కరోనా వైరస్ 2019

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
2019–20 కరోనావైరస్ వ్యాప్తి
COVID-19 Outbreak World Map.svg
2019–20 కరోనావైరస్ వ్యాప్ మ్యాప్ (4 మార్చి 2020)
  1000+ కేసులు నిర్ధారించబడింది
  100–999 కేసులు నిర్ధారించబడింది
  10–99 కేసులు నిర్ధారించబడింది
  1–9 కేసులు నిర్ధారించబడింది
COVID-19-outbreak-timeline.gif
యానిమేటెడ్ మ్యాప్ (12 జనవరి - 2 మార్చి 2020).
వ్యాధికరోనావైరస్ వ్యాధి 2019 (COVID-19)
వైరస్ స్ట్రెయిన్ సివియర్‌ అక్యూట్‌ రెస్పిరేటరీ సిండ్రోమ్‌ కరోనావైరస్ 2 (SARS-CoV-2)
ప్రదేశంప్రపంచవ్యాప్తంగా
మొదటి కేసు1 డిసెంబర్ 2019[1][2]
మూల స్థానంవూహన్, హుబే, చైనా[3]
క్రియాశీలక బాధితులు86,06,385[4]
ప్రాంతములు
188[4]

చైనాలో కొత్తగా పుట్టుకొచ్చిన వైరస్‌ .కరోనా వైరస్‌ శ్వాస వ్యవస్థపై ప్రభావం చూపే ఈ వైరస్‌ను 1960లో తొలిసారిగా కనుగొన్నారు.[5]పక్షులు, క్షీరదాల్లో వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. [6]ఈ వైరస్‌ వుహాన్‌లోని ఓ సముద్రపు ఆహార ఉత్పత్తుల మార్కెట్‌ లో కొత్త వైరస్‌ వ్యాపించినట్లు అధికారులు గుర్తించారు. వైరస్‌ కారణంగా వుహాన్‌లో ఇద్దరు మృతిచెందడంతో వీరి శాంపిల్స్‌ను లండన్‌కు పంపించి పరిశోధనలు నిర్వహించారు. పరిశోధనల్లో "కరోనావైరస్‌"గా గుర్తించారు. ఈ వ్యాధికి ఎటువంటి టీకాలు లేవు.[7][8][9][10][11][12] ఈ వైరస్ లక్షణాలను మొదట గుర్తించిన వైద్యుడు లీ వెన్లియాంగ్.

కరోనా వైరస్‌

కరోనా అర్థం[మార్చు]

కరోనావైరస్‌ లో కరోనా అంటే కిరీటం అని అర్థం. ఈ సూక్ష్మజీవిని ఎలక్ట్రానిక్‌ మైక్రోస్కోప్‌లో చూసినప్పుడు కిరీటం ఆకృతిలో కన్పించడంతో ఈ పేరు పెట్టారు. కరోనా క్రౌన్ అనే లాటిన్ పదం నుంచి వచ్చినది. ఇప్పటికే మొత్తం ఏడు కరోనావైరస్లు ఉన్నాయి,వీటిలో ‘మెర్స్ సీఓవీ’ అంటే ‘మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్’ అనేది ఒక రకమైన వైరస్. రెండోది ‘సార్స్ సీఓవీ’ అంటే ‘సివియర్ అక్యురేట్ రెస్పిరేటరీ సిండ్రోమ్’[13]. ఈ రెండురకాల కరోనావైరస్‌ల వల్ల సాధారణ జలుబు, జ్వరం వస్తుంది. ఈ సాధారణ కరోనావైరస్‌లు జంతువుల నుండి జంతువులకు. జంతువుల నుండి మనుషులకు వస్తుంది. చాలా ముఖ్యమైన కరోనావైరస్లలో సార్స్ SARS, మెర్స్ MERS ఉన్నాయి పరిశోధనల్లో తేలిందేమిటంటే ‘సార్స్ సీఓవీ’ వైరస్ పిల్లుల నుండి మనుషులకు సోకుతుందని. ‘మెర్స్-సీఓవీ’ ఒంటెల నుండి మనుషులకు సోకుతుందని తేలింది. ఇవి కాకుండా అనేక రకాలైన కరోనావైరస్‌లు జంతువుల నుండి జంతువులకే సోకుతున్నాయని వెల్లడైంది., ఇవి ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి ఎంత తేలికగా వ్యాపిస్తుందో అనే విషయం మీద స్పష్టత లేదు

కరోనా వైరస్ చాలా సాధారణంగా ఉంటుంది. శ్వాస తీసుకోవడంలో కాస్త ఇబ్బంది, దగ్గు లేదా ముక్కు కారడం లాంటి ప్రారంభ లక్షణాలతో దానిని గుర్తించవచ్చు. కానీ కరోనా కుటుంబానికే చెందిన సార్స్(సివియర్ ఎక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్), మర్స్(మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్) వంటి కొన్ని వైరస్‌లు చాలా ప్రమాదకరం.వుహాన్ నుంచి వ్యాపించిన అంటువ్యాధులకు కారణమైన వైరస్‌కు 'నావెల్ కరోనా వైరస్ లేదా nCoV'అని పేరు పెట్టారు. ఇది కరోనా కుటుంబానికి చెందిన కొత్త జాతి వైరస్. దీనిని ఇంతకు ముందు వరకూ మనుషుల్లో గుర్తించలేదు.[14] [15]

కరోనా వైరస్ - కోవిడ్-19[మార్చు]

కరోనావైరస్ అనే పేరుగల వైరస్ కలిగించే జబ్బు పేరు కోవిడ్-19 (Covid-19).[16] Coronavirus లోని Co vi లకు డిసీస్ (disease) లోని d ని చేర్చి Covid అనే పేరు పెట్టారు.[17] కరోనావైరస్ సోకిన తరువాత కోవిడ్-19 జబ్బు లక్షణాలు బయటపడేందుకు 1 నుండి 14 రోజుల వరకు పట్టవచ్చని, సాధారణంగా ఇది 5 రోజుల్లో బయట పడుతుందనీ ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.[16]

కరోనా వైరస్‌ మూలం[మార్చు]

ఈ వైరస్ శ్వాసవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.1960ల్లో ఈ వైరస్ ని కనుగొన్నారు. ఇప్పటి వరకూ ఆరు రకాల కరోనా వైరస్‌లను గుర్తించారు. ఇవి ఎక్కువగా పక్షులు, క్షీరదాలపై ప్రభావం చూపించేవి.కొత్తగా వచ్చిన కరోనా వైరస్ మనుషులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మామూలుగా వచ్చే influenza (flu) కన్నా COVID-19 కనీసం పదింతలు ఎక్కువ ప్రాణాంతకమైనది. COVID-19 నుండి 80% మంది తేలికపాటి లక్షణాలతొ (దగ్గు, జ్వరం)తో కోలుకుంటారు. 10-20 శాతం మందికి హాస్పిటల్ అడ్మిషన్ అవసరం పడుతుంది. 2-3 % మంది ఈ వ్యాధితో చనిపోతారు.

మానవ కరోనా వైరస్‌ జాతులు[మార్చు]

 • హ్యూమన్‌ కరోనావైరస్‌ 229ఈ
 • హ్యూమన్‌ కరోనావైరస్‌ ఓసీ 43
 • సివియర్‌ అక్యూట్‌ రెస్పిరేటరీ సిండ్రోమ్‌ (సార్స్‌-సీఓవీ)
 • హ్యూమన్‌ కరోనావైరస్‌ ఎన్‌ఎల్‌ 63
 • హ్యూమన్‌ కరోనావైరస్‌ హెచ్‌కేయూ 1
 • మిడిల్‌ఈస్ట్‌ రెస్పిరేటరీ సిండ్రోమ్‌ కరోనావైరస్‌ (మెర్స్‌-సీఓవీ)


1.హ్యూమన్ కరోనా వైరస్ 229ఈ (హెచ్ కోవ్-229ఈ): ఇవి ఆల్ఫా కరోనా వైరస్ జన్యువుతో సింగిల్ ఆర్ఎన్ఎను కలిగి ఉంటాయి. కరోనా విరిడే కుటుంబంలోని కరోనా విరినే ఉప కుటుంబానికి చెందినవి.ఇది హ్యూమన్ కరోనా వైరస్ ఓసీ43తో కలిసి సాధారణ జలుబుకు కారణమవుతుంది. ఇది ముదిరితే న్యూమోనియా, బ్రాంబైటిస్లకు దారి తీస్తుంది. దీంతో పాటు హ్యూమన్ రెస్టిరేటరి సిన్ సైటియల్ వైరస్ (హెచ్ఆరఎస్వి) గుర్తించారు. ఏడు మానవ కరోనా వైరస్లలో హెచ్కోవ్ 9ఈ ఒకటైనప్పటికీ వీటిలో హెచ్ కోవ్ ఎన్ఎల్63, హెచ్కోవ్-ఓసీ43 హెచ్ కోవ్-హెచ్ కెయు 1లు ఉన్నాయి. ఇవి ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తి అయ్యింది.

2.హ్యూమన్ కరోనా వైరస్ ఓసీ43 (హెచ్ కోవ్-ఓసీ43): ఇది కరోనా విరిడే కుటంబానికి చెందినది. బీటా కరోనా వైరస్ జన్యువును కలిగిన బీటా కరోనా వైరస్ 1 జాతికి చెందినది. ఈ వైరస్ ద్వారా సాధారణంగా 10 నుంచి 15 శాతం వరకు జలుబు వస్తుంది.

3.సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కరోనా వైరస్ (సార్స్-కోవ్): సార్స్ 2003, ఏప్రిల్ 6 ఆసియాలో ఆ తరువాత ప్రపంచవ్యాప్తంగా డబ్ల్యుహెచ్ఓ గుర్తించింది. సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్, వ్యాధీ సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కరోనా వైరస్ ద్వారా వస్తుంది. దీని ద్వారా కండరాల నొప్పి, తల నొప్పి, జ్వరం లక్షణాలు కనిపిస్తాయి. అనంతరం 2నుంచి 14 రోజుల్లో దగ్గు, న్యూమోనియా లాంటి శ్వాసకోశ సంబంధ లక్షణాలు కనిపిస్తాయి.

4.హ్యూమన్ కరోనా వైరస్ ఎన్ఎల్63 (హెచ్కోవ్ ఎన్ఎల్ 63): ఈ వ్యాధిని మొదట 2004లో నెదర్లాండ్లో ఏడు నెలల పాప బ్రాంఖైలిటిస్ తో బాధపడుతున్నప్పుడు గుర్తించారు. జ్వరం, దగ్గు, గొంతునొప్పి, న్యూమోనియా లాంటి లక్షణాలు ఈ వ్యాధిలో కనిపిస్తాయి. ఈ వ్యాధి అత్యధిక జనాభా గల ప్రాంతాలలో ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తిస్తుంది.

5.హ్యూమన్ కరోనా వైరస్ HKU1 (హెచ్కోవ్ హెచ్కెయు1): ఈ వైరస్ బీటా కరోనా వైరస్ లో సబ్ గ్రూప్-ఎ కు చెందినది. దీనిని 2005 జనవరితో హాంకాంగ్ లోని ఇద్దరు వ్యాధిగ్రస్తుల్లో గుర్తించారు.

6.మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోవ్-రిలేటెడ్ కరోనా వైరస్.(మెర్స్‌-సీఓవీ): ఇది బీటా వైరస్ జన్యువును కలిగి ఉంటుంది. దీనిని 2012 నావల్ కరోనా వైరస్ (2012 ఎన్ కోవ్) అని పిలుస్తారు. 2012లో నూతన ఫ్లూయూ వ్యాధితో ఉన్న వ్యక్తిలో ఈ వ్యాధిని గుర్తించడం జరిగింది. 2015 జులైలో మెర్స్కోవ్ కేసులను 21 దేశాల్లో గుర్తించారు. ఈ వైరస్ మొదట్లో సార్స్ కరోనా వైరస్కు భిన్నంగా ఉంది. కానీ 2013, మే 23 తరువాత సార్స్ వైరస్ గా గుర్తించారు.

వైరస్‌ లక్షణాలు[మార్చు]

కొత్త కరోనావైరస్‌ను అధికారికంగా సార్స్-కోవ్-2 అని పిలుస్తున్నారు. మనం ఈ వైరస్‌ను శ్వాస లోకి పీల్చినపుడు లేదా ఈ వైరస్‌తో కలుషితమైన ప్రాంతాన్ని చేతులతో ముట్టుకుని, అవే చేతులతో మన ముఖాన్ని ముట్టుకున్నపుడు కళ్ళు , ముక్కు , నోటి ద్వారా ఇది మన శరీరంలోకి చొరబడుతుంది. మొదట గొంతు, శ్వాస నాళాలు, ఊపిరితిత్తుల్లో ఉన్న కణాలలోకి ఇది వ్యాపిస్తుంది. అక్కడ వైరస్ విపరీతంగా పెరిగిపోతుంది. అక్కడి నుంచి మరిన్ని శరీర కణాల మీద దాడి చేస్తుంది. ఇది ప్రాధమిక దశ. ఈ దశలో మనం జబ్బు వున్నట్టు తెలీదు. మరి కొంతమందికి ఎటువంటి లక్షణాలూ కనిపించకపోవచ్చు. ఈ ఇంక్యుబేషన్ పీరియడ్ అంటే వైరస్ తొలుత సోకినప్పటి నుంచి వ్యాధి మొదటి లక్షణాలు కనిపించే వరకూ పట్టే కాలం ఒక్కొక్కరిలో ఒక్కో రకంగా ఉంటుంది. ఈ కాలం సగటున ఐదు రోజులుగా ఉంటుంది. కోవిడ్-19 వ్యాధి వచ్చిన ప్రతి 10 మందిలో ఎనిమిది మందికి కొద్ది ఇన్‌ఫెక్షన్‌గా ఉంటుంది. ప్రధాన లక్షణాలు జ్వరం, దగ్గు. ఒళ్లు నొప్పులు, గొంతు నొప్పి, తల నొప్పి వంటివి కూడా రావచ్చు. కానీ తప్పనిసరిగా వస్తాయనేమీ లేదు. ఈ వ్యాధి వచ్చినప్పుడు న శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ ఇన్‌ఫెక్షన్‌కు ప్రతి స్పందించటం వలన జ్వరం, నలతగా ఉన్నట్లు అనిపిస్తుంది. శరీరంలో ప్రవేశించిన వైరస్‌ను దాడి చేసిన శత్రువుగా మన రోగనిరోధక వ్యవస్థ గుర్తించి ఆ వైరస్స్ ను ఎదుర్కోవటానికి కైటోకైన్లు అనే రసాయనాలను విడుదల చేయటం ద్వారా శరీరంలోని మిగతా భాగమంతటికీ సంకేతాలు పంపిస్తుంది. నిజానికి ఈ కైటోకైన్లు మన రోగనిరోధక వ్యవస్థలో భాగం. కానీ దీనివల్ల ఒళ్లు నొప్పులు, జ్వరం వస్తాయి.ఈ కరోనా వైరస్ సోకినపుడు కణాల్లో కలిగే అలజడి వల్ల వచ్చే దగ్గు ఆరంభంలో పొడిగా ఉంటుంది. అందులో తెమడ వంటిదేమీ రాదు. కొన్ని రోజులు గడిచిన తర్వాత కొందరిలో దగ్గుతో పాటు తెమడ కూడా వస్తుంది. వైరస్ సంహరించిన ఊపిరితిత్తుల కణాలు ఈ తెమడ రూపంలో బయటకు వస్తాయి.ఈ లక్షణాలకు ఉన్నప్పుడు శరీరానికి పూర్తి విశ్రాంతినిస్తూ ఎక్కువ మోతాదులో ద్రవాలు అందించటం, పారాసెటమాల్ వంటి మందులతో చికిత్స అందిస్తారు ఈ దశ ఒక వారం రోజుల పాటు కొనసాగుతుంది. ఆ సమయానికి చాలా మంది కోలుకుంటారు. ఎందుకంటే వారిలోని రోగ నిరోధ వ్యవస్థ[18] వైరస్‌తో పోరాడి దానిని తరిమేస్తుంది రెండవ దశలో స్వల్పంగా ఆయాసం, జీర్ణకోశ సమస్యలు, విరేచనాలు అవుతాయి. ఇంకా తీవ్రమైతే ఇన్ ఫెక్షన్ ఊపిరితిత్తులకు చేరుకుని శ్వాసకోశ వ్యవస్థ దెబ్బతింటుంది.. బలహీనం అయిన రోగనిరోధక వ్యవస్థ కోవిడ్-19 వ్యాధి మరింతగా ముదురుతుంది. ఈ దశలో ముక్కు కారటం వంటి జలుబు వంటి లక్షణాలు కూడా రావచ్చు. రోగనిరోధక వ్యవస్థ శరీరంలోని మిగతా భాగానికి పంపించే రసాయన సంకేతాలైన కైటోకైన్ల వల్ల వాపు రావచ్చు. ఇలా ఊపిరితిత్తుల వాపు న్యుమోనియా గా దారి తీయవచ్చు . మానవ ఊపిరితిత్తులు రెండు చిన్న పాటి గాలి సంచుల్లా ఉంటాయి న్యూమోనియా వచ్చినపుడు ఈ గాలి సంచులు నీటితో నిండిపోవటం మొదలవుతుంది. దీనిఫలితంగా శ్వాస తీసుకోవటం ఇబ్బందికరంగా మారుతూ వస్తుంది. చివరికి చాలా కష్టమవుతుంది. కొంతమందికి శ్వాస అందించటానికి వెంటిలేటర్ (కృత్రిమ శ్వాస పరికరం) అవసరమవుతుంది . ఈ ఇన్ఫెక్షన్ న్యుమోనియా లేదా సార్స్‌గా మారుతుంది. కిడ్నీలు ఫెయిలై రోగి చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది చివరి దశలొ విఫలమవటం మొదలవుతుంది. రోగనిరోధక వ్యవస్థ అదుపు తప్పిపోతూ రక్తపోటు ప్రమాదకరస్థాయిలో పడిపోయి, అంతర్గత అవయవాలు సరిగ్గా పనిచేయటం ఆగిపోయి చివరికి పూర్తిగా విఫలమవుతాయి. ఊపిరితిత్తుల్లో చాలా ప్రాంతాల్లో తీవ్రమైన వాపు వలన అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ తలెత్తుతుంది. అంటే శ్వాసప్రక్రియ దాదాపుగా ఆగిపోయి శరీర మనుగడకు అవసరమైన ఆక్సిజన్ అందకుండా పోతుంది దీని వలన కిడ్నీలు రక్తాన్ని శుభ్రం చేయలేవు. పేగులు దెబ్బతింటాయి.అంతర్గత అవయవాలు శరీరాన్ని సజీవంగా ఉంచలేవు. కరోనా రోగుల్లో ఎక్కువగా వృద్ధులే ఉన్నారు. ముఖ్యంగా పార్కిన్సన్, డయాబెటిస్ లాంటి వ్యాధులు ఉన్నవారు దీనికి గురవుతున్నారు. ఈ ఇన్ఫెక్షన్ వదిలించుకోడానికి ప్రస్తుతం ఎలాంటి ప్రత్యేక చికిత్సలూ లేవు. సాధారణంగా ఇన్ఫెక్షన్ సోకినప్పటి నుంచి వ్యాధి బయట పడానికి సుమారు 14 రోజుల సమయం పడుతుందని డబ్ల్యూహెచ్ఓ చెబుతుండగా కొందరు పరిశోధకులు మాత్రం 24 రోజుల వరకు సమయం తీసుకుoటుందని చెబుతున్నారు. కరోనా వైరస్‌ సోకిన వారి శరీరంలో వ్యాధికారక వైరస్‌ 37 రోజుల వరకు జీవించి ఉండగలదని ఓ కొత్త అధ్యయనం ద్వారా తెలిసింది[19] అమెరికాకు చెందిన సెంటర్‌ ఫర్‌ డిసీస్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌, చలిగా అనిపించడం, ఒంట్లో వణుకు, కండరాల నొప్పి, తలనొప్పి, వాసన గ్రహించలేకపోవడం, గొంతు నొప్పి, మంట వంటి లక్షణాలు కూడా కరోనా కొత్త లక్షణాలు గా పేర్కొన్నది . [20]. సుమారు 80 శాతం కరోనా బాధితులు ఏ ప్రత్యేక వైద్య చికిత్స అవసరం లేకుండా కోవిడ్-19 లక్షణాల నుండి కోలుకుంటారు.[21]. ఈ మద్య భారతదేశంలో వస్తున్న నివేదికల ప్రకారం కొందరిలో ఏ లక్షణాలు లేకుండానే కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అయితే కొత్తగా తలనొప్పి, వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న వారికి కూడా వైరస్ సోకుతున్నట్లు తెలిసింది[22]

ఈ వైరస్‌ సోకిన వ్యక్తికి జలుబు , జ్వరం, దగ్గు, ఛాతీలో నొప్పి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు వస్తాయి. తర్వాత తీవ్రమైన న్యుమోనియాకు దారితీసి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. చలికాలంలో ఈ వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది.

సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ప్రకారం కరోనా లక్షణాల జాబితా[మార్చు]

 1. జ్వరం లేదా చలి జ్వరం
 2. దగ్గు
 3. శ్వాస అందకపోవడం లేదా శ్వాస తీసుకోవడం కష్టంగా అనిపించడం
 4. ఆయాసం
 5. ఒంటి నొప్పులు లేదా కండరాల నొప్పులు
 6. తలనొప్పి
 7. రుచి తెలియకపోవడం లేదా వాసన గ్రహించే శక్తిని కోల్పోవడం
 8. గొంతునొప్పి
 9. జలుబు
 10. వాంతులు
 11. విరేచనాలు

చైనా[మార్చు]

కరోనావైరస్‌ను మొదట చైనాలోని వుహాన్ లో 2019 డిసెంబరు 1 న గుర్తించారు. [23] 2020 మార్చి 5 నాటికి, ప్రపంచవ్యాప్తంగా 95,000 కంటే ఎక్కువ కేసులు నిర్ధారణయ్యాయి. వాటిలో 7,100 తీవ్రమైనవి. [24] 85 దేశాలు ప్రభావితమయ్యాయి, మధ్య చైనా, దక్షిణ కొరియా, ఇటలీ, ఇరాన్లలో పెద్దయెత్తున వ్యాపించింది. 3,200 మందికి పైగా మరణించారు: మరణించిన వారిలో చైనాలో దాదాపు 3,000, ఇతర దేశాలలో 275 మంది ఉన్నారు. 51,000 మందికి పైగా కోలుకున్నారు. [24]

చైనా తీసుకున్న చర్యల్లో హుబీ లాక్డౌన్, వివిధ ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించడం వంటివి ఉన్నాయి; జపనీస్ జలాల్లో బ్రిటిష్ క్రూయిజ్ షిప్ డైమండ్ ప్రిన్సెస్ ను దిగ్బంధించారు; ఇటలీలో లాక్డౌన్లు విధించారు. కొన్ని విమానాశ్రయాలు, రైలు స్టేషన్లు ఉష్ణోగ్రత తనిఖీలు, ఆరోగ్య ప్రకటన రూపాలు వంటి స్క్రీనింగ్ పద్ధతులను ఏర్పాటు చేశాయి. చైనా, ఇటలీ, ఇరాన్ వంటి దేశాలకు ప్రయాణాలు చేయవద్దని అనేక దేశాలు హెచ్చరికలు జారీ చేశాయి.[25] చైనా, ఇరాన్, జపాన్, ఇటలీలోని అన్ని పాఠశాలలను మూసివేసారు.

[26]. కొన్ని గణాంకాల ప్రకారం నిజానికి కరోనా వైరస్ సోకిన ప్రతి 20 మందిలో 19 మంది ఆసుపత్రిలో చేరకుండానే కోలుకుంటారు. ఆసుపత్రిలో చేరిన వారిలో చాలా మంది వైద్యం అందడంతో కోలుకుంటారు, కానీ కొందరు మాత్రం ఆక్సిజన్ కానీ వెంటిలేటర్ కానీ లేకపోతే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. [27]. బ్రిటన్ లొ జరిగిన కొన్ని పరిశోధనల ప్రకారం కరోనా మరణాలను తగ్గించడంలో అత్యధిక ఫలితాలు ఇచ్చిన మొట్టమొదటి ఔషధం డెక్సామెథాసోన్‌ అయితే అయితే ఇది ప్రజలు ఎవరికి వారు దీన్ని కొనుగోలు చేసి సొంతం వైద్యం చేసుకోకూడదు. కరోనావైరస్‌కు వ్యాక్సిన్ తయారీ పని ఇంకా కొనసాగుతోంది.

కరోనా వైరస్ పట్ల జాగ్రత్తలు[మార్చు]

నావల్ కరోనా వైరస్ సోకిన వ్యక్తి ఇతరులతో మాట్లాడుతుండగా వారి నోటి నుండి వచ్చే తుంపర్లు ఇతరులపై పడితే ఇతరులకు సోకవచ్చు. తుమ్మితే వారి ముక్కు నుండి బయటకు వచ్చే క్రిములు ఇతరులపై పడితే సోకవచ్చు. ఈ వైరస్ సోకిన వ్యక్తి ఇతరులు ఆలింగనం చేసుకున్నా, కరచాలనం చేసినా ఇతరులకు సోకే అవకాశం ఉంటుంది. అలాగే వైరస్ సోకిన వ్యక్తి ఉపయోగించే వస్తువులను ఇతరులు వాడినా ఇతరులకు సోకవచ్చు. లిఫ్ట్‌లలో, టేబుళ్లు, మెట్లు ఎక్కేటప్పుడు పట్టుకునే రాడ్లపై కరోనా వైరస్ చేరితే అది 12 గంటల వరకు ఉంటుంది. ఈ 12 గంటలలోగా ఎవరైనా ఈ ప్రాంతంలో చేతులుపెట్టినా, శరీరంలోని ఇతర భాగాలు పెట్టినా వారికి సోకవచ్చు. అందుకే కరోనా సోకిన వ్యక్తి అందరికీ దూరంగా ఉండటం మంచిది. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు చేతిరుమాలు, లేదా నాప్కిన్ అడ్డుగా పెట్టుకోవాలి.

 • చేతులు శుభ్రంగా కడుక్కోకుండా ముక్కు, నోరు దగ్గర తాకొద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది.
 • విదేశాలకు వెళ్లినప్పుడు బాగా ఉడికించిన మాంసాహారం మాత్రమే తీసుకోవాలి.
 • పచ్చిగా ఉన్నవి లేదా సగం ఉడికిన మాంసం, గుడ్లు తినకుండా ఉండాలని సూచించింది.
 • కరోనా వైరస్ ఇన్ఫెక్షన్‌ వచ్చినవారు తుమ్ముతున్న సమయంలో ఎదురుగా ఉన్నవారికి అది రాకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని చెప్పింది. అంటే ముక్కుకు టిష్యూ లేదా బట్ట పెట్టుకోవడం, ఎదురుగా ఉన్న వ్యక్తికి దూరంగా జరగడం లాంటివి చేయాలి.
 • మరీ ముఖ్యంగా దగ్గడం, తుమ్మడం, జ్వరం ఉన్న వ్యక్తులకు మధ్య కనీసం 1 మీటరు (3 అడుగులు) దూరం ఉండేలా చూసుకోవాలి,[28]

కరోనా వైరస్‌ అపోహలు[మార్చు]

చేతులు కడుక్కున్న తరువాత వేడి గాలి వచ్చే పరికరం కింద చెయ్యి పెడితే వైరస్ చచ్చిపోతుందనుకోవడం కూడా ఒక అపోహ. ముఖానికి మాస్క్ ధరించి ఎక్కడికి వెళ్లినా కరోనా రాదనుకోవడం అపోహ మాత్రమే. డాక్టర్లు వాడే అత్యంత కాస్ట్‌లీ మాస్కుల వల్ల మాత్రమే కరోనా సోకే అవకాశాలు తక్కువగా ఉంటాయి మాస్క్ అనేది నేరుగా కరోనా సోకిన వ్యక్తి నుంచి విడుదల అయ్యే తుంపర్లు మనలోకి ప్రవేశించకుండా మాత్రమే ఆపగలవు.పైగా చాలా మంది మళ్లీ మళ్లీ వాడిన వాటినే వాడుతున్నారు. అది మరింత ప్రమాదం.

ఎండ పెరిగితే కరోనా రాదా? - అలా రుజువు కాలేదు. ఇదివరకు వచ్చిన స్వైన్ ఫ్లూ సహా చాలా వైరస్‌లు ఎండా కాలంలో కూడా ప్రభావం చూపాయి

ఒంటిపై మద్యం, క్లోరిన్ చల్లుకుంటే వైరస్ చనిపోతుందా? -అప్పటికే ఒంట్లోకి ప్రవేశించిన వైరస్ బయటి నుంచి మద్యం, క్లోరిన్ చల్లుకున్నంత మాత్రాన చనిపోదు. పైగా అవి చర్మానికి, కళ్లకు హాని చేస్తాయి

యాంటీబయోటిక్స్;తో కరోనాను ఆపగలమా? - యాంటీబయోటిక్స్&బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లను నయం చేయటానికే తోడ్పడతాయి. వైరస్ ల మీద పనిచేయవు.

నువ్వుల నూనె కాపాడుతుందా? - నువ్వుల నూనె ఒంటికి రాసుకుంటే కరోనా వైరస్‌ ఒంట్లోకి ప్రవేశించదని అనుకోవటం అపోహ. బ్లీచ్/క్లోరిన్; ఆధారిత క్రిమినాశకాలు, ఈథర్ ద్రావణాలు, 75% ఇథనాల్, పెరాసెటిక్ యాసిడ్& క్లోరోఫాం వంటివి ఆయా వస్తువులు, ఉపరితలాల మీద అంటుకున్న వైరస్ లను చంపగలవు. గోమూత్రం తాగడం వలన వైరస్ రాకపోవడం అనేది అపోహ వెల్లుల్లి తింటే కరోనా రాదా? - వెల్లుల్లికి సూక్ష్మక్రిములను చంపే శక్తి ఉంది. అంతమాత్రాన వెల్లుల్లిని తింటే కరోనా వైరస్‌ రాదని లేదు. వెల్లుల్లి కరోనాను పోగొడుతుందని రుజువు కాలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చెప్పింది[29]

కరోనా వైరస్ కు వాక్సిన్ లు[మార్చు]

మనుషులకు సోకే కరోనావైరస్ రకాలు ఇప్పటికే నాలుగు ఉన్నాయి. వాటి వల్ల జలుబు వస్తుంది. వాటిలో దేనికీ ఇప్పటి వరకూ కూడా వ్యాక్సిన్ లేదు. అయితే కరోనావైరస్‌కు వ్యాక్సిన్ తయారీ పని ఇంకా కొనసాగుతోంది.ఇప్పటికి 20 వ్యాక్సిన్లు తయారీలో ఉన్నాయి. వీటిలో ఒకదానిని నేరుగా మనుషులపైనే ప్రయోగిస్తున్నారు. మిగతా వాటిని జంతువులపై ప్రయోగిస్తున్నారు. ఇవి విజయవంతం అయితే మనుషులపై ప్రయోగాలు మొదలు పెడతారు. ఈ ఏడాది చివరాఖరికి ఫలితాలు వెలువడొచ్చు.[30] ప్రపంచము లో కొన్ని కొట్లాని  కోట్ల ప్రజల ప్రాణాలు కాపాడిన క్రెడిట్ వాక్సిన్ లకు దక్కుతుంది .17 డి పసుపు Yellow Fever వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడంలో చేసిన కృషికి మాక్స్ థైలర్‌కు ఫిజియాలజీ లేదా మెడిసిన్ నోబెల్ బహుమతి లభించింది. అవార్డును ప్రదానం చేయడానికి ముందు ఇచ్చిన ప్రసంగంలో, ఫిజియాలజీ లేదా మెడిసిన్ నోబెల్ కమిటీ ఛైర్మన్ థైలర్ యొక్క పని యొక్క ప్రాముఖ్యతను వివరించారు.[31]

మొదటి రకము వాక్సిన్[మార్చు]

మొదటి రకము వాక్సిన్ "పాసివ్ వాక్సిన్" అనగా అప్పటికే రెడీ గా వున్నయాంటీబోడీఎస్ ను ఇంజక్షన్ రూపము లో వుంచడము . కుక్క కరిచినా తరువాత ఇచ్చే  రేబిస్ వాక్సిన్ , దెబ్బ తగిలాక ఇచ్చే TT ఇంజక్షన్ ఈ కోవలోకి వస్తాయి .భారత దేశము లోని  విశాఖపట్నం కు చెందిన ప్రముఖ వైద్యులు డా.వై.శ్రీహరి " కోవిడ్ ఇమ్మ్యూనోగ్లోబులైన్స్ ఇంజక్షన్"( "పాసివ్ వాక్సిన్" ) కనుక్కున్నారు . భారత ప్రభుత్వపు "ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్" వారు  ఈ ఇంజక్షన్ క్లినికల్ ట్రయల్స్ కు అనుమతి ఇచ్చారు . ఈ ఇంజక్షన్ క్లినికల్ ట్రయల్స్ సక్సెస్ అయితే కోవిడ్ కు మందు కనిపెట్టిన మొదటి దేశం భారత దేశం అవుతుంది . ఈ ఇంజక్షన్ సక్సెస్ అయితే ఒక మూడు నెలల్లో పేషెంట్ లకు అందుబాటు లోకి రావచ్చు అని వైద్యులు చెపుతున్నారు .ఈ ఇంజక్షన్ భారత ప్రభుత్వపు పేటెంట్ ఆఫీస్ లో పేటెంట్ రిజిస్టర్ కాబడినది. "Passive Vaccine" వ్యాధి రావడానికి ముందు కానీ , వ్యాధి వచ్చిన తరువాత కానీ ఇవ్వ వచ్చును[32]

రెండవ రకము వాక్సిన్[మార్చు]

ఇక రెండవ రకము వాక్సిన్ లు "Active Vaccine".ఆక్టివ్ వాక్సిన్ అనగా వ్యాధి రాకుండా మూడు జాగ్రత్త చర్య గా ఇచ్చే వాక్సిన్ ."Active Vaccine"లు తయారు చెయ్యాలి అని ప్రపంచ వ్యాప్తము గా అనేక ప్రరిశోధనలు జరుగుతున్నాయి . కానీ ఇంకా కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు అని శస్త్ర వేత్తలు చెపుతున్న

COVID-19 వ్యాధి కలగ జేసే వైరస్ శాస్త్రీయ నామము [మార్చు]

severe acute respiratory syndrome coronavirus 2

(SARS-CoV-2)[33]

ఇంకా చదవండి[మార్చు]

మరింతగా తెలుసుకునేందుకు[మార్చు]

కరోనా వైరస్, కోవిడ్-19 ల గురించి ఐక్యరాజ్యసమితి వారి ప్రపంచ ఆరోగ్య సంస్థ తమ వెబ్‌సైటులో ఉంచిన వివరాలు చూడండి.

మూలాలు[మార్చు]

 1. 柳叶刀披露首例新冠肺炎患者发病日期,较官方通报早7天 [Lancet reveals date of first onset of neonatal pneumonia, 7 days before official notification] (in Chinese). 27 January 2020. Archived from the original on 30 January 2020. Retrieved 30 January 2020.CS1 maint: unrecognized language (link)
 2. 《柳叶刀》刊文详解武汉肺炎 最初41案例即有人传人迹象 ["Lancet" article explains Wuhan pneumonia in the first 41 cases] (in Chinese). 26 January 2020. Archived from the original on 30 జనవరి 2020. Retrieved 30 January 2020.CS1 maint: unrecognized language (link)
 3. "Coronavirus Disease 2019 (COVID-19) Situation Summary". U.S. Centers for Disease Control and Prevention (CDC). 30 January 2020. Archived from the original on 26 January 2020. Retrieved 30 January 2020.
 4. 4.0 4.1 "COVID-19 Dashboard by the Center for Systems Science and Engineering (CSSE) at Johns Hopkins University (JHU)". ArcGIS. Johns Hopkins University. Retrieved 23 May 2020.
 5. de Groot RJ, Baker SC, Baric R, Enjuanes L, Gorbalenya AE, Holmes KV, Perlman S, Poon L, Rottier PJ, Talbot PJ, Woo PC, Ziebuhr J (2011). "Family Coronaviridae". In AMQ King, E Lefkowitz, MJ Adams, EB Carstens (eds.). Ninth Report of the International Committee on Taxonomy of Viruses. Elsevier, Oxford. pp. 806–828. ISBN 978-0-12-384684-6.
 6. Lua error in మాడ్యూల్:Citation/CS1/Identifiers at line 1014: attempt to compare nil with number.
 7. "International Committee on Taxonomy of Viruses (ICTV)". talk.ictvonline.org (in ఆంగ్లం). Retrieved 2020-01-24.
 8. "Sign in". International Committee on Taxonomy of Viruses (ICTV) (in ఆంగ్లం). Retrieved 2020-01-24.
 9. "Operations Dashboard for ArcGIS". gisanddata.maps.arcgis.com. The Center for Systems Science and Engineering (CSSE) is a research collective housed within the Department of Civil and Systems Engineering (CaSE) at Johns Hopkins University (JHU). 2020-01-28. Archived from the original on 2020-01-28. Retrieved 2020-01-28.
 10. Kotyk, Alyse (2020-01-28). "B.C. confirms province's first presumptive positive case of new coronavirus". CTV News (in ఆంగ్లం). Archived from the original on 2020-01-29. Retrieved 2020-01-28.
 11. James Griffiths; Nectar Gan; Tara John; Amir Vera. "Wuhan coronavirus death toll rises, as city imposes transport lockdown". CNN.
 12. "China virus death toll mounts to 25, infections spread". Reuters (in ఆంగ్లం). 24 January 2020. Retrieved 24 January 2020.
 13. "చైనా నుండి తిరిగి వచ్చే ప్రయాణికులకు సలహా..." pib.gov.in. Retrieved 2020-03-16.
 14. "WHO experts set to join battle against COVID-19 in China as death toll crosses 1500". The Hindu (in ఆంగ్లం). PTI. 2020-02-15. ISSN 0971-751X. Retrieved 2020-02-15.CS1 maint: others (link)
 15. "కరోనావైరస్‌లు ఎక్కడి నుంచి వస్తాయి... ఒక్కసారిగా ఎలా వ్యాపిస్తాయి?". BBC News తెలుగు. 2020-01-27. Retrieved 2020-02-06.
 16. 16.0 16.1 "Q&A on coronaviruses (COVID-19)". www.who.int (in ఆంగ్లం). Archived from the original on 2020-03-05. Retrieved 2020-03-05.
 17. Joseph,STAT, Andrew. "Disease Caused by the Novel Coronavirus Officially Has a Name: COVID-19". Scientific American (in ఆంగ్లం). Archived from the original on 2020-03-05. Retrieved 2020-03-05.
 18. రోగ నిరోధక వ్యవస్థ
 19. "కొవిడ్‌-19‌: ఐసోలేషన్‌ వ్యవధి సరిపోతుందా?". www.eenadu.net. Retrieved 2020-03-16.
 20. "కరోనా కొత్త లక్షణాలు ఇవే.. జాగ్రత్త సుమా!". Samayam Telugu. Retrieved 2020-04-28.
 21. "Q&A on coronaviruses (COVID-19)". www.who.int (in ఆంగ్లం). Retrieved 2020-05-21.
 22. "#IndiaFightsCorona COVID-19". MyGov.in (in ఆంగ్లం). 2020-03-16. Archived from the original on 2020-06-05. Retrieved 2020-07-05.
 23. "Getting your workplace ready for COVID-19" (PDF). World Health Organization. 27 February 2020.
 24. 24.0 24.1 "Operations Dashboard for ArcGIS". gisanddata.maps.arcgis.com. Retrieved 2 March 2020.
 25. Canada, Public Health Agency of (28 February 2020). "Coronavirus disease (COVID-19): Travel advice". aem. Archived from the original on 29 February 2020. Retrieved 29 February 2020.
 26. "'కరోనా'తో కంగారు వద్దు! | Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi". web.archive.org. 2020-03-16. Retrieved 2020-03-16.
 27. రాబర్ట్స్, మిషెల్లె (2020-06-16). "కరోనా వైరస్ రోగుల ప్రాణాలు కాపాడుతున్న మందు ఇదే." BBC News తెలుగు. Retrieved 2020-06-16.
 28. "Advice for public". www.who.int (in ఆంగ్లం). Retrieved 2020-02-06.
 29. "Myth busters". www.who.int (in ఆంగ్లం). Retrieved 2020-03-16.
 30. గాల్లాగెర్, జేమ్స్ (2020-03-28). "కరోనావైరస్‌కు వ్యాక్సిన్‌ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?". BBC News తెలుగు. Retrieved 2020-06-16.
 31. "CORONA VIRUS". History of Vaccines. USA. June 2020. Archived from the original on 2020-06-15. Retrieved 2020-06-14.
 32. "CORONA INJECTION". Andhra Jyothi. Visakhapatnam. May 2020.
 33. "CORONA VIRUS". Corona virus scientific name. USA. June 2020.