకల వ్యవస్థ సైతం అతి జాగరూకతగా తమకు అనుకూలంగా మలచుకోబడుతుంది. 2010 ఎన్నికలు స్వాతంత్రం కాని ధర్మబద్దంగాకాని జరగలేదు. ఎన్ ఎల్ డి కి చెందిన సభ్యులు, 1990 ఎన్నికలలో విజేతలు అయిన 429 మందితో కలిసి దేశంలో 2,100 రాజకీయ ఖైదీలు ఉన్నారు". సేకరించబడిన సాక్ష్యాల ఆధారంగా బర్మాపాలనలో కరేన్ వంటి అల్పసంఖ్యాకులైన సంప్రదాయక ప్రజలు నాశనం చేయబడడమో లేక బర్మీలుగా మార్చబడడమో జరిగింది. బర్మాలోని ర్వాండా ప్రాంతంలో జరిగిన మూకుమ్మడి హత్యల సమయంలో ఈ సంఘటనలు అంతర్జాతేయదేశాల దృష్టిలోకి వచ్చాయి. ది ఫ్రీడం ఇన్ ది వరల్డ్ (ప్రపంచలో శాంతి ) 2012 నివేదికలో పరిస్థితి కొంత మెరుగుపడినట్లు సూచించింది. రాజకీయ హక్కులు, ప్రజాస్వతంత్రం, రాజకీయ ఖైదీల విడుదల వంటి విషయాలు మెరపుగు పడ్డాయి.

ఏదిఏమైనప్పటికీ 2011 ఆగస్టు ఎన్నికల అనంతరం బర్మా మానవహక్కల పరిస్థితి అభివృధ్ధి సాధించంది. బర్మా ప్రభుత్వం వివిధ నేపథ్యాలకు చెందిన 15 సభ్యులతో కూడిన బర్మా మానవహక్కుల సంఘం (నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్) రూపొందించింది. ప్రెసిడెంట్ తెయిన్ సేన్ దేశబహిష్కృతులకు దాశానికి తిరిగి వచ్చి దేశాభివృద్ధికి సాయపడమని ఆహ్వానం చేసిన తరువాత దేశంనుండి బయటకు పంపబడిన అనేక మంది విప్లవకారులు తిరిగి దేశంలో అడుగుపెట్టారు. ప్రభుత్వం కఠినమైన మునుపటి చట్టాలను సడలించింది. 2011 సెప్టెంబరు నుండి యూ ట్యూబ్, డెమొక్రటిక్ వాయిస్ ఆఫ్ బర్మా, వాయిస్ ఆప్ అమెరికా వంటి వెబ్ సైట్స్ మీద ఉన్న నిషేధం తొలగించబడింది.

పాలనా విభాగాలు

[మార్చు]

బర్మాదేశం ఏడు రాష్ట్రాలు, ఏడు ప్రాంతాలు (రీజియన్స్) గా విభజింపబడ్డాయి. 2010 ఆగస్టు 20 ప్రాంతాలకు తిరిగి పేరుపెట్టబడింది. బర్మర్స అధికంగా నివసిస్తున్న ప్రాంతాలు రీజియన్స్ గానూ అల్పసంఖ్యాకులు నివసిస్తున్న ప్రాంతాలను రాష్ట్రాలుగా విబజింపబడ్డాయి. పాలనా విభాగాలు జిల్లాలుగా, జిల్లాలు పురాలుగా, పురాలు వార్డులుగా అలాగే గ్రామాలుగా విభజింపహడ్డాయి.

నంబర్. పాలన జిల్లాలు సహలగేగజాలిటీలు నగరాలు/పట్టణాలు వార్డ్స్ మండలాలు గ్రామాలు
1 కచిన్ రాష్ట్రం 3 18 20 116 606 2630
2 కాయాహ్ రాష్ట్రం 2 7 7 29 79 624
3 కాయిన్ రాష్ట్రం 3 7 10 46 376 2092
4 చిన్ రాష్ట్రం 2 9 9 29 475 1355
5 సాజింగ్ రీజియన్ 8 37 37 171 1769 6095
6 తనిన్తరాయ్ రీజియన్ 3 10 10 63 265 1255
7 బాగో రీజియన్ 4 28 33 246 1424 6498
8 మాగ్ వే రీజియన్ 5 25 26 160 1543 4774
9 మాండలే రీజియన్ 7 31 29 259 1611 5472
10 మాన్ రాష్ట్రం 2 10 11 69 381 1199
11 రాకినే రాష్ట్రం 4 17 17 120 1041 3871
12 యాంగాన్ రీజియన్ 4 45 20 685 634 2119
13 షాల్ రాష్ట్రం 11 54 54 336 1626 15513
14 ఎ యేయర్వాడి రీజియన్ 6 26 29 219 1912 11651
'మొత్తం 63 324 312 2548 13742 65148

విదేశీ సంబంధాలు, సైన్యం

[మార్చు]

2010 ఎన్నకల తరువాత దేశంలో జరిగిన మార్పుల కారణంగా పశ్చిమదేశాలు బర్మాతో దౌత్యసంబంధాలు వెనుకు తీసుకున్నాయి. కొన్ని సంవత్సరాల దౌత్యసంబంధాల ఏకాంతం తరువాత బర్మాలో జరిగిన రాజకీయమార్పుల అనంతరం యునైటెడ్ స్టేట్స్ 2011 నవంబరు నుండి తిరిగి దౌత్యసంబంధాల మీద ఉన్న నిషేధాలను సడలించి 2012 జనవరి 13 నుండి దౌత్యసంబంధాల పునరుద్ధరణ గురించిన ప్రకటన చేసింది. యురేపియన్ యూనియన్ ఆయుధాలు, వాణిజ్య సంబంధాలు కూడా ఇతర బర్మాస్వతంత్ర పోరాట వీరుల వత్తిడుల కారణంగా ఆపబడ్డాయి. ఔంగ్ సాన్ సూ కై నాయకత్వంలో ప్రో డెమొక్రసీ పార్టీ 2012 ఉపఎన్నికలలో 45 స్థానాలలో 43 స్థానాలు చేపట్టిన తరువాత బ్రిటిష్ ప్రభుత్వం వాణిజ్య సంబంధాల పునరుద్ధరణ కొరకు ఆసక్తి చూపింది.

పశ్చిమదేశాలు బర్మాతో దౌత్యసంబంధాలకహ దూరంగా ఉన్నా ఏయియన్ వాణిజ్య సంస్థలు బర్మాతో వాణిజ్య సంబంధాలను కొనసాగిస్తూనే ఉంది. బర్మాదేశం తమ పొరుగు దేశాలైన చైనా, భారతదేశాలకు చెందిన వ్యాపార పరమైన సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకున్నాయి. బర్మా చైనా, భారతదేశాల నుండి సైనిక సహాయం కూడా అందుకున్నది. బర్మా భారతదేశం నుండి 200 మిలియన్ల అమెరికా డాలర్ల సైనిక సాయం అందింది. భారతదేశం భవిష్యత్తులో ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్ ప్లొరేషన్, ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ, హైడ్రో పవర్, ఓడరేవులు, భవననిర్మాణం వంటి రంగాలలో వాణిజ్య సంబంధాలను అభివృద్ధి చేయాలని యోచిస్తుంది. 2008లో బర్మాలో చోటుచేసుకున్న మానవహక్కుల ఉల్లంఘన కారణంగా భారతదేశం కొంతకాలం సైనిక సాయం నిలుపుదల చేసినా వాణిజ్య సంబంధాల మాత్రం కొనసాగించింది. 1997 నుండి బర్మా ఎ ఎస్ ఇ ఎ ఎన్ లో సభ్యత్వం కలిగి ఉంది. అయినా 2006 లో ఎ ఎస్ ఇ ఎ ఎన్ సమ్మిట్ కు ఆతిధ్యం ఇవ్వక 2014 నాటికి ఎ ఎస్ ఇ ఎ ఎన్ సమ్మిట్ కు ఆతిధ్యం ఇవ్వాలని నిర్ణయించుకుంది. 2008 నవంబరులో బంగ్లాదేశ్, బర్మాల మధ్య రోహింగ్యా శరణార్దుల కారణంగా అలాగే వివాదాస్పద ప్రాంతంలో బంగ్లాదేశ్ నేచురల్ గ్యాస్ శోధన కారణంగా ఉద్రిక్తలు తలెత్తాయి.

488,000 మంది సైనికులు కలిగిన బర్మా సైనిక శక్తిని తాట్ మాడా' అని అంటారు. తాట్ మాడా వాయు సేన, సముద్ర సేన, సైన్యంల మీద తాట్ మాడా ఆధిపత్యం వహించింది. సైనిక పరంగా బర్మా పన్నెండవ స్థానంలో ఉంది. దేశంలో సైనిక శక్తి చాలా ప్జాదరణ కలిగి ఉంది. సైనికాధికారులు కాబినెట్, మంత్రి పదవులు వహించారు. సైనిక రంగానికి అత్యధికంగా నిదులను విడుదల చేస్తున్న కారణంగా విదేశీ మారకంలో ఉండే అనిశ్చితి కాలణంగా నిధుల వివరాలు అందుబాటులో ఉండవు, దేశం రష్యా, చైనా, భారతదేశంల నుండి ఆయుధాలను దిగుమతి చేసుకుంటుంది.

బర్మాదేశం రష్యా సహాయంతో ప్యిన్ ఊ ల్విన్ వద్ద రీసెర్చ్ న్యూక్లియర్ రియాక్టర్ నిర్మించింది. సైనికప్రభుత్వం 2000 లో రియాక్టర్ నిర్మాణం గురించి ఐఎఇఎ'కు తెలియజేసాడు. రీసెర్చ్ రియాక్టర్ భవననిర్మాణ ఫ్రేం యాంగాన్ లోని ఇ ఎన్ ఇ' స్టీల్ ఇండస్ట్రీ నిమిటెడ్ వారు నిర్మించారు. అలాగే రియాక్టర్ కేవిటీ కూలింగ్ సిస్టం కోసం కావలసిన నీటిని అనిస్కాన్ జలపాతం నుడి నీసుకున్నారు. 2005 వరకు యునైటెడ్ నేషన్స్ జనరల్ శాసనసభ బర్మాలోని పరిస్థిని వివరణాత్మక నిర్ణయం చేస్తుంది. 2005లో యునైటెడ్ నేషన్స్ జనరల్ శాసనసభ బర్మాలో జరుగుతున్న మానవహక్కుల ఉల్లంఘనలు ఖండిస్తూ హెచ్చరిక చేసింది. 2007 జనవరిలో యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ బర్మాను మానవహక్కులను గౌరవించాలని, ప్రజల ప్రాథమిక స్వతంత్రం కాపాడాలని చేసిన హెచ్చరికకు అనుకూలంగా రష్యా, చైనా ఓటు వేసాయి. సౌత్ ఆఫ్రికా కూడా ఈ హెచ్చరికు అనుకూలంగా ఓటు వేసింది.

ఆర్ధిక రంగం

[మార్చు]

ఆగ్నేయ ఆసియా దేశాలలో బర్మా స్థబ్ధత, లోపభూయిష్టమైన నిర్వహణ, ప్రపంచానికి దూరంమైన ఒంటరి తనం వంటి సమస్యల కారణంగా అత్యంత పేద దేశంగా మారింది. విద్యావంతులైన ఉద్యోగులు, ఆధునిక సాంకేతిక నిపుమణుల కొరత, కార్యాలయ భవనాల కొరత మూలంగా ఆర్థిక సమస్యలు అధికం అయ్యాయి. ఎక్కడైతే చట్టవిరుద్ధమైన మాదక ద్రవ్యాలు రవాణా జరుగుతుదో అదే ఇర్రాడ్ వెల్లీ నది తీరం వెంట తాయ్ లాండ్ సరిహద్దుల నుండి సరకురవాణా కూడా జరుగుతుంది. 19వ శతాబ్ధపు చివరిలో నిర్మరంచబడిన రైళ్ళు స్వల్పమైన రిపేర్లతో అస్థవ్యస్తమైన పరిస్థితిలో నడుపబడుతున్నాయి. ప్రధాన నగరాలలో తప్ప మిగిలిన చోట్ల రహదార్లకు పేవ్ మెంట్ కూడా నిర్మించబడలేదు. యాంగాన్ తో సహా బర్మా అంతటా విద్యుత్ఛక్తి సరఫరా కొరతగానే ఉంటుంది.

ఆగ్నేయాసియా బ్రిటిష్ పాలనలో బర్మా సంపన్న దేసాలలో ఒకటిగా ఉందేది. ఇది బియ్యం సరపరాలో ప్రపంచంలో ప్రథమ స్థానంలో ఉండేది. బర్మా సహజ వనరులకు, మానవ వనరుల సంపన్నత కలిగి ఉంది. 75% ప్రపంచ టేకు అవసరాలకు సరిపడే టేకు బర్మాలో తయారు చేయబడేది. అలాగే అధికంగా విద్యావంతులు ఉండేవారు. దేశం శీఘ్రగతిలోఅభివృద్ధి సాధించగలదని ఒకప్పుడు విశ్వసించే వారు.

రెండవ ప్రపంచయుద్ధ సమయంలో టంగ్ స్టన్, టిన్, లీడ్, వెండి జపానీయుల వశం కాకుడా చేయడానికి ప్రధాన చమురు బావులు బ్రిటిష్ ప్రభుత్వం చేత ధ్వంసం చేయబడ్డాయి. బర్మా రెండు తీరాల వెంట బాంబులు వేసారు. 1948 ప్రభుత్వ పార్లమెంటరీ రూపుదిద్దుకున్న తరువాత ప్రధాన మంత్రి యూ ఎన్ యూ దేశాన్నిజాతీయంచేసే విధానాన్ని ప్రతిపాదించిన తరువాత బర్మా అంతటి మీద అధికారం సాధించాడు. ప్రభుత్వం బలహీనమైన ఎన్మిది సంవత్సరాల ప్రణాళిక ప్రతిపాదించబడింది. 1950 నాటికి బియ్యం ఎగుమతులు రెండింట మూడువంతులు క్షీణించింది అలాగే ఖనిజాల ఎగుమతి 96%నికి పడిపోయింది. ప్రణాళికకు కావలసిన నిధుల కొరకు ధనం ముద్రించిన కారణంగా ద్రవ్యోల్బణం పతాకస్థాయిని చేరింది. 1962లో తలెత్తిన తిరుగుబాటు అనంతరం బర్మీస్ వే ఆఫ్ సోషలిజం పేరుతో కొత్త ఆర్థిక విధానం వ్యవసాయాన్ని తప్పించి మిగిలిన పరిశ్రమలు జాతీయం చేయబడ్డాయి. ఈ విపత్కర కార్యం బర్మాను పేదరికంలో ముచెత్తింది. 1987 నాటికి ఐక్యరాజ్య సమితి ఆర్థికంగా దివాలా పరిస్థితిలో కూరుకుపోయిన బర్మాను అత్యల్ప అభివృద్ధి చెందిన దేశంగా పేర్కొనడం ప్రధానాంశం అయింది.

బర్మా దేశీయ కరెన్సీని (ద్రవ్యం) క్యాట్ అంటారు. క్యూబాలో ఉన్నట్లు బర్మాలో రెండువిధాలైన ద్రవ్యమారక విలువలు ఉన్నాయి. 2006లో విఫణి విలువ ప్రభుత్వం నిర్ణయించన విలువకంటే రెండు వందల రెట్లు తక్కువగా ఉండేది. 2005 నుండి 2007 సరాసరి ద్రవ్యోల్బణం 30.1% . ఆర్థిక రంగం ఎదుర్కొన్న ప్రధాన సమస్య ద్రవ్యోల్బణం. సమీప కాలంలో చైనా, భారతదేశం ఆర్థికపరమైన ప్రయోజనం కోసం బర్మాతో సంబంధాలను బలపరచుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. యునైటెడ్ స్టేట్స్, యురేపియన్ యూనియన్, కెనడాతో సహా అనేక దేశాలు బర్మాతో వాణజ్య, పెట్టుబడులు ప్రతిపాదనలు చేసాయి. యునైటెడ్ స్టేట్స్ బర్మా నుడి అన్ని దిగుమతుల మీద నిషేధం విధించింది. బర్మాకు విదేశీ పెట్టుబడులు ప్రధానంగా చైనా, సింగపూరు, ఫిలిప్పైన్స్, దక్షిణకొరియా, [[]తాయ్ లాండ్]], భారతదేశం నుడి వస్తున్నాయి. బర్మా సంవత్సర వైద్యం, వైద్యపరికరాల దిగుమతులు 160 మరలియన్ల అమెరికన్ డాలర్లు.

వ్యవసాయం

[మార్చు]

బర్మాలో వ్యవసాయ భూములలో 60% భూమి బియ్యం ఉత్పత్తికి ఉపయోగించబడుతుంది. ఆహారధాన్యాలలో బియ్యం 97% ఉంటుంది. 1966 నుండి 1997 ఇంటర్ నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్సిట్యూట్ సాయంతో 52 బియ్యం రకాలు ప్రవేశ పెట్టబడ్డాయి. ఈ సహాయంతో 1987 లో 14 మిలియన్ టన్నుల ఉత్పత్తిని 1996లో 19 మిలియన్ టన్నుల ఉత్పత్తిని సాధించింది. 1988 నాటికి దేశంలోని సగం వ్యవసాయ భూములలో ఆధునిక రకాలు సాగుచేయబడ్డాయి. నీటిపారుదల వసతి కలిగిన భూములలో 98 శాతం భూములలో బియ్యం పండించబడింది. 2008 నాటికి బియ్యం ఉత్పత్తి 50 మిలియన్లకు చేరుకుంటుందని అంచనా వేసారు.

బర్మాలో మాదక దీవ్యాలలో ఒకటి అయిన ఓ పీ ఎమ్ను అంతర్జాతీయ ఉత్పత్తిలో 8% ఉతుపత్తి చేయబడుతుంది. ఓ పీ ఎమ్ మాదక ద్రవ్యాలు చేయడానికి ఉపయోగపడే ప్రధాన ద్రవ్యం. అంతర్జాతీయ వత్తిడికి లొంగి 2002 నుడి బర్మా ఓ పీ ఎమ్ ఉత్పత్తి మీద నిషేధం విధించింది. పాత గసాలు పండించే రైతులకు సరైన జీవనాధారం చూపించకుండా ఈ నిషేధం విధించిన కారణంగా కోకాంగ్, వా ప్రదేశాల రైతులు ఉపాధి కోసం కూలీ పనుల మీద ఆధారపడసాగారు.

సహజ వనరులు

[మార్చు]

బర్మాకు నీలం, ముత్యం, పచ్చలు, కెంపులు వంటి విలువైన రత్నాలను తయారు చేయడంలో అంతర్జాతీయంగా ప్రధాన స్థానం ఉంది. ప్రపంచంలోనే నాణ్యతలో వర్ణంలో గుర్తింపు పొందిన కెంపులు 90% బర్మాలో తయారు ఔతుంటాయి. బర్మాలో తయారయ్యే రత్నాలలో అధిక శాతం తాయ్ లాండ్ కొనుగోలు చేస్తుంది. బర్మాలోని వెల్లీ ఆఫ్ రూబీస్ అని పిలువబడే కొండచెరియల ప్రాంతం మాండలేకు 200 కిలోమీటర్ల ఉత్తరంలో ఉంది. ఇది రక్తవర్ణ కెంపులకు నీలాలకు పేరుపొందింది. అనేక యూ. ఎస్, యురేపియన్ యూనియన్, బల్దేరియా నగల వ్యాపార సంస్థలు ఇక్కడ తయారయ్యే రత్నాలను కొనుగోలు చేయడానికి నిరాకరిస్తున్నారు. అందుకు కారణం ఇక్కడ గనులలో దుఖఃకరమైన పరిస్థితులలో పనివారు పనిచేస్తుండడమే. మానవహక్కుల సంఘం కూడా బర్మా రత్నాల మీద సంపూర్ణ నిషేధాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ కారణంగా అధిక శాతం ఆదాయం సైనిక ప్రభుత్వానికి చేరుతుంది. అధికమైన రత్నాల గనులు ప్రభుత్వం ఆధీనంలో, ప్రభుత్వంతో జాయింట్ వెంచర్ గా పనిచేస్తున్నాయి. బర్మాలో ఇతర పరిశ్రమలు వస్తువులు, వస్త్రాలు, కొయ్యసానులు, రత్నాలు, లోహాలు, చమురు, సహజ వాయువులు.

పర్యాటక రంగం

[మార్చు]

1992 నుండి బర్మా ప్రభుత్వం దేశంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహిస్తుంది. బర్మా యొక్క పర్యాటకం, హోటల్స్ మంత్రి మాజ-జెన్- సా ల్విన్ ప్రభుత్వానికి పర్యాటక రంగం నుండి గుర్తించ తగినంత ఆదాయం లభిస్తుందని ప్రకటించాడు. బర్మాప్రభుత్వం విదేశీ పర్యాటకులకు తమ సంపూర్ణ సహకారం అందిస్తుంది. వారు విదేశీ పర్యాటకులతో రాజకీయాలు మాట్లాడరు. అన్ నెససరీ కాంటాక్ట్ చట్టం రూపొందించి విదేశీ పర్యాటకులు దేశీయులతో సంబంధాలు పెట్టుకోకుండా నియంత్రిస్తుంది.

జనాభా లెక్కలు

[మార్చు]

జాతి పరమైన సమూహాలు

[మార్చు]

బర్మా అనేక భాషా సమూహాలకు పుట్టిల్లు. సినో-టిబెటన్, తాయ్-కడాయ్, ఆస్ట్రో-ఆసియాటిక్, ఇండో-యురేపియన్ వంటి భాషలు వాటిలో కొన్ని. సినో-టిబెటన్ భాషను దేశంలో అత్యధికులు మాట్లాడుతుటారు. వారు ఇంకా బర్మీస్, కరేన్, కచిన్, చిన్, చైనీస్ భాషలను కూడా మాట్లాడుతుటారు. షాన్ లో తాయ్-కడాయ్ ప్రధాన భాష. మాన్, పలౌంగ్, వా లలో ఆస్ట్రో-ఆసియాటిక్ ప్రధాన భాష. పాలిలో ప్రధాన భాష అలాగే మతపరమైన భాషా అయిన తరవాడ బుద్ధిజం, ఆంగ్లం కూడా వాడుకలో ఉంది. యునెస్కో గణాంకాలను అనుసరించి 2000లో బర్మా అక్షరాస్యత 89.9%. చారిత్రకంగా బర్మా అధిక అక్షరాస్యత కలిగిన దేశం. 1987 లో ఐక్యరాజ్యసమితి అల్ప అభివృదధి చెందిన దేశంగా గుర్తించిన సమయంలో బర్మా అక్షరాస్యత 78.6% నుడి 18.7% వరకు పడిపోయింది. బర్మా జాతి పరంగా వైవిధ్యం కలిగిన దేశం. 135 ప్రత్యేక జాతుసమూహాలు ప్రభుత్వం చేత గుర్తింపు పొందాయి. బార్మర్ ప్రజలు 68%, వీరిలో 10% ప్రజలు షాన్ లో కాయిన్ లో 7%, రాఖనేలో 4% విదేశీ చైనీయులు 3% ఉన్నారు. అల్పసంఖ్యాక ప్రజలు అబద్రతా భావంతో జీవిస్తున్నారు. బర్మర్ ప్రజలు అల్పసంఖ్యాక ప్రజల మీద బర్మనైజేషన్ అనేక, అనేక ఆధిక్యతలను ప్రదర్శిస్తుటారు.

జనాభాలో 2% ఉన్న మాన్ ఖామర్ కహ చెందినవారు, విదేశీ భారతీయులు 2% ఉండగా మిగిలిన వారు కచిన్, చిన్, ఆంగ్లో-ఇండియన్లు అల్పసంఖ్యాక జాతులు ఉన్నారు. వీరిలో ఆంగ్లో-బర్మీయులు కూడా ఉన్నారు. ఒక్కప్పుడు అత్ధిక ప్రజాదరణ కలిగి ఉన్న ఆంగ్లో-బర్మీయులు 1958 నుండి ప్రవాహంలా ఆస్ట్రేలియా, యూ.కే లకు తరలి వెళ్ళారు. 52,000 ఆంగ్లో-బర్మీయులు దేశంలో ఉన్నట్లు అంచనా. తాయ్ సరిహద్దులలో శిబిరాలలో శరణార్ధులుగా ఉన్న వారి సంఖ్య 1,10,000. దేశంలో 89% ప్రజలు బుద్ధమతావలంబీకులే అని ఎబిసి వరల్డ్ న్యూస్ టునైట్ 2008 మేలో బుద్ధధర్మా అసోసేషన్ పేర్కొన్నది.

సంస్కృతి

[మార్చు]

బర్మాలో దేశవాళీ సంస్కృతులు వివిధ రకాలు ఉన్నాయి, మెజారిటీ సంస్కృతి ప్రధానంగా బౌద్ధ, బామర్ సంస్కృతులు ఉన్నాయి. బామర్ సంస్కృతి పొరుగు దేశాల సంస్కృతుల ద్వారా ప్రభావితమైనది. ఈ సంస్కృతి భాష, వంటలు, సంగీతం, నాట్యం, థియేటర్ లో స్పష్టతగా తెలుస్తుంది. కళారంగంలో ముఖ్యంగా సాహిత్యం, చారిత్రాత్మకంగా థీరవేదా బౌద్ధ మతం యొక్క స్థానిక రూపంలో ప్రభావితం చేయబడ్డాయి. బర్మా జాతీయ పురాణగాధ యమ్మ జాత్వా భారతదేశం యొక్క రామాయణ యొక్క మరు అవతారం లాగా ఉంటుంది. థాయ్, మాన్, నాటకం భారత నాటకతిరుతెన్నుల వలన చాలా ప్రభావితమైనది. ఇక్కడ అనుసరించే బౌద్ధమతం నాట్ వింత ఆచారాలు కలిగి ఉంది. నాట్ ఆరాధనతో పాటు అభ్యసించే 37 నాట్ లు ఒక గుడి నుండి లభిస్తాయి .

ఈ విధానానికి ఒక సంప్రదాయ గ్రామం లోని ఆశ్రమంలో అనుసరిస్తున్న సాంస్కృతిక జీవితం కేంద్రంగా ఉంది. ఇక్కడ సన్యాసులకు లే ప్రజలు మద్దతిస్తున్నారు. ఒక బాలుని వయో పరిమితిని అనుసరించి ఆచరించే శిన్బ్యూ అని పిలువబడే ఒక సంప్రదాయక వేడుక అతను ఆశ్రమంలో ప్రవేశించిన తరువాత చాలా తక్కువ సమయంలో ఆచరించబడుతుంది. ఇది ఒక బాలుని వయో సంబంధిత సంబంధిత మాట సంప్రదాయాలలో చాలా ముఖ్యమైనది. బౌద్ధ కుటుంబాలు అన్ని మగ పిల్లలు (బౌద్ధమతం కోసం అనుభవశూన్యుడు) ఒక అనుభవం లేని వ్యక్తి అనిభావిస్తాయి. కనుక ఇరవై ఏళ్ల ముందు అజ్ఞానిగా భావించి ఇరవై ఏళ్ల తర్వాత ఒక సన్యాసిగా ఉండాలని భావిస్తారు. బాలికలకు కూడా ఆ వయసులో చెవులు కుట్టే వేడుక జరుపుతారు. బర్మా గ్రామాలలో అత్యంత స్పష్టంగా, బర్మీస్ సంస్కృతి ప్రతిబింబిస్తుది. ఇక్కడ స్థానిక పండుగలు చాలా ఏడాది పొడవునా జరుగుతాయి. వీటిలో ముఖ్యమైన పండుగ పగోడా పండుగ. ​చాలా గ్రామాలు కలిసి ఒకే సమయంలో చెవి-కుట్లు వేడుకలు లాంటివి జరుపుకుంటారు. అనేక గ్రామాలు తమ సంరక్షకుడుగా నాట్ ను ఆమోదిస్తారు. గ్రామాలలో మూఢ నమ్మకాలూ నిషేధాలు సర్వసాధారణంగా ఉంటాయి.

బ్రిటిష్ వలస పాలన కూడా బర్మాలో పాశ్చాత్య సంస్కృతి అంశాలను ప్రవేశపెట్టింది. బర్మా యొక్క విద్యా వ్యవస్థ యునైటెడ్ కింగ్డమ్ యొక్క విద్యా వ్యవస్థ ఆధారంగా తయారు చేయబడుతుంది. వలస ప్రభుత్వ శైలి నిర్మాణ ప్రభావాలు వంటివి యాంగాన్ ప్రధాన నగరాలలో అత్యంత స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఆగ్నేయంలోచాలా అల్పసంఖ్యాకులుగా కరెన్ సంప్రదాయం, అలాగే ఉత్తర, ఈశాన్యం ప్రాంతాలలో సుపరిచితం. వరల్డ్ ఫాక్ట్ బుక్ ప్రకారం వాయవ్య ప్రాంతంలో కాచిన్, చిన్ (ప్రజలు), క్రైస్తవ మతం ఆచరణ కొనసాగిస్తున్నట్లు తెలుస్తుంది. బర్మాలో బర్మన్ సంప్రదాయక జనాభా 68%, భారతీయ సంప్రదాయ సమూహాలు 32% యొక్క ఉంటాయి. అయితే ఇందుకు విరుద్దంగా బహిష్కరింపబడిన నాయకులు, సంస్థలతో చేరి భారతీయ సంప్రదాయ జనాభా పరిపూర్ణంగా 40% ఉన్నట్లు సి ఐ ఎ నివేదిక (అధికారిక సంయుక్త నివేదిక) ప్రకటించింది.

బర్మాలో బామర్ ప్రజల మాతృభాష, అధికార భాష బర్మీస్ భాష టిబెటన్, చైనీస్ భాషలతో సంబంధం కలిగి ఉంది. ఇది గుండ్రని, అర్ధచంద్రాకార అక్షరాలను కలిగి ఉంటుంది. ఇది మాన్ లిపిఆధారిత లిపిని కలిగి ఉంది. మాన్ లిపి 8వ శతాబ్ధపు దక్షిణ భారతదేశ లిపిని పోలి ఉంటుంది. ప్రాచీన బర్మీస్ శాసనాలు 11 శతాబ్దం నుండి లభిస్తుంది. ఈ లిపిని భౌద్ధుల పవిత్ర భాష అయిన తరవాడ భాషను వ్రాయడానికి కూడా వాడుతుంటారు. అలాగే అల్ప సంఖ్యాక జాతుల భాషలైన షాన్, కొన్ని కరేన్ భాషలు, కాయాహ్ భాషలలో కొన్ని ప్రత్యేక అక్షరాలను చేర్చి ఉపయోగించబడుతుంది. బర్మీస్ భాష దేశమంతా విస్తరించి గౌరవాదరణ పొంది ఉంది. మతపరంగా బర్మీస్ సంఘంలో విద్యాభ్యాసం చేయడం తప్పనిసరి. మాధ్యమిక విద్యను ప్రభుత్వ పాఠశాలలో అభ్యసిస్తారు.

మతము

[మార్చు]

బర్మాలో అనేక మతాలు అవలంబించబడుతున్నాయి. పండుగలను చాలా ఆడంబరంగా జరుపబడుతుటాయి. క్రైస్తవ మతం, ముస్లిం మతం అవలింబించే వారు ప్రక్షాళన వంటి సమస్యలను ఎదురకొంటున్నారు. భౌద్ధులు కాని వారు సైన్యమలో చేరాలన్నా, ప్రభుత్వ ఉద్యోగాలలో చేరాలన్నా ఉన్నత స్థితికి చేరాలన్నా ప్రక్షాళన చేయవలసి ఉంటుంది. గత పది సంవత్సరాలలో దాదాపు 3000 ప్రక్షాళన చేసిన తూర్పు బర్మా దేశంలోని ప్రజలను ప్రత్యేకంగా లక్ష్యంగా పెట్టుకున్నారు. గత 20 స్వత్సరాల నుడి ఈ ప్రక్షాళన కార్యక్రమాన్నుండి తప్పించుకున్న 2,00,000 ముస్లింలు రోహంగ్యా ప్రాంతంలో నివసిస్తున్నారు. ఇతర మతాలు ఎలాంటి ఆటంకం లేకుండా అవలంబించబడుతున్నాయి. రోహంగ్యాలో నివసిస్తున్న అల్ప సంఖ్యాక ముస్లింలు వారిలో కొందరు. వారి పౌరసత్వం నిరాకరించబడిన కారణంగా వారు విద్యను అభ్యసించడానికి వీలు ఉండదు. అలాగే క్రైస్తవ మతావలంబీకులు 4%, ఇస్లాం మతావలంబీకులు 4%, సంప్రదాయ విశ్వాసం కలిగిన వారు 1%, ఇతర మతావలంబీకులు 2% ఉన్నారు. మహాయాన బుద్ధిజం, హిందూ ఇజం, తూర్పు ఆసియన్ మతాలు బహాయ్ మతావలంబీకులు కూడా ఉన్నారు. యూ.ఎస్ స్టేట్స్ డిపార్ట్ మెంటు తమ రిలీజియస్ ఫ్రీడం రిపోర్ట్లో బర్మా అధికారిక గణన బౌద్ధులు కాని వారి సంఖ్యను తగ్గించి చూపబడుతుందని సూచించింది. పరిశోధకులు మాత్రం ముస్లిం ప్రజల శాతం 6 నుడి 10%, రంగూన్ లో అతి స్వల్ప యూదుల ప్రార్థనా మందిరం ఉంది.

కొలపరిమాణం

[మార్చు]

మెట్రిక్ కొలతలను ఉపయోగించని మూడు దేశేలలో బర్మా ఒకటి. సి ఐ ఎ ఫాక్ట్ బుక్ సాధారణ కొలతలు బర్మా అంతా ఒకే విధంగా ఉంటుంది. ప్రభుత్వ వెబ్ పేజీలలో మాత్రం రాజ్య సంబంధ కొలతలు, మెట్రిక్ కొలతలను వాడుతుంటారు. 2011 జూన్ లో బర్మా ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ కొలపరిమాణాల స్సస్కరణల చేసి వారి భాగస్వాములలో అధికులు వాడుతున్న మెట్రిక్ కొలతలను వాడడం గురించి చర్చల ప్రతిపాదన చేయబడింది.

విద్య

[మార్చు]

బర్మా విద్యావ్యవస్థ ప్రభుత్వ పరమైన ప్రతినిధుల ద్వారా నిర్వహించబడుతుంది. విశ్వవిద్యాలయాలు, వృత్తి విద్యా సంస్థలకు చెందిన విద్యా మంత్రిత్వ శాఖ ఎగువ బర్మా, దిగువ బర్మాలుగా రెండు ప్రత్యేక విభాగాలుగా పనిచేస్తున్నాయి. ఎగువబర్మాలోని డిపార్ట్ మెంట్ ఆఫ్ అప్పర్ బర్మా, దిగువ బర్మాలోని డిపార్ట్ మెంట్ ఆఫ్ లోయర్ బర్మా ప్రధాన కార్య.లయాలు యాంగాన్, మాండలేలో ఉన్నాయి. విద్యావిధానం మాత్రం యునైటెడ్ కింగ్ డం విద్యావిధానాన్ని అనుసరించి ఉటుంది. ఒక శతాబ్దం కాలం సాగిన బ్రిటిష్ - క్రైస్తవ పాలన సమయంలో బర్మాలోని దాదాపు మొత్తం పాఠశాలలు ప్రభుత్వం చేత నడపబడ్డాయి. అయినప్పటికీ సమీపకాలంలో ప్రైవేటు నిధులతో నడుపబడుతున్న ఆంగ్లమాధ్యమ పాఠశాలలు అభివృద్ధి చెందుతున్నాయి. పిరాధమిక స్థాయి విద్య వరకు నిర్బంధ విద్య కొనసాగుతుంది. దాదాపు 9 సంవత్సరాల వరకు ఉంటుంది. అంతర్జాతీయ నిర్బంధ విద్య 15 లేక 16 సంవత్సరములు. బర్మాలో 101 విశ్వనిద్యాలయాలు, 9 కళాశాలలు, 24 జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఇంకా సాంకేతిక 10 శిక్షణాలయాలు, 23 నర్సింగ్ శిక్షణాలయాలు, 1 స్పోర్ట్స్ అకాడమీ, 20 ప్రసూతి సహాయక (మిడ్ వైఫ్) శిక్షణాలయాలు ఉన్నాయి. ఇంకా 2047 ఉన్నత పాఠశాలలు (హైస్కూల్స్), 2605 మాధ్యమిక పాఠశాలలు, 29944 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. 1692 మల్టీ మీడియా క్లాస్ రూములు కూడా ఘ విద్యా విధానంలో చోటుచేసుకున్నాయి.

బర్మాలో డబల్యూ ఎ ఎస్ సి, కాలేజ్ బోర్డ్- ఇంటర్నేషనల్ పాఠశాల యాంగాన్ (ఐ ఎస్ వై), క్రేన్ ఇంటర్నేషనల్ పాఠశాల యాంగాన్ (సి ఐ ఎస్ ఎమ్), ఇంటర్నేషనల్ పాఠశాల ఆప్ మాయన్మార్ (ఐఎస్ ఎమ్) నాలుగు అంతర్జాతీయ పాఠశాలలు కూడా ఉన్నాయి.

ఇవి కూడా చూడండి

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. రామారావు, మారేమండ (1947). భారతీయ నాగరికతా విస్తరణము (1 ed.). సికిందరాబాద్, వరంగల్: వెంకట్రామా అండ్ కో. Retrieved 9 December 2014.
"https://te.wikipedia.org/w/index.php?title=మయన్మార్&oldid=4336537" నుండి వెలికితీశారు