ఆంగ్ సాన్
బోగ్ యోక్ ఆంగ్ సాన్ (Burmese: ဗိုလ်ချုပ် အောင်ဆန်း; MLCTS: buil hkyup aung hcan:, pronounced: [bòdʑంʊʔ àʊɴ sʰáɴ]); 1915 ఫిబ్రవరి 13 – 1947 జూలై 19) మయన్మార్ రాజనీతివేత్త, మొదట్లో కమ్యూనిస్ట్ ఆపైన సామాజిక ప్రజాస్వామ్య రాజకీయనాయకుడు, విప్లవకారుడు, జాతీయవాది, తత్మాదావ్ స్థాపకుడు, ఆధునిక మయన్మార్ కు జాతిపితగా పరిగణింపబడ్డవారు. ఆయన బ్రిటీష్ క్రౌన్ కాలనీ ఆఫ్ బర్మాకు 1946 నుంచి 1947 వరకూ 5వ ప్రీమియర్ గా పనిచేశారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ బర్మాకు సంస్థాపకుడు.
బ్రిటీష్ పాలన నుంచి బర్మాకు స్వాతంత్ర్యం రావడానికి ఆయన ప్రధాన కారణంగా నిలిచారు, అయితే స్వాతంత్ర్యానికి 6 నెలల ముందే హత్యకు గురయ్యారు. స్వాతంత్ర్యానికి ప్రధాన నిర్మాతగానూ, యూనియన్ ఆఫ్ బర్మా స్థాపకునిగానూ ప్రఖ్యాతి వహించారు. బర్మీస్ ప్రజలు ఆయనను ఇప్పటికీ విస్తృతంగా అభిమానిస్తూంటారు, ప్రస్తుత బర్మీస్ రాజకీయాల్లోనూ ఆయన పేరు ప్రముఖంగా వినవస్తుంది. బర్మా ప్రజలు అభిమానంగా బోగ్యోక్ (మేజర్ జనరల్) అని పిలుచుకుంటూంటారు.
ఆంగ్ సాన్ కుమార్తె అంగ్ సాన్ సూకీ బర్మీస్ రాజనీతివేత్త, రాజకీయ నాయకురాలు, ఆమెకు నోబెల్ బహుమతి లభించింది. ప్రస్తుతం స్టేట్ కౌన్సిలర్ గా పనిచేస్తున్నారు. హ్తిన్ క్యావ్ క్యాబినెట్ లో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు మంత్రివర్గంలో తొలి మహిళగా గుర్తింపు పొందారు.
స్వాతంత్ర పోరాటం
[మార్చు]1933లో రంగూన్ విశ్వవిద్యాలయంలో చేరాకా వెనువెంటనే విద్యార్థి నాయకుడు అయ్యారు.[1] రంగూన్ విశ్వవిద్యాలయం విద్యార్థి యూనియన్ (ఆర్.యు.ఎస్.యు.) ఎగ్జిక్యూటివ్ కమిటీకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆయన ఆర్.యు.ఎస్.యు. పత్రిక ఓవే (నెమలి కేక)కు సంపాదకుడు అయ్యారు.[2] 1936 ఫిబ్రవరిలో హెల్ హౌండ్ ఎట్ లార్జ్ అన్న వ్యాసంలో సీనియర్ విశ్వవిద్యాలయాధికారిని గురించి విమర్శించిన విద్యార్థి రచయిత పేరు బయటపెట్టనందుకు తర్వాతికాలంలో రాజకీయ నాయకునిగా ఎదిగిన యునుతో సహా విశ్వవిద్యాలయం నుంచి బయటకు పంపేస్తామని బెదరించారు. ఇది రెండవ విశ్వవిద్యాలయ విద్యార్థుల సమ్మెకు దారితీసింది; విశ్వవిద్యాలయాధికారులు దీనితో బహిష్కరణను వెనక్కి తీసుకున్నారు. 1938లో ఆంగ్ సాన్ రంగూన్ విశ్వవిద్యాలయ యూనియన్ కీ, ఆల్-బర్మా స్టూడెంట్స్ యూనియన్ కీ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. వీటిలో ఆల్-బర్మా స్టూడెంట్స్ యూనియన్ సంస్థ సమ్మె మాండలేకి విస్తరించాకా ఏర్పాటయింది.[2][3] రంగూన్ విశ్వవిద్యాలయ చట్టం సవరణ కమిటీకి అదే సంవత్సరం ప్రభుత్వం ఆయనను విద్యార్థి ప్రతినిధిగా నియమించింది.
1938 అక్టోబరులో ఆంగ్ సాన్ న్యాయ విద్య క్లాసులు వదిలిపెట్టి, జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఈ సమయంలోనే బ్రిటీష్ వ్యతిరేకిగా, మరింత స్పష్టంగా ఇంపీరియలిజం వ్యతిరేకిగా మారారు. ఆయనను దోబామా ఆసియోన్ (మన బర్మన్ల అసోసియేషన్)లో చేరిన తర్వాత థాకిన్ అని పిలువనారంభించారు. (ప్రభువు లేదా దొర - ఈ పిలుపు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నది. బర్మాకి బర్మీస్ ప్రజలే ప్రభువులని, ఈ పిలుపును బ్రిటీష్ వారికే ప్రత్యేకించి వాడే రోజుల్లో ఇది సంకేతాత్మకమైనది). 1940 ఆగస్టు నుంచి ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. ఈ పదవిలో ఆయన వరుస జాతీయ స్థాయి సమ్మెలు నిర్వహించారు, ఆ వరుస సమ్మెలను ఎమ్ఇ 1300 విప్లవం (၁၃၀၀ ပြည့် အရေးတော်ပုံ, Htaung thoun ya byei ayeidawbon), బర్మీస్ క్యాలెండర్ సంవత్సరం మీదుగా ఈ పేరు వచ్చింది.
ఫ్రీడం బ్లాక్ (ဗမာ့ထွက်ရပ်ဂိုဏ်း, Bama-htwet-yat Gaing) అన్న మరో జాతీయవాద సంస్థను స్థాపించడంలో సహకరించారు, దానికి దోబామా, ఎ.బి.ఎస్.యు., రాజకీయ చైతన్యం కల సాధువులు, డాక్టర్ బా మా యొక్క పూర్ మేన్స్ పార్టీల మధ్య కూటమి ఏర్పరిచి దానికి ప్రధాన కార్యదర్శి అయ్యారు. 1939 ఆగస్టులో ఏర్పడ్డ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ బర్మా (సీపీబీ) వ్యవస్థాపక సభ్యునిగా, తొలి ప్రధాన కార్యదర్శిగా నిలిచారు.[4] కొద్దికాలానికి ఆయన పీపుల్స్ రివల్యూషనరీ పార్టీ సహ వ్యవస్థాపకునిగా స్థాపించారు, రెండవ ప్రపంచయుద్ధం తర్వాత దీనినే సోషలిస్టు పార్టీగా మార్చారు.[2] 1940 మార్చిలో భారతదేశంలోని రాంఘర్లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ జాతీయ సమావేశాలకు హాజరయ్యారు. బ్రిటీషర్లకు వ్యతిరేకంగా ఆయన విప్లవం తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలపై వారంటు విడుదల చేయగా, బర్మాకు పారిపోయారు.[3] కుమింటాంగ్ జాతీయ ప్రభుత్వం సహకారం కోరుతూ ముందు చైనాకు వెళ్ళారు,[5] కానీ ఆయనను అమోయ్ లో జపనీస్ సైనిక ఆక్రమణదారులు అడ్డుకున్నారు, చైనాకు ప్రభుత్వానికి బదులు జపాన్ వెళ్ళి సహాయం కోరమని చెప్పి ఒప్పించారు.[2]
రెండవ ప్రపంచయుద్ధంలో
[మార్చు]ఆంగ్ సాన్ జపాన్ లో ఉండగా, సాధారణంగా ఆయన రాశారని భావిస్తూండే బ్లూప్రింట్ ఫర్ ఎ ఫ్రీ బర్మా రచన జరిగింది, కానీ నిజానికి దాన్ని ఆయన రాయలేదు.[6] 1941 ఫిబ్రవరిలో ఆంగ్ సాన్ జపాన్ కు చెందిన ఫుమిమారో కోనో ప్రభుత్వం నుంచి ఆర్థికంగానూ, ఆయుధపరంగానూ సహాయం చేసే మాట తీసుకుని బర్మా తిరిగివచ్చారు. 30 కామ్రేడ్స్ అనే పేరుతో ప్రసిద్ధులైన యువ విప్లవకారుల బృందంతో మరింత సైనిక శిక్షణ స్వీకరించేందుకు జపాన్ వెళ్ళారు.[2] 1941 డిసెంబరు 26న మినిమి కికాన్ అనే రహస్య నిఘా సంస్థ బర్మా రోడ్ సమీపంలో ఏర్పడింది. దీని ప్రధానోద్దేశం బ్యాంకాక్, థాయ్ లాండ్ లో బర్మా ఇండిపెండెన్స్ ఆర్మీ సంస్థాపించిన సుజుకీ కైజీ నాయకత్వంలోని జాతీయవ్యాప్త తిరుగుబాటుకు సహకరించడం.[2] రెండవ ప్రపంచ యుద్ధంలో చాలావరకూ జపాన్ సైన్యంతో సహకరించింది.[2]
బర్మా రాజధాని రంగూన్ (యాంగోన్గా కూడా ప్రఖ్యాతం) కూడా 1942 మార్చి నాటికి జపాన్ సైన్యానికి పతనం అయిపోయింది. (బర్మా కాంపైన్ లో ఇది భాగం). థాకిన్ తున్ ఒకె కింద బర్మా ఇండిపెండెన్స్ ఆర్మీ, జపనీస్ మిలటరీ అడ్మినిస్ట్రేషన్ నడుస్తూండగా సమాంతర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ ప్రభుత్వం జపనీయులు ఆ ప్రభుత్వాన్ని కూలదోసేంత వరకూ సాగింది. రద్దైన బిఐఎ మళ్ళీ బర్మా డిఫెన్స్ ఆర్మీ (బిడిఎ)గా ఏర్పాటైంది. ఆంగ్ సాన్ కల్నల్ గా సైన్యానికి నాయకత్వం వహించారు.[3] ఆయనను తర్వాత జపాన్ కు ఆహ్వానించి, హిరోహితో చక్రవర్తి ఆర్డర్ ఆఫ్ రైజింగ్ సన్ అవార్డుతో సత్కరించారు.[3]
1943 ఆగస్టు 1లో జపనీయులు బర్మాను స్వతంత్ర దేశంగా ప్రకటించారు. ఆంగ్ సాన్ యుద్ధ మంత్రిగా నియమితులయ్యారు, ఆర్మీ పేరు తిరిగి మార్చి బర్మా నేషనల్ ఆర్మీ (బి.ఎన్.ఎ.)గా పెట్టారు.[3] ఆంగ్ సాన్ కు కొద్ది కాలానికే జపనీయులు స్వాతంత్ర్యం గురించి చేసిన ప్రమాణాలపైనా, వారికి యుద్ధంలో జయించగల అవకాశాలపైనా అనుమానం ప్రారంభమైంది
ఆంగ్ సాన్ బర్మాలో మరో తిరుగుబాటు చేయడానికి ప్రణాళికలు వేసుకోవడం ప్రారంభించారు, ఆ క్రమంలో కమ్యూనిస్టు నేతలు థాకిన్ థాన్ టన్, థాకిన్ సోల సహకారంతో భారతదేశంలోని బ్రిటీష్ అధికారులను సంప్రదించారు. 1945 మార్చి 27న బి.ఎన్.ఎ.కు నాయకత్వం వహిస్తూ జపనీస్ ఆక్రమణదారులకు వ్యతిరేకంగా తిరుగుబాటు ఆరంభించారు. మిత్రరాజ్యాలు జపాన్ ను గెలవడానికి సహకారం అందించారు.[2] 27 మార్చిని ప్రతిఘటన దినోత్సవంగా జరుపుకునేవారు, కొన్నేళ్ళకు మిలటరీ పాలకులు సైనిక దళాల దినోత్సవంగా ప్రకటించింది.
యుద్ధానంతరం
[మార్చు]1944 ఆగస్టులో బ్రిటీష్ రాక అనంతరం వారు యాంటీ-ఫాసిస్ట్ ఆర్గనైజేషన్ ప్రారంభించారు. అది బి.ఎన్.ఎ., కమ్యూనిస్టులు, సోషలిస్టులతో కలిసి ఐక్యవేదికగా యాంటీ-ఫాసిస్ట్ పీపుల్స్ ఫ్రీడం లీగ్ గా రూపాంతరం చెందింది. బర్మా జాతీయ సైన్యానికి పేట్రియాటిక్ బర్మీస్ ఫోర్స్ గా పేరుమార్చి, జపనీయులను దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తిప్పికొట్టేకొద్దీ బ్రిటీషర్లు నిరాయుధీకరిస్తూ పోయారు. సిలోన్ లో 1945 సెప్టెంబరులో జరిగిన కండీ కాన్ఫరెన్సులో లార్డ్ మౌంట్ బాటన్తో జరిగిన ఒప్పందం అనుగుణంగా పేట్రియాటిక్ బర్మీస్ ఫోర్సెస్ ను రద్దుచేసి బ్రిటీష్ నాయకత్వంలోని బర్మా సైన్యంలో వివిధ హోదాలను రద్దైన సైన్యంలో సభ్యులకు ఇచ్చారు.[2] ఆంగ్ సాంగ్ కు బర్మా సైన్యంలో డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ పదవిని ఇవ్వజూపగా ఆయన పౌర రాజకీయ నాయకునిగానూ, పితు యెబావ్ తాత్ (పీపుల్స్ వాలంటీర్ ఆర్గనైజేషన్)లో సైనిక నేతగానూ ఉండేందుకు నిర్ణయించుకుని తిరస్కరించారు.[2]
1946 జనవరిలో ఆంగ్ సాన్ ఎఎఫ్‌పిఎఫ్‌ఎల్ అధ్యక్షుడయ్యారు, అప్పటికి పౌర ప్రభుత్వం బర్మాలో ప్రారంభమై ఏడాది గడిచింది. సెప్టెంబరులో ఆయనను ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ డిప్యూటీ ఛైర్మన్ లేదా బ్రిటీష్-బర్మా క్రౌన్ కాలనీకి 5వ ప్రీమియర్ గా కొత్త బ్రిటీష్ గవర్నర్ సర్ హ్యూబెర్ట్ రాన్స్ ఎంపికచేశారు. In September, he was appointed Deputy Chairman of the Executive Council or 5th Premier of British-Burma Crown Colony by the new British Governor Sir Hubert Rance, and was made responsible for defence and external affairs.[2] Rance and Mountbatten took a very different view from the former British Governor, Sir Reginald Dorman-Smith, and also Winston Churchill, who had called Aung San a "traitor rebel leader".[2] A rift had already developed inside the AFPFL between the Communists and Aung San, leading the nationalists and Socialists, which came to a head when Aung San and others accepted seats on the Executive Council. The rift culminated in the expulsion of Thakin Than Tun and the CPB from the AFPFL.[2][3]
References
[మార్చు]- ↑ Maung Maung (1962).
- ↑ 2.00 2.01 2.02 2.03 2.04 2.05 2.06 2.07 2.08 2.09 2.10 2.11 2.12 Martin Smith (1991).
- ↑ 3.0 3.1 3.2 3.3 3.4 3.5 Aung San Suu Kyi (1984).
- ↑ Lintner, Bertil (1990).
- ↑ Stewart, Whitney. (1997).
- ↑ Gustaaf Houtman, In Kei Nemoto (ed) – Reconsidering the Japanese military occupation in Burma (1942–45) (30 May 2007).