Jump to content

పెంగ్విన్

వికీపీడియా నుండి

పెంగ్విన్
Temporal range: Paleocene-Recent
Scientific classification
Kingdom:
Phylum:
Class:
Order:
Sphenisciformes

Family:
Spheniscidae

పెంగ్విన్లు (ఆంగ్లం Penguin) దక్షిణ ధృవము లో ఉండే జల జంతువు, ఎగుర లేని పక్షి.

సుమారు 17-20 పెంగ్విన్ జాతులు ఉన్నాయని అంచనా. అన్నిటి కంటే పెద్ద జాతి రారాజు పెంగ్విన్. ఇవి సుమారు 1.1 మీటర్లు పొడుగు, 35 కే.జీ ల బరువు ఉంటాయి.

పెంగ్విన్ పాదాలు మంచుగడ్డలకు ఎందుకు అంటుకోవు?

[మార్చు]

మంచు గడ్డలు పరుచుకొని ఉండే ప్రదేశంపై మనం నడిస్తే ఒత్తిడి వల్ల, మన దేహ ఉష్ణోగ్రత వల్ల మన కాళ్ల కింద మంచుగడ్డ కరుగుతుంది. ఆ ఒత్తిడిని కొంత సడలించగానే కరిగిన ఆ మంచు మరల గడ్డకట్టడంతో మన పాదాలు మంచు గడ్డకు అంటుకుంటాయి. కానీ పెంగ్విన్ పక్షుల విషయంలో అలా జరగదు. పెంగ్విన్ల దేహ ఉష్ణోగ్రత 39 డిగ్రీల సెల్సియస్ వరకు ఉన్నా, వాటి కాళ్లు ఎప్పుడూ చల్లగానే ఉంటాయి. అవి మంచుగడ్డపై కలిగించే ఒత్తిడి తక్కువే. అందువల్ల అవి మంచు గడ్డలున్న ప్రదేశాలల్లో ఉన్నా వాటి పాదాలకు మంచుగడ్డల మధ్య మంచు కరిగిన నీరు ఏర్పడదు. ఆ పాదాలు మంచుగడ్డలకు అంటుకోవు. పెంగ్విన్ల పాదాలు ఎల్లవేళలా చల్లగా ఉండడానికి కారణం వాటి కాళ్లలో ప్రవహించే రక్తం నియంత్రించబడి ఉండడమే. వాటి కాళ్లలో ఉండే రక్తనాళాలు, ధమనుల చుట్టూ ఉండే కండరాల అమరిక వల్ల వాటి పాదాల ఉష్ణోగ్రత 0 డిగ్రీల సెల్సియస్ కన్నా కొంచెం ఎక్కువగా మాత్రమే ఉండేటట్టు రక్తం అతి తక్కువగా ప్రవహిస్తుంది. ఇలా జరగడం వల్ల చల్లబడిన రక్తం మరలా దేహంలోకి తిరిగి వచ్చి అక్కడ ఉండే అనేక వెచ్చని రక్తనాళాలు, ధమనుల గుండా ప్రవహించి వేడెక్కుతుంది. అంటే తిరిగి తొలి ఉష్ణోగ్రతను చేరుకుంటుంది. ఆ విధంగా పెంగ్విన్ పాదాలు మంచుగడ్డలకు అంటుకోవు.

పెంగ్విన్ ల గురించిన కొన్ని విశేశాలు

[మార్చు]
అంటార్కిటికాలోని వివిధ ప్రవర్తనలను చూపుతున్న వీడియో
  • పెంగ్విన్లలో దాదాపు 17 జాతులు ఉన్నాయి. వీటిల్లో అతి పెద్దది ఎంపరర్ పెంగ్విన్. ఇది 3 అడుగుల ఎత్తు, 35 కేజీల బరువు ఉంటుంది. అతి చిన్నది బ్లూ పెంగ్విన్. 16 అంగుళాల ఎత్తు, కేజీ బరువుంటుంది.
  • ఉత్తర ధ్రువంలో అస్సలు ఉండవు!
  • ఇవి ఎగరలేని పక్షులు
  • వీటి రెక్కలు నీళ్లలో తడవవు. అంటే వాటర్‌ప్రూఫ్.
  • పెంగ్విన్లు సముద్రపు నీరును కూడా తాగగలవు!

వర్గీకరణ

[మార్చు]

Subfamily Spheniscinae – Modern penguins