నెమటోడ
Appearance
నెమటోడ | |
---|---|
Scientific classification | |
Kingdom: | |
Phylum: | నెమటోడ Rudolphi, 1808
|
Classes | |
Adenophorea |
నెమటోడ (లాటిన్ Nematoda) వర్గంలో గల జీవులను గుండ్రటి పురుగులు లేదా నులి పురుగులు అంటారు. ఇవి నేల, నీరు మొదలైన అనేక ఆవాసాలలో స్వేచ్ఛగా నివసించే జీవులు. కొన్ని పరాన్న జీవులు. ఇవి మిధ్యా శరీరకుహరజీవులు. ఇవి త్రిస్తరిత నిర్మాణాన్ని, ద్విపార్శ్వ సౌష్టవాన్ని చూపుతాయి.
సాధారణ లక్షణాలు
[మార్చు]- శరీరం పొడవుగా, స్థూపాకారంగా ఉంటుంది. ఖండీభవనం లేదు.
- శరీరం మీద రక్షణ కోసం పారదర్శకమైన, గట్టి కొల్లాజన్ అవభాసిన పొర ఉంటుంది. శైలికలు లేవు.
- బాహ్యచర్మం అనేక కణాల కలయికతో ఏర్పడినది (సిన్షీషియమ్).
- శరీర కుడ్యానికి ఆయత కండరాలు మాత్రమే ఉంటాయి. వర్తుల కండరాలు లేవు.
- శరీర కుహరం మిథ్యాశరీరకుహరం. పిండాభివృద్ధి విదళన కుహరపు శేషం. మధ్యత్వచం పూర్తిగా శరీర కుహరాన్ని పరివేష్టించలేదు. ఇది మిథ్యాశరీరకుహరద్రవంతో నిండి ఉంటుంది. కాబట్టి జలస్థితిక అస్థిపంజరంగా పనిచేస్తుంది.
- జీర్ణనాళం సరళమైన నిలువు గొట్టం. పూర్వాంతాన నోరు, పరాంతాన పాయువు ఉంటాయి. జీర్ణనాళం గోడలలో ఒకే పొరగా ఉన్న అంతఃత్వచ కణాలు ఉంటాయి. కండరాలు లేవు. అందువల్ల జీర్ణమైన ఆహారపదార్ధాలు మిథ్యాశరీరకుహరంలోకి సులబంగా శోషించడం జరుగుతుంది.
- రక్తప్రసరణ వ్యవస్థ లేదు. మిథ్యాశరీర కుహరద్రవం పోషకపదార్ధాలను శరీరం అంతటా పంపిణీ చేస్తుంది.
- విసర్జన వ్యవస్థలో నాళికలు H-ఆకారంలో అమరి ఉంటాయి లేదా గ్రంథిలాంటి నిర్మాణాలు ఉంటాయి. జ్వాలా కణాలు లేవు.
- నాడీ వ్యవస్థలో నాడీ సంధులు గల పర్వాంత్ర నాడీ వలయం, పూర్వ పరాంతానికి వ్యాపించిన నాడులు ఉంటాయి. ఏంఫిడ్లు (శరీరానికి పూర్వాంతంలో ఉండే రసాయన గ్రాహకాలు), ఫాస్మిడ్లు (శరీరానికి పరాంతంలో ఉండే గ్రంధి జ్ఞానాంగాలు) అనే జ్ఞానాంగాలు ఉంటాయి.
- ఏకలింగ జీవులు, లైంగిక ద్విరూపకతను ప్రదర్శిస్తాయి. సాధారణంగా మగ జీవులు ఆడ జీవుల కంటే చిన్నవి, పరాంతం వంపు తిరిగి ఉంటుంది. అవస్కరం, ఒకటి లేదా రెండు సంపర్క కంటకాలు ఉంటాయి. ఆడ జీవులలో జనన రంధ్రం పాయువు నుంచి వేరుగా ఉంటుంది.
- ఎక్కువగా అండోత్పదకాలు (ఉదా: ఆస్కారిస్), కొన్ని అండ శిశుత్పాదకాలు (ఉదా:ఉచరేరియా). అంతఃఫలదీకరణ జరుగుతుంది. అధిక సంఖ్యలో గుడ్లు పెడతాయి. పెరుగుదలలో నాలుగు పర్యాయాలు అవభాసిని నిర్మోచనం జరుగుతుంది.
వర్గీకరణ
[మార్చు]- ఆస్కారిస్:- (సామాన్య గుండ్రటి పురుగు)
- ఆంకైలోస్టోమా:- (కొంకి పురుగు)
- ఎంటిరోబియస్:- (పిన్ పురుగు)
- ట్రైకినెల్లా:- (ట్రైకినా పురుగు)
- ఆంకోసెర్సిడే:- కుటుంబం:
- ఆంకోసెర్సియా:-
- ఉచరేరియా:- (ఫైలేరియా పురుగు)