Jump to content

అంగ్ సాన్ సూకీ

వికీపీడియా నుండి
అంగ్ సాన్ సూకీ
အောင်ဆန်းစုကြည်
మొదటి మయయన్మార్ స్టేట్ కౌన్సిలర్
Assumed office
6 ఏప్రిల్ 2016
అధ్యక్షుడుహితిన్ క్యా
మైంత్ స్వే (ఏక్టింగ్)
విన్ మైంత్
అంతకు ముందు వారుథైన్ సైన్ (మయన్మార్ ప్రధాని, 2011)
మయన్మార్ విదేశీ వ్యవహారాల మంత్రి
Assumed office
30 మార్చి 2016
అధ్యక్షుడుహితిన్ క్యా
మైంత్ స్వే (ఏక్టింగ్)
విన్ మైంత్
Deputyక్యా టిన్
అంతకు ముందు వారువున్నా మాంగ్ ల్విన్
మయన్మార్ అధ్యక్ష కార్యాలయ మంత్రి
Assumed office
30 మార్చి 2016
అధ్యక్షుడుహితిన్ క్యా
మైంత్ స్వే (ఏక్టింగ్)
విన్ మైంత్
అంతకు ముందు వారుఆంగ్ మిన్
హ్లా తున్
సో మాంగ్
సో థైన్
థైన్ న్యుంట్
మయన్మార్ విద్యామంత్రి
In office
30 మార్చి 2016 – 5 ఏప్రిల్ 2016
అధ్యక్షుడుహితిన్ క్యా
అంతకు ముందు వారుఖిన్ సాన్ యి
తరువాత వారుమ్యో థైన్ గ్యి
విద్యుత్, శక్తి వనరుల మంత్రి
In office
30 మార్చి 2016 – 5 ఏప్రిల్ 2016
అధ్యక్షుడుహితిన్ క్యా
అంతకు ముందు వారుఖిన్ మాంగ్ సో
జెయా ఆంగ్
తరువాత వారుపే జిన్ టన్
నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ అధ్యక్షురాలు
Assumed office
18 నవంబరు 2011
అంతకు ముందు వారుఆంగ్ స్వే
మయన్మార్ ప్రతిపక్ష నాయకురాలు
In office
2 మే 2012 – 29 జనవరి 2016
అధ్యక్షుడుథైన్ సైన్
అంతకు ముందు వారుసై హ్లా క్యా
నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ ప్రధాన కర్యదర్శి
In office
27 సెప్టెంబరు 1988 – 18 నవంబరు 2011
అంతకు ముందు వారుస్థానం స్థాపించబడింది
తరువాత వారుస్థానం తొలగించబడినది
కాహ్ము టౌన్ షిప్
బర్మీస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ సభ్యురాలు
In office
2 మే 2012 – 30 మార్చి 2016
అంతకు ముందు వారుసో టింట్
తరువాత వారుఖాళీ
మెజారిటీ46,73 (71.38%)
వ్యక్తిగత వివరాలు
జననం (1945-06-19) 1945 జూన్ 19 (వయసు 79)
రంగూన్, బర్మా, (ప్రస్తూం మయన్మార్)
రాజకీయ పార్టీనేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ
జీవిత భాగస్వామిమైఖేల్ ఆరిస్ (వివాహం 1972 జనవరి 1; మరణం 1999 మార్చి 27)
సంతానంఅలెక్సాండర్ ఆరిస్ తో కలసి ఇద్దరు
తల్లిదండ్రులుఆంగ్ సా (తండ్రి)
ఖిన్ క్యీ (తల్లి)
నివాసం54 యూనివర్శిటీ అవెన్యూ
కళాశాలఢిల్లీ విశ్వవిద్యాలయం
సెయింట్ హ్యూ కళాశాల, ఆక్స్‌ఫర్డు
SOAS, లండన్ విశ్వవిద్యాలయం
పురస్కారాలుRafto Prize
Sakharov Prize
Nobel Peace Prize
Jawaharlal Nehru Award
International Simón Bolívar Prize
Olof Palme Prize
Bhagwan Mahavir World Peace
Congressional Gold Medal
సంతకం

ఆంగ్ సాన్ సూకీ 1945 జూన్ మాసంలో జన్మించింది. ఆమె బర్మాదేశ ప్రతిపక్షనాయకురాలు. ఆమె బర్మాలో ప్రముఖ రాజకీయవాది, "నేషనల్ లీగ్ ఫర్ డెమాక్రసీ " (ఎన్ ఎల్ డి) చైర్ పర్సన్. 1990 జనరల్ ఎన్నికలలో ఎన్ ఎల్ డి 59% ఓట్లను, 81% (మొత్తం 485 స్థానాలలో 382 స్థానాలు) పార్లమెంట్ స్థానాలను గెలుచుకుంది. అయినప్పటికీ ఆమెను ఎన్నికలకు ముందే బర్మా ప్రభుత్వం గృహనిర్బంధంలో ఉంచింది. ఆమె 1987 నుండి 2010లో విడుదల అయ్యేవరకూ దాదాపు 15 సంవత్సరాలకాలం గృహనిర్బంధంలోనే ఉంచబడింది. ఆమె ప్రపంచంలో ప్రముఖ రాజకీయఖైదీగా గుర్తించబడింది.

సూకీ 1990లో స్వతంత్ర భావాల కొరకు రాఫ్టో, షాఖ్రోవ్ పురస్కారం అందుకున్నది. 1991లో నోబుల్ బహుమతి అందుకున్నది. భారత ప్రభుత్వం అంతర్జాతీయ అవగాహన కొరకు ఆమెకు జవహర్ లాల్ పురస్కారం ఇచ్చింది. వెనుజులా ప్రభుత్వం ఆమెకు "సైమన్ బోలీవర్" పురస్కారం ఇచ్చి గౌరవించింది. 2007 లో కెనడా ప్రభుత్వం ఆమెకు గౌరవ పౌరసత్వం ఇచ్చి గౌరవించింది. కెనడా నుండి ఈ గౌరవాన్ని అందుకున్న వారిలో ఆమె నాలుగవది. 2011లో ఆమె వాలెన్ బర్గ్ పతకం అందుకున్నది. 2012 సెప్టెంబరు 19 తేదీన ఆంగ్ కై సూకీ కాంగ్రెస్ బంగరు పతకం అధ్యక్షుని స్వాతంత్ర్య పతకంతో చేర్చి అందుకున్నది. ఇది సంయుక్తరాష్ట్రాల పురస్కారాలలో అత్యుత్తమమైనది.

2012 ఏప్రిల్ 1 ఆమె పార్టీ అయిన నేషనల్ కాంగ్రెస్ లీగ్ ఫర్ డెమక్రసీ ఆమె బర్మా దిగువ సభ కొరకు ఎన్నికైనట్లు ప్రకటించింది. ఆమె పార్టీ బర్మా దిగువ సభ 45 ఖాళీ స్థానాలలో 43 స్థానాలను ఎన్నికలలో గెలుచుకుంది. తరువాత రోజు అధికారికంగా ఎన్నికల కమిషన్ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. రాఖిన్ రాష్ట్రం లోని యాంటీ-రోహింగ్యా దౌర్జన్య కారుల విషయంలో మౌనం వహించినందుకు అదే సంవత్సరం కొంతమంది ఉద్యమకారుల చేత ఆమె విమర్శించబడింది. సూకీ ఫాదర్ ఆఫ్ బర్మాగా కీర్తించబడిన అంగ్ సాన్ ఏకైక పుత్రిక.

పేరు వెనుక చరిత్ర

[మార్చు]

ఆంగ్ సాన్ సూకీ పేరు మూడు బాంధవ్యాల నుండి తీసుకో బడింది. ఆంగ్ సాన్ అనేది తండ్రి నుండి, సూ అనేది తాత నుండి, కీ అనేది తల్లి ఖిన్ కీ నుండి గ్రహించబడింది. డా అనేది ఆమె పేరులో భాగం కాదు. డా అనేది అమ్మగారు (మేడం) లా గౌరవ పదం. ఇది పెద్ద వారిని పేరున్న స్త్రీలను సూచించే పదం. బర్మీయులు ఆమెను తరచుగా " డా సూ " (లేక ఆమయ్ సూ, అనుయాయులు మదర్ సూ ) అని సంబోధిస్తుంటారు. ఇంకా సూ ఆంటీ, దాక్టర్ సూ ఆని కూడా పిలుస్తుంటారు. మిస్ సూకీ అని విదేశీయ మాధ్యమం అంటుంది. ఏది ఏమైనప్పటికీ ఇతర బర్మీయులకు ఉన్నట్లు ఆమెకు మారు పేరు ఏమీ లేదు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఆంగ్ సాన్ సూకీ 1945 జూన్ 19 తారీఖున రంగూన్ (ప్రస్తుతం యాంగన్) లో పుట్టింది. ఆమె తండ్రి అయిన ఆంగ్ సాన్ 1947 లో బర్మా సైన్య స్థాపకుడే కాక బర్మీయుల స్వాతంత్ర్యం కొరకు ఆంగ్లేయులతో దౌత్యం నడిపాడు. అదే సంవత్సరం ఆయన తన రాజకీయ శత్రువుల చేత కాల్చి చంపబడ్డాడు. ఆమె తన తమ్ములైన సాన్ లిన్, ఆంగ్ సాన్ ఊ తల్లి పోషణలో బర్మాలో నివసించారు. ఆంగ్ సాన్ ఊ తమ ఇంటి వద్ద ఉన్న అలంకార సరస్సులో పడి తన ఎనిమిదవ సంవత్సరంలో మరణించాడు. పెద్ద సహోదరుడైన సాన్ లిన్ కాలిఫోర్నియా లోని శాన్ డియోగోకు వలస వెళ్ళి తరువాత సంయుక్తరాష్ట్రాల పౌరుడు అయ్యాడు. ఆంగ్ సాన్ మరణించిన తరువాత కుటుంబం ఇన్యా లేక్ ప్రాంతానికి నివాసం మార్చుకున్నది. అక్కడ సూకీకి వైవిధ్యమైన నేపథ్యం కలిగిన ప్రజల పరిచయం అయింది. రాజకీయ నేపథ్యం, మతం వాటిలో ప్రధానమైనవి. సూకీ " మెథడిస్ట్ ఇంగ్లీషు ఉన్నత పాఠశాల"లో విద్యాభ్యాసం సాగించింది. ఆమె తరువాత బౌద్ధ మతానికి చెందినది.

సూకీ తల్లి ఖిన్‌కీ కొత్తగా రూపొందించబడిన బర్మా ప్రభుత్వంలో రాజకీయ ప్రాముఖ్యత సంపాదించింది. 1960లో ఆమె భారతదేశప్రభుత్వానికి , నేపాల్ ప్రభుత్వానికి రాజకీయ ప్రతినిధులను నియమించింది. ఆమెను అనుసరించిన ఆంగ్ సాన్ సుకీ ఢిల్లీ లోని జీసెస్ అండ్ మేరీ స్కూల్ కాన్వెంటులో విద్యాభ్యాసం పూర్తిచేసి న్యూఢిల్లీ శ్రీ రాం కాలేజ్‌లో పట్టభద్రురాలైంది. ఆమె 1964లో పొలిటికల్ పట్టభద్రురాలైంది. సూకీ తన విద్యాభ్యాసం కొనసాగించి 1969లో ఆక్స్‌ఫర్డ్ హాస్ కాలేజ్ నుండి ఫిలాసఫీ, పాలిటిక్స్ , ఎకనమిక్స్ మాస్టర్ డిగ్రీ పొందింది. విద్యాభ్యాసం తరువాత ఆమె కుటుంబ మిత్రుడూ ఒకప్పుడు బర్మా పాప్ గాయకుడు అయిన మా తాన్ ఈతో న్యూయార్క్ నగరంలో నివసించింది. ఆమె సంయుక్త రాష్ట్రాలలో మూడు సంవత్సరాలు ప్రణాళిక వ్యవహారాల శాఖలో పని చేసింది. 1971లో సూకీ టిబెటన్ సంస్కృతి స్కాలర్" డాక్టర్ మైకేల్ ఆరిస్"ను వివాహం చేసుకుని భూటాన్‌లో నివసించసాగింది. తరువాత సంవత్సరంలో ఆమె లండన్ నగరంలో తన మొదటి సంతానమైన అలెగ్జాండర్ ఆరిస్‌కు జన్మనిచ్చింది. 1977లో ఆమె రెండవ కుమారుడైన కింకు జన్మనిచ్చింది. 1985-1987 మధ్య కాలంలో బర్మీస్ సాహిత్యంలో రీసెర్చ్ స్టూడెంటుగా లండన్ లోని " ఓరియంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్ " అనే పాఠశాలలో పనిచేసింది. 1990లో ఆమె ఆనరరీ ఫెలోగా ఎన్నిక చెయ్యబడింది. తరువాత రెండు సంవత్సరాలు ఆమె సిమ్లాలోని " ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ అడ్వాంస్డ్ స్టడీస్ "లో ఫెలోగా ఉన్నది. ఆమె గవర్నమెంట్ ఆఫ్ యూనియన్‌లో కూడా పనిచేసింది.

1988లో బర్మాకు తిరిగి వచ్చిన సూకీ ప్రారంభంలో రోగగ్రస్థురాలైన తల్లి కొరకు అక్కడే ఉండి పోయింది. తరువాత మెల్లగా ప్రజాస్వామ్య ఉద్యమానికి నాయకత్వం వహించింది. 1995లో ఆఖరిసారిగా ఆరిస్ క్రిస్‌మస్ సందర్భంలో సూకీని కలుసుకుని తిరిగివెళ్ళడమే వారి చివరి కలయిక. తరువాత బర్మా నియంతృత్వ ప్రభుత్వం ఆరిస్‌ను బర్మాలోకి ప్రవేశించడానికి అనుమతించలేదు. 1997లో ఆరిస్‌కు కేన్సర్ ఉన్నట్లు గుర్తించబడింది. అది చివరికి ఆరిస్ మరణానికి దారితీసింది. అంతర్జాతీయ ప్రముఖులు, పలు సంస్థలు అమెరికా దేశం నుండి, ఐక్యరాజ్య సమితి అధ్యక్షుడు " కోఫీ అన్నన్ " , రెండవ పోప్ జాన్‌పాల్ వంటి వారు అభ్యర్ధించినా బర్మా ప్రభుత్వం ఆరిస్ ప్రవేశంను అనుమతించలేదు. బదులుగా ఆరిస్ ను చూడడానికి శాశ్వతంగా దేశం వదిలి పొమ్మని సూకీని ఆదేశించింది. అందుకు వారు ఆరిస్ సంరక్షణ భారం వహించే వసతి వారి వద్దలేదన్న సాకు చెప్పి ఆ అభ్యర్థనలను తిరస్కరించారు. తిరిగి బర్మాలో ప్రవేశించవచ్చని ఆమెను బర్మా ప్రభుత్వం తాత్కాలికంగా విడుదల చేసింది. అయినప్పటికీ ఆమె నిరంకుశ ప్రభ్యుత్వాన్ని విశ్వసించక బర్మాను వదిలి వెళ్ళడానికి నిరాకరించింది.

1999 మార్చ్ 27 తేదీన తన 23వ ఏట ఆరిస్ తుది శ్వాస విడిచాడు. ఆరిస్ భార్య సూకీ గృహనిర్బంధంలో ఉంచబడిన తరువాత ఆమెను ఐదు మార్లు మాత్రమే కలుసుకున్నాడు. 1995లో కలుసుకున్నదే ఆఖరి కలయిక. సూకీ నుంచి వారి కుమారులు దూరం చేయబడ్డారు. సూకీకి దూరంగా యునైటెడ్ కింగ్ డంలో నివసిస్తున్న ఆమె కుమారులు ఆమెను 2011 నుండి కలుసుకుంటున్నారు. 2008 మే మాసంలో నర్గీస్ తుఫాను బర్మాను దెబ్బతీసిన తరుణంలో సూకీ తన ఇంటి కప్పును కోల్పోయి విద్యుత్ కొరత కారణంగా శిధిలమైన సరస్సు తీర గృహంలో ఒంటరిగా గాఢాంధకారంలో మిగిలి పోయింది.

ఆరంభకాల రాజకీయాలు

[మార్చు]

1988లో సూకీ బర్మాలో ప్రవేశించిన సమయంలోనే అధికకాలం సైనికపాలకుడైన జనరల్ నే విన్ పాలన పతనం అయింది. ఆ సందర్భంలో 1988 ఆగస్ట్ 8 తేదీన సామూహిక విధ్వంసకాండ చెలరేగింది. (8-8-88 తేదీ శుభప్రథమైనదిగా భావించబడుతుంది). ఈ రోజు 8888 పునరుత్థానంగా అభివర్ణించబడింది.సూకీ 1988 ఆగస్ట్ 26 "షూడగాన్ పగోడా"లో గుమికూడిన 5 లక్షల ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రజాప్రభుత్వ నిర్మాణానికి ఆహ్వానం పలికింది. అయినప్పటికీ సెప్టెంబర్‌లో ఎలాగో కొత్త సైనికాధికారి " జుంటా" అధికారాన్ని చేజిక్కించుకున్నాడు.

మహాత్మా గాంధీ సిద్ధాంతాలతో ప్రభావితమైన సూకీ బౌద్ధ మత అహింసా సిద్ధాంతాన్ని బలపరుస్తూ 1988 సెప్టెంబరు 27న " నేషనల్ లీగ్ ఫర్ డెమాక్రసీ " పార్టీని స్థాపించింది. జుంటా ప్రభుత్వం సూకీని 1989 జూలై 20వ తేదీన గృహనిర్బంధంలో ఉంచింది . ఆమె దేశం వదిలి వెళ్ళిపోతే స్వతంత్రంగా ఉండడానికి అవకాశం ఇచ్చారు. అయినప్పటికీ సూకీ ఆ అవకాశాన్ని నిరాకరించింది.

1990 ఎన్నికలు

[మార్చు]

1996 దౌర్జన్యం

[మార్చు]

1996లో నేషనల్ లీగ్ ఫర్ డెమాక్రసీ నాయకులైన టిన్ ఊ, యూకై మౌంగ్, మరో తొమ్మిది మంది ఇతరులు ఉన్న మోటర్ వాహనం యాంగన్‌లో ప్రయాణిస్తున్న తరుణంలో ఆమె మీద దాడి జరిగింది. 200 మంది మనుషులు ఇనుపగొలుసులు, ఇనుప లాఠీలు, రాళ్ళు, ఇతర ఆయుధాలతో వాహనాన్ని అడ్డగించారు. ఈ దాడిలో సూకీ కారు ముందు భాగం ధ్వంసం అయింది.ఈ దాడికి పాల్పడింది యూనియన్ సాలిడారిటీ, డెవలప్ మెంట్ అసోసియేషన్ ఏర్పాటుచేసిన కిరాయి సైన్యం అని ఊహించబడింది. ఎన్ ఎల్ డి ప్రభుత్వానికి అధికారిక ఫిర్యాదు చేసింది రిపోర్టుల ఆధారంగా విచారణ జరిపినా ఎలాంటి చర్య తీసుకో లేదు.

గృహనిర్బంధం

[మార్చు]

ఆంగ్ సాన్ సూకీ 21 సంవత్సరాల కాలంలో 15 సంవత్సరాలు గృహనిర్బంధంలోనే జీవితం గడిపింది. ఆమె రాజకీయజీవితం ఆరంభించిన కాలం నుండి ఆమెకు అనేక సందర్భాలలో తనపార్టీ నాయకులతో సమావేశాలు, విదేశీ అతిధులతో కలయిక వంటివి నిరాకరించబడ్డాయి. సూకీ ఒక ముఖాముఖిలో తాను గృహనిర్బంధంలో ఉన్న సమయయంలో ఆమె తన భర్త పంపిన మనస్తత్వ పుస్తకపఠనం, రాజకీయాలు, జీవితకథలను చదవడంతో గడిపానని వివరించింది. ఆమె కొన్నిమార్లు పియానోవాయించడం, అనుమతించిన అతిధులతో సమావేశాలు వంటి వాటితో ఆమె సమయం గడిచింది. మాధ్యమం కూడా సూకీని చూడడానికి వీలుపడకుండా కట్టడి చేయబడింది. 1994 సెప్టెంబరు 20 తేదీన పత్రికా సంపాదకుడైన మౌరిజియో జియూలినో ఆమె చాయాచిత్రాలు తీస్తున్న సమయంలో అధికారులతో అడ్డగించబడి ఫొటో ఫిలిం, టేపులు మిగిలిన వ్రాతలు స్వాధీనం చేసుకొనబడ్డాయి. బదులుగా ఆమె గృహనిర్బంధ కాలంలో 1994 లో బర్మా నాయకుడైన జనరల్ ఖిన్ న్యుయంట్ తో మొదటిసారిగా సమావేశం జరిగింది. సూకీ ఆరోగ్యం క్షీణించి కొన్ని సందర్భాలలో ఆసుపత్రిలో చేర్చబడింది.

బర్మా ప్రభుత్వం సూకీని అడ్డగించి గృహనిర్బంధంలో పెట్టడం బర్మాదేశం సమాజ శాంతి భద్రత లను, దేశ స్థిరత్వాన్ని భూస్థాపితం చేసినట్లు భావించబడింది. 1975లో అమలు చేయబడిన "స్టేట్ ప్రొటెక్షన్ ఏక్ట్" (ఈ చట్టం ప్రభుత్వానికి ప్రజలను విచారణ లేకుండా ఐదు సంవత్సరాల కాలం నిర్బంధంలో ఉంచడానికి అనుమతిస్తుంది), సెక్షన్ 22 చట్టం " తిరుగుబాటు దార్ల ప్రమాదం నుండి దేశాన్నిరక్షించాలి " అన్న కారణంతో అమలుకు తీసుకురాబడింది. ఆమె తన విడుదల కొరకు వదలకుండా అప్పీలు చేస్తూనే వచ్చింది. 2010 నవంబరు 12 న నిరంకుశ ప్రభుత్వం నేపథ్యంలో పనిచేసిన " యూనియన్ సాలిడారిటీ అండ్ డెవలప్ మెంట్ పార్టీ (యు.ఎస్.డి.పి)ఎన్నికలలో గెలిచిన తరువాత దాదాపు 20 సంవత్సరాల తరువాత నిరంకుశ ప్రభుత్వం ఆంగ్ సాన్ సూకీ విడుదల పత్రాలమీద సంతకం చేసింది. సూకీ గృహనిర్బంధం 2010 నవంబర్ 13 తేదీన ముగింపుకు వచ్చింది.

ఐక్యరాజ్యసమితి జోక్యం

[మార్చు]

ఐక్యరాజ్యసమితి (యు.ఎన్) జుంటా , సుకీ మధ్య రాజీచర్చలకు మార్గం సుగమం చెయ్యడానికి ప్రయత్నించింది. 2002 మే 6 న ఐక్యరాజ్యసమితి నాయకత్వంలో జరిగిన రహస్య సమావేశం సుకీ విడుదలకు దారితీసింది. బర్మాప్రభుత్వ స్పోక్స్ మాన్ " మేము ఇరువురం ఒకరిని ఒకరం విశ్వసిస్తున్నాం కనుక ఆమెను స్వతంత్రంగా తిరగడానికి అనుమతించాం". 2003 మే 30 తేదీన 1996 లో జరిగినట్లు తిరిగి దాడి జరిగింది. ఉత్తరప్రాంత గ్రామమైన " డిపేయిన్" లో ఆమెప్రయాణం చేస్తున్న కారవేన్ మీద ప్రభుత్వ నియమిత కూలి మూక ఈ అఘాయిత్యానికి పాల్పడింది. ఈ దాడిలో సుకీ మద్దతుదార్లను చంపడం, గాయపరచడం చేసారు. సుకీ కారు డ్రైవర్ కో క్యా సో లిన్ " సాయంతో పారిపోయి నిరాపాయంగా తప్పించుకున్నది. అయినప్పటికీ యే-ఈ చేరుకునే సమయానికి ఖైదు చేయబడింది. బర్మా ప్రభుత్వం ఆమెను రంగూన్ లోని ఇంసేయిన్ జైలులో బంధించింది. 2003 ఆమె సర్జరీ తరువాత తిరిగి రంగూన్ జైలులో బంధించబడింది.

ఐక్యరాజ్యసమితి ప్రత్యేక దూత రాజాళీ ఇస్మాయిల్ " ఆంగ్ సాన్ సుకీ "ని కలుదుకున్నాడు. బర్మాలో తిరిగి ప్రవేశించడానికి అనుమతించని కారణంగా ఇస్మాయిల్ తన పదవికి రజీనామా చేసాడు. 2006లో ఇబ్రహీం గాంబారి " యుఎన్ అండర్ సెక్రెటరీ-జనరల్ (యు.ఎస్.జి) ఆఫ్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ పొలిటికల్ అఫైర్స్ " ఆంగ్ సాన్ సుకీని కలుసుకున్నాడు. 2004 తరువాత సుకీతో విదేశీదూత సమావేశం ఇదే. అదే సంవత్సరం తరువాత మరొకసారి అయన సుకీని కలుసుకుని సంభాషించాడు. 2007 అక్టోబర్ 2వ తేదీన గాంబారి తిరిగి వచ్చి షూ , ఇతర సభ్యులను కలుసుకున్న తరువాత నైపిడాలో సుకీతో సంభాషించాడు. బర్మా టెలివిషన్ గాంబారి , సుకీ సమావేశం ప్రసారం చేసింది. ఖైదు చేసిన నాలుగు సంవత్సరాల అనంతరం సుకీ మాధ్యమంలో కనిపించడం ఇదే మొదటి సారి.

ఐఖ్యరాజ్యసమితి బర్మాప్రభుత్వ ఈ ఏకపక్ష ఖైదును గురించి తమ అభిప్రాయం తెలియజేస్తూ ఇది స్వాతంత్రాన్ని అణగదొక్కే ఈ ఏకపక్ష నిర్ణయం " ఆర్టికల్ 9 యూనివర్సల్ డిక్లరేషన్ " ప్రకారం మానవహక్కుల ఉల్లంఘన అని ఖండిస్తూ సుకీని విడుదల చేయమని బర్మా అధికారులను కోరింది. బర్మా అధికారులు ఆ అభ్యర్ధను తోసిపుచ్చింది. బర్మా ప్రభుత్వం తమ ప్రత్యుత్తరంలో " ఆంగ్ సాన్ సుకీని ఖైదు చేయలేదు, ఆమెను రక్షణ కొరకు మాత్రమే సురక్షితమైన నిర్బంధంలో ఉంచాము. తరువాత దేశీయ చట్టఉల్లంఘన నెపంతో సుకీ మీద చట్టపరమైన చర్యలకు ఉపక్రమించింది. ఆ చర్యలను మాయాన్మార్ పోలీస్ ఫోర్స్ అధికారి బ్రిగ్-జనరల్ ఖిన్-యి నిరాకరించాడు. 2007 జనవరి 18తేదీన ప్రభుత్వం చేత నడుపబడుతున్న " న్యూ లైట్ ఆఫ్ మాయన్మార్ " నోబుల్ బహుమతి ధనాన్ని ప్రభుత్వానికి చెల్లించవలసిన పన్ను చెల్లించకుండా దేశం వెలుపల వెచ్చించబడిందని సుకీని నిందిస్తూ ప్రచురించింది. ఐక్యరాజ్య యు.ఎస్ కు చెందిన ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌంసిల్ నిర్ణయంతో ఆ నిందారోపణ అపజయంపాలైంది. వారు ఇది అంతర్జాతీయ బధ్రతకు బెదిరింపని బర్మాప్రభుత్వాన్ని ఖందించారు. ఈ నిర్ణయం జుంటా ప్రభుత్వంతో బలంసిన సంబంధాలు కలిగి ఉన్న చైనాప్రభుత్వ బలమైన వ్యతిరేకత కారణంగా వీగిపోయింది. (తరువాత చైనా ప్రభుత్వం రష్యా, దక్షిణాఫ్రికాలతో చేరి ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేసింది).

2007 నవంబరులో సుకీ తన రాజకీయ మద్దతుదారులైన నేషనల్ లీగ్ ఫర్ డెమాక్రసీ నాయకులను ప్రభుత్వ మంత్రి సమక్షంలో కలుసుకున్నారు. ఐక్యరాజ్యసమితి దూత ఇబ్రహీం గాంబారి రెండవసారి బర్మాకు వచ్చి వెళ్ళిన కొన్ని గంటల తరువాత జుంటా ప్రభుత్వ టెలువిషన్‌లో అధికారిక ప్రకటన చేసాడు. సుకీతో సంభాషించడానికి ఆహ్వానం ఎన్.ఎల్.డి నిర్ధారించిందని ఆ ప్రకటన సారాంశం. 2009 జూలై 3 తేదీన ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ బాన్ కీ-మూన్ బర్మాకు వెళ్ళి సుకీని విడుదల చేయమని ప్రజాప్రభుత్వ సంస్కరణలు చేయమని బర్మా ప్రభుత్వం మీద వత్తిడి తీసుకువచ్చాడు. ఏమైనప్పటికీ ఆయన బర్మాను విడిచి పోయే సమయంలో జుంటా అధికారి సుకీని కలుసుకోవడానికి నిరాకరించడం వలన తాను చాలా నిరాశకు గురి అయ్యానని అన్నాడు. అలాగే ఆయన వారు ముఖ్యమైన అవకాశాన్ని జారవిడుచుకున్నందుకు కూడా తాను చాలా నిరాశకు గురి అయ్యానని బర్మా ప్రభుత్వ అధికారులతో అన్నాడు.

నిర్బంధ కాలజీవితం

[మార్చు]
  • 1989 జూలై 20వ తేదీన " మార్షియల్ లా " ఆధారంగా బర్మాప్రభుత్వం విచారణ రహితంగా మూడు సంవత్సరాల కాలం సుకీని ఖైదులో ఉంచింది.
  • 1995 జూలై 10వ తేదీన గృహనిర్బంధం నుండి విడుదల.
  • 2000 సెప్టెంబరు 23వ తేదీన గృహనిర్బంధంలో ఉంచబడింది.
  • 2002 మే 6వ తేదీన 19 మాసాల గృహనిర్బంధం తరువాత విడుదల చెయ్యబడింది.
  • 2003 మే 30వ తేదీన " డిపేయిన్ మాస్‌క్రీ " తరువాత ఆమె రహస్యంగా ఖైదుచేయబడి మూడు నెలల తరువాత గృహనిర్బంధంలో ఉంచబడింది.
  • 2007 మే 25వ తేదీన ఐక్యరాజ్య సమితి సెక్రెటరీ కోఫీ అన్నన్ నేరుగా చేసిన అభ్యర్థిన త్రోసివేస్తూ జనరల్ తాన్ షూ సుకీ గృహనిర్బంధాన్ని ఒక సంవత్సరం పొడిగించాడు.
  • 2007 అక్టోబరు 24 నాటికి

2007 ప్రభుత్వ వ్యతిరేక ప్రకటన

[మార్చు]

2009 ఆక్రమణ సంఘటన

[మార్చు]

అంతర్జాతీయ వత్తిడి , దేశీయ ఎన్నికలు

[మార్చు]

విడుదల

[మార్చు]

మధ్యంతర ఎన్నికలు

[మార్చు]

రాజకీయ విశ్వాసం

[మార్చు]

అంతర్జాతీయ మద్దతు

[మార్చు]

సేవాసంస్థలు

[మార్చు]

పరిశోధనలు

[మార్చు]

ఆత్మకథ

[మార్చు]

వివాదాలు

[మార్చు]

ఆమె మయన్మార్ స్టేట్ కౌన్సిలర్ పదవీకాలంలో ఆమె తన దేశం ఆర్థిక, జాతి సమస్యలను పరిష్కరించడంలో విఫలమైనదని అంతర్జాతీయంగా విమర్శలకు గురైనది. ముఖ్యంగా 2016 అక్టోబరు 9న ఎ.ఆర్.ఎస్.ఎ. తిరుగుబాటుదారులు బంగ్లాదేశ్-మయన్మార్ సరిహద్దు వెంబడి బర్మీస్ సరిహద్దు దళాల స్థావరాలపై దాడిచేయడంతో ఉత్తర రఖినె రాష్ట్ర సంఘర్షణ ప్రారంభం అయింది.[2][3]

మరో నాలుగేళ్ల జైలు శిక్ష

[మార్చు]

కరోనా వైరస్ పరిమితులను ఉల్లంఘించడం, వాటిని ఉల్లంఘించేలా ప్రజలను ప్రేరేపించడం, వాకీ-టాకీలు కలిగి ఉండటం, అక్రమంగా దిగుమతి చేసుకోవడం.. వంటి నేరఆరోపణలపై మయన్మార్ బహిష్కృత నేత ఆంగ్ సాన్ సూకీకి మరో నాలుగేళ్ల జైలు శిక్ష జనవరి 2022లో విధించింది కోర్టు.[4]

మూలాలు

[మార్చు]
  1. "Aung San Suu Kyi". Desert Island Discs. 27 January 2013. BBC Radio 4. http://www.bbc.co.uk/programmes/b01q7gvl. Retrieved 18 January 2014. 
  2. "Is the world getting Myanmar wrong?". The Economist. 26 October 2017.
  3. "Press freedom is waning in Myanmar". The Economist. 8 March 2018. Retrieved 9 March 2018.
  4. "Aung San Suu Kyi ఆంగ్ సాన్ సూకీకి మరో నాలుగేళ్ల జైలు శిక్ష". EENADU. Retrieved 2022-01-10.

వెలుపలి లింకులు

[మార్చు]