పక్షి
(పక్షులు నుండి దారిమార్పు చెందింది)
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
పక్షులు Temporal range: జురాసిక్ యుగం ఆఖరు - ప్రస్తుతము
| |
---|---|
Superb Fairy-wren, Malurus cyaneus, juvenile | |
Scientific classification | |
Kingdom: | |
Phylum: | |
Subphylum: | |
Class: | పక్షులు |
క్రమాలు | |
సుమారు రెండు డజన్లు - క్రింద విభాగము చూడండి. |
పక్షులు రెండు కాళ్ళు, రెక్కలు కలిగియుండి ఎగురగలిగే, అండోత్పాదక జంతువులు. తెలుగు భాషలో పక్షి పదానికి వికృతి పదము పక్కి. ప్రపంచ వ్యాప్తంగా ఇంచుమించుగా 10,000 జాతుల పక్షులున్నాయి. ఇవి అతిచిన్న పరిమాణం నుండి 6 అడుగుల వరకూ ఉన్నాయి. దొరికిన శిలాజాల ప్రకారం పక్షులు జురాసిక్ యుగం (150-200 మిలియన్ సంవత్సరాల పూర్వం) నుండి పరిణామం చెందాయి. పక్షులకు సంబంధించిన విజ్ఞాన శాస్త్రాన్ని 'ఆర్నిథాలజీ' (ornithology) అంటారు. ప్రతి సంవత్సరం మే నెల రెండవ శనివారం అంతర్జాతీయ వలస పక్షుల దినోత్సవం నిర్వహించబడుతుంది.[1]
సామాన్య లక్షణాలు
[మార్చు]- పక్షులు అంతరోష్ణ లేదా ఉష్ణ రక్త జీవులు.
- ఎగరడానికి అనుకూలంగా ఉండడానికి దేహం సాధారణంగా కదురు ఆకారంలో ఉండి కుదించినట్లు అమరి ఉంటుంది. వాయుగోణులు ఉండటం వల్ల తేలికగా ఉంటుంది. పూర్వాంగాలు రెక్కలుగా మార్పుచెంది ఉంటాయి. చరమాంగాలు పెద్దవిగా ఉండి జీవి దేహం బరువును మోయడానికి తోడ్పడతాయి. ఆహార సంగ్రహణ, ఈదడం, చెట్టు కొమ్మలను పట్టుకోవడం మొదలయిన వాటికి చరమాంగాలు ఉపయోగపడతాయి.
- శరీరం ఈకలతో కప్పబడి ఉంటుంది. ఇవి బాహ్య అస్థిపంజరంలో భాగంగా ఉంటాయి. ఇవి నాలుగు రకాలు. అవి: 1.కాటోర్ ఈకలు, 2. పైలోప్లూమ్ లు, 3. క్విల్ ఈకలు, 4. డేన్ ఈకలు.
- వీటిలో ఒకే ఒక గ్రంథి (తైల గ్రంథి లేదా ప్రీన్ గ్రంథి) తోకపై ఉంటుంది. ఇది క్విల్ ఈకలపై మైనపు పూతను ఏర్పరుస్తాయి.
- పక్షుల అస్థిపంజరంలోని ఎముకలు వాతలాస్థులు. అస్థి మజ్జ ఉండదు. మోనో కాండైలిక్ కపాలం ఉంటుంది. విషమ గర్తి కశేరుకాలు ఉంటాయి. పర్శుకలు ద్విశిరోభాగంతో ఉంటాయి. కొన్ని కశేరుకాలు కలియడం వల్ల సంయుక్త త్రికం (Synsacrum) ఏర్పడుతుంది. ఉరోస్థి ఉదర మధ్య భాగంలో కెరైనా ఉండి ఉడ్డయక కండరాలు అతుక్కోవడానికి తోడ్పడుతుంది. అంసఫలకం (Scapula) పట్టాకత్తి ఆకారపు ఎముక. జత్రుకలు రెండూ కలిసి ఫర్కులా లేదా విష్ బోన్ ఏర్పడుతుంది.
- కండర వ్యవస్థ వైహాయన జీవనానికి అనుకూలంగా రూపాంతరం చెందింది. రెక్కల విధినిర్వహణలో తోడ్పడే కండరాలను ఉడ్డయక కండరాలు (Flight muscles) అంటారు.
- ఆహారవాహిక అన్నాశయంగా విస్తరించి ఆహార పదార్ధాల నిల్వకు తోడ్పడుతుంది.
- నాలుగు గదుల గుండె ఉంటుంది. సిరాసరణి, మూలమహాధమనులు ఉండవు. కుడి దైహిక చాపం ఉంటుంది.
- ఊపిరితిత్తులు స్పంజికాయుతంగా ఉంటాయి. ఇవి 9 వాయుగోణులను కలిగి ఉంటాయి. పక్షులలో స్వరపేటిక వల్ల కాక ఉబ్బిన వాయునాళం ప్రాథమిక శ్వాసనాళికలకు మధ్య గల శబ్దిని (Syrynx) ద్వారా శబ్దం ఉత్పత్తి అవుతుంది.
- మూత్రపిండాలు అంత్యవృక్కాలు. మూడు లంబికలను కలిగి ఉంటాయి. మూత్రాశయం ఉండదు. యూరిక్ ఆమ్లం విసర్జక పదార్థం.
ఆర్ధిక ప్రాముఖ్యత
[మార్చు]- పక్షులు మానవులకు ముఖ్యమైన ఆహారము. వీటిలో ముఖ్యమైనవి కోడి, కోడి గుడ్లు. ఇవే కాకుండా బాతు, టర్కీ కోడి, ఈము మొదలైన పక్షుల మాంసం కూడా తినబడేవి. పురాతన కాలంలో పక్షుల్ని వేటాడేవారు,[2] దీనిమూలంగా కొన్ని పక్షి జాతులు అంతరించిపోయాయి.[3]
- పక్షుల ఈకలు దుస్తులు, పరుపులు తయారుచేయడంలో, కొన్ని రకాల ఎరువుల తయారీలో ఉపయోగపడతాయి.
- చిలుక, మైనా మొదలైన రంగురంగుల అందమైన పక్షులను పెంచుకుంటారు. ఈ రకమైన వ్యాపారం కోసం కొన్ని అరుదైన పక్షులు స్మగ్లింగ్ చేయబడి అంతరించిపోయాయి.[4]
- కొన్ని ప్రత్యేకమైన పనులు చేయడానికి ఉపయోగించారు. పావురాలను వార్తాహరులుగా 1వ శతాబ్దంలో ఉపయోగించేవారు. కొన్ని రకాల పక్షులను వేటకోసం, చేపల్ని పట్టడానికి వాడేవారు.[5]
- జంతువులలో ప్రయోగాల కోసం ఎక్కువగా కోళ్ళు, పావురాలను ఉపయోగిస్తారు. ఇవి ముఖ్యంగా జీవ శాస్త్రం, మానసిక శాస్త్రంలో వాడతారు.
పక్షులకు సంబందించిన పదాలు
[మార్చు]- ఆకుపక్షి
- అపశకున పక్షి
- పక్షి తీర్థము
పక్షుల విశేషాలు
[మార్చు]- అతి పెద్ద పక్షి: నిప్పుకోడి
- అతి చిన్న పక్షి: హమ్మింగ్ బర్డ్
- అతి వేగంగా ఎగర గల పక్షి-స్విఫ్ట్
- వెనక్కి కూడా ఎగరగలిగే ఒకే ఒక పక్షి హమ్మింగ్ బర్డ్
- మనిషి మాటలను అనుకరించి పలుక గలిగిన పక్షులు: 1. చిలుక, 2. మైనా
- వేటకుపయోగ పడే పక్షి. = డేగ
పక్షులలో వర్గాలు
[మార్చు]- నీటిలో వుండగలిగినవి = నీటి పక్షులు 1. నీటి కోడి, 2.బాతు. 3. హంస, 4. నీటికాకి
- వలస పక్షులు = నిర్ణీత కాలంలో సుదూరంలో వున్న దేశాలకు వలస పోయి తిరిగి వచ్చే పక్షులు
- నిశాచర పక్షులు: (రాత్రి వేళలందు మాత్రమే తిరుగునవి)= 1. గుడ్లగూబ2. పైడిగంట,
- దేవతా పక్షి: గండబేరుండము లేదా గండబేరుండపక్షి
వర్గీకరణ
[మార్చు]- ఉపవిభాగం 1: ఆర్కియార్నిథిస్ ఉ. ఆర్కియోప్టెరిక్స్
- ఉపవిభాగం 2: నియార్నిథిస్
- అధిక్రమం 1: ఒడంటేనేతే ఉ. ఇక్తియార్నిస్
- అధిక్రమం 2: పేలియోనేతే ఉ. ఈము, నిప్పుకోడి, కివి
- అధిక్రమం 3: ఇంపిన్నే ఉ. పెంగ్విన్
- అధిక్రమం 4: నియోగ్నేతే లేదా కారినేటే
- Anseriformes, బాతు, హంస
- Galliformes, కోడి, గిన్నికోడి, నెమలి, చకోర, సీమకోడి/టర్కీకోడి , కౌజు పిట్ట
- Gaviiformes, loons
- Podicipediformes, మునుగుకోడి
- Procellariiformes, albatrosses, petrels, and allies
- Sphenisciformes, పెంగ్విన్
- Pelecaniformes, గూడ బాతు and allies
- Ciconiiformes, నారాయణ పక్షి and allies
- Phoenicopteriformes, పూకొంగ
- ఫాల్కనీఫార్మిస్, falcons, గద్దలు, రాబందులు, hawks and allies
- గ్రూయిఫార్మిస్, కొంగలు and allies
- కారడ్రిఫార్మిస్, కలివికోడి, క్రౌంచపక్షి, gulls, button-quail, plovers and allies
- Pteroclidiformes, బుర్రలావుక
- కొలంబిఫార్మిస్, పావురాలు, డోడో
- సిట్టసిఫార్మిస్, చిలుకలు, ప్రేమ పక్షులు
- కుకులిఫార్మిస్, కోకిల, turacos, hoatzin
- స్ట్రిగిఫార్మిస్, గుడ్లగూబలు
- Caprimulgiformes, కప్పిరిగాడు
- Apodiformes, కోలంకిపిట్టలు, hummingbirds
- Coraciiformes, లకుముకి
- పిసిఫార్మిస్, వడ్రంగి పిట్ట and allies
- Trogoniformes, trogons
- Coliiformes, mousebirds
- పేసరీఫార్మిస్, పిచ్చుక, కాకి, పాలపిట్ట, గోరింక, కాటుకపిట్ట, రజతాక్షి
ఇవి కూడా చూడండి
[మార్చు]చిత్రమాలిక
[మార్చు]-
రజతాక్షి (Silvereye) Zosterops lateralis
-
మైనా పక్షి (Common myna both Adult and Juvenile) Acridotheres tristis
-
జెముడు కాకి Greater Coucal or Crow Pheasant (Centropus sinensis)
-
కొంగలు Painted Stork (Mycteria leucocephala)
-
పసల పోలిగాడు. /పక్షి
-
బెళబాయి/ వనస్థలిపురం
-
పిచ్చుక/వనస్థలిపురం
-
బాతు
-
కాకి
-
కోడిపుంజు
-
పక్షిగూడు
-
పిగిలి పిట్ట
-
కోయిల/ వనస్థలి పురంలో తీసిన చిత్రము
-
ఆడకోయిల: వనస్థలిపురంలో తీసిన చిత్రము
-
కొప్పు గువ్వ (ఎల కోడి) /వెంకట్రామా పురంలో తీసిన చిత్రము
మూలాలు
[మార్చు]వికీమీడియా కామన్స్‌లో
కి సంబంధించిన మీడియా ఉంది.
Look up పక్షి in Wiktionary, the free dictionary.
- ↑ వార్త, అంతర్జాతీయ (11 May 2019). "ప్రపంచ వలస పక్షుల దినోత్సవం". Vaartha. Archived from the original on 12 మే 2020. Retrieved 12 May 2020.
- ↑ Simeone A, Navarro X 078X2002000200012&lng=es&nrm=iso&tlng=en "Human exploitation of seabirds in coastal southern Chile during the mid-Holocene."] Rev. chil. hist. nat 75 (2): 423–31
- ↑ Keane A, Brooke MD, Mcgowan PJK (2005). "Correlates of extinction risk and hunting pressure in gamebirds (Galliformes)." Biological Conservation 126 (2): 216–33. doi:10.1016/j.biocon.2005.05.011
- ↑ Cooney R, Jepson P (2006). "The international wild bird trade: what's wrong with blanket bans?" Oryx 40 (1): 18–23. PDF
- ↑ Manzi M (2002). "Cormorant fishing in Southwestern China: a Traditional Fishery under Siege. (Geographical Field Note)." Geographic Review 92 (4): 597–603.